ఇయర్ రౌండప్ -2010 స్పెషల్ *************************************************** | ||||||||||||||
| ||||||||||||||
వరల్డ్ ఇన్ 2010 జనవరి మరో రెండు రోజులు.. కొత్త సంవత్సరంలో కాలు పెట్టడానికి.. పాత సంవత్సరానికి వీడ్కోలు పలకడానికి.. కాల గమనంలో ఉత్సాహంగా, ఉరకలేస్తూ వచ్చిన 2010.. ఎన్నో సంచలనాలు.. మరెన్నో విశేషాలకు నెలవైంది.. ఏళ్ల నిర్బంధం నుంచి ఆంగ్‌సాన్ సూకీకి విముక్తి.. అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత పర్యటన.. చిన్నారుల కోసం విద్యా హక్కు చట్టం.. మహిళా రిజర్వేషన్ బిల్లు.. ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ తార సైనా నెహ్వాల్ రికార్డులు.. మారిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ తీరు.. మార్పుల దిశగా పయనిస్తున్న పోటీ పరీక్షలు.. ఇలా ఎన్నో మార్పులకు చిరునామా 2010.. ఇవన్నీ విద్యార్థులు, పోటీ పరీక్షార్థులకు ప్రధానమే. అంతరిక్షం నుంచి ఆటల వరకు ప్రతి అంశమూ ప్రశ్నార్హమే. అందుకే మీకోసం ఇయర్ రౌండప్ -2010 స్పెషల్ మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమ నేత సూకీ విడుదల భారత ఉపరాష్టప్రతి హమీద్ అన్సారీ జాంబియాలో పర్యటించారు. ఆ దేశాధ్యక్షుడు రుపియా బెజాని బందా, ఉపాధ్యక్షుడు జార్జి కుందాలతో భేటీ అయ్యారు. భారత్ ఆ దేశానికి *596 కోట్ల రుణాన్ని ప్రకటించింది. {Mొయేషియా నూతన అధ్యక్షుడిగా ప్రతిపక్ష సోషల్ డెమోక్రాట్ పార్టీ నేత ఇవో జోసి పోలిక్ ఎన్నికయ్యారు. కాలుష్య నియంత్రణ, సహజ వనరుల యాజమాన్యానికి సంబంధించిన (Environmental Performance Index) సూచి-2010లో భారత్ 123వ ర్యాంకులో నిలిచింది. ఐస్‌లాండ్‌కు మొదటి స్థానం. ఫిబ్రవరి లాటిన్ అమెరికా దేశం కోస్టారికా తొలి మహిళా అధ్యక్షురాలిగా లారా చిన్‌చిల్లా ఎన్నికయ్యారు. ఉక్రెయిన్ అధ్యక్షుడిగా ప్రతిపక్షనేత విక్టర్ యనుకోవచ్ ఎన్నికయ్యారు. శ్రీలంకలో మానవ హక్కుల ఉల్లంఘన కారణంగా యూరోపియన్ యూనియన్ శ్రీలంకకు ఇచ్చే ప్రిపరెన్షియల్ ట్రేడ్ బెనిఫిట్స్‌ని తాత్కాలికంగా నిలిపి వేసింది. అంతర్జాతీయ అణు శక్తి సంస్థ(ఐఏఈఏ)తో భారత్ కుదుర్చుకున్న పౌర అణు రియాక్టర్‌ల రక్షణకు సంబం ధించిన ఒప్పందం అమల్లోకి రానుందని అమెరికా అధ్య క్షుడు బరాక్ ఒబామా తెలిపారు. మార్చి {పపంచంలో మరణశిక్ష అమలు చేస్తున్న దేశాల్లో చైనా ముందుందని మార్చి 30న విడుదలైన అమ్నెస్టి ఇంటర్నేషనల్ నివేదిక పేర్కొంది. ఈ జాబితాలో ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, అమెరికా కూడా ఉన్నాయి. చైనా ప్రభుత్వం టిబెట్‌కు 11వ పంచన్‌లామాగా ‘గ్యాయిన్ కాయిన్ నోర్బు’ను నియమించింది. ఇతనికి టిబె ట్ బౌద్ద సన్యాసులలో రెండో ముఖ్యవ్యక్తిగా గుర్తింపు. ఏప్రిల్ బ్యాంకాక్‌లోని థాయిలాండ్ పార్లమెంట్‌ను ‘రెడ్‌షర్ట్స్’ కార్యకర్తలు ముట్టడించడంతో ఏప్రిల్ 7న దేశంలో ప్రధానమంత్రి అభిజిత్ వెజ్జజీవా ఎవుర్జెన్సీ ప్రకటించారు. పదేళ్లపాటు అవుల్లో ఉండే వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు ఒబామా, రష్యా అధ్యక్షుడు మెద్వెదేవ్‌లు ఏప్రిల్ 8న చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్‌లో సంతకం చేశారు. 1991 స్టార్ట్ (వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం) స్థానంలో ప్రస్తుత ఒప్పందం కొనసాగుతుంది. పోలండ్ అధ్యక్షుడు లెచ్ కజిన్‌స్కీ(60) ఏప్రిల్ 10న పశ్చిమ రష్యాలోని స్మాలెన్స్క్ నగరంలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. కజిన్‌స్కీ భార్య మారియా, తో పాటు మొత్తం 97 మంది మరణించారు. {పపంచంలోని ఎత్తయిన పర్వతం మౌంట్ ఎవరెస్ట్ సమీపంలో చైనా ఒక కొత్త విమానాశ్రయాన్ని నిర్మించబోతుంది. దీనికి ‘పీస్ ఎయిర్‌పోర్టు’ అని పేరు పెట్టింది. ‘బోన్‌జోర్ ఇండియా’ పేరుతో ఏడాది పాటు సాగే భారత కళలు, సంప్రదాయాల పండుగ పారిస్‌లో ప్రారంభం. భారత్, చైనా, నేపాల్ సరిహద్దులను కలిపే కైలాస్ పర్వత ప్రాంత రక్షణకు ఈ మూడు దేశాలూ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటె గ్రేటెడ్ మౌంటేన్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో ట్రాన్స్ బౌండరీ ప్రాజెక్టును చేపట్టాయి. మే ముస్లిం మహిళలు బుర్ఖా ధరించడాన్ని బెల్జియుం ప్రభుత్వం నిషేధించింది. యూరప్ దేశాల్లో బుర్ఖాపై నిషేధం విధించిన తొలి దేశం బెల్జియం. {బిటన్ కొత్త ప్రధానిగా కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు డేవిడ్ కామెరాన్, ఉప ప్రధానిగా లిబరల్ డెమోక్రట్‌నేత నిక్‌క్లెగ్ మే 12న ప్రమాణ స్వీకారం. 43 ఏళ్ల కామెరాన్ 1812 తర్వాత అతి పిన్న ప్రధాన మంత్రి. ముస్లిం మహిళలు బుర్ఖా ధరించడంపై నిషేధానికి ఫ్రెంచ్ కేబినెట్ మే 19న ఆమోదం తెల్పింది. లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్, భూటాన్ పర్యటన సందర్భంగా భారత్, భూటాన్ మధ్య స్నేహ బంధాల బలోపేతం దిశగా పార్లమెంటరీ ఫ్రెండ్‌షిప్ గ్రూప్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. భూటాన్ పార్లమెంట్‌లో మాట్లాడిన మొదటి లోక్‌సభ స్పీకర్‌గా ఆమె రికార్డు సృష్టించారు. చైనాలోని లుయోయాంగ్ పట్టణంలోని భారత శైలిలోని దేవాలయాన్ని భారత రాష్టప్రతి ప్రతిభాపాటిల్ భారత్- చైనా ప్రజల స్నేహానికి గుర్తుగా అంకితమిచ్చారు. జూన్ {sినిడాడ్-టొబాగో తొలి మహిళ ప్రధానిగా భారత సంతతికి చెందిన కమల ప్రసాద్ విశ్వేశ్వర్ ఎన్నికయ్యారు. ఈ దేశంలో భారత సంతతి జనాభా 44 శాతం. జపాన్ కొత్త ప్రధానమంత్రిగా డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ జపాన్ (డీపీజే)నేత నవోతోకాన్ ఎన్నికయ్యారు. భారత రాష్టప్రతి ప్రతిభాపాటిల్ చైనాలో పర్యటించి, ఆ దేశాధ్యక్షుడు హు జింటావోతో చర్చలు జరిపారు. వైమానికరంగ సిబ్బందికి వీసా విధానాలు, సివిల్ సర్వీసులు, క్రీడల రంగంలో సహకారం వంటి అంశాలపై ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. దశాబ్దంగా భారత రాష్టప్రతి చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి. జర్మనీ అధ్యక్షుడు హోస్ట్ కోలర్ తన పదవికి రాజీనామా చేశారు. ఆఫ్ఘానిస్థాన్ యుద్ధంలో జర్మనీ ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉన్నాయంటూ కోలర్ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీయటంతో రాజీనామా చేశారు. వివాదాస్పద అణు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఐక్యరాజ్యసమితి ఇరాన్‌పై ఆంక్షలు విధించింది. దీనికోసం నిర్వహించిన ఓటింగ్‌లో భద్రతా మండలిలోని 15 మంది సభ్యుల్లో 12 మంది అనుకూలంగా, ఇద్దరు వ్యతిరేకంగా ఓటు వేశారు. లెబనాన్ గైర్హాజరైంది. హవాయ్ దీవులలోని మౌనకియ పర్వతంపై నెలకొల్పనున్న అత్యాధునికమైన 30 మీటర్ల టెలిస్కోప్ ప్రాజెక్టులో భారత్ కూడా భాగస్వామిగా చేరింది. అమెరికా జియోలాజికల్ సర్వే డిపార్ట్‌మెంట్ ఆఫ్ఘానిస్థాన్‌లో ఒక ట్రిలియన్ డాలర్ల విలువ చేసే ఖనిజాలున్నట్లు నిర్ధారించింది. ఫ్రాన్స్‌లోని ఇస్‌స్ట్రీస్ ఎయిర్‌బేస్‌లో గరుడ 2010 పేరుతో భారత, ఫ్రాన్స్, సింగపూర్ దేశాల వైమానిక దళాలు ఉమ్మడి విన్యాసాలను నిర్వహించాయి. జూలై ఆస్ట్రేలియా తొలి మహిళ ప్రధానిగా జూలియా గిల్లార్డో ఎన్నికయ్యారు. కిర్గిజిస్థాన్ తొలి మహిళాధ్యక్షురాలిగా రోసా ఒంటుబయోవా ప్రమాణ స్వీకారం చేశారు. ఫిలిప్పీన్స్ నూతన అధ్యక్షుడిగా బెనినో సిమియోన్ అక్వినో ప్రమాణ స్వీకారం చేశారు.ఆయన తల్లి కొరజాన్ అక్వినో గతంలో దేశాధ్యక్షురాలిగా వ్యవహరించారు. భారత ప్రధాని మన్మోహన్ సింగ్ కెనడా పర్యటనలో ఇరు దేశాలమధ్య పౌర అణు సహకార ఒప్పందం కుదిరింది. 1974 ఫోఖ్రాన్ అణు పరీక్షల తర్వాత కెనడా భారత్‌కు అణు సహకారం నిలిపివేసింది. 2008లో అణు సరఫరా దేశాల గ్రూపు నిషేధం ఎత్తివేసిన తర్వాత భారత్‌తో ఇలాంటి ఒప్పందం చేసుకున్న 9వ దేశం కెనడా. పోలండ్ అధ్యక్ష ఎన్నికల్లో సివిక్ ప్లాట్‌ఫాం పార్టీకి చెందిన బ్రొనిన్‌స్లావ్ కొమరోవ్‌స్కీ విజయం. రష్యా, కజికిస్థాన్, బెలారస్‌లు కస్టమ్స్ యూనియన్ ప్రారంభించాయి. విమాన ప్రమాదాలను విశ్లేషించే ‘బ్లాక్‌బాక్స్’ సృష్టికర్త డేవిడ్ వారెన్ (85) ఆస్ట్రేలియాలో మరణించారు. 1956 లో తొలిసారి నమూనా బ్లాక్‌బాక్స్‌ను రూపొందించారు. కొసావో ఏక పక్షంగా స్వాతంత్య్రం ప్రకటించుకోవడం అంతర్జాతీయ చట్టానికి వ్యతిరేకం కాదని అంతర్జాతీయ న్యాయ స్థానం (ఐసీజే) ప్రకటించింది. 2008లో సెర్బి యా నుంచి కొసావో స్వాతంత్య్రం ప్రకటించుకుంది. ఉగ్రవాద నిర్మూలనకు మరింత సహకారం కోసం భారత్-అమెరికాలు ‘కౌంటర్ టెరర్రిజం కో ఆపరేషన్ ఇనిషియేటివ్’ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. 2009లో భారత ప్రధాని మన్మోహన్ సింగ్ అమెరికా పర్యటనలో కుదిరిన అవగాహన మేరకు ఈ ఒప్పందం కుదిరింది. అర్జెంటినా దేశం స్వలింగ వివాహాలకు అనుమతిస్తూ చట్టం చేసింది. దీంతో లాటిన్ అమెరికా దేశాల్లో ఇలాంటి చట్టం చేసిన మొదటి దేశంగా అవతరించింది. ఆగస్టు పరిశుద్ధ తాగునీరు, పారిశుద్ధ్యం మానవ హక్కుగా పేర్కొంటూ ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని ఆమోదించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పారిశుద్ధ్యం అందుబాటులో లేని కారణంగా ప్రతి ఏటా 1.5 మిలియన్ల మంది పిల్లలు మరణిస్తున్నారు. ‘వాంగార్డ్-2010’ పేరిట చైనా వారం రోజులు సైనిక విన్యాసాలు నిర్వహించింది. ఆరో సజీవ బుద్ధునిగా టిబెట్‌కు చెందిన ఐదేళ్ల లపాంగ్ దోజే టిబెట్‌లో ఆగస్ట్ 2న సింహాసనం అధిష్టించారు. లపాంగ్‌కు దెజాద్ జమియూంగ్ షెరాబ్ అని నావుకరణం చేశారు. ఐదో సజీవ బుద్ధుడు దెజాద్ 2000 వూర్చిలో వురణించారు. దక్షిణ కొరియూ ప్రధానిగా కిమ్ తెహోను అధ్యక్షుడు లీయుంగ్‌బాగ్ ఆగస్ట్ 8న నియుమించారు. సెప్టెంబర్ మహిళా సాధికారత, లింగ సమానత్వం కోసం ఐక్యరాజ్య సమితి ప్రకటించిన కొత్త సంస్థ ‘యూఎన్ ఉమెన్’ కు చిలీ వూజీ అధ్యక్షురాలు మిచెల్లె బాచ్‌లెట్ అధ్యక్షత (డిప్యూటీ సెక్రటరీ జనరల్ హోదాలో) వహిస్తారని ఐరాస జనరల్ సెక్రటరీ బాన్ కీ వుూన్ ప్రకటించారు. ఈ సంస్థ యుూనిసెఫ్ హోదా పొంది 2011 జనవరి 1 నుంచి ప్రారంభమౌతుంది. అక్టోబర్ పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ‘ఆల్ పాకిస్థాన్ ముస్లీం లీగ్’ అనే కొత్త పార్టీని అక్టోబర్ 1న ప్రకటించారు. లండన్‌లో ఉంటున్న ముషారఫ్ 2001-08 కాలంలో పాక్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. నవంబర్ {sాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన 2010 కరప్షన్ ఇండెక్స్ రిపోర్ట్‌లో భారత్ 3.3 స్కోర్‌తో 87వ స్థానంలో నిలిచింది. గతేడాది భారత్ స్థానం 84. డెన్మార్క్‌కు మొదటి స్థానం దక్కింది. న్యూజిలాండ్, సింగపూర్‌లు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. {బెజిల్ తొలి మహిళా అధ్యక్షురాలిగా అధికార వర్కర్స్ పార్టీ ప్రతినిధిదిల్మా వానా రోసెఫ్ (62) ఎన్నికయ్యారు. మాజీ మార్కిస్ట్ గెరిల్లాగా పని చేసిన దిల్మా సైనిక నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడి జైలు శిక్షకూడా అనుభవించారు. ద క్షిణ కరోలినా (అమెరికా) రాష్ట్రానికి గవర్నర్‌గా భారత్ సంతతికి చెందిన నిక్కీ రందావా హాలే(38) ఎన్నికయ్యారు. అమెరికాలో ఈ పదవికి ఎంపికైన తొలి భారత సంతతి మహిళ-రెండో ఇండియన్ అమెరికన్. మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమ నేత ఆంగ్ సాన్ సూకీ(65)ని సైనిక ప్రభుత్వం నవంబర్ 13న విడుదల చేసింది. సూకీ గత ఏడున్నర ఏళ్లుగా గృహ నిర్బంధంలో ఉన్నారు. 20 ఏళ్ల విరామం తర్వాత నవంబర్ 7న జరిగిన మయన్మార్ ఎన్నికల్లో సైనిక జుంటా మద్దతు గల యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్‌మెంట్ పార్టీ (యూఎస్‌డీపీ) భారీ విజయం సాధించిన తర్వాత.. సూకీ విడుదల కావటం విశేషం. ఈ ఎన్నికలను సూకీకి చెందిన నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ (ఎన్‌ఎల్‌డీ) పార్టీ బహిష్కరించింది. 1991లో నోబెల్ శాంతి బహుమతి, 1992లో జవహర్‌లాల్ నెహ్రూ అవార్డు పొందిన సూకీ 1989 నుంచి 15 ఏళ్ల పాటు నిర్బంధంలోనే గడిపారు. }లంక అధ్యక్షుడిగా మహీంద్ర రాజపక్సె రెండో సారి నవంబర్ 19న ప్రమాణస్వీకారం చేశారు. 2005లో రాజపక్సె తొలిసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. టెరర్రిజం రిస్క్ ఇండెక్స్ ర్యాంకుల ప్రకారం భారతదేశం 15వ స్థానంలో, సోమాలియా మొదటి స్థానంలో ఉంది. ఐక్యరాజ్యసమితి పరిధిలో పరిష్కారం కాని సమస్యల జాబితా నుంచి జమ్మూ కాశ్మీర్‌ను తొలగించారు. భారత సంతతికి చెందిన స్వరాజ్‌పాల్ (లేబర్‌పార్టీ) బ్రిటన్ పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ లార్‌డ (ఎగువసభ) డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగింపు. యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్‌లో భారత్ రాష్టప్రతి ప్రతిభా పాటిల్ ఐదురోజుల పర్యటనలో సిరియాను సందర్శిం చారు. ఈ సందర్భంగా దూరదర్శన్, సిరియన్ నేషనల్ బ్రాడ్‌కాస్టర్స్‌కు మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. {పపంచంలోనే అతిపెద్ద చిత్ర పరిశ్రమలు హాలీవుడ్, బాలీవుడ్‌ల మధ్య ఒప్పందం కుదిరింది. సిటీ ఆఫ్ లాస్ ఏంజెల్స్, భారతీయ చిత్ర పరిశ్రమల పరస్పర సహ కారం, వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. డిసెంబర్ ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలని కోరుతూ అమెరికా ప్రతినిధుల సభలో సభ్యుడు గున్ బిలిరాకిన్ నవంబర్ 22న తీర్మానం ప్రవేశ పెట్టారు. ఇందుకోసం ఐరాస చార్టర్‌లోని ఆర్టికల్ 23ను సవరించాలని తీర్మానం కోరింది. అణు ఇంధన బ్యాంకు ఏర్పాటుకు సంబంధించిన తీర్మానానికి అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ఆమోదం. రష్యాతో కుదిరిన కొత్త వ్యూహాత్మక ఆయుుధాల నియుంత్రణ ఒప్పందానికి (స్టార్ట్) అమెరికా సెనేట్ డిసెంబర్ 23న, రష్యా పార్లమెంట్ డిసెంబర్ 24న ఆమోదం. బెలారస్ కొత్త అధ్యక్షుడిగా లూకాషెంకో తిరిగి ఎన్నికయ్యారు. ************************************************************ జాతీయం జపాన్ ప్రధాని యుకియో హతోయమా భారత్‌లో పర్యటించారు. ప్రధాని మన్మోహన్ సింగ్‌తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(సీఈపీఏ) వంటి అంశాలపై చర్చించారు. దేశంలో సౌర విద్యుత్‌లో 20వేల మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఏర్పాటుకు ఉద్దేశించిన సోలార్ ఇండియా (జవహర్‌లాల్ నెహ్రూ సోలార్ మిషన్) పథకాన్ని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ప్రారంభించారు. ఈ సహస్రాబ్దిలోనే అతి సుదీర్ఘ కంకణ సూర్యగ్రహణం జనవరి 15న సంభవించింది. ఉదయం 11.14 గంటలకు మొదలైన ఈ ఖగోళ విన్యాసం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. తమిళనాడులోని ధనుష్కోటి, రామేశ్వరం, కన్యాకుమారిలో సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది. రామేశ్వరంలో అత్యధికంగా 10 నిమిషాల ఎనిమిది సెకన్లపాటు గ్రహణం ఏర్పడింది. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్‌హసీనా భారత్‌లో పర్యటించారు. ఇరు దేశాల మధ్య ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేరాలు, విద్యుత్ రంగంలో సహకారం, ఖైదీల పరస్పర బదిలీ వంటి పలు అంశాలపై ఒప్పందాలు కుదిరాయి. ఈ సందర్భంగా బంగ్లాదేశ్‌కు 100 కోట్ల డాలర్ల (*4,575 కోట్లు) రుణాన్ని భారత్ ప్రకటించింది. గంగానది డాల్ఫిన్ (ఎ్చజ్ఛట టజీఠ్ఛిట ఛీౌఞజిజీ)ను జాతీయ ఆక్వాటిక్ యానిమల్‌గా కేంద్రం ప్రకటించింది. 2008, అక్టోబర్ 5న జరిగిన గంగా రివర్ బేసిన్ అథారిటీ మొదటి సమావేశంలో డాల్ఫిన్‌ను ఆక్వాటిక్ యానిమల్‌గా ప్రకటించాలనే నిర్ణయం తీసుకున్నారు. ‘క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(సవరణ) చట్టం-2008’ డిసెంబర్ 31, 2009 నుంచి అమల్లోకి వచ్చింది. {పపంచంలోనే అతి పెద్దదైన వుడ అడవుల జీవావరణం ‘సుందర్బన్స్’ పరిరక్షణ కోసం *200 కోట్ల గ్రాంట్‌ను కేంద్ర పర్యావరణ వుంత్రి జై రాం రమేశ్ ప్రకటించారు. ప్రపంచ బ్యాంకు ‘ఇంటిగ్రేటెడ్ కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్ట్’ కింద ఈ గ్రాంట్ ప్రకటించారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ మయుంగ్ బక్ భారత పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య నాలుగు ఒప్పందాలు కుదిరాయి. శాంతియుత అవసరాలకోసం సివిల్ న్యూక్లియర్ సహకారానికి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో), కొరియా ఏరోస్పేస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (కేఏఆర్‌ఐ) మధ్య కుదిరిన ఒప్పందాన్ని భారత ప్రధాని మన్మోహన్ సింగ్, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీమయుంగ్‌బక్‌లు అంగీకరించారు. 2014 కల్లా ఇరుదేశాల ద్వైపాక్షిక వాణిజ్యం 30 బిలియన్ డాలర్లకు పెంచేందుకు లక్ష్యాన్ని పెట్టుకున్నారు. రాజకీ య, భద్రతాపర సహకారాలను మరింత పెంచేందుకు కూడా వారు అంగీకరించారు. ఫిబ్రవరి కర్ణాటకలోని హంపిలో విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయల 500వ పట్టాభిషేక మహోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ‘హంపి ది స్పైండర్ దట్ వాజ్’ ‘విజయనగర త్రూ ది ఐస్ ఆఫ్’ పుస్తకాలను కేంద్ర హోంమంత్రి పి.చిదంబరం ఆవిష్కరించారు. భారత్ ఎన్నికల కమిషన్ ఏర్పాటై జనవరి 25కి 60 ఏళ్లు నిండిన సందర్భంగా నిర్వహించిన వజ్రోత్సవాల్లో రాష్టప్రతి ప్రత్యేక పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. మేఘాలయలో ముఖ్యమంత్రి డీడీ లపాంగ్‌తో పాటు మరో ముగ్గురికి ముఖ్యమంత్రి హోదా దక్కింది. ప్రస్తుత ఉపముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడైన లింగ్డో, ప్రణాళికా బోర్డ్ చైర్మన్ దోన్‌కుపార్‌రాయ్, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి మండలి చైర్మన్ జీడీరింబైలకు సీఎం హోదా లభించింది. ముస్లింలలో వెనుకబడిన వారికి ఉద్యోగాల్లో ఓబీసీ కేటగిరీ కింద 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈనెల 8న ప్రకటించింది. కేరళలోని పరంబికులంలో దేశంలోని 38వ పులుల సంరక్షణ కేంద్రం ప్రారంభం. కేంద్ర హోం శాఖ మంత్రి పి.చిదంబరం భారత్-పాక్ సరిహద్దులోని ‘అట్టారి’ వద్ద ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్‌కు శంకుస్థాపన చేశారు. దేశంలోనే పూర్తిగా విద్యుదీకరించిన తొలి జిల్లాగా కేరళలోని పాలక్కడ్ గుర్తింపు పొందింది. {పధానమంత్రి మన్మోహన్ సింగ్ ఫిబ్రవరి 27 నుంచి సౌదీ అరేబియాలో పర్యటించారు. రెండు దేశాలు నేరస్తుల అప్పగింత; పరిశోధన, విద్య వంటి ఒప్పందాలపై సంతకాలు చేశాయి. కింగ్ సౌదీ యూనివర్సిటీ మన్మోహన్‌కు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. టర్కీ అధ్యక్షుడు అబ్దుల్లా గుల్ భారత పర్యటన సంద ర్భంగా... ఉగ్రవాద వ్యతిరేక కార్యాచరణను మరింత పటిష్ట పరిచేందుకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుది రింది. అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర సదస్సు (సీసీఐటీ)కు భారత్, టర్కీలు ఉమ్మడి ప్రకటన చేశాయి. భారత్-బ్రిటన్‌ల వుధ్య పౌరఅణు సహకార ఒప్పందం ఫిబ్రవరి11న కుదిరింది. దీని ప్రకారం భారత అణు రంగానికి సంబంధించిన పరికరాల సరఫరా కోసం బ్రిటన్ కంపెనీలకు చట్టబద్దత లభిస్తుంది. భారత్‌తో పౌర అణు ఒప్పందం చేసుకున్న దేశాల్లో బ్రిటన్ ఎనిమిదో దేశం. మార్చి ఇండియా ఏవియేషన్-2010 ప్రదర్శన హైదరాబాద్‌లో ప్రారంభం. ఇందులో 190 కంపెనీలు పాల్గొన్నాయి. వంశధార నదీ జలాలపై ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాల మధ్య నెలకొన్న వివాదం పరిష్కారానికి జస్టిస్ అగర్వాల్ చైర్మన్‌గా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని మార్చి 4న కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు రాజ్యసభ మార్చి 9న ఆమో దించింది. హాజరైన సభ్యుల్లో 191 మంది అనుకూలం గా, ఒకరు వ్యతిరేకంగా ఓటు వేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మార్చి 12న జరిపిన భారత పర్యటనలో ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. వీటిల్లో శాంతియుత ప్రయోజనాలకు అణు ఇంధన వాడకం, రష్యా అణు కేంద్రాల నిర్మాణం, విమానవాహక నౌక అడ్మిరల్ గోర్ష్‌కోవ్, మిగ్-29 కె యుద్ధ విమాన కొనుగోలు వంటివి ఉన్నాయి. నేషనల్ నాలెడ్జ్ నెట్‌వర్క్(ఎన్‌కేఎన్) ఏర్పాటుకు మార్చి 25న మౌలిక సదుపాయాల కేబినెట్ కమిటీ ఆమోదం. {పధానమంత్రి మన్మోహన్ సింగ్ తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ-సచివాలయ నూతన భవన సముదాయాన్ని ప్రారంభించారు. ఇది ప్రపంచంలోనే తొలి హరిత శాసన సభ భవంతి. కేంద్ర కేబినెట్ విదేశీ విద్యాలయాల బిల్లు-2010ని ఆమోదించింది. దీని ప్రకారం విదేశీ వర్సిటీలు దేశంలో క్యాంపస్‌లను స్థాపించి, పట్టాలు అందించవచ్చు. దేశంలోని తొలి మహిళ బహిరంగ జైలును పుణేలోని యరవాడ జైలులో ప్రారంభించారు. రాజీవ్ ఆవాస్ యోజన పథకానికి సంబంధించిన విధి విధానాలను రూపొందించేందుకు దీపక్ పరేక్ నేతృత్వంలోని ఎనిమిది మంది సభ్యుల ఎక్స్‌పర్ట్ కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆరు దశాబ్దాల నాగాలాండ్ సమస్య పరిష్కారానికి నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలియమ్ జనరల్ సెక్రటరీ తుయింగలెంగ్ యుయివావా ప్రధాని మన్మోహన్ సింగ్‌తో చర్చలు జరిపారు. అమెరికా అణు ఉత్పత్తి కేంద్రాల నుంచి వెలువడే పదార్థాలను తిరిగి ఉపయోగించుకునేందుకు భారత్, అమెరికా మధ్య ఒప్పందం కుదిరింది. ఈ విధంగా రీసైకిల్ చేసిన వాటితో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారు. అమెరికా కుదుర్చుకున్న ఒప్పందాల్లో ఇది మూడోది. జపాన్, యురోపియన్‌కు చెందిన యురోటమ్‌లతో ఇంతకు మునుపే ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌లో రష్యా రియాక్టర్‌లను నిర్మించడానికి ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. తమిళనాడులోని కుందన్‌కులంలో రెండు రియాక్టర్‌లు (యూనిట్ 5, 6), పశ్చిమ బెంగాల్‌లోని హరిపూర్‌లో మరో రెండు రియాక్టర్‌లు ఏర్పాటుచేయనున్నారు. వీటిని 12వ పంచవర్షప్రణాళిక కాలంలో(2012- 2017) నిర్మిస్తారు. కొలంబో నుంచి మటారా వరకు దక్షిణ మధ్య రైల్వే మార్గం పునర్నిర్మాణానికి 67.4 మిలియన్ డాలర్లకు భారత్, శ్రీలంక మధ్య లైన్ ఆఫ్ క్రెడిట్ ఒప్పందం. ఏప్రిల్ ఏప్రిల్ 1 నుంచి విద్యా హక్కు చట్టం(ఆర్‌టిఇ) అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం 6-14 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత, నిర్భంద విద్యనందించాలి. ప్రైవేట్ విద్యా సంస్థలు ఆర్థికంగా వెనుకబడిన వారికి 25 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. ఈ చట్టం అమలును బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ (ఎన్‌సీపీసీఆర్) పర్యవేక్షిస్తుంది. 2002లో చేసిన 86వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యా హక్కును ప్రాథమిక హక్కుగా రూపొందించారు. దేశంలో మొదటిసారి స్టాండర్డ్ గేజ్ రైల్వే మార్గాన్ని ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ ఏప్రిల్ 2న ప్రారంభించింది. ఈ లైను వెడల్పు 4అడుగుల ఎనిమిదిన్నర అంగుళాలు. మేఘాలయ ముఖ్యమంత్రిగా ముకుల్ సంగ్మా ఏప్రిల్ 20న ప్రమాణ స్వీకారం చేశారు. గత రెండేళ్లలో ఈ రాష్ట్రానికి సంగ్మా నాలుగో ముఖ్యమంత్రి. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఏప్రిల్ 24న న్యూఢిల్లీలో నిర్వహించారు. ‘పంచాయతీరాజ్ ఎంపవర్‌మెంట్ అండ్ అకౌంటబిలిటీ ఇన్సెంటివ్ స్కీం’ను సమర్థంగా అమలు చేసిన కేరళ, కర్నాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, సిక్కింలకు అవార్డులు ప్రదానం చేశారు. ‘జాతీయ హరిత ట్రిబ్యునల్ ఏర్పాటు’ బిల్లుకు లోక్‌సభ ఏప్రిల్ 30న ఆమోదం. పర్యావరణ సంబంధ కేసుల సత్వర పరిష్కారానికి ఈ ట్రిబ్యునల్ ఏర్పాటు. దేశంలో ట్రిబ్యునల్‌కు నాలుగు బెంచ్‌లు ఏర్పాటు చేస్తారు. ఎం.ఎం. పూంచి నేతృత్వంలో కేంద్ర రాష్ట్ర సంబంధాల కమిటీ తన నివేదికను కేంద్ర హోం వుంత్రి చిదంబరానికి అందజేసింది. ఆచార్య వినోభాబావే భూదాన్ పోచంపల్లిలో భూదానోద్యవూన్ని ప్రారంభించి ఏప్రిల్ 18 నాటికి 59 సంవత్సరాలు నిండిన సందర్భంగా నల్గొండ జిల్లా భూదాన్ పోచంపల్లిలో ఉత్సవాలు నిర్వహించారు. {బహ్మపుత్ర నదిలోని ‘వుజుల’ దీవిని ‘ఎకో సెన్సిటివ్ జోన్’గా ప్రకటించాలని కేంద్రం నిర్ణరుుంచింది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద నదీ దీవి. దేశ ప్రజలకు 16 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్యను అందించే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ప్రాజెక్టును ‘ఆధార్’ అనే పేరుతో వ్యవహరిస్తారు. ‘ఆధార్’ లోగోను యూఐడీఏఐ చైర్మన్ నందన్ నిలేకని ఏప్రిల్ 26న ఆవిష్కరించారు. 2,600వ బుద్ధ జయంతి గుర్తుగా భారత్‌కు శ్రీలంక బోధి మొక్కను బహూకరించింది. మహా బోధి వృక్షం కిందే గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందినట్లు ప్రసిద్ధి. అనురాధపురలో ఉన్న జయ శ్రీ మహా బోధి వృక్షాన్ని పవిత్రమైనదిగా, చరిత్రాత్మకమైన బోధి వృక్షంగా పేర్కొంటారు. ప్రపంచంలోనే ఇది అత్యంత పురాతనమైన వృక్షం. భారత్, అమెరికా నావికా దళాలు మలబార్‌లో 14వ విడత యుద్ధ విన్యాసాలను నిర్వహించాయి. పదిరోజుల ఈ కార్యక్రమంలో యాంటీ సబ్‌మెరైన్ ఆపరేషన్లు, ఉప రితల కాల్పులు వంటి విన్యాసాలను ప్రదర్శించాయి. సింగపూర్ ఇండియన్ నావికా ద్వైపాక్షిక విన్యాసాలు (సిమ్‌బెక్స్) - 2010ను అండమాన్, బంగాళాఖా తంలో ఏప్రిల్ 3నుంచి 16వరకు నిర్వహించారు. మే హివూచల్‌ప్రదేశ్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్, ఇతర జడ్జిలు స్వచ్ఛందంగా తవు ఆస్తుల వివరాలు వెల్లడించారు. {పపంచంలోనే అతి ఎక్కువ పులుల సాంద్రత ఉన్న ప్రాంతం కజిరంగా నేషనల్ పార్క్ అని అసోం ప్రభుత్వం పేర్కొంది. నవంబర్ 26, 2008న ముంబై దాడులకు పాల్పడ్డ పాకిస్థాన్ ఉగ్రవాది అజ్మల్ అమిర్ కసబ్‌కు ప్రత్యేక కోర్టు మే 6న ఉరిశిక్ష విధించింది. ఐదు నేరాల్లో ఉరిశిక్ష విధించినట్టు న్యాయమూర్తి ఎంఎల్ తహిల్యానీ ప్రకటన. నదుల అనుసంధనానికి సవివరమైన ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను రూపొందించడానికి మహారాష్ట్ర, గుజరాత్‌లు మే 4న సంతకాలు చేశాయి. దామన్ గంగా-పింజల్ లింక్ ప్రా జెక్ట్, పర్-తాపి-నర్మదా లింక్ ప్రాజెక్టులకు సంబంధిం చి నివేదిక తయారు చేస్తారు. వుంగళూరు వివూనాశ్రయుంలో మే 22న జరిగిన ప్రవూదంలో 158 వుంది వురణించారు. దుబాయ్ నుంచి బయుల్దేరిన ‘ఎరుుర్ ఇండియూ ఎక్స్‌ప్రెస్ ప్లేన్ ఐఎక్స్-812’ దిగే సవుయుంలో ఈ ప్రవూదం జరిగింది. హర్యానాలోని గుర్గావ్ జిల్లాలో ‘అటానవుస్ డిఫెన్స్ యుూనివర్సిటీ’ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ నిర్ణయం. వూతా శిశు ఆరోగ్యాన్ని పెంపొందించే ఉద్దేశంతో బీహార్ రాష్ట్ర ప్రభుత్వం, మిలిందా గేట్స్ ఫౌండేషన్‌లు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారుు. గుజరాత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జాతీయ టొబాకో నియంత్రణ కార్యక్రమాన్ని బలోపేతం చేసేందుకు మూడేళ్లకు (2009-2012) బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ఐదు మిలియన్ డాలర్లను పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా(పీహెచ్‌ఎఫ్‌ఐ)కు మంజూరు చేసింది. జూన్ నేషనల్ గ్రీన్ మిషన్(జాతీయ హరిత పథకం) ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ కార్యక్రమం కింద 2020 నాటికి అడవుల విస్తీర్ణం కోటి హెక్టార్లకు పెంచుతారు. గ్రీన్‌హౌస్ వాయువులను తగ్గించేందుకు 2009లో ప్రధాని ప్రకటించిన జాతీయ కార్యాచరణ ప్రణాళికలోని ఎనిమిది మిషన్స్‌లో ఇది ఒకటి. జమ్మూ కాశ్మీర్‌లో భారత్ నిర్మిస్తున్న యూరి-2, చౌతక్ జల విద్యుత్ కేంద్రాలపై తన అభ్యంతరాలను పాక్ విరమించుకుంది. కాశ్మీర్ లోయలో జీలం నదిపై 240 మెగావాట్ల యూరి-2, జమ్మూలోని కార్గిల్ జిల్లాలో సురు నదిపై 44 మెగావాట్ల చౌతక్ ప్రాజెక్ట్‌లను భారత్ నిర్మిస్తోంది. వీటి వల్ల తమ నీటి వాట కోల్పోతామని గతంలో పాక్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా భారత పర్యటనలో ఇరు దేశాల మధ్య విమానయాన సర్వీసులు, విదేశీ- దౌత్య సేవలపై ఒప్పందాలు కుదిరారుు. కేంద్రంలో రెండోసారి అధికారం చేపట్టి ఏడాది పూర్తరుున సందర్భంగా యూపీఏ ప్రభుత్వం ‘2009-2010 ప్రజల నివేదిక’ పేరుతో 12 ప్రధాన అంశాలతో 68 పేజీల ప్రగతి నివేదిక రూపొందించింది. స్వైన్‌ఫ్లూ (హెచ్-1 ఎన్-1) వ్యాధికి దేశీయంగా జైడస్ క్యాడిలా సంస్థ తయారు చేసిన టీకా విడుదల. ఈ వ్యాధి వల్ల భారత్‌లో 1500 మంది మరణం. {పపంచ శాంతి సూచీ(గ్లోబల్ పీస్ ఇండెక్స్)-2010లో భారత్‌కు 128వ స్థానం దక్కింది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ రూపొందించిన సూచిలో న్యూజీలాండ్ వరుసగా రెండో ఏడాది ప్రథవు స్థానంలో నిలవగా, అమెరికాకు 85వ స్థానం దక్కింది. }లంక అధ్యక్షుడు మహీంద్రా రాజపక్స భారత పర్యటనలో ఇరు దేశాల మధ్య ఏడు ఒప్పందాలు కుదిరాయి. శ్రీలంక ఉత్తర, తూర్పు ప్రాంతాలకు చేసే సహాయంపై కూడా ఇరు దేశాలు అంగీకారానికి వచ్చాయి. మనుషుల అక్రమ రవాణాకు సంబంధించి అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన నివేదికలో భారత్ టైర్-2 వాచ్‌లిస్ట్‌లో నిలిచింది. టైర్-3లో సౌదీ అరేబియా, జింజాబ్వే; టెర్-1లో అభివృద్ధి చెందిన దేశాలతోపాటు కొలంబియా, నైజీరియాలు ఉన్నారుు. కర్ణాటకలోని కోలార్ జిల్లాలో రోజుకు మూడు మెగావాట్ల సౌర విద్యుదుత్పాదన శక్తితో నిర్మించిన దేశంలోనే తొలి సోలార్ ఫోటోవోల్టాయిక్ ప్రాజెక్ట్ ప్రారంభం. జాతీయ ఉన్నత విద్య, పరిశోధన కమిషన్ (ఎన్‌సీహెచ్‌ఈఆర్) ఏర్పాటుకు కేంద్ర విద్యా సలహా మండలి (సీఏబీఈ) ఆమోదం తెలిపింది. న్యూఢిల్లీలో జరిగిన సీఏబీఈ 57వ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ‘నేషనల్ అకెడమిక్ డిపాజిటరీ బిల్లు (ఎన్‌ఏడీ)’ ముసాయిదాను కూడా ఈ సమావేశం ఆమోదించింది. దేశంలో భారీగా ఉన్న పెండింగ్ కేసుల పరిష్కారం కోసం ‘నేషనల్ లిటిగేషన్ పాలసీ’ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి వీరప్ప మొయిలీ ప్రకటించారు. తమిళ భాషకు ప్రాచీన హోదా లభించిన నేపథ్యంలో.. మొట్ట మొదటి ప్రపంచ తమిళ ప్రాచీన భాష మహాసభలు తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఐదురోజులు జరిగాయి. తొలిసారి ప్రకటించిన ‘కలైంజర్ కరుణానిధి ప్రాచీన తమిళ అవార్డును’ను.. తమిళభాష పరిశోధకుడు ఆస్కో పర్పోలా(ఫిన్లాండ్)కు ప్రదానం చేశారు. జూలై {పపంచంలోనే అత్యంత ఎత్తులో హిమాలయాల్లో నిర్మిస్తున్న రోహ్‌తంగ్ సొరంగ మార్గానికి యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలికి సమీపంలో ధుండి వద్ద శంకుస్థాపన చేశారు. సముద్ర మట్టానికి 13,300 అడుగుల ఎత్తులో 8.8 కిలోమీటర్ల పొడవునా *1,700 కోట్లతో సొరంగాన్ని నిర్మిస్తున్నారు. బీహార్‌లోని రాజ్‌గిర్‌లో నలందా యూనివర్సిటీ ఏర్పాటు బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు కేబినెట్ ఆమోదించింది. 2009 అక్టోబర్‌లో థాయ్‌లాండ్‌లో జరిగిన తూర్పు ఆసియా సదస్సులో కుదిరిన ఏకాభిప్రాయం మేరకు ఈ వర్సిటీని ఏర్పాటు చేస్తున్నారు. పర్యావరణ వ్యవస్థను సమర్థంగా నిర్వహించిన తొలి పట్టణ నివాసంగా రాష్టప్రతి ఎస్టేట్ ‘ఐఎస్‌వో 14001’ గుర్తింపు పత్రాన్ని పొందింది. కేంద్ర ప్రభుత్వ అంచనాల ప్రకారం 2050 నాటికి భారత్ జనాభా విషయంలో చైనాను అధిగమించనుంది. 2050 నాటికి మన దేశ జనాభా 161.38 కోట్లకు చేరుకుంటే.. చైనా జనాభా 141 కోట్లు ఉంటుంది. {V>Ðుపంచాయుతీల్లో వుహిళలకు 50 శాతం రిజర్వేషన్ల కల్పనకు ఉద్దేశించిన 110వ రాజ్యాంగ సవరణ బిల్లు పరిశీలనకు సుమిత్రా వుహాజన్ నేతృత్వంలో స్టాండింగ్ కమిటీని పార్లమెంట్ నియుమించింది. దేశంలో తొలిసారిగా పుణే వుున్సిపాలిటీ ‘రైట్ టు ఇన్ఫర్మేషన్ (ఆర్‌టీఐ) లైబ్రరీని స్థాపించింది. ఆర్‌టీఐ చట్టాన్ని తీసుకురావడంలో విశేష కృషి చేసిన ప్రవుుఖ జర్నలిస్ట్ ప్రకాష్ కార్ధలే పేరిట దీన్ని ఏర్పాటు చేసింది. రవీంద్రనాథ్ ఠాగూర్ 150వ జయుంతి సందర్భంగా ‘త్రీ ఛాన్సలర్స్’ గ్రంథాన్ని ఆవిష్కరించారు. నీలాంజన్ బంధోపాథ్యాయ్ ఈ గ్రంథాన్ని రాశారు. గాంధీ జయుంతి (అక్టోబర్ 2)ని పురస్కరించుకుని వుహాత్మాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ పీస్ అండ్ సస్టెరుునబుల్ డెవలప్‌మెంట్ (ఎంజీఐఈపీ) పేరుతో యుునెస్కో న్యూఢిల్లీలో ఒక ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఇది ఆసియూలో నెలకొల్పే మెుదటి కేటగిరీ ఇన్‌స్టిట్యూట్. ఆగస్టు జైపూర్‌లోని జంతర్‌వుంతర్‌కు యుునెస్కో ప్రపంచ వారసత్వ సంపద హోదా లభించింది. జంతర్‌వుంతర్‌ను 1727-34 వుధ్యలో వుహారాజ జైసింగ్-2 నిర్మించారు. రాష్ట్రీయ జనతాదళ్(ఆర్‌జేడీ)కు జాతీయ పార్టీ గుర్తింపును ఎన్నికల సంఘం రద్దు చేసింది. మయన్మార్ సైనిక పాలకుడు థాన్‌స్వూ భారత్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య ఐదు ఒప్పందాలు కుదిరాయి. ఉగ్రవాద నిర్మూలన, విద్యుత్ రంగాల్లో సహకారం, చిన్న తరహా ప్రాజెక్టులు వంటి పలు రంగాలకు సంబంధించి అవగాహన కుదిరింది. హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసును 62-65ఏళ్లకు పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం . 2011 జనాభా లెక్కల్లో కులాన్ని చేర్చేందుకు ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలోని కేంద్ర మంత్రుల బృందం (జీఓఎం) ఆమోదం తెలిపింది. దేశంలో చివరి సారిగా 1931 లో కుల ప్రాతిపదికన జనాభా లెక్కలను సేకరించారు. దేశంలో సుదీర్ఘకాలం ప్రధానమంత్రిగా కొనసాగిన మూడో వ్యక్తిగా మన్మోహన్ సింగ్ చరిత్ర సృష్టించారు. మన్మోహన్ సింగ్ అధికారం చేపట్టి ఆగస్టు 11 నాటికి సరిగ్గా 2,273 రోజులు. తద్వారా ఇప్పటివరకు అత్యధిక కాలం ప్రధాని పదవిలో కొనసాగిన మూడో వ్యక్తిగా అటల్ బిహారీ వాజ్‌పేయి పేరిట ఉన్న రికార్డును అధిగమించారు. తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 6,130 రోజులతో మొదటి స్థానంలో, ఇందిరాగాంధీ 5,289 రోజులతో రెండో స్థానంలో నిలిచారు. నెహ్రూ తర్వాత ఐదేళ్ల పదవీ కాలం పూర్తి చేశాక వరుసగా రెండో దఫా ప్రధానిగా ఎన్నికైన వ్యక్తి మన్మోహనే. మన్మోహన్ సారథ్యంలోని యూపీఏ-1 ప్రభుత్వం 2004-09 మధ్య 1,826 రోజుల పాటు ఏకబిగిన కొనసాగింది. తద్వారా దీర్ఘకాలంపాటు కొనసాగిన రెండో కేంద్ర ప్రభుత్వంగా నిలిచింది. ఈ విషయంలో ఇందిరాగాంధీ ముందున్నారు. ఆమె 1971, మార్చి 18 నుంచి 1977 మార్చి 24 వరకు దాదాపు 2,198 రోజుల పాటు ప్రధాని పదవిలో ఏకధాటిగా కొనసాగారు. పార్లమెంట్ సభ్యుల జీతం, ఇతర భత్యాలు పెంచేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న జీతం *16 వేల నుంచి *50 వేల వరకు పెరుగుతుంది. నియోజకవర్గ భత్యం *20 వేల నుంచి *40 వేలు, కార్యాలయ భత్యం *20 వేల నుంచి *40 వేలకు పెరిగింది. {పధాన రంగాలకు మరింత చేయూతనిచ్చేందుకు ఉద్దేశించిన నేషనల్ ఇన్నోవేషన్ కౌన్సిల్ ఏర్పాటుకు ప్రధాని మన్మోహన్ సింగ్ ఆమోదం తెలిపారు. 2010-12 మధ్య కాలాన్ని ‘డికేడ్ ఆఫ్ ఇన్నోవేషన్’గా పాటించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి దోహదపడే ఈ కౌన్సిల్‌కు ప్రధాని సలహాదారు శాంపిట్రోడా నేతృత్వం వహిస్తారు. అమెరికాకు చెందిన ప్రముఖ పత్రిక న్యూస్‌వీక్ విడుదల చేసిన ఉత్తమ దేశాల జాబితాలో భారత్‌కు 78వ స్థానం లభించింది. ఫిన్లాండ్, స్విట్జర్లాండ్‌లు మొదటి, రెండు, స్థానాలను దక్కించుకున్నాయి. కౌమార బాలికల్లో పోషక విలువలు, ఆర్థిక పరిస్థితిని మెరుగు పరిచేందుకు ఉద్దేశించిన ‘సబల’ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం. దీన్ని ‘రాజీవ్‌గాంధీ కౌమార బాలికల సాధికార పథకం’ అని కూడా వ్యవహరిస్తారు. ఈ పథకం కింద 11 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు గల బాలికలు ఇంటికి తీసుకెళ్లేందుకు ఆహార ధాన్యాలను అందజేస్తారు. అంగన్ వాడీ కేంద్రాల ద్వారా ఈ పథకాన్ని దేశంలోని 200 జిల్లాల్లో అమలు చేస్తారు. బీహార్‌లోని అన్ని జిల్లాలను అ రాష్ట్ర ముఖ్యమంత్రి నితిష్‌కుమార్ కరువు జిల్లాలుగా ప్రకటించారు. అటవీ చట్టాల ఉల్లంఘన కారణంగా ఒరిస్సాలో స్థాపిస్తున్న ‘పోస్కో’ స్టీల్ ప్రాజెక్టును ఆపివేయాలని ఆ రాష్ర్ట ప్రభుత్వానికి కేంద్ర పర్యావరణ, అటవీశాఖ ఆదేశం. సెప్టెంబర్ ద్వంద్వ పన్నుల విధానం తొలగింపు ఒప్పందంపై భారత్ -స్విట్జర్లాండ్‌లు సంతకాలు చేశాయి. దీని ప్రకా రం.. స్విస్ బ్యాంకుల్లో భారతీయులు అక్రమంగా నిల్వ చేసిన నగదు సమాచారం పొందొచ్చు. చిత్తూరు జిల్లా మన్నవరంలో *6000 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఎన్‌టీపీసీ-భెల్ పవర్ ప్రాజెక్ట్ లిమిటెడ్ (ఎన్‌బీపీపీఎల్)కు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ శంకుస్థాపన చేశారు. తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ శంకుస్థాపన చేశారు. మదర్ థెరీసా శతజయంతి వేడుకల సందర్భంగా ఆమె స్మారకార్థం కొత్త ఐదు రూపాయల నాణేన్ని కేంద్రం విడుదల చేసింది. జార్ఖండ్‌లో బీజేపీ-జేఎంఎం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. నూతన ముఖ్యమంత్రిగా అర్జున్ ముండా (బీజేపీ) ప్రమాణస్వీకారం చేశారు. ముండా మూడోసారి ఈ పదవిని చేపట్టారు. గత పదేళ్లలో ఈయన ఎనిమిదో సీఎం. జూన్ 1న రాష్ట్రంలో రాష్టప్రతి పాలన విధించారు. దేశంలో అసంఘటిత రంగ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వ కొత్త పింఛన్ పథకం ‘స్వావలంబన్’ను సెప్టెంబర్ 26న ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చే ఈ పథకం మరో మూడేళ్లు కొనసాగుతుంది. ఆధార్ ప్రాజెక్ట్‌లో భాగంగా పౌరులకు గుర్తింపు సంఖ్య జారీ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సెప్టెంబర్ 29న మహారాష్ట్ర నందర్బార్ జిల్లాలోని తెంబ్లీలో ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ కింద 12 అంకెలు ఉండే తొలి విశిష్ట గుర్తింపు(యూఐడీ) సంఖ్యను ఆ గ్రామానికి చెందిన ‘రజనాసోనావానే’ అనే గిరిజన మహిళకు కేటాయించారు. ఆధార్ ప్రపంచంలోనే తొలి బయోమెట్రిక్ డేటా ఐడీ ప్రాజెక్ట్. వేలి ముద్రలు నుంచి ఐరిష్ స్కాన్ వరకు అన్ని బయోమెట్రిక్ ఆధారాలను ఇందులో పొందు పరుస్తున్నారు. వూతా, శిశు మరణాలను 2015 నాటికి తగ్గించేందుకు ఉద్దేశించిన మోడల్ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్‌ను తొలిసారిగా అసోంలోని మోరిగావ్ జిల్లాలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తరుణ్ గోగోయ్ సెప్టెంబర్ 27న ప్రారంభించారు. కొలంబియా యూనివర్సిటీకి చెందిన ఎర్త్ ఇన్‌స్టిట్యూట్, కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను చేపడుతున్నాయి. మోరిగావ్‌తో పాటు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, బీహర్‌లలోని మరో నాలుగు జిల్లాల్లో ఈ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తారు. తిరుమల శ్రీ వేంకటేశ్వరుని సన్నిధిలో శేషాచల కొండలు బయోస్పియర్ రిజర్వుగా కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ గుర్తింపుపొందాయి. అక్టోబర్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యత్వానికి భారత్ ఎన్నికైంది. 2011 జనవరి 1 నుంచి జపాన్ స్థానంలో రెండేళ్లపాటు భద్రతా మండలిలో కొనసాగుతుంది. అక్టోబర్ 12న జరిగిన ఎన్నికల్లో భారత్‌కు 192కు గాను 187 ఓట్లు లభించాయి. భద్రతా మండలికి భారత్ ఎన్నిక కావడం ఇది ఏడో సారి. ఆఫ్రికా నుంచి దక్షిణాఫ్రికా, లాటిన్ అమెరికా నుంచి కొలంబియా కూడా తాత్కాలిక సభ్య దేశాలుగా ఎన్నికయ్యాయి. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ ఆర్) రెండో క్యాంపస్‌కు ప్రధాని మన్మోహన్ సింగ్ అక్టోబర్ 19న హైదరాబాద్‌లో శంకుస్థాపన చేశారు. మొదటి క్యాంపస్‌ను 1945లో ముంబైలో స్థాపించారు. దేశంలోని 75 శాతం జనాభాకు ఆహార భద్రత కల్పించా లని జాతీయ సలహా మండలి(ఎన్‌ఏసీ) కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ పథకం గ్రామాల్లో 90 శాతం, పట్టణాల్లో 50 శాతం మంది ప్రజలకు వర్తిస్తుంది. దీని ద్వారా లబ్దిపొందే జనాభాను రెండు కేటగిరీలుగా విభజించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే ప్రారంభించే ఈ పథకాన్ని కేంద్ర కేబినేట్ ఆమోదించాలి. 2014 నాటి కి దేశ వ్యాప్తంగా అమలు చేసే ఈ పథకానికి *23,231 కోట్లు అదనపు భారం పడుతుంది. ప్రస్తుతం నిత్యావసర వస్తువులకు కేంద్రం చేస్తున్న సబ్సిడీ వ్యయం *56,700 కోట్లు. మొదటి దశలో 85 శాతం గ్రామీణ, 40 శాతం పట్టణ జనాభాకు ఆహార భధ్రత కల్పిస్తారు. న్యాయు ప్రవూణాలు, జవాబుదారీ బిల్లు - 2010 (జ్యుడీషియుల్ అకౌంటబిలిటీ)కు కేంద్ర కేబినెట్ అక్టోబర్ 5న ఆమోదం తెలిపింది. దీని ప్రకారం సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయువుూర్తులందరూ తవు ఆస్తుల వివరాలను తప్పనిసరిగా వెలువరించాలి. న్యాయువుూర్తులపై వచ్చే ఆరోపణల విచారణకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీకి సుప్రీంకోర్టు వూజీ ప్రధాన న్యాయువుూర్తి నేతృత్వం వహిస్తారు. తల్లి, పిల్లలలో పోషకాహార లోపం, రక్త హీనతలను అరికట్టేందుకు ఉద్దేశించిన ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ్ యోజన (ఐజీఎంఎస్‌వై) పథకాన్ని అక్టోబర్ 20న కేంద్రం ఆమోదించింది. దీని ద్వారా గర్భిణి స్ర్తీలకు, శిశువుకు ఆరు నెలల వయసు వరకు *4000 ఆర్థిక సహాయాన్ని మూడు దఫాలుగా అందజేస్తారు. పర్యావరణ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన నేష నల్ గ్రీన్ ట్రిబ్యునల్ న్యూఢిల్లీలో అక్టోబర్ 19న ప్రారంభమైంది. దీనికి సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి లోకేశ్వర్ సింగ్ పంతా చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. 10 మంది న్యాయ నిపుణులు, 10 మంది పర్యావరణ నిపుణులు సభ్యులు. ఈ ట్రిబ్యునల్‌కు దేశంలో మూడు ప్రాంతీయ బెంచ్‌లను ఏర్పాటు చేస్తారు. ఇటువంటి ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసిన మూడో దేశం భారత్. గతంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో ఈ ట్రిబ్యునల్స్ ఉన్నాయి. ఏనుగును జాతీయ వారసత్వ జంతువుగా గుర్తిస్తూ కేంద్ర పర్యావరణశాఖ అక్టోబర్ 22న ప్రకటించింది. ఏనుగుల సంఖ్య తగ్గుతున్నందున వాటికి ప్రత్యేక గుర్తింపును ఇవ్వటం ద్వారా సంరక్షించవచ్చని గత ఆగస్టులో నియమించిన ‘ఎలిఫెంట్ టాస్క్‌ఫోర్స్’ నివేదిక తెలిపింది. ఉత్తరాఖండ్‌లోని కుమఓన్ కొండల్లో భారత్ - రష్యాలు ఇంద్రా పేరిట ఉమ్మడిగా నిర్వహించిన సైనిక విన్యాసాలు అక్టోబర్ 23న ముగిశాయి. ఇరుదేశాల మధ్య సైనిక స్థాయిలో జరిగిన మూడో విన్యాసాలు ఇవి. గతం లో 2005 లో ఆగ్రాలో, 2007లో రష్యాలో జరిగాయి. భారత ప్రధాని మన్మోహన్‌సింగ్ జపాన్ పర్యటనలో భాగంగా అక్టోబర్ 25న ఆ దేశ ప్రధాని నవాటో కాన్‌తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక పౌర అణు సహకార ఒప్పందంపై చర్చలను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. భారత ప్రధాని మన్మోహన్ సింగ్ వులేషియూ పర్యటనలో ఇరు దేశాల మధ్య అక్టోబర్ 27న ఆరు ఒప్పందాలు కుదిరాయి. ఇదే పర్యటనలో ప్రధాని మన్మోహన్ ‘లిటిల్ ఇండియా’ పేరుతో బ్రిక్‌ఫీల్డ్స్‌లో నిర్మించిన భారతీయ షాపింగ్ మాల్‌ను కూడా ప్రారంభించారు. అనుబంధ పౌర అణు పరిహార ఒప్పందం (సీఎస్‌సీ)పై వియన్నాలోని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(ఐఏఈఏ)లో భారత్ అక్టోబర్ 27న సంతకం చేసింది. దీంతో 2005లో అమెరికాతో కుదిరిన అణు ఒప్పందానికి సంబంధించిన చివరి దశ పూర్తయింది. హర్యానా ప్రభుత్వం ప్లాస్టిక్ సంచుల వాడకం, నిల్వ ఉంచడాన్ని నిషేధిస్తూ చట్టం చేసింది. ఇంతకు మునుపే ఇలాంటి చట్టాలు చేసిన రాష్ట్రాలు - హిమాచల్‌ప్రదేశ్, రాజస్తాన్, ఢిల్లీ, చండీగడ్. నవంబర్ ఐక్యరాజ్యసమితి అడ్వైజరీ కమిటీ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ బడ్జెటరీ(ఏసీఏబీ)కి భారత్ ఎంపికైంది. 16 మంది సభ్యులుండే ఈ కమిటీలో భారత ప్రతినిధిగా నంగ్సా కంపా వ్యవహరిస్తారు. అంటార్కిటికాలోని దక్షిణ ధ్రువానికి భారత శాస్తవ్రేత్తల మొట్ట మొదటి యాత్ర నవంబర్ 1న ప్రారంభమైంది. ఎనిమిది మంది శాస్తవ్రేత్తలతో కూడిన ఈ బృందానికి నేషనల్ సెంటర్ ఫర్ అంటార్కిటిక్ అండ్ ఓషియన్ రీసెర్చ్ డెరైక్టర్ రసిక్ రవీంద్ర నేతృత్వం వహిస్తున్నారు.మార్చి 2011లో భారత్‌కు తిరిగి వస్తుంది. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి ఎ.రాజా నవంబర్ 14 న రాజీనామా చేశారు. 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని ప్రతిపక్షాల ఆరోపణలతో డీఎంకే పార్టీ నాయుకుడైన రాజా రాజీనావూ చేశారు. మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా పృథ్వీరాజ్ చవాన్ నవంబర్ 11న ప్రమాణస్వీకారం చేశారు. ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ వివాదం కారణంగా అశోక్ చవాన్ రాజీనామా చేశారు. ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ(యునెస్కో) వారసత్వ జాబితాలో భారతదేశానికి చెందిన మూడు కళలకు చోటు దక్కింది. అవి.. కేరళకు చెందిన ‘ముడియాట్టు నృత్యనాటిక’, తూర్పు భారత్‌కు చెందిన ‘ఛౌ నృత్యం’ రాజస్థాన్‌కు చెందిన ‘కల్బేలియా జానపద గీతాలు, నృత్యాలు’. వీటిని నవంబర్ 17న యునెస్కో రిప్రజంటేటివ్ లిస్ట్ ఆఫ్ ది ఇంటాజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీలో చేర్చింది. దేశ రాజధానిలో మహిళలు, యుక్త వయసు బాలికలపై జరుగుతున్న హింసను అరికట్టేందుకు ఐక్యరాజ్యసమితి మహిళా అభివృద్ధి నిధి (యూనిఫెమ్) ‘సేఫ్ సిటీస్’ అనే నూతన కార్యక్రమాన్ని న్యూఢిల్లీలో నవంబర్ 22న ప్రారంభించింది. భారత్‌తోపాటు, ఈక్విడార్, ఈజిప్టు, పాపువా న్యూగినియా, రువాండా దేశ రాజధాని నగరాల్లో కూడా ఈ కార్యక్రవుం ప్రారంభిస్తారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నవంబర్ 6 నుంచి 9వరకు భారత్‌లో పర్యటించారు. ఈ పర్యటనలో ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు ఆయన మద్దతిచ్చారు. పార్లమెంట్ ఉభయ సభలనుద్దే శించి ప్రసంగించారు. ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ తో కలిసి 12 పేజీల ఉమ్మడి ప్రకటనను విడుదల చేశారు. ఇందులో ఇరు దేశాల సంబంధాలు, ఆఫ్ఘాని స్థాన్, ఇండియన్ ఓషన్ ఔటర్ స్పేస్, ఉన్నత విద్య, ఇంధనం వంటి అంశాలను ప్రస్తావించారు. ఒబామా పర్యటనలో ఇరు దేశాల మధ్య పలు అంశాలకు సంబంధించి ఒప్పందా లు కుదిరాయి. వాటిలో ప్రధానమైనవి.. క్లీన్ ఎనర్జీ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు, అణు ఇంధన భాగస్వామ్యంపై అంతర్జాతీయ కేంద్రం ఏర్పాటు, భారత్-అమెరికా ఇంధన సహకార కార్యక్రమం, భారత వార్షిక రుతుపవన వర్షాల అధ్యయనంలో సహకారం, గ్యాస్‌వనరుల లెక్కింపులో అమెరికా సాంకేతిక పరిజ్ఞా నం, భారత్‌లో గ్లోబల్ డిసీజ్ డిటెక్షన్ సెంటర్ ఏర్పాటు కు అవగాహన. గోవా రాజధాని పనాజీలో 41వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాన్ని రైల్వే శాఖ మంత్రి మమతా బెనర్జీ, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ ప్రారంభించారు. పది రోజులు నిర్వహించే ఈ ఉత్సవాల్లో 61 దేశాలకు చెందిన దాదాపు 300 చిత్రాలను ప్రదర్శించారు. ప్రారంభ చిత్రంగా ‘వెస్ట్ ఈజ్ వెస్ట్’ (బ్రిటిష్)ను ప్రదర్శించారు. కర్ణాటకలోని కైగా అణు విద్యుత్ కేంద్రం నాలుగో యూనిట్‌లో నవంబర్ 26న ఉత్పత్తి ప్రారంభమైంది. దీంతో దేశంలో మొత్తం అణు విద్యుత్ ఉత్పత్తి 4780 మెగావాట్లకు పెరిగింది. అంతేకాక అణు విద్యుత్ ఉత్పత్తిలో ప్రపంచంలో భారత్ ఆరోస్థానానికి చేరుకుంది. అమెరికా, ఫ్రాన్స్, జపాన్, రష్యా, దక్షిణ కొరియాలు తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి. కైగా-4 స్వదేశీ ప్రెజరైజ్‌డ్ హెవీ వాటర్ రియాక్టర్. దీని సామర్థ్యం 220 మెగావాట్లు. ఇది దేశంలో 20వ అణువిద్యుత్ కేంద్రం. బీహార్ ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి నితీశ్ కుమార్ (జనతాదళ్- యునెటైడ్) నవంబర్ 26న ప్రమాణస్వీకారం చేశారు. నితీశ్ 2005లో తొలిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. డిసెంబర్ {ఫాన్స్ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ భారత పర్యటనలో డిసెంబర్ 6న ఇరు దేశాల వుధ్య పలు రంగాలకు సంబంధించి ఒప్పందాలు కుదిరారుు. అణు రంగంలో భారత్‌పై అంతర్జాతీయు ఆంక్షలు తొలగిపోరుున రెండేళ్లకు.. భారత్‌లో అణు రియూక్టర్లు నెలకొల్పేందుకు ఫ్రాన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. దీనిప్రకారం వుహారాష్టల్రోని జైతాపూర్‌లో ఏర్పాటు చేయునున్న ఆరు అణు రియూక్టర్లలో మెుదటి రెండింటిని ఫ్రాన్స్ నెలకొల్పుతుంది. రక్షణ, ఉగ్రవాదంపై పోరు, అంతరిక్షం, శాస్త్ర సాంకేతికత వంటి రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపైనా ఇరువురు నాయుకులు చర్చించారు. భారత్‌లో అంతరిస్తున్న జంతువుల ఇతివృత్తంతో డెరైక్టరేట్ ఆఫ్ అడ్వర్‌టైజింగ్ అండ్ విజువల్ పబ్లిసిటీ (డీఏవీపీ) 2011 క్యాలెండర్‌ను రూపొందించింది. చైనా ప్రధాన వుంత్రి వెన్ జియూబావో భారత్‌లో పర్యటించారు. ప్రధాని వున్మోహన్‌సింగ్‌తో సవూవేశవుయ్యూరు. ఈ సందర్భంగా పలు ద్వైపాక్షిక, వాణిజ్య, ప్రాంతీయు, అంతర్జాతీయు అంశాలు చర్చించారు. 2011 ను చైనా-ఇండియూ ఎక్స్ఛేంజ్ సంవత్సరంగా ప్రకటించారు. 2015 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియున్ డాలర్లకు పెంచాలని నిర్ణరుుంచారు. ఈ పర్యటన సందర్భంగా.. ఇరు దేశాల ప్రధానుల వుధ్య నేరుగా సవూచార సంబంధాలు కల్పించే హాట్‌లైన్ సదుపాయూన్ని ప్రారంభించారు. ఇరు దేశాల దౌత్య సంబంధాలు ప్రారంభమై 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా న్యూఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియుంలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రవూలు నిర్వహించారు. పని చేసే స్థలాలలో వేధింపులకు గురయ్యే స్త్రీలకు రక్షణగా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కృష్ణతీర్థ ‘‘ది ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ అగయినెస్ట్ సెక్సువల్ హరాస్‌మెంట్ ఎట్ వర్‌క ప్లేస్ బిల్ 2010’’ను ప్రవేశపెట్టారు. అల్‌జజీరా అనే ఇంగ్లీష్ టి.వి.ఛానల్ నాలుగు సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత ప్రభుత్వ అనుమతులు పొంది తన ప్రసారాలను ప్రారంభించింది. అల్ అజవా అనే ఈ ఛానల్ తన అరబిక్ ప్రసారాలను 1996 నుంచి ఖదర్‌లోని దోహా నుంచి ప్రసారం చేస్తుంది. స్పెక్ట్రమ్ లెసైన్‌స మంజూరు విధానాలను అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏకసభ్య కమిటీని నియమించింది. ఇందుకోసం రిటైర్‌డ సుప్రీంకోర్టు జడ్జి శివరాజ్.వి.పటేల్‌కు బాధ్యత అప్పగించింది. రష్యా అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్ భారత పర్యటనలోభాగంగా ఇరు దేశాల వుధ్య డిసెంబర్ 21న 30 ఒప్పందాలు కుదిరారుు. వీటిలో పౌర అణు సహకారం, హైడ్రో కార్బన్, అంతరిక్ష రంగాల్లో వ్యూహాత్మక భాగస్వావ్యూన్ని పటిష్టం చేయుడం, విస్తరించడం ప్రధానమైనవి. ఓఎన్‌జీసీ, విదేశీ లిమిటెడ్, టాటా సన్స్, రెడ్డీస్ లేబొరేటరీస్, రిలయున్స్ వంటి సంస్థలు కూడా రష్యాతో ఒప్పందాలు చేసుకున్నారుు. ప్రధాని వున్మోహన్ సింగ్ తో మెద్వెదేవ్ వార్షిక శిఖరాగ్ర స్థారుు చర్చలు సాగించారు. 2015 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని *91 వేల కోట్లకు పెంచాలని నిర్ణరుుంచారు. గుజరాత్ వుుఖ్యవుంత్రి నరేంద్ర మోడి రాసిన ‘కన్వీనియుంట్ యూక్షన్ : గుజరాత్ రెస్పాన్స్ టు క్లైమేట్ ఛేంజ్’ పుస్తకాన్ని డిసెంబర్ 21న వూజీ రాష్టప్రతి అబ్దుల్ కలాం, ఐపీసీసీ చైర్మన్ ఆర్.కె. పచౌరి అహ్మదాబాద్‌లో ఆవిష్కరించారు. ************************************************************************ రాష్ట్రీయం జనవరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎస్.వి. ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రమాకాంత్ రెడ్డి డిసెంబర్ 31, 2009న బాధ్యతలు స్వీకరించారు. ఫిబ్రవరి ఆంధ్రప్రదేశ్‌లోని పరిస్థితిపై అధ్యయనానికి ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీకి కేంద్ర ప్రభుత్వం ఈనెల 12న విధి విధానాలు ప్రకటించింది. ఐదుగురు సభ్యులు ఉన్న ఈ కమిటీ ఏడు అంశాలను అధ్యయనం చేస్తుంది. తెలంగాణ ఏర్పాటు డిమాండ్‌తో పాటు ప్రస్తుతం రాష్ట్రాన్ని ఇలాగే కొనసాగించాలన్న డిమాండ్‌నూ కమిటీ పరిశీలిస్తుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నిస్సార్ అహ్మద్ కక్రూను రాష్టప్రతి నియమించారు. ప్రస్తుతం ఈయన జమ్మూ కాశ్మీర్ హైకోర్టు సీనియర్ న్యామమూర్తిగా ఉన్నారు. 2009 సంవత్సరానికి ప్రపంచంలో ఉత్తమ విమానాశ్రయంగా హెదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం ఎంపికైంది. 50 లక్షల నుంచి 1.5 కోట్ల మంది ప్రయాణికుల సామర్థ్యమున్న ఎయిర్‌పోర్ట్‌ల విభాగంలో శంషాబాద్‌కు ఈ ఘనత దక్కింది. ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) ప్రకటించిన ర్యాంకుల్లో శంషాబాద్ ప్రపంచంలో ఐదోస్థానంలో నిలిచింది. మూడో దశ పేదరిక నిర్మూలన కార్యక్రమం కింద రాష్ట్రంలోని సెల్ఫ్-హెల్ఫ్ గ్రూపులకు ప్రపంచ బ్యాంకు *1000 కోట్ల ఆర్థిక సహాయం చేయనుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి మరణంపై ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ఉద్దేశించిన ద్విసభ్య కమిటీ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ కమిటీలో ఎం.ఆర్. రెడ్డి, హెచ్.ఎస్.కోహ్లా సభ్యులు. మార్చి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆస్థాన గాయకురాలిగా లతా మంగేష్కర్, శోభారాజ్‌లు నియమితులయ్యారు. వీరు రెండేళ్లు ఈ పదవిలో ఉంటారు. లో కార్బన్ ఫుట్ ప్రింట్ సిటీగా అభివృద్ధి చేయడానికి ‘తిరుపతి’ అనువైన పట్టణంగా యూరోపియన్ ఎయిడ్, అభివృద్ధి సంస్థ గుర్తించింది. ఈ సంస్థ యూరోపియన్ కమిషన్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. 2009-10 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లో తలసరి ఆదాయం * 43,556గా ప్రభుత్వం మార్చి 30న శాసనసభకు సమర్పించిన ద్రవ్య విధాన పత్రంలో పేర్కొంది. 2008-09 ఆర్థిక సంవత్సర తలసరి ఆదాయం *40,902 తో పోల్చితే 6.49 శాతం పెరుగుదల ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో(2009-10) రాష్ర్ట అభివృద్ధి రేటు 7.76 శాతంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు మార్చి 29న నవరత్న హోదా కల్పించింది. మానవ వనరుల అభివృద్ధికి సంబంధించి అంతర్జాతీయ ప్రమాణాలు పాటించినందుకు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు గ్లోబల్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ అవార్డు-2010 లభించింది. ఏప్రిల్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) రెండో క్యాంపస్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్ జిల్లాలో ఏర్పాటు చేసేందుకు కేంద్రం అంగీకరించింది. దేశ ప్రజలకు ప్రత్యేక గుర్తింపును అందించేందుకు ఉద్దేశించిన యునెటైడ్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్‌ఇండియా ప్రాజెక్టు రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా మెదక్, కృష్ణా జిల్లాల్లో ప్రారంభించారు. డా॥బి.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐదో దశ భూ పంపిణీ కార్యక్రమం చేపట్టింది. మొత్తం 1.06 లక్షల ఎకరాల భూమిని 69,506 మంది పేదలకు పంపిణీ చేయనుంది. మే రాష్ట్ర ప్రభుత్వం 2010-11 సంవత్సరానికి *65,763 కోట్ల పరపతి ప్రణాళికను విడుదల చేసింది. ఇందులో వ్యవసాయ రంగానికి *41,913 కోట్లు, వ్యవసాయేతర రంగాలకు *8,150 కోట్లు, ఇతర ప్రాధాన్యతారంగాలకు *15,700 కోట్ల రుణాలు అందజేస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ‘లైలా’తుపాను వల్ల ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తాలో మే 19, 20 తేదీల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ పేరును పాకిస్థాన్ సూచించింది. తదుపరి తుపానుకు శ్రీలంక సూచించిన ‘బందు’ అనే పేరు పెడతారు. జూన్ విజయవాడలో 101 గంటల పాటు నిరంతరాయంగా జరిగిన అన్నమయ్య సంకీర్తనార్చనకు గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ఈ సహస్రనామ సంకీర్తనార్చనలో ఐదువేల మంది కళాకారులు ఐదు రోజులపాటు 1008 కీర్తనలను ఏకధాటిగా ఆలపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2010-15 సంవత్సరానికి నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. ముఖ్యాంశాలు: తయారీ రంగంలో 12-17 శాతం వృద్ధి లక్ష్యం; ఏడాదికి 5 లక్షల మందికి ఉపాధి (ఇందులో 2 లక్షల మందికి ప్రత్యక్షంగా, 3 లక్షల మందికి పరోక్షంగా); *250 కోట్లకు పైబడిన ప్రాజెక్ట్‌కు మెగాప్రాజెక్ట్‌గా గుర్తింపు (ప్రస్తుతం *100 కోట్లకు పైబడిన ప్రాజెక్ట్‌ను మెగాప్రాజెక్ట్‌గా గుర్తిస్తున్నారు); మధ్యతరహాకు 25శాతం, చిన్నతరహాకు 50 శాతం, సూక్ష్మ పరిశ్రమలకు 100 శాతం వ్యాట్ రీయింబర్స్‌మెంట్. జూలై ఆంధ్రప్రదేశ్ నుంచి 2009-10 సంవత్సరంలో *36 వేల కోట్ల సాఫ్ట్‌వేర్ ఎగుమతులు నమోదైనట్లు రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ తెలిపారు. దేశ ఐటీ ఉత్పత్తుల ఎగుమతుల్లో రాష్ట్రం వాటా 15 శాతం, కర్ణాటక వాటా 30 శాతంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2010-15 సంవత్సరానికి నూతన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) విధానాన్ని ప్రకటించింది. ముఖ్యాంశాలు: 2015 నాటికి ఏటా 70 వేల కోట్ల ఎగుమతుల లక్ష్యం; లక్షన్నర మందికి ప్రత్యక్ష ఉపాధి, 5 లక్షల మందికి పరోక్ష ఉపాధి; వార్షిక వృద్ధి లక్ష్యం 17శాతం; ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైడ్ ఏరియా (అ్కగిఊ) తో అన్ని గ్రామాల అనుసంధానం విజయనగర సామ్రాజ్య పాలకుడు శ్రీకృష్ణదేవరాయల (క్రీ.శ.1509-29 పాలనాకాలం) పట్టాభిషేక పంచ శతాబ్ది ఉత్సవాలను జులై 5న హైదరాబాద్‌లో భారత రాష్టప్రతి ప్రతిభా పాటిల్ ప్రారంభించారు. టీటీడీ జీవితకాల ఆస్థాన విద్వాంసుడిగా ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ నియామకం. ఈయన గతంలో మూడు సార్లు టీటీడీ ఆస్థాన విద్వాంసులుగా వ్యవహరించారు. ఆగస్టు నాగార్జునసాగర్ ఆధునీకరణకు *2025 కోట్ల రుణం అందించేందుకు ప్రపంచబ్యాంకు అంగీకరించింది. ఆధునీకరణ మొత్తం వ్యయ అంచనా *4440 కోట్లు. కేంద్ర ప్రభుత్వం రాష్ర్టంలోని 13 జిల్లాలకు బ్యాక్‌గ్రౌండ్ రీజియన్ గ్రాంట్ ఫండ్ (ఆఖఎఊ) ఇవ్వనుంది. రాయలసీమ నుంచి మూడు, కోస్తా నుంచి ఒకటి, తెలంగాణ నుంచి పది జిల్లాలను ఎంపిక చేశారు. దీని ద్వారా రాష్ట్రానికి *348.28 కోట్లు నిధులు అందుతాయి. సెప్టెంబర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 31వ డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)గా కె.అరవిందరావు బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌కు చెందిన హలీమ్ వంటకానికి జియోగ్రా ఫికల్ ఇండికేటర్ (భౌగోళిక గుర్తింపు) లభించింది. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 8న హైదరాబాద్‌లో ‘సాక్షర భారత్’ కార్యక్రమాన్ని కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి డి.పురంధేశ్వరి ప్రారంభించారు. దేశంలో వయోజన విద్యను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని 19 జిల్లాల్లో అమలు చేస్తారు. హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, ఎల్ అండ్ టీ, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య ఒప్పందం కుదిరింది. ఖర్చు * 12, 312 కోట్లు. దివంగత వుుఖ్యవుంత్రి డా॥రాజశేఖర రెడ్డి ప్రథవు వర్థంతి సందర్భంగా ఆయున పేరిట ఐదు రూపాయుల పోస్టల్ స్టాంప్‌ను సెప్టెంబర్ 2న విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ పోస్ట్ వూస్టర్ జనరల్ శారద సంపత్ విడుదల చేశారు. హైదరాబాద్‌లోని ప్రఖ్యాత చౌమొహల్లా ప్యాలెస్‌ను 2010 సంవత్సరానికి చారిత్రక కట్టడాల జాబితాలో చేర్చుతూ ప్రిస్టీజియస్ ఆఫ్ మెరిట్ అవార్డును యునెస్కో ప్రకటించింది. తొలి సారిగా ఆంధ్రప్రదేశ్‌కు ఈ పురస్కారం దక్కింది. 30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ భవన నిర్మాణం 1750లో ప్రారంభమై 5వ నిజాం అఫ్జల్ అద్ దౌలా పాలనలో పూర్తయ్యింది. 2006 లో ఈ భవనాన్ని పర్యాటక కేంద్రంగా మార్చారు. వర్షపాతాన్ని మూడు గంటల ముందుగా గుర్తించే అత్యాధునిక ‘డాఫ్లర్ వెదర్ రాడర్(డీడబ్ల్యుర్)’ను హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రంలో ప్రారంభించారు. ఇందు కోసం *12 కోట్లు ఖర్చు చేశారు. అక్టోబర్ అనంతపురంలో నాదల్ ఫౌండేషన్ సహకారంతో రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ నిర్మించిన టెన్నిస్ అకాడెమిని ప్రపంచ నెంబర్‌వన్ టెన్నిస్ ఆటగాడు రాఫెల్ నాదల్ ప్రారంభించాడు. రాష్ర్టంలో మరో ఆరు సీబీఐ కోర్టులను ప్రారంభించనున్నారు. అందులో భాగంగా హైదరాబాద్‌లో నాలుగు, విశాఖపట్నంలో రెండు కోర్టులను ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్‌లో జరిగిన మక్కా మసీదు బాంబు పేలుడు ఘటనపై 2007లో నియమించిన జస్టిస్ వి.భాస్కరరావు కమిటీ నివేదిక సమర్పించింది. నవంబర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల కోసం ‘జవహర్ బాల ఆరోగ్య రక్ష(జేబీఏఆర్)’ పథకాన్ని ముఖ్యమంత్రి కె.రోశయ్య రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదివే బాలబాలికలకు ఉచితంగా స్కూల్ యూనిఫార్‌మ్సను అందించే పథకాన్ని ప్రారంభించనుంది. ఇందులో భాగంగా 52 లక్షల విద్యార్థులు లబ్ది పొందనున్నారు. దీనికి 210 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. నవంబర్ రెండో వారంలో ఆంధ్రప్రదేశ్ తీరం తాకిన తుపానుకు ‘జల్’ అనే పేరు పెట్టారు. దీని కారణంగా ఆంధ్ర, తమిళనాడులలో ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించాయి. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద రాష్ర్ట ప్రభుత్వం 8 లక్షల ఆపరేషన్‌స పూర్తి చేసి రికార్డు సృష్టించింది. ఆంధ్రప్రదేశ్ 16వ ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నవంబర్ 25న ప్రమాణస్వీకారం చేశారు. ఆయన ఇప్పటి వరకు శాసనసభ స్పీకర్‌గా వ్యవహరించారు. కిరణ్‌కుమార్ రెడ్డి ప్రస్తుతం చిత్తూరు జిల్లా పీలేరు నుంచి శాసనసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన 1989లో తొలిసారి చిత్తూరు జిల్లా వాయల్పాడు నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2004-09 మధ్య ప్రభుత్వ చీఫ్ విప్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఇగ్నో-యునెస్కో సంయుక్తంగా నిర్వహించిన సైన్స్ ఒలింపియాడ్ 2010లో శ్రీ చైతన్య విద్యాసంస్థల విద్యార్థి మహ్మద్ హఫీజుల్లా మొదటి ర్యాంక్‌ను సాధించాడు. మహబూబ్‌నగర్‌లోని పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులు అత్యధిక సంఖ్యలో పాదయాత్ర చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఎక్కారు. డిసెంబర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2009 చలనచిత్ర అవార్డులు. రఘుపతి వెంకయ్యు అవార్డు: ప్రవుుఖ నిర్మాత కె.రాఘవ; ఎన్‌టీఆర్ జాతీయు చలనచిత్ర అవార్డు: ప్రవుుఖ నటి బి.సరోజాదేవి; బీఎన్ రె డ్డి జాతీయు చలనచిత్ర అవార్డు: ప్రవుుఖ దర్శకుడు కె.రాఘవేంద్ర రావు; నాగిరెడ్డి, చక్ర పాణి జాతీయు అవార్డు: రామోజీరావు; ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజనల్ బెంచ్ రైట్ టు ఎడ్యుకేషన్ బిల్లు అమలుపై స్టే విధించింది. సిలికానాంధ్ర, రాష్ర్ట సాంస్కృతిక శాఖ ఆధ్వర్యం లో హైదరాబాద్‌లో రెండో అంతర్జాతీయ కూచిపూడి నృత్య సమ్మేళనం నిర్వహించారు. ఇందులో 2800 మందితో ‘మహా బృంద నాట్యం’ చేశారు. వీరు 10 నిమిషాలపాటు చేసిన ‘థిల్లానా’ నాట్యానికి గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ********************************************************************* సదస్సులు జనవరి కామన్‌వెల్త్ దేశాల 20వ సదస్సును భారత ప్రధాని మన్మోహన్ సింగ్ న్యూఢిల్లీలో ప్రారంభించారు. సదస్సుకు 42 దేశాల నుంచి 50 మంది స్పీకర్లు, ప్రిసైడింగ్ అధికారులు హాజరయ్యారు. తదుపరి సదస్సు 2012లో కెనడాలో జరగనుంది. {పవాస భారతీయ దివస్‌ను ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ న్యూఢిల్లీలో ప్రారంభించారు. {పధానమంత్రి మన్మోహన్ సింగ్ 97వ సైన్స్ కాంగ్రెస్‌ను తిరువనంతపురంలో ప్రారంభించారు. ఇదే వేదికపై ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్‌కు పనంబిల్లి గోవింద మీనన్ పురస్కా రాన్ని ప్రధాని బహూకరించారు. ఇండియున్ సైన్స్ అవార్డును ప్రవుుఖ స్టాటిస్టీషియున్ సీఆర్ రావుకు ప్రదానం చేశారు. శ్రీనివాసరామానుజన్ పురస్కారాన్ని రాజేందర్ జిత్, పి.రాయ్ మెమోరియల్ అవార్డు గణేష్ పాండే, హెచ్.జె.బాబా మెమోరియల్ పురస్కారాన్ని అనిల్‌కుమార్, విక్రమ్ సారాబాయ్ అవార్డు కె.రాధాకృష్ణన్ అందుకున్నారు. ఫిబ్రవరి నాలుగు రోజుల బయో ఆసియా 2010 సదస్సు ఫిబ్రవరి 3న హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రొ. సీఆర్ రావు, ప్రొ. జనెట్ థార్నటన్‌లకు ‘జీనోమ్ వ్యాలీ ఎక్సలెన్స్’ అవార్డులను అందజేశారు. ఏప్రిల్ 16వ దక్షిణాసియా ప్రాంతీయ సహకార సమాఖ్య(సార్క్) సమావేశం భూటాన్ రాజధాని థింపూలో ఏప్రిల్ 28, 29 తేదీల్లో జరిగింది.17వ సార్క్ సదస్సు 2011లో మాల్దీవుల రాజధాని మాలేలో జరుగుతుంది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ మేయర్స్ (ఎఐసిఎం) రెండు రోజుల సమావేశం ఏప్రిల్ 24, 25 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించారు. అమెరికా ఏర్పాటు చేసిన అంతర్జాతీయు అణు భద్రత సదస్సు ఏప్రిల్ 12,13 తేదీల్లో వాషింగ్టన్‌లో జరిగింది. దీనికి భారత ప్రధానవుంత్రి వున్మోహన్ సింగ్ హాజర య్యూరు. భారత్‌లో అణు ఇంధన భాగస్వావ్యుంపై అంతర్జాతీయు కేంద్రం ఏర్పాటు చేయునున్నట్లు ప్రధాని ఈ సందర్భంగా ప్రకటించారు. జూన్ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్‌పీటీ) సమీక్షా సదస్సు న్యూయార్క్‌లో ముగిసింది. మే 3న ఐక్య రాజ్య సమితిలో ప్రారంభమైన ఈ సదస్సు నాలుగు వారాల పాటు సాగింది. వూర్చి 5, 1970 నుంచి అవుల్లోకి వచ్చిన ఎన్‌పీటీపై ప్రతి ఐదేళ్లకోసారి సమీక్ష జరుగుతుంది. అణు నిరాయుధీకరణ, అణ్వస్ర్తాలు లేని పశ్చిమాసియా కోసం కొత్త చర్యలను ఐదేళ్ల కొకసారి జరిగే ఈ సదస్సు ప్రతిపాదించింది. ఎన్‌పీటీపై గత10 ఏళ్లల్లో ఇదే తొలి ఒప్పందం. నిరాయుధీకరణ, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధం, శాంతియుత అణు ఇంధనం అనే మూడు అంశాల కార్యాచరణ ప్రణాళికను సమావేశ తుది ప్రకటనలో పేర్కొన్నారు. ఇండియా, పాకిస్థాన్, ఇజ్రాయెల్ దేశాలను ఎన్‌పీటీ, సీటీబీటీలో చేరాలని ఐక్యరాజ్యసమితి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసింది. ఉజ్బెకిస్థాన్ రాజధాని తాష్కెంట్‌లో షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సమావేశం జరిగింది. కిర్గిజిస్థాన్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు అవసరమైన సహకారం అందించాలని డిక్లరేషన్ విడుదల చేశారు. ఎస్‌సీఓలో కొత్త దేశాలను చేర్చుకునేందుకు వీలుగా విధి విధానాలను కూడా ప్రకటించారు. జూలై పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో సార్క్ దేశాల హోం వుంత్రుల సమావేశం జరిగింది. అక్టోబర్ 2ను సార్క్ అహింసా దినోత్సవంగా నిర్వహించాలని భారత హోంమంత్రి పి.చిదంబరం సభ్యదేశాలను కోరారు. కెనడాలోని టొరంటో నగరంలో జీ-20, జీ-8 దేశాల సదస్సు జరిగింది. వృద్ధితోకూడిన లోటు తగ్గింపు చర్యలు చేపట్టాలని జీ-20 సమావేశంలో పాల్గొన్న నాయకులు సూచించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు స్వేచ్ఛా మార్కెట్ విధానాన్ని అనుసరించాలని జీ-8 సదస్సు తీర్మానించింది. భారత్, పాక్ చర్చలను కూడా స్వాగతించారు. ఇరాన్, ఉత్తర కొరియాల అణు కార్యక్రమం పట్ల సదస్సు నిరసన వ్యక్తం చేసింది. l ఆస్ట్రియా రాజధాని వియన్నాలో 18వ అంతర్జాతీయ ఎయిడ్స్ సదస్సు వారం రోజులపాటు జరిగింది. ప్రస్తుతం 5.2 మిలియ *********************************************** అవార్డులు జనవరి కెనడా అత్యున్నత పురస్కారం ‘ద ఆర్డర్ ఆఫ్ కెనడా’కు ప్రవాస భారతీయుడు శ్రావణ్ కుమార్ ఎంపికయ్యారు. ఐస్‌లాండ్ అధ్యక్షుడు ఒలాపుర్ రగ్నార్ గ్రిమన్స్‌కు 2007 జవహర్ లాల్ నెహ్రూ అంతర్జాతీయ అవగాహన పురస్కారాన్ని రాష్టప్రతి ప్రతిభా పాటిల్ ప్రదానం చేశారు. భారత సంతతికి చెందిన అణు భౌతిక శాస్తవ్రేత్త, రచయిత గులామ్ హుస్సేన్ వసాన్జీ కెనడా అత్యున్నత సాహిత్య పురస్కారం‘గవర్నర్ జనరల్స్ లిటర్సీ’కి ఎంపికయ్యారు. ‘ఎ ప్లేస్ వితిన్ రీ డిస్కవరింగ్ ఇండియా’ రచనకు ఈ అవార్డు లభించింది. {పధానమంత్రి మన్మోహన్ సింగ్ కుమార్తె ప్రొఫెసర్ ఉపీందర్ సింగ్ ‘ఇన్ఫోసిస్ 2009’ పురస్కారానికి ఎంపికయ్యారు. మైథిలీ భాషలో అత్యున్నత సాహిత్య పురస్కారం ‘ప్రబోద్ సాహిత్య సమ్మాన్- 2010’కి ప్రముఖ కవి, రచయిత జీవకంట్ ఎంపికయ్యారు. కాశ్మీర్‌కు చెందిన రుక్సానా కోస్సెర్‌కు సర్వోత్తమ్ జీవన్ రక్షా పతకం లభించింది. ఆమెతోపాటు మరో 44 మందిని ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. {పముఖ సినిమాటోగ్రాఫర్ వి.కె. మూర్తి 2008 సంవత్సరానికిగాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికయ్యారు. ఫాల్కే పురస్కారం సినిమాటోగ్రాఫర్‌కు లభించడం ఇదే తొలిసారి. కేంద్రప్రభుత్వం 2008 సంవత్సరానికి గాను 56వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించింది. ఉత్తమ చిత్రం - ‘అంతహీన్’ (దర్శకుడు: అనిరుద్ధరాయ్ చౌదరి- బెంగాలీ); ఉత్తమ తెలుగు చిత్రం-1940 లో ఒక గ్రామం; ఉత్తమ నటుడు - ఉపేంద్ర లిమయే; (చిత్రం: జోగ్వా-మరాఠీ); ఉత్తమ నటి - ప్రియాంక చోప్రా (ఫ్యాషన్-హిందీ); ఉత్తమ దర్శకుడు - బాల (నాన్‌కడవుల్-తమిళం); ఉత్తమ సహాయ నటుడు - అర్జున్ రాంపాల్; (చిత్రం: రాక్‌ఆన్-మరాఠీ) ఉత్తమ సహాయ నటి- కంగనా రనౌత్ (చిత్రం: ఫ్యాషన్-హిందీ); ఇందిరాగాంధీ పురస్కారం - ఎ వెడ్నస్ డే (హిందీ); జాతీయ సమైక్యత అవార్డు(నర్గీస్‌దత్ పురస్కారం)- ఆయికోట్ నాయ్ (అస్సామీ). గోల్డెన్ గ్లోబ్ అవార్డులను లాస్ ఏంజెలిస్‌లో ప్రదానం చేశారు. ఉత్తమ చిత్రం - అవతార్; ఉత్తమ దర్శకుడు - జేమ్స్ కామెరూన్ (అవతార్ - ఈయన 1997లో టైటానిక్ చిత్రానికి దర్శకత్వం వహించారు); ఉత్తమ నటుడు - జెఫ్ బ్రిడ్జెస్ (క్రేజీహార్ట్); ఉత్తమ నటి - శాండ్రా బులక్ (ది బ్లైండ్ సైడ్); ఉత్తమ విదేశీ చిత్రం - ది లైట్ రిబ్బన్ (జర్మన్) భారత్‌లో పూర్తి స్థాయిగా బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్(బీఆర్‌టీ) వ్యవస్థను విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరం సస్టెయినబుల్ ట్రాన్స్‌పోర్ట్ అవార్డ్- 2010కి ఎంపికైంది. ఫిబ్రవరి మొదటి సారిగా ప్రవేశ పెట్టిన ఠాగూర్ సాహిత్య అవార్డులను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కోవెల సుప్రసన్నాచార్యతోపాటు బెంగాలీ, బోడో, గుజరాతీ, హిందీ, కాశ్మీరీ, కన్నడ, పంజాబీ రచయితలకు ప్రదానం చేశారు. కేంద్రప్రభుత్వం 2009 సంవత్సరానికిగాను జాతీయ మత సామరస్య అవార్డులు ప్రకటించింది. వ్యక్తిగత విభాగంలో సంస్కృత పండితుడు మహ్మద్ హనీఫ్‌ఖాన్ శాస్ర్తి, సంస్థల విభాగంలో రాజస్థాన్‌కు చెందిన మానవహక్కులు, సామాజిక సంక్షేమ కేంద్రానికి ఈ అవార్డు లభించింది. దేశంలో రెండో అత్యున్నత సాహస పురస్కారం ‘కీర్తి చక్ర’కు కాశ్మీర్ వ రుక్సానా ఎంపికయ్యారు. రుక్సానాతోపాటు రాష్ట్రీయ్ రైఫిల్స్‌కు చెందిన మేజర్ పుష్పేందర్ సింగ్, బీఎస్‌ఎఫ్ ఎస్సై భోపాల్ సింగ్, మేఘాలయ పోలీసు కానిస్టేబుల్ రెల్‌దేవ్ సంగ్మాలకు కూడా కీర్తి చక్ర దక్కింది. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ)లో లైఫ్ సెన్సైస్ అండ్ హ్యుమన్ రిసోర్స్ విభాగంలో చీఫ్ కంట్రోలర్‌గా పనిచేస్తున్న డబ్ల్యు సెల్వమూర్తికి డీఆర్‌డీఓ అందించే టెక్నాలజీ లీడర్‌షిప్ అవార్డ్ - 2008 లభించింది. విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్(వీటీపీఎస్)కు 2008-09 సంవత్సరానికి ఉత్తమ పనితీరు అవార్డు లభించింది. వరుసగా 21వ సారి ఈ పురస్కారం దక్కింది. దేశంలో అత్యున్నత సాహస పురస్కారం అశోకచక్రను ఈ సంవత్సరానికి ముగ్గురు సైనిక వీరులకు ప్రకటించారు. మేజర్ టి. శ్రీరామ్, హవల్దార్ రాజేశ్ కుమార్, మేజర్ మోహిత్ శర్మలకు ఈ అవార్డు దక్కింది. {పముఖ గాయని లతామంగేష్కర్ 2010 అక్కినేని నాగేశ్వరరావు పురస్కారానికి ఎంపికయ్యారు. లతా మంగేష్కర్‌కు ‘ప్రైడ్ ఆఫ్ ఇండియా-కళా సరస్వతి’ సంగీత అవార్డును ముఖ్యమంత్రి కె.రోశయ్య హైదరాబాద్ లో ప్రదానం చేశారు. 2010 ‘పద్మ’ అవార్డులు. పద్మవిభూషణ్: నోబెల్ బహుమతి గ్రహీత వెంకట్రామన్ రామకృష్ణన్, అపోలో ఆసుపత్రి అధినేత ప్రతాప్ సి. రెడ్డి, రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ యాగా వేణుగోపాల్ రెడ్డి, ఇబ్రహీం అల్కజీ (రంగస్థల నటి), ఉమయాల్పురం కే శివరామన్ (మృదంగ విద్వాంసుడు), జోహ్రా సెహగల్ (రంగస్థల నటి) పద్మ విభూషణ్ గ్రహీత వేణుగోపాల్ రెడ్డితోపాటు.. సంగీత విద్వాంసుడు నూకల చినసత్యనారాయణ పద్మ భూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు. పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన వారిలో పారిశ్రామికవేత్త అల్లూరి సత్యనారాయణ రాజు, గాయని శోభారాజు, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, విజయ్‌ప్రసాద్ డిమ్రీ (జాతీయ భూ భౌగోళిక పరిశోధన సంస్థ డెరైక్టర్) ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు. 2010 సంత్సరానికి 52వ గ్రామీ అవార్డులను లాస్ ఎంజెలిస్‌లో ఫిబ్రవరి 1న ప్రదానం చేశారు. ఇందులో స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రానికి ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతానికి రెండు గ్రామీ అవార్డులు లభించాయి. బెస్ట్ సౌండ్ ట్రాక్, బెస్ట్ మోషన్ పిక్చర్ సాంగ్ విభాగాల్లో ఈ అవార్డులు దక్కాయి. రెహమాన్‌తో పాటు పాట రాసిన గుల్జార్, తన్వీర్‌లకు సంయుక్తంగా బెస్ట్ సాంగ్ అవార్డు లభించింది. ఉత్తమ గాయనిగా అమెరికన్ పాప్ సింగర్ బొయోన్స్ నోవెల్స్ ఎంపికైంది. గ్రామీ లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు దివంగత పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్‌కు దక్కింది. 2009 సంవత్సరానికి సంగీత నాటక అకాడెమీ పురస్కారాలు, అవార్డులు ఈనెల 16న ప్రకటించారు. ఈ పురస్కారాలకు(ఫెలోషిప్) ఆరుగురు ఎంపికయ్యారు. వారు - పండిట్ జస్‌రాజ్, కిషోరి అమోన్‌కర్(హిందుస్థానీ సంగీతం), లాల్‌గుడి జయరామన్(వయోలిన్), యామినీ కృష్ణమూర్తి (నృత్యం), శ్రీరాం లగూ(సినీ నటుడు), కమలేష్ దత్ త్రిపాఠీ(రంగస్థల నటుడు). సంగీతం, నృత్యం, నటనలకు చెందిన మరో 33 మందిని సంగీత నాటక అకాడెమీ అవార్డులకు ఎంపిక చేశారు. వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కళాకృష్ణ(ఆంధ్రనాట్యం), ఆనంద్ శంకర్ జయంత్ (భరతనాట్యం) ఉన్నారు. మార్చి దళిత ఉద్యమ చరిత్ర తెలుగు అనువాదానికి ప్రభాకర్ మందరకు సాహిత్య అకాడమీ అనువాద అవార్డు- 2009 లభించింది. హిందీ నటి జయాబచ్చన్‌కు లండన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో లైఫ్ టైం అచీవ్‌మెంట్ పురస్కారం బహూకరించారు. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ అందజేసే స్ర్తీ శక్తి పురస్కారం(కన్నెగి అవార్డు) 2008 సంవత్సరానికి హైదరాబాద్ రచయిత్రి మహేజబీన్‌కు లభించింది. కడపలో బాలనేరస్తుడిగా శిక్ష అనుభవిస్తున్న విద్యాసాగర్ బంగారు నంది అవార్డ్‌ను అందుకున్నాడు. ‘బాపు కలలుగన్న దేశం’ అనే తెలుగు నాటకంలో ‘సేగా’ అనే గిరిజన బాలుడిగా మంచి నటనను ప్రదర్శించినందుకు అతనికి ఈ అవార్డ్ లభించింది. 82 ఏళ్ల ఆస్కార్ చరిత్రలో ఉత్తమ డెరైక్టర్ అవార్డు పొందిన తొలి మహిళగా కేథరిన్ బిగెలో రికార్డు సృష్టించింది. హార్ట్ లాకర్ చిత్రానికి ఆమెకు ఈ పురస్కారం దక్కింది. ఉత్తమ చిత్రం, దర్శకత్వం, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్, సౌండ్ ఎడిటింగ్, మిక్సింగ్ విభాగాల్లో హార్ట్ లాకర్ చిత్రానికి మొత్తం ఆరు ఆస్కార్‌లు దక్కాయి. అవతార్ చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ, కళా దర్శకత్వం విభాగాల్లో ఆస్కార్ అవార్డులు వచ్చాయి. ఉత్తమ నటుడు - జెఫ్ బ్రిజెస్(చిత్రం: క్రేజీ హార్ట్) ఉత్తమ నటి - శాంద్రా బులక్(ది బ్లైండ్ సైట్) ఉత్తమ సహాయ నటుడు - క్రిస్టోఫ్ వాల్జ్ ఉత్తమ సహాయ నటి - మోనికే మీడియాలో అత్యంత ప్రతిభ చూపిన మహిళలకు ఇచ్చే చమేలీ దేవి అవార్డు 2009 సంవత్సరానికి తెహల్కా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సోమా చౌదరి, నాగాలాండ్ పేజ్ ఎడిటర్ మొనాలిసా చాంగ్‌కిజలకు సంయుక్తంగా లభించింది. భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు 2010కి వరల్డ్ స్టేట్స్‌మెన్ అవార్డు లభించింది. అమెరికాకు చెందిన ‘ది అప్పీల్ ఆఫ్ కన్‌సైన్స్ ఫౌండేషన్’ ఈ అవార్డును అందజేస్తుంది. భారత నవలా రచయిత రానా దాస్ గుప్తాకు 2010కు కామన్వెల్త్ రైటర్స్ ప్రైజ్ ప్రాంతీయ విభాగంలో లభించింది. 2008 ఆంధ్రప్రదేశ్ చలన చిత్ర అవార్డులు ఎన్టీఆర్ జాతీయ అవార్డు: జమున(నటి) బీఎన్ రెడ్డి జాతీయ అవార్డు: కెబి తిలక్(దర్శకుడు) నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ అవార్డు: ఎ రమేశ్ ప్రసాద్(నిర్మాత) రఘుపతి వెంకయ్య అవార్డు: విజయ నిర్మల (నటి, దర్శకురాలు) {పముఖ హిందీ రచయిత అమర్‌కాంత్ వ్యాస్ సమ్మాన్ అవార్డుకు ఎంపికయ్యారు. ‘ఇన్హీ హత్యా రోన్‌సే’ అనే నవలకు ఈ అవార్డు లభించింది. ఎన్టీఆర్ జాతీయ సాహిత్య పురస్కారం-2010కి ప్రముఖ బెంగాలీ రచయిత్రి మహాశ్వేతాదేవి ఎంపిక. సరస్వతీ సమ్మాన్ అవార్డు-2009ను పంజాబీ కవి సుర్జీత్ పతార్‌కు మార్చి 22న న్యూఢిల్లీలో ప్రకటించారు. ఆయన రాసిన కవితా సంపుటి ‘లఫ్జన్ ది దర్గా’కు ఈ అవార్డు దక్కింది. {పతిష్టాత్మక అబెల్ ప్రైజ్‌ను 2010 సంవత్సరానికి అమెరికా గణిత శాస్తవ్రేత్త జాన్ టొర్రెన్స్ టాటెకు మార్చి 24న ఓస్లోలో ప్రకటించారు. ఏప్రిల్ ఆర్కిటెక్చర్‌లో అత్యున్నత బహుమతి ప్రిట్జ్‌కెర్ ప్రైజ్ 2010 సంవత్సరానికి జపాన్ ఆర్కిటెక్చర్లు కజుయో సెజిమా, రేయు నిషిజావాలకు లభించింది. బెంగాలీ నవలాకారుడు మణిశంకర్ ముఖర్జీ రాసిన చౌరంఘీ ఇండిపెండెంట్ ఫారిన్ ఫిక్షన్ ప్రైజ్-2010కి ఎంపిక చేసిన పుస్తకాల్లో ఒకటిగా నిలిచింది. ఒక భారతీయ రచయిత రాసిన పుస్తకం ఈ ప్రైజ్‌కు ఎంపికవడం ఇదే మొదటిసారి. మే బెంగళూరులో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్)లో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నాగరాజా 2008 సంవత్సరానికి గానూ శ్రమరత్న అవార్డ్‌కు ఎంపికయ్యారు. భారత సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్‌కు ‘పీపుల్స్ చాయిస్’ గోల్డ్ మెడల్ దక్కింది. మాస్కోలో జరిగిన రెండో ప్రపంచ సైకత శిల్ప ఛాంపియన్‌షిప్ పోటీల్లో ఈ బహుమతి పొందారు. 2010 సంవత్సరానికి సిడ్నీ శాంతి పురస్కారానికి(పీస్ ప్రైజ్) ప్రముఖ భౌతిక శాస్తవ్రేత్త, పర్యావరణ వేత్త వందనా శివ ఎంపికయ్యారు. {పముఖ సామాజిక కార్యకర్త ఎలాభట్ (76)కు 2010 సంవత్సరానికి జపాన్ పురస్కారం ‘నివానో పీస్ ప్రైజ్’ టెక్సాలో మే 13న బహూకరించారు. సాహితీవేత్త జేజీ ఫెరల్‌కు లాస్ట్‌మన్ బుకర్ ప్రైజ్-2010 లభించింది. మరణానంతరం ఆయన ‘ట్రబుల్స్’ పుస్తకానికి ఈ అవార్డును మే 20న ప్రకటించారు. ఫెరల్‌కు ఇది రెండో బుకర్ ప్రైజ్. ఈయన రాసిన ‘సీజ్ ఆఫ్ కృష్ణాపూర్’కు 1973లో ఈ ప్రైజ్ లభించింది. జూన్ కేన్స్ చలనచిత్రోత్సవంలో ఉత్తమ చిత్రానికి బహూకరించే ‘పామ్‌డిఒర్’ పురస్కారం ‘అంకుల్ బూన్మీ’ కి లభించింది. దీనికి వీరసెతకుల్ దర్శకత్వం వహించారు. ఉత్తమ నటుడిగా జేవియర్ బార్డెమ్(స్పెయిన్), ఎలియో జెర్మనో (ఇటలీ)లు సంయుక్తంగా ఎంపికయ్యారు. ఉత్తమ నటిగా జూలియట్ బినోచ్(ఫ్రాన్స్-చిత్రం సర్టిఫైడ్ కాపీ), ఉత్తమ దర్శకుడిగా మాథ్యూ అమ్రాలి(ఆన్ టూర్ డెరైక్టర్) నిలిచారు. అమెరికా నవలా రచయిత్రి బార్బరా కింగ్ సోల్వెర్ 2010 ఆరెంజ్ ప్రైజ్‌కు ఎంపికయ్యారు. ‘ది లాకునా’ నవలకు గాను ఆమెకు ఈ బహుమతి లభించింది. జూలై మానవ అక్రమ రవాణాను అరికట్టడంలో చేసిన కృషికి గాను ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ అధికారి ఎస్.ఉమాపతికి అమెరికా గౌరవ పురస్కారం లభించింది. ఈ గౌరవం పొందిన తొలి భారతీయ అధికారి ఉమాపతి. ఉత్తమ జర్నలిస్ట్‌లకు బహుకరించే రామనాథ్ గోయంకా అవార్డుకు ప్రింట్ కేటగిరీ విభాగంలో సిద్ధార్థ వరదరాజన్ (హిందూ దినపత్రిక), బ్రాడ్ కాస్టింగ్ కేటగిరీలో జర్నలిస్ట్ ఆఫ్ ది ఇయర్‌గా అర్నాబ్ గోస్వామి (టైమ్స్ నౌ) ఎంపికయ్యారు. ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ 2010 లోకమాన్య తిలక్ అవార్డుకు ఎంపికయ్యారు. ఆగస్టు 2010 సంవత్సరానికి కేంద్రం క్రీడా పురస్కారాలను ప్రకటించింది. రాజీవ్ ఖేల్త్న్ర: సైనా నెహ్వాల్, ద్రోణాచార్య అవార్డు: ఎ.కె.కుట్టి (అథ్లెటిక్స్), సుభాశ్ అగర్వాల్ (బిలియర్డ్స్, స్నూకర్), లిబోంచా సింగ్ (బాక్సింగ్), అజయ్‌కుమార్ బన్సాల్(హాకీ), కెప్టెన్ చంద్రుప్ (రెజ్లింగ్).. ధ్యాన్‌చంద్ అవార్డు: సతీష్ పిళ్లై(అథ్లెటిక్స్), కుల్ దీప్ సింగ్(రెజ్లింగ్), అనిత చాను(రెజ్లింగ్).. అర్జున అవార్డు: జోసెఫ్ అబ్రహం, కృష్ణ పూనియా (అథ్లెటిక్స్), దినేష్ కుమార్ (బాక్సింగ్), పరిమార్జన్ నేగి(చెస్), జులన్ గోస్వామి(మహిళల క్రికెట్), దీపక్ కుమార్ మండల్(ఫుట్ బాల్), సందీప్ సింగ్(పురుషు ల హాకీ), దినేష్ కుమార్(కబడ్డీ), సంజీవ్ రాజ్‌పుట్ (షూటింగ్), రేహాన్ జహంగీర్ పోంచా(ఈత), కపిల్ దేవ్ కేజే(వాలీబాల్), రాజీవ్ తోమర్ (రెజ్లింగ్), రాజేష్ చౌదరి(యాంటింగ్), జగ్సీస్ సింగ్( పారా ఒలింపిక్స్ అథ్లెటిక్స్), జసిత్ కౌర్ హండా(మహిళల హాకీ)... రాష్ట్రీ య ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్: సర్వీసెస్ స్పోర్ట్స్, కం ట్రోల్ బోర్డ్, టాటా స్టీల్ లిమిటెడ్, ఖేల్ ఇవమ్ యువ విభాగ్ (మధ్యప్రదేశ్ ప్రభుత్వం)లకు లభించాయి. కొంకణి రచయిత రవీంద్ర కేలేకర్‌కు 2006 సంవత్సరానికి 42వ జ్ఞాన్‌పీఠ్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. {పముఖ ఇస్లామిక్ పండితుడు, రచయిత మౌలానా వహిముద్దీన్ ఖాన్ 18వ రాజీవ్‌గాంధీ సద్భావన అవార్డుకు ఎంపికయ్యారు. అశోకచక్ర’ ఆర్మీ మెడికల్ ఆఫీసర్ మేజర్ లాయిశ్రామ్ జ్యోతిన్ సింగ్‌కు మరణానంతరం లభించింది. జమ్ము కాశ్మీర్‌లో ఉగ్రవాదులపై సాగిస్తున్న పోరులో మరణించిన కెప్టెన్ దేవీందర్‌సింగ్ జాస్, యాంటీ నక్సల్స్ ఆపరేషన్లలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఎస్పీ వినోద్ కుమార్ చౌబేలకు ‘కీర్తిచక్ర’ పతకాలను ప్రకటించారు. భారత సంతతికి చెందిన ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, రచయిత, జర్నలిస్ట్ సిమోన్ లెన్వాసింగ్ లీలావతి అవార్డుకు ఎంపికయ్యారు. 2010 విక్రం సారాబాయి అవార్డులు ప్రొఫెసర్ జయరాంచెంగళయ్యార్ (ఖగోళ భౌతిక రంగం-పుణే), ప్రొఫెసర్ కరన్‌దికర్ (వైర్‌లెస్ టెక్నాలజీ-ఐఐటీముంబై), ప్రకాశ్ చౌహాన్(సముద్ర శాస్తల్ర అధ్యయనం-అహ్మాదాబాద్), ప్రొఫెసర్ కె.శ్రీధరన్ (కంప్యుటేషనల్ జియో మెట్రిక్-ఐఐటీ చెన్నై). ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డులను 2007, 08, 09 సంవత్సరాలకు వరుసగా.. మాజీ కేంద్ర మంత్రి ప్రియరంజన్ దాస్ మున్షీ (కాంగ్రెస్), సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు మోహన్ సింగ్, భారతీయ జనతా పార్టీ నాయకుడు మురళీ మనోహర్ జోషిలకు ప్రదానం చేశారు. {పముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్ రెహ్మాన్, ఛత్తీస్‌ఘడ్ నారాయణపూర్ రామకృష్ణ మిషన్ ఆశ్రమ్‌కు 2009 ఇందిరాగాంధీ జాతీయ సమగ్రతా పురస్కారం సంయుక్తంగా లభించింది. ఆసియా నోబెల్‌గా భావించే ప్రతిష్టాత్మక రామన్‌మెగసెసే-2010 అవార్డులు.. తదతోషి అకిబా(జపాన్): అణ్వాయుధాల నిర్మూలన కోసం కృషిచేసినందుకు; హువో దైషన్(చైనా): భారీ కాలుష్యానికి గురైన చైనాలోని మూడో అతిపెద్ద నది హుహాయ్‌కి ప్రాచుర్యం కల్పించినందుకు; పాన్ యుయే (చైనా పర్యావరణ మంత్రి),ఫు కిపింగ్ (చైనా): చైనా ప్రజల అభ్యున్నతి, అభివృద్ధి విషయంలో పర్యావరణాన్ని వేరుచేసి చూడలేమని ప్రాచుర్యం కల్పించినందుకు; క్రిష్టోఫర్, మారియా బెర్నిడో: ఫిలిప్పీన్స్‌లో పేదల కోసం కొత్త బోధన విధానాలను అవలంబించినందుకు; ఎ.హెచ్.ఎం. నోమన్ ఖాన్: బంగ్లాదేశ్‌లో 13 మిలియన్ల మంది వికలాంగులకు సహాయం చేసినందుకు. రైట్ లైవ్లీహుడ్ అవార్డులు- 2010 నిమ్మోబాస్సే(బహుళ జాతి సంస్థల విధానాలకు వ్యతిరేకంగా నైజీరియాలో చేస్తున్న పోరాటానికి), ఎర్విన్ కారేట్లర్ (బ్రెజిల్ పౌరుల మానవ పర్యావరణ హక్కుల కోసం చేస్తున్న పోరాటానికి), శ్రీకృష్ణ ఉపాధ్యాయ (నేపాల్‌లో పేదరిక నిర్మూలనకు పోరాడినందుకు), ఫిజీషియన్ ఫర్ హ్యుమన్ రైట్స్ అనే స్వచ్చంద సంస్థకు (పాలస్తీనా, ఇజ్రాయిల్ ప్రజలకు అందిస్తున్న మొబైల్ వైద్య సేవలకు) లభించాయి. సెప్టెంబర్ ఉద్యమకారిణి ఇరోమ్ చానూ షర్మిలాకు రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతి బహుమతిని ప్రదానం చేశారు. ఈశాన్య భారతదేశంలో సాయుధ దళాల ప్రత్యేక రక్షణ చట్టాలను ఉపసంహరించుకోవాలని షర్మీలా నవంబర్, 2000 నుంచి నిరాహారదీక్ష చేస్తోంది. యునెటైడ్ కింగ్‌డమ్‌లో న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్న సర్‌మోతాసింగ్‌కు 2009కిగాను ప్రైడ్ ఆఫ్ ఇండియా పురస్కారాన్ని సెప్టెంబర్ 22న బ్రిటన్‌లో బహూకరించారు. {పతిష్టాత్మక శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డులు 2010 సంవత్సరానికి సీఎస్‌ఐఆర్ సంస్థాపన దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 26న ప్రకటించారు. వివరాలు.. సంజీవ్ గాలండే(సెల్స్‌సెన్సైస్-పుణే); శుభాథోలె(టీఐఎఫ్‌ఆర్-ముంబై); స్వాపన్ కె.పాటి(బెంగళూరు); సందీప్ వర్మ(కాన్పూర్); జి.కె. అనంత సురేష్(బెంగళూరు); సంఘమిత్ర బంధోపాధ్యాయ్(కోలకత); మిథాలీ ముఖర్జీ(ఢిల్లీ); ఉమేష్ వాసుడియె వాఘ్ మారే(బెంగళూరు); కాలోబారన్ మైథీ(ముంబై); 2009 సంవత్సరానికి గ్రామీణాభివృద్ధిలో శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణల పురస్కారం-ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పరిశోధన, అభివృద్ధి కేంద్రం (ఫరీదాబాద్). 2007, 2008 సంవత్సరాలకు జ్ఞాన్‌పీఠ్ పురస్కారాలను అవార్డుల కమిటీ చైర్మన్ సీతాకాంత్ మహా పాత్ర సెప్టెంబర్ 24న ప్రకటించారు. 2007 సంవత్సరానికి ప్రముఖ మళయాళ కవి ఓఎన్‌వీ కురూప్, 2008 సంవత్సరానికి ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రముఖ ఉర్దూ కవి అఖ్లాక్ ఖాన్ షహర్వార్‌లు ఎంపికయ్యారు. అక్టోబర్ లాల్‌బహదూర్ శాస్ర్తి జాతీయ అవార్డును రాజకీయ, సామాజిక కార్యకర్త అరుణా రాయ్‌కు రాష్టప్రతి ప్రతిభా పాటిల్ అక్టోబర్ 1న ప్రదానం చేశారు. నోబెల్ బహుమతులు- 2010 వైద్యంలో రాబర్ట్ ఎడ్వర్డ్(బ్రిటన్)కు, భౌతిక శాస్త్రంలో మాంచెస్టర్ యూనివర్సిటీ శాస్తవ్రేత్తలు ఆండ్రీగీమ్(51), కాన్‌స్టాంటిన్ నోవో సెలేవ్(36)లకు సంయుక్తంగా లభించింది. రసాయన శాస్త్రంలో రిచర్డ్ హైక్ (అమెరికా), ఐచినెగిషి, అకీరా సుజీ(జపాన్)లకు సంయుక్తంగా లభించాయి. ప్రజాస్వామ్యవాది లూ జియాబో(చైనా)కు నోబెల్ శాంతి బహుమతికి, బ్రిటన్ రచయిత హోవార్డ్ జాకబ్‌సన్ 2010 సంవత్సరానికి ‘మ్యాన్ బుకర్ ప్రైజ్’కు ఎంపికయ్యారు. {బిటన్ రచయిత హోవార్డ్ జాకబ్‌సన్ 2010 సంవత్సరానికి ‘మ్యాన్ బుకర్ ప్రైజ్’కు ఎంపికయ్యారు. ‘ద ఫింక్లర్ క్వశ్చన్’ అనే నవలకు ఈ అవార్డు దక్కింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2009 నంది అవార్డులను అక్టోబర్ 7న ప్రకటించింది. వివరాలు.. ఉత్తమ చిత్రం- సొంత ఊరు, ద్వితీయ ఉత్తమ చిత్రం-బాణం, తృతీయ ఉత్తమ చిత్రం-కలవరమాయెమదిలో, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం-మగధీర, కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం- కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఉత్తమ నటుడు- దాసరి నారాయణ రావు (మేస్ర్తీ), ఉత్తమ నటి-తీర్థ (సొంత ఊరు), ఉత్తమ దర్శకుడు -రాజమౌళి (మగధీర), ఉత్తమ కథా రచయిత- శేఖర్ కమ్ముల(లీడర్), ఉత్తమ సహాయ నటుడు-రామ్ జగన్(మహాత్మ), ఉత్తమ సహాయ నటి- రమ్యకృష్ణ(రాజు మహారాజు), ఉత్తమ గాయకుడు- బాల సుబ్రహ్మణ్యం (మహాత్మ), ఉత్తమ గాయని- చిత్ర (కలవరమాయెమదిలో), ఉత్తమ సంగీత దర్శకుడు- కీరవాణి (వెంగమాంబ), ఉత్తమ గీత రచయిత -సుద్దాల అశోక్ తేజ (మేస్ర్తీ), ఉత్తమ బాలల చిత్రం-బంటి నవంబర్ 41వ భారత అంతర్జాతీయు చలనచిత్రోత్సవాల్లో ‘మోనర్ వునుష్’ బెంగాలీ చిత్రం గోల్డెన్ పీకాక్ (బంగారు నెవులి) అవార్డుకు ఎంపికైంది. {పతిష్టాత్మక ‘హోమీ బాబా లైఫ్ టైం అచీవ్‌మెంట్’ అవార్డుకు అణుశక్తి కమిషన్ వూజీ చైర్మన్ అనిల్ కకోద్కర్ ఎంపికయ్యూరు. సహారా స్పోర్ట్స్ అవార్డులు: సచిన్ టెండూల్కర్ - ఈ ఏటి భారత క్రికెటర్, శతాబ్ది మేటి ఆటగాడు. ఉత్తమ మహిళా క్రికెటర్- మిథాలీ రాజ్, క్రికెటేతర క్రీడాంశాల్లో ఉత్తమ క్రీడాకారుడు- హైదరాబాద్ షూటర్ గగన్ నారంగ్. మహిళల విభాగంలో దీపికా కుమారి (జార్ఖండ్-ఆర్చరీ). యువ ప్రతిభావంతుడు- హైదరాబాదీ షూటర్ అషెర్ నోరియాకు దక్కింది. ఇండియాటుడే మ్యాగజీన్ నిర్వహించిన దేశంలోని రాష్ట్రాల సర్వే-2010లో ఓవరాల్ పెర్ఫార్మెన్స్ ఉత్తమ రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ ఎంపికైంది. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ఆర్ అండ్ డీ) మ్యాగజీన్ ఇన్నోవేటర్ ఆఫ్ ది ఇయర్-2010 అవార్డ్‌కు భారత సంతతి అమెరికన్ పరిశోధకుడు అమిత్ గోయెల్ ఎంపికయ్యారు. హైటెక్ కార్పొరేట్ విభాగంలో ప్రభుత్వరంగంలోని బీహెచ్‌ఈఎల్‌కు సీఐఐ-థామ్సన్ ర్యూటర్స్ ఇన్నోవేషన్ అవార్డ్-2010 లభించింది. సీఎన్‌ఎన్-ఐబీఎన్ ఇంగ్లిష్ న్యూస్‌చానల్‌కు చెందిన కరణ్ థాపర్‌కు ‘బెస్ట్ కరెంట్ అఫైర్స్ ప్రెజెంటర్’గా ఏషియున్ టెలివిజన్ పురస్కారం దక్కింది. {పముఖ వేణుగాన విద్వాంసుడు హరిప్రసాద్ చౌరాసియా ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం ‘షెవలియర్ డాన్ ఎల్‌ఆర్డర్ డి ఆర్ట్స్ ఎట్ డి లెటర్స్’కు ఎంపికయ్యారు. టర్కీ ప్రధానవుంత్రి ఎర్డోగన్, అల్- గడాఫీ ఇంటర్నేషనల్ ప్రైజ్ ఫర్ హ్యువున్ రైట్స్‌కు ఎంపికయ్యూరు. కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ అందించే ‘ఇండియా పవర్ అవార్డు-2010’కి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సరఫరా సంస్థ (ఏపీట్రాన్స్‌కో) ఎంపికైంది. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో సాధించిన ప్రగతికిగాను గ్రేటర్ హైదరాబాద్ వుున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ)కు జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ (జేఎన్ ఎన్‌యుుఆర్‌ఎం) అవార్డు లభించింది. డిసెంబర్ 2010 సంవత్సరానికి 22 మందికి సాహిత్య అకాడెమీ అవార్డులు డిసెంబర్ 20న ప్రకటించారు. ఎనిమిది మంది కవులు, నలుగురు నవలా రచయితలు, ముగ్గురు చిన్నకథల రచయితలకు ఈ అవార్డులు లభించాయి.
జనవరి జాతీయ భద్రతా సలహాదారుగా (ఎన్.ఎస్.ఎ.) విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి శివ శంకర్ మీనన్ నియమితులయ్యారు. {బిటన్ జ్యుడీషియల్ రికార్డర్‌గా భారత సంతతికి చెందిన కళ్యాణీ కౌల్ నియమితులయ్యారు. పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ) చైర్మన్‌గా లోక్‌సభలో భారతీయ జనతా పార్టీ ఉపనేత గోపీనాథ్ ముండే, విదేశీ వ్యవహారాల కమిటీ చైర్మన్‌గా యశ్వంత్ సిన్హా నియమితులయ్యారు. {పసార భారతి నూతన చైర్మన్‌గా ప్రముఖ జర్నలిస్ట్, రచయిత మృణాల్ పాండే నియామకం. సభ్యులుగా దర్శకుడు శ్యాంబెనగల్, ముజఫర్ అలీ, ప్రముఖ జర్నలిస్ట్ సుమన్ దూబే. భారత సైనికదళాల ప్రధానాధికారిగా తూర్పు ప్రాంత సైనిక కమాండర్ లెఫ్ట్‌నెంట్ జనరల్ విజయ్ కుమార్ (వి.కె.) సింగ్ నియమితులయ్యారు. ఫిబ్రవరి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) డెరైక్టర్ జనరల్‌గా విక్రమ్ శ్రీవాత్సవ నియామకం. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) డెరైక్టర్ జనరల్‌గా శరత్ చంద్ర సిన్హా ఫిబ్రవరి 10న నియామకం. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సెక్రటరీ జనరల్‌గా భారత సంతతికి చెందిన సలీల్ శెట్టి నియమితులయ్యారు. ఈ పదవి పొందిన మొదటి భారతీయుడు ఇతడే. ఆర్ట్స్, హ్యుమానిటీస్ రంగాలపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు సలహాలిచ్చే కమిటీలో భారత సంతతి రచయిత జుంపా లాహిరికి చోటు దక్కింది. మార్చి లా కమిషన్ చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పి.వెంకటరామిరెడ్డి మార్చి 20న నియమితులయ్యారు. ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడిగా రబే హస్మీ నడ్వీ వరుసగా మూడోసారి ఎన్నిక. 39 దేశాల అంతర్ ప్రభుత్వ మండలికి చెందిన ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్(ఐపీడీసీ) చైర్మన్‌గా రఘుమీనన్ మార్చి 25న ఎన్నికయ్యారు. అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి ఈ పదవిని పొందిన మొదటి వ్యక్తి మీనన్. జాతీయ సలహామండలి(ఎన్‌ఏసీ) చైర్‌పర్సన్‌గా రెండో సారి సోనియాగాంధీ మార్చి 29న నియామకం. ఏప్రిల్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సరోష్ హోమి కపాడియాను కేజీబాలకృష్ణన్ స్థానంలో రాష్టప్రతి ఏప్రిల్ 20న నియమించారు. 38వ చీఫ్ జస్టిస్‌గా నియమితులైన కపాడియా 28 నెలలు పదవిలో ఉంటారు. భారత విదేశాంగ శాఖ మాజీ అధికారి అతుల్ ఖరే ఐక్యరాజ్యసమితి శాంతి కార్యకలాపాల అసిస్టెంట్ సెక్రటరీ జనరల్‌గా ఏప్రిల్ 30న నియమితులయ్యారు. ఈయన గతంలో ఐక్యరాజ్యసమితి ఇండిగ్రేటెడ్ మిషన్ అధ్యక్షుడిగా పని చేశారు. మే అమెరికాలోని హార్వర్డ్ బిజినెస్ స్కూల్(హెచ్‌బీఎస్) డీన్‌గా భారత సంతతికి చెందిన నితిన్ నోహ్రియా మే 5న నియామకం. ఈ పదవి చేపట్టిన తొలి భారతీయ సంతతి వ్యక్తి నోహ్రియా. ఈయన 1984లో ఐఐటీ-బాంబే నుంచి కెమికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పొందారు. జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ చైర్‌పర్సన్‌గా శాంతా సిన్హా మే 12న నియమితులయ్యారు. ఆమె తొలిసారి 2007లో ఈ పదవి చేపట్టారు. జూన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆరో చైర్మన్ గా భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కె.జి.బాలకృష్ణన్ నియమితులయ్యారు. భారత సంతతికి చెందిన అమెరికన్ సుబ్రా సురేష్ అమెరికా నేషనల్ సైన్స్ ఫౌండేషన్(ఎన్.ఎస్.ఎఫ్) డెరైక్టర్‌గా నియమితులయ్యారు. జాతీయ వెనుకబడిన వర్గాల(బీసీ) కమిషన్ చైర్మన్‌గా మకాని నారాయణ రావు బాధ్యతలు స్వీకరించారు. నెల్లూరుకు చెందిన నారాయణ రావు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడిగా స్విట్జర్లాండ్ మాజీ అధ్యక్షుడు జోసెఫ్ డీస్ ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్‌గా సీనియర్ జర్నలిస్టు తుర్లపాటి కుటుంబరావు నియమితులయ్యారు. రిపబ్లిక్ ఆఫ్ నైజర్‌లో భారత మొదటి రాయబారిగా యోగేంద్ర ప్రతాప్ సింగ్ నియమితులయ్యారు. జూలై అంతర్జాతీయ న్యాయ నిపుణుడు కిషోర్ సింగ్.. విద్యా హక్కు పరిరక్షణకు సంబంధించి ఐకరాజ్యసమితిలో ప్రత్యేక అధికారిగా నియమితులయ్యారు. ఐరాసలో భారతీయుడికి దక్కిన ప్రతిష్టాత్మకమైన పదవి ఇది. ఐక్యరాజ్యసమితి సహస్రాబ్ది (మిలీనియం) అభివృద్ధి లక్ష్యాల సలహా బృందంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీకి చోటు దక్కింది. మైక్రోసాఫ్ట్ చైర్మన్ బిల్ గేట్స్, ప్రఖ్యాత మానవతావాది టెడ్ టర్నర్, నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ తదితరులు ఈ బృందంలో సభ్యులు. ఇందులో ఏకైక భారతీయుడు ముకేశ్ కావడం విశేషం. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధిగా డి.ఆర్. ఎస్.చౌదరి నియామకం. భారత సంతతికి చెందిన గురురాజ్ దేశ్‌పాండే అమెరికా నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్-ఇన్నోవేషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సలహామండలికి కో చైర్మన్‌గా నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా జన్నత్ హుస్సేన్ బాధ్యతలు చేపట్టారు. కాంగోలోని ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళాల ఫోర్స్ కమాండర్‌గా లెఫ్టెనెంట్ జనరల్ చందర్ ప్రకాశ్ నియమితులయ్యారు. ఆగస్టు భారత ఎన్నికల ప్రధానాధికారి(చీఫ్ ఎలక్షన్ కమిషనర్-సీఈసీ)గా ప్రస్తుత ఎన్నికల కమిషనర్ షాబుద్దీన్ యాకుబ్(ఎస్‌వై) ఖురేషీ బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవి చేపట్టిన తొలి ముస్లిం కూడా ఖురేషీనే. సంగీత నాటక అకాడెమీ నూతన చైర్ పర్సన్‌గా ప్రముఖ భరతనాట్య కళా కారిణి లీలా శామ్సన్‌ను రాష్టప్రతి నియమించారు. ఈమె ఐదేళ్లపాటు ఈ పదవిలో ఉంటారు. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా యునిసెఫ్ భారత రాయబారిగా నియమితులయ్యారు. సెప్టెంబర్ . జాతీయ భద్రతా దళం(ఎన్‌ఎస్‌జీ) నూతన అధిపతిగా సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్) ప్రత్యేక డెరైక్టర్ జనరల్ ఆర్‌కే మేధేకర్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ)గా టెలికాం శాఖ కార్యదర్శి పీజే థామస్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. 1973 ఐఏఎస్ బ్యాచ్ కేరళ కేడర్ అధికారి అయిన థామస్.. ప్రత్యుష్ సిన్హా స్థానంలో 14వ సీవీసీగా నియమితులయ్యారు. యూరప్‌లోని ప్రతిష్టాత్మక బిజినెస్ స్కూల్ ‘ఇన్‌సీడ్’ డెరైక్టర్‌గా భారతీయ అమెరికన్ దీపక్‌జైన్ సెప్టెంబర్ 20న నియమితులయ్యారు. అసోంకు చెందిన జైన్ ప్రస్తుతం నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీలోని కెలాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అక్టోబర్ అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) బోర్డ్ ఆఫ్ చైర్మన్‌గా పాకిస్థాన్ మూడోసారి ఎన్నికైంది. 2010-12 సంవత్సరానికి పాకిస్థాన్ అణు ఇంధన సంస్థ చైర్మన్ అన్సార్ పర్వేజ్ 35 మంది సభ్యులున్న బోర్డుకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. లోక్‌సభ సెక్రటరీ జనరల్‌గా న్యాయ శాఖ మాజీ కార్యదర్శి టి.కె. విశ్వనాథన్ నియమితులయ్యారు. సీఆర్పీఎఫ్ నూతన డెరైక్టర్ జనరల్‌గా హైదరాబాద్‌లోని సర్ధార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడెమీ డెరైక్టర్ కె.విజయ కుమార్ నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని సర్ధార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడెమీ డెరైక్టర్‌గా 1974 ఐపీఎస్ బ్యాచ్ అధికారి ఆర్.కె. మాధూర్ నియమితులయ్యారు. నవంబర్ భారత సంతతికి చెందిన కమల హారీస్ కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా నవంబర్ 3న ఎన్నికయ్యారు. ఈ పదవికి ఎన్నికైన మొదటి మహిళ హారీస్. అమెరికాకు చెందిన రోనాల్డ్ నోబెల్ ఇంటర్‌పోల్ సెక్రటరీ జనరల్‌గా నవంబర్ 9న తిరిగి ఎన్నికయ్యారు. ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) నూతన డెరైక్టర్‌గా రాజీవ్ మాధుర్ స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారి నేచల్ సంధూ నవంబర్ 26న నియమితులయ్యారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నూతన డెరైక్టర్‌గా అశ్వనీ కువూర్ స్థానంలో 1974 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అవుర్ ప్రతాప్(ఏపీ) సింగ్ నవంబర్ 30న బాధ్యతలు స్వీకరించారు. డిసెంబర్ నూతన సమాచార కమిషనర్ (సీఐసీ)గా ఎ.ఎన్. తివారీ స్థానంలో సత్యానంద మిశ్రా నియామకం. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డీఎంఏ) సంస్థ వైస్ చైర్మన్‌గా మర్రి శశిధర్ రెడ్డి నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని సనత్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ************************************************************************** క్రీడలు జనవరి 60వ జాతీయ బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్ పురుషుల, మహిళల రెండు విభాగాల్లోను రైల్వేస్ జట్లు విజేతలుగా నిలిచాయి. {Vేట్ బ్రిటన్‌ను ఓడించి స్పెయిన్ మూడోసారి హాప్‌మాన్ కప్ టెన్నిస్ టైటిల్‌ను సాధించింది. వరల్డ్ టీం చెస్ టోర్నీ టైటిల్‌ను రష్యా నిలబెట్టుకుంది. టర్కీలో జరిగిన ఈ పోటీల్లో భారత్‌కు మూడో స్థానం దక్కింది. రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీని ముంబై జట్టు గెలుచుకుంది. రికార్డు స్థాయిలో 39వ సారి ముంబై జట్టు ఈ ట్రోఫీని గెలుపొందింది. గౌతమ్ గంభీర్ టెస్టుల్లో వరుసగా ఐదు సెంచరీలు చేసిన మొదటి భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. ఈ ఘనత సాధించిన నాలుగో క్రికెటర్ గంభీర్. ఈ జాబితాలో ఆస్ట్రేలియా క్రికెటర్ బ్రాడ్‌మన్ వరుసగా ఆరు సెంచరీలతో మొదటి స్థానంలో.. జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా-5), మహ్మద్ యూసుఫ్ (పాకిస్థాన్-5) తర్వాతి వరుసలో ఉన్నారు. ఫిబ్రవరి ఆస్ట్రేలియా ఓపెన్ విజేతలు..పురుషుల సింగిల్స్: రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్). మహిళల సింగిల్స్: సెరెనా విలియమ్స్(అమెరికా). మిక్స్‌డ్ డబుల్స్: లియాండర్ పేస్(ఇండియా), కారాబ్లాక్ (జింబాబ్వే). వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికాతో ఫిబ్రవరి 24న గ్వాలియర్‌లో జరిగిన రెండో వన్డేలో సచిన్ 147 బంతుల్లో 200 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. సయీద్ అన్వర్(పాకిస్థాన్), చార్లెస్ కొవెంట్రీ (జింబాబ్వే) పేరిట 194 పరుగులతో ఉన్న గత రికార్డును బ్రేక్ చేశాడు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో నిర్వహించిన 11వ దక్షిణాసియా క్రీడల్లో 90 స్వర్ణ పతకాలతో సహా మొత్తం 175 పతకాలను సాధించి భారత్ అగ్రస్థానంలో నిలిచింది. న్యూజిలాండ్‌లో ముగిసిన అండర్-19 క్రికెట్ వరల్డ్‌కప్‌ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. ఈ టోర్నీలో భారత్ ఆరో స్థానంలో నిలిచింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)ని గుర్తిస్తున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఓసీ) ఈనెల 12న ప్రకటించింది. భారత్- దక్షిణాఫ్రికాల మధ్య టెస్ట్ సిరీస్ డ్రా అయింది. ఈనెల 18న కోల్‌కతాలో జరిగిన రెండో టెస్టులో భారత్ విజయం సాధించింది. దీంతో ఐసీసీ టెస్ట్ చాంపియన్‌షిప్ కూడా భారత్ గెలుచుకుంది. హేగ్‌లో జరిగిన ఇంటర్‌షూట్ షూటింగ్ చాంపియన్‌షిప్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ అంశంలో అభినవ్ బింద్రా స్వర్ణ పతకం గెలుచుకున్నారు. మార్చి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) భారత మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్‌కు మార్చి 9న క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ క్యాప్ అందజేసింది. వెస్ట్ జోన్‌ను ఓడించి నార్త్‌జోన్ జట్టు దేవధర్ ట్రోఫీని గెలుచుకుంది. భారత్ నుంచి ఫార్ములా వన్ రేస్ (ఎఫ్-1)లో పాల్గొంటున్న రెండో డ్రైవర్‌గా కరణ్ చందోక్ గుర్తింపు పొందాడు. గతంలో నారాయణ్ కార్తికేయన్ 2005లో జోర్డాన్ ఎఫ్-1 టీంలో చేరి భారత మొదటి ఎఫ్-1 డ్రైవర్‌గా నిలిచాడు. 2010కి వరల్డ్ స్పోర్ట్స్ అవార్డులు.. వరల్డ్ స్పోర్ట్స్‌మెన్ ఆఫ్ ది ఇయర్: ఉసేన్ బోల్ట్(జమైకా- అథ్లెట్) స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్: సెరెనా విలియమ్స్ (అమెరికా- టెన్నిస్) వరల్డ్ టీం ఆఫ్ ది ఇయర్: బ్రాన్ జీపీ ఫార్ములా వన్ జట్టు. లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు: నావల్ ఎల్ మౌతావకెల్(మొరాకో-అథ్లెట్) న్యూఢిల్లీలో జరిగిన 2010 హాకీ ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. భారత్ ఎనిమిదో స్థానంలో నిలిచింది. 2010 ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ మార్చి 13న లండన్‌లో ముగిసింది. ఇది 100వ ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్. విజేతలు-పురుషుల సింగిల్స్ లీ చోంగ్ వీ (మలేషియా), మహిళల సింగిల్స్ టిన్నెరా స్మునేన్ (డెన్మార్క్). ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో మరో రెండు జట్లు చేరాయి. మార్చి 21న చెన్నైలో జరిగిన ఫ్రాంచైజీల వేలం పాటలో పుణేను సహారా అడ్వెంచర్ స్పోర్ట్స్ *1,702 కోట్లకు, కొచ్చిని రందేవుస్పోర్ట్స్ వరల్డ్ *1,533 కోట్లకు దక్కించుకున్నాయి. ఏప్రిల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-3 క్రికెట్ టైటిల్‌ను ముంబై ఇండియన్స్‌ను ఓడించి చెన్నై సూపర్ కింగ్స్ గెలుచుకుంది. మే 2010 ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో బల్గేరియా గ్రాండ్ మాస్టర్ వాసిలిన్ తొపలోవ్‌పై నెగ్గి భారత క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ టైటిల్ సాధించాడు. 2010 ట్వంటీ-20 క్రికెట్ ప్రపంచ కప్‌ను ఆస్ట్రేలియాను ఓడించి ఇంగ్లండ్ గెలుచుకుంది. మహిళల ట్వంటీ-20 క్రికెట్ ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. న్యూఢిల్లీలో జరిగిన ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన సుశీల్‌కుమార్‌కు స్వర్ణ పతకం జూన్ {ఫెంచ్ ఓపెన్-2010 విజేతలు.. పురుషుల సింగిల్స్: రాఫెల్ నాదల్ (స్పెయిన్). మహిళల సింగిల్స్: ఫ్రాన్సెస్కో చియనోవ్(ఇటలీ). చియనోవ్ గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకున్న తొలి ఇటలీ మహిళ. 29 ఏళ్ల చియనోవ్ తొలి గ్రాండ్‌స్లామ్ సాధించిన రెండో అతిపెద్ద వయసు గల మహిళ. ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేతలు.. మహిళల సింగిల్స్: సైనా నెహ్వాల్. పురుషుల సింగిల్స్: యూనస్ అలసియా(ఇండోనేషియా) మిక్స్‌డ్ డబుల్స్: భారత్‌కు చెందిన జ్వాల-దిజుల జోడి. టర్కీలోని అంటల్యాలో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్‌లో అమెరికాను ఓడించి భారత్ స్వర్ణ పతకం సాధించింది. దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో 19వ సాకర్ (ఫుట్‌బాల్) ప్రపంచ కప్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు తొలిసారి ఆఫ్రికా ఖండం ఆతిథ్యం ఇస్తోంది. ఇండియన్ ఓపెన్ టేబుల్ టెన్నిస్ విజేతలు.. పురషుల సింగిల్స్: దిమిత్రిజి ఒక్‌చారోవ్ (జర్మనీ). మహిళల సింగిల్స్: సయాకా హిరాన్ (జపాన్). సింగపూర్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను భారత క్రీడాకారిణి సైనా నెహ్వాల్ గెలుచుకుంది. దీంతో రెండు సూపర్ సిరీస్ టైటిల్స్ సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా సైనా ఘనత సాధించింది. జూలై పదో ఆసియా క్రికెట్ కప్‌ను భారత జట్టు కైవసం చేసుకుంది. ఆసియా కప్ నెగ్గడం భారత్‌కు ఇది ఐదోసారి. ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టైటిల్‌ను సైనా నెహ్వాల్ గెలుచుకుంది. సైనాకు ఇది వరుసగా మూడో అంతర్జాతీయ టైటిల్. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా కూడా సైనా రికారు.్డ వింబుల్డన్ 2010 విజేతలు.. పురుషుల సింగిల్స్: రాఫెల్ నాదల్ (స్పెయిన్). మహిళల సింగిల్స్: సెరెనా విలియమ్స్ (అమెరికా). మిక్స్‌డ్ డబుల్స్: లియాండర్ పేస్(భారత్), కారాబ్లాక్ (జింబాబ్వే)ల జోడి. ఇది పేస్‌కు 12వ గ్రాండ్‌స్లామ్ టైటిల్. ఈ విజయంతో పేస్ అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. తర్వాతి స్థానంలో మహేశ్ భూపతి (11గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో) ఉన్నాడు. వింబుల్డన్ టోర్నీలో జాన్ ఇస్నర్ (అమెరికా), నికోలస్ మహుత్ (ఫ్రాన్స్)ల మధ్య 11 గంటల ఐదు నిమిషాలపాటు మ్యాచ్ జరిగింది. టెన్నిస్ చరిత్రలో ఇదే సుదీర్ఘకాలం సాగిన మ్యాచ్. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) నూతన అధ్యక్షుడిగా డేవిడ్ మోర్గాన్ స్థానంలో కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ ఎన్నికయ్యారు. ఈ పదవి చేపట్టిన రెండో భారతీయుడు పవార్. గతంలో జగ్మోహన్ దాల్మియా 1997- 2000 వరకు ఐసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. దక్షిణాఫ్రికాలో ముగిసిన 19వ సాకర్ ప్రపంచకప్‌ను నెదర్లాండ్‌ను ఓడించి స్పెయిన్ గెలుచుకుంది. స్పెయిన్ తొలిసారి ఈ చాంపియన్‌షిన్ సాధించింది. అమెరికాలో జరిగిన వరల్డ్ ఓపెన్ చెస్-2010 టోర్నీలో గ్రాండ్ మాస్టర్ విక్టర్ లాజ్నికా (చెక్ రిపబ్లిక్) విజేతగా నిలిచాడు. భారత గ్రాండ్‌మాస్టర్ హరికృష్ణకు రెండో స్థానం దక్కింది. టెస్ట్ క్రికెట్‌లో 800 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు (133 టెస్టుల్లో 800 వికెట్లు), వన్డేల్లో అత్యధిక వికెట్లు (337 వన్డేల్లో 515 వికెట్లు) తీసిన రికార్డు కూడా మురళీ పేరిటే ఉంది. ఆగస్టు జర్మనీలోని మ్యూనిచ్‌లో జరిగిన ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ షూటర్ గగన్ నారంగ్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో కాంస్య పతకం సాధించాడు. దీంతో 2012 లండన్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారతీయ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. {Mికెట్‌లో అత్యధికంగా 169 టెస్టులు ఆడిన క్రికెటర్‌గా సచిన్ టెండూల్కర్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఆగస్టు 3న శ్రీలంకతో జరిగిన మూడో టెస్టుతో ఈ రికార్డు సాధించాడు. ఇంతవరకు ిస్టీవ్ వా పేరిట (ఆస్ట్రేలియా) 168 టెస్టుల రికార్డుంది. సెప్టెంబర్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు గ్రూప్ కెప్టెన్ హోదాను ప్రదానం చేసింది. ఈ హోదాను అందుకున్న తొలి క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్. చైనాలోని షాంఘైలో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్‌లో భారత పురుషుల జట్టు జపాన్‌ను ఓడించి స్వర్ణ పతకం సాధించింది. ఇదే టోర్నీ.. సీనియర్ కేటగిరిలో దీపికా కుమారి రజతం, పురుషుల వ్యక్తిగత రికర్వ్ పోటీలో జయంత్ తాలుక్‌దార్ కాంస్య పతకాలు సాధించారు. {పపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ 66 కిలోల ప్రీస్టయిల్ విభాగంలో భారత రెజ్లెర్ సుశీల్ కుమార్ స్వర్ణ పతకం సాధించాడు. ప్రపంచ రెజ్లింగ్ పోటీల్లో భారత్‌కు స్వర్ణ పతకం లభించడం ఇదే తొలిసారి. యూఎస్ ఓపెన్-2010 విజేతలు: పురుషుల సింగిల్స్: రఫెల్ నాదల్ (స్పెయిన్). ఈ విజయంతో నాదల్ కెరీర్ స్లామ్ పూర్తి చేసుకున్నాడు(ప్రస్తుత టెన్నిస్ క్రీడాకారుల్లో కెరీర్ స్లామ్ సొంతం చేసుకున్న వారు రోజర్ ఫెదరర్, రాఫెల్ నాదల్). మహిళల సింగిల్స్: కిమ్ క్లియ్‌స్టర్స్(బెల్జియం). {పపంచ మహిళా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్ మేరీకామ్ స్వర్ణం పతకం సాధించింది. ఈ గెలుపుతో ఐదు సార్లు ప్రపంచ టైటిల్ కైవసం చేసుకున్న బాక్సర్‌గా మేరీకామ్ అరుదైన ఘనత దక్కించుకుంది. నేషనల్ స్నూకర్ చాంపియన్‌షిప్‌ను పంకజ్ అద్వానీ గెలుచుకున్నాడు. అద్వానీకి ఇది ఐదో నేషనల్ టైటిల్. దక్షిణాఫ్రికాలో ముగిసిన చాంపియన్స్ లీగ్ టీ-20 క్రికెట్ చాంపియన్‌షిప్‌ను చెన్నైసూపర్ కింగ్స్ గెలుచుకుంది. అక్టోబర్ బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడెమీ (ఎన్‌సీఏ) చైర్మన్‌గా భారత జట్టు మాజీ సారధి అనిల్ కుంబ్లే నియమితులయ్యారు. బీసీసీఐ ప్రెసిడెంట్ ఎలక్ట్‌గా ప్రస్తుత కార్యదర్శి ఎన్.శ్రీనివాసన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. న్యూఢిల్లీ-జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో 19వ కామన్‌వెల్త్‌క్రీడలను అక్టోబర్ 3న భారత రాష్టప్రతి ప్రతిభా పాటిల్, బ్రిటన్ యువరాజు చార్లెస్‌లు ప్రారంభించారు. తొలిసారి భారత్ ఆతిథ్యమిచ్చిన ఈ క్రీడల మస్కట్ ‘షేరా’. భారత క్రీడాకారుల బృందానికి ఒలింపిక్ స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా నేతృత్వం వహించారు. ఈ క్రీడల్లో భారత్ 38 స్వర్ణపతకాలు సహా మొత్తం 101 పతకాలను సాధించి రెండో స్థానంలో నిలిచింది. కాగా ఆస్ట్రేలియా 74 స్వర్ణ పతకాలతో మొదటి స్థానాన్ని దక్కించుకుంది. 2014 కామన్‌వెల్త్ గేమ్స్‌కు స్కాట్‌లాండ్‌లోని గ్లాస్గో పట్టణం ఆతిథ్యం ఇస్తుంది. ఐసీసీ అవార్డులు.. సర్ గర్‌ఫీల్డ్ సోబర్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయుర్-సచిన్ టెండూల్కర్ (ద్రవిడ్ తర్వాత ఈ అవార్డు పొందిన భారత రెండో క్రికెటర్ సచిన్); పీపుల్స్ చారుుస్ అవార్డు-సచిన్; టెస్ట్ ప్లేయుర్ ఆఫ్ ది ఇయుర్- వీరేంద్ర సెహ్వాగ్; వన్డే ప్లయుర్ ఆఫ్ ది ఇయుర్-ఎబీ డివిలియుర్స్; స్పిరిట్ ఆఫ్ క్రికెట్-న్యూజిలాండ్ టీమ్; ఎవుర్జింగ్ ప్లేయుర్-స్టీవ్ ఫిన్; ఎంపైర్ ఆఫ్ ది ఇయుర్- అలీమ్ దర్; ఉమెన్ క్రికెటర్‌ఆఫ్ ది ఇయుర్ -షెల్లీ నిచెకీ నవంబర్ భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లలో నిర్వహించనున్న 2011 క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీకి సచిన్ టెండూల్కర్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ఈ టోర్నీ 2011 ఫిబ్రవరి 19 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగనుంది. చైనాలోని గ్వాంగ్‌జౌలో నిర్వహించిన 16వ ఆసియా క్రీడల్లో భారత్ 14 స్వర్ణ పతకాలతోసహా మొత్తం 64 పతకాలను సాధించి ఆరో స్థానంలో నిలిచింది. తదుపరి ఆసియా క్రీడలకు 2014లో దక్షిణ కొరియాలోని ఇంచియోన్ నగరం ఆతిధ్యం ఇవ్వనుంది. డిసెంబర్ ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌ను రోజర్ ఫెదరర్(స్విట్జర్లాండ్) గెలుచుకున్నారు. ఫెదరర్ ఐదో సారి ఈ చాంపియున్‌షిప్‌ను సాధించాడు. ఫిఫా(సాకర్) ప్రపంచకప్ టోర్నీని 2018లో రష్యా, 2022లో ఖతార్‌లో నిర్వహించనున్నారు. 2014 సాకర్ వరల్డ్ కప్ వేదిక బ్రెజిల్. డేవిస్ కప్ టెన్నిస్ టైటిల్‌ను తొలి సారి సెర్బియూ జట్టు గెలుచుకుంది. ఫైనల్లో ఫ్రాన్స్‌ను ఓడించింది. హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టైటిల్‌ను సైనా నెహ్వాల్ గెలుచుకుంది. 1982లో ప్రకాశ్ పదుకొనే తర్వాత హాంకాంగ్ టైటిల్ సాధించిన తొలి భారతీయుురాలిగా కూడా సైనా గుర్తింపు పొందింది. న్యూజిలాండ్‌తో ముగిసిన మూడు టెస్ట్ మ్యాచ్‌ల క్రికెట్ సిరీస్‌ను భారత్ 1-0 తేడాతో గెలుచుకుంది. ఐదు వన్డేల క్రికెట్ సిరీస్‌ను భారత్ 5-0తో గెలుచుకుంది. సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికాతో ముగిసిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో 50వ సెంచరీ సాధించాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. దీంతో టెస్ట్, వన్డేలలో కలిపి అంతర్జాతీయ స్థాయిలో సచిన్ సాధించిన సెంచరీల సంఖ్య 96కు చేరుకుంది. ఇదే మ్యాచ్‌లో రాహుల్ ద్రవిడ్ 12,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్ ద్రవిడ్.ప్రస్తుతం సచిన్(14,509),పాంటింగ్(12,333), ద్రవిడ్(12,000) కంటే ముందున్నారు. ఇండియన్ ఓపెన్ గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ టోర్నీ డిసెంబర్ 19న హైదరాబాద్‌లో ముగిసింది. విజేతల వివరాలు.. పురుషుల సింగిల్స్: హయోమ్ రుంబాకా(ఇండోనేషియా); మహిళల సింగిల్స్: జుహు హుచ్(చైనా); భారత్‌కు చెందిన పారుపల్లి కశ్యప్(పురుషుల సింగిల్స్), పి.వి. సింధు (మహిళల సింగిల్స్), తరుణ్-అశ్విని(మిక్స్‌డ్ డబుల్స్)లకు కాంస్య పతకాలు లభించాయి. డర్బన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్ సంద ర్భంగా.. భారత క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ టెస్ట్ క్రికెట్‌లో 200 క్యాచ్‌లు (149టెస్టుల్లో) అందుకున్న తొలి క్రికెట ర్‌గా రికార్డు సృష్టించాడు. వూర్క్‌వా (ఆస్ట్రేలియూ-181 క్యాచ్‌లు), రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియూ-174 క్యాచ్‌లు) లు ద్రవిడ్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ************************************************** అవీ ఇవీ జనవరి {పపంచంలో ఎతె్తైన భవనం ‘బుర్జ్ దుబాయ్’ని దుబాయ్‌లో రాజు బిన్ రషిద్ అల్ ముక్తామ్ ప్రారంభించారు. ఎత్తు 2700 అడుగులు. నిర్మాణ ఖర్చు *7531కోట్లు. వయోజన నిరక్షరాస్యుల్లో అత్యధిక మంది భారత్‌లోనే ఉన్నట్లు యునెస్కో నివేదిక పేర్కొంది. దీని ప్రకారం దేశంలో 1985-1994 మధ్య వయోజనుల్లో సగం మంది అక్షరాస్యులు ఉండేవారు. ప్రస్తుతం వీరి సంఖ్య జనాభాలో మూడింట రెండు వంతులకు చేరడంతో (వయోజనుల జనాభా 45 శాతం పెరిగింది) నిరక్షరాస్యత కూడా పెరిగినట్లు ఆ నివేదిక పేర్కొంది. భారతీయ విశ్వవిద్యాలయాల్లో వ్యవసాయ రంగంలో మాస్టర్స్, పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్ అభ్యసించే ఆఫ్ఘనిస్తాన్ విద్యార్థులకు వచ్చే ఐదేళ్ల పాటు ఏటా 100 ఫెలోషిప్‌లు అందజేయాలని భారత్ నిర్ణయించింది. మే గూగుల్ వెబ్‌ట్రాఫిక్ డేటా ప్రకారం అతి ఎక్కువమంది దర్శించిన వెబ్‌సైట్ ఫేస్‌బుక్.కామ్. ఇంటర్నెట్ వినియోగదారులలో 35శాతం మంది దీన్ని దర్శించారు. ఈశాన్య రాష్ట్రాల్లో కోన్యక్ నాగాస్ జీవితాల ఆధారంగా తీసిన ‘లాస్ట్ ఆఫ్ ది టాటోయిడ్ హెడ్‌హంటర్స్ (Last of the Tattooed Head Hunters) అనే లఘుచిత్రాన్ని కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. జూన్ {పకృతి వైపరీత్యాల వల్ల తీవ్ర ముప్పు పొంచి ఉన్న దేశాల్లో భారత్ చేరింది. బ్రిటన్‌కు చెందిన ‘మ్యాపుల్‌క్రాప్ట్’ అనే సంస్థ ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రమాదం ఎదుర్కొనే 15 దేశాల జాబితాను రూపొందించింది. ఇందులో బంగ్లాదేశ్ మొదటి స్ధానంలో నిలిచింది. ఈ జాబితాలో భారత్‌కు 11వ స్థానం దక్కింది. అమెరికాలో మూడో అతి పెద్ద వలస గ్రూప్‌గా భారతీయులు నిలిచారు. వాషింగ్టన్‌కు చెందిన మైగ్రేషన్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఈ సర్వే ప్రకారం.. మెక్సికో, ఫిలిప్పీన్స్ తర్వాత భారత్ నుంచి ఎక్కువ మంది వలస వచ్చారు. జూలై కేంద్ర న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ రాసిన ‘తెంబారే (డోలు వాయిద్యం)’ తెలుగు అనువాదం ‘కాలం అంచున’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తమిళనాడు ప్రభుత్వం విద్యా, ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 69 శాతం రిజర్వేషన్లను మరో ఏడాది కొనసాగించేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. ఆగస్టు సౌత్ ఆఫ్రికాలో జరిగిన 2010 ఊఐఊఅ వరల్డ్‌కప్‌లో ప్రేక్షకుల మధ్య మారుమోగిన ఏౌట అనే వాయిద్యం పేరు ఆక్స్‌ఫర్‌డ ఇంగ్లిష్ నిఘంటువులో స్థానం సంపాదించింది. ఫుట్‌బాల్ ఫ్యాన్‌సకు బాగా పరిచయం ఉన్న ఈ వాయిద్యం పొడవైన ప్లాస్టిక్‌తో చేసిన ఒక పరికరం. లోక్‌సభ మాజీ స్పీకర్ సోవునాథ్ చటర్జీ రచించిన ‘కీపింగ్ ద ఫెయిత్: మెమొరీస్ ఆఫ్ ఏ పార్లమెంటేరి యన్’ పుస్తకాన్ని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. సెప్టెంబర్ {పముఖ బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ నిర్మించిన ‘పిప్లీలైవ్’ 2011 సంవత్సరానికి ఆస్కార్ అవార్డులకు నామినేషన్ పొందింది. ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో మన దేశం నుంచి ఈ చిత్రం అధికారిక ఎంట్రీగా నిలిచింది. అనుషా రిజ్వీ ఈ చిత్రానికి కథను అందించడం తోపాటు దర్శకత్వం వహించారు. నవంబర్ ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ-2010 సంవత్సరం పదంగా (వర్డ్ ఆఫ్ ది ఈయర్)- ‘రెఫ్యూడియేట్ (Refudiate)’ నిలిచింది. రెఫ్యూడియేట్ అంటే తిరస్కరణ అని అర్థం. ఈ పదాన్ని అలాస్కా మాజీ గవర్నర్ సారా పాలిన్ తన ట్విట్టర్ మెసేజ్‌లో ఉపయోగించారు. న్యూయార్క్‌లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలిన ప్రాంతం సమీపంలో మసీదు నిర్మాణ ఆలోచనను శాంతి కాముకులైన ముస్లింలు తిరస్కరించాలని పాలిన్ తన ట్విట్టర్ మెసేజ్‌లో కోరారు. 2010 జూలైలో మేరియం-వెబ్‌స్టర్ ఆన్‌లైన్ డిక్షనరీలో ఎక్కువ మంది వెతికిన పదంగా కూడా నిలిచింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ వూజీ చీఫ్ సెక్రటరీ(సీఎస్) నీరా యూదవ్‌కు సీబీఐ ప్రత్యేక కోర్టు డిసెంబర్ 8న నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. నీరా 1992-94లో నోరుుడా అభి వృద్ధి సంస్థ చైర్‌పర్సన్‌గా వ్యవహరించిన సవుయుంలో.. ప్లాట్ల కేటారుుంపులో నిబంధనలు ఉల్లంఘించినందుకు కోర్టు ఈ శిక్ష విధించింది. డిసెంబర్ దేశంలో అక్టోబర్ నాటికి 70.6 కోట్ల మెుబైల్ కనెక్షన్లు ఉన్నట్లు భారత టెలికాం రెగ్యులేటరీ అథారిటీ వెల్లడిం చింది. దీంతో దేశంలో మెుత్తం వైర్‌లెస్, వైర్‌లైన్ కనెక్షన్ల సంఖ్య 74.2 కోట్లకు చేరుకుంది. అదేవిధంగా టెలీ డెన్సిటీ 62.51శాతానికి పెరిగింది. ఇదే సవుయుంలో కోటిన్నర వుందికి బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్లు ఉన్నారుు. దేశంలో మెుదటిసారిగా వుుంబైలో జల వివూన(రన్‌వే అవసరం లేకుండానే సవుుద్ర జలాల్లో దిగి, నీటి మీద నుంచే టేకాఫ్ తీసుకునేది) సర్వీసులను ప్రారంభిం చారు. అండవూన్ నికోబార్ దీవులకు, లక్ష దీవులకు ప్రయూణాన్ని సులభరతం చేసే ఉద్దేశంతో ప్రారంభిం చిన జల వివూనం సేవలు గోవా, ఒడిశాలకు అందుబా టులో ఉంటారుు. |
ఇయర్ రౌండప్ -2010 స్పెషల్
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment