పేపర్-2, సెక్షన్-1
గ్రూప్-1 మొయిన్స్ పేపర్-2లో కీలక విభాగం ‘చరిత్ర’. శాస్ర్తీయంగా, ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ అరుుతే ఈ విభాగంలో చక్కని స్కోరు సాధించవచ్చు. సిలబస్‌లో.. భారతదేశ చరిత్రకు సంబంధించిన విభాగాన్ని పరిశీలిస్తే ‘సాంస్కృతిక వారసత్వం, 20వ శతాబ్ది చరిత్ర’కు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తుంది. మొదటి రెండు యూనిట్ల సిలబస్‌లో స్థూలంగా భారతీయ సాంస్కృతిక వారసత్వానికి సంబంధించిన అంశాలే కనిపిస్తాయి. ఇక, 3,4,5 యూనిట్లు ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధిం చినవి. వర్తమాన చరిత్రను సమగ్రంగా అర్ధం చేసుకోవడా నికి అభ్యర్ధికి ఆధునిక భారతదేశ చరిత్రపై లోతైన అవగా హన తప్పనిసరి.
ఈ విషయూన్ని దృష్టిలో ఉంచుకుని ఆధునిక చరిత్రకు మూడు యూనిట్లు కేటాయించారు.
అభ్యర్ధులు ప్రిపరేషన్ విషయుంలో జాగ్రత్తగా వ్యవ హరించాలి. తర్కబద్ధంగా, శాస్ర్తీయంగా ప్రిపేర్ కావడం వుంచిది. అందుబాటులో ఉన్న సవుయూన్ని దృష్టిలో పెట్టుకుని, మిగిలిన పేపర్లను కూడా పరిగణనలోకి తీసుకుని పక్కా ప్రణాళికతో ప్రిపేర్ కావడం లాభిస్తుంది. ప్రతి యూనిట్ నుంచి ఒక్క ప్రశ్నకు మాత్రమే సమాధానం రాయాలి. అంతేకాకుండా ప్రతి యూనిట్‌లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. కాబట్టి హిస్టరీలో కొన్ని ముఖ్యమైన టాపిక్స్‌ను గుర్తించి వాటిపై అన్ని కోణాల్లోను ప్రశ్నలు- సమాధానాలు రూపొందించుకోవడం ఉపయుుక్తం.
ఏ యూనిట్‌లో ఏ టాపిక్స్ ఎంచుకోవాలనేది అభ్యర్ధి అవగా హన, ఆసక్తిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు 4వ యూనిట్‌లో జాగ్రత్తగా గమనిస్తే రెండు విభాగాలను గుర్తించవచ్చు. తొలుత సాంఘిక-మత సంస్కరణోద్య మాలు- రాజారామ్మోహన్‌రాయ్, దయానంద సరస్వతి తదితర అంశాలు, ఆ తర్వాత కులవ్యతిరేక, బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు కనిపిస్తాయి. అభ్యర్ధి ఈ రెండు విభా గాల్లో (చాయిస్ దృష్ట్యా) ఏదో ఒక దానిపై సమగ్రంగా ప్రిపేర్ అరుుతే సరిపోతుంది. అయితే ఇది ఒక వ్యూహా త్మక దృక్పథం మాత్రమేననే విషయూన్ని గుర్తుంచుకో వాలి. ఒక్కోసారి ఏదో ఒక విభాగం నుంచి రెండు ప్రశ్నలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు.
మొదటి యూనిట్
ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించిన ఈ యూనిట్ ప్రిపరేషన్‌కు ఎన్‌సీఈఆర్‌టీ ‘ఏన్సియంట్ ఇండియా’ (ఆర్‌ఎస్ శర్మ) పుస్తకం, తెలుగు అకాడెమీ బీఏ మొదటి సంవత్సరం ‘భారతదేశ చరిత్ర’ పుస్తకం చాలా వరకు ఉపయోగపడతాయి. అభ్యర్ధి గమనించాల్సిన విషయం.. ప్రాచీన భారతదేశ చరిత్రలోని చాలా అంశాలు సిలబస్‌లో పేర్కొనలేదు. సాధారణంగా చరిత్ర పుస్తకాల్లో కనిపించే ‘ఆధారాలు’, ‘చరిత్ర పూర్వ యుగం (ప్రీ హిస్టరీ)’లాంటి అంశాలు లేవు. సిలబస్.. సింధు నాగరికతతో ప్రారంభమై మౌర్యానంతర యుగంలోని ‘గాంధార, మధుర, అమరావతి’ శైలులతో వుుగుస్తుంది. అకడెమిక్ స్థాయిలో ప్రాచీన చరిత్రలో చాలా ముఖ్యమైన గుప్తులు, హర్షుడు వంటి అంశాలను ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా సిలబస్‌లో ఒక్క రాజవంశం పేరుగాని, ఒక్క పాలకుడి పేరుగాని ప్రస్తావించలేదు.
ముఖ్యమైన ప్రశ్నలు
సింధు నాగరికతలోని పట్టణ సంస్కృతికి సంబంధించిన అంశాలను విశ్లేషించండి?
సింధు నాగరికత పతనాన్ని చర్చించి, వారసత్వాన్ని విశ్లేషించండి?
రుగ్వేద కాలానికి, మలివేద కాలానికి ఆర్యుల జీవనంలో వచ్చిన మార్పులను చర్చించండి?
సింధు నాగరికతకు, వైదిక సంస్కృతికి మధ్య తేడాలను చర్చించండి?
బౌద్ధ, జైన మతాల ఆవిర్భావానికి ఆనాటి సాంఘిక, ఆర్థిక అంశాలే కారణం- చర్చించండి?
భారతీయ సంస్కృతికి బౌద్ధమత సేవలను అంచనా వేయండి?
బౌద్ధమత వ్యాప్తికి, పతనానికి కారణాలను విశ్లేషించండి?
మహాయాన బౌద్ధం నేపథ్యాన్ని, ప్రభావాన్ని పరిశీలించండి?
గాంధార, మధుర, అమరావతి శైలులను తులనాత్మకంగా పరిశీలించండి?
రెండో యూనిట్
మధ్య యుగ చరిత్రకు సంబంధించిన ఈ యూనిట్‌లో ఎక్కువ సిలబస్ ఉన్నప్పటికీ, ‘భక్తి ఉద్యమం, ఇండో- పర్షియన్ సంస్కృతి, మొఘల్ సంస్కృతి, విజయనగర సాంఘిక, ఆర్ధిక స్థితిగతులు’ వంటి కొన్ని ముఖ్యమైన అంశాలను లోతుగా అధ్యయునం చేస్తే సరిపోతుంది. అదే సవుయుంలో ‘రాజకీయ చరిత్ర’ను పరిగణనలోకి తీసు కోవాల్సిన అవసరం లేకపోవడం గవునించాలి.
‘మధ్య యుగాల భారతదేశ చర్రిత’ (సతీష్ చంద్ర), తెలుగు అకాడెమీ-బీఏ ద్వితీయ సంవత్సరం భారతదేశ చరిత్ర పుస్తకాలు ఈ యుూనిట్ ప్రిపరేషన్‌కు ఉపకరిస్తాయి. ఈ విభాగంలో అభ్యర్ధులు దృష్టి పెట్టాల్సిన వురో కీలక అంశం ‘వాస్తు, చిత్ర లేఖనం, సంగీతం, సాహిత్యం’. అంతేకాకుండా ఈ అంశాలకు సంబంధించిన కచ్చితమైన పారిభాషిక పదజాలాన్ని పరీక్షలో ఉపయోగించడం సంద ర్భోచితంగా ఉంటుంది.
ముఖ్యమైన ప్రశ్నలు:
హిందూ సమాజం, ముస్లిం సమాజం పరస్పర ప్రభావానికి గురై, ‘ఇండో-ఇస్లామిక్ సంస్కృతి’ వికాసానికి ఎలా దోహదపడ్డాయో వివరించండి?
భక్తి ఉద్యమ స్వభావాన్ని, ప్రభావాన్ని విశ్లేషించండి?
సాంస్కృతిక సామరస్యానికి కబీర్, నానక్ బోధనలు ఎంత వరకు దోహదపడ్డాయో పరిశీలించండి?
సూఫీ భావనలు వివరించి భారతీయ సమాజంపై సూఫీల ప్రభావాన్ని విశ్లేషించండి?
ఢిల్లీ సుల్తానుల కాలం నాటి ఇండో-పర్షియన్ వాస్తు శైలి విశేషాలను వివరించండి?
విజయనగర సామ్రాజ్యంలోని సాంఘిక, ఆర్ధిక పరిస్థితులను విదేశీ యాత్రికుల ప్రస్తావనల సాయంతో చర్చించండి?
విజయనగర సామ్రాజ్యంలో సాంస్కృతిక వికాసాన్ని పరిశీలించండి?
మొఘల్ యుగంలోని వాస్తు, చిత్రలేఖనం, సంగీతం, సాహిత్య రంగాల వికాసాన్ని పరిశీలించండి?
మొఘల్ వాస్తు శైలి పరిణామాన్ని సోదాహరణంగా చర్చించండి?
శివాజీ ఉత్థానానికి దారితీసిన కారకాలను విశ్లేషించండి?
మూడో యూనిట్
భారతదేశ చరిత్రకు సంబంధించి గ్రూప్-1 సిలబస్‌లో అతిపెద్ద యూనిట్ ఇదే. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రిపరే షన్ సాగించాలి. జాతీయోద్యమంపై సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలి. అప్పుడే ఈ యూనిట్ నుంచి వచ్చే ప్రశ్నలను సమర్ధంగా ఎదుర్కోగలుగుతారు.
ఈ యూనిట్ ప్రిపరేషన్‌కు ఎన్‌సీఈఆర్‌టీ-‘మోడర్న్ ఇండియా’ (బిపిన్ చంద్ర), అలాగే బిపిన్ చంద్ర తదితరు లు రాసిన ‘భారతదేశ స్వాతంత్య్రోద్యమ చరిత్ర’ చాలా వరకు ఉపకరిస్తాయి.
ఆధునిక భారతదేశ చరిత్ర పుస్తకాల్లో విస్తృతంగా కన్పించే ‘కర్ణాటక యుద్ధాలు’ ‘ఆంగ్లో-మైసూరు యుద్ధా లు’, ఆంగ్లో-మరాఠా యుద్ధాలు’ తదితర రాజకీయ సంఘటనలను చదవాల్సిన అవసరం లేదు. జాతీయో ద్యమ చరిత్రను మాత్రం లోతుగా అధ్యయనం చేయాలి.
ముఖ్యమైన ప్రశ్నలు:
బ్రిటిష్ వారి విజయానికి, భారతీయ పాలకుల వైఫల్యానికి కారణాలు చర్చించండి?
1857 తిరుగుబాటు కారణాలను, ఫలితాలను విశ్లేషించండి?
1857 తిరుగుబాటు వైఫల్యానికి గల కారణాలను చర్చించండి?
1857 తిరుగుబాటు స్వభావాన్ని చర్చించండి?
భారత జాతీయోద్యమ ఆవిర్భావానికి దారి తీసిన పరిస్థితులను విశ్లేషించండి?
మితవాద రాజకీయాలను విమర్శనాత్మకంగా పరిశీలించండి?
అతివాద రాజకీయాలు బలపడేందుకు దోహదపడిన కారణాలను విశ్లేషించండి?
బెంగాల్ విభజనకు గల కారణాలను విశ్లేషించి, స్వదేశీ ఉద్యమ ప్రభావాన్ని చర్చించండి?
మితవాదులు, అతివాదులకు మధ్య భేదాలను చర్చిస్తూ, సూరత్ చీలికకు దారితీసిన పరిస్థితులను విశ్లేషించండి?
హోం రూల్ ఉద్యమ ప్రభావాన్ని పరిశీలించండి?
సహాయ నిరాకరణోద్యమ నేపథ్యాన్ని, ప్రభావాన్ని విశ్లేషించండి?
శాసనోల్లంఘన ఉద్యమ నేపథ్యాన్ని, ప్రభావాన్ని చర్చించండి?
విప్లవ తీవ్రవాద ఉద్యమాన్ని, భావజాలాన్ని పరిశీలించండి?
1944-47 మధ్య సంభవించిన రాజకీయ పరిణామాలను విశ్లేషించండి?
జాతీయోద్యమానికి గాంధీ ఎలా తిరుగులేని నాయకుడిగా ఎదిగాడో విమర్శనాత్మకంగా పరిశీలించండి?
గాంధీ శకం ప్రాముఖ్యతను అంచనా వేయండి?
నాలుగో యూనిట్
19వ శతాబ్దంలోని సాంఘిక, మత సంస్కరణోద్యమాలు, అ శతాబ్ది చివరి దశకాల నుంచి 20వ శతాబ్ది ప్రధమార్థం వరకు కొనసాగిన కులవ్యతిరేక పోరాటాలు, బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలను ఈ యూనిట్‌లో చేర్చారు. మిగతా యూనిట్లతో పోలిస్తే ఈ యూనిట్‌లోని సమాచారం పరిధి చాలా స్వల్పం. అయితే విశ్లేషణ పరంగా చాలా ప్రాముఖ్యమైంది.
సాంఘిక, మత సంస్కరణోద్యమాలు, రాజారామ్మో హన్‌రాయ్, దయానంద సరస్వతి తదితరుల గురించి సమాచారం ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లోనూ, తెలుగు అకా డెమీ పుస్తకాల్లోనూ పుష్కలంగా లభిస్తుంది. కులవ్యతిరేక, బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాల్లో భాగంగా జస్టిస్ పార్టీ ఉద్యమం, ఆత్మగౌరవ ఉద్యమంపై లోతుగా అధ్యయనం చేయాలి. అలాగే కుల వ్యవస్థ, అస్పృశ్యతలకు సంబం ధించి జ్యోతిభా ఫూలే, నారాయణ గురు, అంబేద్కర్, గాంధీల ఆలోచనలు వారు నడిపిన ఉద్యమాలపై లోతైన అవగాహన ఏర్పర్చుకోవాలి. ఈ అంశాలకు ‘ ఏ న్యూ లుక్ ఎట్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ’ (గ్రోవర్ అండ్ గ్రోవర్), ఇగ్నో స్టడీ మెటీరియల్ చాలా వరకు ఉపకరిస్తాయి.
ముఖ్యమైన ప్రశ్నలు:
19వ శతాబ్దిలో తలెత్తిన వివిధ మత, సాంఘిక, సంస్కరణోద్యమాలను పరిశీలించండి?
19వ శతాబ్దిలో తలెత్తిన సాంస్కృతిక పునరుజ్జీవనంలో రాజారామ్మోన్ రాయ్, దయానంద సరస్వతి రెండు ప్రత్యేక ధోరణులకు ప్రతినిధులు- చర్చించండి?
ఆధునిక భారతదేశంలో తలెత్తిన వివిధ కుల వ్యతిరేక, బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలను వివరించండి?
జస్టిస్ పార్టీ లక్ష్యాలను, పనితీరును విమర్శనాత్మకంగా పరిశీలించండి?
ఆత్మ గౌరవ ఉద్యమ నేపథ్యాన్ని, ప్రభావాన్ని విశ్లేషించండి?
భారతదేశంలో దళితుల అభ్యున్నతికి కృషి చేసిన వివిధ వ్యక్తుల పాత్రను వివరించండి?
దళితుల కోసం ఫూలే, నారాయణ గురు, అంబేద్కర్ చేసిన కృషిని చర్చించండి?
గాంధీ నడిపిన హరిజనోద్యమాన్ని వివరించి, కుల వ్యవస్థ-అస్పృశ్యతకు సంబంధించి గాంధీ, అంబేద్కర్‌కు గల భేదాభిప్రాయాలను విశ్లేషించండి?
ఐదో యూనిట్
జాతీయోద్యమానికి సమాంతరంగా నడిచిన కొన్ని వర్గ పోరాటాలు, మతతత్వ రాజకీయాలు-జాతీయోద్యమం తో వీటికి గల సంబంధాలు ఈ యూనిట్‌లోని ప్రధాన అం శాలు. అలాగే స్వాతంత్య్రానంతర చరిత్ర కూడా అధ్యయ నం చేయడం అవసరం. ఈ అధ్యయనం ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ ఎస్సే పేపర్లకు కూడా ఉపకరి స్తుంది. స్వాతంత్య్రానంతర చరిత్రలో నెహ్రూ విదేశాంగ విధానం, సంస్థానాల విలీనం, ప్రణాళికలు, రాష్ట్రాల పున ర్విభజన, ఇతర సాంఘిక, ఆర్ధిక పునర్నిర్మాణానికి సంబం ధించిన అంశాలను అధ్యయనం చేయడం మంచిది.
ఈ యూనిట్ లో కనిపించే రకరకాల ఉద్యమాలు- రైతు ఉద్యమాలు, కార్మిక ఉద్యమాలు, వామపక్ష రాజకీ యాలు, మతతత్వ రాజకీయాలు వంటి అంశాల కోసం బిపిన్ చంద్ర పుస్తకాలతో పాటు ‘మోడర్న్ ఇండియా’ (సుమిత్ సర్కార్), ‘ఎ న్యూ లుక్ ఎట్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ’ (గ్రోవర్ అండ్ గ్రోవర్) ఉపకరిస్తాయి. మహిళా ఉద్యమానికి సంబంధించిన సమాచారం కోసం సోషియా లజీకి సంబంధించిన పుస్తకాలు, ఇగ్నో స్టడీ మెటీరియల్ ఉపయుుక్తం. స్వాతంత్య్రానంతర చరిత్ర కోసం ‘ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్’ (బిపిన్ చంద్ర అండ్ అదర్స్) చదవడం మంచిది.
ముఖ్యమైన ప్రశ్నలు:
ఆధునిక భారతదేశంలో వామపక్ష రాజకీయ వృద్ధిని, ప్రభావాన్ని విశ్లేషించండి?
ఆధునిక భారతదేశంలోని రైతు ఉద్యమాలను పరిశీలించండి?
భారతదేశంలో కార్మికోద్యమ ప్రస్థానాన్ని విశ్లేషించండి?
జాతీయోద్యమంలో కర్షకులు, కార్మికులు పోషించిన పాత్రను పరిశీలించండి?
భారతదేశంలో మహిళా ఉద్యమ వికాసాన్ని, పరిణామాన్ని విశ్లేషించండి?
జాతీయోద్యమంలో మహిళల పాత్రను చర్చించండి?
మతతత్వ రాజకీయాలు ఆవిర్భవించడానికి దారి తీసిన కారణాలను విశ్లేషించండి?
భారతదేశంలో మతతత్వ ఘర్షణలు, రాజకీయాల వృద్ధిని పరిణామాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించండి?
దేశ విభజనకు దారితీసిన పరిస్థితులను విశ్లేషించండి? దేశ విభజన అనివార్యమా?
దేశ విభజన ప్రభావాన్ని, ఫలితాలను విశ్లేషించండి?
భారతదేశంలో సంస్థానాలు విలీనమైన వైనాన్ని, అందులో వల్లభాయ్ పటేల్ పాత్రను విశ్లేషించండి?
ఆధునిక భారతదేశ పరిణామంలో నెహ్రూ పాత్రను అంచనా వేయండి?
-వి.శివాజీ
హిస్టరీ ఫ్యాకల్టీ, హైదరాబాద్
|
No comments:
Post a Comment