సరికొత్త సిలబస్‌లో సివిల్స్ వ్యూహం మూడు దశాబ్దాల తర్వాత... సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష సిలబస్ మారింది. 'ఆప్షనల్ పేపర్ తొలగింపు' అనే ప్రధాన మార్పుతో తాజా నోటిఫికేషన్ వెలువడింది. ఆన్‌లైన్ దరఖాస్తు సదుపాయాన్నీ కొత్తగా ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అభ్యర్థుల్లో రేకెత్తుతున్న సందేహాలేమిటి? నివృత్తి చేసుకుని, విజయం సాధించటానికి ఏ వ్యూహం అనుసరించాలి? ... పరిశీలిద్దాం!
గోపాలకృష్ణ డైరెక్టర్, బ్రెయిన్ ట్రీ
ఖాళీలు ఎన్ని?
సివిల్స్-2011లో ప్రకటించిన ఖాళీల సంఖ్య 880. కిందటి సంవత్సరం కంటే ఇది స్వల్పంగా తక్కువ. అయితే ఖాళీలు ఇంకా పెరుగుతాయని ఆశిస్తున్నారు. ఐఏఎస్ పోస్టులు 120 వరకూ ఉంటాయి. ఐపీఎస్‌లో 150, కస్టమ్స్‌లో 200, ఇన్‌కమ్‌టాక్స్‌లో 180 పోస్టులున్నాయి.
*సివిల్స్ ప్రకటనతో పాటే నమూనా ప్రశ్నలను ఇవ్వలేదు. యూపీఎస్‌సీ వెబ్‌సైటులో ఉన్న నమూనా ప్రశ్నపత్రంపైనే అభ్యర్థులు ఆధారపడాల్సివుంటుంది.
మొదట యూపీఎస్‌సీ 14 ప్రశ్నలను ఇచ్చి తర్వాత మరో ఐదు ప్రశ్నలను జోడించింది. పేపర్-I లో వాతావరణ మార్పు- పర్యావరణ శాస్త్రం, పేపర్-II లో నిర్ణాయక శక్తి (Decision making) లపై ఈ ప్రశ్నలున్నాయి. ఇంటర్ పర్సనల్ నైపుణ్యాల విభాగంలో ఎలాంటి నమూనా ప్రశ్నలనూ ఇవ్వలేదు!
* పేపర్- I, II లలో ప్రశ్నల సంఖ్య ఎంత ఉంటుందనేది ప్రకటనలో ఎక్కడా లేదు. ఒక్కో area ప్రాముఖ్యాన్ని కూడా సూచించలేదు. ఈ సంవత్సరం ప్రతి area కూ సమాన ప్రాముఖ్యం ఇస్తారని అంచనా.
పద్ధతి అస్పష్టం... సిద్ధమయ్యేదెలా?
పేపర్-I పరీక్షా విధానం కిందటి ఏడాది పద్ధతిలోనే ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ విభాగం లేదు కాబట్టి... ఆ ప్రశ్నలకు బదులు పర్యావరణ సంబంధ ప్రశ్నలుంటాయి.
పేపర్-II పరీక్షా విధానాన్ని ఇంకా సూచించలేదు. మొదటిసారి ప్రవేశపెడుతున్నారు కాబట్టి ఏ రకమైన విధానానికైనా అభ్యర్థులు సిద్ధపడివుండాలి. బ్యాంకింగ్ ప్రశ్నపత్రాలను ఒక నమూనాగా తీసుకోవచ్చు.
ఇలాంటి పరిస్థితిలో ప్రిపరేషన్ పద్ధతి ఎలా ఉండాలనే ప్రశ్న వస్తుంది. పేపర్-I లాంటి తెలిసిన అంశాలమీద అధిక దృష్టి పెట్టడం సముచితం. పేపర్-II విషయానికొస్తే- గణితం, ఆంగ్లంలోని ప్రాథమికాంశాలపై పట్టు సాధించటం ఉత్తమం. ఇంటర్‌పర్సనల్ నైపుణ్యాలూ, డెసిషన్ మేకింగ్ ప్రశ్నలు ప్రాథమికమైన లోకజ్ఞానంతో సమాధానం చెప్పగలిగినవి. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వ పాలనాశాస్త్రం (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) నేపథ్యమున్న విద్యార్థులకు అదనపు ప్రయోజనం సహజం.
వ్యూహం ఎలా ఉండాలి?
గతంలో రాశారు కాబట్టి పేపర్-I రిపీటర్లకు బాగా పరిచితమే. వారిప్పుడు పేపర్-II సాధనపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఇంజినీర్లూ, ఇంగ్లిష్ మీడియం నేపథ్యమున్నవారూ గణితం, ఇంగ్లిష్‌లను సమస్యగా భావించనక్కర్లేదు. బ్యాంకింగ్ పరీక్షలకు ఇచ్చిన ప్రశ్నపత్రాలను సాధన చేయటం మేలు. అవసరమైన అభ్యాసం పొందటానికి ఇది ఉపయోగపడుతుంది.
మొదటిసారి సివిల్స్‌కు హాజరయ్యేవారు పేపర్- II మీదకంటే పేపర్-I మీదనే దృష్టి కేంద్రీకరించాలి. మన రాష్ట్రం నుంచి ఈ పరీక్ష రాసేవారిలో ఎక్కువమంది ఇంజినీర్లు. వీరికి మొదటి పేపర్ కంటే రెండోపేపరే తేలిక. పేపర్-I కు వివరణాత్మక అధ్యయనం, విస్తృత పరిజ్ఞానం అవసరమవుతుంది.
ప్రిపరేషన్ ఇప్పుడే ప్రారంభిస్తే?
ఎప్పటినుంచో కాకుండా ఇప్పుడే సివిల్స్ ప్రిపరేషన్ మొదలుపెట్టినవారుంటారు. వీరు తమ నేపథ్యాన్నిబట్టి తమకంతగా పట్టులేని అంశాలు పట్టించుకోవాలి. ఉదాహరణకు- ఆర్ట్స్ విద్యార్థులు గణితంపైనా, ఇంజినీరింగ్ వారు పేపర్-I పైనా దృష్టి పెట్టాలి. తగిన వ్యూహం పాటిస్తే మూడున్నర నెలల్లో ప్రిలిమినరీ దశ దాటటం కష్టమేమీ కాదు.
నమూనా పరీక్షలు అవసరమా?అనేది ఓ సందేహం. సివిల్స్ అనేది CAT, GRE లాగా వేగాన్ని పరీక్షించేది కాదు. పైగా ఒకసారి వచ్చిన ప్రశ్నలు జనరల్‌స్టడీస్‌లో పునరావృతం కావు. పేపర్-I కోసం పేరున్న గైడ్స్ నుంచీ, పేపర్-II కోసం బ్యాంకింగ్ టెస్టుల నుంచీ ప్రశ్నలు తీసుకోవచ్చు. ఇప్పుడు బ్యాంకింగ్ పరీక్షల ప్రకటనలు వరుసగా వస్తున్నాయి కాబట్టి వాటికి దరఖాస్తు చేసి, రాయటం మంచిది. ప్రిపరేషన్ స్థాయి గురించి పట్టించుకోకుండా వాటిని రాస్తే సివిల్స్‌కు ఉపయోగపడే మేలు జరుగుతుంది.
వృత్తి నిపుణుల ఉత్సాహం
సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో వేతనాలు భారీగా ఉన్నప్పటికీ ఉద్యోగ అనిశ్చితి వెంటాడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో హోదా, ఉద్యోగ భద్రత ఉన్న సివిల్ సర్వీసులు ఐటీ నిపుణులను ఆకర్షిస్తున్నాయి. ఇప్పుడు సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీలో మార్పులు జరగటం... ఇంజినీరింగ్, గణిత నేపథ్యమున్నవారికి మొగ్గు ఉండటంతో వృత్తినిపుణులు ఈ సర్వీసులపై దృష్టి పెడుతున్నారు. ప్రస్తుత ఉద్యోగంలో ఐదారేళ్ళ అనుభవం ఉన్నప్పటికీ వయః పరిమితి ఇంకా దాటకపోవటం వల్ల వీరు సివిల్స్ రాద్దామనే ఉత్సాహం చూపుతున్నారు. హైదరాబాద్‌లోని సివిల్స్ కోచింగ్ కేంద్రాల్లో వీరి సందడి కనిపిస్తోంది!
దరఖాస్తు... జాగ్రత్తలు
యూపీఎస్‌సీ తొలిసారి ఆన్‌లైన్ దరఖాస్తు సదుపాయం ప్రవేశపెట్టింది. www.upsconline.nic.in వెబ్‌సైటుకి వెళ్ళి దరఖాస్తు చేయవచ్చు. లేకపోతే పోస్టాఫీసుల్లో దరఖాస్తు కొని, పూర్తిచేసీ పంపించవచ్చు.
* దరఖాస్తు గడువు: మార్చి 21
* ప్రిలిమినరీ పరీక్ష తేదీ: జూన్ 12
* వెంటనే దరఖాస్తు పొందటం శ్రేయస్కరం. కిందటి సంవత్సరం దరఖాస్తుల కొరత ఏర్పడిందని మర్చిపోవద్దు.
* దరఖాస్తులో అవసరమైన వివరాలనే పూర్తిచేయాలి. మెయిన్స్ పరీక్షకు సంబంధించిన కాలమ్స్ కూడా ఉంటాయి. ప్రకటనలో తెలిపిన ప్రకారం- మెయిన్స్ ఆప్షన్స్ వివరాలు భర్తీ చేయనక్కర్లేదు. ఒకవేళ వాటిని నింపినప్పటికీ మీరు మెయిన్స్‌కు హాజరయ్యేటపుడు ఆ ఆప్షనల్స్‌ను మార్చుకోవచ్చు.
* గడువు తేదీ ముగిసేవరకూ ఎదురుచూడొద్దు. త్వరగా దరఖాస్తులను పంపటం మంచిది. గడువు ముగిసే రోజుల్లో సెర్వర్ మీద లోడ్ ఎక్కువ పడవచ్చు. దరఖాస్తులూ అందుబాటులో ఉండకపోవచ్చు. అందుకనే వీలైనంత త్వరలో దరఖాస్తు భర్తీ చేసి, పంపించటం అన్నివిధాలా మంచిది.
* మనరాష్ట్రంలో హైదరాబాద్, విశాఖపట్నం పరీక్షా కేంద్రాలుగా ఉన్నాయి.
ఇచ్చిన ఓ నమూనా ప్రశ్నను పరిశీలిద్దాం. issues, you... (a) Go strictly as per the procedures (b) Take initiative to help the lady arranging for alternative documents (c) Assist the lady with some money on your own but do not compromise on procedures. (d) Avoid some procedural steps since you understand the necessity of the lady. విశ్లేషణ: ఈ ప్రశ్న చాలా సాధారణ స్వభావంతో ఉంది. జవాబు B మాత్రమే సరైన సమాధానమవుతుంది. * నిబంధనలను నిక్కచ్చిగా అనుసరిస్తే ఆ మహిళకు అందాల్సిన ప్రయోజనాలు దక్కకుండా పోతాయి. సేవాదృక్పథమున్న స్వభావం కాదిది. * మీ డబ్బుతో ఆ మహిళకు సాయం చేయటం తగిన పరిష్కారం కాదు. ఇది దయాగుణం కావొచ్చు కానీ హేతుబద్ధమైనది కాదు. సహాయం అవసరమున్నవారు అసంఖ్యాకంగా ఉంటారు కాబట్టి సొంత డబ్బు ఇచ్చుకుంటూపోతే మీ దగ్గర పైసా కూడా ఉండదు. *నిబంధనలను ఉల్లంఘించటం మీరు చేయకూడని పని. ఇది చట్టవ్యతిరేక మవుతుంది. అందుకనే B మాత్రమే పాలనాపరమైన స్పృహతో కూడిన పరిష్కారం. దీనిలో నిబంధనల విషయంలో రాజీపడటం లేదు; సేవాదృక్పథాన్నీ వదులుకోవటం లేదు. ఇలాంటి ప్రశ్నల ద్వారా యూపీఎస్‌సీ అభ్యర్థుల నుంచి పాలనా పరిజ్ఞానంతో పాటు పరిణత ఆలోచనా విధానాన్ని ఆశిస్తోందని అర్థమవుతోంది. నిర్ణయం తీసుకోవటంలో అభ్యర్థి ఏమైనా పక్షపాతంతో ప్రవర్తిస్తాడా అని పరీక్షించటానికి కూడా ప్రయత్నించినట్టు అర్థం చేసుకోవచ్చు. |
డిసెంబర్లో విడుదల చేసిన సిలబస్‌నే యథాతథంగా ప్రిలిమినరీ సిలబస్‌గా ఇచ్చారు. అంటే జనరల్‌స్టడీస్‌లో రెండు కంపల్సరీ పేపర్లు. రెండూ ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటాయి. *History of India and Indian national movement *Indian and World Geography- physical, social, economic geography of India and the world *Indian Polity and governance - constitution, political system, Panchayati raj, public policy, rights issues, etc. *Economic and social development - sustainable development, poverty, inclusion, demographics, social sector initiatives etc. *General issues on environmental ecology, bio-diversity and climate change-that donot require subject specialization *General science. * Interpersonal skills including communication skills * Logical reasoning and analytical ability * Decision making and problem solving * General mental ability * Basic numeracy (numbers and their relations, orders of magnitude etc. (Class X level), Data interpretation (charts, graphs, tables, data sufficiency etc. - Class X level) * English language comprehension skills (Class X level) * ఏ పేపర్లో ఎన్ని ప్రశ్నలు ఇస్తారనేది పేర్కొనలేదు. అయితే... ఒక్కో పేపర్లో 150 ప్రశ్నలు ఉండొచ్చని అంచనా. ప్రతి ప్రశ్నకూ 1.33 మార్కులుండవచ్చు. * తప్పు సమాధానాలకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 4 ఆప్షన్లు ఉంటే 0.33 శాతం; 5 ఆప్షన్లుంటే 0.25 శాతం పెనాల్టీ. 4 ఆప్షన్లే ఉండే అవకాశముంది. * ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్ భాషల్లో మాత్రమే ఉంటుంది. |
No comments:
Post a Comment