తపన వుంటే తొలి ప్రయత్నంలోనే... ఐపీఎస్!!


Creative Commons LicenseAPPSC Groups and Indian Civil Services Articles by Dilip Reddy is licensed under a Creative Commons Attribution 2.5 India License.Based on a work at appscgroupspoint.blogspot.com.Permissions beyond the scope of this license may be available at http://appscgroupspoint.blogspot.com/. All articles published under CC License

గ్రూప్ I గురిపెడితే మీరే విన్...


Creative Commons LicenseAPPSC Groups and Indian Civil Services Articles by Dilip Reddy is licensed under a Creative Commons Attribution 2.5 India License.Based on a work at appscgroupspoint.blogspot.com.Permissions beyond the scope of this license may be available at http://appscgroupspoint.blogspot.com/. All articles published under CC License

పాఠకులకు విజ్ఞప్తి

పాఠకులకు విజ్ఞప్తి : ఈ బ్లాగు లో ఒక కొత్త చర్చా వేదిక చేర్చబడినది.చర్చా వేదిక లో ఎవరైనా ఏదైనా అడుగవచ్చు.తెలిసిన వారు సమాధానం ఎవ్వవచ్చు.తెలుగు వారికి ఇటువంటి వేదిక మరేక్కడా లేకపోవడం వలన దీనిని తయారు చెయ్యడం జరిగింది .ఈ చర్చా వేదికను సమర్థ వంతంగా ఉపయోగించుకున్నవారికి ఉపయోగించుకున్నంత... :D


Good morning all.I have newly added a Forum in our blog.Here any one can ask anything to the forum users.Many seniors and good people will be visiting our site.So i hope all your queries will be answered by them.I am also planning to invite some Good working Officers to participate in our forum.I'll inform you whenever such opportunities come.It will be a good platform for all of you to ask your questions and get replies from them.Hope it will become a good platform for all of Andhra Students preparing for Services(State & Central).Wish it a succes :D


I also request all the SENIORS visiting my blog to go to the forum atleast once every time you visit the blog and answer the queries posted by our brothers and sisters seeking guidance. 




This is a sincere effort to help all the Andhra Students.So SPREAD this forum among your friends


Thank You.

-ఇట్లు మీ దిలిప్

వాల్ స్ట్రీట్ ఆక్రమణ... అంతర్జాతీయ స్పందన


Creative Commons LicenseAPPSC Groups and Indian Civil Services Articles by Dilip Reddy is licensed under a Creative Commons Attribution 2.5 India License.Based on a work at appscgroupspoint.blogspot.com.Permissions beyond the scope of this license may be available at http://appscgroupspoint.blogspot.com/. All articles published under CC License

ఇష్టపడి చదివితే విజయం మీదే..


Creative Commons LicenseAPPSC Groups and Indian Civil Services Articles by Dilip Reddy is licensed under a Creative Commons Attribution 2.5 India License.Based on a work at appscgroupspoint.blogspot.com.Permissions beyond the scope of this license may be available at http://appscgroupspoint.blogspot.com/. All articles published under CC License

జనరల్ స్టడీస్....'నల్ల హంస' లాంటిదా?


Creative Commons LicenseAPPSC Groups and Indian Civil Services Articles by Dilip Reddy is licensed under a Creative Commons Attribution 2.5 India License.Based on a work at appscgroupspoint.blogspot.com.Permissions beyond the scope of this license may be available at http://appscgroupspoint.blogspot.com/. All articles published under CC License

లక్ష్యం గ్రూప్ - II

రాష్ట్రస్థాయిలో రెండో అత్యున్నత పరీక్ష గ్రూప్ ||. సాధారణ గ్రాడ్యుయేట్లు సామాజిక హోదా ఉన్న ఉద్యోగాన్ని సాధించడానికి ఈ పరీక్ష ఒక చక్కని మార్గం. ఖాళీల ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ పరీక్షను నిర్వహిస్తుంది. పరీక్షలోని అంశాలు, ప్రిపరేషన్ విధానం గురించి తెలుసుకుందాం.
గ్రూప్ -|| పరీక్ష విధానం
మొత్తం మూడు పేపర్లుంటాయి. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ టైప్‌లోనే ఉంటాయి.
పేపర్ -1 (150 మార్కులు) : జనరల్ స్టడీస్ 
పేపర్ -2 (150 మార్కులు) :  ఎ)  -  ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక చరిత్ర
                                              బి)  -  భారత రాజ్యాంగం - ఒక అవలోకనం.
పేపర్ -3 (150 మార్కులు) :  ఎ) భారతదేశంలో ప్రణాళికా రచన, భారతదేశ ఆర్థిక వ్యవస్థ
                                              బి) ఆంధ్రప్రదేశ్: ప్రత్యేక ప్రాధాన్యంతో గ్రామీణ సమాజంలో సమకాలీన  సమస్యలు, పరిణామాలు
ఇంటర్వ్యూ : (50 మార్కులు)
మొత్తం మార్కులు : 500
¤ ఆప్షనల్స్ లేవు
ప్రిపరేషన్ ఎలా
?               రాత పరీక్షలో అందరికీ ఒకేరకమైన పేపర్లు ఉంటాయి. ఆప్షనల్స్ లేవు. ఒక్కో విభాగానికి సిలబస్ ఆధారంగా సమయాన్ని కేటాయించి చదవాలి. సిలబస్ ఎక్కువగా ఉన్న పార్ట్‌కు కొంత ఎక్కువ సమయాన్ని, తేలికైన అంశాలకు కొంత తక్కువ సమయాన్ని ఇచ్చి మొత్తం మీద అన్ని విభాగాలు కవరయ్యేలా చూసుకోవాలి. 
 ¤ పేపర్ -1 - జనరల్ స్టడీస్ : దీన్లో చాలా వరకు ప్రాథమిక అంశాల (బేసిక్స్) పైనే అధిక ప్రశ్నలు వస్తాయి. కాబట్టి పాఠశాల స్థాయిలోని ఆయా సబ్జెక్టులను మరోసారి సునిశితంగా చదవాలి. పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలి. పరీక్షకు అనుగుణంగా జనరల్‌స్టడీస్ అంశాలను కింది విధంగా విభజించారు. 
¤  జనరల్ సైన్స్
¤  భారతదేశ చరిత్ర
¤  భూగోళశాస్త్రం (ప్రపంచ, భారతదేశ, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించింది)
¤  కరెంట్ అఫైర్స్ (సమకాలీన అంశాలు)
¤  మెంటల్ ఎబిలిటీ.
గమనిక : మిగిలిన పోటీ పరీక్షల్లో మాదిరి ఇక్కడ ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ విభాగాల నుంచి ఉండవు. ప్రశ్నలు ఇవ్వరు.
1) జనరల్ సైన్స్: ఇందులో భౌతిక, రసాయనిక, వృక్ష, జంతుశాస్త్రాలు; సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ప్రశ్నలుంటాయి. సాధారణ శాస్త్ర విజ్ఞానంతోపాటు అంతరిక్ష విభాగం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అణుశాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధిస్తున్న ప్రగతి మొదలైన అంశాలుంటాయి. భౌతిక, రసాయనిక శాస్త్రాల్లో ప్రాథమిక కొలతలు, కాంతి, ఆధునిక భౌతికశాస్త్రం, బయోకెమిస్ట్రీ, ఎరువులు, మానవ శరీర నిర్మాణం తదితర టాపిక్‌లు ఉంటాయి.

ఈ విభాగం ఎక్కువగా లోతైన అధ్యయనంపై ఆధారపడిందికాదు. ప్రధానంగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో నిరంతరం సంభవిస్తున్న పరిణామాలు, ప్రాథమిక అవగాహనలపై ప్రశ్నలు ఉంటాయి. కాబట్టి వాటిపై ఎక్కువ దృష్టి సారించాలి. అయితే సబ్జెక్టు పరంగా ప్రతి అంశం గురించి సమాచారాన్ని సేకరించాలి. వాతావరణ పరిస్థితుల్లో వాయువులు, పర్యావరణం; రసాయన శాస్త్రంలో అణువులు, వాటి ధర్మాలు, రసాయనిక మూలాలు, రసాయనిక బంధాలపై ప్రశ్నలు వస్తాయి. అలాగే జీవశాస్త్రంలో జీవపరిణామ క్రమం, శాస్త్రజ్ఞుల పరిశోధనలు, వ్యాధులు, వ్యాధికారక వైరస్‌లు, బ్యాక్టీరియాలు, విటమిన్లు, ప్రొటీన్లు, కిరణజన్య సంయోగక్రియ, మానవ జీర్ణవ్యవస్థ వంటి అంశాలను బాగా చదవాలి. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ విషయానికొస్తే సైన్స్ విధానాలు, పర్యావరణ కాలుష్యం, జీవసాంకేతిక పరిజ్ఞానం, సమాచార సాంకేతిక రంగం, ఉపగ్రహ వ్యవస్థ, నానోటెక్నాలజీ, క్షిపణులు, యుద్ధ వ్యవస్థ తదితర అంశాలను కాలానుగుణంగా చోటుచేసుకుంటున్న పరిణామాలతో అన్వయించుకోవాలి. అప్‌డేట్‌గా ఉండాలి.  
2) భారతదేశ చరిత్ర:  ఇది చాలా విస్తారమైంది. చరిత్రకారులు దీన్ని మూడు భాగాలుగా వర్గీకరించారు అవి
¤   ప్రాచీన
¤   మధ్యయుగ
¤   ఆధునిక యుగ చరిత్ర.
చరిత్ర ప్రారంభం మొదలు ముస్లిం పాలన, వలస వాదుల ఆక్రమణలు, బ్రిటిష్ పరిపాలన స్వాతంత్య్ర పోరాటం మొదలైన అంశాలన్నీ దీన్లో వస్తాయి. ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించి సింధు నాగరికత నుంచి అరబ్బుల దండయాత్ర వరకు; మధ్యయుగ భారతదేశ చరిత్రలో అరబ్బుల దండయాత్ర మొదలు 1857 సిపాయిల తిరుగుబాటు వరకు; ఆధునిక భారతదేశ చరిత్రలో భారత్‌లోకి యూరోపియన్ల రాక నుంచి స్వాతంత్య్ర ఉద్యమం వరకూ చదవాలి. జాతీయోద్యమంలో భాగంగా సిపాయిల తిరుగుబాటు, వందేమాతర ఉద్యమం, హోంరూల్ ఉద్యమం, దండిసత్యాగ్రహం, క్విట్ ఇండియా, బ్రిటిష్ వైస్రాయ్‌లు, గవర్నర్ జనరల్స్ గురించి తెలుసుకోవాలి. ముఖ్యమైన ఘటనలకు సంబంధించి విడిగా నోట్స్ రాసుకుంటే సిలబస్ అధికమనే సమస్య ఉండదు.
                  చరిత్ర సిలబస్ చదవడానికి ప్రణాళిక వేసుకోవాలి. లేకపోతే ఎంత చదివినా ఇంకా మిగిలే ఉంటుంది. కళలు, సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక అంశాలను క్షుణ్నంగా చదవాలి. ప్రధాన, చారిత్రక యుద్ధాలు ఎప్పుడు జరిగాయో గుర్తుపెట్టుకోవాలి. పాత ప్రశ్నపత్రాలను అధ్యయనంచేస్తూ ప్రశ్నలు ఏ తరహాలో వస్తున్నాయో గ్రహించాలి. ఆయా టాపిక్‌లను ఇంకా ఎక్కువగా గుర్తుంచుకోవాలి. ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్‌లోనే ఉన్నా ఆన్సర్ చేయడంలో మాత్రం నిశిత పరిశీలనా శక్తి అవసరం. 

3) భౌగోళికశాస్త్రం: ప్రపంచ; భారతదేశ; ఆంధ్రప్రదేశ్‌కు భౌగోళికంగా ఉన్న హద్దులేమిటి? విశ్వ రహస్యాలేమిటి; సౌరకుటుంబం, వాతావరణం - ప్రకృతి మార్పులు, రుతుపవనాలు, ప్రపంచం పారిశ్రామిక జనాభా, ఉత్పత్తులు, ఇంధన వనరులు మొదలైన అంశాలను చదవాలి. భారతదేశ భౌగోళిక అంశాలతో పాటు రాష్ట్ర భౌగోళిక అంశాలపై కూడా ఎక్కువ శ్రద్ధపెట్టాలి. ప్రపంచ పటాన్ని దగ్గర పెట్టుకుని ఏ ఖండం ఎక్కడ నుంచి ఎక్కడదాకా విస్తరించింది? భారతదేశ భౌగోళిక స్వరూపం, దాన్లో రాష్ట్ర స్వరూపం ఎలా ఉందో నోట్ చేసుకోవాలి. దేశాభివృద్ధికి సహకరించే బహుళార్థ సాధక ప్రాజెక్టులు, మత్స్య సంపద, పరిశ్రమలు, మౌలిక ఉత్పత్తులు వంటి అంశాలను చదవాలి.
4) కరెంట్ అఫైర్స్ (సమకాలీన అంశాలు): నిత్యం పేపర్లలో, టీవీల్లో చూస్తున్నవే. అయినా పరీక్షలో అడిగే విధానం విభిన్నంగా ఉంటుంది. కరెంట్ టాపిక్స్ అంటే కేవలం రాష్ట్రానికి సంబంధించినంత వరకే పరిమితం కాదు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న వివిధ సంఘటనలు వస్తాయి. వార్తల్లోని ప్రదేశాలు, వ్యక్తులు; అవార్డులు, నియామకాలు, క్రీడలు - ప్రదేశాలు, ఆర్థిక, రాజకీయ, భౌగోళిక పరిణామాలు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, ప్రముఖ వ్యక్తుల పర్యటనలు, మరణాలు మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
                    పరీక్షకు ముందు సుమారు 5 లేదా 6 నెలల నుంచి దీనికోసం సిద్ధం కావాలి. రోజూ ప్రధాన దినపత్రికలు చూస్తూ నోట్స్ రాసుకోవాలి. జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ విభాగాలుగా నోట్స్‌ను సెట్‌చేసుకుని టాపిక్‌లను ఆయా విభాగాల్లో రాసుకోవాలి. ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటూ పోవాలి. 

5) మెంటల్ ఎబిలిటీ: టెన్త్ వరకు చదివిన మ్యాథమెటిక్స్ ప్రాథమిక మూల సూత్రాల చుట్టూనే ప్రశ్నలు ఉంటాయి. అధిక మార్కుల కోసం ఎక్కువగా పేపర్ వర్క్ చేయాలి. దీన్లో రీజనింగ్, అరిథ్‌మెటిక్‌లకు సంబంధించిన అంశాలుంటాయి. నాన్-వెర్బల్ రీజనింగ్ విభాగం దీన్లో లేదు. రీజనింగ్‌లో డైరెక్షన్స్, కోడింగ్, డీ-కోడింగ్, డైరెక్షన్స్ టెస్ట్, బ్లడ్ రిలేషన్స్, క్యాలెండర్, క్లాసిఫికేషన్స్, లాజికల్ వెన్ డయాగ్రమ్స్ మొదలైనవి ఉంటాయి. ఇక అరిథ్‌మెటిక్ విభాగంలో సరాసరి, శాతాలు, సగటు, భాగస్వామ్యం, సింప్లిఫికేషన్స్, చక్రవడ్డీ, బారువడ్డీ, లాభనష్టాలు, కాలం - పని, కాలం -దూరం, క్షేత్రగణితం తదిర అంశాలు వస్తాయి.
           మెంటల్ ఎబిలిటీ విభాగంపై పూర్తి సాధన కోసం మోడల్ పేపర్లు, ప్రాక్టీస్ బిట్లు, టెన్త్ వరకు ఉన్న ప్రాథమిక మ్యాథ్స్ సబ్జెక్టు అంశాలను బాగా స్టడీ చేయాలి. సూత్రాలను బాగా గుర్తుంచుకోవాలి.
పేపర్ -2
ఎ) భారత రాజ్యాంగం - ఒక అవలోకనం - 75 మార్కులు
బి) ఆంధ్రప్రదేశ్ సామాజిక చరిత్ర - 75 మార్కులు
ఎ) భారత రాజ్యాంగం - ఒక అవలోకనం: ఈ విభాగంలో మొత్తం 5 చాప్టర్లు ఉన్నాయి. ఒక్కో దాన్నుంచి కనీసం 15 మార్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 5 చాప్టర్లనూ చదవాల్సిందే. భారత రాజ్యాంగ నిర్మాణం మొదలు, చట్టాలు, షెడ్యూళ్లు, రాజ్యాంగ మౌలిక లక్షణాలు, ప్రాథమిక హక్కులు - ఆదేశ సూత్రాలు చదవాలి. రెండోవిభాగంలో కేంద్ర, రాష్ట్ర సంబంధాలు; భారత సమాఖ్య విశిష్ట లక్షణాలు, అవశిష్టాధికారాలు తెలుసుకోవాలి. మూడోవిభాగంలో సమాజ వికాస ప్రయోగం కింద మూడంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ, రాజ్యాంగ సవరణలు, వాటి అమలు వస్తాయి. నాలుగోవిభాగంలో భారతదేశంలో సంక్షేమ యంత్రాంగం, అల్ప సంఖ్యాక వర్గాలు, షెడ్యూల్డ్ కులాలు, తెగలు, ఇతర కులమత వర్గాలకు వర్తించే చట్టాలు మొదలైనవి అధ్యయనం చేయాలి. అయిదో విభాగంలో శాసనసభ వ్యవస్థలుంటాయి. ఈ విభాగంలో పట్టు సాధించేందుకు పక్కా వ్యూహంతో వెళ్లాలి.

ఒకదానితో మరొక అంశం ముడిపడి ఉన్నప్పుడు తర్కబద్ధంగా ఆలోచించి ఆయా అంశాలను గుర్తుపెట్టుకోవాలి. ప్రిపరేషన్ కోసం అన్ని యూనిట్లను సమగ్రంగా చదువుకుంటూ పోవాలి. భారత రాజకీయ వ్యవస్థలో ఎప్పటికప్పుడు వస్తున్న తాజా పరిణామాలు, సుప్రీం కోర్టు తీర్పులు, చట్టాలు - సవరణలు నోట్ చేసుకోవాలి. పరిపాలనా యంత్రాంగం విధి విధానాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి.
బి) ఆంధ్రప్రదేశ్ సామాజిక చరిత్ర:  ఆంధ్రప్రదేశ్‌లో సామాజికంగా, రాజకీయంగా సంభవించిన పరిణామాలు, చరిత్రలో రాష్ట్రానికి ఉన్న ప్రాధాన్యం మొదలైన అంశాలను చదవాలి. రాష్ట్ర సంస్కృతి, ఇతర సామాజిక సంప్రదాయాల ప్రభావం గమనించాలి. ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర, స్వాతంత్య్ర ఉద్యమం, రాష్ట్రంలో స్వాతంత్య్ర ఉద్యమ వ్యాప్తి, సాహితీ వికాసం, వాస్తు శిల్ప సంపద, లలిత కళలు తదితర అంశాలను బాగా చదవాలి.
పేపర్
-3 ఎ) భారతదేశంలో ప్రణాళికా రచన, భారతదేశ ఆర్థిక వ్యవస్థ - 75 మార్కులు
బి) ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రాధాన్యంతో గ్రామీణ సమాజంలో సమకాలీన సమస్యలు, పరిణామాలు - 75 

మార్కులు
            ఆర్థిక రంగాన్ని సిలబస్ వారీగా అధ్యయనం చేయాలి. ఆంధ్రప్రదేశ్ ఎకానమీని సాధారణ పరిజ్ఞానంతో అర్థం చేసుకోవాలి. ప్రణాళికా బద్ధంగా, లోతుగా చదవాలి. పేపర్ - 2, పేపర్ - 3లలో ఒక్కో దాంట్లో 75కు 70 మార్కుల దాకా స్కోర్ చేయవచ్చు. తాజా సమాచారంతో ఈ పేపర్లను చదవాలి. 

) భారతదేశంలో ప్రణాళికా రచన: భారత ఆర్థిక వ్యవస్థలోని ప్రాథమిక భావనలపై ఎంత పట్టు సాధిస్తే అంత ప్రయోజనం ఉంటుంది.     
ఆర్థిక వ్యవస్థ స్వరూప స్వభావాలు, బ్యాంకింగ్ రంగం, జాతీయాదాయం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు తదితర అంశాలపై ప్రశ్నలు వస్తాయి. ఆర్థిక సంస్కరణలకు ప్రత్యేకంగా చోటు కల్పిస్తూ ఆర్థిక సంస్కరణల ప్రారంభంతో వచ్చిన మార్పులపై మంచి అవగాహన ఏర్పరచుకోవాలి.
బి) ఆంధ్రప్రదేశ్ - ప్రత్యేక ప్రాధాన్యంతో గ్రామీణ సమస్యలు: ఇక్కడ కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించిన పూర్తి అవగాహన అవసరం. రాష్ట్రంలో ఏ జిల్లాల్లో ఏయే పంటలు ఎక్కువగా పండుతాయి? గ్రామీణ అభివృద్ధి పథకాలు ఏమిటి? నీటిపారుదల వ్యవస్థ తీరుతెన్నులు ఎలా ఉన్నాయి మొదలైన అంశాలను తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ మీద మంచి పట్టు ఉండేలా చూసుకుంటే మరింత ప్రయోజనం కలుగుతుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ, సహకార రంగం, ప్రత్యామ్నాయ మార్గాలు, భూ సంస్కరణలు వాటి పరిణామాలు, ప్రణాళికల్లో రాష్ట్ర కేటాయింపులు, రాష్ట్ర ఆర్థిక పురోగతి నివేదికలు తదితర అంశాలను విపులంగా చదివి, ముఖ్యమైన పాయింట్లను నోట్ చేసుకోవాలి.
గుర్తుంచుకోండి ¤  సిలబస్‌పై పూర్తి స్పష్టత ఏర్పరచుకోవాలి.
¤  ప్రణాళిక ప్రకారం సిలబస్‌ను వర్గీకరించుకోవాలి.
¤ పరీక్ష నెల ముందు నుంచీ మోడల్ పేపర్లు బాగా ప్రాక్టీస్ చేస్తే పరీక్షలో సమయం ఎలా ఆదాచేయాలో తెలుస్తుంది. అంతేకాదు క్లిష్ట సమస్యలను ఏ విధంగా ఆన్సర్ చేయవచ్చో ఒక అవగాహన ఏర్పడుతుంది.
¤  ప్రశ్నలు ఎలా వస్తున్నాయో గమనించాలి. దీనివల్ల పరీక్ష ప్రశ్నల స్థాయి తెలుస్తుంది.


  చదవాల్సిన పుస్తకాలు ¤  జనరల్ స్టడీస్ - టాటా మెక్‌గ్రాహిల్ -జనరల్ స్టడీస్ గైడ్.
¤  కరెంట్ అఫైర్స్ - ప్రధాన దినపత్రికలు, పోటీ పరీక్షల మ్యాగజీన్‌లు
¤  ఆంధ్రుల చరిత్ర - బి.ఎస్.ఎన్.ఎల్.హనుమంతరావు.
¤  ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర - రఘునాథరావు.
¤  ఇండియన్ పాలిటీ - కె.లక్ష్మీకాంత్
¤  భారత ఆర్థిక వ్యవస్థ - తెలుగు అకాడమీ పుస్తకాలు.
వీటితోపాటు ఇయర్‌బుక్, ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే మొదలైనవి.


Creative Commons LicenseAPPSC Groups and Indian Civil Services Articles by Dilip Reddy is licensed under a Creative Commons Attribution 2.5 India License.Based on a work at appscgroupspoint.blogspot.com.Permissions beyond the scope of this license may be available at http://appscgroupspoint.blogspot.com/. All articles published under CC License

సివిల్స్‌ మెయిన్స్‌లో.. మార్కుల వ్యూహం

 
సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌... సిసలైన సత్తాను పరీక్షకు పెట్టే డిస్క్రిప్టివ్‌ విధానంలో జరిగే పరీక్ష!

దీనిలో విజయవంతమైతే సివిల్స్‌ ప్రస్థానంలో విజయానికి దాదాపు చేరువైనట్లే. వచ్చేనెల చివరివారంలో ఈ పరీక్ష ప్రారంభమవుతున్న సందర్భంగా అత్యధిక మార్కులను స్కోరు చేసే వ్యూహం వివరిస్తున్నారు గోపాలకృష్ణ.

తగిన పరిజ్ఞానం, నైపుణ్యాలు ఉన్నంతమాత్రాన ఎవరూ ఉత్తమ సివిల్‌ సర్వెంట్లు కాలేరు. అంకితభావం, సామాజిక అంశాలపై స్పందన, రాజ్యాంగ ఆదర్శాలపట్ల నిబద్ధత మొదలైన విలువలు ప్రధానం. ఇలాంటివారిని గుర్తించే లక్ష్యంతోనే సివిల్స్‌ నియామక ప్రక్రియ పనిచేస్తుంది.

తొమ్మిది పేపర్లతో డిస్క్రిప్టివ్‌ విధానంలో సాగే మెయిన్స్‌ పరీక్ష 20 రోజుల వ్యవధిలో ముగుస్తుంది. అభ్యర్థుల విద్యాపరమైన ప్రతిభను మాత్రమే కాకుండా వారి సమన్వయ సామర్థ్యాన్నీ, స్వీయ పరిజ్ఞానాన్ని స్పష్టంగా సమర్పించే తీరునూ పరీక్షించేలా మెయిన్స్‌ను రూపొందించారు.

క్వాలిఫైయింగ్‌ పేపర్లు
అభ్యర్థి ప్రాథమిక నైపుణ్యాలను మోడర్న్‌ ఇండియన్‌ లాంగ్వేజ్‌, జనరల్‌ ఇంగ్లిష్‌లలో పరీక్షిస్తారు. ఈ పేపర్లలో మార్కులను ర్యాంకింగ్‌కు లెక్కించరు కానీ, వీటిలో కనీసం 33 శాతం మార్కులు తెచ్చుకోవటం తప్పనిసరి.

* మోడర్న్‌ ఇండియన్‌ లాంగ్వేజ్‌: తెలుగు/ హిందీ రాయటం తగ్గిపోయిన అభ్యర్థులు చాలామందే ఉంటారు. ఇలాంటివారు రోజుకు కనీసం అరగంటైనా రైటింగ్‌ సాధన చేయాల్సివుంటుంది. భాషను సాధన చేయటం కోసం అక్టోబరు 1 నుంచి రోజుకు అరగంట చొప్పున వారానికి 4 రోజులు కేటాయించుకోవాలి. తెలుగుమీడియంలో డిగ్రీ చేసినవారూ, తెలుగు సాహిత్యం ఐచ్ఛికంగా ఉన్న విద్యార్థులూ ఈ పేపర్‌పై ఎక్కువ సమయం వెచ్చించనక్కర్లేదు.

* జనరల్‌ ఇంగ్లిష్‌: మన రాష్ట్ర విద్యార్థుల్లో చాలామందికి ఈ పేపర్‌ సమస్యే కాదు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన గ్రామీణప్రాంతాల్లో ఇంగ్లిష్‌ బోధన మెరుగేనని చెప్పాలి. కాబట్టి తెలుగుమీడియం నేపథ్యం వారు కూడా దీనికి ఎక్కువగా సన్నద్ధం కానక్కర్లేదు. గత సంవత్సరాల పేపర్లు చూసి, మానసికంగా సిద్ధమవ్వాలి.

జనరల్‌ ఎస్సే

ర్యాంకును సాధించటంలో వ్యాసం పాత్ర నిర్ణయాత్మకం. చాలామంది టాపర్లు సగటు మార్కుల కంటే అధికంగా తెచ్చుకునే పేపరిది. గరిష్ఠమార్కులు పొందాలంటే తగిన అంశాన్ని ఎంచుకోవటం, క్రమపద్ధతిలో దాన్ని విశ్లేషించటం అవసరం.

ఈ ఏడాది ఆశించదగ్గ టాపిక్స్‌:
1) Role of Audit in Democratic India

2) Judicial Accountability and Democracy

3) Food Security, Food inflation and Public Distribution System

4) What the Next five year Plan should focus upon Five priority items

5) Information Technology for the Masses: Bridging the Digital Divide

  
స్కోరు సాధించేదెలా?
* వ్యాసానికి ఎంచుకున్న అంశం (టాపిక్‌) సందర్భాన్ని అభ్యర్థి సరిగా అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. లేకపోతే ఆ అంశానికి న్యాయం చేయలేము.

* అందుకే మొదటి 10 నిమిషాలూ టాపిక్‌ ఎంచుకోవటానికే వెచ్చించాలి.

* ఇచ్చిన సందర్భాన్ని సరిగా అర్థం చేసుకున్నామా లేదా అనేది ఒకటికి రెండుసార్లు నిర్థారించుకోవాలి.

* అంశం ఎంచుకున్నాక దాని గురించి మీ దగ్గరున్న సమాచారం గురించి పాయింట్లుగా రాయాలి.

* వాటిని తార్కిక పద్ధతిలో అమర్చాలి.

* ప్రతి పాయింటునూ రాసేటపుడు విస్తరిస్తూ రాయాలి. ఉదా: Judicial accountability and democracy అనే అంశం. ఈ క్రమంలో ముందుకుసాగవచ్చు-

The need for judicial accountability in a democracy

> The problems of ensuring judicial accountability in practice

> Significant features of the proposed judicial standards and accountability bill

> Mechanism for making the proposed bill effective.

కంపల్సరీ పేపర్లలో ముఖ్యాంశాలు గుర్తించాలి. తర్వాత ఇదే కసరత్తును ఆప్షనల్స్‌లో కూడా చేయాలి. వాటిపై మనసు కేంద్రీకృతం చేయాలి. ఇలాంటి ప్రయత్నం పరీక్షలో మంచి ఫలితాలను అందిస్తుంది.

భర్తీ చేయబోయే పోస్టుల సంఖ్య ఎక్కువుంది కాబట్టి 2011 సంవత్సరం అభ్యర్థులు ముందడుగు వేయటానికి సరైన సంవత్సరం. ఆత్మవిశ్వాసంతో విజయవ్యూహాన్ని ఆచరణలో పెడితే... మెయిన్స్‌లో విజయం సాధించి... ఇంటర్వ్యూ దశకు చేరుకున్నట్టే!

ఇవి గుర్తుంచుకోండి!
* జనరల్‌ స్టడీస్‌ పేపర్‌ పూర్తిగా అనూహ్యంగా ఉంటుంది. ఇలా ఉండటం అసాధారణమేమీ కాదు. అందుకని అందుకు మానసికంగా సిద్ధం కావాలి.

* ఎస్సే ప్రశ్నలు మరీ ఎక్కువగా ఉండకపోవచ్చు. ఎక్కువ ప్రశ్నలు షార్ట్‌ నోట్సు, 5 మార్కులు, 10 మార్కులవి ఉండొచ్చు.

* అన్ని అంశాలనూ కవర్‌ చేయటం దాదాపు అసాధ్యం. అందుకని అలా చేయాలనుకోవద్దు.

* కిందటి సంవత్సరం విజేతల్లో చాలా తక్కువమందే 300/600 కంటే మించి స్కోర్‌ చేశారు. ఇదే ధోరణి కొనసాగుతుంది. అందుకని జనరల్‌స్టడీస్‌ సన్నద్ధతకు మితిమీరిన ప్రాధాన్యం ఇవ్వొద్దు. దీనికంటే ఆప్షనల్స్‌పై దృష్టిపెట్టటం సముచితం. ఎందుకంటే మార్కుల నిష్పత్తి 2:1 ఉంటుంది.
Creative Commons LicenseAPPSC Groups and Indian Civil Services Articles by Dilip Reddy is licensed under a Creative Commons Attribution 2.5 India License.Based on a work at appscgroupspoint.blogspot.com.Permissions beyond the scope of this license may be available at http://appscgroupspoint.blogspot.com/. All articles published under CC License

ఆహార సంస్థలో అవకాశాల హారం....


Creative Commons LicenseAPPSC Groups and Indian Civil Services Articles by Dilip Reddy is licensed under a Creative Commons Attribution 2.5 India License.Based on a work at appscgroupspoint.blogspot.com.Permissions beyond the scope of this license may be available at http://appscgroupspoint.blogspot.com/. All articles published under CC License

సివిల్స్‌ తెలుగును అశ్రద్ధ చేస్తే అసలుకే మోసం!

సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో మన రాష్ట్ర విద్యార్థులకు తప్పనిసరి పేపర్‌గా మాతృభాష తెలుగు ఉంది. ఇది అర్హత పరీక్ష మాత్రమే అయినా నిర్లక్ష్యం వహిస్తే అర్హత కోల్పోయే ప్రమాదం లేకపోలేదంటున్నారు డా. ద్వా.నా. శాస్త్రి.

అర్హత పరీక్షగా తెలుగు 300 మార్కులకు జరుగుతుంది. అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రాయాలి. అయితే నలబై శాతం మార్కులు తెచ్చుకోవాల్సివుంటుంది. అంటే 120 మార్కులు! 'ఈ మాత్రం రావా?' అనే నిర్లక్ష్యం పనికిరాదు. అశ్రద్ధ వల్ల 'క్వాలిఫై' అవ్వని అభ్యర్థులూ ఉన్నారన్న సంగతి మర్చిపోవద్దు.

'క్వాలిఫైయింగ్‌' తెలుగులో మొత్తం ఆరు ప్రశ్నలుంటాయి.

1) 300 పదాలతో వ్యాసం - 100 మార్కులు 2) ఒక ఖండిక ఇచ్చి చివర ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయటం- 60 మార్కులు 3) ఒక ఖండికను మూడోవంతు పరిమాణానికి తగ్గించి రాయటం- 60 మార్కులు 4) ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదించటం- 20 మార్కులు 5) తెలుగు నుంచి ఆంగ్లంలోకి అనువదించటం - 20 మార్కులు 6) ఎ) జాతీయాలను సొంత వాక్యాల్లో ప్రయోగించటం- 20 మార్కులు బి) సమానార్థక పదాలు రాయటం- 20 మార్కులు

పదో తరగతి స్థాయికి తగినది అని చెపుతున్నా నిజానికి ఈ పేపర్‌ డిగ్రీ స్థాయికి చెందినదే. పైగా ఆంగ్లమాధ్యమంలో చదువుతున్న అభ్యర్థులకు తెలుగు రాసే అలవాటు అంతగా ఉండదు. అందుకే ఈ పేపర్‌ను తేలిగ్గా తీసుకోవటం, నిర్లక్ష్యం చేయటం సరికాదు.

మొదటి ప్రశ్న
ఇది 'జనరల్‌ ఎస్సే'కి సంబంధించినది. సుమారు 300 పదాల్లో రాయమన్నారు కాబట్టి ఓ ఇరవై పదాలు ఎక్కువైనా, తక్కువైనా పట్టించుకోరు. తక్కువ రాయటం కంటే ఇరవై పదాలు ఎక్కువైనా ఫరవాలేదనుకోవాలి. లెక్కపెట్టి మరీ రాయనవసరం లేదు.

ఒక పేజీ రాసినతర్వాత సుమారుగా ఎన్ని పదాలు వచ్చాయో చూసుకుని దాని ప్రకారం రాయవచ్చు. వంద మార్కులున్నాయి కాబట్టి ఆచితూచి రాయాల్సివుంటుంది. ఇందులో ఉన్న సౌలభ్యం ఏమిటంటే... ఐదు ప్రశ్నల్లో ఒకటే రాయటం. 'చాయిస్‌' ఎక్కువుంది కాబట్టి దిగులు చెందనక్కర్లేదు.

నేపథ్యం, ప్రారంభం, విషయ వివరణ, అనుకూల ప్రతికూల అంశాలు, ప్రస్తుత స్థితి, సూచనలు, ముగింపు... అనేవాటిపై దృష్టి ఉంచి వ్యాసం రాయాలి. పెద్దల మాటలనూ, కవుల వాక్యాలనూ, సామెతలనూ, జాతీయాలనూ ప్రయోగిస్తే మార్కులు ఎక్కువ సంపాదించవచ్చు. అనుకూలమైనా, ప్రతికూలమైనా చర్చించే పద్ధతిని బట్టి మార్కులుంటాయి. సోదాహరణంగా వివరిస్తే స్పష్టత సాధించవచ్చు.

రెండో ప్రశ్న
చివరలో ఇచ్చే ప్రశ్నలకు సమాధానాలు- పైన ఇచ్చిన ఖండికలోనే ఉంటాయి. జాగ్రత్తగా చదివితే చాలు. అయితే సమయం ముఖ్యమని మర్చిపోకూడదు. ఖండికలో ఉన్నట్టే రాయక్కర్లేదు- 'మీ సొంత మాటల్లో' రాయాలని సూచిస్తారు.

మూడో ప్రశ్న
ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇచ్చిన ఖండికను మూడో వంతు పరిమాణానికి తగ్గించి సంక్షిప్తంగా రాయాలి. ఈ ప్రశ్నకు సమాధానం కోసం ప్రత్యేకంగా ఇచ్చిన కాగితాలపైనే రాసి ప్రధాన సమాధాన పత్రానికి జత చేయాలి. మూడోవంతుకు తక్కువైనా, ఎక్కువైనా తగిన విధంగా మార్కులుంటాయన్న హెచ్చరికను గమనించాలి. కాబట్టి మొత్తం పంక్తులు లెక్కబెట్టి మూడో వంతుకు ఎన్ని పంక్తులు వస్తాయో ముందుగానే సరిచూసుకోవాలి. ఇలా సంక్షిప్తం చేయడమంటే ఇచ్చిన సమాచారంపై అవగాహన ఉండాలని భావం. రెండు మూడు వాక్యాల్లో ఉంటే ఒక వాక్యంగా కుదించాలి. భావం మారకుండా, సొంత కవిత్వం లేకుండా రాయాలి. ఇందుకు సామెతలు, జాతీయాలు తోడ్పడతాయి. రెండు మూడుసార్లు చదివినతర్వాతనే సంక్షిప్త రచన చేపట్టాలి.

అనువాదం
ఆంగ్లం నుంచి తెలుగులోకీ, తెలుగు నుంచి ఆంగ్లంలోకీ అనువదించమనే ప్రశ్నలుంటాయి. అనువాదం ఎప్పుడూ యథాతథానువాదం కాకూడదు. అంటే మక్కీకి మక్కీ ఉండకూడదు. భావాన్ని సొంతమాటల్లో చెప్పాలి. అనువాదంలా కాకుండా 'అనుసృజన' లాగా ఉండాలి.

రెండు వాక్యాల్లో ఉంటే ఒక వాక్యంలో చెప్పవచ్చు. సరైన పదాలు తట్టకపోతే మూలపదాలను అలాగే రాసి కొటేషన్లలో రాయవచ్చు. ఆంగ్లపదాలను రాయాల్సివస్తే ఆంగ్లంలో కాకుండా వాటిని కొటేషన్లో ఉంచి తెలుగులో రాయాలి. ఉదా: 'కంప్యూటర్‌', 'అడ్మినిస్ట్రేషన్‌', 'ఇంటర్వ్యూ' మొదలైనవి. అనువాదంలో భాషానుగుణమైన పదప్రయోగాలకే ప్రాధాన్యం ఇవ్వాలి. ఆంగ్లంలో staying at hotel అంటారు. దీన్ని తెలుగులో రాసేటప్పుడు 'హోటల్‌ వద్ద' అనకుండా 'హోటల్‌లో'బస చేస్తున్నాడనాలి. ఆంగ్లంలోని 'బ్రెడ్‌' అనే మాటను సందర్భాన్నిబట్టి 'ఆహారం' అని మార్చాల్సివుంటుంది. ఇలాంటి మెలకువలు గ్రహించాలి.

సొంతవాక్యాల్లో జాతీయాలు
ఇది ఎంత తేలికో అంత కష్టమైనది. జాతీయాలను సొంత వాక్యాల్లో ప్రయోగించటమంటే లోకజ్ఞానం, సందర్భం తెలిసివుండాలి. జాతీయం అనేది రెండు మూడు పదాల కలయిగా ఉండే పదబంధం. ఆంగ్లంలో 'ఇడియమ్‌' అంటారు. అసలైన అర్థం కాకుండా దానికి సంబంధించి మరో అర్థం వస్తుంది.

'కళ్ళల్లో కారం పోసుకోవడం' అంటే నిజంగా ఆ అర్థం కాదు. ఈర్ష్య పడటం, అసూయపడటం, ఓర్వలేకపోవడం అని. దీన్ని గ్రహించి వాక్యంలో ప్రయోగించాలి.

* వడ్డించిన విస్తరి: అధికారం, సంపద గలవారి జీవితం వడ్డించిన విస్తరి వంటిది.

* నత్తనడక: ప్రభుత్వ ప్రణాళికలు చాలావరకూ నత్తనడక నడుస్తున్నాయి.

*  చెవి కోసుకోవడం: కథలంటే మా అన్నయ్య చెవి కోసుకుంటాడు.

అమృతము= పీయూషము, సుధ

కలువ= ఉత్పలము, కల్హారం, కుముదం

మనుష్యుడు= మానవుడు, మనుజుడు, మర్త్యుడు, నరుడు, పురుషుడు

వాయువు= గాలి, మారుతము, పవనము, అనిలం, సమీరం

ఈ విధంగా తెలుగు అర్హత పరీక్ష ఉంటుంది. జనరల్‌స్టడీస్‌, ఆప్షనల్స్‌ ఎంత బాగా చదివినా, ఎంత బాగా రాయగలిగినా మాతృభాషలో అర్హత పొందకపోతే అంతా బూడిదలో పోసిన పన్నీరు విధం అవుతుంది. కాబట్టి మెయిన్స్‌కు సన్నద్ధమయ్యేవారు దీనిపై దృష్టి పెట్టడం అవసరం.

ఒక్కమాట- తెలుగులో రాయటం అంటే వాడుకభాషలో రాయటమే. పత్రికాభాషలో రాయటమే!
Creative Commons LicenseAPPSC Groups and Indian Civil Services Articles by Dilip Reddy is licensed under a Creative Commons Attribution 2.5 India License.Based on a work at appscgroupspoint.blogspot.com.Permissions beyond the scope of this license may be available at http://appscgroupspoint.blogspot.com/. All articles published under CC License

సివిల్స్ నగార


Creative Commons LicenseAPPSC Groups and Indian Civil Services Articles by Dilip Reddy is licensed under a Creative Commons Attribution 2.5 India License.Based on a work at appscgroupspoint.blogspot.com.Permissions beyond the scope of this license may be available at http://appscgroupspoint.blogspot.com/. All articles published under CC License

సివిల్స్ మెయిన్స్‌ మెలకువలివిగో!

సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌ పరీక్షలు దగ్గర్లోకి వచ్చేశాయి.

దీంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ, ఆందోళన!

పరీక్షను అర్థం చేసుకుని, విజయసూత్రాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తే 'సన్నద్ధత' ప్రయాణం సాఫీగానే సాగుతుంది. ఆ వివరాలను అందిస్తూ పునశ్చరణను పరిపుష్టం చేసుకునే విధానం వివరిస్తున్నారు... బ్రెయిన్‌ ట్రీ డైరెక్టర్‌ గోపాలకృష్ణ

సివిల్స్‌లో ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది కాబట్టి అది చాలా తేలికనే అభిప్రాయం చాలామందిలో కనిపిస్తుంది. నిజానికి కష్టమైన పరీక్ష ఇదే. ప్రిలిమినరీలో ప్రతి మార్కూ విలువైనదే. ఒక్క మార్కే అభ్యర్థి పోటీలో ఉండటాన్నీ, వైదొలగటాన్నీ నిర్ణయించే అవకాశముంది. పైగా మొదటిసారి ప్రిలిమ్స్‌లో నెగ్గనివారిలో ఆ కారణం మానసికంగా కొంత అవరోధాన్ని ఏర్పరిచే ప్రమాదం ఉంటుంది.

అందుకే ప్రిలిమ్స్‌ దశ దాటినవారు పెద్ద 'హర్డిల్‌' దాటేసినందుకు తమ భుజం తామే తట్టుకోవచ్చు! ఇక రెండో దశ అయిన మెయిన్స్‌ విషయానికి వస్తే... దీనిలో సాధించిన మార్కులు అభ్యర్థుల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. వారు ఇంటర్వ్యూకు అర్హత పొందుతారా? ఏ సర్వీసుకు ఎంపికవుతారు? ఐఏఎస్‌కో, ఐపీఎస్‌కో ఎంపికైతే ఏ రాష్ట్రంలో పనిచేస్తారు?... ఇవన్నీ!

ప్రతి మార్కూ ఇక్కడ కూడా పరిగణనలోకి వచ్చేదే. అయితే ఎక్కువ పేపర్లుంటాయి కాబట్టి ఒక పేపర్లో తక్కువ మార్కులు వచ్చినా మరో పేపర్లో అత్యధిక స్కోరు తెచ్చుకుని సర్దుబాటు చేసుకోవచ్చు.

ఆప్షనల్స్‌ ప్రత్యేకత
మెయిన్‌ పరీక్షలో తొమ్మిది పేపర్లుంటాయి. వాటిలో ఐదు తప్పనిసరి (కంపల్సరీ). మిగిలిన నాలుగూ అభ్యర్థి ఎంచుకునే ఆప్షనల్స్‌. ఈ ఆప్షనల్‌ సబ్జెక్టుల ప్రత్యేకత ఏమిటి? గత మూడేళ్ళ ఫలితాల్లో టాపర్ల మార్కులను పరిశీలిస్తే... అందరూ ఆప్షనల్స్‌లో చాలా అధిక మార్కులు స్కోర్‌ చేసినవారే! ఆశ్చర్యకరంగా జనరల్‌ స్టడీస్‌లో అందరికీ తక్కువ మార్కులే వచ్చాయి.

ఇది దేన్ని సూచిస్తోంది?

జనరల్‌ స్టడీస్‌ చాలా విస్తృతం కాబట్టి దీనిలో స్కోర్‌ చేయటం చాలా కష్టం. ఈ క్లిష్టత అభ్యర్థులందరిదీ! ఈ పేపర్‌ పూర్తిగా అనూహ్యంగా ఉండొచ్చు. ఎంత విస్తారంగా చదివినా, ఎన్ని కోచింగ్‌ తరగతులకు హాజరైనా... ప్రశ్నపత్రం అదివరకెన్నడూ ఎరగనిది చూసినట్టు అనిపిస్తే ఆశ్చర్యపోనవసరం లేదు.

ఇలాంటపుడు ఏం చేయాలి? ప్రతి ఒక్కరికీ ఇదే పరిస్థితి ఉంటుంది కాబట్టి విచారించనక్కర్లేదు. అందుకే 2000 మార్కులున్న ఆప్షనల్స్‌ మీద దృష్టి కేంద్రీకరిస్తే 1200 మార్కులు (60 శాతం) తెచ్చుకునే అవకాశం ఉంది. ఇతర పేపర్లలో అనూహ్య ప్రశ్నలు ఎక్కువ కాబట్టి ఆప్షనల్స్‌ మార్కులు 60 శాతమైనప్పటికీ, అభ్యర్థి విజయంలో వాటి పాత్రను 75 శాతం వరకూ లెక్కలోకి వేసుకోవచ్చు. ఈ రకంగా ఆప్షనల్స్‌లో వచ్చే మార్కులకు నేరుగా ర్యాంకుతోనే సంబంధం ఉంటుంది!

మన రాష్ట్రంలో సివిల్స్‌ విజేతల్లో ఎక్కువమంది ఎంచుకునే ఆప్షనల్స్‌లో పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఆంత్రపాలజీ, తెలుగు సాహిత్యం, భూగోళశాస్త్రం ఉన్నాయి. తొలిసారే అర్హత పొందినవారిలో అధికశాతం ఎంపిక- పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఆంత్రపాలజీలే. దేశవ్యాప్తంగా కూడా ప్రాచుర్యం పొందిన ఆప్షనల్‌- పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌. గత ఏడాది విజేతలైన 900 + అభ్యర్థుల్లో 400+ మంది ఆప్షనల్‌ ఇదే! ఈ ఏడాది మెయిన్స్‌కు హాజరయ్యే 12,000 మంది అభ్యర్థుల్లో 6,500కి పైగా ఈ సబ్జెక్టునే ఆప్షనల్‌గా ఎంచుకోవటం విశేషం. ఈ సబ్జెక్టు సిలబస్‌ను రెండు పేపర్లుగా విభజించారు. మొదటి పేపర్‌లో అడ్మినిస్ట్రేటివ్‌ థియరీ, రెండోదానిలో భారతీయ పాలనావ్యవస్థ. రెండూ స్కోరింగ్‌కు అనుకూలమైనవే. ప్రతి పేపర్లోనూ 300కు 200 మార్కులు తెచ్చుకున్నవారున్నారు. వీరి వ్యూహం ఏమిటంటే...

1) స్కోరింగ్‌ అంశాలను గుర్తించటం

2) ఈ అంశాల్లోని వర్తమాన పరిణామాలను చదవటం

3) జవాబులు రాసే తీరుపై దృష్టి పెట్టటం

పేపర్‌-1: మొదటి విభాగం (సెక్షన్‌)లో తొలి ఆరు అధ్యాయాలూ, రెండో విభాగంలో మిగిలిన ఆరు అధ్యాయాలూ ఉంటాయి. మొదటి విభాగం అధిక స్కోరింగ్‌ కాబట్టి ఈ అధ్యాయాలపై అధిక దృష్టి కేంద్రీకరించవలసివుంది.

పేపర్‌-2: తొలి ఏడు అధ్యాయాలూ సెక్షన్‌-ఎలో, మిగిలిన ఏడు అధ్యాయాలూ సెక్షన్‌-బిలో ఉంటాయి. దీనిలో పేపర్‌-1 మాదిరి కాకుండా రెండో విభాగంలోనే అధిక మార్కులు స్కోర్‌ చేసే అవకాశముంది.

గత కొద్ది సంవత్సరాల ప్రశ్నపత్రాల ఆధారంగా కింది ధోరణులను గుర్తించవచ్చు.

* గతంలో కనీసం నాలుగు వ్యాసరూప (ఎస్సే) ప్రశ్నలుండేవి. ఈ తీరు మారుతోంది. ఎస్సే ప్రశ్నలు చిన్న ప్రశ్నలుగా మారుతున్నాయి. దీనిబట్టి గ్రహించాల్సింది ఏమిటంటే... అభ్యర్థులు కొన్ని అంశాలను వదిలివేసే అవకాశం లేదిప్పుడు. అన్నిటినీ చదివి తీరాల్సిందే!

* కొన్ని areasలో ప్రశ్నలు పరోక్షంగా ఉంటాయి. అవి అంత స్కోరింగ్‌ కావు. కానీ కొన్ని areasలో నేరుగా వచ్చే ప్రశ్నలుంటాయి. అవి స్కోరింగే. సమస్యేమిటంటే... ఈ areasచదవటానికి విసుగ్గా ఉంటాయి. బోరింగ్‌... కానీ స్కోరింగ్‌! అందుకే అభ్యర్థులకు మరో అవకాశం లేదని గుర్తుంచుకోండి.

* ప్రశ్నల విధానం ఏటా మారుతుంటుంది. ఇటీవల 10-15 మార్కులుండే short questions ఇవ్వటంపై దృష్టి పెరిగింది. దీనికి సిద్ధంగా ఉండాలి.

* సరికొత్త పరిణామాలను తెలుసుకుంటూ ఉండాలి. పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ గతిశీలమైనది, రోజూ నూతన సంఘటనలు చోటుచేసుకునే సబ్జెక్టు. అతి ముఖ్యమైన అంశాలను క్రమం తప్పకుండా గమనిస్తూ ఉండాలి.

* గత సంవత్సరాల ప్రశ్నపత్రాల ఆధారంగా ముఖ్యమైన అంశాల జాబితా తయారుచేసుకోవాలి. వాటిపై అధిక దృష్టి పెట్టాలి. అయితే పేపర్‌ రూపొందించేవారు మనకంటే తెలివైనవారైవుంటారు కాబట్టి ఏ అంశాన్నీ వదిలెయ్యకుండా జాగ్రత్తపడాలి.

* 'ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌' నుంచి సంబంధమున్న వ్యాసాలను చదవాలి. వాటి నుంచి చాలా ప్రశ్నలు ఆశించవచ్చు.

* పరీక్షలో ఎన్ని వీలైతే ప్రశ్నలకు జవాబులు రాయాలి. ప్రశ్నకు నేరుగా స్పందించలేకపోయినప్పటికీ ఆ అంశం గురించి ఏదో ఒకటి రాయటం మేలు. ఆ అంశానికి సంబంధించిన ముఖ్య కోణాల గురించి రాసినప్పటికీ కనీసం 40 శాతం మార్కులైనా వచ్చే అవకాశం ఉంటుంది.
Creative Commons LicenseAPPSC Groups and Indian Civil Services Articles by Dilip Reddy is licensed under a Creative Commons Attribution 2.5 India License.Based on a work at appscgroupspoint.blogspot.com.Permissions beyond the scope of this license may be available at http://appscgroupspoint.blogspot.com/. All articles published under CC License

ప్రాథమిక ప్రణాలిక ఎలా?


Creative Commons LicenseAPPSC Groups and Indian Civil Services Articles by Dilip Reddy is licensed under a Creative Commons Attribution 2.5 India License.Based on a work at appscgroupspoint.blogspot.com.Permissions beyond the scope of this license may be available at http://appscgroupspoint.blogspot.com/. All articles published under CC License

విస్తృత ఉపాధి కల్పన ఎంతో ముఖ్యం



Creative Commons LicenseAPPSC Groups and Indian Civil Services Articles by Dilip Reddy is licensed under a Creative Commons Attribution 2.5 India License.Based on a work at appscgroupspoint.blogspot.com.Permissions beyond the scope of this license may be available at http://appscgroupspoint.blogspot.com/. All articles published under CC License

ఫైజల్ పయనం....పాఠాలెన్నో


Creative Commons LicenseAPPSC Groups and Indian Civil Services Articles by Dilip Reddy is licensed under a Creative Commons Attribution 2.5 India License.Based on a work at appscgroupspoint.blogspot.com.Permissions beyond the scope of this license may be available at http://appscgroupspoint.blogspot.com/. All articles published under CC License

పనిమంతులదే భవిత





Creative Commons LicenseAPPSC Groups and Indian Civil Services Articles by Dilip Reddy is licensed under a Creative Commons Attribution 2.5 India License.Based on a work at appscgroupspoint.blogspot.com.Permissions beyond the scope of this license may be available at http://appscgroupspoint.blogspot.com/. All articles published under CC License

స్థూలంగా చూసి... సూక్ష్మం గ్రహించాలి!

స్థూలంగా చూసి... సూక్ష్మం గ్రహించాలి!
సివిల్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన విధానం గురించి వివిధ వూహాగానాలు ప్రచారమయ్యాయి. వీటన్నిటికీ తెర దించుతూ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించి, ఫలితాలూ ప్రకటించారు. ప్రశ్నల స్వభావాన్ని విశ్లేషిస్తే తెలిసే అంశాలేమిటి? బ్రెయిన్‌ ట్రీ డైరెక్టర్‌ గోపాలకృష్ణ చెబుతున్న విశేషాలు ఇవిగో...
రవై మూడేళ్ళ నుంచి సివిల్‌ సర్వీస్‌ పరీక్షను సన్నిహితంగా పరిశీలిస్తూ వచ్చాను. ప్రతి సంవత్సరం ఎంతోకొంత విస్మయాన్ని కలిగించే అంశం ఉండటం నాకనుభవమే! ఈ ఏడాది సివిల్స్‌ పరీక్షలో అలాంటి అంశాలెన్నో కనిపించాయి.
 
మొట్టమొదటిది... కొత్త విధానంలో జరిగిన తొలి పరీక్ష ఇది. ఏ పద్ధతిలో ప్రశ్నపత్రం ఉంటుందనేది చివరివరకూ ఏ ఒక్కరూ నిర్థారణగా చెప్పలేకపోయారు. ప్రతి విద్యార్థినీ, సబ్జెక్టు నిపుణులనూ, ప్రచురణకర్తలనూ ఈ సందేహమే వెంటాడింది. మొదటి పేపర్‌కు అందరూ ఒకే పద్ధతిని అనుసరించారు కానీ రెండో పేపర్‌ విషయంలోనే అయోమయం! చాలామంది విద్యార్థులూ, శిక్షణ సంస్థలూ బ్యాంకింగ్‌ పరీక్షల పద్ధతినో, MAT, CATలాంటి మేనేజ్‌మెంట్‌ పరీక్షల పద్ధతినో అనుసరించారు. ఇక కొందరు విద్యార్థులైతే పరీక్షకు దూరంగా ఉన్నారు; పరీక్షా విధానం స్పష్టం కాని పరీక్షకు హాజరై ఓ attemtని వృథా చేసుకోవడం వారికిష్టం లేకపోయింది.
అయినప్పటికీ జాతీయ, రాష్ట్రస్థాయుల్లో సివిల్స్‌ దరఖాస్తుదారుల సంఖ్య బాగానే పెరిగింది. దేశవ్యాప్తంగా 4.5 లక్షలమంది దరఖాస్తు చేశారు. మనరాష్ట్రంలో ఏటా సివిల్స్‌ అభ్యర్థుల సంఖ్య 24 వేలుండేది. అలాంటిది హైదరాబాద్‌, విశాఖపట్నం, తిరుపతి కలిపి ఒక్కసారిగా ఈ సంఖ్య 35 వేలమందికి పెరిగిపోయింది!
వూహలు తారుమారు
అభ్యర్థులందరూ ఉత్కంఠతో ఎదురుచూసిన సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష జూన్‌ 12న జరిగింది. దరఖాస్తుదారుల్లో సగం మందే పరీక్షకు హాజరయ్యారు. ఇది మామూలే! హైదరాబాద్‌ నుంచి 16,500 మంది రాశారు. గత సంవత్సరాల్లో ఇచ్చినట్టే ప్రశ్నల సంఖ్య ఉంటుందని ఊహిస్తూ పరీక్షకేంద్రంలోకి వెళ్ళారు ప్రతి ఒక్కరూ!
ప్రశ్నపత్రం చూసినక్షణంలో చాలామంది రిలీఫ్‌ పొందివుంటారు. మొత్తం ఇచ్చినవి వంద ప్రశ్నలే. గతంలో 150 ప్రశ్నలుండేవి. ప్రశ్నలను ఓసారి చకచకా చూస్తూపోయిన అభ్యర్థుల మొహాలు సంతోషంతో వెలిగిపోయాయి. ప్రతిదీ రాయగలిగేలాగే కనిపించింది మరి! అయితే ఒకసారి సమాధానాలు రాయటం మొదలెట్టాక తెలిసొచ్చింది ఇబ్బందేమిటో! ప్రతి ప్రశ్నా సరళమైన, తెలిసిన భావనకు సంబంధించిన వివరాల్లోకి దారితీస్తూవచ్చింది. ఆప్షన్లన్నీ ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉన్నాయి.
చాలామంది అభ్యర్థులు సగం సమాధానాలు సరిగా గుర్తించారు. మరో పాతికశాతం ప్రశ్నలను వూహించి రాసి మిశ్రమ భావాలతో పరీక్ష నుంచి బయటికి వచ్చారు.

ఎదురుచూసిన పేపర్‌
అందరూ ఎదురుచూసిన పేపర్‌-2లో 80 ప్రశ్నలే! మెంటల్‌ ఎబిలిటీ, బేసిక్‌ న్యూమరసీ ప్రశ్నలు అటు బ్యాంకింగ్‌ స్థాయిలో కానీ, ఇటు CAT స్థాయిలో గానీ లేవు; బాగా తక్కువ స్థాయిలో ఉన్నాయి. కాంప్రహెన్షన్‌ పాసేజ్‌లు ఎక్కువున్నాయి. కష్టంగా భావించిన ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, డెసిషన్‌మేకింగ్‌ ప్రశ్నలు తక్కువిచ్చారు.

వెలిగిపోతున్న మొహంతోనే పరీక్షాకేంద్రం నుంచి బయటికొచ్చారు అభ్యర్థులు. పట్టణాల్లో ఇంగ్లిష్‌మీడియంలో చదివినవారిలో ఉత్సాహం కనిపించింది. వృత్తిఉద్యోగాల్లో ఉండి సమగ్రంగా సన్నద్ధమవ్వటానికి వ్యవధి చాలనివారు కూడా ఇదే రీతిలో సంతోషపడ్డారు. లక్ష్యం సాధించగలిగినట్టే ఉందని దాదాపు ప్రతిఒక్కరూ భావించారు.
పరీక్ష బడలిక తీరాక రెండ్రోజుల తర్వాతినుంచీ చాలామంది పరీక్షాపత్రాల 'కీ'ల కోసం వెబ్‌సైట్లలో అన్వేషించారు. తమ జవాబులు ఎంత సరైనవో తెలుసుకోవటానికి ప్రయత్నించారు. మెయిన్స్‌కు అర్హత పొందటానికి కటాఫ్‌ మార్కులు ఎంత ఉండొచ్చంటూ చర్చల్లో పడిపోయారు. 400 మార్కులకు 200 కటాఫ్‌ ఉంటుందని భావించాను. కానీ చాలామంది మాత్రం 160-170 మధ్యే ఉండొచ్చని ఊహించారు. (క్వాలిఫైయింగ్‌ మార్కులు జనరల్‌ క్యాటగిరీకి 50 శాతం కంటే పైనే. ఇతరులకు 45-50 మధ్య ఉండొచ్చు.)
ఫలితాలు జులై 15కల్లా వస్తాయని వదంతులు. ఆ నెల ఏమీ జరగలేదు. ఆగస్టు మొదటివారంలో కూడా ఎలాంటి వార్తా లేదు. మొత్తానికి ఆగస్టు 18న ఫలితాలు వెలువడ్డాయి.... కిందటి ఏడాది మల్లే! 11,984 మంది మెయిన్స్‌కు అర్హత సంపాదించారు. క్వాలిఫై అవుతామని ఆశించిన ఎందరో నిరాశపడ్డారు. ఓసారి చూద్దామని ప్రయత్నించినవారిలో కొద్దిమంది క్వాలిఫై అయ్యారు. దీంతో కొత్త పద్ధతిలో అర్హత పొందే రహస్యం ఏమిటా అని ఆలోచనలు మొదలయ్యాయి!



సివిల్ సర్వీసెస్ ను ఛేధింఛడం ఎలా...

                                                                                                  

కోచింగ్ వెళ్ళడమా...? సొంతంగా ప్రిపేర్ కావడమా...?

గమనించుము:సమయము లేకపోవడం వలన తెలుగులో వ్రాయలేకపోయాను.మన్నించగలరు.
This question often comes for those starting now or for those who got no time at hand and in need of some instant fix.
what you get through coaching?
  • Material of the coaching centre
  • Attending classes and interact with other students & faculty
  • Need to spend around 6 hrs daily attending classes
  • possibility of practising mock tests if they conduct any such
  • Finally all this costs around 5000 ( only coaching fee depending on institute) without including hostel/living ,travel and food expenses.
  • Most institutes takes 1 to 3 months to teach syllabus depending on fast track or regular batches.So in total it costs atleast 10000 to 15000.
REMEMBER COACHING IS NOT DICTATING NOTESIT SHOULD BE A GUIDANCE TO YOUR LEARNING PROCESS
What you get by self preparation?
  • You read the syllabus,collect the books and prepare your material
  • Better concentration on exam as you dont get diverted by pep talk of your collegues
  • It doesn’t cost you more than 3000 with all material included and no travel and living expenses as you prepare from your home/office.
  • You can practise the mock tests by going through previous papers, fortnighly magazines,newspapers once your preparation is finished.
  • So if you want control on the material preparation (yes you can do it in 3 to 4 months and you learn along the way as well!)and your costs better prepare self.If you don’t have time or you you lack the will to prepare on your own and can afford the costs go for coaching.Most people realise that they don’t need coaching and curse themselves after they took coaching!!. 
  • I prefer to prepare self than go for coaching and most importantly the current affairs aspects need to be handled by you and not the institute. Crash courses are disastrous on your psyche as they dump lot of information in short period, but regular coaching can enforce some discipline and regularize your studies.