Showing posts with label GROUP 1. Show all posts

గ్రూప్ I గురిపెడితే మీరే విన్...
కోచింగ్ వెళ్ళడమా...? సొంతంగా ప్రిపేర్ కావడమా...?
గమనించుము:సమయము లేకపోవడం వలన తెలుగులో వ్రాయలేకపోయాను.మన్నించగలరు.
This question often comes for those starting now or for those who got no time at hand and in need of some instant fix.what you get through coaching?
- Material of the coaching centre
- Attending classes and interact with other students & faculty
- Need to spend around 6 hrs daily attending classes
- possibility of practising mock tests if they conduct any such
- Finally all this costs around 5000 ( only coaching fee depending on institute) without including hostel/living ,travel and food expenses.
- Most institutes takes 1 to 3 months to teach syllabus depending on fast track or regular batches.So in total it costs atleast 10000 to 15000.
REMEMBER COACHING IS NOT DICTATING NOTES, IT SHOULD BE A GUIDANCE TO YOUR LEARNING PROCESSWhat you get by self preparation?
- You read the syllabus,collect the books and prepare your material
- Better concentration on exam as you dont get diverted by pep talk of your collegues
- It doesn’t cost you more than 3000 with all material included and no travel and living expenses as you prepare from your home/office.
- You can practise the mock tests by going through previous papers, fortnighly magazines,newspapers once your preparation is finished.
- So if you want control on the material preparation (yes you can do it in 3 to 4 months and you learn along the way as well!)and your costs better prepare self.If you don’t have time or you you lack the will to prepare on your own and can afford the costs go for coaching.Most people realise that they don’t need coaching and curse themselves after they took coaching!!.
- I prefer to prepare self than go for coaching and most importantly the current affairs aspects need to be handled by you and not the institute. Crash courses are disastrous on your psyche as they dump lot of information in short period, but regular coaching can enforce some discipline and regularize your studies.
ఎడిటోరియల్స్ ఎందుకు చదవాలి?
ఎందుకంటే రోజూ వచ్హే వార్తల లో ఒక అంశం యొక్క చరిత్ర కానీ దాని యొక్క మంచి లేదా చెడుల గురించి అవగాహన కలిపించరు.కానీ ఎడిటోరియల్స్ లో ఒక అంశం గురించి పూర్తి అవగాహన కల్పిస్తారు.ఎడిటోరియల్స్ చదవటం వల్ల మనకు మేన్స్+ఎస్సే+ఇంటర్వ్యూ లో కూడా ఉపయోగపడుతుంది.
చాలా వరకు ఆర్టికల్స్ గవర్నమెంట్ ను దూశించడం చేస్తుంటాఇ.అటువంటివాటిని చదవకుండా ఉండటమే మంచిది.ఎందుకంటే మీ జవాబులు ఎప్పుడూ పాజిటివ్ గా ఉండాలి.ఉదాహరనకి "అటువంటి మార్పులు తెస్తే బాగుంటుంది"....
ఇటువంటి వాటి మీద దృష్టి సాధిస్తే బాగుంటుంది

|
|
|
|
|
|
|
|
| |
సమీకరణే సగం విజయం గురూ....
సమీకరణే సగం విజయం
కొడాలి భవానీ శంకర్
యుద్ధంలో గెలవాలంటే సర్వశక్తులూ ఒడ్డి పోరాడాలి. దానికంటే ముందు సరైన ఆయుధాల ఎంపిక తప్పనిసరి కదా! గ్రూప్స్ పరీక్షల పోటీలో ప్రామాణిక మెటీరియల్‌నుసమీకరించుకోవటమూ అలాంటిదే! లక్ష్యానికి అనుగుణంగా విషయసేకరణ ఉండాలి. ఆ పునాదిపైనే అభ్యర్థి అవగాహనా, విశ్లేషణలు ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. అప్పుడే అభ్యర్థుల కృషి ఫలిస్తుంది!
గ్రూప్-1, 2 పరీక్షల కొత్త సిలబస్‌కు తగిన మెటీరియల్ లభ్యం కాక అభ్యర్థులు తికమక పడుతున్నారు. మెటీరియల్‌ను సమర్థంగా సమీకరించుకోగలిగితే సగం విజయం సాధించినట్లే! కాబట్టి ఈ అంశంపై అభ్యర్థులు శ్రద్ధ చూపాల్సి ఉంది. త్రికోణాలు
అన్ని సబ్జెక్టుల్లోనూ మెటీరియల్‌ను మూడు కోణాల్లో సేకరించుకోవాలి.
1. ప్రాథమిక సమాచారం
పోటీ పరీక్షల్లో దాదాపు 50 శాతం బిట్ల వరకూ ప్రాథమిక (బేసిక్) సమాచారంపైనే ఆధారపడివుంటాయి. అందుకే ప్రతి పేపర్‌లోని ప్రతి సబ్జెక్టుపైనా ప్రాథమిక సమాచారం సేకరించుకోవాలి. సొంత నోట్సు వీలైనంతవరకూ రాసుకోవాలి. సమయం లేదనుకుంటే ప్రాథమిక సమాచారం కోసం ఏదో ఒక ప్రామాణిక పుస్తకాన్ని ఎంచుకోవాలి.

సేకరించే ప్రాథమిక సమాచారంపైనే అభ్యర్థి అవగాహనస్థాయి, విశ్లేషణ శక్తులు ఏర్పడతాయి. దాన్నిబట్టే ఉన్నతస్థాయి, వర్తమాన విషయాల్లో సంబంధమున్న ఆయా సబ్జెక్టులను అర్థం చేసుకోగలుగుతారు.
2. ఉన్నతస్థాయి విషయాలు
సబ్జెక్టుపై ప్రాథమికంగా మెటీరియల్ సేకరించాక అదే సబ్జెక్టుపై ఉన్నతస్థాయి (అడ్వాన్స్‌డ్) విషయాలపై దృష్టి నిలపాలి. ఇందుకోసం పీజీ పుస్తకాలనూ, ప్రామాణిక పుస్తకాలనూ ఆశ్రయించాలి. ఉన్నతస్థాయి అంశాలపై 30 శాతం వరకూ ప్రశ్నలు వస్తుంటాయి. అందుకని అన్ని సబ్జెక్టుల్లోనూ ఈ అంశాలు చదవక్కర్లేదు. పరీక్ష అవసరాలను బట్టి సమయం కేటాయించుకోవాలి.

3. ‘వర్తమాన’ సంధానం
ఒక విషయానికి సంబంధించి ఉన్నతస్థాయి మెటీరియల్ కూడా రూపొందించుకున్నాక ఆయా అంశాలతో సంబంధమున్న వర్తమాన అంశాలు (కరంట్ అఫైర్స్) ఏమున్నాయో గమనించి, నోట్సు తయారుచేసుకోవాలి. ఈ విధంగా చేస్తే కరంట్ అఫైర్స్‌తో పాటు సబ్జెక్టు మెటీరియల్‌ను కూడా సమర్థంగా రూపొందించుకున్నట్లు అవుతుంది.

ఇలా చేస్తే మేలు
* జీకే ప్రిపరేషన్
ఇటీవల ఏపీపీఎస్‌సీ పరీక్షల్లో జనరల్ నాలెడ్జ్‌కి చాలా ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. అందువల్ల గ్రూప్స్ అభ్యర్థులు ఇయర్‌బుక్స్‌ను అధ్యయనం చేయటం అవసరం.

* ఏపీ ఎకానమీ
అభ్యర్థులు ఈ సబ్జెక్టు మెటీరియల్ కోసం బాగా ఇబ్బందులు పడుతున్నారు. ఏపీ ఎకానమీ నోట్సు తయారీకి 1) ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి-ఆర్థిక సంస్కరణల సవాళ్ళు (ప్రజాశక్తి ప్రచురణ) 2) ‘ఈనాడు’, ‘హిందూ’ పత్రికల కథనాలు ఉపయోగపడతాయి.

* కరంట్ అఫైర్స్
పరీక్ష తేదీకి 6 నెలల ముందటి సంఘటనలపై ప్రశ్నలు వస్తుంటాయి కాబట్టి ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాల విభజన చేసుకోవాలి. ప్రతి అంశంలోనూ సాంఘిక, రాజకీయ, సాంకేతిక, క్రీడారంగాలు; అవార్డులు; నూతన అన్వేషణలు అనే కోణాల్లో ఎప్పటికప్పుడు సొంతనోట్సు తయారుచేసుకోవాలి. దినపత్రికలతో పాటు పోటీ పరీక్షల మ్యాగజీన్లను పరిశీలిస్తుండాలి.

చిక్కులు… పరిష్కారాలు
1. గ్రూప్-1, 2లకు ప్రత్యేకంగా మెటీరియల్ తయారుచేసుకోవాలా?
*గ్రూప్-2 మెటీరియల్ గ్రూప్-1 ప్రిలిమ్స్‌కు కూడా సరిపోతుంది. పైగా గ్రూప్-1 ప్రిలిమ్స్ క్వాలిఫైయింగ్ పరీక్ష కాబట్టి పెద్దగా ఆందోళనేమీ లేకుండా అదే మెటీరియల్‌ను వాడుకోవచ్చు.
గ్రూప్-1 మెయిన్స్‌లో పేపర్-2,3 ల్లోని అంశాలకూ గ్రూప్-2లోని పేపర్-2,3 అంశాలకూ సారూప్యతలున్నాయి. వాటిని అనుసంధానం చేసుకొని మెటీరియల్ రూపొందించుకోవచ్చు.

2. గ్రూప్స్ రెంటికీ మెటీరియల్ రూపకల్పనలో ఒకే పంథా సరిపోతుందా?
*గ్రూప్-2 మెటీరియల్ తయారీలో సమగ్రతకూ, సూక్ష్మతకూ ప్రాధాన్యం ఇవ్వాలి. గ్రూప్-1లో అంశాలవారీగా కీలక ప్రశ్నలను ఊహించుకొని మెటీరియల్ తయారుచేసుకోవాలి.

3. తాజా గణాంకాల సమాచారం తెలుసుకోవటం ఎలా?
*ఈ సమస్య ఆర్థిక అంశాల్లో ప్రధానంగా ఉంది. 2007-08 ఎకనమిక్ సర్వే, 2008-09 బడ్జెట్ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. భారత ఆర్థికవ్యవస్థ సమాచారం 2005-06, 2006-07 వరకూ లభిస్తోంది. మనరాష్ట్ర ఆర్థికాంశాలే సమస్య. 2004-05, 2005-06 ఆర్థిక గణాంకాలపై ఆధారపడితే సరిపోయే అవకాశాలున్నాయి.

4. సొంతనోట్సు తయారీకి సమయం లేదు. ఎలా?
*ఇలాంటప్పుడు ప్రామాణిక మెటీరియల్‌ను తీసుకొని అందులోని సమాచారాన్ని ప్రాథమిక ఆధారంగా తీసుకోవాలి. దానికి అదనపు సమాచారాన్ని జోడిస్తూ కొంత సమయం ఆదా చేసుకోవచ్చు.

5. ఒక అంశానికి సంబంధించి ఒకటి రెండు పాఠ్యపుస్తకాలకు పరిమితమైతే చాలదా?
*అభ్యర్థికి లభించే సమాచారాన్ని బట్టి మాత్రమే దీనికి జవాబు ఉంటుంది. ఎక్కువ సమయం లభ్యమైతే అదనపు పుస్తకాలను అధ్యయనం చేసి సొంత మెటీరియల్‌ను రూపొందించుకోవాలి. సమయం తక్కువున్నపుడు తక్కువ పుస్తకాలకు పరిమితమవ్వటమే సరైంది.

6. భారీ సమాచారాన్ని క్లుప్తీకరించటం ఎలా?
*కొన్ని సబ్జెక్టులకు విస్తృతస్థాయిలో మెటీరియల్ దొరుకుతుంది. దాన్ని ఏ స్థాయిలో, ఎంత పరిమాణంలో వినియోగించుకోవాలనేది సమస్యే. రాయబోయే పరీక్ష ఆబ్జెక్టివ్ అయితే సమాచారాన్ని చిన్న చిన్న ప్రశ్నలుగా మార్చుకుంటే సరిపోతుంది.

కొన్ని సబ్జెక్టుల్లో సమాచారం కొరతగా ఉంది. ఇలాంటివాటివల్ల ఆబ్జెక్టివ్ పరీక్షలకు పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ గ్రూప్-1 మెయిన్స్‌లో ‘ఒక్కమాట’నే ఇచ్చి విశదీకరించమని అడిగే అవకాశముంది. ఉదా: ‘రాజ్యాంగ మౌలిక నిర్మితిని విశ్లేషించండి’. నిజానికి ‘మౌలిక నిర్మితి’ అనే పదం రాజ్యాంగంలో కన్పించదు. కాబట్టి సబ్జెక్టును సమగ్రంగా అర్థం చేసుకుంటేనే ఇలాంటివాటికి జవాబులు రాయటం సాధ్యమవుతుంది.
| సాధ్యాసాధ్యాలు గమనించాలి! ఆర్.సి. రెడ్డి మెటీరియల్ ఎంపిక అనేది పోటీ పరీక్షల్లో చాలా కీలకం. కనపడిన ప్రతి పుస్తకాన్నీ చదివెయ్యకూడదు. గుడ్డిగా చేసే కృషి ఫలితాలనివ్వదు. ఎంతవరకూ చదవగలమో సాధ్యాసాధ్యాలు పరిగణనలోకి తీసుకోవాలి. ప్రామాణిక పుస్తకాలను చదివితే చాలు. ఏది ప్రామాణికమనే విషయంలో సందేహముంటే నిపుణుల సలహాలు తీసుకోవాలి. చదివే సమాచారం స్పష్టంగా, క్లుప్తంగా ఉంటే మేలు. ఒక అంశం మీద ఎన్నో పుస్తకాలు చదువుతూ ఉండటం (ప్యారలల్ అప్రోచ్) సరైంది కాదు. దీనివల్ల ఫలితం తక్కువ; సమయం వృథా. అందుకే ఒక అంశానికి సంబంధించి పరిమితంగానే, అవీ ప్రామాణిక పుస్తకాలనే ఎంచుకోవటం (వర్టికల్ అప్రోచ్) ఉత్తమం. ఏ పుస్తకాన్ని అయినా కవర్ పేజీనుంచి చివరిపేజీ వరకూ చదవక్కర్లేదు. పరీక్షకు అవసరమైనవే చదవాలి. ఇలా మొదటిదశ ప్రిపరేషన్ ముగించాలి. ఇంకా సమయం ఉంటే రెండో దశలో అదనపు పుస్తకాలు చదవొచ్చు. |
| గ్రూప్-2 మెటీరియల్ తయారీలో సమగ్రతకూ, సూక్ష్మతకూ ప్రాధాన్యం ఇవ్వాలి. గ్రూప్-1లో అంశాలవారీగా కీలక ప్రశ్నలను వూహించుకొని మెటీరియల్ తయారు చేసుకోవాలి. సొంతనోట్సు తయారీకి సమయం లేనప్పుడు ప్రామాణిక మెటీరియల్‌లోని సమాచారాన్ని ప్రాథమిక ఆధారంగా తీసుకోవాలి. దానికి అదనపు సమాచారాన్ని జోడిస్తూ సమయం ఆదా చేసుకోవచ్చు. ఒక అంశం మీద ఎన్నో పుస్తకాలు చదువుతూ ఉండటం సరైంది కాదు. దీనివల్ల సమయం వృథా. అందుకే ఏ అంశంపైనైనా సరే, పరిమితంగా, ప్రామాణిక పుస్తకాలనే అధ్యయనం చేయాలి. |
మెంటల్ ఎబిలిటీ గ్రూప్ - 1 మెయిన్స్
|
మౌర్య పూర్వ యుగం - షోడశ మహా జనపదాలు
క్రీస్తు పూర్వం 600 నుంచి 325 వరకు గల కాలాన్నీ మౌర్య పూర్వ యుగం (Pre-Mouryan Age) అని వ్యవహరిస్తున్నారు. ప్రాచీన భారత రాజ్య వ్యవస్థతోపాటు, సాంఘిక, ఆర్థిక వ్యవస్థలు కూడా స్పష్టమైన రూపాన్ని సంతరించుకున్న కాలమది. సుమారు వేయి సంవత్సరాలపాటు భారత రాజకీయ, సాంఘిక, ఆర్థిక వ్యవస్థలు అదే రూపంతో కొనసాగాయని చెప్పవచ్చు. షోడశ మహా జనపదాలు: బౌద్ధ గ్రంథం ‘అంగుత్తర నికాయ’ ఆధారంగా.. ఆనాటి భారతదేశంలో 16 మహా జనపదాలు ఉండేవని తెలుస్తోంది. ఈ మహా జనపదాలు, వాటి రాజధానుల వివరాలు ఇవి.. మహా జనపదం రాజధాని అంగ చంపా మగధ గిరివజ్రం, పాటలీపుత్రం కాశీ వారణాసి కోసల అయోధ్య, శ్రావస్తి వజ్జి వైశాలి మల్ల కుసీ నగర, పావాపురి చేది సుక్తిమతి వత్స కౌసాంబి కురు ఇంద్రప్రస్థ పాంచాల అహిచ్ఛత్ర మత్స్య విరాట నగరం సౌరసేన మధుర అస్సక పౌధన్యపురం (బోధన్) అవంతి ఉజ్జయిని, మహిష్మతి గాంధార తక్షశిల కాంభోజ రాజపుర షోడశ మహా జనపదాల్లో రాచరిక వ్యవస్థలే అధికం. అయినప్పటికీ కొన్ని గణ రాజ్యాలు కూడా ఉన్నాయి. వజ్జి, మల్ల జనపదాలు అలాంటివే. శాక్యులు పాలించిన కపిలవస్తు, కోలియుల రామగ్రామం, జ్ఞాత్రికుల కుందగ్రామం, తదితరాలు కూడా ఈ కోవకు చెందినవే. షోడశ మహా జనపదాల్లో కాశీ, కోసల, మగధ, వజ్జియగణ సమాఖ్య ముఖ్యమైనవి. ఈ నాలుగు రాజ్యాల మధ్య నిరంతర యుద్ధాలు జరిగేవి. దీనికి ముఖ్య కారణం.. గంగా నదీ లోయలో సాగే వాణిజ్యంపై ఆధిపత్యం సాధించాలనుకోవడం. ఈ ఆధిపత్య పోరులో చివరకు మగధ పై చేయి సాధించింది. కాశి: షోడశ మహా జనపదాల్లో తొలుత ప్రాబల్యాన్ని పొందిన రాజ్యం. వరుణ, ఆసి అనే నదుల సంగమ స్థానంలో ఉండటం వల్ల రాజధానికి ‘వారణాసి’ అనే పేరు వచ్చింది. ‘‘కాశీ రాజ్యాన్ని బ్రహ్మదత్తుడు పాలించే కాలంలో..’’ అంటూ ఎన్నో జాతక గాధలు ప్రారంభమవడాన్ని బట్టి బ్రహ్మదత్తుడు అనే కాశీ పాలకుడు ఎంతో ప్రాచుర్యం పొందాడని చెప్పవచ్చు. కోసల: తొలి రాజధాని అయోధ్య. మలి రాజధాని శ్రావస్తి. కాశీని ఆక్రమించడం ద్వారా కోసల శక్తిమంతంగా రూపుదిద్దుకుంది. బుద్ధుని కాలంలో కోసల రాజ్యాన్ని ప్రసేనజిత్ (పసేనది) పాలించేవాడు. ఇతని వారసుడు ‘విధూదభ’ శాక్య రాజ్యంపై దండెత్తి శాక్యతెగను సమూలంగా సంహరించాడు. వజ్జి: ఎనిమిది తెగలు కలిసి పాలించడం వల్ల దీనికి ‘అట్టకుల’ అనే పేరు వచ్చింది. ఈ ఎనిమిది తెగల్లో లిచ్ఛవులు ప్రధానమైన తెగ. మగధ పాలకుడు బింబిసారుడు... లిచ్ఛవుల నాయకుడైన ‘చేతకుని’ కుమార్తె ‘చెల్లన’ను వివాహం చేసుకున్నాడు. షోడశ మహా జనపదాల్లో అత్యంత శక్తిమంతమై.. మహా సామ్రాజ్యంగా ఎదిగిన రాజ్యం మగధ. ఈ సామ్రాజ్య వికాసంలో పాలకుల విధానాలతో పాటు మగధకు గల భౌగోళిక సానుకూలతలు కూడా దోహదపడ్డాయి. హర్యాంకులు: బింబిసారుడు (క్రీస్తు పూర్వం 547-495 వరకు): రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకోవడంలో వైవాహిక సంబంధాలకున్న ప్రాధాన్యాన్ని గుర్తించాడు. కోసల రాజ కుమారి కోసలాదేవి, మద్రదేశ (పంజాబ్ ప్రాంతం) రాకుమారి ఖౌమ, లిచ్ఛవుల రాకుమారి ‘చెల్లన’లను పెళ్లి చేసుకుని తన రాజ్యానికి అన్ని వైపుల నుంచి భద్రతను సాధించాడు. భారతదేశ చరిత్రలో సిద్ధ సైన్యానికి (Standing army) ఉన్న ప్రాధాన్యతను గుర్తించిన రాజుగా బింబిసారుడుని పేర్కోవచ్చు. అతడికి గల ‘సేనియ’ అనే బిరుదు ఈ విషయాన్నే సూచిస్తోంది. గ్రామాధికారులతో కూడా సమావేశాలు నిర్వహిస్తూ పరిపాలనలో అట్టడుగు స్థాయి వరకు ఆసక్తి ప్రదర్శించాడు. పొరుగునే ఉన్న అంగ రాజ్యాన్ని ఆక్రమించి గంగా నదిపై మగధ ప్రాబల్యాన్ని విస్తరించాడు. అవంతి పాలకుడైన ప్రద్యోతునితో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాడు. ప్రద్యోతుడు కామెర్ల వ్యాధితో బాధపడుతున్నప్పుడు బింబిసారుడు తన వ్యక్తిగత వైద్యుడైన జీవకుడిని ప్రద్యోతుడి దగ్గరికి పంపాడు. అతనికి స్వస్థత చేకూరేలా చేశాడు. బింబిసారుడు సహజ మరణాన్ని పొందలేదని, కుమారుని కారణంగా అతని జీవితం విషాదంగా ముగిసిందని సాహిత్యాధారాలు సూచిస్తున్నాయి. అజాత శత్రువు (క్రీస్తు పూర్వం 495-462 వరకు): వజ్జి గణ సమాఖ్యను ధ్వంసం చేయడం ఇతడు సాధించిన ప్రధాన విజయం. లిచ్ఛవుల్లో చిచ్చు పెట్టేందుకు ‘వస్సకార’ అనే బ్రాహ్మణుడిని అజాత శత్రువు నియోగించాడు. వస్సకారుడి కృషి కారణంగా లిచ్ఛవ నాయకుల ఐక్యత దెబ్బతింది. లిచ్ఛవులు బలహీనపడ్డారనే సమాచారం అందుకున్న అజాత శత్రువు వారిపై యుద్ధం ప్రకటించాడు. ఈ యుద్ధంలో అజాత శత్రువు ‘మహా శిల కంటక’, ‘రథముసల’ అనే ఆయుధాలను వినియోగించి విజయం సాధించినట్లు తెలుస్తోంది. అజాతశత్రువు బుద్ధుడిని కలిసి.. తన తండ్రిని చ ంపి నేరానికి పాల్పడినట్లు తెలిపి... పశ్చాత్తాపాన్ని ప్రకటించినట్లు బౌద్ధ సంప్రదాయం చెబుతోంది. అజాత శత్రువు తర్వాత వరుసగా నలుగురు పితృహంతకులు అధికారంలోకి వచ్చారు. వారితో విసిగి వేసారిన ప్రజలను ఆకట్టుకొని ‘శిశునాగుడు’ అధికారం చేపట్టాడు. ఆ విధంగా హర్యాంక వంశం అంతమై శిశునాగ వంశం అధికారంలోకి వచ్చింది. శిశునాగులు: ‘అవంతి’ రాజ్యాన్ని ఆక్రమించి మగధ ప్రాబల్య విస్తరణలో శిశునాగుడు కీలక పాత్ర పోషించాడు. శిశునాగుని వారసుడైన కాలాశోకుడు(కాకవర్ణి) కాలంలోనే వైశాలిలో రెండో బౌద్ధ సంగీతి జరిగింది. కాలాశోకుడిని వధించి మహాపద్మ నందుడు‘నంద ’ వంశాన్ని స్థాపించాడు. నందులు: నంద వంశ స్థాపకుడైన ‘మహాపద్మ’ నిమ్న జాతికి చెందిన వాడని పురాణాలు, ఇతర సాహిత్య ఆధారాలు చెబుతున్నాయి. నందులు.. మగధ ప్రాబల్యాన్ని మరింత విస్తరించారు. ఖారవేలుని హాథిగుంఫా శాసనం ప్రకారం ‘కళింగ’ను నందులు ఆక్రమించినట్లు తెలుస్తోంది. నందులు గొప్ప సైన్యాన్ని, కోశాగారాన్ని నిర్మించారు. నందులలో చివరి వాడు ధన నందుడు. గ్రీకు రచయితలు ఇతడినే ‘అగ్రేమ్సు’ అని పిలిచే వారు. ఇతడిని ఓడించి చంద్ర గుప్తమౌర్యుడు అధికారంలోకి వచ్చాడు. మగధ విజృంభణకు రాజుల దండయాత్రలు, విధానాలే గాక, మగధకు గల ప్రత్యేక భౌగోళిక సానుకూలతలు కూడా ఉపకరించాయి. గంగానదీ ప్రవాహ ప్రాంతంలో అధిక భాగాన్ని ఆక్రమించగలగడం మగధ సాధించిన తొలి విజయంగా చెప్పొచ్చు. కాశీ నుంచి అంగ వరకు సారవంతమైన ఒండ్రు మట్టి నేలలు, మగధ రాజ్యంలో ఉండటం వల్ల వ్యవసాయిక మిగులు పెరిగి, మగధ ఆర్థికంగా బలపడింది. ఆ రోజుల్లో వాణిజ్యంలో గంగానదీ వ్యవస్థ ఎంతో కీలకమైంది. గంగానదీపై గల ప్రధాన వాణిజ్య రేవు పట్టణాలన్నింటీని నియంత్రించడం ద్వారా మగధ ఎంతో లాభపడింది. భారతదేశంలోని అత్యంత సుసంపన్నమైన ఇనుప గనులు మగధ రాజ్యంలోనే ఉన్నాయి. ఇనుప గొడ్డళ్లు.. అడవులను నరికి సాగు భూమిని పెంచడానికి, ఇనుప నాగళు..్ల వ్యవసాయానికి, కొడవళ్లు పంటకోతకు ఉపయోగపడ్డాయి. ఇనుముతో బలమైన ఆయుధాలను తయారు చేసుకోవడం కూడా మగధకు ఉపకరించిన అంశమే. మగధ దక్షిణ ప్రాంతంలో గల అడవులు, ఆ నాటి యుద్ధతంత్రంలో కీలకమైన గజ బలాన్ని అందించాయి. అలాగే సుదూర వాణిజ్యంలో కూడా ఏనుగు దంతం ఎంతో ప్రతిష్టాత్మకమైన వస్తువుగా మారింది. అంతేకాకుండా ఆ అడవులు రథాల తయారీకి, భవన నిర్మాణాలకు కావల్సిన కలపను అందించాయి. మగధ కొత్తగా ఆర్యీకరణకు గురైన ప్రాంతం. కొత్తగా నాగరికతకు గురైన ప్రజల్లో ఉండే చొరవ, ఉత్సాహం మగధ ప్రజల్లో కూడా ఉన్నాయి. సమర్థులైన పాలకులకు మద్దతివ్వడం, అసమర్థులను తొలగించడంలో మగధ ప్రజలు చూపిన వివేకం మగధ సామ్రాజ్య వాదానికి దోహపడిందని చెప్పొచ్చు. పర్షియన్ గ్రీకు దండయాత్రలు: ప్రపంచ ఆధిపత్యం కోసం పర్షియన్లు, గ్రీకులు సంఘర్షించుకున్న కాలమది. ఈ పోరులో చివరకు గ్రీకులే పై చేయి సాధించారు. పర్షియాకు చెందిన సైరస్.. సింధు నది వరకు చొచ్చుకు రాగలిగారు. సైరస్ మనమడైన డేరియస్ సామ్రాజ్యంలోని భారతదేశం 20వ సత్రపి(రాష్ట్రం)గా ఉందని హెరోడోటస్ పేర్కొన్నాడు. అయితే అలెగ్జాండర్ దండేత్తే నాటికే పర్షియన్ల నియంత్రణ సడలిన ట్లు తెలుస్తోంది. క్రీ.పూ. 334లో తన తండ్రి ఫిలిప్ మరణం తర్వాత మాసిడోనియా సింహాసనాన్ని అధిష్టించిన అలెగ్జాండర్ ప్రపంచాన్నంతా జయించి, విశ్వ విజేత కావాలని కాంక్షించాడు. అలెగ్జాండర్ భారత దేశ దండయాత్ర: క్రీ.పూ.326లో ఖైబర్ కనుమను దాటి అలెగ్జాండర్ భారత దేశంలోకి ప్రవేశించాడు.తక్షశిల పాలకుడైన ఆంఫిస్ (అంభి) అలెగ్జాండర్‌కు లొంగిపోయాడు. జీలం, చీనాబ్ నదుల మధ్య గల‘పోరస్’ (పురుషోత్తముడు) రాజ్యాన్ని ఆక్రమించేందుకు అలెగ్జాండర్‌కు సహకరించాడు. క్రీ.పూ. 326లో జరిగిన హైడాస్పెస్ యుద్ధం (జీలం నదినే గ్రీకులు హైడాస్పెస్ అని పిలిచారు) లో పోరస్ తీవ్రంగా పోరాడి ఓడాడు. పోరస్ వ్యక్తిత్వాన్ని మెచ్చుకున్న అలెగ్జాండర్ అతని రాజ్యాన్ని తిరిగి అతనికే కట్టబెట్టాడు. అలా జీలం నది వద్ద మొదలైన అలెగ్జాండర్ ప్రస్థానం బియాస్ నది వరకు సాగుతూ వచ్చింది. అయితే.. అప్పటికే అలసిన సైనికులు బియాస్ నదిని దాటేందుకు నిరాకరించడంతో అలెగ్జాండర్ నిరుత్తరుడయ్యాడు. నిరంతర యుద్ధాలు, ఇంటి బెంగ అలెగ్జాండర్ సైన్యాన్ని బలహీనపరచాయి. బియాస్ నదికి అవతల మహాసైన్యాన్ని, కోశాన్ని కలిగిన నందుల రాజ్యం ఉంది. దానిని లొంగతీసుకోవడం అంత సులభం కాదని కూడా భావించాడు. ఫలితంగా అలెగ్జాండర్ వెనుదిరిగి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. సింధు నుండి బియాస్ వరకు విస్తరించి ఉన్న తన రాజ్యాన్ని అలెగ్జాండర్ మూడు భాగాలుగా విభజించి ప్రతినిధులను నియమించాడు. నియార్ఖస్ నేతృత్వంలో కొంత సైన్యాన్ని సముద్ర మార్గం ద్వారా వెనక్కు పంపాడు. తను భూమార్గం ద్వారా ప్రయాణించాడు. బాబిలోనియా చేరేసరికి అలెగ్జాండర్ తీవ్ర అస్వస్థతకు గురై మరణించాడు. అలెగ్జాండర్ దండయాత్ర వల్ల కొత్త వాణిజ్య మార్గాలు వృద్ధి చెందాయి. ఎన్నో చిల్లర రాజ్యాలను, తెగలను నిర్మూలించడం ద్వారా వాయవ్య భారత దేశంలో రాజకీయ చిత్రపటాన్ని మార్చి చంద్రగుప్తునికి మార్గం సుగమం చేశాడు అలెగ్జాండర్. ఇంతకు మించి అలెగ్జాండర్ భాతర దండయాత్రకు ప్రాధాన్యం లేదు. భారతీయ గ్రంధాల్లో అలెగ్జాండర్ ప్రస్తావన మచ్చుకైనా కనపడదు. ముఖ్యాంశాలు: {పాచీన భారత రాజ్య వ్యవస్థతోపాటు, సాంఘిక, ఆర్థిక వ్యవస్థలు కూడా స్పష్టమైన రూపాన్ని సంతరించుకున్న కాలం మౌర్య పూర్వ యుగం. భారతదేశ చరిత్రలో సిద్ధ సైన్యానికి (Standing army) ఉన్న ప్రాధాన్యతను గుర్తించిన రాజుగా బింబిసారుడుని పేర్కోవచ్చు. వజ్జి గణ సమాఖ్యను ధ్వంసం చేయడం అజాత శత్రువు సాధించిన ప్రధాన విజయం. నందులలో చివరి వాడు ధన నందుడు. గ్రీకు రచయితలు ఇతడినే ‘అగ్రేమ్సు’ అని పిలిచే వారు. సైరస్ మనమడైన డేరియస్ సామ్రాజ్యంలోని భారతదేశం 20వ సత్రపి(రాష్ట్రం)గా ఉందని హెరోడోటస్ పేర్కొన్నాడు. 334లో తన తండ్రి ఫిలిప్ మరణం తర్వాత మాసిడోనియా సింహాసనాన్ని అధిష్టించిన అలెగ్జాండర్ 326లో జరిగిన హైడాస్పెస్ యుద్ధంలో పోరస్ (పురుషోత్తముడు) తీవ్రంగా పోరాడి ఓడాడు. |
More Headlines |
భారత్.. పారిశ్రామిక రంగ ప్రగతి
స్వాతంత్య్రానంతరం భారత్ ఆర్థికంగా పురోగతి సాధించడానికి వ్యవసాయ, పారిశ్రామిక రంగాల విస్తరణతోపాటు అధిక ఉత్పత్తి దోహదపడింది. అనేక పరిశ్రమల్లో నూతన సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశపెట్టారు. పారిశ్రామిక పెట్టుబడులు పెరిగాయి. దీంతోపాటు ఆధునిక యాజమాన్య పద్ధతులు, నవకల్పనల నేపథ్యంలో ఉద్యమదారులు పెరగ డం, ప్రభుత్వ మద్దతు పారిశ్రామికాభివృద్ధికి దోహదపడ్డాయి.
దేశంలోని అనేక ప్రాంతాల్లో కొత్త పారిశ్రామిక కేంద్రాల అభివృద్ధి జరిగింది. గత కొన్నేళ్లుగా మౌలిక సౌకర్యాలైన విద్యుచ్ఛక్తి, కమ్యూనికేషన్లపై ప్రభుత్వ రంగ పెట్టుబడులు పెరిగాయి. ఉద్యమిత్వ అభివృద్ధి (ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్)ని పెంపొందించే అనేక సంస్థల తోపాటు పారిశ్రామిక పరపతి సంస్థలు ఎక్కువగా ఏర్పడటం పారిశ్రామిక రంగ పురోగతికి కారణమయ్యాయి.
ఆర్థిక విస్తరణ భారతదేశ స్థూల జాతీయోత్పత్తి పెరుగుదలకు దారితీసింది. స్వాతంత్య్రానంతరం 4 సంవత్సరాలు మినహా, భారత్ ధనాత్మక వృద్ధిని నమోదు చేసుకుంది. 1951తో పోల్చినపుడు 1999-2000 సంవత్సరంలో దేశ తలసరి నికరజాతీయోత్పత్తి 2.75 రెట్లు ఎక్కువ. తలసరి నికర జాతీయోత్పత్తి 1950-90 మధ్య కాలంలో వార్షిక వృద్ధి సగటు 3.2 శాతం కాగా 1993-94 నుంచి 1999-2000 మధ్య కాలంలో వార్షిక వృద్ధి 4.8 శాతంగా నమోదైంది. 2009-10లో ఈ వృద్ధి 6.1 శాతం.
సంస్కరణల ముందు కాలం: ప్రభుత్వం అవలంబించిన అనేక ప్రోత్సాహకర విధానాలు స్థూల జాతీయోత్పత్తి పెరుగుదలకు దోహదపడ్డాయి. స్వాతంత్య్రానంతరం ప్రభుత్వం రక్షణ విధానాలు అవలంబించడంతోపాటు విదేశీ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన ఒప్పందాలను ప్రోత్సహించినప్పటికీ విదేశీ పెట్టుబడులపై పరిమితిని 40 శాతంగా విధించింది. దిగుమతుల విధానాన్ని స్థానిక పరిశ్రమలకు అనుకూలంగా అవలంబించిన అతి కొద్ది దేశాలలో భారత్ ఒకటి.
స్వాతంత్య్రానంతరం కొంత కాలంలోనే విదేశీ మారక ద్రవ్య కొరతను భారత్ ఎదుర్కొన్నందువల్ల దిగుమతులపై నియంత్రణ విధించింది. వినియోగ వస్తువుల దిగుమతులను పూర్తిగా నియంత్రించింది. వీటితోపాటు మూల ధన వస్తువుల దిగమతులపై కూడా ప్రభుత్వం కొంతమేర నియంత్రణ విధించినప్పటికి దేశంలో ఈ ఉత్పత్తుల పెరుగుదలకు ప్రభుత్వ విధానం దోహదపడింది.
మూలధన వస్తువులకు సంబంధించి విదేశీ సహకారంతోపాటు సాంకేతిక పరిజ్ఞానం దిగుమతికి మూలధన వస్తు పరిశ్రమలకు ప్రభుత్వం ప్రోత్సాహమిచ్చింది. రెండు, మూడో పంచవర్ష ప్రణాళికా కాలంలో మూలధన వస్తు పరిశ్రమల అభివృద్ధి దిశగా కొన్ని పరికరాల దిగుమతికి ప్రభుత్వం అనుమతిచ్చింది.
స్థానిక పరిశ్రమలను ప్రోత్సహించే దిశగా దిగుమతులపై నియంత్రణతో పాటు అనేక ఉత్పత్తుల దిగుమతులపై 200 నుంచి 300 శాతం వరకు దిగుమతి సుంకం విధిస్తూ స్థానిక పరిశ్రమలకు ప్రభుత్వం రక్షణ కల్పించింది. పారిశ్రామిక రంగ అభివృద్ధి నిమిత్తం ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకులను ఏర్పాటు చేసింది. మధ్య, దీర్ఘకాలిక పెట్టుబడులను పారిశ్రామిక రంగ అభివృద్ధికి అందించడం అభివృద్ధి బ్యాంకు ముఖ్యోద్దేశం.
ఈ క్రమంలో ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను 1948లో, ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఐసీఐసీఐ) 1955లో, పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకు (ఐడీబీఐ) 1964లో, చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు 1990లో స్థాపించారు. యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా 1963లో, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1956లో ఏర్పాటయ్యాయి.
చిన్న ఉద్యమదారులకు పరపతి కల్పించడం కోసం రాష్ట్రాల స్థాయిలో 1951లో పార్లమెంట్ చట్టం ద్వారా ఫైనాన్స్ కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి. వీటితోపాటు జాతీయ చిన్న తరహా పరిశ్రమల కార్పొరేషన్‌ను జాతీయ స్థాయిలో ఏర్పాటు చేశారు.
పారిశ్రామికాభివృద్ధి వేగవంతంకావడానికి శక్తి-రవాణా-సమాచార సౌకర్యాలు తప్పనిసరి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుదుత్పాదన, పంపిణీతోపాటు కొత్త విద్యుచ్ఛక్తి ప్రాజెక్టులపై పెట్టుబడులను పెంచాయి. వీటితోపాటు రోడ్ల నిర్మాణం, సమాచారం, నౌకాయానా అభివృద్ధిపై పెట్టుబడులు పెరిగాయి.
1977లో పారిశ్రామిక తీర్మానం నేపథ్యంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పారిశ్రామిక వాడలను అన్ని మౌలిక సౌకర్యాలతో ఏర్పాటు చేశాయి. 1980 దశకం తర్వాత కాలంలో చమురు, సహజ వాయువు శక్తి ఉత్పాదనకు ముఖ్య ఆధారాలుగా రూపొందాయి. చమురు వెలికితీతకు ‘ఆయిల్, సహజ వాయువు కమిషన్ (ఓఎన్‌జీసీ)’ ఏర్పాటు చేశారు. ప్లాంట్లను విస్తరించడం ద్వారా అదనపు రిఫైనింగ్ సామర్ధ్యం పెంచారు.
పారిశ్రామిక రంగం.. 1991 తర్వాత:
1991లో నూతన ఆర్థిక సంస్కరణల్లో భాగంగా పారిశ్రామిక రంగంలో సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిం ది. ప్రభుత్వ రంగ పాత్రను తగ్గిస్తూ ప్రైవేటీకరణకు ప్రాధాన్యమిచ్చారు. స్వదేశీ పరిశ్రమల్లో విదేశీ పెట్టుబడులను 51 శాతానికి పెంచారు. అవస్థాపనా సౌకర్యాల కల్పనలో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించారు.
పారిశ్రామిక రంగంలో అనేక సరళీకృత విధానాలను ప్రవేశపెట్టినప్పటికీ 9వ ప్రణాళికలో పారిశ్రామిక రంగం కేవలం 5 శాతం వృద్ధినే సాధించింది. 1950-51లో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ 7.9 శాతం కాగా ఏప్రిల్-డిసెంబర్ 2010లో 8.6శాతం. బేసిక్ గూడ్స్, ‘వినియోగనశ్వర వస్తువు’ రం గంలో ప్రగతి తగ్గినందువల్ల 2010లో పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో చెప్పుకోదగ్గ పెరుగుదల సంభవించలేదు.
సంస్కరణల యుగంలో పారిశ్రామిక రంగంలో ఉత్పాదక సామర్ధ్యం పెరిగినందువల్ల ‘స్వదేశీ మూలధన కల్పన’లో ఎక్కువ వాటాను ఈ రంగం ఆకర్షించగలిగింది. నేషనల్ అకౌంట్స్ అంచనా ప్రకారం 2004-05 నుంచి 2009-10 మధ్య కాలంలో స్థూల దేశీయోత్పత్తి సగటు 8.6 శాతం కాగా ఇదే కాలానికి సంబంధించి నూతన పెట్టుబడుల వార్షిక వృద్ధి 11.3 శాతం. మైనింగ్, రిజిస్టర్డ్ తయారీ రంగం, విద్యుచ్ఛక్తి రంగాల్లో స్థూల మూలధన కల్పన వృద్ధి రేటు ఎక్కువ.
2008-09లో మొత్తం స్థూల మూలధన కల్పనలో పారిశ్రామిక స్థూల మూలధన కల్పన తగ్గడానికి ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణమయింది. కాని 2009-10లో పారిశ్రామిక స్థూల మూలధన కల్పన వాటా మొత్తం స్థిర మూలధన కల్పనలో 43.8 శాతంగా ఉండడానికి ఇన్వెస్ట్‌మెంట్ సెంటిమెంట్స్‌లో పురోగతి కారణమయింది.
సంస్కరణల యుగంలో ముఖ్యంగా 2003-04 తర్వాత దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం పెరిగింది. ఆగస్ట్ 1991 నుంచి మే 2010 మధ్యకాలంలో దేశంలోకి వచ్చిన మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 136.86 బిలియన్ డాలర్లు.
భారత్‌లో సేవలు, టెలికమ్యూనికేషన్లు, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, హౌసింగ్, రియల్ ఎస్టేట్ రంగాలు ఎక్కువ విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక సంక్షోభ నేపథ్యంలో ప్రపంచ పెట్టుబడులు స్థంభించే అవకాశం ఉందని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ) నివేదిక 2010 పేర్కొంది.
పారిశ్రామికాభివృద్ధికి వనరులు:
ప్రణాళికా యుగంలో పారిశ్రామికీకరణ సాధించే దిశగా పారిశ్రామిక రంగానికి వనరుల కేటాయింపు పెరిగింది. మొదటి ప్రణాళికలో మొత్తం ప్రభుత్వ రంగ పెట్టుబడి రూ, 1960 కోట్లలో 2.8 శాతం అంటే రూ.56 కోట్లు పరిశ్రమలు, ఖనిజాలకు కేటాయించారు. రెండో ప్రణాళికలో మొత్తం ప్రభుత్వ రంగ పెట్టుబడిలో 20.1 శాతం, మూడో ప్రణాళికలోను 20.1 శాతం ఈ రంగానికి కేటాయించారు.
రెండో, మూడో ప్రణాళికల్లో బేసిక్ ఇండస్ట్రీస్,మూలధన వస్తు పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యమిచ్చారు. ఈ పరిశ్రమలను ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసి ప్రభుత్వ రంగ పరిధిని విస్తరించారు. వినియోగ వస్తు పరిశ్రమలను ప్రైవేటు రంగంలో అనుమతించారు. నాలుగో ప్రణాళికలో మొత్తం వ్యయం రూ.15779 కోట్లలో 18.2 శాతం అంటే 2,864 కోట్లను; 5వ ప్రణాళికలో మొత్తం వ్యయంలో 22.8 శాతాన్ని పరిశ్రమలు, ఖనిజాలకు కేటాయించారు.
పరిశ్రమలు అవస్థాపనా సౌకర్యాలను పూర్తిగా వినియోగించుకోవడం, ఉత్పాదకతను పెంపొందించడం, మూలధన వస్తు పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్, శక్తి సామర్ధ్యం పెంపునకు 6వ ప్రణాళిక ప్రాధాన్యమిచ్చింది. మొత్తం వ్యయంలో ఈ ప్రణాళికలో 13.7 శాతం ఏడో ప్రణాళికలో 11.9 శాతం ఈ రంగానికి కేటాయించారు.
నూతన పారిశ్రామిక విధానం 1991 ప్రకారం పారిశ్రామిక కార్యకలాపాల్లో ప్రైవేటు రంగానికి ప్రాధాన్యమిచ్చారు. మౌలిక, కీలక రంగాల్లో ప్రభుత్వ రంగం కీలక పాత్ర పోషించగలదని భావించారు. 8వ ప్రణాళిక మొత్తం వ్యయం రూ.4,85,457 కోట్లలో 8.4 శాతం అంటే రూ.40,623 కోట్లు ఈ రంగానికి కేటాయించారు. 9 వ ప్రణాళికలో మొత్తం వ్యయంలో ఈ రంగంపై వ్యయం 5 శాతం మాత్రమే.
మిగతా ప్రణాళికలతో పోల్చినపుడు 10వ ప్రణాళికలో ఈ రంగంపై చేసిన వాస్తవ వ్యయం మొత్తం వ్యయంలో 3.9 శాతం మాత్రమే. ప్రభుత్వ రంగ పెట్టుబడులు తగ్గడం మరో వైపు ప్రైవేటు రంగ పెట్టుబడులను ఎక్కువగా ఆకర్షించకపోవడం వల్ల సంస్కరణల కాలంలో ప్రణాళికల్లో వృద్ధిరేటు తగ్గింది. 11వ ప్రణాళికలో మొత్తం వ్యయంలో 4.2 శాతం పారిశ్రామిక రంగానికి కేటాయించారు.
ముఖ్యాంశాలు:
{పపంచ పెట్టుబడి నివేదిక 2009 ప్రకారం ప్రపంచ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మొత్తం 2007లో 1.979 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు. కాగా 2008లో 1.697 ట్రిలియన్ డాలర్లు.
పారిశ్రామిక అభివృద్ధి, నియంత్రణ చట్టం-1951.
ఎలక్ట్రానిక్స్ వస్తువుల ఉత్పత్తి వృద్ధి 2009-10లో 13 శాతం.
2004-05 నుంచి 2009-10 మధ్య కాలంలో జీడీపీ వృద్ధి సగటు 8.6 శాతం.
2004-05 నుంచి 2009-10 మధ్య కాలంలో పారిశ్రామిక రంగంలో కొత్త పెట్టుబడుల వృద్ధి 11.3 శాతం.
2003-04 తర్వాత దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం పెరిగింది.
2003-04తో పోల్చినపుడు 2009-10లో దేశంలోకి వచ్చిన ఈక్విటి ప్రవాహాల్లో పెరుగుదల 13 రెట్లు.
2009-11 మధ్య కాలంలో చైనా, ఇండియా, బ్రెజిల్, అమెరికా, రష్యన్ ఫెడరేషన్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఎక్కువగా ఆకర్షించాయి.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఈక్విటీ ప్రవాహాలు 2003-04లో జీడీపీలో 0.37 శాతం కాగా 2008- 09లో 2.21 శాతం.
వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడానికి అనువుగా ఉండే దేశాల్లో చైనా తర్వాత భారత్ రెండోస్థానం ఆక్రమించిందని ‘జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్’ అభిప్రాయపడింది.
ఆగస్ట్ 1991 నుంచి మే 2010 మధ్య కాలంలో దేశంలోకి వచ్చిన మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 136.86 బిలియన్ డాలర్లు.
{పపంచ ఆర్థిక సంక్షోభ నేపథ్యంలో ప్రపంచ పెట్టుబడులు స్థంబించగలవని ఓఈసీడీ నివేదిక 2010 అభిప్రాయపడింది.
1951లో పార్లమెంటు చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు పారిశ్రామిక రంగ అభివృద్ధికి రాష్ట్రాల స్థాయిలో ఫైనాన్స్ కార్పొరేషన్లను ఏర్పాటు చేశాయి.
10వ ప్రణాళికలో మొత్తం వ్యయంలో 3.9 శాతం, 11వ ప్రణాళికలో 4.2 శాతం పారిశ్రామిక రంగానికి కేటాయించారు.

ఫుకిషిమా విస్ఫోటనం.. అణు భద్రత
జైతాపూర్‌లో అణు రియాక్టర్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఇటీవలి కాలంలో ప్రజలు నిరసన తెలియజేయడం.. ఆ సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరును ప్రతిపక్షాలు, పర్యావరణ పరిరక్షక ఉద్యమకారులు గర్హించడం తెలిసిందే. ఇటీవల జపాన్‌లో సంభవించిన సునామీ కారణంగా ఫుకిషిమా పట్టణంలోని అణు రియాక్టరులో జరిగిన ప్రమాదం దృష్ట్యా.. భారతదేశం సహా ప్రపంచంలోని అన్ని దేశాలు తాము అనుసరిస్తున్న అణు విధానం గురించి పునరాలోచనలో పడ్డాయి.
చెర్నోబిల్ (ఉక్రెయిన్)లో 25 ఏళ్ల క్రితం సంభవించిన ఘోర అణు ప్రమాదాన్ని ప్రజలు ఇంకా మరిచిపోలేదు. దాంతో అణుశక్తి ఉత్పత్తి క్షేమకారం కాదని.. దానికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ.. మన ప్రభుత్వ అణు విధానంలో ఎటువంటి మార్పు కనిపించడంలేదు.
దేశ వ్యాప్తంగా 20 అణు రియాక్టర్లను నిర్మించి 2052 నాటికి 208,000 మెగావాట్ల విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 7,000 కిలోమీటర్ల పొడవున్న కోస్తా ప్రాంతంలో ప్రతి 55 కిలోమీటర్లకు 1,000 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన కర్మాగారాలను ఏర్పాటు చేయడానికి సన్నద్ధమవుతోంది.
అణు విద్యుత్ ఉత్పత్తిపై ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించడానికి అనేరీతిలో మన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇటీవల ఒక ప్రకటన చేశారు. దాని సారాంశం.. స్వతంత్ర ప్రతిపత్తితో చట్టబద్ధత కలిగిన అణు వ్యవస్థను ఏర్పాటు చేయడం; ఈ అంశానికి సంబంధించి ప్రజలతో విస్తృత చర్చలు జరపడం.. తద్వారా ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయడం; అణు రియాక్టర్లను స్థాపించడం వల్ల స్థానిక ప్రజలకు ఎటువంటి నష్టం కలగకుండా తగిన పరిహారాన్నివ్వడం; వారికి పునరావాసాన్ని కల్పించడం.
పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారులు మాత్రం ప్రభుత్వ హామీలతో సంతృప్తి చెందడం లేదు. అంతర్జాతీయ స్థాయి లో ప్రాచుర్యం కలిగిన హరిత శాంతి ఉద్యమకారులు (గ్రీన్ పీస్ మూవ్‌మెంట్ లీడర్స్) చెర్నోబిల్‌లో సంభవించిన ప్రమాదం వల్ల పర్యావరణానికి ఇప్పటి వరకు కలిగిన హాని, భవిష్యత్‌లో సంభవించ బోయే దుష్పరిణామాలను కాసింత అతిశయోక్తితో ప్రచారం చేస్తున్నారు.
వారి అంచనాల ప్రకారం చెర్నోబిల్ ప్రమాదం వల్ల 2056 నాటికి 93,000 మంది రేడియేషన్‌కు గురై మరణిస్తారు. కాని అధికారిక లెక్కల ప్రకారం అణు కర్మాగారంలో పని చేసిన ఉద్యోగులు 47-62 మంది మాత్రమే మరణించారు. థైరాయిడ్ క్యాన్సర్‌వల్ల 15మంది మరణించినట్లు ఉక్రెయిన్ ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
హరిత ఉద్యమకారులు భయపెట్టినంతగా పర్యావరణానికి ప్రమాదం లేదని అణు విధానాన్ని సమర్థించే వారు వాదిస్తున్నారు. వాస్తవానికి ఇరుపక్షాల వాదనలు అతిశయోక్తులే. ఈ సందర్భంగా అణు శక్తికి సంబంధించిన అంశాల మీద విస్తృత చర్చలు జరగాలి. శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు, ఉద్యమకారులు వాస్తవాలను ప్రజలకు తెలియజేసి వారి భయాందోళలను తొలగించాలి.
ఒక దేశ అభివృద్ధిని.. ఆ దేశ వార్షిక సగటు విద్యుచ్ఛక్తి వినియోగం ప్రాతిపదికగా అంచనా వేస్తారు. మన దేశం విద్యుచ్ఛక్తి వినియోగంలో 150వ స్థానంలో ఉంది. చైనా 80, రష్యా 26, జపాన్ 19, అమెరికా 11 స్థానాల్లో ఉన్నాయి. మన దేశ సగటు విద్యుచ్ఛక్తి వినియోగం పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే 14 రెట్లు తక్కువ.
ప్రస్తుతం సగటున 650-700 kwh విద్యుచ్ఛక్తి వినియోగిస్తుంది. కనీసం 5000 kwh వినియోగ స్థాయికి చేరుకుంటే ఆమోదయోగ్యమైన ప్రగతి సాధించడానికి వీలవుతుంది. దేశంలో 1947లో కేవలం 1,400 MW విద్యుచ్ఛక్తి ఉత్పత్తి అయ్యేది. ఇప్పుడది 1,63,670 MW స్థాయికి చేరుకుంది. ఇందులో నీటి ద్వారా 37,033 కగి ఉత్పత్తి అవుతోంది. బొగ్గు, సహజ వాయువు ద్వారా 1,05,647 MW, అణుశక్తి ద్వారా 4,560 కగి, సాంప్రదాయయేతర (వాయు, సౌర) పద్ధతుల ద్వారా 16,429 కగిఉత్పత్తి జరుగుతోంది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న విద్యుచ్ఛక్తిలో 40 శాతాన్ని ఉత్పత్తి చేసినప్పుడే భారతదేశంలోని 1.2 బిలియన్ ప్రజల అవసరాలను తీర్చడానికి వీలవుతుంది . దేశంలో ఎక్కువ శాతం విద్యుత్ ఉత్పత్తి బొగ్గు, సహజ వాయువుల ద్వారా జరుగుతుంది.
అయితే బొగ్గు నిల్వలు 11 సంవత్సరాల వరకు మాత్రమే సరిపోతాయి. నీటి ద్వారా ఐదు శాతం మేరకు మాత్రమే విద్యుచ్ఛక్తి ఉత్పత్తి అవుతుంది. సౌరశక్తి ద్వారా రెండు శాతం ఉత్పత్తి సాధ్యమవుతుంది. అణు శక్తిని పెంపొందిస్తే కనీసం 10 శాతం విద్యుచ్ఛక్తి అవసరాలు తీరుతాయని అంచనా.
అణుశక్తి ప్రమాదకరమైనదే కాకుండా.. ఖర్చుతో కూడుకుంది. కాబట్టి ప్రత్యామ్నాయ వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయాలని వాదించే వారి అభిప్రాయంలో.. సహజ వాయువు (Natural gas) మిగిలిన కర్బన పదార్థాకంటే మేలైంది. ఇది పుష్కలంగా లభించడమే కాకుండా... దీని ద్వారా బొగ్గు, అణు పద్ధతులకంటే తక్కువ నీటితో విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. దీనికి అవసరమైన అధునాతన సాంకేతిక పరిజ్ఞానం తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంది.
దీంతోపాటు బొగ్గు గనుల్లో లభించే కోల్ బెడ్ మీథేన్ అనే వాయువు గోండ్వానా ప్రాంతంలో ఒక ట్రిలియన్ క్యూబిక్ మీటర్లు లభిస్తుందని ఒక అంచనా. బొగ్గుకు ప్రత్యామ్నాయంగా సహజ వాయువు, మీధేన్ వాయువు.. విద్యుత్ అవసరాలను చాలా వరకు తీరుస్తాయనే వాదన ఉంది.
అంతేకాకుండా వీటి వల్ల సంభవించే పర్యావరణ కాలుష్యం చాలా తక్కువ. సాంప్రదాయేతర విద్యుత్ వనరుల మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం పవన విద్యుత్ (wind power) ద్వారా 20,000 MW నుంచి 45000 MW విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు. అదేవిధంగా సౌరశక్తి ద్వారా ఉత్పత్తికి కూడా అపారమైన అవకాశాలున్నాయి.
అయితే సౌరశక్తి ఫలకాల (Solar Photo Voltaic Cells) ఏర్పాటుకు 4.5 మిలియన్ హెక్టారుల భూమి కావాలి. పవన యంత్రాల (wind mills) ఏర్పాటుకు కూడా విశాలమైన ఆవరణ కావాలి. ఉత్పత్తి సామర్థ్యం నిలకడగా ఉండదు. వాయుపీడనం మీద ఇది ఆధారపడి ఉంటుంది. ఇన్ని పరిమితుల దృష్ట్యా అణుశక్తి మీద ఆధారపడక తప్పదని ఒక వాదన.
ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 16 శాతం విద్యుత్ ఉత్పత్తికి అణుశక్తి ఉపయోగపడుతోంది. ఫ్రాన్స్ దాదాపు 90 శాతం, జపాన్ 40 శాతం అణుశక్తిమీదనే ఆధారపడుతున్నాయి. బొగ్గు, పెట్రోలు వంటి ఇంధనాల వినియోగం వల్ల పర్యావరణానికి జరిగే హానితో పోల్చితే అణుశక్తి స్వచ్ఛమైంది.
చెర్నోబిల్, ఫుకిషిమా ఘటనల వల్ల జరిగిన/జరగబోతున్న హాని పరిమితమేనని ప్రఖ్యాత శాస్త్రవేత్త అనిల్ కకోద్కర్ అభిప్రాయం. సునామీ వల్ల మరణించిన ప్రజల సంఖ్య, ఆస్తి నష్టంతో పోల్చితే అణు ప్రమాదాల వల్ల జరిగిన నష్టం చాలా తక్కువ అని ఆయన వాదన.
భోపాల్ గ్యాస్ లీకు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య.. చెర్నోబిల్ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య కంటే ఎన్నో రెట్లు ఎక్కువ అని అణు విద్యుత్ ఉత్పత్తి మద్దతు దారుల వాదన.
భారతదేశం 2009లో అమెరికాతో కుదుర్చుకొన్న పౌర అణు సహకార ఒప్పందం (Civil nuclear cooperation agreement) కేవలం అమెరికా, ఫ్రాన్స్, జపాన్ దేశాల అణు రియాక్టర్ల పరిశ్రమలకు గిరాకీ కల్పించడానికే తప్ప.. భారత శక్తి అవసరాలను తీర్చడానికి ఉద్దేశించింది కాదని తీవ్ర విమర్శ నెలకొంది. ఇటీవల లిబియా, ఈజిప్టువంటి దేశాల్లో సంభవించిన రాజకీయ అనిశ్చిత పరిస్థితి ఇంధన రంగంలో సంక్షోభాన్ని తెచ్చింది.
70 శాతం ఇంధన అవసరాలు ‘మధ్య ప్రాచ్య ఆసియా, ఉత్తర ఆఫ్రికా దేశాల’ ద్వారానే తీరుతున్నాయి. క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ 100 డాలర్లు దాటిన ఈ నేపథ్యంలో వర్థమాన దేశమైన భారత్ ఆర్థిక పరిస్థితి అతలాకుతలమవుతుంది. దిగుమతుల మీద ఆధారపడేకంటే ఇంధన రంగంలో వీలైనంత వరకు స్వావలంబన సాధించడానికి ప్రయత్నించాలనీ, అందుకు అణు విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యతనివ్వడంలో తప్పు లేదని కొందరు మేధావుల అభిప్రాయం.
సంక్షోభం సంభవించినప్పుడు మనోధైర్యాన్ని కోల్పోకుండా ధ్రుడ విశ్వాసంతో దానికి ఎదుర్కొని, అధిగమించడమే ధీరోధాత్తత. జపాన్ వంటి దేశాలకు సహజ వనరులు అంతంతమాత్రమే కాబట్టి అణుశక్తి మీద ఆధారపడక తప్పదు అనే వాదనలో నిజమున్నప్పటికీ..రష్యా వంటి దేశం అపారమైన సహజ వాయువు, క్రూడ్ ఆయిల్ రిజర్వులు కలిగున్నప్పటికీ 10 శాతం ఇంధన అవసరాలను అణుశక్తి ద్వారా తీర్చుకుంటోంది.
భారతదేశం, ఒకవైపు సాంప్రదాయేతర ఇంధన ఉత్పత్తిని (సౌర, పవన, సహజవాయువు) ప్రోత్సహిస్తూనే, అణుశక్తి ఉత్పత్తికి తగిన ప్రాధాన్యతనివ్వడంలో తప్పులేదు. ఇంధన భద్రతను, వైవిధ్య వనరులను అభివృద్ధి పరచుకోవడం ద్వారా స్వావలంబన సాధించవచ్చు. ఇంధన ఉత్పత్తికి అభివృద్ధిపరచిన సాంకేతిక పరిజ్ఞానాన్ని రక్షణ రంగంలో కూడా వినియోగించుకోవచ్చు.
ఇంధన, రక్షణ రంగాల్లో స్వావలంబన సాధించినప్పుడే..దేశానికి నిజమైన భద్రత. సామాజిక సేవలందించడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నప్పుడు ఊహించని విపత్తులు సంభవిస్తాయి. అవి ప్రకృతి సిద్ధమైనవి (సునామీ; మానవ తప్పిదాల వల్ల చెర్నోబిల్ సంఘటనల వంటివి).
ఇలాంటి వాటి ఉపశమనానికి కొన్ని చర్యలు తీసుకోవచ్చు. అవి..
{పమాద అవకాశాలను సాధ్యమైనంతగా నివారించడం.
నివారణ వీలుకానప్పుడు.. కనీసం దాని ప్రభావాన్ని సాధ్యమైనంత మేర తగ్గించడం.
విపత్తు అనంతర పరిణామాలను ఎదుర్కోవడానికి సమాయత్తం కావడం.
భవిష్యత్తులో సంభవించే విపత్తులను ఎదుర్కోవడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించుకోవడం.
ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కి మూన్ అణుభద్రతకు సూచించిన అయిదు అంశాలను పాటించడం సముచితం. అవి..
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రస్తుతం అమల్లో ఉన్న భద్రతా ప్రమాణాలను సమీక్షించడం.
అంతర్జాతీయ అణు ఇంధన వ్యవస్థను పటిష్టం చేయడం.
{పకృతి సిద్ధమైన విపత్తులు అణుభద్రతను ప్రభావితం చేస్తాయనే అంశాన్ని క్షుణ్నంగా అధ్యయనం చేయడం.
అణుశక్తి ఉత్పత్తి విషయంలో వ్యయ-ప్రయోజన విశ్లేషణ (ఇౌట్టఛ్ఛ్ఛజజ్టీ ్చ్చడటజీట) చేసి ఉపద్రవాలు సంభవించినప్పుడు సత్వర చర్యలు తీసుకోవడానికి సిద్ధమవ్వడం.
అణు రక్షణ - అణు భద్రత (ఠఛ్ఛ్చిట ట్చజ్ఛ్టడ ్చఛీ ఠఛ్ఛ్చిట ట్ఛఛిఠటజ్టీడ) అనుసంధానించడం.
చైనాకు చెందిన ప్రఖ్యాత తత్వవేత్త వ్యాఖ్యానించినట్లు: జీవితంలో ఎప్పుడూ కిందపడకుండా ఉండటంలో గొప్పదనం లేదు. పడిన ప్రతిసారీ లేవడంలోనే ఉంది గొప్పదనం.
సునామీ, చెర్నోబిల్, ఫుకిషిమా అణు ప్రమాదాలు సంభవిస్తాయి. వాటిని పసిగట్టి, వీలైతే నివారించి, అనివార్యమైతే ఎదుర్కొని, సాధ్యమైనంత తక్కువ జన, ఆస్తి నష్టంతో బయటపడాలి.
ముఖ్యాంశాలు:
2052 నాటికి 208,000 మెగావాట్ల విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది
మన దేశం విద్యుచ్ఛక్తి వినియోగంలో 150వ స్థానంలో ఉంది
దేశంలో 1947లో కేవలం 1,400 MW విద్చుచ్ఛక్తి ఉత్పత్తి అయ్యేది. ఇప్పుడది 1,63,670 MW స్థాయికి చేరుకుంది.
సాంప్రదాయేతర విద్యుత్ వనరుల మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం పవన విద్యుత్ (wind power) ద్వారా 20,000 MW నుంచి 45000 MW విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు.
{పపంచంలో 70 శాతం ఇంధన అవసరాలు మధ్య ప్రాచ్య ఆసియా, ఉత్తర ఆఫ్రికా దేశాల ద్వారానే తీరుతున్నాయి.
{పపంచ వ్యాప్తంగా 16 శాతం విద్యుత్ ఉత్పత్తికి అణుశక్తి ఉపయోగపడుతోంది. ఫ్రాన్స్ దాదాపు 90 శాతం, జపాన్ 40 శాతం అణుశక్తిమీదనే ఆధారపడుతున్నాయి. రష్యా 10 శాతం ఇంధన అవసరా లను అణు శక్తి ద్వారానే తీర్చుకుంటోంది.

జన గణన 2011.. విశేషాలు, వివరాలు..
భారతదేశ జనాభా 121 కోట్లకు చేరింది. ఇది అమెరికా, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, జపాన్ దేశాల మొత్తం జనాభాకు సమానం. 2011 జనగణన వివరాల ప్రకారం.. గత పదేళ్లలో దేశ జనాభా 18.1 కోట్లు పెరిగింది.
1911-21 దశాబ్దాన్ని మినహాయిస్తే.. వృద్ధి రేటు తగ్గడం దేశంలో ఇదే తొలిసారి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో.. 19.9 కోట్లతో ఉత్తరప్రదేశ్ దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రంగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానంలో ఉండగా.. కేవలం 64,429 మంది జనాభాతో లక్షదీవులు అట్టడుగు స్థానంలో ఉంది.
స్వదేశీ మార్కెట్ పరిమాణాన్ని నిర్ణయించడంలో ఒక ముఖ్య కారకం జనాభా. సాపేక్షికంగా ఆర్థికాభివృద్ధి ఎక్కువగా ఉన్నప్పటికీ.. చైనా, భారత్‌లలో జనాభా కూడా అధికంగా ఉండడంతోపాటు అంతే స్థాయిలో మార్కెట్లు కూడా విస్తరించాయి. దీంతో బహుళజాతి సంస్థలు ఈ దేశాల్లోని మార్కెట్లలో ప్రవేశించడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తున్నాయి.
21వ శతాబ్దం ప్రారంభంలో ప్రపంచ జనాభా 6.1 బిలియన్లు కాగా.. అది 2007లో 6.6 బిలియన్లకు చేరుకుంది. 2010లో 6.9 బిలియన్లకు పెరిగింది. 2015 నాటికి 7.2 బిలియన్లకు, 2050 నాటికి 9.3 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా. ప్రపంచంలోని మొత్తం జనాభాలో 90 శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే నివసిస్తున్నారు. 2001లో భారత్ జనాభా 1,028, 737,436 నుంచి 2011లో 1,210,193,422 కు పెరిగింది.
ప్రపంచ జనాభాలో భారత్:
ప్రస్తుత భారతదేశ మొత్తం జనాభా..అమెరికా, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, జపాన్ దేశాల మొత్తం జనాభాకు సమానం. ఈ ఆరు దేశాల మొత్తం జనాభా 1214.3 మిలియన్లు కాగా భారత్ జనాభా 2011 లెక్కల ప్రకారం.. 1210.2 మిలియన్లు. చైనా, భారత్ జనాభాలోని తేడా 2001లో 238 మిలియన్లు. 2011లో ఈ వ్యత్యాసం 131 మిలియన్లకు తగ్గింది.
ప్రపంచంలోని మొత్తం జనాభాలో 19.4 శాతం చైనాలో, 17.5 శాతం భారత్‌లో నివసిస్తున్నారు. భారత్, అమెరికా జనాభాలోని తేడా 2001లో 741 మిలియన్లు ఇది 2011 నాటికి 902 మిలియన్లకు పెరిగింది. 2000-10 మధ్య కాలంలో ప్రపంచ జనాభావృద్ధి 1.23 శాతంగా ఉంటుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. ఐక్యరాజ్య సమితి అభిప్రాయంలో ఇదే కాలానికి సంబంధించి చైనాలో జనాభా వృద్ధి 0.53 శాతం. భారత్‌లో వృద్ధి 1.64 శాతం.
20వ శతాబ్దం ప్రారంభంలో భారత్ జనాభా 238.4 మిలియన్లు. గత 110 సంవత్సరాల కాలంలో భారతదేశ జనాభా 4 రెట్లు పెరిగి.. 2011లో 1210 మిలియన్లకు చేరుకుంది. 20వ శతాబ్దం ప్రథమార్థంలో జనాభా ఒకటిన్నర రెట్లు, ద్వితీయార్థంలో మూడు రెట్లు పెరిగింది. స్వాతంత్య్రానంతరం దశాబ్దపు జనాభా వృద్ధి 1981-91 మధ్య 23.87 శాతం నుంచి 1991-2001 మధ్య 21.54కు తగ్గి 2001-2011 మధ్య 17.64 శాతానికి చేరుకుంది.
జనాభా-రాష్ట్రాలు:
దేశంలో అధిక జనాభా కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఈ రాష్ట్ర జనాభా బ్రెజిల్ దేశ జనాభాకు సమానం. ఉత్తరప్రదేశ్, మహారాష్టల్ర జనాభా కలిపితే 312 మిలియన్లు. ఈ మొత్తం అమెరికాలో నివసించే జనాభా కంటే ఎక్కువ కావడం గమనార్హం. దేశంలోని 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు 10 మిలియన్ల కంటే ఎక్కువజనాభా కలిగి ఉన్నాయి. మరోవైపు దేశంలోని 5 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని జనాభా ఒక మిలియన్‌కు చేరుకునే అవకాశం ఉంది.
1991-2001 కాలంలో ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌లలో దశాబ్దపు జనాభా వృద్ధి శాతం ఎక్కువగా ఉంది. కాగా 2001-11 మధ్య ఈ వృద్ధి శాతం తగ్గింది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ తగ్గుదల స్వల్పంగా 3.5 శాతంగా ఉంది. మహారాష్టల్రో 6.7 శాతం, తమిళనాడులో 3.9 శాతం కాగా పుదుచ్చేరిలో అత్యధికంగా 7.1 శాతంగా నమోదైంది.
చిన్న రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి దాద్రానగర్ హవేలీ, డామన్-డయ్యూల్లో ఈ వృద్ధి 5.3 శాతం కంటే ఎక్కువగా ఉంది. లక్షద్వీప్, అండమాన్-నికోబార్ దీవులు, గోవాలలో ఈ వృద్ధి సింగిల్ డిజిట్‌కు పరిమితమైంది. కాగా నాగాలాండ్‌లో మాత్రమే ఈ అంశానికి సంబంధించి రుణాత్మక వృద్ధి నమోదైంది.
కేరళలో జనాభా వృద్ధి 1961-71 మధ్య 26.29 శాతం కాగా 1991-2001 మధ్య 9.43 శాతానికి పడిపోయింది. వివిధ కార్యక్రమాల ద్వారా 2001-11 మధ్య జనాభా వృద్ధి రేటును 4.9 శాతానికి పరిమితం చేసుకోగలిగింది. జనాభా వృద్ధి రేటు విషయంలో..40 సంవత్సరాల క్రితం కేరళ, తమిళనాడులలో నెలకొన్న స్థితి ప్రస్తుతం బీహార్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, రాజ స్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో కనిపిస్తోంది.
స్త్రీ-పురుష నిష్పత్తి:
దేశ స్వాతంత్య్రానంతరం సమాజంలో మహిళా ప్రాధాన్యత పెరిగింది. ఈ నేపథ్యంలో స్త్రీ-పురుష నిష్పత్తిలో పెరుగుదల ఉంటుందని భావించారు. కానీ దానికి భిన్నంగా మహారాష్ట్ర, గుజరాత్, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానాలలో ఈ నిష్పత్తి తగ్గింది. 1961 నుంచి కేరళలో స్ర్తీ-పురుష నిష్పత్తిలో మంచి పెరుగుదల కనిపించింది. 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల స్ర్తీ-పురుష నిష్పత్తి జాతీయ సగటు క ంటే ఎక్కువ.
జనాభా వృద్ధి రేటు తగ్గుదల:
భారత్‌లో స్వాతంత్య్రానంతరం ఆరోగ్య సౌకర్యాల విస్తరణతోపాటు అంటు వ్యాధులను పూర్తిగా అరికట్టడం వల్ల మరణాల రేటు తగ్గింది. 1950-51లో జననాల రేటు ప్రతి 1000 మందికి 39.9. కాగా మరణాల రేటు ప్రతి 1000 మందికి 27.4. మరణాల రేటు 2009 నాటికి ప్రతి 1000 మందికి 7.4 కు తగ్గింది. 1911-21 మధ్య కాలంలో జనన, మరణాల రేటు సమానంగా ఉండటంతో జనాభా పెరుగుదల సంభవించలేదు. గత 50 సంవత్సరాల కాలంగా శిశు మరణాల రేటులో తగ్గుదల నమోదైంది. 20వ శతాబ్దపు రెండో దశాబ్దంలో శిశు మరణాల రేటు ప్రతి 1000 జననాలకు 218 కాగా 2007 నాటికి 55కి తగ్గింది.
అవసరమైన ఆస్పత్రి సౌకర్యాలు లేకపోయినప్పటికీ, పేదరిక తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రసూతి మరణాల సంఖ్యలో తగ్గుదల నమోదు కావడం గమనార్హం. జననాల రేటు ప్రతి 1000 మందికి 1950-51లో 39.9గా ఉంది. కాగా ఈ రేటు 2008-09లో 22.8కి తగ్గింది. పెరుగుతున్న పట్టణీకరణ కూడా జనాభా వృద్ధి తగ్గడానికి ఒక రకంగా కారణమైందని చెప్పొచ్చు. జనాభా నియంత్రణలో భాగంగా కుటుంబ నియంత్రణ కార్యక్రమం ఎంతో ప్రాచుర్యం పొందింది.
చైనాలో జననాల రేటు ప్రతి 1000 మందికి 24 కాగా ప్రస్తుతం 12కు తగ్గించుకోగలిగింది. అక్కడ వివాహితులైన స్త్రీలలో 85 శాతం మంది గర్భనిరోధక సాధనాలు వినియోగిస్తున్నారు. మన దేశంలో వీరి శాతం 41 మాత్రమే. గర్భనిరోధక సాధనాల వినియోగంలో మన దేశం కంటే శ్రీలంక మెరుగైన స్థితిలో ఉంది. దాంతో ఆ దేశంలో జననాల రేటు 19కి తగ్గింది. కేరళ, తమిళనాడు, గోవా వంటి రాష్ట్రాలను మినహాయిస్తే.. మిగతా రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ పట్ల ఎక్కువ మంది ప్రజలకు అవగాహన లేదని చెప్పొచ్చు.
జనాభా వృద్ధి రేటులో తగ్గుదల గణనీయంగా ఉన్నప్పటికీ.. ప్రోత్సాహక విధానాల ద్వారా భవిష్యత్తులో ఈ వృద్ధిని తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నించాలి. మహిళా సాధికారత పెంపు, వివాహ వయసు పెంచడం, ఒకే బిడ్డ విధానం (వన్ చైల్డ్ నార్మ్) పాటించిన వారికి అనేక ప్రోత్సాహకాలు ప్రకటించడం, హెల్త్ వర్కర్లకు శిక్షణ ఇవ్వడం వంటి చర్యల ద్వారా జనాభా వృద్ధి రేటును నియంత్రించవచ్చు. దేశంలో జనాభా వృద్ధి రేటులో తగ్గుదల నమోదుకావడం వల్ల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. అంతేకాకుండా ప్రభుత్వ ఆర్థిక స్థితి మెరుగుపడగలదని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యాంశాలు:
1950లో ప్రపంచ జనాభాలో చైనా జనాభా 22 శాతం కాగా భారత్ వాటా 14.2 శాతం.
ప్రపంచ విస్తీర్ణంలో భారత్ వాటా 2.4 శాతం. జనాభా వాటా 17.5 శాతం.
ప్రపంచ విస్తీర్ణంలో అమెరికా వాటా 7.2 శాతం. జనాభా వాటా 4.5 శాతం.
2001-11 మధ్య కాలంలో భారత్‌లో జనాభా పెరుగుదల 181 మిలియన్లు.
భారతదేశ జనాభాలో ఉత్తరప్రదేశ్ శాతం 16. అంధ్రప్రదేశ్ జనాభా ఏడు శాతం.
2000-10 మధ్య కాలంలో ప్రపంచ జనాభా వృద్ధి 1.23 శాతంగా ఉండగలదని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.
ప్రపంచంలో జనాభా పరంగా ఐదో పెద్ద దేశం బ్రెజిల్.
199.6 మిలియన ్ల జనాభాతో ఉత్తరప్రదేశ్ దేశంలో మొదటి స్థానంలో నిలిచింది.
తర్వాతి స్థానాల్లో వరుసగా మహారాష్ట్ర (112.4 మిలియన్లు), బీహార్ (103.8 మిలియన్లు), పశ్చిమ బెంగాల్ (91.3 మిలియన్లు), ఆంధ్రప్రదేశ్ (84.7 మిలియన్లు) ఉన్నాయి.
నాగాలాండ్ రాష్ట్రంలో మాత్రమే దశాబ్దపు జనాభావృద్ధి శాతం పరంగా రుణాత్మకం.
డామన్-డయ్యూలో స్ర్తీ-పురుష నిష్పత్తి 618:1000
కేరళలో స్ర్తీ-పురుష నిష్పత్తి 1084:1000
భారత్ జనాభాలో 0-6 వయో వర్గం 13.2 శాతం
భారత్‌లో అక్షరాస్యత 74.04 శాతం. కాగా పురుషుల అక్షరాస్యత రేటు 82.14 శాతం, స్ర్తీల అక్షరాస్యత రేటు 65.46 శాతం.

బౌద్ధ మత ఆవిర్భావం.. తదనంతర పరిణామాలు
సివిల్స్ ఎగ్జామినేషన్ మొదలు గ్రూప్-1, 2 ఇలా అన్ని పోటీ పరీక్షలో చరిత్ర విభాగం నుంచి మతాలు, వాటి తీరు, మనుగడ వంటి అంశాలపై ప్రశ్నలు తప్పకుండా ఉంటాయి. కాబట్టి ఈ అంశాలపై అవగాహన ఉండటం అభ్యర్థులకు తప్పనిసరి. ఈ క్రమంలో బౌద్ధమతం గురించి వివరాలు..
క్రీస్తు పూర్వం ఆరో శతాబ్ధంలో ఆవిర్భవించిన నూతన మతాల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన మతం బౌద్ధం. ఉత్తర భారత దేశంలో సాంఘిక, ఆర్థిక జీవనంలో చోటు చేసుకున్న మార్పులు, వైదిక కర్మకాండల పట్ల వ్యక్తమైన నిరసనల నేపథ్యంలో ఆవిర్భవించిన బౌద్ధం..దేశ మంతటా విస్తరించింది. మన పొరుగు దేశాలకు కూడా విస్తరించింది ఆసియా ఖండంలో ఒక బలమైన తాత్విక సాంప్రదాయంగా స్థిరపడటం విశేషం.
బుద్ధుని జీవిత క్రమం:
క్రీస్తు పూర్వం 563లో కపిలవస్తు నగర సమీపంలోని ‘లుంబినీ’గ్రామం (ప్రస్తుత నేపాల్‌లోని ప్రాంతం)లో జన్మించిన బుద్ధుడి అసలు పేరు సిద్ధార్ధుడు. శాక్య తెగను పాలిస్తున్న శుద్ధోధనుడు ఇతని తండ్రి. మహామాయ తల్లి.
ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం.. చిరు ప్రాయంలోనే ‘యశోధర’ అనే సమీప బంధువును పెళ్లి చేసుకున్న సిద్ధార్ధుడికి.. కొంతకాలం గృహస్థు జీవనం సాగించాక తీవ్ర అశాంతి ఏర్పడింది. ఒక రోజు చెన్నుడి సారథ్యంలో రథంలో విహరిస్తున్న సిద్ధార్ధుడికి కనిపించిన దృశ్యాలు (వృద్ధుడు, రోగి, శవయాత్ర) అతణ్ని తీవ్రంగా కలచివేశాయి. తర్వాత కనిపించిన నాలుగో దృశ్యం.. ప్రశాంత వదనంతో, అలౌకిక ఆనందంతో సంచరిస్తున్న సన్యాసి.
ఈ నాలుగు దృశ్యాలు సిద్ధార్ధుడికి దిశానిర్దేశం చేశాయి. ఈ నేపథ్యంలోనే యశోధర ‘రాహులుడికి’ జన్మనిచ్చింది. కుమారుడి జన్మదినాన సిద్ధార్ధుడు తన 29వ ఏటా రాజ్యా న్ని కుటుంబాన్ని విడిచి సన్యాసిగా మారాడు. తన యజమాని వియోగాన్ని తట్టుకోలేని ప్రియ అశ్వం ‘కంథక’ మరణించింది. సిద్ధార్ధుడు ఇల్లు విడిచి వెళ్లటాన్నే బౌద్ధులు ‘మహాభినిష్ర్కమణ’ అని వ్యవహరిస్తారు.
ఆ తర్వాత సిద్ధార్ధుడు ‘ఆలార కాలామ’ అనే గురువు వద్ద ధ్యాన సాధనలో శిక్షణ పొందాడు. తదనంతరం అయిదుగురు సన్యాసులతో కలసి కఠోర సాధనలు చేస్తూ.. శరీరాన్ని శుష్కింప చేసుకున్నాడు. కానీ ఆ సాధనల వల్ల ప్రయోజనం లేదని తెలుసుకుని మళ్లీ ఆహారాన్ని తీసుకున్నాడు. శారీరక బలాన్ని పొందాడు.
35వ ఏటా మగధను బింబిసారుడు పాలిస్తున్న కాలంలో గయ పట్టణ శివార్లలో, ‘సుజాత’ అనే పల్లెపడుచు తెచ్చిన ఆహారాన్ని స్వీకరించాక, ఒక పెద్ద బోధి వృక్షం కింద ధ్యాన నిమగ్నుడయ్యాడు. 49 రోజుల ధ్యానం తర్వాత సిద్ధార్ధుడికి జ్ఞానోదయం కలిగింది. దాని ఫలితమే సిద్ధార్ధుడు బుద్ధుడిగా మారడం. ఆ తర్వాత సారనాథ్‌లోని హరిణవనంలో ఒకప్పటి తన అయిదుగురు సహచరులకు తాను పొందిన జ్ఞానాన్ని ఉపదేశించాడు. దీనినే ‘ధర్మ చక్ర ప్రవర్తన’ అంటారు.
క్రమంగా బుద్ధుడి బోధనలు ప్రచారం పొందుతూ, ఎందరినో ఆకర్షించాయి. అ క్రమంలోనే బౌద్ధ సంఘం ఏర్పడింది. ఆ విధంగా 40 సంవత్సరాలకు పైగా బుద్ధుడు ధర్మ ప్రచారం చేశాడు. చివరికి 80వ ఏటా క్రీస్తు పూర్వం 483లో కుసీనగర్ అనే ప్రాంతంలో మరణించాడు. ఈ సంఘటననే బౌద్ధ పరిభాషలో ‘మహా పరినిర్వాణ’గా వ్యవహరిస్తారు.
బుద్ధుని బోధనలు:
తన సమకాలీన వాస్తవికతను సవ్యంగా అవగాహన చేసుకుని, దానిని సంస్కరించే ప్రయత్నం చేశాడు బుద్ధుడు. ఆత్మ, బ్రహ్మల గురించి నడుస్తున్న రాద్ధాంతాలను పట్టించుకోలేదు. నాలుగు గొప్ప సత్యాలను గుర్తించాడు. అవి..
1. పపంచం దుఃఖమయం
2. దుఃఖానికి మూలం కోరిక
3. కోరికలను జయిస్తే దుఃఖం నివారణై నిర్వాణం సిద్ధిస్తుంది.
4. దుఃఖాన్ని నివారించేందుకు అష్టాంగ మార్గాన్ని అనుసరించాలి.
అష్టాంగ మార్గం:
1. సమ్యక్ దృష్టి
2. సమ్యక్ నిశ్చయం
3. సమ్యక్ వాక్కు
4. సమ్యక్ క్రియ
5. సమ్యక్ జీవనం
6. సమ్యక్ సాధన
7. సమ్యక్ స్మృతి
8. సమ్యక్ సమాధి
ఈ ఎనిమిది సూత్రాలు అవగతం చేసుకుని, ఆచరించిన వ్యక్తికి ‘నిర్వాణం’ సిద్ధిస్తుంది. అంటే జనన మరణ చక్రం నుంచి విముక్తి. బుద్ధుడు విలాస జీవనాన్ని, కఠోర క్రమశిక్షణను తిరస్కరించాడు. బౌద్ధం అన్నింటిలోనూ ‘మితం’గా ఉండటం వల్లే ఎక్కువ ప్రాచుర్యాన్ని పొందింది. బుద్ధుడు తన అనుచరులకు కొన్ని సాంఘిక ప్రవర్తన నియమాలను రూపొందించాడు. అవి..
1. ఇతరుల ఆస్తిని ఆశించకూడదు.
2. అహింసను పాటించాలి
3. మత్తు పదార్థాలు సేవించకూడదు.
4. అబద్ధాలు ఆడరాదు.
5. అవినీతి చర్యలకు పాల్పడకూడదు.
బుద్ధుని జీవితానికి సంబంధించి అయిదు ప్రధాన ఘట్టాలను బౌద్ధులు పంచకళ్యాణులుగా భావిస్తారు. అవి..
1. బుద్ధుడి జననం 2. మహాభినిష్ర్కమణం 3. సంబోధి (బుద్ధుడికి జ్ఞానోదయం కలగడం) 4. ధర్మచక్ర ప్రవర్తన 5. మహా పరినిర్వాణం
బౌద్ధ సంగీతులు:
బౌద్ధ సంఘంలోని సైద్ధాంతిక వాదోపవాదాలను పరిష్కరించుకునేందుకు జరిగిన సమావేశాలనే ‘సంగీతుల’అని వ్యవహరించే వారు.
మొదటి సంగీతి: బుద్ధుని మరణానంతరం అజాత శత్రువు పాలనా కాలంలో క్రీస్తు పూర్వం 483లో ‘రాజగృహ’ సమీపంలో మహాకస్యపుడి అధ్యక్షతన జరిగింది. బుద్ధుని శిష్యుల్లో ముఖ్యుడైన ఉపాలి ‘వినయ పీటిక’ను, ఆనందుడు ‘సుత్త పీటిక’ను క్రోడీకరించారు.
రెండో సంగీతి: బుద్ధుడు మరణించిన వందేళ్లకు అంటే క్రీస్తు పూర్వం 383లో వైశాలిలో ‘సబకామి’ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో బౌద్ధ సంఘం ‘స్థవిరవాదులు’, ‘మహాసాంఘికులు’గా చీలింది.
మూడో సంగీతి: అశోకుని పోషణలో పాటలీపుత్రంలో మొగలి పుత్తతిస్స అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో స్థవిరవాదులు పైచేయి చాటుకున్నారు. ఈ సమావేశంలోనే త్రిపీటికాల చివరి భాగం- అభిదమ్మ పీటికలోని ‘కథావత్తు’ సంకలనం చేశారు.
నాలుగో సంగీతి: కనిష్కుని కాలంలో కాశ్మీర్‌లో వసుమిత్రుడు, అశ్వఘోషుల అధ్యక్షతన జరిగింది. బౌద్ధ సంఘం హీనయాన, మహాయాన శాఖలుగా చీలింది.
బౌద్ధ మత సాహిత్యం:
వినయ పీటిక: బౌద్ధ సంఘ ప్రవర్తన, క్రమశిక్షణకు సంబంధించి బుద్ధుడు రూపొందించిన నియమావళి.
సుత్త పీటిక: త్రిపీటకాల్లో విస్తృతమైంది, ముఖ్యమైంది. దీనిలో అయిదు భాగాలున్నాయి. అవి..
1. దీర్ఘ నికాయ

2. మధ్యమ నికాయ
3. సంయుక్త నికాయ
4. అంగుత్తర నికాయ
5. ఖుద్దక నికాయ.
ప్రపంచ ప్రసిద్ధి పొందిన జాతక గాధలు ‘ఖుద్దక నికాయ’లోనే నిక్షిప్తమయ్యాయి.
అభిదమ్మ పీటిక: బౌద్ధులు వృద్ధి చేసిన అధిభౌతిక, మనస్తత్వ విజ్ఞానం ఇందులో సంకలనం చేశారు.
ఈ త్రిపీటకాలన్నీ పాలీ భాషలోనే ఉన్నాయి. క్రీస్తుశకం ఒకటో శతాబ్ధంలో ఆవిర్భవించిన ‘మహాయానం’ సంస్కృత భాషను స్వీకరించింది. మహాయానం ‘వైఫల్య సూత్రాలు’ పేరిట కొంత సాహిత్యాన్ని సృష్టించింది. అందులో ముఖ్యమైనవి..
అష్ట సహస్రిక ప్రజ్ఞా పారమిత, సద్ధర్మ పుండరీక, లలిత విస్తార.
బౌద్ధ మేధావులు: అశ్వఘోషుడు: కనిష్కుని సమకాలీనుడు. కవి, వాగ్గేయకారుడు, నాటక రచయిత, పండితుడు, మహా వక్త. ఈయన కాలినడకన పట్టణాలు, పల్లెలు సంచరించి బౌద్ధ మత ప్రచారం చేశాడు.
నాగార్జునుడు: యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో శ్రీపర్వతం (దీనికే నాగార్జున కొండ అని పేరు) వద్ద నివసించాడు. మాధ్యమిక వాదాన్ని ప్రవచించాడు. దీనికే శూన్యవాదం అని పేరు వచ్చింది.
అసంగుడు: నాలుగో శతాబ్ధంలో పంజాబ్ ప్రాంతంలో జీవించాడు. మైత్రేయనాధుడు స్థాపించిన యోగాచార లేదా విజ్ఞాన వాద శాఖను ప్రచారం చేశాడు.
వసుబంధుడు: అసంగుని సోదరుడు. ఇతడు రాసిన ‘అభిదమ్మ కోశ’ను బౌద్ధ విజ్ఞాన సర్వస్వంగా భావిస్తున్నారు.
బుద్ధఘోషుడు: అయిదో శతాబ్ధంలో జీవించిన పాలీ విద్వాంసుడు. ఇతడు రచించిన ‘విశుద్ధిమార్గ’ త్రిపీటకాలను అవగతం చేసుకునేందుకు కీలకమైంది.
అయిదో శతాబ్ధంలోనే జీవించిన బుద్ధపాలితుడు భావ వివేకుడు. నాగార్జునుడి ‘శూన్య వాదాన్ని’ విస్తృతపరిచారు. ఈ శతాబ్ధానికే చెందిన దిగ్నాశుడు తర్కంపై సుమారు వంద రచనలు చేసి ప్రసిద్ధి పొందాడు. ఏడో శతాబ్ధంలో జీవించిన ధర్మకీర్తి మరో గొప్ప తార్కికుడు. గాఢ తాత్విక చింతన, గతితర్కంతో ‘కాంట్ ఆఫ్ ఇండియా’ (Kant of India) గా ప్రశంసలు పొందాడు.
బౌద్ధ మత శాఖలు:
బుద్ధుడు జీవించినప్పుడు ఆయన బోధనలు అక్షరబద్ధం కాలేదు. దీంతో ఆయన మరణించాక తలెత్తిన విభేదాల కారణంగా బౌద్ధ మత సిద్ధాంతాలు, సూత్రాలు, బౌద్ధ సంఘం శాఖోపశాఖలుగా చీలింది.
బుద్ధుడు మరణించిన వందేళ్లకు జరిగిన రెండో సంగీతిలో బౌద్ధ సంఘం ‘స్థవిరవాద’, ‘మహా సాంఘిక’ శాఖలుగా చీలింది. అశోకుని కాలానికి బౌద్ధంలో 18 శాఖలు ఏర్పడినట్లు తెలుస్తోంది. వివాదాల పరిష్కారం కోసమే అశోకుడు మూడో సంగీతిని ఏర్పాటు చేశాడు. కనిష్కుని కాలానికి మహా సాంఘికులే ‘మహాయాన శాఖ’ఏర్పాటుకు కారణమయ్యారు.
మహాయానం:
మౌర్యానంతర యుగం (క్రీస్తు పూర్వం 200- క్రీశ 300) లో సంభవించిన సామాజిక పరిణామాలు మహాయాన ఆవిర్భావానికి దారి తీశాయి. ఎన్నో విదేశీ తెగలు బౌద్ధాన్ని స్వీకరించడం, బౌద్ధ సంఘంలో సంపద పేరుకుపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో ‘సంఘం’లో తలెత్తిన విభేదాలు మహాయానానికి దారి తీశాయి.
మహాయానం ‘బోధి సత్య భావన’కు విస్తృత ప్రచారం కల్పించింది. దానాలు చేసి పుణ్యం పొందొచ్చని, పుణ్యాన్ని బదిలీ చేయొచ్చని ప్రచారం చేసింది. మహా యానం బుద్ధుడిని దేవుడిగా మార్చింది. భారతదేశంలో విగ్రహారాధన ప్రబలమవడానికి మహాయానమే కారణం.
మహాయానం విపరీత పోకడలో వజ్రయానానికి దారితీసింది. వజ్రయానం బుద్ధుడికి తోడుగా ‘తారా’ అనే స్ర్తీ దేవతలను సృష్టించింది. లైంగిక సాధనల వంటి చర్యలతో బౌద్ధం ప్రతిష్ట మసకబారింది.
బౌద్ధమత ప్రాచుర్యం:
బౌద్ధమతంలోని నిరాడంబరత్వం సామాన్యులను విశేషంగా ఆకర్షించింది. వర్ణ వివక్షను నిరసించడం ద్వారా బ్రాహ్మణేతర వర్ణాల్లో విశేష ప్రాచుర్యం పొందింది. బుద్ధుని వ్యక్తిత్వం, సంభాషణ శైలి బౌద్ధానికి విశేష ప్రచారం తీసుకొచ్చాయి. బౌద్ధ సంఘం ఎంతో ఆసక్తితో, క్రమశిక్షణతో మత ప్రచారానికి పాటుపడింది. జన సమాన్యంలో ప్రచారంలో ‘పాలీ’ భాషను వినియోగించడం ద్వారా కూడా బౌద్ధం విశేష ప్రాచుర్యం పొందింది. ఇక, అశోకుడ, కనిష్కుడు, హర్షుడు వంటి చక్రవర్తులు కూడా ఆరాధించడం వల్ల ఉపఖండంతోపాటు, విదేశాలకూ సైతం బౌద్ధ మతం విస్తరించింది.
బౌద్ధమత క్షీణత:
క్రీస్తు శకం ఆరో శతాబ్ధం నాటికే బౌద్ధం క్షీణత ప్రారంభమైంది. క్రీస్తు శకం 12వ శతాబ్ధం నాటికి బౌద్ధం భారతదేశం నుంచి అంతర్ధానమైంది. ఒకప్పటి నిరాడంబరత్వాన్ని, మౌలిక సిద్ధాంతాలను బౌద్ధం విడిచిపెట్టడం, ‘పాలీ’ భాషకు బదులు సంస్కృతాన్ని స్వీకరించడం, బౌద్ధ సంఘం శాఖోపశాఖలుగా చీలిపోవడం.. శంకరాచార్య, కుమారభట్టు తదితరులు హిందూమతాన్ని సంస్కరించి, శక్తిమంతం చేయడం, బౌద్ధంపై అన్యమతస్తుల (ముఖ్యంగా శైవులు) దాడులు.. వంటి ఎన్నో కారణాలతో బౌద్ధం క్షీణించింది.
20వ శతాబ్ధంలో డా॥బి.ఆర్. అంబేద్కర్ బౌద్ధాన్ని స్వీకరించి, గొప్ప సమతా సిద్ధాంతంగా, ప్రజాస్వామిక భావనగా బౌద్ధానికి తిరిగి ప్రచారం కల్పించడంలో సఫలమయ్యాడు.
వి. శివాజీ
చరిత్ర అధ్యాపకులు

గ్రూప్-2కు ప్రిపేరయ్యే విద్యార్థులు గ్రూప్-1 మెయిన్స్‌కు కూడా క్వాలిఫై అయ్యారా?
పేపర్- 3
సెక్షన్-1 - ఇండియన్ ఎకానమీ
సెక్షన్-2 - ఏపీ ఎకానమీ
ప్రశ్నలు: 150 మార్కులు: 150
సమయం: రెండున్నర గంటలు
సిలబస్ విస్తృతంగా ఉండి.. అభ్యర్థుల గ్రాహణ శక్తిని పరీక్షించే పేపర్ ఇది. ముఖ్యంగా ఇండియన్ ఎకానమీకి సంబంధించి విస్తృత అధ్యయనం అవసరం.
విస్తృత అధ్యయనం క్రమంలో నిర్దేశిత సిలబస్ ప్రకారం ఒక క్రమ పద్ధతిలో ప్రిపరేషన్ సాగించాలి. ఈ క్రమంలో..
పణాళికా యుగం - ప్రణాళికల ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఆయా ప్రణాళికలు- వాటి కాల వ్యవధి- నిర్దేశిత లక్ష్యాలు- సాధించిన లక్ష్యాలు- విజయాలు- వైఫల్యాలు, కారణాలు వంటి వాటిపై పరిజ్ఞానం సొంతం చేసుకోవాలి.
సంస్కరణల ముందు, తర్వాతి కాలాల్లో ఆయా రంగాలకు సంబంధించిన మార్పులను బేరీజు వేస్తూ ప్రిపరేషన్ సాగించాలి.
దేశంలో పన్నుల వ్యవస్థ, వ్యయ-ఆదాయ రాబడుల ధోరణులు, వ్యవసాయ విధానాలు, పారిశ్రామిక ప్రగతి సూచీల సమాచారం సొంతం చేసుకోవాలి.
బ్యాంకింగ్ రంగంపైనా ప్రత్యేక దృష్టి సారించాలి. ఈ క్రమంలో ఆర్‌బీఐ ద్రవ్య విధానం- లక్ష్యాలు- గణాంకాలు; పరపతి నియంత్రణకు తీసుకునే పరిణామాత్మక, గుణాత్మక చర్యలు, ద్రవ్యోల్బణ నివారణకు తీసుకునే చర్యలు తదితర అంశాలపై పట్టు సాధించాలి. వాణిజ్య బ్యాంకుల పరపతి సృష్టి- ఏర్పడిన అడ్డంకులు ఔపోసన పట్టాలి.
భారత వ్యవసాయ విధానం-2000; లక్ష్యాలు- ప్రగతి వివరాలు సేకరించాలి.
ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే భౌగోళిక అంశాలపైనా పట్టు సాధించాలి.
ఈ క్రమంలో జనాభా- వృద్ధి; వృత్తి పరంగా విభజన; మేథో వలస; ఆయా రంగాలపై ఆధారపడిన జనాభా గణాంకాలు; సహజ వనరులు- ఆర్థికాభివృద్ధిలో వాటి పాత్రకు సంబంధించి సమాచారంపైనా పట్టు సాధించాలి.
అల్పాభివృద్ధి దేశాల లక్ష ణాలు; ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి పదాల మధ్య తేడా- వాటిని గణించే విధానం
వృద్ధి వ్యూహాల్లో భాగంగా హరాడ్ డోమార్, రాబిన్ సన్, ఫెయ్న్రి, కాల్డర్, హిక్స్ అండ్ హాన్‌సన్, లెబన్ స్టీస్ వృద్ధి సిద్ధాంతాల్లోని ముఖ్యాంశాలు చదవాలి.
గణాంక శాస్త్రానికి సంబంధించి అంక మధ్యమం, మధ్యగతం, బాహుళకం,గుణ మధ్యమం, హర మధ్య మం, సహ సంబంధ గుణకం, సూచీసంఖ్యలను పరిశీ లించాలి. లాస్పెయిర్, పాషే, బౌలీ, ఫిషర్, మార్షల్ ఎడ్జ్‌వర్త్ సూచీ సంఖ్యల గణన సూత్రాలు చదవాలి.
విభాగం-2 ఆంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యమిస్తూ గ్రామీణ సమాజంలో సమకాలీన సమస్యలు, పరిణామాలు:
ఈ విభాగానికి సంబంధించి అభ్యర్థులు ముఖ్యంగా.. రాష్ట్రంలో జిల్లాల వారీగా మానవాభివృద్ధి సూచీలలోని వివిధ అంశాలను పరిశీలించాలి. గత నాలుగు దశాబ్దాల్లో వ్యవసాయం; ఉపాధి పెరుగుదలకు అది తోడ్పడిన తీరుపై అవగాహన సాధించాలి.
దీంతోపాటు జాతీయాదాయంలో జీఎన్‌పీ, జీడీపీ, ఎన్‌ఎన్‌పీ, ఎన్‌డీపీ, ఎన్‌ఎన్‌పీ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, వృష్టి, వ్యయార్హ ఆదాయం; తలసరి ఆదాయాల కాన్సెప్ట్‌లు చదవాలి.
జాతీయాదాయంలో వివిధ రంగాల్లో వచ్చిన మార్పు లు; మానవాభివృద్ధి సూచీ; మానవ పేదరిక సూచీ; లింగ సంబంధ అభివృద్ధి సూచీ; లింగ సాధికారత సూచీలలో ముఖ్యాంశాల పరిశీలన- వాటిలో భారత్ స్థితి.
రాష్ట్రంలో ప్రణాళికల పనితీరు, వివిధ రంగాలకు కేటాయింపులు - వాటి ప్రాధాన్యం; వనరుల సేకరణ తీరు; ప్రణాళిక యుగంలో రాష్ట్రంలో ఏర్పడిన అభివృద్ధికి సంబంధించి గణాంక సహిత సమాచారంతో సిద్ధం కావాలి.
రాష్ట్రంలో భూ సంస్కరణలు, వ్యవసాయం, అడవులు, సహజ వనరులపై గణాంకాలు సేకరించాలి.
నీటిపారుదల వ్యవస్థ; సాగునీటి విస్తీర్ణం- పంటల తీరులో మార్పులు; వ్యవసాయ రంగంలో సంస్థాపరమైన, సంస్థాపరంకాని పరపతి ఆధారాలపై అవగాహన పొందాలి.
ఫ్యాక్టరీలు, చిన్న మధ్య తరహా పరిశ్రమల ఆవశ్యకత- వాటి సమస్యలు; సహకార వ్యవస్థ మౌలిక సూత్రాలు- కుంటుపడటానికి కారణాలు విశ్లేషిస్తూ సమాచార సేకరణ చేసుకోవాలి.
రాష్ట్ర అవతరణ తర్వాత పలు వ్యవసాయ ఉత్పత్తులు -ఉత్పాదకత పెరిగినా కొన్ని రాష్ట్రాలతో పోల్చితే తక్కువే. దీనికి కారణాలపై పంటల వారీ విశ్లేషణ సాగించాలి. మద్దతు, సేకరణ ధరల భావనలపై స్పష్టత అవసరం.
టైం మేనేజ్‌మెంట్
గ్రూప్-2 పరీక్షకు మరో అయిదు నెలల వ్యవధి అందుబాటులో ఉంది. కాబట్టి ఇప్పుడే ప్రిపరేషన్ మొదలుపెట్టిన వారు కూడా సరైన ప్రణాళికతో ప్రిపరేషన్ సాగిస్తే విజయం సులభంగానే సాధించవచ్చు.
ఈ క్రమంలో వారు టైం మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
మూడు పేపర్ల మధ్య సమన్వయం సాగిస్తూ ప్రిపేర్ కావాలి.
హిస్టరీ, పాలిటీ, ఇండియన్, ఏపీ ఎకానమీలు పేపర్-2, పేపర్-3 కోసం చదువుతారు. కాబట్టి జనరల్ స్టడీస్ పేపర్‌లో ఆయా అంశాల ప్రశ్నల విషయంలో ప్రత్యేకంగా శ్రమించక్కర్లేదు.
అయితే వీరు ప్రత్యేకంగా జాగ్రఫీ, మెంటల్ ఎబిలిటీ విషయాల కోసం ప్రిపరేషన్ సాగించాలి.
......................
మెయిన్స్‌కు కూడా క్వాలిఫై అయ్యారా?
గ్రూప్-2కు ప్రిపేరయ్యే విద్యార్థులు చాలా మంది గ్రూప్-1 మెయిన్స్‌కు కూడా ఉత్తీర్ణత సాధించారు. అటు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు.. గ్రూప్-2 తేదీల కంటే 20 రోజుల ముందుగా సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు నిర్వహించనున్నారు. దీంతో వారు ఒకేసారి రెండు పడవలపై ప్రయాణం చేయాల్సిన పరిస్థితి. అయితే సమన్వయంతో ముందుకు సాగితే ఈ రెండు పరీక్షలకు ఆశించిన రీతిలో సిద్ధం కావచ్చు.
గ్రూప్-1 మెయిన్స్ పేపర్-2.. గ్రూప్-2 పేపర్-2 రెండూ హిస్టరీ, పాలిటీకి సంబంధించినవే. వీటికి డిస్క్రిప్టివ్ విధానంలో ప్రిపరేషన్ సాగిస్తే ఒకే సమయంలో రెండిటి సిలబస్ పూర్తి చేసుకోవచ్చు.
గ్రూప్-1 మెయిన్స్ పేపర్-3; గ్రూప్-2 పేపర్-3 ఎకానమీ సంబంధితం. దీనికి కూడా ఒకే సమయంలో ప్రిపరేషన్ సాగించొచ్చు.
అయితే అభ్యర్థులు కచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అంశం డిస్క్రిప్టివ్ తరహా ప్రిపరేషన్. ఇలా ప్రిపేర్ అవుతూ చదివిన అంశాలను నోట్స్ రూపంలో రాసుకుంటే.. అటు గ్రూప్-1 రివిజన్‌కు కూడా లాభిస్తుంది.
గ్రూప్-2 పేపర్-1 జనరల్ స్టడీస్‌లోని సైన్స్ అండ్ టెక్నాలజీ; కరెంట్ అఫైర్స్ సంబంధిత అంశాలపై పరిపూర్ణ సమాచారం సొంతం చేసుకుంటే గ్రూప్-1 మెయిన్స్ జనరల్ ఎస్సేకు కూడా లాభిస్తుంది.
గ్రూప్-1 మెయిన్స్‌కు క్వాలిఫై అయిన అభ్యర్థులు ప్రత్యేకంగా ప్రిపరేషన్ సాగించాల్సిన విభాగం డేటా ఇంటర్‌ప్రిటేషన్(పేపర్-5). దీన్ని దృష్టిలో ఉంచుకుని తమకున్న పరిజ్ఞానం ఆధారంగా సమయం కేటాయించుకోవాలి.

Subscribe to:
Posts (Atom)