జాతీయాదాయ భావనలు.. శ్రామికశక్తి లక్షణాలు


జాతీయాదాయ భావనలు.. శ్రామికశక్తి లక్షణాలు
 పేపర్-3, సెక్షన్-1
ప్లానింగ్ ఇన్ ఇండియా -
ఇండియన్ ఎకానమీ
జాతీయాదాయ భావనలు


వాణిజ్య సంస్థలు, కుటుంబాలు, ప్రభుత్వం మధ్య ఆదా య చక్రీయ ప్రవాహం జరుగుతుంది. వస్తు, సేవల ఉత్ప త్తికి కుటుంబ రంగం సేవలను అందించి ప్రతిఫలంగా వేతనాలు పొందుతుంది. కుటుంబ రంగం వస్తు, సేవల కొనుగోలుకు చేసే వ్యయాన్ని ఆదాయంగా ఉత్పత్తిదారు లు పొందుతారు. ఇలా ఆదాయ చక్రీయ ప్రవాహం జరు గుతుంది. ఈ స్థితి రెండు రంగాలున్న ఆర్థిక వ్యవస్థలో.. ఆదాయ ప్రవాహాన్ని సూచిస్తుంది. అదేవిధంగా మూడు, నాలుగు రంగాలున్న (ప్రభుత్వ, విదేశీ వాణిజ్య రంగాలు) ఆర్థిక వ్యవస్థలో కూడా ఆదాయ చక్రీయ ప్రవాహం జరు గుతుంది.

ప్రస్తుత ఉత్పత్తి కారకాలు ఆర్జించిన మొత్తం ఆదాయమే జాతీయాదాయం. జాతీయాదాయ ధోరణులాధా రంగా ఆర్థిక వ్యవస్థ ప్రగతిని తెలుసుకోవచ్చు. స్థూల జాతీ యోత్పత్తి నిర్వచనంలో.. ‘జాతీయ’ అనే భావన దేశానికి సంబంధించిన స్థానికులు ప్రస్తుత సంవత్సరంలో ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనటం ద్వారా ఆర్జించిన ఆదాయాన్ని తెలుపుతుంది. ‘దేశీయోత్పత్తి’ అనేది దేశం లోపల మొత్తం ఉత్పత్తి విలువ లేదా ఆదాయ కల్పనను సూచిస్తుంది. దేశం లోపలి ఉత్పత్తి, ఆదాయ కల్పన (జాతీయతకు తావు లేకుండా) దేశీయోత్పత్తిలో కలిపి ఉంటాయి.

స్థూల ఆదాయ కొలమానాలు:
ఉత్పత్తి కారకాల పంపిణీ దృష్ట్యా జీడీపీ= మార్కెట్ ధరల వద్ద జీడీపీ+ సబ్సిడీలు-పరోక్ష పన్నులు
ఉత్పత్తి కారకాల పంపిణీ దృష్ట్యా స్థూల జాతీయోత్పత్తి = ఉత్పత్తి కారకాల పంపిణీ దృష్ట్యా జీడీపీ నీ విదేశాల నుంచి నికర ఆదాయాలు.
ఉత్పత్తి కారకాల పంపిణీ దృష్ట్యా నికర జాతీయోత్పత్తి = ఉత్పత్తి కారకాల పంపిణీ దృష్ట్యా జీఎన్‌పీ- మూలధన తరుగుదల.
వ్యష్టి ఆదాయం = ఉత్పత్తి కారకాల పంపిణీ దృష్ట్యా నికర జాతీయోత్పత్తి-కార్పొరేట్ పన్నులు+-పంపిణీ కాని కంపెనీ లాభాలు+ బదిలీ చెల్లింపులు
వ్యయార్హ ఆదాయం= వ్యష్టి ఆదాయం-వ్యక్తిగత పన్నులు
జీడీపీ డిఫ్లేటర్= నామినల్ జీడీపీ/రియల్ జీడీపీ

జాతీయాదాయ మదింపు:
జాతీయాదాయాన్ని లెక్కించడానికి ఉత్పత్తి, ఆదాయ, వ్యయాల పద్ధతి ఉపయోగిస్తారు. ఉత్పత్తి మదింపు పద్ధతి లో ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి అయిన మొత్తం వస్తు సేవల విలువను తీసుకుంటారు. దీనిలో వినియోగ వస్తువులు, స్థూల స్వదేశీ ప్రైవేటు పెట్టుబడులు, ప్రభుత్వ రంగ ఉత్పత్తి, నికర ఎగుమతులు కలిసి ఉంటాయి. ఆదాయ మదింపు పద్ధతి ద్వారా జాతీయాదాయాన్ని లెక్కించడా నికి ఉత్పత్తి కారకాల చెల్లింపులు తీసుకుంటారు. ఉద్యోగు లకు ఇచ్చిన పరిహారం, బాటకం, వడ్డీ, విదేశాల నుంచి పొందిన నికర ఉత్పత్తి కారకాల ఆదాయాన్ని తీసుకుంటా రు. స్థూల దేశీయోత్పత్తిపై చేసినఅంతిమ వ్యయాన్ని.. వ్యయాల మదింపు పద్ధతి ద్వారా జాతీయాదాయం లెక్కించడానికి తీసుకుంటారు. స్వదేశీ ఉత్పత్తిపై జరిగిన అంతిమ వ్యయంలో ఎ) ప్రైవేటు అంతిమ వినియోగ వ్య యం బి) ప్రభుత్వ అంతిమ వినియోగ వ్యయం సి)స్థూల స్థిర మూలధన కల్పన డి) స్టాక్‌లలోని మార్పులు ఇ) వస్తు,సేవల నికర ఎగుమతులు కలిసి ఉంటాయి. ఉత్పత్తి, ఆదాయ, వ్యయాల మదింపు పద్ధతులన్నీ ఒకే విధమైన జాతీయాదాయ లెక్కలను సూచిస్తాయి. ఈ స్థితి లభ్య మయ్యే దత్తాంశం, అంచనాలను బట్టి ఆధారపడి ఉంటుంది. వ్యయాల మదింపు పద్ధతి ద్వారా స్థూల దేశీ యోత్పత్తి అత్యల్ప లేదా అత్యధికంగా అంచనా వేయువచ్చు.

ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులు:
స్వాతంత్య్రానంతరం భారత ఆర్థిక వ్యవస్థలో పలు పరి మాణాత్మక, గుణాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి.
స్వాతంత్య్రం వచ్చిన సమయంలో జాతీయాదాయం లో ప్రాథమిక రంగం వాటా ఎక్కవ కాగా.. తదనంత రం ప్రణాళికా యుగంలో ద్వితీయ, తృతీయ రంగాలు పుంజుకున్నాయి. ప్రస్తుతం జాతీయాదాయంలో(2008 -09) సేవారంగం 57 శాతం, ద్వితీయ రంగం 27 శాతం, ప్రాథమిక రంగం 15.7 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఈ విధంగా జాతీయాదాయంలో ప్రాథమిక రంగం వాటా తగ్గి ద్వితీయ, తృతీయ రంగాల వాటా పెరగడాన్ని నిర్మాణాత్మక మార్పుగా భావించవచ్చు.

స్వాతంత్య్రానంతరం వృత్తుల వారీ పంపిణీలో మార్పు లు చోటు చేసుకున్నాయి. బ్రిటిష్ కాలంలో వ్యవసాయ రంగంపై ఆధార పడిన శ్రామిక శక్తి 72 శాతం. కాగా స్వాతంత్య్రానంతర ఆర్థిక ప్రగతి వల్ల ఈ రంగంపై ఆధారపడిన శ్రామిక శక్తి కొంత తగ్గి.. ద్వితీయ, తృతీయ రంగాలపై ఆధారపడే శ్రామికశక్తి పెరిగింది.

స్వాతంత్య్రం వచ్చే నాటికి దేశంలో వినియోగ వస్తు పరిశ్రమలు ఎక్కువ. 1960,70లలో దేశంలో తయారైన వినియోగ ఉత్పత్తులు ధనికుల అవసరాలకే ఎక్కువగా ఉపయోగపడ్డాయి. తర్వాత పారిశ్రామిక తీర్మానాల నేపథ్యంలో మూలధన వస్తు పరిశ్రమలు ఎక్కువగా స్థాపించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి.

స్వాతంత్య్రానంతరం భౌతిక, సాంఘిక అవస్థాపనా సౌకర్యాలు పెరిగాయి. భౌతిక అవస్థాపనలైన విద్యుత్ ఉత్పాదన, రైలు, రోడ్డు మార్గాల విస్తరణ జరిగింది. ప్రజల విద్య, ఆరోగ్య ప్రమాణాలు మెరుగుపడ్డాయి. శిశు మరణాల రేటు, మరణాల రేటు, జననాల రేటులో తగ్గుదల సంభవించింది.

1991లో ఆర్ధిక సంస్కరణల నేపథ్యంలో అన్ని నియం త్రణలు తొలగించారు. అప్పటి వరకు ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ రంగం పాత్ర ఎక్కువ. కానీ తర్వాతి కాలంలో ప్రైవేటీకరణకు అవకాశం కల్పించారు. విదేశీ పెట్టుబడు లు, సాంకేతిక పరిజ్ఞానంపై ఉన్న ఆంక్షలు తొలగిం చారు.

జాతీయ, తలసరి ఆదాయ ధోరణులు:
ప్రస్తుత ధరల వద్ద లెక్కించిన జాతీయ, తలసరి ఆదా యాలు ఆర్థిక వ్యవస్థ వృద్ధిని స్పష్టంగా తెలియుజేయువు. ఒక నిర్ణీత కాలంలో ధరలలోని మార్పుల ప్రభావం నిర్మూ లించాలంటే జాతీయాదాయాన్ని స్థిర ధరల వద్ద లెక్కిం చాలి. ఉత్పత్తి కారకాల పంపిణీ దృష్ట్యా జాతీయాదాయం (ఎన్‌ఎన్‌పీ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్)ను ‘నిజ జాతీయాదాయం’ గా భావించాలి. 1950-51 నుంచి 1980-81 మధ్య జాతీ యాదాయ సగటు వృద్ధి 3.4 శాతం. కాగా తలసరి నికర జాతీయోత్పత్తి (తలసరి ఆదాయం) వృద్ధి 1.2 శాతం. 1980లలో జాతీయ, తలసరి ఆదాయాలలో మంచి వృద్ధి నమోదైంది. 1980-81 నుంచి 1990-91 మధ్య జాతీ యాదాయ వృద్ధి 5.4 శాతం కాగా తలసరి ఆదాయ వృద్ధి 3.1 శాతం. ఈ వృద్ధిని ఆర్థిక వ్యవస్థలో ఆరోగ్యవంతమైన వృద్ధిగా భావించవచ్చు. 1990-91 నుంచి 1995-96 మధ్య జాతీయాదాయ వృద్ధి రేటు 4.9 శాతం కాగా తల సరి ఆదాయ సగటు వృద్ధి 3.4 శాతం. 1992-94 మధ్య ఆర్థిక వ్యవస్థ పురోగమన నేపథ్యంలో 1994-95 నుంచి 1996-97 మధ్య జాతీయ, తలసరి ఆదాయాల వృద్ధి రేటు ఎక్కువగా ఉంది. 1997-2002 మధ్య జాతీయ ఆదాయ లక్షిత వృద్ధి 6.5 శాతం కాగా.. వాస్తవంగా సాధించిన వృద్ధి 5.5 శాతం మాత్రమే. పారిశ్రామిక రంగం కూడా తక్కువ వృద్ధిని నమోదు చేసుకోవడంతో ఆశించిన జాతీయాదాయ వృద్ధి సాధ్యం కాలేదు. ఈ కాలంలో తల సరి ఆదాయ వృద్ధి 2.2 శాతం. 10వ ప్రణాళికలో (2002 -07) జాతీయాదాయ వృద్ధి రేటు 7.8 శాతం కాగా తల సరి ఆదాయ సగటు వృద్ధి 6.1 శాతం. 2009-10లో జాతీ యాదాయం 2004-05 ధరల వద్ద *39,24,183 కోట్లు, తలసరి ఆదాయం *33,540. ఇదే కాలంలో జాతీయాదా యం 6.9 శాతం, తలసరి ఆదాయం 5.4 శాతం మేర వృద్ధి సాధించాయి.
స్వాతంత్య్రానంతరం జాతీయ, తలసరి ఆదాయాల వృద్ధి రేటు పెరిగినప్పటికీ.. చైనా, ఇండోనేషియాలతో పోల్చినపుడు మన దేశ వృద్ధి రేటు తక్కువే. ఆ దేశాలలో జాతీయాదాయ సగటు వృద్ధి రేటు 10 శాతం. గత ఆరు దశాబ్దాలలో జాతీయ, తలసరి ఆదాయాల పెరుగుదల లో స్థిరత్వం లేదు. 1951 తర్వాత తలసరి వినియోగం కూడా ఆశించిన స్థాయిలో పెరగలేదు.

శ్రామిక శక్తి-ఆర్థికాభివృద్ధి:
దేశంలో ఆర్థిక కార్యకలాపాల స్థాయిని నిర్ణయించడంలో శ్రామిక శక్తి ప్రధానమైంది. ఈ శక్తి పరిమాణం పనిలో పాలు పంచుకొనే రేటుపై ఆధారపడి ఉంటుంది. 2001 జనాభా లెక్కల ప్రకారం మొత్తం దేశ జనాభాలో శ్రామిక శక్తి 39.26 శాతం.

దేశంలో శ్రామిక శక్తి లక్షణాలు
అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చినపుడు దేశంలో పనిలో పాలు పంచుకొనే రేటు తక్కువ. దీనికి కారణం జనాభా పెరుగుదల రేటు ఎక్కువగా ఉండటం.
గామీణ శ్రామిక జనాభా నిష్పత్తి పట్టణ జనాభా నిష్పత్తి కంటే తక్కువ.
మహిళలలో పనిలో పాలు పంచుకునే రేటు పురుషుల కంటే తక్కువ. 2001లో మహిళలలో ఈ రేటు 25.68 శాతం కాగా పురుషులలో 51.93 శాతం. ఈ స్థితి దేశంలో సాంఘిక వెనుక బాటుతనాన్ని సూచిస్తోంది. ఇప్పటికీ ఎక్కువ శాతం వుంది మహిళలు ఆర్థిక ఒత్తిళ్ల కారణం గానే ఉత్పాదక శ్రమలో పాలు పంచుకుంటున్నారు.
శ్రామిక భాగస్వామ్య రేట్లు వివిధ రాష్ట్రాలలో వేర్వేరుగా ఉంటున్నాయి.

సాపేక్షికంగా వెనుకబడిన దేశాల్లో ఎక్కువ మంది ప్రజలు ఆధారపడిన రంగం ప్రాథమిక రంగం. ప్రస్తుతం అభివృద్ధిచెందిన దేశాలు తమ అభివృద్ధి తొలి దశలో వ్యవసాయక దేశాలేకావడం గవునార్హం. అనేక అభివృద్ధి చెందిన, వెనుకబడిన దేశాల్లో ఇప్పటికీ చేపల వేట ఒక ముఖ్య వృత్తి. జపాన్, నార్వే, ఇంగ్లండ్‌లలో చేపల వేట ద్వారా అధిక శాతం మంది ఉపాధి పొందుతున్నారు. డెన్మార్క్, అర్జెంటీనాలలో పశుపోషణ, డైరీయింగ్, పౌల్ట్రీ లు ముఖ్య కార్యకలాపాలు. కెనడా, మయన్మార్‌లలో ఎక్కువ శాతం వుంది అటవీ సంపదపై ఆధారపడుతు న్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే..వెనుకబడిన దేశాల్లోనే అధికశాతం వుంది ప్రజలు ప్రాథమికరంగంపై ఆధారపడుతున్నారు. వెనుకబడిన ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక ప్రగతి సాధించే క్రమంలో ప్రాథమిక కార్యకలాపాల పాత్ర తగ్గుతుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో పారిశ్రామిక రంగాభివృద్ధితో పాటు సేవా కార్యకలాపాల పాత్ర ఎక్కువగా ఉండటం గమనించవచ్చు. వ్యవసాయం, ప్రాథమిక కార్య కలాపాలు ఎక్కువగా శ్రమ సాంద్రతవైనందువల్ల ఉత్పాద కత తక్కువ . వీటిలో మూలధన సాంద్రత పెరిగినప్పటికీ.. వాటి స్వభావం వల్ల మూలధన సాంద్రత పద్ధతులు ఉత్పాదకత పెరుగుదలకు దోహదం చేయుడంలేదు. ద్వితీయ, తృతీయ రంగాలపై అధిక శాతం శ్రామిక శక్తిపై ఆధారపడితే తప్ప ఆయా దేశాల్లో తలసరి ఆదాయంలో పెరుగుదల సాధ్యం కాదు.

మూడో ప్రపంచ దేశాల్లో ద్వితీయ రంగం పరిధి తక్కువగా ఉండి.. తక్కువ శ్రామికశక్తికే ఉపాధి కల్పిస్తోంది. ఇటు వంటి స్థితి వెనుబడిన దేశాలలో స్పష్టంగా కనిపిస్తోంది. ద్వితీయ రంగ ముఖ్య కార్యకలాపం తయారీ రంగం ఈ దేశాల్లో తక్కువ ప్రాధాన్యం కలిగి ఉంది. మరో వైపు కుటీ ర, చిన్న పరిశ్రమలు తక్కువ మూల ధన సాంద్రత కలిగి.. ఎక్కువ శ్రామిక శక్తికి ఉపాధి క ల్పిస్తున్నాయి. భారత్‌లో ఈ పరిశ్రమ.. పారిశ్రామిక రంగంలోని మొత్తం శ్రామిక శక్తిలో 80 శాతం మందికి ఉపాధి కల్పిస్తోంది. కుటీర, చిన్న తరహా పరిశ్రమల్లో ఉత్పాదకత తక్కువకావడంతో ఈ రంగంపై ఆధారపడిన ప్రజల తలసరి ఆదాయాలు తక్కు వే. తృతీయ రంగంలో ఉత్పాదకత ద్వితీయ రంగ ఉత్పా దకత కంటే ఎక్కువగా ఉండొచ్చు. ప్రాథమిక రంగం నుంచి శ్రామిక బదిలీ ద్వితీయ, తృతీయ రంగాలకు జరి గినప్పుడే ఆర్థికాభివృద్ధికి అనువైన వాతావరణం ఏర్పడు తుంది. తృతీయ రంగంలో వాణిజ్యం, రవాణా, సమాచా రం, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ సేవలను విస్తరించాలి.

-డా.తమ్మా కోటిరెడ్డి
ప్రొఫెసర్, ఐబిఎస్
హైదరాబాద్

No comments:

Post a Comment