అందువల్ల గ్రామీణ నేపథ్యమున్నవారు ముందు సిలబస్‌ని అధ్యయనం చేయాలి. సిలబస్‌కు సంబంధించి ప్రామాణిక తెలుగు అకాడమీ, పాఠశాల స్థాయి పాఠ్యపుస్తకాలు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాలను చదవాలి. సమీపంలోని డిగ్రీ కాలేజీ లెక్చరర్లను కలిసి, ఆయా పాఠ్యాంశాల్లో సందేహాలను తీర్చుకోవాలి; సలహాలు తీసుకోవాలి. నమూనా ప్రశ్నలకు సమాధానాలు రాసి, వారికి చూపించాలి. తప్పొప్పులు తెలుసుకోవాలి. గ్రూప్స్‌లో విజయాలు సాధించి ఉద్యోగాలు చేస్తున్న అధికారులను సంప్రదించటం ప్రేరణనూ, మార్గదర్శకత్వాన్నీ అందిస్తుంది. నిజాయితీగా కృషి చేయాలి.
ఇటీవల ఆర్డీవోగా ఎంపికైన నారాయణరెడ్డి ఒకటి రెండు పేపర్లలో తప్ప మిగతా ప్రిపరేషన్‌ని ఇదే రీతిలో కొనసాగించారు! దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి.
* కొత్త సిలబస్‌లో జరిగిన గ్రూప్-| పరీక్షల్లో మాథ్స్, సైన్స్ అభ్యర్థులకు మంచి ర్యాంకులు వచ్చాయని అంటున్నారు. నిజమేనా? ఎం.ఎ. తెలుగు చేసినవారికి విజయావకాశాలు ఎలా ఉంటాయి?
* కొత్త సిలబస్‌లో జరిగిన గ్రూప్-I, II పరీక్షలు సైన్స్, ఆర్ట్స్ సబ్జెక్టులు అని కాకుండా కష్టపడిన అభ్యర్థులనే ఎంపిక చేశాయి. అందుకే మొదటి పది మందిలో దాదాపు 50 శాతం మంది ఇంజినీరింగ్, మ్యాథ్స్ నేపథ్యమున్నవారు ఉన్నారు.
ఆర్ట్స్ అభ్యర్థులు సైన్స్ అండ్ టెక్నాలజీలోని ప్రాథమికాంశాలు సరిగా అర్థం చేసుకోకపోవటం, డేటా ఇంటర్‌ప్రెటేషన్ పేపర్లో ప్రాక్టీస్ చేయకపోవటం మొదలైన కారణాల వల్ల మొత్తమ్మీద వెనకబడివుండొచ్చు. సరైనరీతిలో కృషి చేస్తే వీరైనా మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు.
బీటెక్ చదివి, ఇటీవల డీఎస్‌పీగా ఎంపికైన అభ్యర్థి ఎకానమీలో 118 మార్కులు స్కోర్ చేశారు. తీరా అదే అభ్యర్థికి పాలిటీ, హిస్టరీ కలయికైన పేపర్II లో 54 మార్కులు వచ్చాయి. అందువల్ల ఆయా సబ్జెక్టుల్లో మార్కులనేవి అభ్యర్థి అవగాహన సామర్థ్యంపై ఆధారపడివుంటుంది. ఎమ్మే పొలిటికల్ సైన్స్ అభ్యర్థి పేపర్-V లో 124 మార్కులు స్కోర్ చేశారు.
అందువల్ల పీజీ, గ్రాడ్యుయేషన్ సబ్జెక్టులు ఏవైనా కానివ్వండి- సమస్య ఏమీ లేదు. సిలబస్‌ని ప్రశ్నలవారీగా కాకుండా కాన్సెప్ట్ ఆధారంగా అధ్యయనం చేస్తే... మంచి ఫలితం తథ్యం!
* గ్రూప్-I, II లకు ఉపయోగపడే మ్యాగజీన్లూ, పత్రికలూ?
* ఇంగ్లిష్ మీడియం: సివిల్ సర్వీసెస్ క్రానికల్, యోజన, కురుక్షేత్ర, ఇండియా టుడే, ఫ్రంట్‌లైన్, సైన్స్ రిపోర్టర్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ.
తెలుగు మీడియం: ఆంధ్రప్రదేశ్, యోజన, ఇండియా టుడే, వీక్షణం, ఏపీ హ్యూమన్ డెవలప్‌మెంట్ రిపోర్ట్, ఏపీ ఎకనమిక్ సర్వే, ఇంకా... ప్రముఖ దినపత్రికలు.
- కొడాలి భవానీ శంకర్
No comments:
Post a Comment