ప్రగతి రథానికి ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు రెండు చక్రాలు

పేపర్-2, సెక్షన్-3, చాప్టర్-1

ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలకు వుధ్య ఘర్షణ ఏర్పడితే.. ఆదేశ సూత్రాలకే ప్రాధాన్యమివ్వాలనే అభిప్రాయుంతో ఏకీభవిస్తారా?

సావూజిక జీవనాన్ని క్రవుబద్ధం చేయుడానికి ఏర్పరచిన రాజ్యం.. అందులోని సభ్యులైన పౌరులకు చట్టబద్ధత కలిగిన కొన్ని సౌకర్యాలను కల్పిస్తుంది. వాటినే ప్రాథమిక హక్కులని పేర్కొనవచ్చు. అరుుతే వీటికి సావూజిక ఆమోదం కూడా అవసరం. దాదాపు ఆధునిక రాజ్యాలన్నీ ప్రాథమిక హక్కులను ప్రస్తావిస్తారుు. వీటి ప్రధాన లక్ష్యం.. రాజ్య నిరపేక్ష అధికారం నుంచి వ్యక్తి స్వేచ్ఛను పరిరక్షించడం.

దాంతోపాటు సావూన్య ప్రజానీకంపై సవూజంలోని శక్తివంతమైన వ్యవస్థలు, వ్యక్తులు తవు ఆధిపత్యాన్ని చెలారుుంచకుండా నిరోధించడానికి కూడా తోడ్పడతారుు. వున రాజ్యాంగకర్తలు అమెరికా, ఐరిష్ రాజ్యాంగాలను నవుూనాగా తీసుకుని రాజ్యాంగంలోని వుూడో భాగంలో హక్కులను పొందుపరిచారు. వీటితోపాటు నాలుగో భాగంలో ఆదేశ సూత్రాలను పొందుపరిచారు. ఐరిష్ రాజ్యాంగ ప్రభావంతో రూపొందిన ఈ సూత్రాలు సావూజిక శ్రేయుస్సును ఉద్దేశించి ప్రభుత్వాన్ని నిర్దేశిస్తూ జారీ చేసిన ఆదేశాలు.

రాజ్యాంగంలో పొందుపరచిన హక్కులు ప్రధానంగా.. సవూనత్వపు హక్కు; స్వాతంత్య్రపు హక్కు; దోపిడీ నిరోధన హక్కు; వుత స్వాతంత్య్రపు హక్కు; సాంస్కృతిక, విద్యా విషయూల హక్కు; రాజ్యాంగ పరిరక్షణ హక్కు. ఇవి వ్యక్తిగతమైనవి.. రాజకీయు స్వభావం కలిగి రాజ్యాధికారాన్ని పరిమితం చేసేవి. ఆదేశ సూత్రాలు సావ్యువాద, ఉదారవాద స్వభావాన్ని కలిగి గాంధీ ఆశయూలను ప్రతిబింబిస్తారుు. సవూన పనికి సవూన వేతనం; సంపద పంపిణీ; ప్రజలకు జీవనోపాధి; కార్మికుల సంక్షేవుం, ఉవ్ముడి పౌర శిక్షా స్మృతి; అంతర్జాతీయు శాంతి; కుటీర పరిశ్రవుల ప్రోత్సాహం; వుద్యపాన నిషేధం మెుదలైనవి.

రాజ్యాంగ రూపకల్పన సవుయుం నుంచి ప్రాథమిక హక్కులు - ఆదేశ సూత్రాల ప్రాధాన్యత విషయుంలో రాజకీయు, మేధావి వర్గాల్లో విస్తృత చర్చ సాగుతోంది. తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అభిప్రాయుంలో... ఈ రెండింటి వుధ్య ఘర్షణ ఏర్పడితే ఆదేశ సూత్రాలకే ప్రాధాన్యమివ్వాలి. వ్యక్తికి ప్రాధాన్యమిచ్చే ప్రాథమిక హక్కుల కంటే సావూజిక శ్రేయుస్సుకు దోహదం చేసే ఆదేశ సూత్రాలు శ్రేష్ఠమైనవి. వ్యక్తిగత హక్కుల పరిరక్షణ వుుసుగులో సావూజిక సంక్షేవుం, ప్రగతి వురుగున పడకూడదు.

తిండి, బట్ట, వసతి లాంటి కనీస ప్రాథమిక అవసరాలు లభించని వ్యక్తి సవూనత్వం, వాక్ స్వాతంత్య్రం తదితర హక్కుల గురించి ఆలోచించడు. సంపద కొద్ది వుంది చేతుల్లో కేంద్రీకృతమై నిరుద్యోగం, నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడే వ్యక్తి వుధ్యతరగతి, సంపన్న వర్గాల ప్రాథవ్యూలైన సవూనత్వం, వుతస్వాతంత్య్రం వంటి హక్కుల గురించి పట్టించుకోడు.

సావూజిక శ్రేయుస్సు దృష్ట్యా ప్రాథమిక హక్కులపై కొన్ని పరిమితులు విధించడంలో తప్పు లేదని అభిప్రాయుపడిన జవహర్‌లాల్ నెహ్రూతో ఏకీభవిస్తాను. వాస్తవానికి ఈ రెండింటి వుధ్య ఘర్షణ లేదు. రెండు అవినాభావ సంబంధాలు కలిగి ఉన్నారుు. గత 60ఏళ్లుగా ఆదేశ సూత్రాల అవులుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. భూ సంస్కరణల అవులు, గుత్తాధిపత్య నిరోధం, పంచాయుతీ వ్యవస్థకు రాజ్యాంగపర హోదా కల్పించడం, కుటీర పరిశ్రవులను ప్రోత్సహించడం, జాతీయు గ్రామీణ ఉపాధి పథకం అవులు, విద్యను ప్రాథమిక హక్కుగా వూర్చడం, న్యాయు వ్యవస్థను కార్యనిర్వాహక వర్గం నుంచి వేరు చేయుడం, మెుదలైనవి.

అరుుతే ఆదేశ సూత్రాల అవులుకు తీసుకుంటున్న కొన్ని చర్యలు చట్టపరమైన వివాదాలకు దారి తీశారుు. ఇవి ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నాయునే కారణంగా న్యాయుస్థానాల్లో సవాలు చేయుడం, తదనుగుణంగా సుప్రీంకోర్టు కొన్ని పరిమితులు విధించడం జరిగింది. (ఉదా: గోలక్‌నాథ్, కేశవానంద, మినర్వా మిల్స్ కేసుల్లో తీర్పులు).

పార్లమెంట్ ఆ తీర్పులకు స్పందిస్తూ రాజ్యాంగ సవరణల (25, 42వ రాజ్యాంగ సవరణ చట్టాలు) ద్వారా ఆదేశ సూత్రాల ప్రాధాన్యతను పరిరక్షించడానికి ప్రయుత్నించింది. మెుత్తంమీద సుప్రీంకోర్టు అభిప్రాయుపడినట్లు.. వూనవ ప్రగతి అనే రథానికి ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు రెండు చక్రాల్లాంటివి. సావూజిక, ఆర్థిక ప్రజాస్వావ్యూనికి ఈ రెండు అవసరమే.

రాజ్యాంగ పనితీరును సమీక్షించడానికి ఏర్పాటు చేసిన జాతీయు కమిషన్ సిఫార్సులను ఇప్పటి వరకు ఏ మేరకు అవులు చేశారు?

భారత రాజ్యాంగం అవుల్లోకి వచ్చిన 50 ఏళ్ల తర్వాత దాని పనితీరును సమీక్షించేందుకు 2000 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం.. భారత వూజీ ప్రధాన న్యాయువుూర్తి ఎం.ఎస్. వెంకటాచలయ్యు అధ్యక్షతన ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ 2002లో తన నివేదికను సమర్పించింది. దాదాపు 200 సిఫార్సులు చేసింది. ఈ కమిషన్ వెల్లడించిన అభిప్రాయూలు పౌర సవూజ మేథోవుధనానికి దారి తీసింది. సవుకాలీన, భవిష్యత్ పాలనా వ్యవస్థ మీద ఈ సిఫార్సుల ప్రభావం ఎంతో ఉంటుంది.

ఈ కమిషన్ చేసిన ప్రధాన సిఫార్సులు:

ప్రాథమిక హక్కులు:
పత్రికా స్వాతంత్య్రం, సవూచార స్వాతంత్య్రం, గ్రామీణ ప్రజలకు ఏడాదిలో కనీసం 80 రోజుల ఉపాధి, పర్యావరణ పరిరక్షణ, ప్రాథమిక విద్య మెుదలైన వాటిని రాజ్యాంగంలో చేర్చటం. ఈ ప్రకారం.. రాజ్యాంగ సవరణ (21ఎ) ద్వారా విద్యా హక్కును చేర్చడం, వుహాత్మాగాంధీ జాతీయు గ్రామీణ ఉపాధి పథకం ద్వారా సంవత్సరానికి 100 రోజుల ఉపాధి కల్పనకు చట్ట భద్రత కల్పించడం హర్షించదగ్గపరిణావూలు.

ఆదేశ సూత్రాలు:
ఉపాధి అవకాశాల పెంపు కోసం సవుగ్ర ప్రణాళిక, ప్రతి ఐదేళ్లకోసారి జాతీయు విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేయుడం, వుత సావురస్యాన్ని పెంపొందించడం, కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశ సూత్రాలను అవులు చేస్తున్న తీరును సమీక్షించడానికి యుంత్రాంగాన్ని ఏర్పాటు చేయుడం.. ఆదేశ సూత్రాలకు సంబంధించిన సిఫార్సులు. ఈ నేపథ్యంలో ఉపాధి అవకాశాల పెంపుదలకు కేంద్రం చొరవ తీసుకుంటోంది. అదేవిధంగా విద్యారంగంలో ప్రవూణాలు పెంచేందుకు ఇప్పటికే కొన్ని చర్యలు చేపట్టింది.

ప్రాథమిక విధులు:
ఎన్నికల్లో ఓటు వేయుడం నిర్బంధం చేయుడం; నిజాయుతీగా పన్నులు చెల్లించడం; ప్రజాస్వావ్యు ప్రక్రియులో చురుగ్గా పాల్గొనడం. ఇప్పటికే గుజరాత్ ప్రభుత్వం స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో ఓటు వేయుడం నిర్బంధం చేసింది.

ఎన్నికల ప్రవృత్తి:
ప్రతి ఓటరుకు గుర్తింపు కార్డు; అన్ని రాజకీయు పక్షాలకు సవరించిన ఓటర్ల లిస్టు సరఫరా; ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానం; పోటీ నుంచి నేరస్థులను నిరోధించడం; ఎన్నికల ఖర్చులను ప్రభుత్వం భరించడం; వుంత్రి వుండలి సభ్యుల సంఖ్య దిగువ సభ సభ్యుల సంఖ్యలో పది శాతానికి పరిమితం చేయుడం; ప్రధానవుంత్రి, లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌లతో కూడిన కమిటీ సిఫార్సుల మేరకు ఎన్నికల కమిషన్ సభ్యులను నియుమించడం.

వీటి ప్రకారం దేశవ్యాప్తంగా ఓటర్లందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానాన్ని అన్ని స్థారుుల్లో అవులుచేసి, ఎన్నికల్లో ప్రవేశపెట్టారు. వుంత్రి వుండలి సభ్యులను దిగువ సభ సభ్యుల సంఖ్యలో 15 శాతానికి పరిమితం చేస్తూ చట్టం చేశారు. ఇది అవుల్లోకి వచ్చింది.

న్యాయు వ్యవస్థ:
జాతీయు కమిషన్‌ను ఏర్పాటు చేయూలి. తద్వారా న్యాయు వ్యవస్థకు జవాబుదారీతనం కల్పించాలి. న్యాయువుూర్తుల పదవీ విరవుణ వయుస్సు పెంచాలి. ఈ మేరకు పార్లమెంటులో బిల్లులను ప్రవేశ పెట్టారు.

కార్యనిర్వాహక వర్గం:
ఉద్యోగుల నియూవుకం, బదిలీ, పదోన్నతి వంటి అంశాలను స్వతంత్య్ర పత్రిపత్తి కలిగిన సివిల్ సర్వీస్ బోర్డుకు అప్పగించాలి. సావూజిక తనిఖీకి ప్రాధాన్యత ఇవ్వాలి. లోక్‌పాల్ వ్యవస్థ ఏర్పాటు చేయూలి. జాతీయు గ్రామీణ ఉపాధి పథకం అవులు సావూజిక తనిఖీ ద్వారా పటిష్టంగా నిర్వహిస్తున్నారు.

పార్లమెంట్, రాష్ట్ర శాసన సభలు:
పార్లమెంట్, శాసన సభ సవూవేశాలను వురిన్ని రోజులు నిర్వహించడం, ఎంపీ, ఎమ్మెల్యేలకు ఇచ్చే నియోజక వర్గ అభివృద్ధి గ్రాంటును రద్దు చేయుడం, అంతర్జాతీయు ఒప్పందాలను పార్లమెంట్ ఆమోదించడం. దురదృష్టవశాత్తూ ఈ సూచనలకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చొరవ చూపలేదు.

కేంద్ర - రాష్ట్ర సంబంధాలు:
గవర్నర్ నియూవుక ప్రక్రియులో సర్కారియూ కమిషన్ సిఫార్సుల అవులు. 356 ప్రకరణను తప్పనిసరి పరిస్థితుల్లో వూత్రమే వినియోగించడం, ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ అంశాల్లో ఏడో షెడ్యూల్‌లో చేర్చడం. గవర్నర్ నియూవుక ప్రక్రియులో సర్కారియూ కమిషన్ సిఫార్సులను దాదాపు పాటిస్తున్నారు. ఇటీవల కాలంలో 356 ప్రకరణ దుర్వినియోగం చాలావరకు తగ్గిందని చెప్పొచ్చు.

మెుత్తంమీద రాజ్యాంగ పనితీరును సమీక్షించడానికి నియుమించిన కమిషన్ సిఫార్సులు ప్రస్తుత పాలనా వ్యవస్థకు స్ఫూర్తినిస్తున్నాయుని చెప్పడంలో సందేహం లేదు.

సంకీర్ణ ప్రభుత్వ నేపథ్యంలో సవూజ వ్యవస్థలో సంభవిస్తున్న వూర్పులను విశ్లేషించండి?
స్వాతంత్య్రం వచ్చాక మెుదటి వుూడున్నర దశాబ్దాల్లో కేంద్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంది. రాష్ట్రాల్లో కూడా దాదాపు అదే పార్టీ అధికారాన్ని సొంతం చేసుకుంది. పేరుకు సవూఖ్య వ్యవస్థ అరుునప్పటికీ.. ఆచరణలో ఏక కేంద్ర వ్యవస్థగా వూరిందనే వివుర్శ నెలకొంది. అది వాస్తవమే.

ఆరో దశకం చివరి భాగంలో కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెసేతర ప్రభుత్వాల ఏర్పాటుతో... కేంద్ర ఆధిపత్యాన్ని ప్రశ్నించడం మెుదలైంది. ప్రాంతీయు పార్టీల ప్రాభవం పెరగడం, అవి కేంద్ర ప్రభుత్వ పెత్తందారీతనాన్నీ సవాలు చేయుడం కూడా ప్రారంభమైంది. రాజవున్నార్ కమిటీ సిఫార్సులు కేంద్ర - రాష్ట్రాల వుధ్య కొనసాగుతున్న అంతరాలను తొలగించడానికి ఉద్దేశించారుు. మెుదటిసారి 1977లో కేంద్ర స్థారుులో సంక్షేవు ప్రభుత్వం (జనతా ప్రభుత్వం) ఏర్పాటైంది.

ఎక్కువ కాలంలో అధికారంలో లేకున్నా దాని ప్రభావం ప్రస్తుత రాజకీయూలపై స్పష్టంగానే కనిపిస్తోంది. జాతీయు పార్టీలు బలహీనపడటం, ప్రాంతీయు పార్టీలు బలోపేతం కావడానికి నాంది పలికింది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఆధిపత్యాన్ని అడుగడుగునా ప్రశ్నించడం మెుదలుపెట్టారుు. 9వ దశకం నుంచి కేంద్ర స్థారుులో సంకీర్ణ ప్రభుత్వాలు కొనసాగుతున్నారుు. ఎనిమిదో దశకంలో నియుమించిన సర్కారియూ కమిషన్, 2007లో నియుమించిన పూంచి కమిషన్.. వూరిన పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర సంబంధాల పునఃపరిశీలనకు ఉద్దేశించినవి.

వురోవైపు వూరిన పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం పట్టువిడుపు ధోరణితో వ్యవహరిస్తూ సహకార సవూఖ్య దిశగా పయునిస్తోందని చెప్పొచ్చు. ప్రాంతీయు పార్టీల నాయుకులు, రాష్ట్ర వుుఖ్యవుంత్రులుగా కొనసాగుతూ.. కేంద్ర ప్రభుత్వానికి పరిమితులతో కూడిన వుద్దతిస్తూ కేంద్రాన్ని పరోక్షంగా నియుంత్రిస్తున్నారు. తొమ్మిదో దశకంలో చంద్రబాబు నాయుుడు, వుులాయుం సింగ్ యూదవ్, లాలూ ప్రసాద్ యూదవ్, జయులలిత.. ప్రస్తుతం కరుణానిధి, నితీశ్ కువూర్, నవీన్ పట్నాయుక్ వంటి వుుఖ్యవుంత్రుల ప్రభావం దేశ రాజకీయూలపై ఏమేరకు ఉందో వునకు తెలిసిందే.

అనేక సందర్భాల్లో విదేశాంగ విధానాన్ని (ఉదా: శ్రీలంక విషయుంలో భారతదేశ విదేశాంగ విధానాన్ని తమిళనాడు రాజకీయూలు ప్రభావితం చేశారుు), రక్షణ విధానాన్ని సంకీర్ణ రాజకీయూలు నిర్దేశిస్తున్నాయునేది వాస్తవం. ప్రాంతీయు పార్టీల వుుఖ్యులు కేంద్ర ప్రభుత్వంలో కీలక వుంత్రిత్వ శాఖలు పొంది తవు రాష్ట్రాలకు వురిన్ని రారుుతీలివ్వడం పరిపాటైంది. కేంద్ర ప్రభుత్వం వెనుకటి వూదిరిగా రాష్ట్రాల విషయుంలో నిక్కచ్చిగా వ్యవహరించలేకపోతోంది.

సంకీర్ణ ప్రభుత్వాల వల్ల రాజకీయు అస్థిరత, నిర్ణయు ప్రక్రియులో జాప్యం, అవులులో అనిశ్చితి తదితర ఇబ్బందులు తలెత్తినప్పటికీ... అర్థసవూఖ్య వ్యవస్థ క్రమేణా సవూఖ్య వ్యవస్థవైపు పయునించడానికి, కేంద్ర రాష్ట్రాల వుధ్య సవుతౌల్యత సాధించడానికి సంకీర్ణ ప్రభుత్వాలు, రాజకీయూలు దోహదం చేస్తాయుని చెప్పొచ్చు.

డా॥
సీనియర్ సివిల్స్ ఫ్యాకల్టీ
ఆర్.సి. రెడ్డి స్టడీ సర్కిల్

No comments:

Post a Comment