పౌరులకు మాత్రమే వర్తించే హక్కులు?










రాజ్యాంగ లక్షణాలు
గత గ్రూప్-2 పోటీ పరీక్షలో ఈ చాప్టర్ నుంచి 15 ప్రశ్నలు అడిగారు. రాజ్యాంగ అభివృద్ధి, రా జ్యాంగ లక్షణాలపై అవగాహన పెంచుకుంటే మిగతా చాప్టర్లపై కూడా పట్టు సాధించొచ్చు.

గత గ్రూప్-2 పరీక్షలో ఈ అంశం నుంచి అడిగిన ప్రశ్నలు
1. రాజ్యాంగ పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగమని గుర్తించిన తీర్పు?
ఎ) కేశవానంద భారతి బి) గోలక్‌నాథ్
సి) ఎస్.ఆర్.బొమ్మై డి)మినర్వామిల్స్

2. పీఠికలోని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృ త్వం అనే పదాలను ఏ విప్లవం నుంచి గ్రహించారు?
ఎ) రష్యా బి) ఫ్రెంచ్
సి) అమెరికా డి) జర్మనీ

3. సమాజవాదం, లౌకికవాదం అనే రెండు పదాలను భారత రాజ్యాంగంలో ఏ సవరణ ద్వారా చేర్చారు?
ఎ) 44 బి) 40 సి) 38 డి) 42
సమాధానాలు:
1) ఎ, 2) బి, 3)డి

మాదిరి ప్రశ్నలు
1. రాజ్యాంగ ప్రవేశికకు మూలం?
జ: నెహ్రూ ప్రవేశపెట్టిన లక్ష్యాలు, ఆశయాల తీర్మానం

2. {పవేశిక ప్రకారం మన దేశం?
జ: సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజా స్వామ్య, గణతంత్ర దేశం.

3. రాజ్యాంగ మూలతత్వం, ఉపోద్ఘాతంగా దేన్ని పేర్కొంటారు?
జ: రాజ్యాంగ ప్రవేశిక

4. రాజ్యాంగ ప్రవేశిక ఏ అంశాలను తెలుపుతుంది?
జ: 1) అధికారానికి మూలం
2) రాజకీయ స్వభావం
3) రాజ్యాంగ ఆశయాలు
4) రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ

5. {పవేశిక ప్రకారం మన రాజ్యాంగ ఆశయాలు?
జ: న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం

6. న్యాయం అనే పదాన్ని ఎక్కడి నుంచి గ్రహించారు?
జ: రష్యా

7. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే పదాలను ఎక్కడి నుంచి గ్రహించారు?
జ: {ఫాన్‌‌స

8. {పవేశిక ప్రకారం రాజ్యాంగం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిన తేదీ?
జ: 26 నవంబర్, 1949

9. {పపంచశాంతి కోసం ఐక్యరాజ్యసమితిలో భారతదేశం ఎప్పుడు చేరింది?
జ: 30 అక్టోబర్, 1945

10. సామ్యవాద సమాజ స్థాపనకోసం 20 సూత్రాల పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు?
జ: 1975

11. గణతంత్ర అనే పదాన్ని ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
జ: {ఫాన్‌‌స

12. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో ఏ పదాలను చేర్చారు?
జ: సామ్యవాద, లౌకిక, సమగ్రత

13. {పత్యక్ష ప్రజాస్వామ్యానికి పేరుగాంచిన దేశం?
జ: స్విట్జర్లాండ్

14. భారత ప్రజల మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు తోడ్పడేవి?
జ: {పాథమిక విధులు

15. రాజ్యాంగంలో ప్రవేశిక అంతర్భాగం కాదని సుప్రీంకోర్టు ఏ కేసులో పేర్కొంది?
జ: బెరుబెరి వర్సెస్ యూనియన్-1960

16. రాజ్యాంగంలో ప్రవేశిక అంతర్భాగమని సుప్రీంకోర్టు ఏ కేసులో పేర్కొంది?
జ: కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ర్టం - 1973

17. రాజ్యాంగానికి ప్రవేశిక ఆత్మ వంటిదని పేర్కొన్నవారు?
జ: జస్టిస్ మహ్మద్ హిదయతుల్లా

18. రాజ్యాంగానికి ప్రవేశిక తాళం చెవి వంటిదని పేర్కొన్నవారు?
జ: ఎర్నెస్టు బార్కర్

19. {పవేశిక మన కలలకు, ఆలోచనలకు ప్రతిరూపం అని పేర్కొన్నవారు?
జ: కృష్ణస్వామి అయ్యర్

20. రాజ్యాంగంలో ప్రస్తుతం ఎన్ని ప్రకరణలు, షెడ్యూళ్లు, భాగాలు ఉన్నాయి?
జ: {పకరణలు-450 షెడ్యూళ్లు-12, భాగాలు -24 ఉన్నాయి.

21. {పపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగమేది?
జ: అమెరికా రాజ్యాంగం

22. ఏ తరహా ప్రభుత్వానికి లిఖిత రాజ్యాంగం తప్పనిసరి?
జ: సమాఖ్య ప్రభుత్వం

23. రాజ్యసభలో సీట్ల కేటాయింపు గురించి తెలిపే షెడ్యూల్?
జ: నాలుగో షెడ్యూల్

24. ఏడో షెడ్యూల్‌లో ఏ అంశాన్ని చర్చిం చారు?
జ: కేంద్ర-రాష్ర్ట సంబంధాలు

25. రాజ్యాంగ సవరణ విధానాన్ని ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
జ: దక్షిణాఫ్రికా

26. రాజ్యాంగ సవరణ గురించి తెలిపే ప్రకరణేది?
జ: 368

27. జాతీయ ప్రాముఖ్యత ఉన్న అంశాలను సవరించేందుకు ఏ రాజ్యాంగ సవరణ పద్ధతిని పాటిస్తారు?
జ: దృఢ పద్ధతి

28. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు ఏ రాజ్యాంగ సవరణ పద్ధతి పాటిస్తారు?
జ: సరళ పద్ధతి - 1/2 పార్లమెంట్ మెజార్టీ

29. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు పార్లమెంట్‌లో బిల్లును ఎవరు ప్రవేశపెట్టాలి?
జ: కేంద్ర హోంమంత్రి

30. రాజ్యాంగ సవరణ విధానం ఏ భాగంలో ఉంది?
జ: ఇరవయ్యో భాగం(XXవ)

31. 1951లో చేసిన మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా ఏ షెడ్యూల్‌ను చేర్చారు?
జ: తొమ్మిదో షెడ్యూల్
32. భారత రాజ్యాంగంలో మన ప్రభుత్వాన్ని ఏ విధంగా పేర్కొన్నారు?
జ: రాష్ట్రాల సమ్మేళనం

33. భారత ప్రభుత్వం ఒక ‘కేంద్రీకృత సమాఖ్య’ అని ఎవరు పేర్కొన్నారు?
జ: ఐవర్ జెన్నింగ్‌‌స

34. భారత ప్రభుత్వం సాధారణ సమయంలో సమాఖ్య, అత్యవసర సమయంలో ఏకకేంద్ర ప్రభుత్వంగా పని చేస్తుంది అని పేర్కొన్నవారు?
జ: బి.ఆర్.అంబేద్కర్

35. పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికి గల మరో పేరు?
జ: బాధ్యతాయుత ప్రభుత్వం

36. పార్లమెంటరీ తరహా ప్రభుత్వ ప్రధాన లక్షణం?
జ: శాసన నిర్మాణ శాఖకు కార్యనిర్వా హకశాఖ బాధ్యత వహించడం

37. అధికార పృథఃక్కరణ (అధికార పంపిణీ) సిద్ధాంతం ఏ ప్రభుత్వ విధానంలో అమల్లో ఉంటుంది?
జ: అధ్యక్ష తరహా విధానం

38. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఏ సూత్రాలతో పని చేస్తుంది?
జ: సమష్టి బాధ్యత, వ్యక్తిగత బాధ్యత

39. {పజాస్వామ్య పరిరక్షణకు బాగా తోడ్పడే ప్రభుత్వం ఏది?
జ: పార్లమెంటరీ తరహా ప్రభుత్వం

40. మన దేశంలో పార్లమెంటరీ విధానానికి పునాదులు వేసిన చట్టం?
జ: 1919 మాంటెంగ్ చెమ్స్‌ఫర్‌‌డ సంస్కరణల చట్టం

41. మన దేశంలో ఏ తరహా న్యాయవ్యవస్థ ఉంది?
జ: స్వయం ప్రతిపత్తి ఉన్న ఏకీకృత న్యాయవ్యవస్థ

42. ఏకీకృత న్యాయవ్యవస్థను ఎక్కడి నుంచి గ్రహించారు?
జ: {బిటన్

43. ఏ తరహా న్యాయవ్యవస్థకు న్యాయసమీక్ష అధికారం ఉంటుంది?
జ: స్వయం ప్రతిపత్తి ఉన్న న్యాయవ్యవస్థ

44. న్యాయసమీక్ష అంటే ఏమిటి?
జ: శాసనాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయో లేవోనని పరిశీలించే అధికారం

45. ఆల్ట్రావైరస్(Ultra Virus)అంటే ఏమిటి?
జ: ఏదైనా శాసనాన్ని రాజ్యాంగ విరుద్ధమైందిగా ప్రకటించడం

46. ఏ ప్రకరణ ప్రకారం కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరు చేయాలి?
జ: {పకరణ-50

47. లౌకికరాజ్యం అంటే?
జ: అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ, ఏ మతాన్నీ అధికార మతంగా స్వీకరించకుండా ఉండడం

48. మతరహిత రాజ్యానికి ఉదాహరణ?
జ: చైనా

49. ఏదైనా ఒక మతాన్ని అధికార మతంగా స్వీకరిస్తే మత రాజ్యంగా పేర్కొంటారు. దీనికి ఉదాహరణలు?
జ: పాకిస్తాన్, శ్రీలంక

50. మన రాజ్యాంగంలో మత స్వేచ్ఛను కల్పిస్తున్న ప్రకరణేది?
జ: {పకరణ-25

51. లౌకిక రాజ్యస్థాపనకు తోడ్పడే ఉమ్మడి పౌరస్మృతిని ఏర్పాటు చేయాలని ఏ అధికరణం తెలుపుతుంది?
జ: అధికరణం-44

52. {పజాస్వామ్యానికి పునాది అయిన సార్వజనీన వయోజన ఓటు హక్కును ఏ అధికరణం ప్రకారం కల్పించారు?
జ: అధికరణం-326

53. ఓటింగ్ వయోపరిమితిని 21 నుంచి 18 ఏళ్లకు ఎప్పుడు తగ్గించారు?
జ: 1989లో 61వ సవరణ ద్వారా

54. మహిళలకు ఓటు హక్కును కల్పించిన మొదటి దేశం?
జ: న్యూజిలాండ్

55. చట్టసభల్లో మహిళ భాగస్వామ్యం అధికంగా ఉన్న దేశం?
జ: రువాండ

56. {పస్తుత లోక్‌సభలో మహిళ సభ్యుల సంఖ్య ఎంత?
జ: 59

57. పౌరులకు మాత్రమే వర్తించే హక్కులు?
జ: రాజకీయ హక్కులు

58. పౌరసత్వం గురించి తెలిపే నిబంధనలు ఏవి?
జ: 5-11

59. భారత పౌరసత్వ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు?
జ: 1955

60. ద్వంద్వ పౌరసత్వం ఉన్న దేశాలకు ఉదాహరణ?
జ: స్విట్జర్లాండ్, అమెరికా

61. ఏ కమిటీ సిఫారసు మేరకు ప్రవాస భారతీయులకు ద్వంద్వ పౌరసత్వాన్ని కల్పించారు?
జ: ఎల్.ఎం. సింఘ్వీ కమిటీ-1986

62. {పవాస భారతీయులకు మన దేశంలో ఇచ్చే పౌరసత్వాన్ని ఏమని పిలుస్తారు?
జ: ఎల్లోకార్డు(Yellow Card)

63. మన దేశంలో ద్వంద్వ పౌరసత్వం ఉన్న ఏకైక రాష్ర్టం?
జ: జమ్మూ కాశ్మీర్

64. విదేశీయులకు కూడా వర్తించే హక్కులకు ఉదాహరణ?
జ: అధికరణం-14, 17, 21, 23, 24

65. {పాథమికంగా రాజ్యాంగం 14 అధికార భాషలను గుర్తించింది. 15వ అధికార భాషగా సింధి భాషను ఎప్పుడు గుర్తించింది?
జ: 1967లో 21వ రాజ్యాంగ సవరణ ద్వారా

More Headlines

Listings జూన్ 20 - 06- 2011: గుర్తింపు కోసం శోధించే దశ? Listings జూన్ 20 - 06- 2011: Ask Us?
Listings జూన్ 20 - 06- 2011: ఉద్యోగాలు Listings జూన్ 20 - 06- 2011: Latest Jobs & Notifications
Listings జూన్ 20 - 06- 2011: ఫెలోషిప్స్ Listings జూన్ 19 - 06- 2011: భారత, రామాయణాలు?
Listings జూన్ 19 - 06- 2011:Ask Us? Listings జూన్ 19 - 06- 2011: విద్యా సమాచారం/స్కాలర్‌షిప్స్
Listings జూన్ 19 - 06- 2011: ఉద్యోగాలు Listings జూన్ 19 - 06- 2011: జాతీయాదాయాన్ని మదింపు చేసే సంస్థ?
Listings జూన్ 19 - 06- 2011: Latest Jobs & Notifications Listings జూన్ 18 - 06- 2011: ప్రపంచంలో అతిపెద్ద దీవుల సముదాయం?
Listings జూన్ 18 - 06- 2011: Ask Us? Listings జూన్ 18 - 06- 2011: ఉద్యోగాలు
Listings జూన్ 18 - 06- 2011: ఉద్యోగాలు/అడ్మిషన్లు Listings జూన్ 18 - 06- 2011: ప్రపంచ సాహిత్యంలో మొదటి పుస్తకం?
Listings జూన్ 18 - 06- 2011: EAMCET & ICET Counselling Listings జూన్ 17 - 06- 2011: Hurry up! The programme...
Listings జూన్ 17 - 06- 2011: Ask Us? Listings జూన్ 17 - 06- 2011: అడ్మిషన్లు/ఫెలోషిప్స్
1 2 3
Back to Listing Page
(0) Comments so far
కామెంట్స్
Post Your Comments:
 

No comments:

Post a Comment