జాతీయాదాయం
ఒక సంవత్సర కాలంలో దేశంలో తయారైన అంతిమ వస్తు సేవల మొత్తం విలువను జాతీయాదాయం అంటారు. స్వాతంత్య్రానికి పూర్వం జాతీయ, తలసరి ఆదాయ అంచ నాలను కొంత మంది వ్యక్తిగతంగా రూపొందించే వారు. ఆయా అంచనాలు శాస్ర్తీయమైనవి కావు. స్వాతంత్య్రానం తరం జాతీయాదాయ అంచనాలను రూపొందించడానికి 1949లో జాతీయాదాయ కమిటీ , 1950 లో కేంద్రగణాంక సంస్థను ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం కేంద్రగణాంక సంస్థ 2004-05 ఆధార సంవత్సరంగా జాతీయ, తలసరి ఆదా యాలను అంచనా వేస్తుంది. అభివృద్ధి చేందుతున్న దేశా ల్లో జాతీయాదాయ అంచనాలకు ఉత్పత్తి, ఆదాయ మదిం పు పద్ధతులను ఉపయోగిస్తుండగా.. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆదాయ మదింపు, వ్యయ మదింపు పద్ధతులను అనుసరిస్తున్నారు. 2008-09లో స్థిర ధరల వద్ద (2004- 05) ఉత్పత్తి కారకాల పంపిణీ దృష్ట్యా జాతీయాదాయాన్ని * 41,54,973 కోట్లుగా కేంద్ర గణాంక సంస్థ అంచనా వేసింది.
జాతీయాదాయంలో వివిధ రంగాలు:
స్వాతంత్య్రానంతరం నికర దేశీయోత్పత్తిలో ప్రాథమిక రంగం వాటా(వ్యవసాయ రంగం ప్రాథమిక రంగంలో కీలకమైంది) 1960-61లో గరిష్టంగా 56.6 శాతం.కాగా కనిష్టంగా 2008-09లో 15.7 శాతం. తర్వాతి కాలంలో ఈ రంగం వాటాలో తగ్గుదల గమనించవచ్చు.1960-61లో నికర దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 54 శాతం కాగా 2008-09లో 13.2 శాతానికి పడిపోయింది.
వ్యవ సాయ రంగం వాటా గత 50 సంవత్సరాల కాలంలో తగ్గిన ప్పటికీ.. తగ్గుదలలో స్థిరత్వం కన్పించలేదు. ప్రణాళికబద్ధ ఆర్థిక ప్రగతి ప్రారంభమైన మొదట్లో నికర దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా తగ్గుదల ఎటువంటి నిర్మాణా త్మక మార్పును సూచించలేదు. ఈరంగం ప్రాథాన్యం తగ్గ డానికి రుతుపవనాల అననుకూలతను కూడా కారణంగా పేర్కొనవచ్చు.
ఇటీవల కాలంలో భారత ఆర్థిక వ్యవస్థలో అనేక నిర్మా ణాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. రవాణా, వాణి జ్యం, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఇతర సేవా కార్యకలాపా లు వ్యవసాయ రంగం కంటే వేగంగా వృద్ధి సాధించాయి. ఇప్పటికీ జాతీయాదాయ పెరుగుదలకు వ్యవసాయ రంగమే కీలకం. ప్రాథమిక రంగంలో వ్యవసాయ అనుబం ధ రంగాలైన అడవులు, చేపలవేట, పశుపోషణ, మైనింగ్ రంగాలుంటాయి. ఫిషింగ్ రంగం వాటా నికర దేశీయో త్పత్తిలో 1శాతం ఉండగా అడవులవాటా 1.3 నుంచి 1.7 శాతానికి పెరిగింది. 2009-10లో వ్యవసాయం, అడవు లు, చేపలవేట రుణాత్మక వృద్ధి (-0.2)ని నమోదు చేసు కోగా మైనింగ్, క్వారియింగ్‌లు 8.7 శాతం వృద్ధిని సాధిం చాయి.
ద్వితీయ రంగంలో అత్యంత కీలకమైంది తయారీ రంగం. జాతీయాదాయ అంచనాలకు ఈ రంగాన్ని రిజిస్టర్ అయిన, రిజిస్టర్ కానీ వాటిగా వర్గీకరిస్తారు. రిజిస్టర్ అయిన తయారీ రంగ యూనిట్లు నికర ఉత్పత్తిలో పెరుగు దల ఎక్కువగా ఉండి నికర దేశీయోత్పత్తిలో ఈ యూనిట్ల వాటా గణనీయంగా పెరిగింది. 1990లలో సంఘటిత పారిశ్రామిక వాటా తగ్గింది. రిజిస్టర్ కానీ తయారీ రంగం లో ఉపాధి కల్పన ఎక్కువ ఉండడంతో 1970-80 లలో ఈ రంగం కొన్ని ప్రోత్సాహకాలను పొందింది.
1990లలో సరళీకృత ఆర్థిక విధానాల నేపథ్యంలో తయారీ రంగ ప్రాధాన్యం తగ్గింది. ద్వితీయ రంగం కార్య కలాపాలైన విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా సాపేక్షికంగా చిన్నవి. వీటి కంటే నిర్మాణ రంగం సుమారు నాలుగు రెట్లు పెద్దది. 1950లలో ఈ రంగం వాటా నికర దేశీయోత్పత్తిలో 4 శాతం కాగా.. గత రెండు దశాబ్దలుగా వాటా సగటున 5.5 శాతం. 2008-09లో తయారీ రంగం 8.9 శాతం వృద్ధి సాధించగా.. నిర్మాణ రంగం 6.5 శాతం వృద్ధి నమోదు చేసుకుంది.
తృతీయ రంగంలోని వాణిజ్యం, రవాణా, సమాచార రంగాలు ప్రణాళిక యుగంలో స్థిరమైన వృద్ధి నమోదు చేసుకున్నాయి. ఫైనాన్సింగ్, ఇన్సూరెన్స్ కార్యకలాపాలు వేగంగా వృద్ధి సాధించాయి. రియల్ ఎస్టేట్ రంగం వాటా లో పెరుగుదల గణనీయంగా ఉండగా.. ప్రభుత్వ రంగం స్థిరమైన వృద్ధిని సాధించింది. 2009-10లో వాణిజ్యం, హోటళ్లు, రెస్టారెంట్లలో వృద్ధి 8.8 శాతంకాగా ఫైనాన్సింగ్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్, వాణిజ్య సేవలు 9.9 శాతం, కమ్యూనిటీ, సాంఘిక, వ్యక్తిగత సేవలు 8.2 శాతం వృద్ధి సాధించాయి.
జాతీయాదాయ లెక్కల ప్రాధాన్యం:
జాతీయాదాయ అంచనాలు ఒకదేశ ఆర్థిక వ్యవస్థకు కొల మానంగా ఉపకరిస్తాయి. ఈ అంచనాలలో కొన్ని సమస్య లు ఎదురవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికీ వస్తు మార్పిడి పద్ధతి అమలులో ఉన్నందువల్ల అనేక వస్తు సేవల విలువలు లెక్కించడం కష్టతరమైంది.
మార్షల్ అనే ఆర్థికవేత్త ఉత్పిత్తి కారకాల పరంగా జాతీ యాదాన్ని అంచనావేయగా.. పిగూ అనే మరో ఆర్థికవేత్త ఆదాయాన్ని ద్రవ్యరూపంలో అంచనా వేస్తే జాతీయాదా యం అవుతుందని భావించారు.
భారతదేశంలో ప్రణాళికా బద్ధ్దమైన ఆర్థిక ప్రగతి 1951లో ప్రారంభమైంది. జాతీయాదాయ అంచనాలను బట్టి ప్రణాళికలలో సాధించాల్సిన ఆర్థిక లక్ష్యాలను నిర్ణ యించడం జరుగుతుంది. స్థూల ఆర్థిక విధానాలకు ఈ అంచనాలు ఉపకరిస్తాయి.
ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాల ప్రగతిని తెలుసుకోవ డానికి జాతీయాదాయ గణాంకాలు ఉపకరిస్తాయి. స్వాతంత్య్రం వచ్చిన సమయంలో దేశ జాతీయ ఆదాయం లో సగానికిపైగా వాటా కల్గిన వ్యవసాయరంగం తర్వాత కాలంలో ప్రాధాన్యత కోల్పోయి ద్వితీయ, తృతీయ రంగా ల వాటా పెరిగింది. శ్రామికుల సంఖ్యతో పోల్చినప్పుడు ఏ రంగంలో ఉత్పాదకత తక్కువగా ఉంటుందో ఆవిధం గా ఉండటానికి కారణాలను అన్వేషించి వాటి నివారణకు తగిన విధానాలు రూపొందించాలంటే జాతీయాదాయ అంచనాలు అవసరం.
ఆర్థికాభివృద్ధి సూచికగా తలసరి ఆదాయాన్ని ప్రాతి పదికగా తీసుకోవచ్చు. తలసరి ఆదాయ ప్రాతిపదికగానే ఆయా దేశాలను అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలుగా వర్గీకరిస్తారు. ప్రజల జీవన ప్రమాణాన్ని తెలుసుకోవచ్చు.
జాతీయాదాయ పెరుగుదల రేటు జనాభా పెరుగు దల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే ప్రజల జీవన ప్రమా ణం పెరిగిందని భావించవచ్చు.
పంచవర్ష ప్రణాళికలు రూపొందించే క్రమంలో జాతీ య, తలసరి ఆదాయాల వృద్ధి లక్ష్యం, పొదుపు, పెట్టుబ డుల లక్ష్యం, వినియోగదారుల ఉత్పత్తి లక్ష్యం, ఐసీఓఆర్ (ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్‌పుట్ రేషియో) లక్ష్యాన్ని నిర్ణయించుకుంటారు. జాతీయాదాయ అంచనాల వల్ల ప్రణాళికలు విజయవంతమయ్యాయో లేదో తెలుసు కోవ చ్చు. ప్రభుత్వం వివిధ శాఖలకు సంబంధించి విధాన నిర్ణ యాలు చేపట్టడానికి కూడా ఈ గణాంకాలు ఉపకరిస్తాయి.
జాతీయాదాయాన్ని నిర్ణయించే కారకాలు
జాతీయాదాయ, తలసరి ఆదాయాల పెరుగుదల ప్రజల జీవన ప్రమాణాల్ని మెరుగుపరుస్తుంది.
జాతీయాదాయ పెరుగుదల కింది కారకాలపై ఆధా రపడి ఉంటుంది.
సహజ వనరులు:
ఖనిజాల లభ్యత, నాణ్యత, విద్యుత్ ఆధారాలు(బొగ్గు, నీరు). ప్రోత్సాహకర వాతావరణం, సాయిల్ ఫెర్టిలిటీ జాతీయాదాయాన్ని పెంపొందించే కారకాలు.
మానవ వనరులు:
సహజ వనరులు, మూలధన వనరులు వినియోగం మా నవ వనరుల నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. శ్రామిక శక్తి ఉత్పాదకత ప్రత్యక్షంగా ఆధారపడే అంశాలు..
ఆరోగ్యం, శక్తి, విద్య, వయసు, నేర్పరితనం
పని గంటలు, నియమాలు
పారిశ్రామిక సంబంధాలలో భాగంగా యాజమాన్యం, శ్రామికుల మధ్య సహకారం
మూలధన పరికరాల నాణ్యత
తగిన వేతనాలు లభించే పరిశ్రమలో పాలుపంచుకునే జనాభా
ఉత్పత్తి కారకాలను సంఘటిత పరచడం:
అధిక జాతీయాదాయ సాధనకు దోహదం చేసే అంశాలు..
ఉపాధి లేని శ్రామికులను వినియోగించుకోవడం లేదా తక్కువ ఉత్పాదకత రంగాల నుంచి ఎక్కువ ఉత్పాద కత రంగాలకు శ్రామికుల బదిలీ.
ఉత్పత్తి కారకాల మధ్య సమన్వయం
మూలధన పరికరాలను అభిలషణీయంగా వినియో గించుకోవడం.
జనాభా పరిమాణం లేదా విదేశీ వాణి జ్య ప్రగతి:
చిన్న దేశాల్లో స్వదేశీ మార్కెట్ పరిధి స్వల్పంకావడంతో.. సంస్థల లాభదాయకత తక్కువగా ఉంటోంది. దాంతో పెద్ద తరహ ఉత్పత్తి వల్ల పొందే ప్రయోజనాలను పొంద లేక పోతున్నాయి. విదేశీ వాణిజ్య అవకాశాలను విస్తృత పరచుకున్నట్లయితే ఆర్థిక వృద్ధి సాధించడానికి ఎక్కువ అవకాశాలుంటాయి.
రాజకీయ వ్యవస్థ:
దేశంలో స్థిరమైన, సమర్థమైన రాజకీయ వ్యవస్థ ఉంటే వాణిజ్యం రంగం వృద్ధి బాటలో పయనిస్తుంది. రాజకీయ ఆస్థిరత వల్ల వనరుల వినియోగం తగ్గి జాతీయాదాయ వృద్ధి కుంటుపడుతుంది.
సాంకేతిక పరిజ్ఞానం, అవస్థాపనా సౌకర్యాలు:
అవస్థాపనా సౌకర్యాలు ముఖ్యంగా సమాచారం, విత్త సంస్థలు విద్య, పరిశోధనా సంస్థలు ఆర్ధిక వ్యవస్థలో సమ ర్థత పెంచడానికి దోహదపడి జాతీయాదాయ పెరుగుద లకు దారితీస్తాయి.
ముఖ్యాంశాలు:
ఒక సంవత్సర కాలంలో దేశంలో తయారైన అంతిమ వస్తు సేవల మొత్తం విలువను జాతీయాదాయం అంటారు.
2008-09లో స్థిర ధరల వద్ద (2004-05) ఉత్పత్తి కారకాల పంపిణీ దృష్ట్యా జాతీయాదాయాన్ని *41,54,973 కోట్లుగా కేంద్ర గణాంక సంస్థ అంచనా వేసింది.
1960-61లో నికర దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 54 శాతం కాగా 2008-09లో 13.2 శాతానికి పడిపోయింది.
జాతీయాదాయ అంచనాలు ఒకదేశ ఆర్థిక వ్యవస్థకు కొలమానంగా ఉపకరిస్తాయి.
జాతీయాదాయ అంచనాలను బట్టి ప్రణాళికలలో సాధించాల్సిన ఆర్థిక లక్ష్యాలను నిర్ణయించడం జరుగుతుంది. స్థూల ఆర్థిక విధానాలకు ఈ అంచనాలు ఉపకరిస్తాయి.
ఆర్థికాభివృద్ధి సూచికగా తలసరి ఆదాయాన్ని ప్రాతిపదికగా తీసుకోవచ్చు. తలసరి ఆదాయ ప్రాతిపదికగానే ఆయా దేశాలను అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలుగా వర్గీకరిస్తారు.
ఎక్స్‌పెక్టెడ్ కొశ్చన్స్
జాతీయాదాయంలో వివిధ రంగాల వాటాలో మార్పులను తెలపండి?
జాతీయాదాయాన్ని నిర్ణయించే కారకాలను తెలిపి, జాతీయాదాయ లెక్కింపు ప్రాధాన్యత వివరించండి?
జాతీయాదాయంలోని వివిధ భావనలు?
భారత ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకున్న నిర్మాణాత్మక మార్పులను తెలపండి?
జాతీయాదాయం, మానవ వికాసం మధ్య ఉన్న సంబంధాన్ని తెలపండి?
భారత ఆర్థికాభివృద్ధిలో శ్రామికశక్తి పాత్ర?
No comments:
Post a Comment