ప్రదీప్ పోస్టు గ్రాడ్యుయేట్. గ్రూప్-1 ఉద్యోగ సాధన లక్ష్యం. రెండేళ్ల నుంచి శ్రద్ధగా చదవటం ప్రారంభించాడు. పుస్తకాలన్నీ క్షుణ్ణంగా చదివాడు. శిక్షణ తీసుకున్నాడు. మొన్న జరిగిన ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యాడు. కీ చూసుకుంటే 75 మార్కుల వరకూ వస్తున్నాయి. కటాఫ్ మార్కు 83, 84 వరకూ ఉండవచ్చు అంటున్నారు. దాంతో దిగులుపడ్డాడు. ప్రిపరేషన్ లోపం ఏమిటిన్నది అర్థం కాలేదు. నవీన గ్రాడ్యుయేట్. గ్రూప్-2 పరీక్ష లక్ష్యంగా ఎంచుకుంది. శిక్షణ, ప్రామాణిక పుస్తకాలు చదవడం మొదలైన మెలకువలన్నీ పాటించింది. ప్రాక్టీస్‌గా ఉంటుందని గ్రూప్-1 ప్రిలిమినరీకి కూడా హాజరైంది. తొంభై మార్కుల పైన రావొచ్చనీ, కచ్చితంగా అర్హత సాధిస్తాననీ నమ్మకంతో ఉంది.గ్రూప్-1 వెలుగులో... రేపటి గ్రూప్-2! ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ముగిసింది. ఈ ప్రశ్నపత్రం గ్రూప్-2 పరీక్ష రాయబోయేవారికి కూడా ముఖ్యమైనదే! ఎందుకంటే దీన్ని సూక్ష్మంగా విశ్లేషిస్తే గ్రూప్-2 పరీక్షకు ఉపకరించే వివిధ అంశాలను అర్థం చేసుకోవచ్చు. వాటి ఆధారంగా గ్రూప్-2 పరీక్షలోని పేపర్-1 ప్రిపరేషన్‌ని పదునుగా తీర్చిదిద్దుకోవచ్చు!
కొడాలి భవానీ శంకర్
* ప్రదీప్‌లాగా పుస్తక సమాచారానికి పరిమితమై సరైన దృక్కోణం లేక నిరాశపడ్డ అభ్యర్థులున్నారు.
* సివిల్స్‌లాంటి గత పరీక్షానుభవాలతో ప్రిలిమినరీలో మంచి స్కోరు సాధించిన వారున్నారు.
* మొదటిసారే రాస్తున్నప్పటికీ, ప్రతి విషయాన్ని లోకానుభవాలతో ముడివేస్తూ వాస్తవికతతో చదివి మంచి మార్కులు సాధించే దిశలో అడుగులేస్తున్న నవీన లాంటి వారున్నారు.
* సాదాసీదా చదువులతో బోల్తాపడిన అభ్యర్థులున్నారు.
* మెయిన్స్‌పై అధికంగా దృష్టి నిలిపి ప్రిలిమ్స్‌లో దెబ్బతిన్నవారూ ఉన్నారు.
గ్రూప్-2 అభ్యర్థులు ఏమేం గమనించాలి?
కరెంట్ ఎఫైర్స్: గ్రూప్-1లో కిందటేడాది జూన్ నుంచి ఈ ఏడాది జూన్ 15 వరకు జరిగిన సంఘటనలపై ప్రశ్నలు అడిగారు. ఏడాది కాలాన్ని పరిగణించారు కాబట్టి గ్రూప్-2 వారు ఈ ఏడాది జనవరి నుంచి జరుగుతున్న అంతర్జాతీయ, జాతీయ అంశాల్ని క్షుణ్ణంగా పరిశీలించాలి; తేదీల వారీగా వీలైనంత వరకు గుర్తుంచుకోవటం అవసరం. నోబెల్ బహుమతుల నుంచి సాక్షరతా భారత్ ఎంతకాలం కొనసాగుతుంది లాంటి అంశాల వరకు సమకాలీన అంశాలు విస్తరించాయి. బిట్ల మధ్య సామీప్యత చాలా ఎక్కువగా కన్పించింది. ఉదాహరణకు...
* 21వ శతాబ్దిలో సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడిన రోజు?
* వెయ్యేళ్ల కాలంలో అతి పెద్ద సూర్యగ్రహణం సంభవించిన రోజు?
గ్రూప్- 1లో 26 ప్రశ్నలే అడిగినా, గ్రూప్-2లో 30-35 ప్రశ్నలడిగే అవకాశం ఉంది.
జనరల్ సైన్సు: గ్రూప్-1లో నిజ జీవిత జీవ, భౌతిక శాస్త్ర అంశాలకు అధిక ప్రాధాన్యం లభించింది. సాధారణ పరిజ్ఞాన ప్రశ్నలే అధికం.
* నీటి శాశ్వత కఠినత్వానికి కారణం?
* పేస్‌మేకర్ దేనికి సంబంధించింది?
* జడత్వం దేని ధర్మం?
* ఇత్తడి ఏ లోహాల మిశ్రమం?
... ఇలాంటి పాఠశాల స్థాయి ప్రశ్నలతో పాటు ఉన్నత స్థాయి ప్రశ్నలు కూడా వచ్చాయి. పాఠ్యగ్రంథాల అనువర్తన అంశాల అధ్యయనంతో పాటు పరిసరాలను పరిశీలిస్తూ సైన్స్ అనువర్తనపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం చాలా స్పష్టంగా కన్పిస్తోంది.
గత గ్రూప్-2 పరీక్షలో ఏకంగా 48 ప్రశ్నలు జనరల్ సైన్స్ విభాగం నుంచే అడిగారు కాబట్టి, ఈసారి కూడా అదే స్థాయిలో ఆశించవచ్చు. గ్రూప్- 2 అభ్యర్థులు పాఠశాల స్థాయి సమాచారంపై పట్టు సాధించడం తక్షణ కర్తవ్యంగా గుర్తించాలి.
జనరల్ నాలెడ్జ్: ఇటీవల పరీక్షల్లో జీకే ప్రాధాన్యం బాగా పెరుగుతుందని గతంలోనే ప్రస్తావించుకున్నాం. సివిల్స్, గ్రూప్-1 ప్రిలిమినరీ అనుభవాల ఆధారంగా జీకే అధ్యయనం కీలకంగా మారిందని చెప్పొచ్చు.
* స్టేట్ బ్యాంక్ ఇండియా నినాదం?
* ఆంధ్రాబ్యాంక్ చిహ్నం?
* దూరదర్శన్ చిహ్నం?
... ఇలాంటి ప్రశ్నలు ఈ కోవకి చెందినవే. గ్రూప్-2 అభ్యర్థులు ఏదైనా ఒక ఇయర్ బుక్ తీసుకుని వివిధాంశాల్ని క్రమబద్ధంగా ఇప్పటి నుంచి చదవడం అవసరం.
పాలిటీ: గ్రూప్-1 ప్రిలిమినరీలో యాదృచ్ఛికంగా ఐదు ప్రశ్నలే అడిగారని చెప్పొచ్చు. గ్రూప్- 2లో 75 మార్కులు/ ప్రశ్నలు కాబట్టి ప్రిలిమినరీ పరీక్షను ప్రామాణికంగా తీసుకోరాదు. అందుకే రాజ్యాంగ చరిత్ర, రాజ్యాంగ బద్ధ అంశాల్ని క్షుణ్ణంగా చదవాలి. వివిధ రాజ్యాంగ సవరణలు, కీలకమైన సుప్రీం కోర్టు తీర్పులు మొదలైనవాటిపై దృష్టి నిలపాలి. రాజ్యాంగంలో లేకపోయినా ప్రణాళికా సంఘం, జాతీయ అభివృద్ధి మండలి, కేంద్ర మంత్రిత్వశాఖలు ఇతరత్రా అంశాలపై కూడా ప్రశ్నలు అడుగుతారు.
జాగ్రఫీ: గ్రూప్-1 ప్రిలిమినరీలో అడిగిన 24 ప్రశ్నల్లో వరల్డ్ జాగ్రఫీపైనే 15 ప్రశ్నలుండటం గమనార్హం. సౌర కుటుంబం, భూగోళ దృగ్విషయాలపై ఎప్పటిలానే ప్రశ్నలు వచ్చాయి.
* ట్వీడ్ లోయ ఉన్న ప్రదేశం?
* ఆఫ్రికాలో ఎత్తయిన పర్వత శిఖరం?
* ఆస్ట్రేలియాలో అతిపెద్ద బాక్సైట్ క్షేత్రం?
... ఇలాంటి ప్రశ్నల వల్ల అభ్యర్థులు జాగ్రఫీ కష్టంగా ఉందనే భావం వ్యక్తపరిచారు. నిజానికి పాఠశాల స్థాయిలోని ప్రపంచ భౌగోళిక పాఠ్యాంశాల్లో వివిధ ఖండాల మౌలిక సమాచారం ఉంది.
ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని, గ్రూప్-2 పరీక్షలో గతంలో మాదిరిగా 40 ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్నందువల్ల ఖండాల సమాచారంపై దృష్టి నిలపాలి. లోతైన అధ్యయనం చేయాలి. పాఠశాల స్థాయి పాఠ్యపుస్తకాల్లో పేర్కొన్న ప్రధానాంశాలు, మ్యాప్ పాయింటింగ్‌పై శ్రద్ధ పెడితే మంచి మార్కులు తథ్యం.
ఇండియన్ జాగ్రఫీలో ఆరు ప్రశ్నలే అడిగారని గ్రూప్-2లో కూడా అదే పద్ధతి పునరావృతం అవుతుందని భావించవద్దు. గ్రూప్-2లో ఇండియన్, ఏపీ జాగ్రఫీలపై ఇరవై ప్రశ్నల వరకూ వచ్చే అవకాశం ఉంది. ఆ దిశగా చదివేందుకు 6,7,8,9 తరగతుల పాఠ్యపుస్తకాలు బలమైన వనరులు.
మెంటల్ ఎబిలిటీ: గ్రూప్-1లో అడిగిన 16 ప్రశ్నల్లో సాధారణ స్థాయివే ఎక్కువ. గ్రూప్-2 అభ్యర్థులు ఈ మోడల్ ప్రశ్నలకే పరిమితం కాకూడదు. కనీసం 30 ప్రశ్నలు ఇవ్వవలసి ఉంటుంది కాబట్టి విభిన్న మోడల్స్, లోతయిన ప్రశ్నలు అడిగే అవకాశమే అధికం. అందువల్ల వీలైనంత శ్రద్ధగా అధ్యయనం చేయడం మంచిది. అరిథ్‌మెటిక్, రీజనింగ్‌లకు సమ ప్రాధాన్యం ఇచ్చి సన్నద్ధం అవ్వాలి.
చరిత్ర: గ్రూప్-1లో ఇచ్చిన 28 ప్రశ్నల్లో ఏపీ చరిత్రవి పది ప్రశ్నలు ఉండటం గమనార్హం. గ్రూప్-2లో ఏపీ హిస్టరీకి ఎలాగూ 75 ప్రశ్నలకు సంబంధించిన విభాగం పేపర్-2లో ఉంది కాబట్టి, జనరల్ స్టడీస్ పేపర్‌లో కనీసం 25 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. అందువల్ల అభ్యర్థులు ప్రిలిమినరీలో వచ్చిన ప్రశ్నల స్థాయి కంటే లోతుగా భారతదేశ చరిత్ర, ఏపీ చరిత్రలపై తయారవ్వాల్సి ఉంటుంది.
* హరప్పా ప్రజలు అంతర్జాతీయ సంబంధాలను ఎవరితో కలిగి ఉన్నారు?
* వేదకాలం నాటి ఆర్యులు ఏ రంగంలో ప్రవీణులు?
* పట్టాభిషేకం నాటికి అక్బర్ వయసు?
... ఇలాంటి వాటిని గమనిస్తే, అడిగిన ప్రశ్నల్లో దాదాపు 80 శాతం గత పరీక్షల్లో అడిగినవేనని తెలుస్తుంది. చరిత్రలో గతిశీలత తక్కువ కాబట్టి పాత ప్రశ్నపత్రాలపై దృష్టి పెడితే మంచి ఫలితముంటుంది.
* 9.5 శాతం వృద్ధిరేటు లక్ష్యం దేనికి సంబంధించింది?
* ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగుల్ని నియమించేందుకు ఆదరణ పొందుతున్న విధానం ఏది?
... ఇలాంటి ప్రశ్నలు అభ్యర్థుల వార్తాపత్రికల పరిజ్ఞానానికి సంబంధించినవే. ఆర్థికశాస్త్ర పుస్తకాలతో పెద్దగా సంబంధం లేదు.
గ్రూప్-2 అభ్యర్థులు నిర్దిష్ట సిలబస్ ప్రిపేర్ అవుతూనే వాటితో ముడిపడిన, వర్తమాన పరిణామాల్ని నిశితంగా గమనించాలి. ప్రతి ఆర్థిక అంశాన్నీ గత 52 ఏళ్ల కోణంలో అధ్యయనం చేయాలి. రెండు, మూడు పుస్తకాలు.. ఎకనమిక్ సర్వేల నుంచే గతంలో ప్రశ్నలు అడిగారని అదే ధోరణిలో ప్రిపేర్ కావద్దు. ప్రపంచ, భారత, ఏపీ ఆర్థిక పరిణామాలని తులనాత్మకంగా పరిశీలించే నేర్పు పెంచుకోవడం అవసరం.
please give the list of preferred standard books for Group2
ReplyDeleteM.Narayana Reddy Group 2 Topper from Guntur Dist said these words
ReplyDelete8 books will be enough for group 2 prep
1.PaperI-Tata Mc Graw Hill General Studies Guide(along with this a standard Paper like Eenadu and magazine like Udyoga Sopanam will be enough)
2.paper II-ఆంధ్రుల చరిత్ర(బి.ఎన్.ఎల్.హనుమంతరావు)
3.ఆధునిక ఆంధ్రుల చరిత్ర(రఘునాథ రావు)
4.For Indian Polity-కె.లక్ష్మీకాంత్ alone is enough
5.Paper III-భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు
6.ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ - అభివ్రుద్ధి(తెలుగు అకాడమి)
will be enough
Apart from these 6 books
7.Indian Year Book(Published by కేంద్ర సమాచర ప్రసార మంత్రిత్వ శాఖ )
8.ఆంధ్ర ప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే
If u study these thoroughly u can get around 360 marks If u will get 20/50 in interview ull be amond top 100.
The success formula is Preparation books are less but u have to study them again and again.
visit these posts for other details
http://appscgroupspoint.blogspot.com/2011/01/blog-post_2680.html
http://appscgroupspoint.blogspot.com/2010/12/blog-post_13.html
Hi this is veena , Can U please Help me in getting books required for preparing to Group 1 & where do I get those books.
ReplyDeleteRefer the posts in my blog.Many of them have good guidance.you'll also find books in many of them.First read them and get an overall idea.Ull get the books @ hyderabad @ ashok nagar @ go to RC reddy study circle.you'll find many book shops around that circle wich will fetch u any book.
ReplyDelete*I suggest you to first meet some senior/already working officer,take their advice.u'll find it valuble :D