Showing posts with label INSPIRATION. Show all posts
Showing posts with label INSPIRATION. Show all posts

రైతు సంఘం జిందాబాద్ !



Creative Commons LicenseAPPSC Groups and Indian Civil Services Articles by Dilip Reddy is licensed under a Creative Commons Attribution 2.5 India License.Based on a work at appscgroupspoint.blogspot.com.Permissions beyond the scope of this license may be available at http://appscgroupspoint.blogspot.com/. All articles published under CC License

తిరుగులేని పల్లె!

Courtesy : Eenadu News Paper - Sunday magazine



Creative Commons LicenseAPPSC Groups and Indian Civil Services Articles by Dilip Reddy is licensed under a Creative Commons Attribution 2.5 India License.Based on a work at appscgroupspoint.blogspot.com.Permissions beyond the scope of this license may be available at http://appscgroupspoint.blogspot.com/. All articles published under CC License

ఇష్టపడి చదివితే విజయం మీదే..


Creative Commons LicenseAPPSC Groups and Indian Civil Services Articles by Dilip Reddy is licensed under a Creative Commons Attribution 2.5 India License.Based on a work at appscgroupspoint.blogspot.com.Permissions beyond the scope of this license may be available at http://appscgroupspoint.blogspot.com/. All articles published under CC License

ఫైజల్ పయనం....పాఠాలెన్నో


Creative Commons LicenseAPPSC Groups and Indian Civil Services Articles by Dilip Reddy is licensed under a Creative Commons Attribution 2.5 India License.Based on a work at appscgroupspoint.blogspot.com.Permissions beyond the scope of this license may be available at http://appscgroupspoint.blogspot.com/. All articles published under CC License

పనిమంతులదే భవిత





Creative Commons LicenseAPPSC Groups and Indian Civil Services Articles by Dilip Reddy is licensed under a Creative Commons Attribution 2.5 India License.Based on a work at appscgroupspoint.blogspot.com.Permissions beyond the scope of this license may be available at http://appscgroupspoint.blogspot.com/. All articles published under CC License

ఒక ప్రణాళిక - జీవితాన్నే మార్చేస్తుంది

ప్రణాళిక ఉన్నవారికీ లేనివారికీ ఒకటే తేడా .ప్రణాళిక ఉంటె మనం చుడాలానుకున్నది చూస్తాం .ఆలోచిన్చాలనుకున్నదే ఆలోచిస్తాం .ప్రణాళిక లేకపోతే ,ఏది కనిపిస్తే అదే చూస్తాం .ఏది తోస్తే అదే ఆలోచిస్తాం .
పరిపూర్ణ జీవితానికి పక్కా ప్రణాళిక ఉండాల్సిందే !

నీ చేతిలో విల్లు ఉందా ?'
సిదంగా ఉంది. ఇప్పుడే వింటినారీ  బిగించాను ' 
;బాణం ?'
'ఎక్కుపెట్టి వధిలితే చాలు ,రివ్వున దూసుకువెల్ళిపోతుంధీ '

'ఆలస్యమెందుకు? లక్ష్యానికి గురిపెట్టు?'
'లక్ష్యమా! అదెక్కడుంది?'
ఎంత అద్భుతమైన విల్లు అయితేనేం. ఎంత పదునుదేలిన బాణం ఉంటేనేం. లక్ష్యాన్ని
చూడలేకపోతున్నప్పుడు, గురిపెట్టాల్సిందేదో గురుతే లేనప్పుడు.
ఆలోచన స్పష్టంగా ఉన్నప్పుడు లక్ష్యం స్పష్టంగా ఉంటుంది. లక్ష్యం స్పష్టంగా
ఉన్నప్పుడు అమలు స్పష్టంగా ఉంటుంది. అమలు స్పష్టంగా ఉన్నప్పుడు...భవిష్యత్‌
కళ్లముందు కనిపిస్తూ ఉంటుంది. ఆ స్పష్టత, ఆ భవిష్యత్‌ దర్శనశక్తి, ఆ
దూరదృష్టి... చక్కని ప్రణాళిక ద్వారానే సాధ్యం. నేటికీ రేపటికీ మధ్య మనం
కట్టుకునే కలల వంతెన ప్రణాళిక. కలకూ నిజానికీ మధ్య మనం నిర్మించుకునే రంగుల
రాచబాట ప్రణాళిక. రివ్వున ఎగురుతున్న గాలిపటానికీ హుషారుగా ఎగరేస్తున్న
పిల్లాడికీ మధ్య మాంజా లాంటిది ప్రణాళిక. పక్షి నింగికి ఎగిరేముందు ఒక్కసారి
రెక్కలల్లార్చుకుంటుందే, అదే ప్రణాళిక! సింహం శత్రువు మీదికి ఉరుకుతున్నప్పుడు
చుట్టూ పరికించి చూస్తుందే, అదే ప్రణాళిక! చెరువులోని చేపపిల్ల చిట్టిపొట్టి
పురుగుల్ని గబుక్కున మింగేయడానికి ముందు ఒక్క క్షణం నిశ్శబ్దంగా గమనిస్తుందే,
అదే ప్రణాళిక!
ఓ పదేళ్ల వ్యవధిలో హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో చదువుకున్న వందమంది విద్యార్థుల
మీద ఓ అధ్యయనం చేశారు. అందులో ఎనభైమూడు మందికి అసలు లక్ష్యాలే లేవు. పద్నాలుగు
మందికి లక్ష్యాలున్నాయి కానీ, ఎలా సాధించాలనే ప్రణాళికలేదు. ముగ్గురికి
మాత్రం...స్పష్టమైన లక్ష్యాలున్నాయి, అక్షరబద్ధమైన ప్రణాళికలున్నాయి. పదేళ్ల
తర్వాత చూస్తే...ఆ పద్నాలుగుమందీ మిగతా ఎనభైమూడుమందికంటే...పదిరెట్లు ఎక్కువ
సంపాదిస్తున్నారు. ఆ ముగ్గురూ పద్నాలుగుమంది కంటే వందరెట్లు ఉన్నతమైన
స్థానాల్లో ఉన్నారు.
అదీ ప్రణాళిక శక్తి!
మరి, మీ ప్రణాళిక ఏమిటి? అసలు మీకంటూ ఓ ప్రణాళిక ఉందా? ఉంటే, సంతోషం. ఆ మ్యాపు
ప్రకారం ముందుకెళ్లండి. అసలు ప్రణాళికే లేదా? అయినా ఫర్వాలేదు.
 ఇప్పుడు  ప్రారంభించండి.
 ప్రణాళికా రచనలో ఐదు దశలున్నాయి. ఒకటి- ఆలోచన, రెండు- లక్ష్యం, మూడు- వ్యూహం,
నాలుగు- అమలు, ఐదు- బేరీజు.
*ఆలోచనే ఆయుధం* 
మనిషి ఆలోచనా జీవి. ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ ఆలోచనలు నిద్రలోనూ
వదిలిపెట్టవు. రోజూ మనకు అరవైవేల ఆలోచనలు వస్తుంటాయి. అందులో తొంభైశాతం
నెగెటివ్‌ ఆలోచనలే. చాలా సందర్భాల్లో, ఒకే ఆలోచన పదేపదే బుర్రను తొలిచేస్తూ
ఉంటుంది. ఒక్కటీ పనికొచ్చేది ఉండదు. మన మనసుకు ఓ పరిమితి ఉంది. ఒకసారి ఒక
విషయాన్ని మాత్రమే ఆలోచిస్తుంది. ఆ ఒక్క ఆలోచనా గాలివాటంగా వచ్చేదే
ఎందుక్కావాలి? మనం ఎంచుకున్నదే కావచ్చుగా! *మనం ఏం ఆలోచించాలన్నది మనమే
నిర్ణయించుకోవచ్చుగా. అదేం అసాధ్యం కాదు. సాధనతో సమకూరుతుంది. ప్రాణాయామంలో,
ధ్యానంలో జరిగేది అదే.* 

నోబెల్‌ సాధించాలి,  శాస్త్రవేత్తగా పేరుతెచ్చుకోవాలి, ...ఇలా ఓ పట్టాన
నిద్రపోనివ్వని పాజిటివ్‌ ఆలోచనలకు స్పష్టమైన రూపం వస్తే, అదే లక్ష్యం. ఈ
దశలోనే 'ఎలా' అన్న ప్రశ్న తలెత్తేది. ఎదగాలనుకుంటాం. ఎలా ఎదగాలో తెలియదు.
సాధించాలనుకుంటాం. ఎలా సాధించాలో తేల్చుకోలేం. ఈ సమయంలో ఎటెళ్ళాలో తెలిపే
దిక్సూచి కావాలి. ఏ దారి మనల్ని గమ్యానికి చేరుస్తుందో తెలిపే రోడ్‌మ్యాప్‌
కావాలి. ఎంత సమయంలో ఎంతదూరం వెళ్ళలగలవో లెక్కగట్టడానికి కత్తిలాంటి
కాలిక్యులేటర్‌ కావాలి. ప్రతినిమిషం, ప్రతిగంటా గంటకొట్టి వెన్నుతట్టడానికి
గడియారం కావాలి. రోజులు గడిచిపోతున్నాయని చెవి మెలేసి మరీ గుర్తుచేయడానికి
క్యాలెండరు కావాలి. పరిపూర్ణమైన ప్రణాళికలో ఈ సాధన సంపత్తి అంతా ఉంటుంది. 

*ముడిసరకు సిద్ధమా?* 
*ప్రణాళిక రాసుకోడానికి ఖరీదైన నోటుబుక్కూ రంగురంగుల స్కెచ్‌ పెన్నులూ
అక్కర్లేదు. భాష అత్యద్భుతంగా లేకపోయినా ఫర్వాలేదు. కానీ రాతలో నిజాయతీ ఉండాలి.
ప్రతి అక్షరంలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడాలి. మనం శక్తిమంతులం. *సృజనాత్మక
వ్యక్తులం. ఒక్కసారి గుర్తుచేసుకోండి. చిన్నప్పుడు ఎంత స్వేచ్ఛగా ఉంటాం! ఎంత
గొప్పగా ఆలోచిస్తాం! ఆకాశంలో విమానం కనిపించగానే, 'పెద్దయ్యాక పైలెట్‌
అవుతానోచ్‌' అని ప్రకటించేస్తాం. 'నీ వెుహం! ఆ చదువు చదవాలంటే బోలెడంత డబ్బు
కావాలి' అంటూ ఆశల మీద దోసెడు నీళ్లు చల్లేస్తారు పెద్దవాళ్ళు. టీవీలో
కిరణ్‌బేడీని చూడగానే 'ఐపీఎస్‌ ఆఫీసర్ని అవుతా' అని పబ్లిక్‌ స్టేట్‌మెంట్‌
ఇచ్చేస్తాం. 'బక్కపీచు వెధవా, నీకు పోలీసు ఉద్యోగమెందుకు?'... నిర్దాక్షిణ్యంగా
కలల్ని కాలరాచేస్తారు చుట్టూ ఉన్న జనం. ఎదిగేకొద్దీ మన కలలు కురచైపోతాయి.
ఆత్మవిశ్వాసం చిక్కిశల్యమైపోతుంది. పట్టాచేతికొస్తే అదే పదివేలని
సర్దుకుపోతాం. గుమస్తా ఉద్యోగమైనా చాలనుకునే స్థితికి వచ్చేస్తాం. వ్యక్తిత్వ
వికాస నిపుణుడు రాబిన్‌శర్మ ఇలాంటి పరిమితుల్ని 'కనిపించని కంచెలు' అంటాడు.
ముందు ఆ మాయల ముళ్ళపొదల్ని పెకిలించి వేయండి. అవి మీ దరిదాపుల్లో కూడా
ఉండటానికి వీల్లేదు. ఇప్పుడు మీ ప్రణాళికా రచనకు ఎలాంటి అడ్డంకులూ ఉండవు.
పసివాడిగా ఉన్నప్పుడు ఎలా ఆలోచించారో అలానే ఆలోచించండి. మీలో అంతర్లీనంగా ఉన్న
సృజననంతా వెలికితీయండి. మoచి  కలలు కనండి. అపారమైన ఆత్మవిశ్వాసాన్ని
పోగుచేసుకోండి. గొప్పగొప్ప లక్ష్యాల్ని నిర్దేశించుకోండి. కంచెల్లేవ్‌.
కందకాల్లేవ్‌. సరిహద్దుల్లేవ్‌. శృంఖలాల్లేవ్‌. ఇప్పుడు, మీ జీవిత ప్రణాళికకు ఓ
రూపం ఇవ్వండి. 

అభిరుచి, ఇష్టం, వ్యక్తిత్వం, నైపుణ్యం, కలలు, కళలు, పరిమితులు, ప్రాథమ్యాలు...
ఏ ఒక్కటీ వదలకుండా కాగితం మీద పెట్టండి. ఇవన్నీ తెలియని విషయాలేం కాదు. కానీ
అక్షరాల్లో రాసుకున్నప్పుడు వచ్చే స్పష్టత వేరు. మన నిజరూపం ఏమిటో మనకు
అర్థమైపోతుంది. వ్యక్తిత్వవికాస శిక్షకులు దీన్నే 'కోర్‌ కాంపిటెన్సీ' అంటారు.
ఉదాహరణకు...చార్లెస్‌ డార్విన్‌ మతబోధకుడిగా పనిచేశాడు. ఉపాధ్యాయుడిగా
పనిచేశాడు. చిన్నాచితకా ఉద్యోగాలు చాలానే చేశాడు. జీవశాస్త్రవేత్త...అన్నదే ఆయన
నిజరూపం. మీ నిజరూపం ఏమిటో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. 

విద్యార్థికి- ఇంజినీరింగ్‌, మెడిసిన్‌, ఆర్కిటెక్చర్‌, ఆర్ట్స్‌, కామర్స్‌.
పట్టభద్రుడికి- ఉద్యోగం, వ్యాపారం, సేవ.
రిటైర్డ్‌ ఉద్యోగికి- విశ్రాంతి, పార్ట్‌టైమ్‌ ఉద్యోగం, ఆధ్యాత్మిక జీవితం.
...వేయిదార్లు కనిపించవచ్చు. లక్ష అవకాశాలు తలుపుతట్టవచ్చు. శతకోటి ఊరింపులు
ఉంటే ఉండవచ్చు. 'రాళ్ళున్నా రప్పలున్నా సమస్యలున్నా సుడిగుండాలున్నా..ఇదే నా
దారి. ఆ నడకలోనే ఆనందం పొందుతాను. ఆ సవాళ్ళనే సమర్థంగా ఎదుర్కొంటాను. అసలు నేను
ఈ పనిచేయడానికే పుట్టాను. నా జీవిత పరమార్థమే ఇది' అనిపించే వ్యాపకానికే మన ఓటు
వేయాలి. దాని చుట్టే కలల్ని అల్లుకోవాలి. లక్ష్యాల్ని నిర్మించుకోవాలి. జీవిత
ప్రణాళికలో తొలివాక్యం దాంతోనే ప్రారంభం కావాలి. ఐదేళ్ళ  తర్వాతో పదేళ్ళ తర్వాతో
మీరు ప్రపంచానికి పరిచయం అయ్యేది ఆ గుర్తింపుతోనే. మీరు లేకపోయినా మిమ్మల్ని
గుర్తుంచుకునేది కూడా ఆ కారణంగానే. 

ఒక్కసారి నిజరూపం తెలుసుకున్నామా...ఇక విశ్వరూపం మొదలవుతుంది. అది ఏ కలెక్టరు
ఉద్యోగమో  కానక్కర్లేదు. గొప్పవని అ౦దరూ   అనుకునే   వృత్తుల జాబితాలో
లేకపోవచ్చు. ప్రపంచానికంతా చిన్నచూపు ఉండవచ్చు. జీతమూ అంతంతమాత్రమే కావచ్చు.
అది చదువే అయితే, ఏ ఇంజినీరింగో మెడిసినో కావాలన్న నిబంధన కూడా లేదు. మీ
మార్గాన్ని మీరు ధైర్యంగా సగర్వంగా ఎంచుకోండి. వినదగునెవ్వరు చెప్పిన. కానీ
అంతిమ నిర్ణయం మీదే. 'మీకు నచ్చిన చదువే చదవండి. మీకు నచ్చిన పనే చేయండి. ఇంతకు
మించిన విజయరహస్యం లేదు' అంటారు నోబెల్‌ విజేత వెంకటరామన్‌ రామకృష్ణన్‌.
కెరీర్‌ విషయంలో, జీవిత లక్ష్యాల విషయంలో... లాజికల్‌గా ఆలోచించడం కంటే
హృదయలాజికల్‌గా ఆలోచించడమే ఉత్తమం. 

అదిగో... చిటారుకొమ్మన మిఠాయి స్వప్నం... మునుపటికంటే స్పష్టంగా
కనిపిస్తోందిప్పుడు. గురిపెట్టడమే ఆలస్యం. ఆయుధాలకు పదునుపెట్టుకోండి. 

*వ్యూహాత్మకంగా...* 
భూమి సూర్యునిచుట్టూ తిరిగినట్టు... ప్రధాన లక్ష్యాల చుట్టూ ఉపలక్ష్యాలూ అనుబంధ
లక్ష్యాలూ తిరుగుతూ ఉంటాయి. *రక్షణ దళాల్లో చేరడమన్నది ప్రధాన లక్ష్యం
అనుకోండి. ప్రెసిడెంట్‌ మెడల్‌ సాధించడం, పంద్రాగస్టు పరేడ్‌లో
పాల్గొనడం...ఇలాంటివన్నీ ఉపలక్ష్యాలు.* అసలు లక్ష్యం సాధిస్తేనే ఈ కొసరు కలలు
నిజమవుతాయి. ప్రణాళికలో స్వల్పకాలిక లక్ష్యాలుండాలి, దీర్ఘకాలిక
లక్ష్యాలుండాలి. రెంటికీ మధ్య లింకులూ తప్పనిసరి. స్వల్పకాలిక లక్ష్యాలన్నవి
నిచ్చెన మెట్లలాంటివి. దేనికదే ప్రత్యేకమైనా... అంతిమంగా దీర్ఘకాలిక
లక్ష్యానికి ఉపయోగపడాలి. మనల్ని అన్నిటికంటే పైమెట్టుకు తీసుకెళ్లాలి.
ప్రణాళికలో ప్రాథమ్యాలు ముఖ్యం. ముందు దృష్టిపెట్టాల్సిన అంశాలేమిటి? ఆతర్వాత,
అంతుచూడాల్సిన విషయాలేమిటి? అన్న స్పష్టత ఉండాలి.  ఉద్యోగం తెచ్చుకోవడం అన్నది
ఓ మేనేజ్‌మెంట్‌ పట్టభద్రుడి స్వల్పకాలిక లక్ష్యం మాత్రమే. అంతటితో ఆగిపోతే
అక్కడే మిగిలిపోతాడు. చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసరు స్థాయికి ఎదగాలన్నది
దీర్ఘకాలిక లక్ష్యం. ఒక రోజులో, ఒక ఏడాదిలో సాధించేది కాదది. కొన్నిసార్లు
జీవితకాలం పట్టవచ్చు. ఆ లక్ష్యానికి అనుగుణంగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి.
వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుకోవాలి. నైపుణ్యాలకు పదునుపెట్టుకోవాలి. *మన
ఆలోచనలూ అభిరుచులూ అలవాట్లూ ప్రధాన లక్ష్యం చుట్టూ ముడిపడినపుడే అది
సాధ్యమవుతుంది*. *ప్రణాళికకు తగినట్టుగా ఆలోచించేలా మన మెదడును ట్యూన్‌
చేసుకోవాలి. లక్ష్యానికి ఉపకరించేలా మన అలవాట్లను తీర్చిదిద్దుకోవాలి.
ఎదుగుదలకు సహకరించేలా మన అభిరుచుల్ని పెంపొందించుకోవాలి.* అంతెందుకు, లక్ష్యమే
మన సర్వస్వం కావాలి. నిర్ణీత వ్యవధుల్లో ఎదుగుదలను సమీక్షించుకోవడం,
జయాపజయాల్ని బేరీజు వేసుకోవడం, పరిస్థితులను బట్టి ప్రణాళికలో మార్పుచేర్పులు
చేసుకోవడం చాలా అవసరం. 

*అదే ప్రపంచం* 
ఒక్కసారి ప్రణాళిక సిద్ధం చేసుకుంటే, మనం ఆలోచించే పద్ధతే మారిపోతుంది. సినిమా
చూస్తున్నా, టీవీ చూస్తున్నా, పేపరు తిరగేస్తున్నా, పుస్తకం చదువుతున్నా,
నిద్రపోతున్నా...మన బుర్రలోని సృజనాత్మక విభాగం ప్రణాళిక గురించే ఆలోచిస్తూ
ఉంటుంది. అవసరమైన పాయింటు తగలగానే, గిల్లిమరీ గుర్తుచేస్తుంది. రోజువారీ
జీవితంలో కూడా బోలెడంత తేడా కనిపిస్తుంది. 'చల్తాహై...' ధోరణి దరిదాపుల్లోకి
కూడా రాదు. మన అలవాట్లు కూడా లక్ష్యానికి అనుగుణంగా మారిపోతాయి. 'అలవాట్లే నీ
గెలుపు ఓటముల్ని నిర్ణయిస్తాయి' . *లక్ష్యసాధకులెవరూ సూర్యుడు నడినెత్తిన
వచ్చేదాకా నిద్రపోరు. లక్ష్యం నిద్రపోనివ్వదు కూడా*. ప్రణాళిక ద్వారా మనం
సాధించబోయే విజయాలు జీవితం మీద కొత్త ఆశలు చిగురింపజేస్తాయి. ఆశావాదాన్ని
నూరిపోస్తాయి. ఎదురుదెబ్బలూ చేదు అనుభవాలూ మనల్నేమీ చేయలేవు. స్నేహితుల
ఎంపికలోనూ ఆ ప్రభావం కనిపిస్తుంది. మన ఆలోచనా స్థాయికి చేరుకున్నవారికే
మిత్రబృందంలో చోటిస్తాం. ఎవరైనా చేరుకోకపోతే, ఎలా చేరుకోవాలో నేర్పిస్తాం.
అవసరమైతే చేయిపట్టుకుని నడిపిస్తాం. అన్నిటికీ మించి బాధ్యత అలవడుతుంది.
ఎందుకంటే, మన ప్రణాళికకు మనమే జవాబుదారులం. ఐదేళ్ళలోనో పదేళ్ళలోనో అనుకున్నది
సాధించకపోతే ఆ అక్షరాలు నిలదీస్తాయి. 

*ఆర్థికంగా...* 
*కేవలం డబ్బు వల్లే ఎవరూ సుఖపడిన దాఖలాల్లేవు. *కానీ డబ్బు లేకపోవడం వల్ల
కష్టాలపాలైన వారు చాలా మందే ఉన్నారు. ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా డబ్బు
ప్రాధాన్యం డబ్బుదే. భవిష్యత్‌ అవసరాలకు సరిపడినంత, కుటుంబ బాధ్యతలకు తగినంత
సంపాదన అవసరమే. ఆ సంపాదించిన దానిలో ఎంత పొదుపు చేశామన్నదీ ముఖ్యమే. ఆ పొదుపును
ఎంత తక్కువ సమయంలో ఎంత సురక్షితంగా రెట్టించామన్నది ఇంకా ముఖ్యం.   ప్రభుత్వ
ర౦గ బ్యా౦కులు , తపాలా శాఖవారి చిన్న మొత్తాల పొదుపు పథకాలు, పబ్లిక్‌
ప్రావిడెంట్‌ ఫండ్‌ ... అందుబాటులో ఉన్న అవకాశాల్ని పరిశీలించాలి. సురక్షితమైన
మార్గాల్ని ఎంచుకోవాలి. అవసరమైతే నిపుణుల సాయం తీసుకోవాలి. నెలవారీ ప్రణాళికతో
మొదలుపెట్టి...రిటైర్మెంట్‌ దాకా ప్రతి దశకూ పక్కా ప్రణాళిక ఉండాలి.
ఒక్కసారిగా కోటి రూపాయలు సంపాదించడం అసాధ్యమే కానీ, పాతికేళ్ళ  ప్రణాళికతోనో
ముప్ఫై ఏళ్ళ  ఆర్థిక వ్యూహంతోనో కోటి రూపాయలు పొదుపుచేయడం పెద్ద కష్టమేం కాదు.
పాతికేళ్ళ  కుర్రాడు నెలకు ఆరువేల చొప్పున పబ్లిక్‌ ప్రావిడెంట్‌ఫండ్‌ ఖాతాలో
జమ చేసినా...రిటైర్మెంట్‌ నాటికి కనీసం అరకోటీశ్వరుడు అవుతాడు. కుటుంబానికి
ఆరోగ్యబీమా, మనం లేనప్పుడు ఆదుకోడానికి టర్మ్‌ పాలసీ, ఓ వెచ్చని నీడ...ఆర్థిక
ప్రణాళికలో భాగమే. పొదుపు-మదుపులకు సంబంధించి నెలవారీ లక్ష్యాలూ వార్షిక
లక్ష్యాలూ దశాబ్ద లక్ష్యాలూ రిటైర్మెంట్‌ లక్ష్యాలూ...సవివరంగా
సిద్ధంచేసుకోవాలి. 

*ఓ పాలకుడు పొరుగురాజ్యాన్ని ఆక్రమించుకోడానికి బయల్దేరే ముందు, గురువుగారి
దర్శనానికి వెళ్లాడు. అదే సమయానికి ఓ పేదవాడూ వచ్చాడు. ఆ నిరుపేద తన జేబులో
భద్రంగా దాచుకున్న రూపాయి నాణాన్ని గురువుగారి చేతిలో పెట్టాడు. 'నాకెందుకు
నాయనా! ఇక్కడ ఎవరైనా పేదవాళ్లుంటే ఇవ్వు' అని సలహా ఇచ్చారాయన. ఆ దరిద్రుడి
దానాన్ని పుచ్చుకోడానికి ఎవరూ ముందుకు రాలేదు. స్వామీజీ అదంతా చూస్తున్నారు.
'అదిగో... ఆ రాజుగారికి ఇవ్వు! పాపం, ఎన్ని సిరిసంపదలు ఉన్నా చాలడం లేదు. మళ్లీ
దండయాత్రకు బయల్దేరుతున్నారు. అంతకంటే నిరుపేద ఇంకెవరుంటారు' అని ఆ పేదవాడితో
చెప్పారు.* *
ఆ మాటతో రాజుగారికి జ్ఞానోదయమై౦ది.* 

*సంపాదనకైనా, సంపాదించాలన్న ఆశకైనా ఓ పరిమితి ముఖ్యం. ఆ సంతృప్తి లేకపోతే
మనశ్శాంతి కరవవుతుంది. ఏ కొద్దిమందిలోనో ఆ సంతృప్తి కనిపిస్తుంది. మనం ఎంత
సంపాదించినా...అందులో ఐదుశాతమో  పదిశాతమో సమాజానికి కేటాయించాలన్న నిర్ణయం
తీసుకుంటే, ఆ నిర్ణయాన్ని మన ప్రణాళికలో భాగం చేసుకుంటే ఆస్తులతోపాటు
ఆత్మసంతృప్తీ పెరుగుతుంది.* 

*వికాస యాత్ర...* 
*ఆయనో పెద్ద పారిశ్రామికవేత్త. వ్యాపారాన్ని అంతర్జాతీయంగా విస్తరించిన ఘనుడు.
ప్రధానులు, రాష్ట్రపతులు కూడా ఆ కుబేరుడి అపాయింట్‌మెంట్‌ కోసం
ఎదురుచూస్తుంటారు. అంత డబ్బుంది. అంత పరపతి ఉంది. వందలకోట్ల వ్యాపార
సామ్రాజ్యాన్ని వారసులకు అప్పగించి, ఆరోజే పదవీవిరమణ చేయబోతున్నాడు. చేతిలో
చిల్లిగవ్వకూడా లేకుండా జీవితాన్ని ప్రారంభించిన ఆ విజేతకు వీడ్కోలు పలకడానికి
మహామహులంతా సిద్ధంగా ఉన్నారు. ఆయన మాత్రం దిగాలుగా తన ఛాంబర్‌లో కూర్చుని దేని
కోసవో వెతుకుతున్నాడు. ఓ ఉన్నతోద్యోగి ధైర్యంచేసి అడిగాడు...'అయ్యా! ఏదో
ముఖ్యమైన కాగితం కోసం వెదుకుతున్నట్టున్నారు'. 'కాగితం కోసం కాదయ్యా! నేను
పోగొట్టుకున్న జీవితం కోసం'...దిగాలుగా జవాబిచ్చాడు వ్యాపారవేత్త. జీవితమంటే...
కెరీర్‌, డబ్బు మాత్రమే కాదు. బంధాలు, ఆసక్తులు, అభిరుచులు, అనుభూతులు,
ఆరోగ్యం, ఆధ్యాత్మికత కూడా! ఆ కోణమూ లేకపోతే మన ప్రణాళిక అసమగ్రమే.* 

ప్రతి ఆరోగ్యవంతుడి తలమీదా ఓ కిరీటం ఉంటుంది. అది రోగిష్టివాళ్లకు మాత్రమే
కనబడుతుంది. పోగొట్టుకున్నాకే ఆరోగ్యం విలువ తెలుస్తుంది. కానీ ఒకసారి
పోగొట్టుకుంటే తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టం. బాల్యం నుంచే ఆరోగ్యకరమైన
అలవాట్లను పెంపొందించుకోవాలి.  పెడదార్లు పట్టకుండా జాగ్రత్తపడాలి. వూబకాయం,
అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు అతి సాధారణమైపోయిన రోజుల్లో... అసలు ఆ
రోగాలు మన దరిదాపులకు రాకుండా ఉండాలంటే, ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ
తీసుకోవాలి. పొరపాటున మన జోలికి వస్తే వాటిని ఎలా నియంత్రణలో పెట్టాలన్నదీ
ఆలోచించాలి. వైద్యం, ఆహార విధానం, వ్యాయామం, జీవనశైలి...దేన్నీ తక్కువచేయలేం.
ఆరోగ్య ప్రణాళిక అంతిమ లక్ష్యం...నా ఇంట్లో మందుల అరతో అవసరమేలేని రోజంటూ
రావాలి అన్నదే. 

*హాబీలకూ ప్రణాళికలో స్థానం ఉండాలి. ఈ ఏడాది కూచిపూడిలో అరంగేట్రం చేయాలి...
రెండే*ళ్ళ *లో నేను వేయాలనుకున్న పెయింటింగ్లను   పూర్తిచేసి ఓ ప్రదర్శన
పెట్టాలి...ఐదేళ్లనాటికి రచయితగా నాకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలి... ఇలా హాబీ
మనలోని సృజనని వెలికితీస్తుంది. ఆ శక్తిలో కొంత వృత్తిజీవితానికీ
మళ్ళిoచుకోవచ్చు.* 

*నేర్చుకునే మనసుండాలే కానీ, వృక్షాలు మాట్లాడతాయి. రాళ్ళు  ప్రవచిస్తాయి.
సెలయే**ళ్ళు** గ్రంథాలవుతాయి.     ప్రయాణాల్ని మించిన వ్యక్తిత్వ వికాసమార్గం
లేదు.** **భారతదేశములో **కొత్తకొత్త ప్రదేశాలు, కొత్తకొత్త పరిచయాలు,
కొత్తకొత్త స్నేహాలు, కొత్తకొత్త అనుభవాలు... జీవితానికి కొత్త
ఉత్సాహాన్నిస్తాయి. కొత్త ఆలోచనల్ని ప్రసాదిస్తాయి. ఏడాదికి కనీసం
పదిహేనురోజులు ఏదో ఓ కొత్త ప్రదేశానికి వెళ్లడానికి కేటాయించుకోండి. అందుకయ్యే
ఖర్చులు, చేసుకోవాల్సిన ఏర్పాట్లు, అనువైన సమయం, బస, భోజనం...తదితర వివరాలన్నీ
పర్యాటక ప్రణాళికలో భాగం.* 

పాతికేళ్ల వయసులోనూ నలభై ఏళ్ల వయసులోనూ ప్రపంచం మీ కళ్లకు ఒకేలా
కనిపించిందంటే, మీరు పదిహేనేళ్ల కాలాన్ని వృథా చేసినట్టే. ఎదిగేకొద్దీ పరిణతి
చాలా ముఖ్యం. ఉత్తమ సాహిత్యం, సత్సాంగత్యం మన ఆలోచనల మీద ప్రభావం చూపిస్తాయి.
ఆధ్యాత్మికత ప్రభావమూ చాలా ఉంటుంది. ఇది వికాస ప్రణాళిక. 

పర్యాటకం, ఆర్థికం, హాబీలు, ఆరోగ్యం వగైరా వగైరా దేనికదే విడిగా అనిపిస్తున్నా
అంతస్సూత్రం ఒకటే. మీకిష్టమైన కూచిపూడిలో పద్మశ్రీ అవార్డు అందుకోడానికి
వీల్‌ఛెయిర్‌ మీద వెళ్లకూడదనుకుంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి. నచ్చిన ప్రాంతానికి
వెళ్లడానికి ఎవరి దగ్గరో చేయి చాచాల్సిన దుస్థితి రాకూడదంటే, ఆర్థికంగా ఉన్నత
స్థితిలో ఉండాలి. ఇవన్నీ ఒకదానితో ఒకటి విడదీయలేని అంశాలే. మీరూ మీ ఆలోచనలూ మీ
అలవాట్లూ మీ లక్ష్యాలూ మీ విజయాల్లా! 

*వైఫల్యం వస్తే...* 
ఎడిసన్‌ కథ మనకు తెలిసిందే. తన ప్రయత్నంలో ఎన్నోసార్లు విఫలమయ్యాడు. ఓ దశలో
నిరాశ కమ్మేసింది. ఇక తనవల్ల కాదేవో అనుకున్నాడు. అప్పుడే ఓ మిత్రుడు వచ్చాడు.
ఎడిసన్‌ మొహంలో కనిపిస్తున్న నిరాశానిస్పృహల్ని చూడగానే అతనికి విషయం
అర్థమైపోయింది.
'నీకు అన్నిటికంటే ఇష్టమైన పనేమిటి' అనడిగాడు...
'బల్బు తయారు చేయడం' నిర్వేదంగా చెప్పాడు ఎడిసన్‌.
'మరి, ఎందుకింత నిరాశ?'
'వేయిసార్లు విఫలమయ్యాను మిత్రమా'
'అలా ఎందుకనుకోవాలి? నీకు ఇష్టమైన పని వేయిసార్లు చేసే అవకాశం వచ్చిందని
అనుకోవచ్చుగా'
వైఫల్యాల్ని పాజిటివ్‌ ఎనర్జీగా ఎలా మార్చుకోవచ్చో ఎడిసన్‌కు అర్థమై౦ది. ఈసారి
ఓటమి భయంలేకుండా పరిశోధన చేశాడు. విద్యుత్‌దీపాన్ని ఆవిష్కరించాడు.
నరేంద్ర ముర్కుంబీ అనే యువకుడు నానా కష్టాలూ పడి ఓ చక్కెర ఫ్యాక్టరీని
కొన్నాడు. ఎంత ఆలోచించినా దాన్ని నష్టాల్లోంచి ఒడ్డుకేయడం ఎలానో అర్థంకాలేదు.
దాదాపు ఆరునెలలు ఫ్యాక్టరీలోనే గడిపాడు. తిండీ నిద్రా అక్కడే. ఓ మూలనపడేసిన
చెరుకుపిప్పితో సహా...అణువణువూ పరిచయమైపోయింది. అప్పుడొచ్చిన ఆలోచనే... చెరుకు
పిప్పితో విద్యుదుత్పత్తి! ఆయన నాయకత్వంలోని 'గాయత్రి షుగర్'    పదేళ్లలో
వేయికోట్ల టర్నోవరును అధిగమించింది. వైఫల్యం నేర్పే పాఠాలు ఇంత గొప్పగా
ఉంటాయి. 

పడుతూలేస్తూ సరిదిద్దుకుంటూ సరిపుచ్చుకుంటూ ఓ అడుగు వెనకేస్తూ రెండడుగులు
ముందుకేస్తూ  ధైర్యంగా ముందుకెళ్ళడమే జీవితం. ఆ ప్రయాణంలో ఓ ఆసరా... ప్రణాళిక. 

  విజయాక్షరాలు 
మాట మంత్రాక్షరం. స్తబ్ధతను తరిమే చైతన్య అస్త్రం. దిశ చూపే దిక్సూచి. చీకటిని
గెలిచే దివిటీ. పుస్తకాల్లో రాసుకోండి. గోడమీద అతికించుకోండి. హృదయాల్లో
ప్రతిష్ఠించుకోండి. ప్రణాళికా రథానికి ఈ విజయాక్షరాలే...ఇంధనాలు.  శ్రమ నీకు
ఆయుధమైతే, విజయం నీకు బానిస అవుతుంది.  అసాధ్యమైన దాన్నిఆశించు. కనీసం
అత్యుత్తమమైనదైనా అందుతుంది.  విజయం అంటే, ఆశించినదాన్ని సాధించడం కాదు.
సాధించవలసిన దాన్ని అందుకోవడం.  వనరులూ వసతులూ కాదు, ఎవరి విజయానికైనా ఆలోచనా
విధానమే మూలం.  వైఫల్యం నిరాశకు కారణం కాకూడదు. కొత్త ప్రేరణకు పునాది
కావాలి.  ప్రయత్నించనిదే
ఫలితం లభించదు. సింహమైనా పడుకుని ఉంటే ఆహారం వచ్చి నోట్లోపడదు.  గెలవాలన్న తపన
ఉన్నచోట, ఓటమి అడుగైనా పెట్టలేదు.  ఈ రోజు మన జీవితం, నిన్నటి ఆలోచనల
ఫలితమే.  పరాజయం
అంటే, నువ్వు చేసే పనిని వదిలి పారిపొమ్మని కాదు, ఆ పనిని మరింత శ్రద్ధగా
నేర్పుగా పట్టుదలగా చేయమని అర్థం.  విజయం ఒక గమ్యం కాదు. గమనం మాత్రమే.
ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి జీవితంలో మరో అవకాశం ఉంటుంది.  గొప్ప లక్ష్యాన్ని
సాధించాలని ప్రయత్నించి విఫలం కావడం నేరం కాదు. గొప్ప లక్ష్యం లేకపోవడం
నేరం.  అసంభవం
అన్న పదం అసమర్థుల నిఘంటువుల్లోనే కనిపిస్తుంది.  వజ్రసంకల్పం కలిగిన వ్యక్తి
ప్రపంచాన్నే తన అభీష్టానికి అనుగుణంగా మలచుకుంటాడు.  ప్రతి చిన్న అవాంతరానికీ
సంకల్పాన్ని మార్చుకునేవారు లక్ష్యానికి దూరమవుతారు. అంతరాలు కలిగేకొద్దీ
సంకల్పాన్ని దృఢతరం చేసుకుంటూ పోవాలి.  ఒక పని కష్టమని మనం దాన్ని చేయడానికి
భయపడం. మనం భయపడతాం కనుక ఆ పని కష్టమనిపిస్తుంది.  ఎదురుచూస్తూ కూర్చోవడం కాదు,
ఎదురునడుస్తూ పోవడమే విజయరహస్యం.  విజయశిఖరాలు సోమరులకు అందవు. పట్టుదలతో
కృషిచేసే వారికి అవి తలవంచుతాయి.  విజేత వెనక ఉండేది అదృష్టవో మంత్రదండవో
కాదు... చక్కని ప్రణాళిక, కఠిన శ్రమ, అంకితభావం. 

విజయం అంటే, ఆశించినదాన్ని సాధించడం కాదు. సాధించవలసిన దాన్ని అందుకోవడం.
శ్రమ నీకు ఆయుధమైతే, విజయం నీకు బానిస అవుతుంది.

మేమున్నామని....

అయినవాళ్లందరికీ దూరంగా వూరు కాని వూళ్లో రాష్ట్రం కాని రాష్ట్రంలో కూలి పనులు చేసే కొన్ని లక్షలమంది వలస కార్మికులకు మేమున్నామని భరోసా ఇచ్చారు వాళ్లు.
రాజస్థాన్‌లోని ఓ కుగ్రామం నుంచి అహ్మదాబాద్‌కు వలస వెళ్లాడు ఇందర్‌సింగ్‌. హోటల్లో పనిచేస్తూ, అక్కడే ఉంటున్నాడు. అతడు డబ్బుని హోటల్లో తానుండే చిన్న గదిలోనే దాచుకునేవాడు. చాలాసార్లు దొంగతనాలు జరగడంతో తన షూలో దాచుకోవడం వెుదలుపెట్టాడు. ఎవరూ కనిపెట్టలేదనుకున్నాడు గానీ ఎలుకలకు తెలిసిపోయింది. ఓసారి రెండువేల రూపాయలను ఎందుకూ పనికిరాకుండా కొరికేశాయి. వాటిని చూసినప్పుడు అతడి ముఖంలో కన్నీళ్లొక్కటే తక్కువ. పరాయి రాష్ట్రంవాడు కావడం వల్ల 'గుర్తింపు కార్డులు' ఇవ్వలేమని తేల్చేశాయి స్థానిక సంస్థలు. అందువల్ల బ్యాంకు అకౌంటూ రాలేదు. తన కుటుంబానికి డబ్బు పంపాలంటే దళారులను ఆశ్రయించాల్సి వచ్చేది. వాళ్లు చాలా ఎక్కువ ఛార్జీలు వసూలు చేసేవాళ్లు. ఒక్కోసారి పంపకుండా వోసం చేసేవాళ్లు కూడా.
గాంధీనగర్‌ ప్రాంతంలో చిన్నచిన్న హోటళ్లలో పనిచేస్తున్న 46 మందిది మరీ దీనగాథ. రాజస్థాన్‌లోని గిరిజన ప్రాంతాల నుంచి వచ్చిన ఆ కార్మికులు ఏడేళ్లుగా అక్కడ పనిచేస్తున్నా జీతాలు పెంచలేదు. పెంచాల్సిందిగా అడిగారని వాళ్లందరినీ బెదిరించి, హోటళ్ల నుంచి గెంటేశారు. వాళ్లంతా రోడ్డునపడ్డారు. వాళ్లలో ఏ ఒక్కరికీ బ్యాంకు అకౌంటు లేదు. మరో పని చేతకాదు. ఎలాంటి గుర్తింపు కార్డులూ లేవు. తమకు జరిగిన వోసాన్ని ఎలా ప్రశ్నించాలో తెలియదు. ఇలా ఎక్కడెక్కడి నుంచో వచ్చి, దోపిడీకి గురయ్యే వలస కార్మికులు ఎందరో!
వీళ్లందరి కోసమే ఆజీవికా ఫౌండేషన్‌ ఏర్పడింది. దీని వ్యవస్థాపకుడు రాజస్థాన్‌కు చెందిన రాజీవ్‌ ఖండేవాల్‌. అతడు ఓ కార్పొరేట్‌ కంపెనీలో ఉద్యోగి. తన ఆఫీసు పక్కనే ఉండే పనిచేసే భవన నిర్మాణ కార్మికులు కూలి డబ్బులు దాచుకునే పరిస్థితి లేకపోవడం, యజమానులు వాళ్లను దోచుకోవడం... ఆయన్ను ఆలోచింపజేశాయి. వాళ్లందరిలోనూ చైతన్యం తెచ్చి, కొత్త జీవితం ఇవ్వాలనుకున్నాడు. అలా 2005లో 'ఆజీవికా ఫౌండేషన్‌' ప్రారంభించారు. గుర్తించలేదు... నైపుణ్యమూ లేదు
వలస కార్మికుల సమస్యల్లో వెుదటిదీ అతి ముఖ్యమైనదీ గుర్తింపు కార్డు. అది లేకపోవడంతో... వాళ్లు పనిచేసే ప్రాంతాల్లో యజమానులు వాళ్లను అనేక రకాలుగా దోచుకుంటారు. 'చాలావరకూ వలస కార్మికులు భవన నిర్మాణ పనులూ వంటపనులూ డ్రైవింగ్‌లాంటివి చేసి బతుకుతారు. వీరికి జీతాలిచ్చేటప్పుడు ఎలాంటి లెక్కాపత్రమూ ఉండవు. మరికొన్ని సందర్భాల్లో... ఆ ప్రాంతంలో ఏవైనా నేరాలూ ఘోరాలూ జరిగినప్పుడు పోలీసుల దృష్టి సమీపంలో ఉండే వలస కార్మికులమీదకే వెళ్తుంది. అప్పుడు వాళ్లకు మేం ఫలానావాళ్లం అని చెప్పడానికి ఎలాంటి ఆధారమూ ఉండదు' అంటారు రాజీవ్‌.
మనదేశంలో వలస కార్మికుల సంఖ్య 10 కోట్లకుపైనేనని అంచనా. వీరిలో కేవలం 22 శాతం మందికే బ్యాంకు అకౌంట్లు ఉన్నాయని సెంటర్‌ ఫర్‌ మైక్రోఫైనాన్స్‌ అధ్యయనం. ఇందుకు ప్రధాన కారణం... అధికారిక గుర్తింపు కార్డులు లేకపోవడమేనట.
ఇక, రెండోది... నైపుణ్యం. ఇతర ప్రాంతాలకు తరలివెళ్లే కార్మికుల్లో సగానికిపైగా సదరు పనిలో నైపుణ్యం లేనివాళ్లే.
వలస కార్మికుల సమస్యల్లో మరో ముఖ్యమైనది... ఆరోగ్యం. అపరిశుభ్ర ప్రదేశాల్లోనే వంటలూ భోజనాలూ చేయడం వల్ల సంపాదనలో సగం వైద్య ఖర్చులకే సరిపోతుంది. ఇంటికి డబ్బు పంపే మార్గాలూ తెలియవు. ఈ సమస్యలన్నింటినీ ఆజీవికా గుర్తించింది.
కార్డులిచ్చారు... శిక్షణా ఇచ్చారు వలస కార్మికులను ఆజీవికా ఫౌండేషన్‌ సభ్యులే గుర్తిస్తారు. స్థానిక సంస్థల సాయంతో వాళ్లందరికీ ఫొటో గుర్తింపు కార్డులు వచ్చేలా కృషి చేస్తారు. ఆ కార్డులతో వాళ్లకు బ్యాంకు అకౌంటు వచ్చేలా చేస్తారు. ఇప్పటివరకూ రాజస్థాన్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లో 50వేల మందికి గుర్తింపు కార్డులిచ్చారు. అయితే వారిలో కేవలం వెయ్యిమందికే బ్యాంకులు అకౌంట్లు ఇచ్చాయి. మిగతావాళ్లకూ అకౌంట్లు ఇప్పించేందుకు 'ఆజీవికా' ఇప్పటికీ కృషి చేస్తూనే ఉంది. వలస కార్మికులను వాళ్ల వాళ్ల యజమానులు డబ్బులివ్వకుండా వోసం చేసినా, మహిళా కార్మికులపై అత్యాచారాలకు పాల్పడినా ఆజీవికా వాళ్లకు న్యాయ సహాయం చేస్తుంది.
ఆజీవికాలో నిరుపేద నిరుద్యోగ యువతకు ఎలక్ట్రికల్‌ వైరింగ్‌, తాపీపని, వెల్డింగ్‌ లాంటి అనేక అంశాల్లో శిక్షణ ఇస్తారు. అది పూర్తయ్యాక వాళ్లే ఉద్యోగాలిప్పిస్తారు. వలస కార్మికుల కోసం ఇటీవలే 'సామాజిక వంటశాలలు' ఏర్పాటుచేసింది ఆజీవికా. ఇందులో భాగంగా ఓ గదిలో గ్యాస్‌ స్టౌలు ఏర్పాటుచేస్తారు. సామాన్లూ కూరగాయలూ బియ్యమూ తెచ్చుకుని కార్మికులు ఇక్కడే వండుకోవచ్చు. రోజుకు అయిదు రూపాయలు చెల్లిస్తే చాలు. ఈ కార్యక్రమం ఎంతో విజయవంతమైంది.
'మేం గతంలో కిరోసిన్‌, కట్టెలూ ఉపయోగించి, ఎక్కడ ఉంటే అక్కడే వంట చేసేవాళ్లం. అందువల్ల ఎప్పుడూ ఆరోగ్య సమస్యలే. ఈ వంట గదులు ఎంతో పరిశుభ్రంగా ఉన్నాయి. 'ఆజీవికా' వాళ్లు మాకు గుర్తింపు కార్డులిచ్చారు. బ్యాంకు అకౌంట్లు ఇచ్చారు. మా పిల్లలకు మంచి ఉద్యోగాలిచ్చారు. మేం మంచి భోజనం తినేలా చేస్తున్నారు. వీళ్లే లేకపోతే మా జీవితాలు ఎలా ఉండేవో?' అంటున్నప్పుడు 30 ఏళ్ల మీనా కళ్లల్లోని ఆనందం ... ఆజీవికాకు ఇంతకంటే ప్రశంస ఏముంటుంది.
నిజమే... ఎంతోమంది వలస కార్మికులకు 'ఆజీవికా' పునర్జన్మ ప్రసాదించింది. త్వరలో దక్షిణాది రాష్ట్రాల్లోనూ శాఖలను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. మరెంతోమందికి వారి సేవలు అందాలని ఆశిద్దాం.

PREVIOUS NEXT


దడదడమని బడిగంట!

‘ఠంగు’న గంటకొట్టినట్లు చదువుల రుతువు మళ్లీ చిగురించింది. స్కూల్స్ రీ-ఓపెన్. మరి, మీ పిల్లల మాటేమిటి? వాళ్లు ఓపెన్ అవుతున్నారా? ‘దేవుడా ఇదెక్కడి శిక్ష’ అని లోలోపల కుమిలిపోతున్నారా? స్కూల్ బెల్ వారికి గణగణమని వినిపిస్తోందా? దడదడమని దడ పుట్టిస్తోందా? అడిగి తెలుసుకున్నారా? ‘అడగడమా! నాలుగు తగిలించి స్కూల్ బస్ ఎక్కించక, ఈ కౌన్సెలింగ్ ఏమిటి’ అంటారా? అయితే మీరు మాంటిసోరి ఏం చెప్పారో వినాలి. మీరు పేరెంట్ అయినా, టీచర్ అయినా.. శ్రద్ధగా వినాలి.

పిల్లల్ని స్వేచ్ఛగా వదిలేస్తే.. ముందు స్కూల్ బ్యాగ్ తీసుకెళ్లి ఎక్కడైనా అండర్ గ్రౌండ్‌లో దాచేసి వస్తారు. పెన్సిల్‌ని ముక్కలుగా విరగ్గొట్టి మురిక్కాలువలో పడే స్తారు. మిస్‌ని, క్లాస్ టీచర్‌ని కలలోకైనా అడుగుపెట్టనివ్వరు. యూనిట్ టెస్ట్ ఉన్నరోజు కూడా, మాకివాళ స్కూల్ లేదని గట్టిగా కళ్లు మూసుకుని ఫస్ట్ బెల్, సెకండ్ బెల్, థర్డ్ బెల్ అయిపోయేవరకు దుప్పట్లోంచి లేవరు. తర్వాత ఏం జరుగుతుందన్నది వాళ్లకు లెక్క కాదు. అప్పటికైతే స్కూల్ కి వెళ్లడం అనే ఒక దరిద్రపుగొట్టు పని తప్పుతుంది. అంతవరకే ఆలోచన! నీల్ డౌన్ చేయించి, టైమ్ టేబుళ్లు వేయించి గంటలు గంటలు చదువు నేర్పిస్తుంటే.. మింగలేక, కక్కలేక, ‘అమ్మా! కడుపునొప్పి’ అనక.. ఐయామ్ హ్యాపీ అంటారా పిల్లలు?!

పేరెంట్స్ వాదనా సరిగ్గానే ఉంటుంది. మట్టిలో ఆడినంత సహజంగా మేథ్స్ ఒంటికెలా పడుతుందని వారి ప్రశ్న. మేథ్స్ ఒక్కటే కాదు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ.. ఇవన్నీ పక్కలో పడుకోబెట్టుకుని పాలు పట్టినంత ఒడుపుగా కడుపులోకి పంపించలేం కదా. భయం ఉండాలి. టీచర్ భయం, బెత్తం భయం, డిక్టేషన్ భయం, హోమ్‌వర్క్ భయం, ఇంపోజిషన్ భయం, అసైన్‌మెంట్‌ల భయం ఉండాలి. భయం లేకపోతే పాలు తాగడం కూడా పిల్లలకు ఆటే అవుతుంది!
కరెక్ట్. అయితే నేననడం ఏమిటంటే - ఈ భయాలన్నీ పెద్దల తలల్లోంచి వచ్చి పిల్లల పేగుల్లో దూరుతున్నవేనని! అందుకే పిల్లలకింత చదువుల అజీర్తి.

* * *

గొప్పగొప్ప కుటుంబాల నుంచి ఆర్మీ ఆఫీసర్లు, పోలీసు అధికారులు, విద్యావేత్తలు నన్ను వెదుక్కుంటూ వస్తుంటారు. ‘‘మహాతల్లి మాంటిసోరి తమరేనా’’ అన్నట్లు ఉంటాయి వారి చూపులు. కొందరైతే నేరుగానే అడుగుతారు - ‘‘పిల్లల్ని గాలికి వదిలేయమంటారా అమ్మా.. మీరు కూడా అలానే పెరిగారా..’’ అని!
ఇంట్లో.. పిల్లల దగ్గర కూడా వీళ్ల వ్యంగ్యం ఇలాగే కొనసాగుతుంటుంది. చదువుకోకుండా గాడిదలు కాస్తావా అంటారు. పసితనపు అమాయకత్వంతో పిల్లలు ఒకవేళ ‘సరే’ అంటే.. పెద్దలు ఎంత దుఃఖపడాలి! అలా ఏం జరగదు. కోపం వస్తుంది. నాలుగు తగిలిస్తారు. ఏడిస్తే దగ్గరికి తీసుకుంటారు. చేతినిండా కుకీస్ పెట్టి మళ్లీ పుస్తకం తెరవమంటారు!

* * *

మాంటిసోరి మెథడ్ అనగానే పిల్లల్ని చెట్టుకు పుట్టకు వదిలి, సాయంత్రం కాగానే ఇంటికి తోలేస్తారేమోనని ఒక అనుమానం. ఇలా అనుమానించేవాళ్లకు వెంటనే ఒక సందేహం కూడా రావాలి. పిల్లలు చెట్లను ఇష్టపడుతున్నారు. పుట్టలను ఇష్టపడుతున్నారు. గాలినీ, గాలిలో ఎగిరే పక్షులను ఇష్టపడుతున్నారు. స్కూళ్లను మాత్రం ఇష్టపడడం లేదు! బయట కనిపిస్తున్న ఉన్నవాటినే తరగతి గదిలో కూర్చుని, పుస్తకాల్లో చూసి, చదివి నేర్చుకోమంటే వణికిపోతున్నారు. అంటే - ప్రకృతి పాఠాలలో లేని కాఠిన్యం.. టీచర్లలో, టీచర్లు చదువు చెబుతున్న విధానంలో ఉంది. తల్లిదండ్రులు పిల్లలపై విధించే ఆంక్షలలో ఉంది. ఇళ్లల్లో, స్కూళ్లల్లో పిల్లల కళ్లెదుట ఇంత హింసను కుమ్మరిస్తూ.. చదవడం లేదన్న బాధతో, కోపంతో వాళ్ల వీపుల్ని పగలగొట్టడం ఏ మాయదారి లోకంలోని న్యాయం?

అంకోలా స్కూల్లో ఉండగా ఒకరోజు ఉదయాన్నే నా క్లాస్‌మేట్ ఏడుస్తూ కనిపించింది. తనని ఎ సెక్షన్ నుంచి బి సెక్షన్‌కి మార్చారట! ‘‘అయితే ఏమయింది!’’ అన్నాను. తను ఇంకా పెద్దగా ఏడ్చింది. ‘‘నేను మొద్దుననే కదా రూమ్ మార్చారు’’ అంది. క్లాస్‌రూమ్‌లన్నీ ఒకేలా ఉన్నప్పుడు స్టూడెంట్స్ మాత్రం ఎలా ఎక్కువతక్కువలౌతారు! విభజన రేఖల్ని గీయకుండా పిల్లల్ని సమాన స్థాయికి తేలేరా? ఈ విద్యా పండితులు? పిల్లల మనోభావాలు వీళ్లకు అక్కర్లేదా?
నా క్లాస్‌మేట్‌కు అయినట్లే నాకూ అయ్యిందొకసారి. అయితే వేరే విషయంలో. టీచర్ పాఠం చెబుతుంటే ఆవిడనే చూస్తూ వింటున్నానట, కళ్లు ఎటూ తిప్పకుండా!

‘‘ఏంటా చూపు? మిడిగుడ్లు వేసుకుని’’ అని చికాకు పడ్డారావిడ. నా మనసు చివుక్కుమంది. తనని అలా దీక్షగా చూస్తున్నానన్న స్పృహే నాకు లేదు. అదే ఆఖరు, మళ్లెప్పుడూ కళ్లెత్తి నేనావిడ పాఠం విన్లేదు. స్కూల్ ఫైనల్ వరకు తనకసలు నా కళ్లే చూపించలేదు. పిల్లలైనంత మాత్రాన ఎంత మాటైనా పడాలా? పిల్లలైనంత మాత్రాన తమ సెల్ఫ్ రెస్పెక్ట్.. కాలుకి కాలుగా, చెయ్యికి చెయ్యిగా ఊడిపడుతుంటే మౌనంగా ఓర్చుకోవాలా? పిల్లలు పిల్లలతో ఎలా ఉన్నా పర్వాలేదు. పెద్దలు మాత్రం పిల్లలకు ఇవ్వవలసిన కనీస గౌరవాన్ని ఇచ్చి తీరాల్సిందే. గౌరవం ఇవ్వడం అంటే.. పిల్లల ఫీలింగ్స్‌ని తొక్కుకుంటూ వెళ్లిపోకుండా, జాగ్రత్తగా తప్పుకుని దారివ్వడం.


* * *

కాస్త స్వేచ్ఛనిచ్చి, మీ ఇష్టం అని చూడండి.. ఎంతమంది పిల్లలు, పెద్దపిల్లలు స్కూళ్ల నుంచి, కాలేజీల నుంచి, పరాయి ఊళ్లలోని హాస్టళ్ల నుంచి పారిపోయి ఇంటికొచ్చేస్తారో! రోమ్ యూనివర్శిటీ మెడికల్ స్కూల్ నుంచి నేనూ ఒకసారి అలా పారిపోయి కొంతదూరం వచ్చిన స్టూడెంట్‌నే.

చదువుల హింస, చదువుల ఉప హింస జీవితంపై విరక్తిని కలిగిస్తాయి. నన్నెంత హింస పెట్టారంటే - ఆడపిల్లేమిటి? ల్యాబ్‌లో శవాలు కోసే దగ్గర జుట్టు విరబోసుకున్న దెయ్యంలా కూర్చోవడం ఏమిటి అన్నారు. అబ్బాయిలు నా పక్క నుంచి వెళుతూ ‘ఫూ’ అని అరిచి ముక్కులు మూసుకునేవారు. క్లాస్‌రూమ్‌లో వెనక నుంచి చెత్త కామెంట్లు చేసేవారు. ఇటలీ మొత్తానికే తొలి మెడికల్ స్టూడెంట్ అన్న గుర్తింపు నాకు అక్కర్లేదు, కనీసం.. క్లాసు మొత్తానికీ ఉన్న ఒకే ఒక అమ్మాయిగానైనా నాపై కన్సర్న్ చూపలేక పోయారెందుకు? ఒకటీ రెండు సమస్యలైతే చిరునవ్వును పట్టుకుని వేలాడొచ్చు. చదువునే సమస్యగా మార్చారు నా క్లాస్‌మేట్స్.
తమాయించుకోలేక ఒకరోజు డిసెక్టింగ్ రూమ్ నుంచి పరుగున బయటికి వచ్చేశాను. మెడిసినొద్దు, మెడల్సొద్దు. కాలేజీ వైపైనా తిరిగి చూడకుండా ఇంటికి నడుస్తున్నాను. మధ్యలో పిన్సియో పార్క్ దగ్గర చివికిపోయిన బట్టల్లో ఒకావిడ వాళ్లనీ వీళ్లనీ చెయ్యి చాచి యాచిస్తోంది. పక్కనే ఆమె బిడ్డ. వాడి ప్రపంచంలో వాడున్నాడు. తల్లి కష్టంపై గ్రహింపు లేదు. వీధిలో ఏరుకున్న రంగు కాగితాలతో ఆడుకుంటున్నాడు. వాడి కళ్లలోని సంతోషాన్ని అంతవరకు నేను ఏ హరివిల్లులోనూ చూళ్లేదు. రంగుల కాంక్షతో ఈ లోకాన్నే తృణీకరిస్తున్నాడు వాడు. మేథ్యూ ఆర్నాల్డ్ ‘బరీడ్ లైఫ్’ గుర్తొచ్చింది నాకు.
‘...గుండె లోపల ఎక్కడో గాయమయింది
పోతున్న ప్రాణం తిరిగి కొట్టుకుంది...’
నా ప్రాణం తిరిగి కాలేజీ కోసం కొట్టుకుంది.

* * *

చదివే పిల్లలు, చదవని పిల్లలు అంటూ ఉండరు. పిల్లలెవరైనా ‘మేం చదవలేకపోతున్నాం’ అని అంటుంటే.. స్కూల్లో, ఇంట్లో.. మానసికంగా వారిని డీగ్రేడ్ చేస్తున్న భయాలేమిటో పరిశీలించాలి. పిల్లలు చదవడానికి పుట్టలేదు. చదవలేక చదవలేక ఎందుకు చావాలి?

మారియా మాంటిసోరి : విద్యావేత్త
31 ఆగస్టు 1870 - 6 మే 1952
జన్మస్థలం : అంకోలా, ఇటలీ
తల్లిదండ్రులు : అలషాండ్రో, రెనిల్డే
ప్రత్యేకతలు : మాంటిసోరి విద్యావిధాన రూపకర్త
: ఇటలీలో మొదటి మహిళా డాక్టర్
స్థాపించిన స్కూలు : చిల్డ్రన్ హౌస్ (6-1-1907)
ఫిలాసఫీ : విద్యాహింస నిష్ర్పయోజనం
లక్ష్యం : విద్యతో శాంతి సాధన
సంతానం : మాంటిసోరి సీనియర్ (కుమారుడు)
ఇండియా వచ్చింది :1939లో
మరణం : నెదర్లాండ్స్‌లో

కూర్పు, స్వగత కథనం: మాధవ్ శింగరాజు
e-mail your response : sakshinenu@gmail.com

పాములపర్తి వెంకట నరసింహారావు(P.V.Narasimha Rao) గారి గురించి కాస్త

పాములపర్తి వెంకట నరసింహారావు
పాములపర్తి వెంకట నరసింహారావు

10th భారతియప్రధానమంత్రి
పదవిలో
21 June 1991 – 16 May 1996
ఇంతకు ముందు ఉన్నవారుచంద్రశేఖర్ సింగ్
తరువాత వచ్చినవారుఅటల్ బిహారీ వాజపేయి
నియోజకవర్గంNandyalఆంధ్ర ప్రదేశ్

4th ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి
పదవిలో
1971-09-30 – 1973-01-10
ఇంతకు ముందు ఉన్నవారుకాసు బ్రహ్మానందరెడ్డి
తరువాత వచ్చినవారుజలగం వెంగళరావు

జననంజూన్ 28 1921
వంగర, ( ఆంద్ర ప్రదేశ్, అప్పటి హైదరాబాదు సంస్థానం )
మరణండిసెంబర్ 23 2004(వయసు: 83) న్యూఢిల్లీభారత
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రేసు
వృత్తిLawyerActivist,Poet
మతంహిందూమతము



























పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ వే

దేశంలోనే అతిపెద్ద ఫ్లై ఓవర్ 19.10.2009 న ప్రారంభం అయ్యింది. మెహదీపట్నం నుంచి ఆరాంఘర్ వరకు నిర్మించారు.శంషాబాద్ విమానాశ్రయం ప్రయాణికులను దృష్టిలో ఉంచుకొని దీనిని నిర్మించారు.

పీవీ విజయాలు

  • పీవీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో భారత రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవథలలో ఎన్నో గొప్ప మలుపులు, పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎన్నో ఆరోపణలు ప్రభుత్వాన్నీ, పీవీని చుట్టుముట్టాయి. దివాలా తీసే స్థాయికి చేరుకున్న ఆర్థికవ్యవస్థకు పునరుజ్జీవం కల్పించేందుకు, సంస్కరణలకు బీజం వేసాడు. తన ఆర్థికమంత్రి, మన్మోహన్ సింగ్ కు స్వేచ్ఛనిచ్చి, సంస్కరణలకు ఊతమిచ్చాడు. ఆ సంస్కరణల పర్యవసానమే, ఆ తరువాతి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ సాధించిన అద్భుతమైన అభివృద్ధి. అందుకే పీవీని ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేర్కొంటారు.
  • పంజాబు తీవ్రవాదాన్ని విజయవంతంగా అణచివేసిన ఘనత పీవీ ప్రభుత్వానిదే
  • కాశ్మీరు తివ్రవాదులు ప్రముఖులను అపహరించినపుడు వారి డిమాండ్లకు లొంగకుండా ప్రముఖులను విడిపించిన ఘనత కూడా పీవీదే
  • ఇజ్రాయిల్ తో దౌత్య సంబంధాలు, తీవ్రవాదానికి పాకిస్తాను ఇస్తున్న ప్రోత్సాహాన్ని బయటపెట్టి ప్రపంచదేశాల్లో చర్చకు పెట్టడం, ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలు పెంచుకోవడం, చైనా,ఇరానులతో సంబంధాలు పెంచుకోవడం వంటివి విదేశీ సంబంధాల్లో పీవీ ప్రభుత్వం సాధించిన అనేక విజయాల్లో కొన్ని.
  • 1998 లో వాజపేయి ప్రభుత్వం జరిపిన అణుపరీక్షల కార్యక్రమాన్ని మొదలుపెట్టింది పీవీ ప్రభుత్వమే. ఆయన కాలంలోనే బాంబు తయారయింది. ఈ విషయాన్ని స్వయంగా వాజపేయే ప్రకటించాడు[4] .

పీవీపై విమర్శ

పీవీ తన జీవితంలో ఎదుర్కొన్న వివాదాలు, అవినీతి ఆరోపణలు దాదాపుగా అన్నీ ఆయన ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో జరిగిన సంఘటనల పర్యవసానాలే.
  • 1994 లో లోక్‌సభలో అవిశ్వాస తీర్మాన గండం నుండి తన మైనారిటీ ప్రభుత్వాన్ని గట్టెక్కించడానికి వక్ర మార్గాలను అనుసరించారని విమర్శలు ఉన్నాయి.
  • 1992 డిసెంబర్ 6 న అయోధ్యలో బాబరీ మసీదును కూలగొట్టిన సంఘటన ఆయన ఐదేళ్ళ పాలన లోనూ జరిగిన అత్యంత పెద్ద సంఘటన. దాన్ని కాపాడలేక పోవడం ఆయన వైఫల్యాల్లో అతిపెద్దది.
  • ఆయన కుటుంబ సభ్యుడిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి.
  • సాధువులకు, బాబాలకు ఆయన సన్నిహితంగా ఉండేవాడు. ( ఇది చాలా తప్పు అభిప్రాయం. ఆయన ప్రధాన మంత్రి పదవిలో ఉండగా ఎన్నడూ, ఎప్పుడూ, ఎవరినే దగ్గిరికి దరిచేరనివ్వలేదు. ఎందుకంటే ఆయన పదవిని, ఆయన సాన్నిహిత్యాన్ని అడ్డుపెట్టుకొని లబ్దిపొందుతారని ఆయన భయం. అయితే ఎవరిని నొప్పించే స్వభావం కానందువల్ల ఆయన పేరు వాడుకోవడం వల్ల ఆ అభిప్రాయం ఏర్పడింది)

అవినీతి ఆరోపణలు

ఐదేళ్ళ పదవీకాలంలో అనేక అవినీతి ఆరోపణలని పీవీ ఎదుర్కొన్నాడు. పదవి నుండి దిగిపోయాక కూడా వాటిపై జరిగిన విచారణలు ఆయన్ని వెన్నాడాయి. అయితే ఈ ఆరోపణలన్నీ కోర్టుల్లో వీగిపోయాయి. చివరి కేసు ఆయన మరణానికి సరిగ్గా సంవత్సరం ముందు వీగిపోయింది. ఆయన ఎదుర్కొన్న అవినీతి ఆరోపణలు:
  • జార్ఖండ్ ముక్తి మోర్చా అవినీతి కేసు: పార్లమెంటులో మెజారిటీ సాధనకై జార్ఖండ్ ముక్తి మోర్చా సభ్యులకు లంచాలు ఇచ్చాడనే ఆరోపణ ఇది. ఈ ఆరోపణలను విచారించిన ప్రత్యేక కోర్టు జడ్జి అజిత్ భరిహోక్ 2000 సెప్టెంబర్ 29 న పీవీని ఈ కోసులో దోషిగా తీర్పునిచ్చాడు. నేరస్తుడిగా కోర్టుచే నిర్ధారించబడిన మొట్టమొదటి పూర్వ ప్రధానమంత్రి, పీవీ. అయితే ఢిల్లీ హైకోర్టు ఈ కేసును కొట్టివేసింది.
  • సెయింట్ కిట్స్ ఫోర్జరీ కేసు: 1989 లో బోఫోర్స్ అవినీతిపై రాజీవ్ గాంధీ తో విభేధించి, ప్రభుత్వం నుండి, పార్టీ నుండి బయటకు వచ్చేసిన వి.పి.సింగ్ ను అప్రదిష్ట పాల్జేసేందుకు, కుమారుడు అజేయ సింగ్ ను ఇరికించేందుకు ఫోర్జరీ సంతకాలతో సెయింట్ కిట్స్ ద్వీపంలో ఒక బ్యాంకులో ఎకౌంటు తెరిచిన కేసది.
  • లఖుభాయి పాఠక్ కేసు: లఖుభాయి పాఠక్ అనే పచ్చళ్ళ వ్యాపారి ప్రభుత్వంతో ఏదో ఒప్పందాలు కుదుర్చుకొనేందుకై పీవీకి సన్నిహితుడైన చంద్రస్వామికి డబ్బిచ్చానని ఆరోపించాడు.
పై మూడు కేసుల్లోను పీవీ నిర్దోషిగా పై కోర్టులు తీర్పిచ్చాయి . ఈ మూడూ కాక స్టాక్ మార్కెట్ కుంభకోణం నిందితుడు హర్షద్ మెహతా తాను సూట్‌కేసుల్తో పీవీకి డబ్బిచ్చానని ఆరోపించాడు. అయితే అవి నిరాధారాలని తేలింది.

సాహితీ కృషి

రాజకీయాల్లో బిజీగా ఉన్నా, పీవీ తన ఇతర వ్యాసంగాలను వదిలిపెట్టలేదు. తనకు ప్రియమైన సాహిత్య కృషి, కంప్యూటరును ఉపయోగించడం వంటి పనులు చేస్తూనే ఉండేవాడు. కంప్యూటరును ఉపయోగించడంలో పీవీ ముందంజలో ఉండేవాడు. ఆయన చేసిన సాహిత్య కృషికి గుర్తింపుగా సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. ఆయన రచనల్లో ప్రఖ్యాతి చెందినది ఇన్‌సైడర్ అనే ఆయన ఆత్మకథ. లోపలిమనిషి గా ఇది తెలుగులోకి అనువాదమయింది. ఆయన రచనలు:
  • సహస్రఫణ్విశ్వనాథ సత్యనారాయణ రాసిన వేయిపడగలు కు హిందీ అనువాదం. ఈ పుస్తకానికై పీవీ కి లో కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి వచ్చింది.
  • అబల జీవితంపన్ లక్షత్ కోన్ ఘతో అనే మరాఠీ పుస్తకానికి తెలుగు అనువాదం.
  • ఇన్‌సైడర్: ఆయన ఆత్మకథ. ఇది వివిధ భాషల్లోకి అనువాదమయింది.
  • ప్రముఖ రచయిత్రి "జయ ప్రభ" కవిత్వాన్ని ఆంగ్లంలోకి అనువదించారు
ఇవేగాక మరెన్నో వ్యాసాలు కలం పేరుతో రాసాడు. కాంగ్రెసువాది పేరుతో 1989 లో మెయిన్‌స్ట్రీం పత్రికలో రాసిన ఒక వ్యాసంలో రాజీవ్ గాంధీ పాలనను విమర్శించాడు. 1995 లో ఆ విషయం ఫ్రంట్‌లైన్ పత్రిక ద్వారా వెలుగులోకి వచ్చింది.
తన ఆత్మకథ రెండో భాగం రాసే ఉద్దేశ్యం ఆయనకు ఉండేది. ఆ కార్యం నెరవేరకుండానే, 2004 డిసెంబర్ 23 న పి.వి.నరసింహారావు కన్నుమూసాడు. ఆయనకు ముగ్గురు కొడుకులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు.

పీవీ నిర్వహించిన పదవులు

కాలంపదవి
1951అఖిల భారత కాంగ్రెసు కమిటీ సభ్యత్వం
1957-77ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యత్వం
1962-64ఆంధ్ర ప్రదేశ్ న్యాయ, సమాచార శాఖ మంత్రి
1964-67ఆంధ్ర ప్రదేశ్ న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి
1967ఆంధ్ర ప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి
1968-71ఆంధ్ర ప్రదేశ్ న్యాయ, సమాచార శాఖ మంత్రి
1971-73ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి
1977లోక్‌సభ సభ్యత్వం
1980లోక్‌సభ సభ్యత్వం
జనవరి 1980-జూలై 1984కేంద్ర విదేశ వ్యవహారాల మంత్రి
జూలై 1984-డిసెంబర్ 1984కేంద్ర హోం శాఖమంత్రి
1984లోక్‌సభ సభ్యత్వం (మూడో సారి)
నవంబర్ 1984-ఫిబ్రవరి 1985భారత ప్రణాళికా శాఖ మంత్రి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
జనవరి 1985-సెప్టెంబర్ 1985కేంద్ర రక్షణ శాఖమంత్రి
సెప్టెంబర్ 1985-జూన్, 1988కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి
జూలై 1986- ఫిబ్రవరి 1988కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖమంత్రి
జూన్ 1988-డిసెంబర్ 1989విదేశ వ్యవహారాల శాఖ మంత్రి
1989లోక్‌సభ సభ్యత్వం (నాలుగోసారి)
29 మే, 1991 - 1996కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు
జూన్ 1991 – మే 10 1996ప్రధానమంత్రి
నవంబర్ 1991ఉప ఎన్నికలలో నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం నుండి ఐదవసారి లోక్‌సభకు ఎన్నికయ్యాడు.


బెంగాలీ బాంబు!

కారల్‌మార్క్స్‌ 'కమ్యూనిస్టు మేనిఫెస్టో' రాస్తే, మమతాబెనర్జీ 'యాంటీ కమ్యూనిస్టు మేనిఫెస్టో' రాశారు. మూడున్నర దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న మార్క్సిస్టు పార్టీని చిత్తుచిత్తుగా ఓడించి... తన చిరకాల స్వప్నాన్ని నిజం చేసుకున్నారు ఆ రాయల్‌బెంగాల్‌ ఆడపులి!
మ్యూనిస్టు కోట కుప్పకూలిన ఆనవాళ్లు... గుట్టలుగుట్టలుగా ఎర్రజెండాల పీలికలు... ఓటమి గాయాలతో కామ్రేడ్ల మూలుగులు... చెదపురుగుల పాలైనమార్క్సిస్టు సాహిత్యం. ఆ శిథిలాల మధ్య నుంచి మమతాబెనర్జీ నడుస్తున్నారు. ఎప్పట్లాగానే రబ్బరు చెప్పులు.
ఎప్పట్లాగానే ముతక చీర.
ఎప్పట్లాగానే చిందరవందర జుత్తు.
ఎప్పట్లాగానే భుజానికి గుడ్డ సంచి.
వెుహంలో మాత్రం...
ఎప్పుడూ కనిపించని విజయగర్వం!
సుదీర్ఘ పోరాట ఫలితమిది. ఈరోజు కోసమే ఇన్నేళ్లూ ఎదురుచూశారు. ఈ విజయం కోసమే ఎన్నాళ్లుగానో కలలుగన్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌ ప్రాంతంలో ఉన్న ఆమె నివాసం దగ్గరైతే సందడే సందడి. జయజయధ్వానాలు. కరతాళధ్వనులు. విజయహారతులు. బాణసంచా పేలుళ్లు. మీడియా కెమేరాల మెరుపులు. పాత్రికేయుల పాతరోత ప్రశ్నలు. ఎవరో కాళికతో పోలుస్తున్నారు. ఇంకెవరో ఇందిరమ్మను గుర్తుచేసుకుంటున్నారు. ఇక, ఢిల్లీ పీఠమే మిగిలిందని అంచనాలు వేస్తున్నారు. ఏవో... ఎవరు చెప్పగలరు? సంకీర్ణాల యుగంలో ఏదీ అసాధ్యం కాదు. అయినా, పదీపదిహేనేళ్ల నాడు... కమ్యూనిస్టుల ఉక్కుకవచం తుక్కుతుక్కు అవుతుందని ఎవరైనా వూహించారా? ఆ ఎరుపుజెండా మెరుపు తగ్గిపోతుందని ఏ నిపుణుడైనా విశ్లేషించాడా? కాకలుతీరిన కామ్రేడ్లు కాడి వదలాల్సిన దుస్థితి దాపురిస్తుందని ఏ పెద్దమనిషైనా అంజనమేసి చెప్పాడా?
అటువైపు... యోధానయోధులు. సుశిక్షిత కార్యకర్తలు. వ్యూహప్రతివ్యూహాల్లో ఆరితేరిన సలహాబృందాలు. గగుర్పాటు కలిగించే విప్లవాల చరిత్ర. చేతినిండా అధికారం. గల్లాపెట్టె నిండా నిధులు.
ఇటువైపు... మామూలు మహిళ. ఆస్తిపాస్తుల్లేవు. రాజకీయ వారసత్వం లేదు. చెప్పుకోదగ్గ అనుచరగణమూ లేదు. కొంత రాజకీయానుభవం, కొండంత ఆవేశం... అవే ఆమె అర్హతలు.
ఆ ఒంటరి నారి... వింటినారి సవరిస్తుంటే అంతా వినోదంలా చూశారు. ఆ పడతి పైటబిగిస్తుంటే... ఫక్కుమని నవ్వారు. ఆ గాండ్రింపులకు భయపడిందెవరు? ఆ ప్రతిజ్ఞలను పట్టించుకుందెవరు? నవ్వినచోటే, ఓట్లచేను పండింది. మూడు దశాబ్దాలుగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికవుతూ వస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద కమ్యూనిస్టు ప్రభుత్వం... కుప్పకూలిపోయింది. మమత విజేతగా నిలిచారు.
సంకెళ్లు తెంచుకుని...
వందేళ్లు నిండిన కాంగ్రెస్‌. వందకు దగ్గర్లో ఉన్న వృద్ధనేతలు. పేరుకు రాజకీయ పార్టీయే కాని, నరనరానా పెత్తందారీ పోకడలే. స్వతంత్ర భావాల్ని స్వాగతించలేని ఛాందసవాదుల సమూహం. సొంత గొంతుకల్ని నొక్కిపడేసే ఖద్దరు పెద్దల గుంపు. సీతారాం కేసరి ముక్కుతూ మూలుగుతూ కాంగ్రెస్‌ అధ్యక్షపదవిలో నెట్టుకొస్తున్నరోజులవి. చేవలేకపోయినా, చేతకాకపోయినా... ఒక్కసారి, ఒక్కసారైనా ప్రధాని పీఠం మీద కూర్చోవాలని ఉవ్విళ్లూరుతున్నారా వృద్ధనేత. సరిగ్గా అదే సమయానికి కలకత్తా నగరంలో కాంగ్రెస్‌ ప్లీనరీ జరుగుతోంది. మమతకు మాత్రం పిలుపులేదు. పిలవని పేరంటాలకెళ్లడం ఆమెకెప్పుడూ అలవాటు లేదు. కానీ, పిలవాలన్న ఆలోచన లేని పెద్దమనుషులకు బుద్ధిచెప్పడం ఎలాగో బాగా తెలుసు. ప్లీనరీ వేదికకు కూతవేటుదూరంలోనే బ్రహ్మాండమైన ర్యాలీ నిర్వహించారు. 'ఏమిటీ? కేసరి నన్ను పార్టీలోంచి బహిష్కరిస్తారా? బహిష్కరించనివ్వండి? నేనూ ఆయన్ని బహిష్కరిస్తాను'... అంటూ ఏకంగా అధ్యక్షుడికే సవాలు విసరాలంటే ఎంత దమ్ముండాలి? ఆ తిరుగుబాటు స్వరం ప్రజలకు నచ్చింది. కరతాళ ధ్వనులతో మద్దతు పలికారు.
కాంగ్రెస్‌ పార్టీని వీడాలన్న ఆలోచన మమతకు ఏ కోశానా లేదు. పరిస్థితులే అందుకు ప్రేరేపించాయి. వారసత్వం లేకపోయినా, ఆస్తిపాస్తులు లేకపోయినా... స్వశక్తితో వ్యక్తిత్వసంపదతో నాయకురాలిగా ఎదిగారామె. మమతాబెనర్జీ కలకత్తాలోని మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు. పదిహేనేళ్ల వయసులో తండ్రి మరణించారు. మంచానపడిన మనిషికి వైద్యం చేయించలేనంత పేదరికం. వెుత్తం ఆరుగురు సోదరులు. పెద్దతమ్ముడి టీకొట్టే కుటుంబానికి ఆధారం. ఆ నాలుగురాళ్లతో గుట్టుగా నెట్టుకురావాల్సిన బాధ్యత మాత్రం మమతదే! పదింటికంతా ఇంటి పనులన్నీ ముగించుకుని కాలేజీకి వెళ్లేవారు. సాయంత్రం ఇంటికి రాగానే ట్యూషన్లు చెప్పేవారు. రాజకీయాల మీద ఆసక్తితో కాంగ్రెస్‌ అనుబంధ విద్యార్థి విభాగంలో చేరారు. ఓసారి ఏదో బహిరంగ సభలో మాట్లాడుతుంటే, అటుగా వెళ్తున్న ముఖ్యమంత్రి సిద్ధార్థ శంకర్‌రే చూశారు. కారు ఆపి మరీ, శ్రద్ధగా ప్రసంగం విన్నారు. ఆ ఉపన్యాసపటిమే విద్యార్థి నేతను ప్రజానాయకురాలిగా తీర్చిదిద్దింది. కొద్దికాలంలోనే, రాష్ట్ర కాంగ్రెస్‌ మహిళా విభాగంలో చురుకైన నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. జాదవ్‌పూర్‌ పార్లమెంటరీ స్థానం నుంచి పోటీచేసే అవకాశమూ వచ్చింది. ప్రత్యర్థి ఎవరో కాదు... కమ్యూనిస్టు దిగ్గజం సోమనాథ్‌ చటర్జీ. ముపైశ్ఫ ఏళ్లు కూడా నిండని ఆ యువతి ఆత్మవిశ్వాసం ఓటర్లను అబ్బురపరిచింది. ఇందిరాగాంధీ హత్యతో పెల్లుబికిన సానుభూతి కూడా తోడైంది. మమతాబెనర్జీ నలభై ఎనిమిదివేల మెజారిటీతో గెలిచారు. అదో సంచలనం! ఫలితాలు ప్రకటించగానే మమత నేరుగా సోమనాథ్‌ ఇంటికెళ్లి ఆశీర్వాదాలు అందుకున్నారు. 'ప్రజల తీర్పునే కాదు... ప్రత్యర్థి పెద్దరికాన్ని కూడా గౌరవించాలి' అన్న ఆలోచన ఆమె వ్యక్తిత్వానికి మచ్చుతునక. ఐదేళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో, కాంగ్రెస్‌పార్టీ బెంగాల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఆ ఎదురుగాలి మమతనూ ఓడించింది. మళ్లీ 1991లో దక్షిణ కలకత్తా నియోజకవర్గం నుంచి గెలిచారు. పీవీ నరసింహారావు ప్రభుత్వంలో యువజన శాఖ చేపట్టారు. అంతకంటే పైకెదగనివ్వలేని పరిస్థితులే ఆమెను నిరాశకు గురిచేశాయి. పార్టీలోని వెన్నుపోటు రాజకీయాలు మరింత ఇబ్బందిపెట్టాయి. దానికితోడు, బెంగాల్‌ కాంగ్రెస్‌ పెద్దలు ఎన్నికల్లో తమ పీఠాలు కాపాడుకోడానికి కమ్యూనిస్టుల అడుగులకు మడుగులొత్తుతుంటే కడుపుమండిపోయేది. ఏదో ఒకరోజు కమ్యూనిస్టుల్ని గద్దె దించాలన్న కోరిక మనసులో బలపడిపోయింది. అదేం అకారణ ద్వేషం కాదు. మార్క్సిస్టుల పాలనలో అవినీతి పెచ్చుపెరిగింది. అధికార దుర్వినియోగం సర్వసాధారణమైంది. ఆ అవినీతిని నిలదీయాలి. ఆ దుర్వినియోగానికి అడ్డుకట్టవేయాలి. కాంగ్రెస్‌లో ఉంటే అది అసాధ్యమని అర్థమైపోయింది. అందుకే, బయటికొచ్చి కొత్తపార్టీని స్థాపించారు. ఇదీ కాంగ్రెసే. కానీ, పెత్తందార్ల కాంగ్రెస్‌ కాదు. వృద్ధ జంబూకాల కాంగ్రెస్‌ కాదు. తృణమూల్‌ కాంగ్రెస్‌... అంటే, అట్టడుగు కార్యకర్తల కాంగ్రెస్‌! మమత భారతీయ జనతాపార్టీతో జతకట్టినా, అది ఎక్కువకాలం నిలబడలేదు. ఆ స్నేహం కారణంగా, బెంగాల్‌లోని మైనారిటీలు తనకు దూరమయ్యే ప్రమాదం ఉందని అర్థమైపోయింది. మళ్లీ కాంగ్రెస్‌కే దగ్గరయ్యారు. దగ్గరకావడం అంటే సాగిలపడటం కాదు, రాజీపడటం కాదు, వ్యక్తిత్వాన్ని చంపుకోవడం కాదు. ప్రజా ప్రయోజనాల్ని పణంగా పెట్టడం కాదు. ఎన్నికల సమయంలో కొద్దిపాటి రాజకీయ సర్దుబాటు. అంతే, అంతకుమించి ఎలాంటి ప్రాధాన్యం లేదు. అవసరమనుకుంటే, ఆ బంధాన్ని తెంచుకోడానికి కూడా ఎప్పుడూ వెనుకాడరు. అంతెందుకు, తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎంత బతిమాలినా ఇవ్వాలనుకున్న సీట్లకుమించి, ఒక్కటి కూడా అదనంగా ఇవ్వలేదు. ఆ పట్టుదల తెలుసు కాబట్టి, కాంగ్రెస్‌ అధిష్ఠానమూ కిమ్మనకుండా పుచ్చుకుంది. తృణమూల్‌కు కాంగ్రెస్‌ అవసరం కంటే, కాంగ్రెస్‌కు తృణమూల్‌ అవసరమే ఎక్కువ. పందొమ్మిది మంది ఎంపీలతో ఆపార్టీ యూపీఏ-2లో ప్రధాన భాగస్వామి. బెంగాల్‌లో కాంగ్రెస్‌ పరిస్థితీ ఏమంత గొప్పగా లేదు. మహా అయితే, తృణమూల్‌కు ఓ తోకపార్టీ! అసెంబ్లీ ఫలితాలే, 2014 లోక్‌సభ ఎన్నికల్లోనూ పునరావృతం అయితే, మమత కేంద్రంలో మరింత శక్తిమంతురాలు అవుతారు.




 
ఉద్యమాల జీవితం
మమతాబెనర్జీకి కుట్రలు తెలియవు. కుతంత్రాలు తెలియవు. ఓట్లకోసం కోట్లకుకోట్లు కుమ్మరించగల స్థోమతా లేదు. ఇన్నేళ్ల ప్రజాజీవితంలో, రాజకీయాల్లో నిలదొక్కుకోడానికి అవసరమైన అవలక్షణాలేవీ ఒంటబట్టించుకోలేదామె. అయినా, ఎలా నిలవగలిగారు? ఎలా గెలవగలిగారు?ప్రజాప్రతినిధులంతా తెలుసుకోవాల్సిన రాజకీయ సత్యమిది. సామాన్యుల తరపున నిలబడే ధైర్యం ఉంటే, సమస్యల మీద పోరాడే తెగువ ఉంటే, ఎన్ని వైఫల్యాలొచ్చినా తట్టుకోగల గుండె దిటవు ఉంటే... ఏదో ఒకరోజు గెలుపు పిలుపు వినిపిస్తుంది! మమతా బెనర్జీ విషయంలోనూ అక్షరాలా అదే జరిగింది. ఆమె చేసిన పోరాటాలకూ ఉద్యమాలకూ లెక్కేలేదు. దాడుల్ని తట్టుకున్నారు. లాఠీదెబ్బల్ని భరించారు. హత్యాయత్నాలూ జరిగాయి. ప్రత్యర్థుల విమర్శలు, పార్టీలో కుమ్ములాటలు... ఆమె స్త్థెర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశాయి. అయినా వెనుకడుగు లేదు. గెలిచినా గెలవకపోయినా, ఎన్నికలున్నా లేకపోయినా... ప్రజల మధ్యే ఉన్నారు. ప్రజల్నే నమ్ముకున్నారు. ప్రజలను నమ్మినవారు ఎన్నటికీ చెడిపోరు!
అతికొద్దిమంది నేతల్లో కనిపించే అరుదైన లక్షణం... నిజాయతీ. పెద్దగా ఆధారాల్లేని ఒకట్రెండు విమర్శలు తప్పిస్తే...మమతాబెనర్జీ ప్రజా జీవితంలో ఎలాంటి అవినీతి మరకలూ లేవు. లంచాలూ వాటాలూ సిఫార్సులూ ఆమె గడప తొక్కడానికి కూడా భయపడతాయని చెబుతారు బాగా ఎరిగినవారు. కొత్తగా కేంద్రమంత్రి అయిన రోజుల్లో... ఓ రియల్‌ఎస్టేట్‌ గొడవలో మాటసాయం చేయమంటూ సొంత తమ్ముళ్లే ఎవర్నో తీసుకెళ్లారు. ఆమెకు పైరవీలంటే గిట్టదు. ఆచెంపా ఈచెంపా వాయించాలన్నంత కోపం వచ్చింది. అయినా తమాయించుకున్నారు. గబగబా నాలుగు చీరలు సూట్‌కేసులో సర్దేసుకుని మౌనంగా ఇంట్లోంచి వచ్చేశారు. నేరుగా పార్టీ కార్యాలయానికి వెళ్లిపోయి అక్కడే మకాం పెట్టారు. అదే ఆమె సమాధానం. పేరుకు రైల్వేమంత్రి అయినా, విలాసాల బోగీల్లో ఎప్పుడూ ప్రయాణించింది లేదు. బహుమతులకూ నజరానాలకూ ఆమె ఆమడదూరం, అవి చిన్నవైనా సరే. ఆ మధ్య ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు, ఓ ముస్లిం అభిమాని ప్రేమతో శాలువా ఇవ్వబోయాడు. వెుదట తిరస్కరించారు. కానీ ఆ అభిమాని ఎక్కడ చిన్నబుచ్చుకుంటాడో అని, 'నేను బహుమతులు ఇష్టపడను. ప్రేమతో ఇస్తున్నావు కాబట్టి, అంతే ప్రేమతో అందుకుంటున్నా' అంటూ చిరునవ్వుతో స్వీకరించారు. ఆ అభిమాని కళ్లలో ఆనందబాష్పాలు!
మమతకు చాలా విషయాల మీద స్పష్టమైన అభిప్రాయాలున్నాయి. వాటికి వ్యతిరేకంగా ఎవరైనా నిర్ణయాలు తీసుకుంటే, వెుహమాటం లేకుండా విమర్శిస్తారు. కడిగిపారేస్తారు. ఎదుటి వ్యక్తి... రాష్ట్రంలోని కమ్యూనిస్టు నేత కావచ్చు. కేంద్రంలోని కాంగ్రెస్‌ అధినేత్రీ కావచ్చు. అమాయక ప్రజల భూముల్ని లాక్కుని టాటాలకు అప్పగించారన్న కారణంతో 'నానో'ను వ్యతిరేకించిన మమత... సాక్షాత్తూ తన నేతృత్వంలోని రైల్వే మంత్రిత్వశాఖలో విస్తరణ కార్యక్రమాల కోసం సామాన్యుల ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవాలని ప్రతిపాదించినప్పుడూ అంతే కచ్చితంగా కాదన్నారు. 'అభివృద్ధికి నేను వ్యతిరేకం కాదు. పారిశ్రామికీకరణనూ కాదనను. ఆ పేరుతో పేదల ఉసురు తీస్తే మాత్రం సహించేది లేదు' అని తేల్చిచెప్పారు. చుక్కల్ని తాకే నిత్యావసరాల ధరల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయడంలో ఆమె ప్రతిపక్షాల కంటే ముందున్నారు. 'ధరలకు పగ్గాలు వేయడానికి ఓ స్వతంత్ర పర్యవేక్షణ వ్యవస్థ ఉండాలని నేనెప్పుడో చెప్పాను. అయినా మీరు పట్టించుకోలేదు' అని సర్కారు మీద విరుచుకుపడ్డారు. 'మమత నిరంకుశ నాయకురాలు. నలుగుర్నీ కలుపుకువెళ్లడం అస్సలు తెలియదు' అన్న విమర్శకు నందిగ్రామ్‌, సింగూర్‌ పోరాటాల ఘనవిజయమే సమాధానం. ఆమె వివిధ ప్రజాసంఘాలతో కలిసి పనిచేశారు. చిన్నాపెద్దా నాయకులతో వేదిక పంచుకున్నారు. వేలమందిని ఒక తాటిమీద నడిపించారు. ఆ ఉద్యమాలు మార్క్సిస్టు పాలకులకు చెమటలు పట్టించాయి.
ఓరోజు మమతాబెనర్జీ ఏదో కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్నారు. దార్లో ట్రాఫిక్‌జామ్‌! ఏమిటా అని అద్దాల్లోంచి తొంగిచూస్తే... రోడ్డు ప్రమాదం. ఓ యువకుడు కొన వూపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. మమత పరుగుపరుగున అక్కడికెళ్లారు. క్షతగాత్రుడిని తన కార్లో ఎక్కించుకుని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె మాట పెళుసే కానీ, మనసు వెన్న. ఎదుటి మనిషి కష్టాల్ని చూసి తట్టుకోలేరు. కన్నీళ్లు పొంగుకొచ్చేస్తాయి. అంత సున్నిత మనస్తత్వాన్ని ఏ కళాకారుల్లోనో చూస్తాం. నిజానికి, మమతలో ఓ మంచి కళాకారిణి ఉన్నారు. ఆమెకు చదవడం ఇష్టం. రాయడం ఇష్టం. బొమ్మలు గీసుకోవడం ఇష్టం. హావభావాల్ని పలికిస్తూ రవీంద్రుడి గీతాంజలి చదువుకోవడం మరీమరీ ఇష్టం. 'వేర్‌ ద మైండ్‌ ఈజ్‌ విథవుట్‌ ఫియర్‌...' ...ఠాగూర్‌ కవితాపంక్తిని తరచూ ఉటంకిస్తుంటారు. 'బద్లా నోయి, బద్లా ఛాయి' (మాకు మార్పు కావాలి, ప్రతీకారం కాదు), మా... మాటి... మనుష్‌ (తల్లి, నేల, ప్రజలు) తదితర నినాదాల్లో ఆమె సాహితీ స్పృహ తొంగిచూస్తుంది.
మంకుపట్టు మహారాణి
మమత అనుకుందంటే, ఆ పని జరిగిపోవాల్సిందే. నిబంధనలూ గిబంధనలూ జాన్తానై. చూస్తాం, ఆలోచిస్తాం అంటే కుదర్దు. మాటకు లొంగకపోతే... హెచ్చరిస్తారు, బెదిరిస్తారు, కయ్యానికి కాలుదువ్వుతారు. ఆమెను బుజ్జగించడానికి నానాకష్టాలూ పడినవారిలో సాక్షాత్తు ప్రధానమంత్రి కూడా ఉన్నారు. ఎదుటివ్యక్తి ఎంత శక్తిమంతుడైనా కావచ్చు. ఎంత పేరున్న నేత అయినా కావచ్చు. ఆ ధాటికి తలవంచాల్సిందే. పెట్రోలు ధరల పెంపు విషయంలో అమర్‌సింగ్‌ను నలుగుర్లో నిలదీశారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును వ్యతిరేకించినందుకు దరోగా ప్రసాద్‌ సరోజ్‌కూ అలాంటి అనుభవమే ఎదురైంది. ఆర్థికమంత్రి ప్రణబ్‌ముఖర్జీ తనకు తెలియకుండా బెంగాల్‌లో జరిగిన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు రచ్చరచ్చ చేశారు.
పేరుకు మన్మోహన్‌సింగ్‌ మంత్రివర్గ సహచరురాలే అయినా, తనను తాను సర్వస్వతంత్రురాలిగానే భావించుకుంటారు మమత. తన మద్దతుతో నడిచే ప్రభుత్వంలో తన నిర్ణయానికి తిరుగేం ఉంటుందన్న ధైర్యమూ కావచ్చు. కేబినెట్‌ అనుమతులేవీ లేకుండానే బెంగాల్‌ మీద వరాల వర్షం కురిపించుకున్నారు. షాలిమార్‌ దగ్గర ఆటోహబ్‌, గూడ్స్‌యార్డు మంజూరు చేస్తున్నట్టు బహిరంగంగా ప్రకటించారు. సింగూర్‌లో కోచ్‌తయారీ పరిశ్రమ పెట్టాలన్నది ఆమె ఆలోచన. పాపం, ప్రధానమంత్రి! అవునన్నా తిప్పలే. కాదన్నా తిప్పలే. ఆ మంకుపట్టు వల్ల ఆమె కొన్ని శత్రుత్వాల్ని కొనితెచ్చుకుని ఉండవచ్చు. చిన్నాచితకా ఇబ్బందులూ ఎదురై ఉండవచ్చు. కానీ ఆ మంకుపట్టే లేకపోతే, శత్రుదుర్భేద్యమైన కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఎదిరించే ధైర్యం చేసేవారు కాదు. ఆ మంకుపట్టే లేకపోతే అన్నన్ని వైఫల్యాల్నీ అవమానాల్నీ తట్టుకుని నిలబడేవారే కాదు. ఆ మంకుపట్టే లేకపోతే ఎవరెన్ని అనుకున్నా పట్టించుకోకుండా, పెద్దపెద్ద రైల్వే ప్రాజెక్టుల్ని రాష్ట్రానికి తరలించుకు వెళ్లేవారే కాదు. బెంగాలీల హృదయాల్లో స్థానం సంపాదించేవారే కాదు.
సృష్టికర్త ప్రతిజీవి ఆత్మరక్షణ కోసం ఓ ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేశాడు. కొన్ని వెుక్కలకు ముళ్లిచ్చాడు. కొన్ని వెుక్కలకు ముడుచుకుపోయే గుణం ఇచ్చాడు. కొన్నింటికి దురదపుట్టించే లక్షణం ఇచ్చాడు. వూసరవెల్లిలాంటి జీవులకు రంగుమార్చుకునే వెసులుబాటూ కల్పించాడు. మనుషుల విషయానికి వచ్చేసరికి పరిస్థితులకూ అనుభవాలకూ అనుగుణంగా తమనుతాము మలుచుకునే గుణం ఇచ్చాడు. మమతాబెనర్జీ బాల్యంలో చాలా సౌమ్యురాలు. నలుగురి మధ్యకు వెళ్లాలంటేనే ముడుచుకుపోయేవారు. ఎదిగేకొద్దీ జీవితానుభవాలు పెరిగేకొద్దీ... ఆమె ఆలోచనలూ స్వభావం మారుతూ వచ్చాయి. పెద్ద కూతురిగా తండ్రి మరణం తర్వాత ఇంటి బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది. పురుషాధిక్య సమాజంలో ధైర్యంగా నిలబడటానికి అవసరమైన లక్షణాల్ని కూడా అప్పుడే ఒంటబట్టించుకుని ఉంటారు. ఎదుటి వ్యక్తులు మితిమీరిన చొరవ ప్రదర్శించకుండా, తనకున్న పరిమితుల్ని అలుసుగా తీసుకోకుండా... గాంభీర్యాన్నీ గయ్యాళితనాన్నీ రక్షణ కవచంలా ఉపయోగించుకుని ఉండవచ్చు. నిజానికి, మమత రాజకీయ జీవితం ఏమంత సాఫీగా సాగలేదు. సొంతపార్టీ పెట్టుకోగానే ఘనవిజయాలు వరించలేదు. ఒంటరి సభ్యురాలిగా పార్లమెంటులో చాలా అవమానాలే ఎదుర్కొన్నారు. ఆ నిస్పృహ ఆమె మాటల్లో చేతల్లో వ్యక్తంకావడం అసహజమేం కాదు. ఒకటి మాత్రం నిజం. ఆ కోపతాపాల్నీ పంతాల్నీ పట్టింపుల్నీ మమత ఎప్పుడూ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకోలేదు. ప్రజా సమస్యల పరిష్కారానికే అలకపాన్పులెక్కారు.

 
బెంగాల్‌ మీదే బెంగ!
ఏ శాఖ నిర్వహించినా, ఏ హోదాలో ఉన్నా... మమత మనసెప్పుడూ బెంగాల్‌ మీదే! మనసొక్కటేనా, మనిషీ బెంగాల్‌లో ఉండటానికే ఇష్టపడతారు. పేరుకు కేంద్రమంత్రే అయినా, ఢిల్లీలో గడిపేది తక్కువే. తను ఏ శాఖ చూస్తే, ఆ శాఖ పద్దుల్లో సొంతరాష్ట్రానికే సింహభాగం. రామ్‌విలాస్‌పాశ్వాన్‌ రైల్వేమంత్రిగా ఉన్నరోజుల్లో... బెంగాల్‌కు తగినన్ని నిధులు కేటాయించలేదని తన ఒంటిమీదున్న శాలువాను ఆయన వెుహం మీదికి విసిరేసి, సభ నుంచి వాకౌట్‌ చేశారు. లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తన రాష్ట్రానికి ఏదో ప్రాజెక్టు మంజూరు చేయలేదని పరిశ్రమల మంత్రి క్యాబిన్‌ ముందు ధర్నా చేయడానికీ వెనుకాడలేదు. ఎలాగైనా సరే, మార్క్సిస్టులను మట్టికరిపించాలన్న కోరికే కాదు, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రానికి ఎంతోకొంత మంచి చేయాలన్న తపనా ఉంది ఆమెలో. ఆ చిత్తశుద్ధిని బెంగాలీలు కాస్త ఆలస్యంగా అయినా గుర్తించారు. 2008 పంచాయతీ ఎన్నికల్లో తూర్పు మిడ్నాపూర్‌, 24 పరగణా ప్రాంతంలో మంచి ఫలితాలు అందించారు. 2009 పార్లమెంటు ఎన్నికల్లో 19 లోక్‌సభ స్థానాల్లో గెలిపించారు. మూడున్నర దశాబ్దాలుగా పట్టంకడుతున్న మార్క్సిస్టులను కాదని, అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌కు తిరుగులేని మెజారిటీని అందించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం అంత సులభం కాదు. ప్రస్తుతం బెంగాల్‌ పరిస్థితి కూడా ఏమంత గొప్పగాలేదు. శాంతిభద్రతల్ని పునరుద్ధరించాలి. పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్లాలి. ఆర్థికంగా మెరుగుపరచాలి. నిజానికి కమ్యూనిస్టులను ఓడించడం కంటే, ఇదే పెద్ద సవాలు. ఆ విషయం ఆమెకూ తెలుసు. మమత మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు.