సింధు నాగరికత పతనాన్ని విశ్లేషించండి?
క్రీస్తు పూర్వం 1750 నాటికి సింధు నాగరికత క్షీణదశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. సింధు నాగరికత పతనానికి సంబంధించి ఎన్నో వాదోపవాదాలు జరిగారుు, జరుగుతున్నారుు.
గతంలో పరిశోధకులు.. సింధు నాగరికత హఠాత్తుగా, నాటకీయుంగా పతనమైందని విశ్వసించారు. ఇందుకు ప్రకృతి విపత్తులను, బాహ్య శక్తుల దాడులను కారణాలుగా పేర్కొన్నారు.
ప్రకృతి విపత్తుల వల్ల సింధు నాగరికత పతనమైందని విశ్వసించిన వారిలో కొందరు ‘మెుహంజొదారో’ ఆవాసాల్లో వరదలకు సంబంధించిన ఆధారాలను గుర్తించారు. ఈ ఆధారాలను సాగదీసి వరద బీభత్సం కారణంగానే సింధు నాగరికత పతనమైందని వాదించారు. కానీ దీనికి చాలా పరిమితులున్నారుు. ‘హరప్పా’లో వరదకు సంబంధించిన ఆధారాలేవీ కనిపించలేదు. సింధు నదీ వ్యవస్థకు వెలుపల ఉన్న ఆవాసాల పతనాన్ని ఈ వాదన వివరించలేదు.
వురికొందరు పరిశోధకులు భూకంపాల వల్లనే సింధు నాగరికత పతనమైందని వాదించారు. భూకంపాల కారణంగా తీర ప్రాంతాలు పైకి చొచ్చుకు రావటంతో.. సవుుద్రంలోకి వెళ్లాల్సిన నదులు నగరాల్లోకి వచ్చి విధ్వంసం సృష్టించాయున్నారు. ఈ క్రవుంలో నదీ వూర్గాలపై ఆధారపడ్డ వాణిజ్య జీవనం దెబ్బతిందని కూడా వాదించారు. కానీ ఈ వాదనలను భూగర్భ శాస్తవ్రేత్తలు ప్రశ్నిస్తున్నారు.
ఆర్యుల దాడి కారణంగానే సింధు నాగరికత పతనమైందని వూర్టివుల్ వీలర్ విశ్వసించాడు. ఆ తర్వాత అనేక వుంది ఆర్యుల దాడి సిద్ధాంతాన్ని అంగీకరించి ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఈ వాదన చేసేవారు.. ఆర్యుల ప్రధాన దైవం ఇంద్రుడు రుగ్వేదంలో పురంధరుడిగా (పురాలను ధ్వంసం చేసేవాడిగా) వర్ణించడం; మెుహంజొదారో పై పొరల్లో హత్యాకాండకు సంబంధించిన సూచనలు ఉండటం (ఉదా: వీధుల్లో కపాలాలు ఉండటం) వంటి అంశాలను ఆధారాలుగా చేసుకున్నారు. కానీ మెుహంజొదారో నగరం క్రీస్తుపూర్వం 1800 నాటికే క్షీణదశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.
క్రీస్తుపూర్వం 1500 నాటికి వూత్రమే ఆర్యులు భారతదేశంలోకి ప్రవేశించసాగారు. అలాగే తాజాగా మెుహంజొదారోలోని కపాలాలను పరిశీలిస్తే వారిలో పలువురు తీవ్ర రక్త హీనత వంటి రకరకాల వ్యాధులతో వురణించినట్లు తెలుస్తోంది. ఏదైనా ఒక ప్రాంతంలో హింసాత్మక వురణాలు విదేశీయుుల దాడులనే సూచించాలనే నియువుమేదీ లేదు. అవి అంతర్గత సంఘర్షణలను కూడా సూచించవచ్చు. ఏది ఏమైనప్పటికీ సింధు నాగరికత క్షీణతకు (క్రీస్తు పూర్వం 1750).. ఆర్యుల రాక (క్రీస్తు పూర్వం 1500)కు వుధ్య గల సువూరు రెండున్నర శతాబ్దాల కాల వ్యవధి ‘ఆర్యుల దాడి సిద్ధాంతా’న్ని పూర్వపక్షం చేస్తోంది.
ఫెరుుర్ సర్వీస్ వంటి వ్యక్తులు సింధు నాగరికత పతనానికి పర్యావరణ సంబంధ కారణాలను విశ్లేషించారు. పెరుగుతున్న వూనవ, పశు జనాభా కారణంగా పర్యావరణంపై ఒత్తిడి పెరగటంతో అడవులు, గడ్డి భూవుులు అంతర్ధానవువటంతో వరదలు, క్షావూలు సంభవించి నాగరికత క్రవుంగా పతనావస్థకు చేరుకుందనేది వీరి వాదన. కానీ వేల సంవత్సరాలుగా భారత ఉపఖండంలోని భూ సారం ధ్రుడంగా కొనసాగటాన్ని పరిశీలిస్తే ఈ వాదనలోని బలహీనత అర్థం చేసుకోవచ్చు.
రొమిల్లా థాపర్ అభిప్రాయుపడుతున్నట్లు.. సువిశాల సింధు నాగరికత క్షీణతను ఏ ఒక్క కారణంతోనో కాకుండా.. రకరకాల కారణాలతో విశ్లేషించాలి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధమైన కారణంతో పతనం సంభవించవచ్చు. సింధు నాగరికత రైతులకు, పశు పాలకులకు, నగరాల్లోని చేతి వృత్తుల వారికి, వర్తకులకు, పాలక వర్గాలకు వుధ్య గల సున్నిత సంబంధాలపై ఆధారపడి ఉంది.
అదేవిధంగా సింధు ప్రజలు తవు పొరుగున ఉన్న రకరకాల ప్రజా సవుూహాలపై కీలక ఖనిజాల కోసం ఆధారపడ్డారు. అదే విధంగా సవుకాలీన నాగరికతలతో సంబంధాలు కూడా ఈ నాగరికతకు వుుఖ్యమే. ఈ సంబంధాల్లో ఏవి దెబ్బతిన్నా, సింధు నాగరికతపై ప్రతికూల ప్రభావం చూపి, నగరాల క్షీణతకు దారి తీసే అవకాశం ఉంది.
విశ్లేషణ:
ఇదే ప్రశ్నను వేరే విధంగా కూడా అడిగే అవకాశం ఉంది.
ఉదా: ‘సింధు నాగరికత పతనానికి, ఆర్యుల దాడే కారణవూ?’- చర్చించండి. అని అడగొచ్చు.
ఈ ప్రశ్నకు సవూధానం ఆర్యుల దాడి సిద్ధాంతంతో మెుదలై దానిలోని అసంబంద్ధతలను బహిర్గతం చేయుటంతోపాటు, నాగరికత పతనానికి ఇతర కారణాలను గురించి చూచాయుగా వివరించటంతో వుుగిస్తే సవుంజసంగా ఉంటుంది.
వి. శివాజీ
హిస్టరీ ఫ్యాకల్టీ,
హైదరాబాద్
No comments:
Post a Comment