కొడాలి భవానీ శంకర్
సంవత్సరాల తరబడి చదివితేనే గానీ గ్రూప్-1 మెయిన్స్‌లో విజయం దక్కదనే విశ్వాసం చాలామంది అభ్యర్థుల్లో ఉంది. ఇది కేవలం అపోహే! కాలాన్ని ప్రణాళికాయుతంగా వినియోగించుకోవటమే విజయ రహస్యం. ఇప్పుడున్న సమయం 4 - 5 నెలలు అనుకుంటే... పోటీ పడుతున్న ప్రతి అభ్యర్థీ వ్యూహాత్మకంగా ఎలా సంసిద్ధమవ్వాలో తెలుసుకుందాం!ప్రిలిమినరీ ఫలితాల్లో గ్రూప్-1ని సీరియస్‌గా తీసుకోని చాలామంది తాజా అభ్యర్థులు ఎంపికయ్యారు. దీంతో ఫలితాలకూ మెయిన్స్‌కూ మధ్య తగినంత సమయం దొరకటంతో మెయిన్స్ రాసేందుకు సమాయత్తమవుతున్నారు.
* ఒక ప్రామాణిక మెటీరియల్‌కి పరిమితం కావాలి.
* అధ్యాయాలవారీగా ప్రామాణిక మెటీరియల్‌ను నిర్థారించుకుని చదవాలి.
* వీలైతే రైటింగ్ ప్రాక్టీసుకు సమయం కేటాయించాలి.
* ప్రతి విషయాన్నీ ప్రశ్నలవారీగా కాకుండా 'విషయాన్ని' అర్థం చేసుకుంటూ చదవాలి.
* 'చాయిస్'గా వదిలేయదగ్గ అంశాలను ప్రిపరేషన్ జాబితా నుంచి తొలగించాలి.
మూడో నెలలో...: మొదట చదివిన మెటీరియల్‌లో సంతృప్తి దొరకని పాఠ్యాంశాల్లో ఇతర మెటీరియల్ సమాచారం ద్వారా సంతృప్తిని పొందేందుకు ప్రయత్నించాలి.
* ప్రతి పాఠ్యాంశంలో గతంలో వచ్చిన ప్రశ్నలు, రాదగిన ప్రశ్నలు పరిశీలించుకోవాలి.
* ప్రశ్నల ఆధారంగా పాఠ్యాంశాలను మరోసారి చదవాలి.
నాలుగో నెలలో...: మొదటి మూడు నెలల్లో వచ్చిన అనుభవాల్ని బట్టి పాఠ్యాంశాల్లో బలంగా ఎక్కడున్నారో, బలహీనంగా ఎక్కడున్నారో నిర్ణయించుకోవాలి. బలహీనంగా ఉన్న అంశాలపై దృష్టి బాగా నిలపాలి.
* పట్టు ఉన్న అంశాలపై ప్రశ్నలకు సమాధానాలు రాస్తే సరిపోతుంది.
* బలహీనంగా ఉన్నవాటిని మరొక్కసారి అధ్యయనం చేయాలి. బలహీనత ఎక్కడుందో కనిపెడితే సరిపోతుంది.
ఐదో నెలలో...: ఈ దశలో పునశ్చరణ (రివిజన్) పూర్తయిందని భావిస్తూ సబ్జెక్టులవారీగా వివిధ పాఠ్యాంశాల అనుసంధానాలపై దృష్టి నిలపాలి. సమగ్రదృష్టిని పెంచుకోవాలి.
* గతంలో 'పట్టు' ఉన్నవని వదిలిపెట్టిన అంశాలను స్థూలంగా మరొక్కసారి పరిశీలించాలి.
* నిర్దిష్ట సమయంలో ప్రశ్నలకు జవాబులు రాస్తూ భావ వ్యక్తీకరణ గమనించుకోవాలి.
బృంద చర్చల్లో పాల్గొనండి: మీలాగా సిద్ధమౌతున్న ఇద్దరు ముగ్గురు అభ్యర్థులతో అంశాలవారీ చర్చల్లో పాల్గొనండి. వీటిలో నిజాయతీగా వ్యవహరించాలి. 'అవతలి వ్యక్తులు లబ్ధి పొందుతారేమో' అనే సంకుచిత ధోరణి విడనాడి మీ భావాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయండి. అందువల్ల పరస్పర ప్రయోజనం పొందుతారు. వ్యక్తీకరించిన భావాల్లో సమంజసనీయం ఏవో, అర్థరహితమైనవి ఏవో గ్రహించటం ద్వారా ప్రెజెంటేషన్‌కు కావలసిన శక్తి సమకూరుతుంటుంది. సమయ నిర్వహణ కీలకం ప్రస్తుత మెయిన్స్‌లో సమయ నిర్వహణ ప్రధానమైన సవాలని అభ్యర్థులు గుర్తించాలి. 1 మార్కు నుంచి 10 మార్కుల వరకూ వివిధ రకాల వెయిటేజిలున్న ప్రశ్నలకు ఆస్కారముంది. సమాచారం ఎక్కువుందని అవసరానికి మించి రాస్తే ప్రయోజనం ఉండదు. మార్కులను బట్టి సమయం కేటాయించుకుని, దాన్ని పక్కాగా అమలుచేసే ప్రణాళికకు సిద్ధపడాలి. అందుకోసం ఇప్పటినుంచే నిర్దిష్ట సమయంలో సమాధానాలు రాసే పద్ధతిని అనుసరించాలి. నమూనా సమాధానాల మూల్యాంకనం: ఆ సమాధానాలను మూల్యాంకనం చేయటం ద్వారా తప్పొప్పులు తెలుసుకునే అవకాశముంది. దీనికి సీనియర్ లెక్చరర్ల సహకారం తీసుకోవచ్చు. అయితే వీరిలో చాలామంది పోటీ పరీక్షల ధోరణికి భిన్నమైన 'అకడమిక్ ధోరణి'తో ఉండే ప్రమాదముంది. అందుకని ఇటీవల గ్రూప్స్ పరీక్షల్లో విజయం సాధించిన అభ్యర్థుల సహకారం పొందటం మెరుగు. సివిల్స్‌కు సిద్ధమవుతున్న అభ్యర్థులను కూడా సంప్రదించవచ్చు. సివిల్స్ జీఎస్ ప్రశ్నలు: సీనియర్ అభ్యర్థులకు ప్రిపరేషన్ పూర్తయింది కాబట్టి సివిల్స్ జనరల్‌స్టడీస్ మెయిన్స్ ప్రశ్నపత్రాలను పరిశీలించటం ప్రయోజనకరం. ఆ తరహా ప్రశ్నలు వస్తే సమాధానాలు ఎలా రాయాలో నిర్ణయించుకుంటే సరైన దిశలో పయనించినట్టే. విహంగ వీక్షణమూ ముఖ్యమే ఎలాగూ ప్రిపరేషన్ ముగిసి పునశ్చరణ దశలో ఉన్నారు కాబట్టి సిలబస్ అంశాలకే పరిమితం కాకూడదు. సిలబస్‌తో ముడిపడిన వర్తమానాంశాలు, ఆయా సబ్జెక్టుల్లో నూతన ధోరణులు మొదలైనవాటిపై కూడా సమయం వెచ్చించండి. ఇలా సిలబస్ అంశాలకు అదనపు సమాచారం జోడించి మార్కులు కొల్లగొట్టవచ్చు. పాఠ్యాంశాలపై, సబ్జెక్టులపై స్థూల అవగాహన పెంచుకునేందుకు కూడా ఇది అనువైన సమయం. అలా చేస్తే సమగ్ర అవగాహనతో కూడిన సమాధానాలు రాసే అవకాశం ఉంటుంది. నేరుగా ప్రశ్నలకే ప్రిపేరవకుండా ఇలా చేసే విహంగ వీక్షణం పరీక్షలో ఎంతో మేలు చేకూరుస్తుంది. |
No comments:
Post a Comment