జనరల్ సైన్సూ ముఖ్యమే...!











జంతురాజ్యం

రాబర్‌‌ట విట్టేకర్ ప్రతిపాదించిన జీవుల వర్గీకరణ బహుకణ జంతువులన్నింటినీ జంతురాజ్యం (Animalia)లో వర్గీకరించారు. జీవులన్నిం టిలో జంతువులు సంక్లిష్టమైనవి. జంతువుల శరీర నిర్మాణం, శరీర ధర్మాల్లో ఎంతో వైవిధ్యం కనిపిస్తుంది. అతి సరళ జంతువులు ప్రోటోజో వా జీవులు. ఇవి మొదటి, ఏకకణ జంతువులు. ప్రస్తుత వర్గీకరణ బట్టి వీటిని ప్రోటిస్టా రాజ్యం లో వర్గీకరించారు. జంతువులను అనేక ప్రధాన వర్గాల్లోకి విభజిస్తారు. ఒక వర్గంలోని జంతువు లన్నీ కొన్ని సామాన్య సాధారణ లక్షణాలు ప్రదర్శిస్తాయి. ఐతే వీటిలో కూడా ప్రత్యేకతలు ఉండటం ద్వారా ఒక వర్గాన్ని విభాగాల్లో, విభా గాన్ని క్రమంలో విభజిస్తారు. 

ఉదాహరణకు మానవుడు కార్డేటా వర్గానికి చెందినవాడు. ఈ వర్గంలోని క్షీరదాల (mammals) విభాగంలోని ప్రైమేట్స్ (Primates) క్రమంలో మనిషిని వర్గీకరించారు. ఒక క్రమంలో అవే ప్రజాతి (Genus)లు ఉంటాయి. ఒక ప్రజాతిలో అనేక జాతులు (species) ఉంటాయి. ఒక జాతి అంటే తమలోతాము అంతర్‌ప్రజననం చెందే సమాన లక్షణాలున్న జీవుల సమూహమని అర్థం. సివిల్స్ ప్రిలిమ్స్, గ్రూప్-1 ప్రిలిమ్స్, గ్రూప్-2 పరీక్షల్లో తరచుగా జంతువర్గం లేదా రకాల ప్రశ్నలొతస్తున్నాయి. ప్రశ్నలు ఎక్కువగా జంతువుల ప్రత్యేక లక్షణాలు, జంతువుల ఉప యోగాలపై కేంద్రీకృతమై ఉంటున్నాయి. కాబట్టి ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని జంతు వర్గాలు చదువుకోవాలి.

జంతువులన్నిట్లో సంక్లిష్టమైంది కార్డేటా. మిగతా వర్గాలను నాన్-కార్డేటా వర్గాలంటారు. ప్రధాన నాన్‌కార్డేటా వర్గాలు.. ప్రోటోజోవా, పొరిఫెరా, సీలెంటిరేటా, ప్లాటిహెల్మింథిస్, నెమాటి హెల్మింథిస్, అనెలిడా, ఆర్థ్రోపొడా మొలస్కా, ఇకైనోడెర్మేటా. ప్రోటోజోవా ఏకకణ జీవులున్న వర్గం. వీటిలో కణం జీవిగా వ్యవహ రిస్తుంది. పోషణ, శ్వాస, విసర్జక క్రియలు ప్లాస్మాత్వచం ద్వారానే జరుగుతాయి. ఇవి అత్యధికంగా స్వేచ్ఛా జీవులు. ఉదా: అమీబా, పారామీసియం, యుగ్లీనా. కొన్ని పరాన్న జీవులుగా వ్యవహరిస్తూ మానవుడు ఇతర జంతువులకు వ్యాధులు కలిగిస్తున్నాయి. ఉదా: ప్లాస్మోడియం (మలేరియా), లిష్మానియా డొనొ వాని (కాలా అజార్), లిష్మానియా ట్రాఫికా (ఢిల్లీ బామిల్స్), ఎంటమీబా హిస్టాలిటికా (అమీబియాసిస్).

మొదటి బహుకణ జంతువుల వర్గం పొరి ఫెరా. వీటి శరీరమంతా రంధ్రాలు ఉంటాయి. సాధారణంగా వీటిని స్పంజికలు అంటారు. వీటిలో పోషణ, శ్వాస, విసర్జక క్రియ, ప్రత్యు త్పత్తిలో ఉపయోగపడే కుల్య వ్యవస్థ, రక్షణ కోసం కంటకాలు (spicules) అనే ముళ్ల వంటి నిర్మాణాలుంటాయి. ఉదా: యూస్పాంజియా, యూప్లెక్టెల్లా, క్లయోనా.
మొదట కణజాలయుత జంతువర్గం సీలెం టిరేటా లేదా నిడేరియా. వీటిలో ఆహార సేకరణ, రక్షణ, చలనంలో ఉపయోగపడే వంశ కణాలు (nidoblasts/ Nemat-oblasts) ఉండడం ప్రత్యేకత.

ఉదా: హైడ్రా, జెల్లీ ఫిష్, సీఫ్యాన్, సీఫెరర్
ఈ వర్గంలోని ప్రవాళంలో కొన్ని ఉష్ణ సముద్రాల్లో తీరం నుంచి కొన్ని కి.మీ. దూరం లో ప్రవాళ అవరోధాలు (coral reefs) నిర్మి స్తాయి. ఇవి అధిక జీవవైవిధ్యానికి నిలయాలు.
మొదటి అవయవ శ్రేణి జంతువులు ప్లాటీ హెల్మింథిస్. ఇవి అధికంగా పరాన్న జీవులు.
ఉదా: బద్దెపురుగులు, ఫ్లూక్‌లు. కొన్ని స్వేచ్ఛాజీవులు. ఉదా: ప్లనేరియన్‌లు. 

వీటిలోని విసర్జకాంగాలు జ్వాలా కణాలు. నిజమైన పురుగులు ఉన్న వర్గం నెమాటిహెల్మిం థిస్, నాళంలో నాళం లాంటి శరీర నిర్మాణాన్ని ప్రదర్శించే వీటిలో... అధికంగా పరాన్నజీవులు లీ ఆస్కారిస్ (గుండ్రటి పురుగు), ఆంకైలోస్టో మా(కొక్కెపురుగు), ప్యుచరేరియా (ఫైలేరియా పురుగు). నిజమైన శరీర ఖండీ భవనం, శరీర కుహరాలు అభివృద్ధి చెందిన మొదటి జంతు వర్గం అనెలిడా. ఈ వర్గంలో వానపాములు, జలగలు, నిరీస్, సముద్ర ఎలుక వంటి జంతు వులుంటాయి. 

అతి పెద్ద జంతువర్గం ఆర్ద్రో పోడా. వీటిలో కీటకాలు, క్రస్టేసియన్‌లు(రొ య్యలు, పీతలు, లాబ్ట్సర్‌లు(షింప్‌లు), అరాక్ని డన్‌లు(తేళ్లు సాలీడు టిక్‌లు మైట్‌లు) మిరియా పాడ్‌లు(శతపాదులు, సహస్రపాదులు)పెరిప్యా టిస్ అనే జంతువులుంటాయి. కీటకాల్లో మూడు జతల కాళ్లు, రెండు జతల రెక్కలు, విస ర్జకంగాలుగా మాల్ఫిజీయన్ నాళికలు, శ్వాసాం గాలుగా వాయునాళాలు, నత్రజని వ్యర్థంగా యూరిక్ ఆమ్లం, సంయుక్త నేత్రాలు ఉంటాయి. రెండో అతిపెద్ద జంతువర్గం మొలస్కా. మృదు వైన శరీరమున్న ఈ జంతువులన్నిట్లో దాదాపు రక్షణ కోసం కర్పరం (shell) ఉంటుంది. నీటి నాణ్యత తెలుసుకునే ఆస్ఫ్రేడియాలు అనే జ్ఞానేంద్రియం ఉండటం వీటి ప్రత్యేకత.

ఉదా: నత్తలు, ముత్యపు చిప్పలు, స్వ్విడ్‌లు, మసల్స్, క్లాంలు, సెపియా అక్టోపస్.
కేవలం సముద్ర జీవులు మాత్రమే ఉన్న జంతువర్గం ఇకైనోడెర్మాటా. వీటి శరీరమంతా ముళ్లుంటాయి. చలనం కోసం జలప్రసరణ వ్యవస్థ ఉండటం వీటి ప్రత్యేకత. ఉదా: స్టార్‌ఫిష్, సీ లిల్లీలు, సముద్ర దోసకాయలు
శరీర పృష్ట మధ్య భాగంలో పృష్ఠదండం అనే దండాకార నిర్మాణం లేదా దాని రూపాం తర నిర్మాణం ఉన్న జంతువులు కార్డేటా వర్గంలో ఉంటాయి. వీటిలో అధిక జీవుల్లో పృష్ఠ దండం వెన్నెముకగా మారి ఉంటుంది. వీటిని సకశేరుకాలంటారు. సకశేరుకాలు ప్రధానంగా రెండు రకాలు. దవడలు లేని నిమ్న సకశేరుకాలు. ఉదా: మిక్సిన్ (Hagfish), పెట్రోమైజాన్ (Lamforey). ఇవి చేపలా ఉండే జలచరాలు. రెండో రకం దవడలు ఉన్న ఉన్నత సకశేరుకాలు. ఇవి ఐదు రకాలు... చేపలు, ఉభయ చరజీవులు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. చేపలు తప్ప మిగతా నాలుగు రకాలు చతుష్టాదులు.

చేపలు, ఉభయ చరజీవులు, సరీసృపాలు- శీతల రక్త, అస్థిరోష్ణ జంతువులు. పక్షులు, క్షీరదాలు ఉష్టరక్త జీవులు. సరీసృపాలు, పక్షులు, క్షీరదాల్లో అంతర ఫలదీక రణం ఉంటుంది. ఆడజీవి శరీరంలో పిండాభి వృద్ధి మొదలవుతుంది. పిండం చుట్టూ ఉల్బం తో సహా ఇతర పిండత్వచాలు ఏర్పడుతాయి. కాబట్టి ఈ మూడు రకాల సకశేరుకాలను ఉల్బ జీవులంటారు.

ప్రాక్టీస్ బిట్స్
1. వీటిలో కీటకం కానిది?
ఎ) బొద్దింక బి) సాలీడు
సి) బీటిల్ డి) సీతాకోకచిలుక

2. రుతువులకు అనుగుణంగా జంతువులు ప్రదర్శించే వలసల అధ్యయనం?
ఎ) ఫినాలజీ బి) ఫ్రెనాలజీ
సి) ట్రోఫాలజీ డి) సెరాలజీ

3. నేషనల్ రీసెర్‌‌చ సెంటర్ ఆన్ కేమల్ (ఒంటె) ఎక్కడ ఉంది?
ఎ) జోథ్‌పూర్ బి) బికనీర్
సి) ఉదయ్‌పూర్ డి) జైపూర్

4. వీటిలో ఉభయలింగ జీవి?
ఎ) స్పంజిక బి) వానపాము
సి) బద్దెపురుగు డి) పైవన్నీ

5. అత్యంత వైవిధ్యమైన ప్రవాళఛిత్తికలు ఎక్కడ కనిపిస్తాయి?
ఎ) ఫిజీ దీవులు
బి) అండమాన్, నికోబార్ దీవులు
సి) ఆస్ట్రేలియా తీరం డి) లక్ష దీవులు

6. వీటిలో నిజమైన చేప?

ఎ) జెల్లీ ఫిష్ బి) స్టార్ ఫిష్
సి) సిల్వర్ ఫిష్ డి) స్టోన్ ఫిష్
7. ఏ ప్రోటీన్ ఆక్సీకరణ ద్వారా కొన్ని జంతు వుల శరీరం నుంచి కాంతి విడుదల వుతుంది?
ఎ) లైసోజైం బి) ల్యూసిఫెరిన్
సి) రెనిన్ డి) సెరిసిన్

8. కింది పట్టు రకాల్లో దేశీయ రకం?
ఎ) ఎరి బి) ముగా సి) తసార్ డి) మల్బరీ
9. లక్క ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న దేశం?
ఎ) శ్రీలంక బి) చైనా సి) భారత్ డి)జపాన్

10. సెంట్రల్ ఇన్‌ల్యాండ్ ఫిషరీస్ రీసెర్‌‌చ ఇన్‌స్టి ట్యూట్ ఎక్కడుంది?
ఎ) కోల్‌కత్తా బి) ముంబై
సి) విశాఖపట్నం డి) తిరువనంతపురం

11. బద్దెపురుగుల విసర్జకాంగాలు?
ఎ) వృక్కాలు బి) జ్వాలాకణాలు
సి) మాల్ఫీజియన్ నాళికలు డి) చర్మం

12. సముద్ర కుందేలు ఏ రకమైన జంతువు?
ఎ) చేప బి) సరీసృపం
సి) క్షీరదం డి) ఏదీ కాదు

13. అతిపెద్ద అకశేరుకం?
ఎ) అక్టోపస్ బి) టెరిడో
సి) ఆర్కిట్యులిస్ డి) సెపియా

14. ముత్యాల పరిశ్రమకు పితామహుడు?
ఎ) కొకిచి మికిమొటొబి) మిస్‌టుచి
సి) ఇసూజి డి) కికు కెమైనీ

15. పడవలకు చిల్లు పెట్టే మొలస్కా జంతువు? 
ఎ) సెపియా బి) లాలిగో
సి) డోరిస్ డి) టెరిడో

16. విలువైన ముత్యం దేని నుంచి లభిస్తుంది?
ఎ) యునియో బి) మైటిలస్
సి) పింక్టాడా డి) నాటిలస్
17. జలగను ఉపయోగించి శరీరంలో చెడు రక్తాన్ని తొలగించే ప్రక్రియ?
ఎ) ఫ్లె బొటొమీ బి) అపోలైసిస్
సి) డిఫ్యూజన్ డి) ప్లాస్మోలైసిస్

18. సముద్ర ఎలుక ఏ జంతు వర్గానికి చెందింది?
ఎ) ఆర్ధ్రోపొడా బి) అనెలిడా
సి) మొలస్కా డి) ఇకైనోడెర్మాటా

19. తేనెటీగ డింభకం?
ఎ) రిగ్లర్ బి) క్యాటర్‌పిల్లర్
సి) మాగ్గాట్ డి) గ్రబ్

20. చీమల అధ్యయనం?
ఎ) మిర్మికాలజీ బి) ఏరినాలజీ
సి) లెపిడోటెరాలజీ డి) అకరాలజీ

21. ఏ కీటకం ద్వారా కాలా అజార్ వ్యాప్తి చెందుతుంది?
ఎ) స్యాండ్ ఫ్లై బి) దోమ
సి) సీ-సీ ఫ్లై డి) ఏదీ కాదు

22. ఏ దోమ కాటు ద్వారా ఎల్లో ఫీవర్ వ్యాప్తి చెందుతుంది?
ఎ) క్యూలెక్స్ బి) అనాఫిలిస్
సి) ఎడిస్ డి) ఏదీ కాదు

23. కీటకాల్లో రెక్కలు, కాళ్ల ఎన్ని జతలు?
ఎ) రెండు, మూడు బి) మూడు, రెండు
సి) ఒకటి, రెండు డి) రెండు, ఒకటి

24. తిమింగలాల, డాల్ఫిన్ల ప్రధాన శ్వాసాంగాలు?
ఎ) మొప్పలు బి) చర్మం
సి) ఊపిరితిత్తులు డి) పైవన్నీ

25. ఎగిరే సర్పం?
ఎ) పీడోసిప్రిస్ బి) గెకో
సి) డ్రాకో డి) క్రైసోపిలియా

26. సముద్ర తోడేళ్లు ఏ రకమైన జంతువులు?
ఎ) సముద్ర సర్పాలు బి) సొర చేపలు
సి) విద్యుత్ రే చేపలు
డి) సముద్ర క్షీరదాలు

27. కింది వాటిలో ఉల్బజీవి?
ఎ) కప్ప బి) సొరచేప
సి) ఉడుము డి) సాలమండర్

28. సర్పాల్లోని ప్రధాన ఘ్రాణాంగాలు?
ఎ) జాకబ్‌సన్‌‌స బి) కీబర్‌‌స అంగాలు
సి) బొజానస్ అంగాలు
డి) చేపల్లో ఘ్రాణాంగాలు ఉండవు

29. మంచినీటి తాబేళ్లు?
ఎ) టెర్రాపిన్‌‌స బి) టర్టల్స్
సి) టార్టియిజ్ డి) ఏదీ కాదు

30. వీటిలో ఎగరని పక్షి?
ఎ) ఆస్ట్రిచ్ బి)కస్సావోరి
సి) టినామస్ డి)పైవన్నీ

31. భారీ సమూహాల్లో వచ్చి పంటను నష్టపర్చే కీటకం?
ఎ) ఎఫిడ్ బి) లోకస్ట్
సి) హార్‌‌నఫ్లై డి) బాటిల్ ఫ్లై

32. కింది క్షీరదాల్లో ఉభయచరజీవి?
ఎ) వాల్స్ బి) సీల్
సి) కైరోనెక్టస్ డి) పైవన్నీ

33. సజీవ శిలాజంగా పిలిచే స్ఫీనోడాన్ ఏ ప్రాంతంలో మాత్రమే కనిపిస్తుంది?
ఎ) ఆస్ట్రేలియా బి) ఆగ్నేయాసియా
సి) న్యూజిలాండ్ డి) భారత్

34. వీటిలో ఊపిరితిత్తి చేప?
ఎ) ప్రోటోపైరస్ బి) లెపిడోసైరిన్
సి) నియోసెరటోడస్ డి) పైవన్నీ

35. వీటిలో శీతల రక్త జంతువులు?
ఎ) కప్ప బి) చేప సి) బల్లి డి) పైవన్నీ
36. ఫ్లైయింగ్ ఫాక్స్ ఏ జంతువు?
ఎ) బల్లి బి) కప్ప సి) పక్షి డి) గబ్బిలం

37. సముద్రం నుంచి నదికి, తిరిగి సముద్రానికి వలస వెళ్లే చేపలు?
ఎ) అనాడ్రోమస్ బి) కెటాడ్రోమస్
సి) ఆంఫీడ్రోమస్ డి) పొటామొడ్రోమస్

సమాధానాలు
1) బి 2) ఎ 3) బి 4) డి 5) ఎ
6) డి 7) బి 8) సి 9) సి 10) ఎ
11) బి 12) డి 13) సి 14) ఎ 15) డి
16) సి 17) ఎ 18) బి 19) డి 20) ఎ
21) ఎ 22) సి 23) ఎ 24) సి 25) డి
26) బి 27) సి 28) ఎ 29) ఎ 30) డి
31) బి 32) డి 33) సి 34) డి 35) డి
36) డి 37) ఎ

No comments:

Post a Comment