సివిల్స్‌కు సన్నద్ధత నూతన విధానంలో జరగనున్న తొలి సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష మరో ఆరు రోజుల్లోనే! మార్కుల విషయంలో పేపర్-1,2 లకు ప్రాధాన్యం సమానమే అయినా ప్రశ్నల సంఖ్యలో తేడా ఉండొచ్చు. ప్రిలిమ్స్‌లో విజయానికి పాటించాల్సిన ప్రణాళిక ఇదిగో...
గోపాలకృష్ణ
డైరెక్టర్, బ్రెయిన్ ట్రీ
ప్రిలిమినరీ పేపర్-1 కోసం పాత ప్రశ్నపత్రాల విశ్లేషణ ప్రయోజనకరం. గత కొద్దిఏళ్ళుగా వర్తమాన వ్యవహారాలు, జి.కె.లపై అధిక ప్రశ్నలు వస్తున్నాయి. దీని దృష్ట్యా సాంప్రదాయిక అంశాల్లోని వర్తమాన పరిణామాలపై అభ్యర్థులు దృష్టిపెట్టాలి.
ఎన్విరాన్‌మెంటల్ ఎకాలజీని కొత్తగా ప్రవేశపెట్టారు. దీనిలో సహజ వనరులు, వాటిపై మనిషి ప్రభావం, కొస్తా ప్రాంత నిర్వహణ, ఎన్విరాన్‌మెంటల్ ఆడిట్, ఆహార చక్రం, జీవావరణ వ్యవస్థలపై మానవుని ప్రభావం, జీవ వైవిధ్యం, భారతదేశ వృక్ష, జంతు సంపద, ఓషధి మొక్కలు, పర్యావరణ కాలుష్యం, పర్యావరణ చట్టాలు భాగంగా ఉన్నాయి. ప్రధాన పర్యావరణ సమస్యలు, వివాదాలు (ఉదా: చిప్‌కో ఉద్యమం, సేతు సముద్రం ప్రాజెక్టు...) కూడా ముఖ్యమే.
పేపర్-1 మెలకువలు * ప్రశ్న ఉన్న వాక్యాన్ని జాగ్రత్తగా చదవాలి. అర్థం గ్రహించాలి.
* జవాబు గుర్తించేముందు సరైన సమాధానానికి ఆస్కారమున్న అన్ని సమాధానాలనూ చూడాలి.
* వ్యతిరేక పదాలు/prefixesను గమనించాలి.
* పరిచితం కాని పదాలుంటే సందర్భాన్ని బట్టి వాటి అర్థం గ్రహించేందుకు ప్రయత్నించాలి.
* తెలియని ప్రశ్నలకు గుడ్డిగా సమాధానాలు గుర్తించకూడదు. తప్పు సమాధానాలకు నెగిటివ్ మార్కులుంటాయని మర్చిపోకూడదు.
కొత్తగా ప్రవేశపెట్టిన పేపర్-2 ఎలా ఉంటుందోనని అందరిలోనూ ఉత్కంఠ! ఈ పేపర్‌లోని ఒక్కో విభాగంలో ఎన్ని ప్రశ్నలు వచ్చే అవకాశముందో (ఇదే తరహా ప్రశ్నపత్రాల విశ్లేషణ ఆధారంగా) చూద్దాం.
డెసిషన్ మేకింగ్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్ లాంటి unknown areas పై కంటే known areasఅయిన మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ, ఇంగ్లిష్ లాంగ్వేజ్, కాంప్రహెన్షన్‌లపై అధిక దృష్టి పెట్టటం తెలివైన పని.
ఏ అంశం ఎలా?
* కాంప్రహెన్షన్: ఎకానమీ, పాలిటీ లాంటి సాధారణ అంశాలపై పాసేజ్‌లుంటాయి. మొత్తం పాసేజిని వేగంగా చదివి, ముఖ్యమైన అంశాలను అండర్‌లైన్ చేసుకుని, జవాబులు రాయటం సరైన వ్యూహం.
* కాంప్రహెన్షన్: ఎకానమీ, పాలిటీ లాంటి సాధారణ అంశాలపై పాసేజ్‌లుంటాయి. మొత్తం పాసేజిని వేగంగా చదివి, ముఖ్యమైన అంశాలను అండర్‌లైన్ చేసుకుని, జవాబులు రాయటం సరైన వ్యూహం.
* ఇంటర్ పర్సనల్ స్కిల్స్-కమ్యూనికేషన్: భావవ్యక్తీకరణ థియరీపై దీనిలో ప్రశ్నలుండవు. ఇచ్చిన పాసేజ్‌లోని statement అర్థాన్ని గుర్తించమని అడుగుతారు.
Example for Inter-Personal skills :
You are chosen as counsellor following a family feud. In order to help ease out tensions, what course of action will you select at the best?
You are chosen as counsellor following a family feud. In order to help ease out tensions, what course of action will you select at the best?
a)Provoke one member against the other b)Talk to each member separately
c) First counsel them individually then hold group discussions d) Hold a massive group discussion session with all the members together
Answer : 'C '
* లాజికల్ రీజనింగ్: దీనిలో statementsఉంటాయి. వీటిలో సరైన, సరికాని రీజనింగ్‌ను గుర్తించాల్సివుంటుంది.
For example : All big dams involve displacement of people and risk of serious harm to the ecology of the region. The claims of pro-big dam enthusiast cannot be sustained in terms of costs and benefits.
Assuming the truth of the passage, one can conclude from it that :
a) No big dam should ever be constructed whatever be the benefits arising out of it.
b) All big dams from the very nature of its 'highness' destroy ecology or displace people.
c) Big dam should only be undertaken provided it displaces the minimum number of people causes negligible damage to ecology and provide substantial benefits when completed.
d) There are abundant alternatives to each water in scarcity areas such a way that , what big dams can offer, the alternatives can provide more efficiently at lesser cost.
Answer : 'C '
* డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్: అభ్యర్థి వ్యక్తిత్వాన్నీ, సందర్భానికి ఎలా స్పందిస్తారన్నదీ పరీక్షించే ప్రశ్నలుంటాయి.
* జనరల్ మెంటల్‌ఎబిలిటీ- బేసిక్ న్యూమరసీ: గణితంలోని ప్రాథమిక ప్రశ్నలుంటాయి. పూర్తిమార్కులు దీనిలో తెచ్చుకోవచ్చు. సాధన బాగా అవసరం. వేగంగా ప్రశ్నలు సాధించటానికి షార్ట్‌కట్ పద్ధతులు ప్రయోగించాలి.
* ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ స్కిల్స్: ఆంగ్లాన్ని అర్థం చేసుకునే సామర్థ్యానికి సంబంధించిన ప్రశ్నలుంటాయి. వాక్యనిర్మాణం, వ్యతిరేక పదాలు, పదాల అర్థాలు మొదలైనవి.
కాంప్రహెన్షన్ కోసం కొన్ని పాసేజ్‌లను అభ్యాసం చేయాలి. ఇంటర్ పర్సనల్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్ లాంటివాటిని అప్పటికప్పుడే ఎదుర్కొని పరిష్కరించాలి. ఇలాంటి సందర్భాల్లో బాధ్యత కలిగిన పౌరుల పరిపక్వ నిర్ణయాలు ఎలా ఉంటాయో అలాంటి జవాబులను ఎగ్జామినర్ అభ్యర్థుల నుంచి ఆశిస్తారు.
No comments:
Post a Comment