‘ఠంగు’న గంటకొట్టినట్లు చదువుల రుతువు మళ్లీ చిగురించింది. స్కూల్స్ రీ-ఓపెన్. మరి, మీ పిల్లల మాటేమిటి? వాళ్లు ఓపెన్ అవుతున్నారా? ‘దేవుడా ఇదెక్కడి శిక్ష’ అని లోలోపల కుమిలిపోతున్నారా? స్కూల్ బెల్ వారికి గణగణమని వినిపిస్తోందా? దడదడమని దడ పుట్టిస్తోందా? అడిగి తెలుసుకున్నారా? ‘అడగడమా! నాలుగు తగిలించి స్కూల్ బస్ ఎక్కించక, ఈ కౌన్సెలింగ్ ఏమిటి’ అంటారా? అయితే మీరు మాంటిసోరి ఏం చెప్పారో వినాలి. మీరు పేరెంట్ అయినా, టీచర్ అయినా.. శ్రద్ధగా వినాలి.
పిల్లల్ని స్వేచ్ఛగా వదిలేస్తే.. ముందు స్కూల్ బ్యాగ్ తీసుకెళ్లి ఎక్కడైనా అండర్ గ్రౌండ్‌లో దాచేసి వస్తారు. పెన్సిల్‌ని ముక్కలుగా విరగ్గొట్టి మురిక్కాలువలో పడే స్తారు. మిస్‌ని, క్లాస్ టీచర్‌ని కలలోకైనా అడుగుపెట్టనివ్వరు. యూనిట్ టెస్ట్ ఉన్నరోజు కూడా, మాకివాళ స్కూల్ లేదని గట్టిగా కళ్లు మూసుకుని ఫస్ట్ బెల్, సెకండ్ బెల్, థర్డ్ బెల్ అయిపోయేవరకు దుప్పట్లోంచి లేవరు. తర్వాత ఏం జరుగుతుందన్నది వాళ్లకు లెక్క కాదు. అప్పటికైతే స్కూల్ కి వెళ్లడం అనే ఒక దరిద్రపుగొట్టు పని తప్పుతుంది. అంతవరకే ఆలోచన! నీల్ డౌన్ చేయించి, టైమ్ టేబుళ్లు వేయించి గంటలు గంటలు చదువు నేర్పిస్తుంటే.. మింగలేక, కక్కలేక, ‘అమ్మా! కడుపునొప్పి’ అనక.. ఐయామ్ హ్యాపీ అంటారా పిల్లలు?!
పేరెంట్స్ వాదనా సరిగ్గానే ఉంటుంది. మట్టిలో ఆడినంత సహజంగా మేథ్స్ ఒంటికెలా పడుతుందని వారి ప్రశ్న. మేథ్స్ ఒక్కటే కాదు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ.. ఇవన్నీ పక్కలో పడుకోబెట్టుకుని పాలు పట్టినంత ఒడుపుగా కడుపులోకి పంపించలేం కదా. భయం ఉండాలి. టీచర్ భయం, బెత్తం భయం, డిక్టేషన్ భయం, హోమ్‌వర్క్ భయం, ఇంపోజిషన్ భయం, అసైన్‌మెంట్‌ల భయం ఉండాలి. భయం లేకపోతే పాలు తాగడం కూడా పిల్లలకు ఆటే అవుతుంది!
కరెక్ట్. అయితే నేననడం ఏమిటంటే - ఈ భయాలన్నీ పెద్దల తలల్లోంచి వచ్చి పిల్లల పేగుల్లో దూరుతున్నవేనని! అందుకే పిల్లలకింత చదువుల అజీర్తి.
* * *
గొప్పగొప్ప కుటుంబాల నుంచి ఆర్మీ ఆఫీసర్లు, పోలీసు అధికారులు, విద్యావేత్తలు నన్ను వెదుక్కుంటూ వస్తుంటారు. ‘‘మహాతల్లి మాంటిసోరి తమరేనా’’ అన్నట్లు ఉంటాయి వారి చూపులు. కొందరైతే నేరుగానే అడుగుతారు - ‘‘పిల్లల్ని గాలికి వదిలేయమంటారా అమ్మా.. మీరు కూడా అలానే పెరిగారా..’’ అని!
ఇంట్లో.. పిల్లల దగ్గర కూడా వీళ్ల వ్యంగ్యం ఇలాగే కొనసాగుతుంటుంది. చదువుకోకుండా గాడిదలు కాస్తావా అంటారు. పసితనపు అమాయకత్వంతో పిల్లలు ఒకవేళ ‘సరే’ అంటే.. పెద్దలు ఎంత దుఃఖపడాలి! అలా ఏం జరగదు. కోపం వస్తుంది. నాలుగు తగిలిస్తారు. ఏడిస్తే దగ్గరికి తీసుకుంటారు. చేతినిండా కుకీస్ పెట్టి మళ్లీ పుస్తకం తెరవమంటారు!
* * *
మాంటిసోరి మెథడ్ అనగానే పిల్లల్ని చెట్టుకు పుట్టకు వదిలి, సాయంత్రం కాగానే ఇంటికి తోలేస్తారేమోనని ఒక అనుమానం. ఇలా అనుమానించేవాళ్లకు వెంటనే ఒక సందేహం కూడా రావాలి. పిల్లలు చెట్లను ఇష్టపడుతున్నారు. పుట్టలను ఇష్టపడుతున్నారు. గాలినీ, గాలిలో ఎగిరే పక్షులను ఇష్టపడుతున్నారు. స్కూళ్లను మాత్రం ఇష్టపడడం లేదు! బయట కనిపిస్తున్న ఉన్నవాటినే తరగతి గదిలో కూర్చుని, పుస్తకాల్లో చూసి, చదివి నేర్చుకోమంటే వణికిపోతున్నారు. అంటే - ప్రకృతి పాఠాలలో లేని కాఠిన్యం.. టీచర్లలో, టీచర్లు చదువు చెబుతున్న విధానంలో ఉంది. తల్లిదండ్రులు పిల్లలపై విధించే ఆంక్షలలో ఉంది. ఇళ్లల్లో, స్కూళ్లల్లో పిల్లల కళ్లెదుట ఇంత హింసను కుమ్మరిస్తూ.. చదవడం లేదన్న బాధతో, కోపంతో వాళ్ల వీపుల్ని పగలగొట్టడం ఏ మాయదారి లోకంలోని న్యాయం?
అంకోలా స్కూల్లో ఉండగా ఒకరోజు ఉదయాన్నే నా క్లాస్‌మేట్ ఏడుస్తూ కనిపించింది. తనని ఎ సెక్షన్ నుంచి బి సెక్షన్‌కి మార్చారట! ‘‘అయితే ఏమయింది!’’ అన్నాను. తను ఇంకా పెద్దగా ఏడ్చింది. ‘‘నేను మొద్దుననే కదా రూమ్ మార్చారు’’ అంది. క్లాస్‌రూమ్‌లన్నీ ఒకేలా ఉన్నప్పుడు స్టూడెంట్స్ మాత్రం ఎలా ఎక్కువతక్కువలౌతారు! విభజన రేఖల్ని గీయకుండా పిల్లల్ని సమాన స్థాయికి తేలేరా? ఈ విద్యా పండితులు? పిల్లల మనోభావాలు వీళ్లకు అక్కర్లేదా?
నా క్లాస్‌మేట్‌కు అయినట్లే నాకూ అయ్యిందొకసారి. అయితే వేరే విషయంలో. టీచర్ పాఠం చెబుతుంటే ఆవిడనే చూస్తూ వింటున్నానట, కళ్లు ఎటూ తిప్పకుండా!
‘‘ఏంటా చూపు? మిడిగుడ్లు వేసుకుని’’ అని చికాకు పడ్డారావిడ. నా మనసు చివుక్కుమంది. తనని అలా దీక్షగా చూస్తున్నానన్న స్పృహే నాకు లేదు. అదే ఆఖరు, మళ్లెప్పుడూ కళ్లెత్తి నేనావిడ పాఠం విన్లేదు. స్కూల్ ఫైనల్ వరకు తనకసలు నా కళ్లే చూపించలేదు. పిల్లలైనంత మాత్రాన ఎంత మాటైనా పడాలా? పిల్లలైనంత మాత్రాన తమ సెల్ఫ్ రెస్పెక్ట్.. కాలుకి కాలుగా, చెయ్యికి చెయ్యిగా ఊడిపడుతుంటే మౌనంగా ఓర్చుకోవాలా? పిల్లలు పిల్లలతో ఎలా ఉన్నా పర్వాలేదు. పెద్దలు మాత్రం పిల్లలకు ఇవ్వవలసిన కనీస గౌరవాన్ని ఇచ్చి తీరాల్సిందే. గౌరవం ఇవ్వడం అంటే.. పిల్లల ఫీలింగ్స్‌ని తొక్కుకుంటూ వెళ్లిపోకుండా, జాగ్రత్తగా తప్పుకుని దారివ్వడం.
* * *
కాస్త స్వేచ్ఛనిచ్చి, మీ ఇష్టం అని చూడండి.. ఎంతమంది పిల్లలు, పెద్దపిల్లలు స్కూళ్ల నుంచి, కాలేజీల నుంచి, పరాయి ఊళ్లలోని హాస్టళ్ల నుంచి పారిపోయి ఇంటికొచ్చేస్తారో! రోమ్ యూనివర్శిటీ మెడికల్ స్కూల్ నుంచి నేనూ ఒకసారి అలా పారిపోయి కొంతదూరం వచ్చిన స్టూడెంట్‌నే.
చదువుల హింస, చదువుల ఉప హింస జీవితంపై విరక్తిని కలిగిస్తాయి. నన్నెంత హింస పెట్టారంటే - ఆడపిల్లేమిటి? ల్యాబ్‌లో శవాలు కోసే దగ్గర జుట్టు విరబోసుకున్న దెయ్యంలా కూర్చోవడం ఏమిటి అన్నారు. అబ్బాయిలు నా పక్క నుంచి వెళుతూ ‘ఫూ’ అని అరిచి ముక్కులు మూసుకునేవారు. క్లాస్‌రూమ్‌లో వెనక నుంచి చెత్త కామెంట్లు చేసేవారు. ఇటలీ మొత్తానికే తొలి మెడికల్ స్టూడెంట్ అన్న గుర్తింపు నాకు అక్కర్లేదు, కనీసం.. క్లాసు మొత్తానికీ ఉన్న ఒకే ఒక అమ్మాయిగానైనా నాపై కన్సర్న్ చూపలేక పోయారెందుకు? ఒకటీ రెండు సమస్యలైతే చిరునవ్వును పట్టుకుని వేలాడొచ్చు. చదువునే సమస్యగా మార్చారు నా క్లాస్‌మేట్స్.
తమాయించుకోలేక ఒకరోజు డిసెక్టింగ్ రూమ్ నుంచి పరుగున బయటికి వచ్చేశాను. మెడిసినొద్దు, మెడల్సొద్దు. కాలేజీ వైపైనా తిరిగి చూడకుండా ఇంటికి నడుస్తున్నాను. మధ్యలో పిన్సియో పార్క్ దగ్గర చివికిపోయిన బట్టల్లో ఒకావిడ వాళ్లనీ వీళ్లనీ చెయ్యి చాచి యాచిస్తోంది. పక్కనే ఆమె బిడ్డ. వాడి ప్రపంచంలో వాడున్నాడు. తల్లి కష్టంపై గ్రహింపు లేదు. వీధిలో ఏరుకున్న రంగు కాగితాలతో ఆడుకుంటున్నాడు. వాడి కళ్లలోని సంతోషాన్ని అంతవరకు నేను ఏ హరివిల్లులోనూ చూళ్లేదు. రంగుల కాంక్షతో ఈ లోకాన్నే తృణీకరిస్తున్నాడు వాడు. మేథ్యూ ఆర్నాల్డ్ ‘బరీడ్ లైఫ్’ గుర్తొచ్చింది నాకు.
‘...గుండె లోపల ఎక్కడో గాయమయింది
పోతున్న ప్రాణం తిరిగి కొట్టుకుంది...’
నా ప్రాణం తిరిగి కాలేజీ కోసం కొట్టుకుంది.
* * *
చదివే పిల్లలు, చదవని పిల్లలు అంటూ ఉండరు. పిల్లలెవరైనా ‘మేం చదవలేకపోతున్నాం’ అని అంటుంటే.. స్కూల్లో, ఇంట్లో.. మానసికంగా వారిని డీగ్రేడ్ చేస్తున్న భయాలేమిటో పరిశీలించాలి. పిల్లలు చదవడానికి పుట్టలేదు. చదవలేక చదవలేక ఎందుకు చావాలి?
మారియా మాంటిసోరి : విద్యావేత్త
31 ఆగస్టు 1870 - 6 మే 1952
జన్మస్థలం : అంకోలా, ఇటలీ
తల్లిదండ్రులు : అలషాండ్రో, రెనిల్డే
ప్రత్యేకతలు : మాంటిసోరి విద్యావిధాన రూపకర్త
: ఇటలీలో మొదటి మహిళా డాక్టర్
స్థాపించిన స్కూలు : చిల్డ్రన్ హౌస్ (6-1-1907)
ఫిలాసఫీ : విద్యాహింస నిష్ర్పయోజనం
లక్ష్యం : విద్యతో శాంతి సాధన
సంతానం : మాంటిసోరి సీనియర్ (కుమారుడు)
ఇండియా వచ్చింది :1939లో
మరణం : నెదర్లాండ్స్‌లో
కూర్పు, స్వగత కథనం: మాధవ్ శింగరాజు
e-mail your response : sakshinenu@gmail.com

No comments:
Post a Comment