భూ సంస్కరణలు
(Land Reforms)
గ్రామీణ ప్రాంత ప్రజలు వ్యవసాయ భూమిని తమ గౌరవం, ప్రతిష్టను పెంచే ఆస్తిగా భావిస్తారు. మానవ - భూ సంబంధాలు గ్రామాల్లో వ్యవసాయ నిర్మితిని నిర్దేశిస్తాయి. ‘భూమి యాజమాన్యంలో ఉండే అసమానతలు తగ్గించి, ప్రజలకు, భూమికి మధ్య సంబంధాలను సరిచేయడానికి ఉద్దేశించిన కార్యక్రమమే భూసంస్కరణలు.
భూమి యాజమా న్యంలో మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడాన్ని కూడా భూసం స్కరణగా చెప్పొచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో అధిక భాగం ప్రజలకు జీవనాధారం భూమే. అయితే ఈ భూమి పంపిణీల్లో అసమానతలున్నాయి. ఎక్కువ మొత్తం భూమి కొద్దిమంది ధనవంతులైన భూస్వా ముల ఆధీనంలో ఉంది. అందువల్ల సామాజిక న్యాయాన్ని అందించడానికి భూ సంస్కరణల అమ లు పర్చాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. వ్యవసా యాభివృద్ధి కార్యక్రమాల్లో భూసంస్కరణలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
చిన్న, సన్నకారు, ఉపాంత రైతులు, కౌలుదా రులు, వ్యవసాయ కూలీలు మొదలైన వారికి ‘భూమిని పునఃపంపిణీ’ చేయడంతో పాటు కౌలు పరిమాణం, కౌలుదారులకు భద్రత, వ్యవసాయ కూలీల వేతన నిర్ణయం, సాంకేతిక మార్పులన్నీ భూసంస్కరణల్లో భాగమే అని ఐక్యరాజ్యసమితి నిర్వచించింది.
స్వాతంత్య్రానికి పూర్వమే దేశంలో భూ సంస్క రణలపై చర్చ జరిగింది. దేశంలో జీవన ప్రమాణా లు పెంచాలంటే.. ప్రస్తుత ఆర్థిక, సాంఘిక వ్యవస ్థల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని 1929 మేలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తీర్మానిం చింది. దీనికి అనుగుణంగా చారిత్రాత్మకమైన తీర్మా నాన్ని 1935లో ఆమో దించారు. 1948లో ఏర్పాటు చేసిన కమిటీ సూచనల ఆధారంగా భారతదేశంలో భూసంస్కర ణలు రూపొందించారు. 1950లను భూసంస్కర ణల దశాబ్దంగా పేర్కొన్నారు.
జాతీయ ప్రణాళిక సంఘం భూసంస్కరణల లక్ష్యాలు..
1. వ్యవసాయ ఉత్పత్తిని తగ్గించే ప్రతిబంధకా లను తొలగించడం.
2. వ్యవసాయ రంగంలోని మధ్యవర్తులను తొల గించి, దున్నేవాడికే భూమి ఇవ్వాలి. గ్రామీణ జనాభాలో అన్ని వర్గాలకు సమానహోదా, అవకాశాలు కల్పించాలి.
భూసంస్కరణల ద్వారా ప్రభుత్వం సాధించాలను కున్న లక్ష్యాలు.. 1. భూగరిష్ట పరిమితులను అమ లు చేయడం. కమతాల పరిమాణంలో మార్పులు తేవడం ద్వారా కొరతగా ఉన్న భూమిని హేతుబ ద్ధంగా ఉపయోగించేలా చూడటం. 2. భూమి లేని గ్రామీణ పేదలకు భూమి పంపిణీ చేయడం.
భూసంస్కరణలు - ప్రధాన లక్ష్యాలు
1951లో ప్రణాళికా సంఘం భూసంస్కరణల ప్రధాన లక్ష్యాలను ప్రకటించింది. అవి..
1. గతం నుంచి వారసత్వంగా వ్యవసాయక స్వ రూపంలో వచ్చిన అడ్డంకులను తొలగించడం.
2. వివిధ రూపాల్లో ఉన్న దోపిడీని అరికట్టడం
3. వ్యవసాయ రంగాన్ని సామాజిక న్యాయంతో బలోపేతం చేయడం.
4. భూమిని దున్నేవాడికి రక్షణ కల్పించడం.
5.ఙ్ట్చఛగ్రామ ప్రాంతంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన హోదా, అవకాశాలను కల్పించడం.
పై లక్ష్యాలకనుగుణంగా దేశంలో నాలుగు రకాల భూసంస్కరణల చట్టాలు అమలు చేశారు. అవి..
మధ్యవర్తుల తొలగింపు చట్టం
కౌలు సంస్కరణల చట్టం
భూకమతాల గరిష్ట పరిమితి చట్టం
కమతాల సమీకరణ ద్వారా యాజమాన్య హక్కులను కల్పించడం.
ఆంధ్రప్రదేశ్‌లో భూసంస్కరణలు
ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందటి పరిస్థితి..
1. ఆంధ్ర ప్రాంతం: ఇది అప్పటి మద్రాస్ రాష్ర్టం లో భాగంగా, ఈస్టిండియా కంపెనీ పాలనలో ఉండేది. ఈ ప్రాంతంలోని ఉత్తర సర్కార్ జిల్లా లు జమీందారుల ఆధీనంలో, దక్షిణ జిల్లాలు పాళెగాళ్ల పాలన ఉండేవి. 1801లో థామస్ మన్రో చీఫ్ కలెక్టర్ హోదాలో పాళెగాళ్లను తొల గించి కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ‘రైత్వారీ పద్ధతి’ ప్రవేశపెట్టారు.
2. తెలంగాణ ప్రాంతం: ఇది హైదరాబాద్ సంస్థా నంలో అంతర్భాగంగా ఆసఫ్‌జాహీ వంశస్తులై న నిజాంల పరిపాలనలో ఉండేవి.
ఇక్కడ జాగీర్దారీ, ఇనాందారీ, రైత్వారీ విధానాలు భూ యాజమాన్య పద్ధతులుగా ఉండేవి. ఆనాడు తెలంగాణలో ఆరు రకాల జాగీర్లు, 14 సంస్థా నాలు, సర్ఫేఖాస్ భూములు ఉండేవి. సొంత ఖర్చుల నిమిత్తం నిజాంకు ఉన్న పెద్ద జాగీర్ల ను ‘సర్ఫేఖాస్’భూములు లేదా ‘ఖల్సా’ భూ ములని కూడా పిలిచేవారు. కొన్నింటిని దివానీ భూములనేవారు. దివానీ భూములు ‘సర్ఫే ఖాస్’ భూముల్లోని భాగాలే. ఈ భూములను పాలనా నిర్వహణ కోసం (ప్రభుత్వ ప్రత్యక్ష పాలన) ఇచ్చేవారు.
మధ్య దళారీలు
1. ఆంధ్ర ప్రాంతం: ఇక్కడ జమీందారులు, ఇనాం దారులు మధ్యవర్తులుగా ఉండేవారు. ఆంధ్రా ప్రాంతంలో రెండు రకాల భూమి అనుభవించే పద్ధతులు అమల్లో ఉండేవి. అవి.
భూమిని సాగు చేయడానికి హక్కులున్న రైతులు, ఇతరులు.
ఎలాంటి హక్కులు లేకుండా భూమిని అనుభ వించేవారు రెండవ రకం.
భూమికివ్వాల్సిన కౌలు మొత్తాన్ని, భూమిని అనుభవించే కాలపరిమితిని తరచుగా మార్చే వారు.
2. తెలంగాణ ప్రాంతం: ఈ ప్రాంతంలో జాగీర్దా ర్లు, పట్టేదార్లు, పోటు పట్టేదార్లు మధ్య దళా రీలుగా ఉండేవారు. భూ అనుభవదార్ల పరిస్థి తి దయనీయంగా ఉండేది. వీరిని బానిసలుగా చూసేవారు. మధ్య యుగాల నాటి ఫ్యూడల్ బానిసత్వ విధానం చలామణి అయ్యేది. బ్రాహ్మణులతో పాటు అన్ని వర్గాల వారు ‘వెట్టి’ చేసేవారు. ముందు నవాబుల భూము ల్లో నిర్భంద చాకిరీ చేసిన తర్వాతే వారి భూ ముల్లో సేద్యం చేయనిచ్చేవారు. జాగీర్దారీలు, దేశ్‌ముఖ్, దేశ్‌పాండేలు, సర్‌దేశ్‌ముఖ్‌లు లాంటి మధ్య దళారీలు, ప్రభుత్వ ప్రతినిధు లు, కౌలుదారులను నిర్దయగా దోచుకునేవా రు. సారవంత భూములన్నీ ‘ఖల్సాభూము లు’గా ఉండేవి.
తెలంగాణ ప్రాంతంలో మరో రకమైన భూ అనుభవ పద్ధతి ఆచరణలో ఉండేది. ఇక్కడ మూడు రకాల కౌలుదార్లు ఉండేవారు. దున్నేవాడికి, ప్రభుత్వానికి మధ్య దళారీలుగా ‘పట్టేదారు’ ఉండేవాడు.
షిక్మీదారులు: పట్టేదారు స్వయంగా సేద్యం చేయకుండా కొన్ని షరతులతో, నిర్ణీత కాలా నికి భూములను కౌలుదారులకు ఇచ్చేవారు. వీరినే షిక్మీదారులు, శాశ్వత కౌలుదారులని పిలిచేవారు. ఏదైనా భూమిని 12 ఏళ్ల పాటు పాటు వరుసగా కౌలు చేస్తుంటే వారిని శాశ్వత కౌలుదారులుగా గుర్తిస్తారు.
ఆసామి షిక్మీదారులు: మామూలు కౌలుదా ర్లను అంటే ఎలాంటి షరతులు, హక్కులు లేని సామాన్య కౌలుదారులను ఆసామి షిక్మీదార్ అనేవారు. కౌలు మొత్తం అధికంగా ఉండేది. పండిన పంటలో మాగాణి భూముల్లో 1/4వ వంతు, మెట్ట భూముల్లో 1/5 వంతు కౌలు వసూలు చేసేవారు.
ఇజారా కౌలుదారులు: ఈ కౌలు పద్ధతిని సర్ సాలార్‌జంగ్ ఇజారా ప్రవేశపెట్టాడు. నిర్మాను ష్య గ్రామాల్లో పునరావాసం కల్పించడానికి, సేద్యానికి యోగ్యమైన భూములను సాగులోకి తెచ్చే ఉద్దేశంతో దీన్ని ప్రవేశపెట్టారు. 1908లో ఈ విధానం రద్దు చేశారు.
ప్రభుత్వ చట్టాలు - వాటి లక్ష్యాలు
1956 వరకు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల చట్టాలు వేర్వేరుగా ఉన్నాయి.
1. ‘ఆంధ్రప్రదేశ్ (ఆంధ్రా ప్రాంతం) ఎస్టేట్లు రద్దు -1948’, జమీందారీ వ్యవస్థ రద్దు, రైత్వారీ విధానం అమలు చట్టం-Madras Estate Bill-1948:
మధ్య దళారీలను తొలగించడానికి స్వాతం త్య్రానంతరం తెచ్చిన మొదటి చట్టం ఇది. 1948లో ఆంధ్రా ప్రాంతం మద్రాస్ రాష్ర్టంలో భాగంగా ఉండటంతో ఈ చట్టాన్ని మద్రాస్ రాష్ర్ట ప్రభుత్వం జారీ చేసింది.
చట్టంలోని ప్రధానాంశాలు:
అన్ని రకాల జమీందారీ ఎస్టేట్లు రద్దవుతాయి. ఈ ఎస్టేటుల్లోని భూములు, నదులు, కాలు వలు.. మొదలైన అన్ని రకాల ఆస్తులు ప్రభుత్వపరం అవుతాయి.
జమీందార్లకు నష్టపరిహారాన్ని గత ఏడాది వచ్చిన ఆదాయం ప్రాతిపదిక చెల్లిస్తారు. ఈ నష్టపరిహారం 12 1/2 నుంచి 25 రెట్ల వరకు చెల్లిస్తారు.
సాగు చేస్తున్న రైతులకు రైత్వారీ పట్టా ఇస్తారు.
రైత్వారీ పట్టా పొందిన ప్రతి సాగుదారుడు భూమి పన్నును చెల్లించాలి.
ఈ చట్టం కింద భూములపై గరిష్ట పరిమితిని విధించలేదు.
నోట్: జమీందారీ రద్దు చట్టం వల్ల జమీందారులకు ఉన్న భూమి వికేంద్రీకరణలో అంత మార్పు రాలేదు. ఈ చట్టం భూమి లేని పేదలకు భూమిని పంచడానికి కాకుండా కేవలం మధ్య దళారీ వ్యవస్థ ను రూపుమాపేందుకు ఉద్దేశించింది. రూ.15కోట్ల నష్ట పరిహారం చెల్లించి మధ్యవర్తులను తొలగించారు.
2. ఆంధ్రప్రదేశ్ (ఆంధ్రా ప్రాంతం)లో ఇనాంలు రద్దు; రైత్వారీ విధానం అమలు చట్టం-1956
{పభుత్వానికి లేదా ప్రభువుకు సేవలందించి నందుకు గుర్తింపుగా బహుమతి(ఇనాం) రూపంలో వ్యక్తులకు ఇచ్చేవారు. ఈ వ్యక్తులనే ఇనాందారులు అంటారు. ఇనాం దారుల వద్ద ఉన్న వందల ఎకరాల భూమిని ఎలాంటి హక్కులు కల్పించకుండా ఇతరులకు కౌలుకు ఇచ్చేవారు.
ఈ చట్టంలోని ప్రధాన అంశాలు:
ఇనాందారులకు భూములపై ఉన్న ప్రత్యేక హక్కులు పూర్తిగా రద్దయ్యాయి.
కౌలుకు సాగు చేస్తున్న రైతులకు భూమిపై సర్వహక్కులు కల్పిస్తారు.
ఇనాందారుని వ్యక్తిగత భూమి కౌలుదారుడి స్వాధీనంలో ఉండే ఆ భూమిలో 2/3 వంతు భూమికి సంబంధించి కౌలుదారుడికి, 1/3 వంతు భాగం భూమి యజమానికి హక్కు ఉంటుంది.
ఇనాందారుడు కూడా రైత్వారీ పద్ధతిలో తన వ్యక్తిగత భూమిపై భూమి శిస్తు చెల్లించాలి.
60 రోజుల్లోపు కౌలు చెల్లించని పక్షంలో కౌలు దారుల నుంచి భూమిని తొలగించవచ్చు.
ఈ చట్టం ద్వారా 20 లక్షల మంది రైతులకు 30 లక్షల ఎకరాల భూమిపై యాజమాన్య హక్కు లు కల్పించారు. ఇది రాష్ర్టంలో అత్యంత విజయవంతంగా అమలుచేసిన చట్టం.
గత గ్రూప్-1 మెయిన్‌స ప్రశ్నలు
1. భూసంస్కరణలు ఎందుకు అమలు చేస్తారు? ఆంధ్రప్రదేశ్‌లో భూసంస్కరణలకు సంబం ధించిన ప్రధాన చట్టాలు ఏవి?
2. ఆంధ్రప్రదేశ్‌లో భూసంస్కరణల పరిధి ఏమి టి? భూయాజమాన్య దస్తావేజుల కంప్యూట రీ కరణలో సాధించిన విజయాన్ని తెలపండి?
మాదిరి ప్రశ్నలు
1. భూసంస్కరణలు అంటే ఏమిటి? భూసంస్క రణల ప్రధాన లక్ష్యాలేవి?
2. ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్రా ప్రాంతం, తెలంగాణ ప్రాంతంలోని మధ్య దళారీ వ్యవస్థను విశ్లేషిం చండి?
3. ఆంధ్రప్రదేశ్ (ఆంధ్రా ప్రాంతం)లోని వివిధ మధ్య దళారీలు ఎవరు? వీరిని తొలగించడా నికి ప్రభుత్వం రూపొందించిన చట్టాలు ఏవి?
4. ఆంధ్రప్రదేశ్ (ఆంధ్రప్రాంతం) ఎస్టేట్ల రద్దు చట్టం-1948లోని ప్రధాన అంశాలు ఏమిటి? ఈ చట్టం ఆంధ్ర ప్రాంతంలోని మధ్య దళారీ లను రూపుమాపడంలో సంపూర్ణ విజయం సాధించిందా? విశ్లేషించండి?
5. ఆంధ్రప్రదేశ్ ఇనాంలు రద్దు, రైత్వారీ విధానం అమలు చట్టం-1956, ఆంధ్రప్రదేశ్‌లో అత్యం త విజయవంతంగా అమలుచేసిన చట్టం. విశ్లేషించండి?
6. {బిటిష్ పాలనలో ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ భూమిశిస్తు పద్ధతులు వివరించండి? ఈ పద్ధ తుల ద్వారా ఏర్పడిన లాభనష్టాలను విశదీక రించండి?
|
No comments:
Post a Comment