1.నాదల్‌కు టైటిల్
ప్రపంచ టెన్నిస్ చాంపియన్‌షిప్ ఎగ్జిబిషన్ టోర్నమెంట్‌ను వరల్డ్ నెంబర్ వన్ రాఫెల్ నాదల్(స్పెయిన్) గెలుచుకున్నాడు. జనవరి 1న అబుదాబిలో జరిగిన ఫైనల్లో నాదల్, రోజర్ ఫెదరర్(స్విట్జర్లాండ్)పై విజయం సాధించాడు.
2.కృష్ణా జలాలపై ట్రిబ్యునల్ తీర్పు
మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య కృష్ణా నదీ జలాల పంపిణీ కోసం నియమించిన కృష్ణా ట్రిబ్యునల్ డిసెంబర్ 30న తీర్పు వెలువరించింది. ఈ ట్రిబ్యునల్‌ను 2004లో జస్టిస్ బ్రిజేష్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. 65 శాతం నీటి లభ్యత ప్రాతిపదికన కృష్ణా నదీ జలాలను మూడు రాష్ట్రాలకు పంచింది. వివరాలు..
మొత్తం 2578 టీఎంసీలలో ఆంధ్రప్రదేశ్‌కు 1001 టీఎంసీలు, కర్నాటకకు 911 టీఎంసీలు, మహారాష్టక్రు 666 టీఎంసీల నీటిని కేటాయించింది. గతంలో 1973 బచావత్ ట్రిబ్యునల్.. ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు, కర్నాటకకు 734 టీఎంసీలు, మహారాష్టక్రు 585 టీఎంసీల నీటిని కేటాయించింది.
{sిబ్యునల్ 285 టీఎంసీల మిగులు జలాలు ఉన్నాయని నిర్ధారించింది.
కర్నాటక నిర్మిస్తున్న ఆలమట్టి ప్రాజెక్ట్ ఎత్తును 519 మీటర్ల నుంచి 524.25 మీటర్లు పెంచుకోవడానికి అనుమతినిచ్చింది. తద్వారా ఈ ప్రాజెక్ట్ నుంచి కర్నాటక 303 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చు.
చెన్నై తాగు నీటి కోసం మూడు రాష్ట్రాలు వివిధ నెలల్లో 5 టీఎంసీల చొప్పున నీటిని కేటాయించాలి.
ఈ తీర్పు 2050 మే 31 వరకు అమల్లో ఉంటుంది. తర్వాత తిరిగి సమీక్షించవచ్చు.
ఈ తీర్పును అమలు చేసేందుకు మూడు నెలల తర్వాత కృష్ణా జలా వివాదాల అమలు బోర్డును ఏర్పాటు చేస్తారు.
3.బాలచందర్‌కు అక్కినేని అవార్డు
ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ 2010 సంవత్సరానికి అక్కినేని నాగేశ్వరరావు లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డుకు ఎంపిక య్యారు. బాలచందర్ 100కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ అవార్డు కింద ప్రశంసా పత్రం,*4లక్షల నగదు బహూకరిస్తారు.
4.ఎయిర్‌ఫోర్స్ కొత్త వైస్ చీఫ్ బ్రౌన్
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నూతన వైస్ చీఫ్‌గా పి.కె.బర్బొరా స్థానంలో ఎయిర్ మార్షల్ ఎన్.ఎ.కె. బ్రౌన్ జనవరి 1న పదవీ బాధ్యతలు స్వీకరించారు.
5.బాలచందర్‌కు అక్కినేని అవార్డు
ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ 2010 సంవత్సరానికి అక్కినేని నాగేశ్వరరావు లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డుకు ఎంపిక య్యారు. బాలచందర్ 100కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ అవార్డు కింద ప్రశంసా పత్రం,*4లక్షల నగదు బహూకరిస్తారు.
6.హైదరాబాద్‌లో ఉపగ్ర హ డేటా సేకరణ కేంద్రం
ఉపగ్రహ డేటా సేకరణ కేంద్రం (ఇంటిగ్రేటెడ్ మల్టీ మిషన్ గ్రౌండ్ సెగ్మెంట్)ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) వెల్లడించింది. ఇందులో భాగంగా ఎనిమిది యాటెన్నాలను నెలకొల్పుతారు.
2011 జూన్ నుంచి ప్రారంభమయ్యే.. ఈ కేంద్రం ద్వారా ఉపగ్రహాల నుంచి వచ్చే సమాచారాన్ని సేకరించి ఇస్రో వినియోగదారులకు నిత్యం వెయ్యి అంతరిక్ష ఉత్పత్తులను నేరుగా అందించే వీలవుతుంది. ప్రస్తుతం డేటా అందిన నాలుగైదు రోజులకు ఈ ఉత్పత్తులను అందిస్తున్నారు. గ్రౌండ్ సెగ్మెంట్ నిర్మాణం పూర్తయితే 12 గంటల్లోనే సమాచారం అందించవచ్చు.
7.ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ అధిపతిగా జోషి
ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ అధిపతిగా వైస్ అడ్మిరల్ డి.కె. జోషి డిసెంబర్ 31న నియమితులయ్యారు. ఎయిర్ చీఫ్ మార్షల్ ఎస్.సి. ముకుల్ స్థానంలో జోషి పదవీ బాధ్యతలు స్వీకరించారు.
8.భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా భారత్
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా భారత్ జనవరి 1న చేరింది. రెండు సంవత్సరాలపాటు భారత్ ఈ హోదాలో ఉంటుంది. 19 సంవత్సరాల తర్వాత భారత్‌కు ఈ సభ్యత్వం దక్కింది. భారత్‌తోపాటు జర్మనీ, పోర్చుగల్, కొలంబియా, దక్షిణాఫ్రికాలు 15 మంది సభ్యులుగల భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశాలుగా చేరాయి.
9.ఆదిమానవుడిది పశ్చిమాసియా
ఆదిమానవుడిది పశ్చిమాసియా అని ఇజ్రాయెల్‌కు చెందిన టెల్ అవీవ్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్ధారించారు. పశ్చిమాసియాలోని ఖీసెమ్ గుహలో నాలుగు లక్షల సంవత్సరాల క్రితం నాటి మానవ దంతాలు లభించాయని వారు పేర్కొన్నారు.
దీని ఆధారంగా పశ్చిమాసియా నుంచి నాలుగు లక్షల సంవత్సరాల క్రితం ఆదిమానవుడు తరలి వెళ్లాడని వారు తెలిపారు. ఇప్పటి వరకు ఆధునిక మానవుడి పూర్వీకుడైన హోమోసెపియన్ రెండు లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో పరినామం చెందాడని శాస్తజ్ఞ్రులు భావిస్తూ వస్తున్నారు.
10.పౌరహక్కుల నేత కణ్ణబీరన్ మృతి
పౌరహక్కుల ఉద్యమనేత, పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్(పీయూసీఎల్) జాతీయ అధ్యక్షుడు కందాల గోపాళస్వామి కణ్ణబీరన్(82) డిసెంబర్ 30న హైదరాబాద్‌లో కన్నుమూశారు. 2004లో మావోయిస్టులు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చల్లో ప్రధాన పాత్ర పోషించారు. 1969 పార్వతీపురం కుట్ర కేసు, 1974 సికింద్రాబాద్ కుట్ర కేసుల్లో హక్కుల నేతల తరపున కోర్టులో వాదించి గెలిచారు.
11.అనకాపల్లిలో ఎన్‌టీపీసీ ప్రాజెక్ట్
విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలం పుడిమడకలో 4వేల మెగావాట్ల సామర్థ్యంతో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్‌టీపీసీ) థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈప్రాజెక్ట్ నుంచి 2వేల మెగావాట్లను రాష్ట్ర విద్యుత్ సంస్థలు కొనుగోలు చేస్తాయి. *23 వేల కోట్ల అంచనాతో ఎన్‌టీపీసీ ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టింది.
12.బ్రెజిల్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన రౌసెఫ్
బ్రెజిల్ తొలి మహిళా అధ్యక్షురాలిగా దిల్మా రౌసెఫ్ జనవరి 1న బాధ్యతలు చేపట్టారు. గతేడాది అక్టోబర్‌లో జరిగిన ఎన్నికల్లో లూయిజ్ ఇనాసియా లూలా డి.సిల్వా స్థానంలో రౌసెఫ్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఈమె గతంలో డి. సి ల్వా కేబినెట్‌లో పని చేశారు.
13.ఎడిటర్స్ గిల్డ్ అధ్యక్షుడిగా నీనన్
ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా రాజ్‌దీప్ సర్దేశాయ్(సీఎన్‌ఎన్-ఐబీఎన్) స్థానంలో బిజినెస్ స్టాండర్డ్ చైర్మన్, ఎడిటోరియల్ డెరైక్టర్ టీఎన్ నీనన్ డిసెంబర్ 27న ఎన్నికయ్యారు. కొమి కపూర్(ఇండియన్ ఎక్స్‌ప్రెస్) జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు.
14.ఏరోస్టాట్ రాడార్ పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి ఏరోస్టాట్ బెలూన్ రాడార్ పరీక్ష విజయవంతమైంది. డిసెంబర్ 28న ఆగ్రాలో ఈ పరీక్ష నిర్వహించారు. దీని వల్ల సైనిక దళాల నిఘా సామర్థ్యం పెరుగుతుంది.
హీలియం వాయువుతో నింపే ఏరోస్టాట్‌లో రాత్రి వేళల్లో కూడా కచ్చితత్త్వంతో గుర్తించే కెమెరాలు, శ బ్దాన్ని రికార్డ్ చేసే పరికరాలు ఉన్నాయి. దీనిలోని థర్మల్ ఇమేజింగ్ కెమెరా కారణంగా రాత్రి వేళతోపాటు వెలుతురు తక్కువగా ఉన్న సమయంలో కూడా చిత్రాలను తీయగలదు.
ఏరోస్టాట్‌కు కిలోమీటర్ నుంచి 110 కిలోమీటర్ల దూరం వరకు నిఘా ఉంచే సామర్థ్యం ఉంది. ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ ఇజ్రాయెల్ రూపొందించిన ఏరోస్టాట్‌లను ఉపయోగిస్తున్నాయి. వీటిని దేశ పశ్చిమ సరిహద్దులో మోహరించారు.
ఏరోస్టాట్‌ను డీఆర్‌డీవో ఆధ్వర్యంలోని ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఏడీఆర్‌డీఈ) -ఆగ్రా రూపొందించింది. గతంలో ఈ సంస్థ సైన్యం, ఆయుధాలు, కంబాట్ వెహికిల్స్‌ను జారవిడిచే పారాచూట్లు, ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లకు బార్కింగ్ వ్యవస్థలను అభివృద్ధి చేసింది.
ఏరోస్టాట్ రాడార్‌లు 360 డిగ్రీల సెర్చ్ మోడ్ ఆపరేషన్‌లో పని చేసే సామర్థ్యం కలిగి ఉంటాయి. ముఖ్యంగా వీటిని కమ్యూనికేషన్, నిఘా కోసం వినియోగిస్తారు. దీని ఎత్తు 32 ఫీట్లు, 2000 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం. బరువు 30 కిలోలు.
ఏరోస్టాట్ రూపొందించడానికి ఏడీఆర్‌డీఈ హై ఎండ్ టెక్నాలజీ, ఏరోడైనమిక్స్, బెలూన్ టెక్నిక్స్, హైడ్రాలిసిస్, హై ప్రెషర్ సిలిండర్ టెక్నాలజీలను ఉపయోగించి హైటెక్ ప్లాట్ ఫామ్‌ను డిజైన్ చేసింది. ఇందుకోసం డీఆర్‌డీవో దాదాపు *70 కోట్లు ఖర్చు చేసింది.
ఏరోస్టాట్ బెలూన్‌లో ఎలక్ట్రో-ఆప్టిక్ అండ్ క మ్యూనికేషన్ ఇంటెలిజెన్స్ పేలోడ్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో ఉపయోగించడానికి వీలుగా ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ అండ్ రాడార్ పేలోడ్స్‌ను కూడా డీఆర్‌డీవో అభివృద్ధి చేసింది. ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ పేలోడ్‌లోని కమ్యూనికేషన్ ఇంటెలిజెన్స్ సిస్టమ్.. వివిధ రకాల కమ్యూనికేషన్లను గ్రహించడంతో పాటు వాటిని విశ్లేషించడానికి తోడ్పడుతుంది. దీని వల్ల త్రివిధ దళాలకు ఎంతో ఉపయోగం. అంతేకాకుండా విపత్తు నిర్వహణలో కూడా సహాయపడుతుంది.
ఏరోస్టాట్ ప్రయోగానికి ముందు ఆగ్రాలో మూడు రోజుల పాటు ఏరోస్టాట్ ట్రయల్స్ నిర్వహించారు. ఇందులో ఏరోస్టాట్‌ను కిలోమీటర్ ఎత్తువరకు ప్రయోగించి దాన్ని వివిధ రకాల కమ్యూనికేషన్ వ్యవస్థలతో పరీక్షించారు. బెలూన్ సిస్టమ్స్, గ్రౌండ్ బేస్డ్ కమాండ్స్, కంట్రోల్ సిస్టమ్, పేలోడ్‌ల పనితీరును పరిశీలించారు.
పాకిస్థాన్, చైనా సరిహద్దులతోపాటు దేశ రక్షణ దృష్ట్యా ఎంతో కీలకమైన 7,500 కిలోమీటర్ల సముద్రతీర రేఖ నిఘాలో కూడా ఏరోస్టాట్‌లు కీలకపాత్ర వహిస్తాయి.
ఆకేపాటి శ్రీనివాసులురెడ్డి
కరెంట్ అఫైర్స్ నిపుణులు
No comments:
Post a Comment