రాజ్యాంగ లక్షణాలు
గత గ్రూప్-2 పోటీ పరీక్షలో ఈ చాప్టర్ నుంచి 15 ప్రశ్నలు అడిగారు. రాజ్యాంగ అభివృద్ధి, రా జ్యాంగ లక్షణాలపై అవగాహన పెంచుకుంటే మిగతా చాప్టర్లపై కూడా పట్టు సాధించొచ్చు.
గత గ్రూప్-2 పరీక్షలో ఈ అంశం నుంచి అడిగిన ప్రశ్నలు
1. రాజ్యాంగ పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగమని గుర్తించిన తీర్పు?
ఎ) కేశవానంద భారతి బి) గోలక్‌నాథ్
సి) ఎస్.ఆర్.బొమ్మై డి)మినర్వామిల్స్
2. పీఠికలోని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృ త్వం అనే పదాలను ఏ విప్లవం నుంచి గ్రహించారు?
ఎ) రష్యా బి) ఫ్రెంచ్
సి) అమెరికా డి) జర్మనీ
3. సమాజవాదం, లౌకికవాదం అనే రెండు పదాలను భారత రాజ్యాంగంలో ఏ సవరణ ద్వారా చేర్చారు?
ఎ) 44 బి) 40 సి) 38 డి) 42
సమాధానాలు:
1) ఎ, 2) బి, 3)డి
మాదిరి ప్రశ్నలు
1. రాజ్యాంగ ప్రవేశికకు మూలం?
జ: నెహ్రూ ప్రవేశపెట్టిన లక్ష్యాలు, ఆశయాల తీర్మానం
2. {పవేశిక ప్రకారం మన దేశం?
జ: సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజా స్వామ్య, గణతంత్ర దేశం.
3. రాజ్యాంగ మూలతత్వం, ఉపోద్ఘాతంగా దేన్ని పేర్కొంటారు?
జ: రాజ్యాంగ ప్రవేశిక
4. రాజ్యాంగ ప్రవేశిక ఏ అంశాలను తెలుపుతుంది?
జ: 1) అధికారానికి మూలం
2) రాజకీయ స్వభావం
3) రాజ్యాంగ ఆశయాలు
4) రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ
5. {పవేశిక ప్రకారం మన రాజ్యాంగ ఆశయాలు?
జ: న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం
6. న్యాయం అనే పదాన్ని ఎక్కడి నుంచి గ్రహించారు?
జ: రష్యా
7. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే పదాలను ఎక్కడి నుంచి గ్రహించారు?
జ: {ఫాన్‌స
8. {పవేశిక ప్రకారం రాజ్యాంగం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిన తేదీ?
జ: 26 నవంబర్, 1949
9. {పపంచశాంతి కోసం ఐక్యరాజ్యసమితిలో భారతదేశం ఎప్పుడు చేరింది?
జ: 30 అక్టోబర్, 1945
10. సామ్యవాద సమాజ స్థాపనకోసం 20 సూత్రాల పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు?
జ: 1975
11. గణతంత్ర అనే పదాన్ని ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
జ: {ఫాన్‌స
12. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో ఏ పదాలను చేర్చారు?
జ: సామ్యవాద, లౌకిక, సమగ్రత
13. {పత్యక్ష ప్రజాస్వామ్యానికి పేరుగాంచిన దేశం?
జ: స్విట్జర్లాండ్
14. భారత ప్రజల మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు తోడ్పడేవి?
జ: {పాథమిక విధులు
15. రాజ్యాంగంలో ప్రవేశిక అంతర్భాగం కాదని సుప్రీంకోర్టు ఏ కేసులో పేర్కొంది?
జ: బెరుబెరి వర్సెస్ యూనియన్-1960
16. రాజ్యాంగంలో ప్రవేశిక అంతర్భాగమని సుప్రీంకోర్టు ఏ కేసులో పేర్కొంది?
జ: కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ర్టం - 1973
17. రాజ్యాంగానికి ప్రవేశిక ఆత్మ వంటిదని పేర్కొన్నవారు?
జ: జస్టిస్ మహ్మద్ హిదయతుల్లా
18. రాజ్యాంగానికి ప్రవేశిక తాళం చెవి వంటిదని పేర్కొన్నవారు?
జ: ఎర్నెస్టు బార్కర్
19. {పవేశిక మన కలలకు, ఆలోచనలకు ప్రతిరూపం అని పేర్కొన్నవారు?
జ: కృష్ణస్వామి అయ్యర్
20. రాజ్యాంగంలో ప్రస్తుతం ఎన్ని ప్రకరణలు, షెడ్యూళ్లు, భాగాలు ఉన్నాయి?
జ: {పకరణలు-450 షెడ్యూళ్లు-12, భాగాలు -24 ఉన్నాయి.
21. {పపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగమేది?
జ: అమెరికా రాజ్యాంగం
22. ఏ తరహా ప్రభుత్వానికి లిఖిత రాజ్యాంగం తప్పనిసరి?
జ: సమాఖ్య ప్రభుత్వం
23. రాజ్యసభలో సీట్ల కేటాయింపు గురించి తెలిపే షెడ్యూల్?
జ: నాలుగో షెడ్యూల్
24. ఏడో షెడ్యూల్‌లో ఏ అంశాన్ని చర్చిం చారు?
జ: కేంద్ర-రాష్ర్ట సంబంధాలు
25. రాజ్యాంగ సవరణ విధానాన్ని ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు?
జ: దక్షిణాఫ్రికా
26. రాజ్యాంగ సవరణ గురించి తెలిపే ప్రకరణేది?
జ: 368
27. జాతీయ ప్రాముఖ్యత ఉన్న అంశాలను సవరించేందుకు ఏ రాజ్యాంగ సవరణ పద్ధతిని పాటిస్తారు?
జ: దృఢ పద్ధతి
28. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు ఏ రాజ్యాంగ సవరణ పద్ధతి పాటిస్తారు?
జ: సరళ పద్ధతి - 1/2 పార్లమెంట్ మెజార్టీ
29. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు పార్లమెంట్‌లో బిల్లును ఎవరు ప్రవేశపెట్టాలి?
జ: కేంద్ర హోంమంత్రి
30. రాజ్యాంగ సవరణ విధానం ఏ భాగంలో ఉంది?
జ: ఇరవయ్యో భాగం(XXవ)
31. 1951లో చేసిన మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా ఏ షెడ్యూల్‌ను చేర్చారు?
జ: తొమ్మిదో షెడ్యూల్
32. భారత రాజ్యాంగంలో మన ప్రభుత్వాన్ని ఏ విధంగా పేర్కొన్నారు?
జ: రాష్ట్రాల సమ్మేళనం
33. భారత ప్రభుత్వం ఒక ‘కేంద్రీకృత సమాఖ్య’ అని ఎవరు పేర్కొన్నారు?
జ: ఐవర్ జెన్నింగ్‌స
34. భారత ప్రభుత్వం సాధారణ సమయంలో సమాఖ్య, అత్యవసర సమయంలో ఏకకేంద్ర ప్రభుత్వంగా పని చేస్తుంది అని పేర్కొన్నవారు?
జ: బి.ఆర్.అంబేద్కర్
35. పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికి గల మరో పేరు?
జ: బాధ్యతాయుత ప్రభుత్వం
36. పార్లమెంటరీ తరహా ప్రభుత్వ ప్రధాన లక్షణం?
జ: శాసన నిర్మాణ శాఖకు కార్యనిర్వా హకశాఖ బాధ్యత వహించడం
37. అధికార పృథఃక్కరణ (అధికార పంపిణీ) సిద్ధాంతం ఏ ప్రభుత్వ విధానంలో అమల్లో ఉంటుంది?
జ: అధ్యక్ష తరహా విధానం
38. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ఏ సూత్రాలతో పని చేస్తుంది?
జ: సమష్టి బాధ్యత, వ్యక్తిగత బాధ్యత
39. {పజాస్వామ్య పరిరక్షణకు బాగా తోడ్పడే ప్రభుత్వం ఏది?
జ: పార్లమెంటరీ తరహా ప్రభుత్వం
40. మన దేశంలో పార్లమెంటరీ విధానానికి పునాదులు వేసిన చట్టం?
జ: 1919 మాంటెంగ్ చెమ్స్‌ఫర్‌డ సంస్కరణల చట్టం
41. మన దేశంలో ఏ తరహా న్యాయవ్యవస్థ ఉంది?
జ: స్వయం ప్రతిపత్తి ఉన్న ఏకీకృత న్యాయవ్యవస్థ
42. ఏకీకృత న్యాయవ్యవస్థను ఎక్కడి నుంచి గ్రహించారు?
జ: {బిటన్
43. ఏ తరహా న్యాయవ్యవస్థకు న్యాయసమీక్ష అధికారం ఉంటుంది?
జ: స్వయం ప్రతిపత్తి ఉన్న న్యాయవ్యవస్థ
44. న్యాయసమీక్ష అంటే ఏమిటి?
జ: శాసనాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయో లేవోనని పరిశీలించే అధికారం
45. ఆల్ట్రావైరస్(Ultra Virus)అంటే ఏమిటి?
జ: ఏదైనా శాసనాన్ని రాజ్యాంగ విరుద్ధమైందిగా ప్రకటించడం
46. ఏ ప్రకరణ ప్రకారం కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరు చేయాలి?
జ: {పకరణ-50
47. లౌకికరాజ్యం అంటే?
జ: అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ, ఏ మతాన్నీ అధికార మతంగా స్వీకరించకుండా ఉండడం
48. మతరహిత రాజ్యానికి ఉదాహరణ?
జ: చైనా
49. ఏదైనా ఒక మతాన్ని అధికార మతంగా స్వీకరిస్తే మత రాజ్యంగా పేర్కొంటారు. దీనికి ఉదాహరణలు?
జ: పాకిస్తాన్, శ్రీలంక
50. మన రాజ్యాంగంలో మత స్వేచ్ఛను కల్పిస్తున్న ప్రకరణేది?
జ: {పకరణ-25
51. లౌకిక రాజ్యస్థాపనకు తోడ్పడే ఉమ్మడి పౌరస్మృతిని ఏర్పాటు చేయాలని ఏ అధికరణం తెలుపుతుంది?
జ: అధికరణం-44
52. {పజాస్వామ్యానికి పునాది అయిన సార్వజనీన వయోజన ఓటు హక్కును ఏ అధికరణం ప్రకారం కల్పించారు?
జ: అధికరణం-326
53. ఓటింగ్ వయోపరిమితిని 21 నుంచి 18 ఏళ్లకు ఎప్పుడు తగ్గించారు?
జ: 1989లో 61వ సవరణ ద్వారా
54. మహిళలకు ఓటు హక్కును కల్పించిన మొదటి దేశం?
జ: న్యూజిలాండ్
55. చట్టసభల్లో మహిళ భాగస్వామ్యం అధికంగా ఉన్న దేశం?
జ: రువాండ
56. {పస్తుత లోక్‌సభలో మహిళ సభ్యుల సంఖ్య ఎంత?
జ: 59
57. పౌరులకు మాత్రమే వర్తించే హక్కులు?
జ: రాజకీయ హక్కులు
58. పౌరసత్వం గురించి తెలిపే నిబంధనలు ఏవి?
జ: 5-11
59. భారత పౌరసత్వ చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు?
జ: 1955
60. ద్వంద్వ పౌరసత్వం ఉన్న దేశాలకు ఉదాహరణ?
జ: స్విట్జర్లాండ్, అమెరికా
61. ఏ కమిటీ సిఫారసు మేరకు ప్రవాస భారతీయులకు ద్వంద్వ పౌరసత్వాన్ని కల్పించారు?
జ: ఎల్.ఎం. సింఘ్వీ కమిటీ-1986
62. {పవాస భారతీయులకు మన దేశంలో ఇచ్చే పౌరసత్వాన్ని ఏమని పిలుస్తారు?
జ: ఎల్లోకార్డు(Yellow Card)
63. మన దేశంలో ద్వంద్వ పౌరసత్వం ఉన్న ఏకైక రాష్ర్టం?
జ: జమ్మూ కాశ్మీర్
64. విదేశీయులకు కూడా వర్తించే హక్కులకు ఉదాహరణ?
జ: అధికరణం-14, 17, 21, 23, 24
65. {పాథమికంగా రాజ్యాంగం 14 అధికార భాషలను గుర్తించింది. 15వ అధికార భాషగా సింధి భాషను ఎప్పుడు గుర్తించింది?
జ: 1967లో 21వ రాజ్యాంగ సవరణ ద్వారా
No comments:
Post a Comment