గ్రూప్-2కు ప్రిపేరయ్యే విద్యార్థులు గ్రూప్-1 మెయిన్స్‌కు కూడా క్వాలిఫై అయ్యారా?

పేపర్- 3

సెక్షన్-1 - ఇండియన్ ఎకానమీ

సెక్షన్-2 - ఏపీ ఎకానమీ
ప్రశ్నలు: 150 మార్కులు: 150
సమయం: రెండున్నర గంటలు

సిలబస్ విస్తృతంగా ఉండి.. అభ్యర్థుల గ్రాహణ శక్తిని పరీక్షించే పేపర్ ఇది. ముఖ్యంగా ఇండియన్ ఎకానమీకి సంబంధించి విస్తృత అధ్యయనం అవసరం.


విస్తృత అధ్యయనం క్రమంలో నిర్దేశిత సిలబస్ ప్రకారం ఒక క్రమ పద్ధతిలో ప్రిపరేషన్ సాగించాలి. ఈ క్రమంలో..


పణాళికా యుగం - ప్రణాళికల ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఆయా ప్రణాళికలు- వాటి కాల వ్యవధి- నిర్దేశిత లక్ష్యాలు- సాధించిన లక్ష్యాలు- విజయాలు- వైఫల్యాలు, కారణాలు వంటి వాటిపై పరిజ్ఞానం సొంతం చేసుకోవాలి.


సంస్కరణల ముందు, తర్వాతి కాలాల్లో ఆయా రంగాలకు సంబంధించిన మార్పులను బేరీజు వేస్తూ ప్రిపరేషన్ సాగించాలి.


దేశంలో పన్నుల వ్యవస్థ, వ్యయ-ఆదాయ రాబడుల ధోరణులు, వ్యవసాయ విధానాలు, పారిశ్రామిక ప్రగతి సూచీల సమాచారం సొంతం చేసుకోవాలి.


బ్యాంకింగ్ రంగంపైనా ప్రత్యేక దృష్టి సారించాలి. ఈ క్రమంలో ఆర్‌బీఐ ద్రవ్య విధానం- లక్ష్యాలు- గణాంకాలు; పరపతి నియంత్రణకు తీసుకునే పరిణామాత్మక, గుణాత్మక చర్యలు, ద్రవ్యోల్బణ నివారణకు తీసుకునే చర్యలు తదితర అంశాలపై పట్టు సాధించాలి. వాణిజ్య బ్యాంకుల పరపతి సృష్టి- ఏర్పడిన అడ్డంకులు ఔపోసన పట్టాలి.


భారత వ్యవసాయ విధానం-2000; లక్ష్యాలు- ప్రగతి వివరాలు సేకరించాలి.


ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే భౌగోళిక అంశాలపైనా పట్టు సాధించాలి.


ఈ క్రమంలో జనాభా- వృద్ధి; వృత్తి పరంగా విభజన; మేథో వలస; ఆయా రంగాలపై ఆధారపడిన జనాభా గణాంకాలు; సహజ వనరులు- ఆర్థికాభివృద్ధిలో వాటి పాత్రకు సంబంధించి సమాచారంపైనా పట్టు సాధించాలి.


అల్పాభివృద్ధి దేశాల లక్ష ణాలు; ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి పదాల మధ్య తేడా- వాటిని గణించే విధానం


వృద్ధి వ్యూహాల్లో భాగంగా హరాడ్ డోమార్, రాబిన్ సన్, ఫెయ్న్రి, కాల్డర్, హిక్స్ అండ్ హాన్‌సన్, లెబన్ స్టీస్ వృద్ధి సిద్ధాంతాల్లోని ముఖ్యాంశాలు చదవాలి.


గణాంక శాస్త్రానికి సంబంధించి అంక మధ్యమం, మధ్యగతం, బాహుళకం,గుణ మధ్యమం, హర మధ్య మం, సహ సంబంధ గుణకం, సూచీసంఖ్యలను పరిశీ లించాలి. లాస్పెయిర్, పాషే, బౌలీ, ఫిషర్, మార్షల్ ఎడ్జ్‌వర్త్ సూచీ సంఖ్యల గణన సూత్రాలు చదవాలి.


విభాగం-2 ఆంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యమిస్తూ గ్రామీణ సమాజంలో సమకాలీన సమస్యలు, పరిణామాలు:

ఈ విభాగానికి సంబంధించి అభ్యర్థులు ముఖ్యంగా.. రాష్ట్రంలో జిల్లాల వారీగా మానవాభివృద్ధి సూచీలలోని వివిధ అంశాలను పరిశీలించాలి. గత నాలుగు దశాబ్దాల్లో వ్యవసాయం; ఉపాధి పెరుగుదలకు అది తోడ్పడిన తీరుపై అవగాహన సాధించాలి.

దీంతోపాటు జాతీయాదాయంలో జీఎన్‌పీ, జీడీపీ, ఎన్‌ఎన్‌పీ, ఎన్‌డీపీ, ఎన్‌ఎన్‌పీ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, వృష్టి, వ్యయార్హ ఆదాయం; తలసరి ఆదాయాల కాన్సెప్ట్‌లు చదవాలి.


జాతీయాదాయంలో వివిధ రంగాల్లో వచ్చిన మార్పు లు; మానవాభివృద్ధి సూచీ; మానవ పేదరిక సూచీ; లింగ సంబంధ అభివృద్ధి సూచీ; లింగ సాధికారత సూచీలలో ముఖ్యాంశాల పరిశీలన- వాటిలో భారత్ స్థితి.


రాష్ట్రంలో ప్రణాళికల పనితీరు, వివిధ రంగాలకు కేటాయింపులు - వాటి ప్రాధాన్యం; వనరుల సేకరణ తీరు; ప్రణాళిక యుగంలో రాష్ట్రంలో ఏర్పడిన అభివృద్ధికి సంబంధించి గణాంక సహిత సమాచారంతో సిద్ధం కావాలి.


రాష్ట్రంలో భూ సంస్కరణలు, వ్యవసాయం, అడవులు, సహజ వనరులపై గణాంకాలు సేకరించాలి.


నీటిపారుదల వ్యవస్థ; సాగునీటి విస్తీర్ణం- పంటల తీరులో మార్పులు; వ్యవసాయ రంగంలో సంస్థాపరమైన, సంస్థాపరంకాని పరపతి ఆధారాలపై అవగాహన పొందాలి.


ఫ్యాక్టరీలు, చిన్న మధ్య తరహా పరిశ్రమల ఆవశ్యకత- వాటి సమస్యలు; సహకార వ్యవస్థ మౌలిక సూత్రాలు- కుంటుపడటానికి కారణాలు విశ్లేషిస్తూ సమాచార సేకరణ చేసుకోవాలి.


రాష్ట్ర అవతరణ తర్వాత పలు వ్యవసాయ ఉత్పత్తులు -ఉత్పాదకత పెరిగినా కొన్ని రాష్ట్రాలతో పోల్చితే తక్కువే. దీనికి కారణాలపై పంటల వారీ విశ్లేషణ సాగించాలి. మద్దతు, సేకరణ ధరల భావనలపై స్పష్టత అవసరం.


టైం మేనేజ్‌మెంట్


గ్రూప్-2 పరీక్షకు మరో అయిదు నెలల వ్యవధి అందుబాటులో ఉంది. కాబట్టి ఇప్పుడే ప్రిపరేషన్ మొదలుపెట్టిన వారు కూడా సరైన ప్రణాళికతో ప్రిపరేషన్ సాగిస్తే విజయం సులభంగానే సాధించవచ్చు.


ఈ క్రమంలో వారు టైం మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.

మూడు పేపర్ల మధ్య సమన్వయం సాగిస్తూ ప్రిపేర్ కావాలి.

హిస్టరీ, పాలిటీ, ఇండియన్, ఏపీ ఎకానమీలు పేపర్-2, పేపర్-3 కోసం చదువుతారు. కాబట్టి జనరల్ స్టడీస్ పేపర్‌లో ఆయా అంశాల ప్రశ్నల విషయంలో ప్రత్యేకంగా శ్రమించక్కర్లేదు.

అయితే వీరు ప్రత్యేకంగా జాగ్రఫీ, మెంటల్ ఎబిలిటీ విషయాల కోసం ప్రిపరేషన్ సాగించాలి.

......................


మెయిన్స్‌కు కూడా క్వాలిఫై అయ్యారా?


గ్రూప్-2కు ప్రిపేరయ్యే విద్యార్థులు చాలా మంది గ్రూప్-1 మెయిన్స్‌కు కూడా ఉత్తీర్ణత సాధించారు. అటు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు.. గ్రూప్-2 తేదీల కంటే 20 రోజుల ముందుగా సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు నిర్వహించనున్నారు. దీంతో వారు ఒకేసారి రెండు పడవలపై ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. అయితే సమన్వయంతో ముందుకు సాగితే ఈ రెండు పరీక్షలకు ఆశించిన రీతిలో సిద్ధం కావచ్చు.


గ్రూప్-1 మెయిన్స్ పేపర్-2.. గ్రూప్-2 పేపర్-2 రెండూ హిస్టరీ, పాలిటీకి సంబంధించినవే. వీటికి డిస్క్రిప్టివ్ విధానంలో ప్రిపరేషన్ సాగిస్తే ఒకే సమయంలో రెండిటి సిలబస్ పూర్తి చేసుకోవచ్చు.


గ్రూప్-1 మెయిన్స్ పేపర్-3; గ్రూప్-2 పేపర్-3 ఎకానమీ సంబంధితం. దీనికి కూడా ఒకే సమయంలో ప్రిపరేషన్ సాగించొచ్చు.


అయితే అభ్యర్థులు కచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అంశం డిస్క్రిప్టివ్ తరహా ప్రిపరేషన్. ఇలా ప్రిపేర్ అవుతూ చదివిన అంశాలను నోట్స్ రూపంలో రాసుకుంటే.. అటు గ్రూప్-1 రివిజన్‌కు కూడా లాభిస్తుంది.


గ్రూప్-2 పేపర్-1 జనరల్ స్టడీస్‌లోని సైన్స్ అండ్ టెక్నాలజీ; కరెంట్ అఫైర్స్ సంబంధిత అంశాలపై పరిపూర్ణ సమాచారం సొంతం చేసుకుంటే గ్రూప్-1 మెయిన్స్ జనరల్ ఎస్సేకు కూడా లాభిస్తుంది.


గ్రూప్-1 మెయిన్స్‌కు క్వాలిఫై అయిన అభ్యర్థులు ప్రత్యేకంగా ప్రిపరేషన్ సాగించాల్సిన విభాగం డేటా ఇంటర్‌ప్రిటేషన్(పేపర్-5). దీన్ని దృష్టిలో ఉంచుకుని తమకున్న పరిజ్ఞానం ఆధారంగా సమయం కేటాయించుకోవాలి.

No comments:

Post a Comment