కరెంట్ అఫైర్స్-నవంబరు-2010 సంచిక 1

1.మిస్ వరల్డ్‌గా అలెగ్జాండ్రియా
అమెరికాకు చెందిన అలె గ్జాండ్రియా మిల్స్ మిస్ వరల్డ్-2010గా ఎంపి కైంది. చైనాలోని శాన్యాలో అక్టోబర్ 30న జరిగిన పోటీలో మొదటి రన్న రప్‌గా మిస్ బోట్స్‌వానా ఎమ్మా పరీయస్, రెండో రన్నరప్‌గా మిస్ వెనెజులా ఆడ్రియానా వసినీ నిలిచారు. భారత్ తరఫున పాల్గొన్న మనస్వి మంగై టాప్-20లో కూడా చోటు దక్కిం చుకోలేక పోయింది.

భారత్ నుంచి ఇప్పటి వరకు ఐదు గురు మిస్ వరల్డ్ కీరిటాన్ని గెలుచుకున్నారు. వారు.. రీటా ఫారియా (1966), ఐశ్వర్య రాయ్ (1994), డయానా హైడన్ (1997), యుక్తా ముఖి (1999), ప్రియాంక చోప్రా (2000). భారత్‌తోపాటు వెనెజులాకు కూడా ఐదు సార్లు మిస్ వరల్డ్ కీరిటం దక్కింది.

2.సచిన్‌కు పీపుల్స్ చాయిస్ అవార్డు
భారత క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌కు ‘స్పోర్ట్స్ అండ్ పీపుల్స్ చాయిస్’ అవార్డు లభించింది. లండన్‌లో అక్టో బర్ 27న జరిగిన ఆసియా అవార్డుల ప్రదానోత్సవంలో ఈ పురస్కారాన్ని సచిన్‌కు బహుకరించారు.

3.ఇన్ఫోసిస్ అవార్డులు-2010
ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ ఐదు కేటగిరీల్లో ‘ఇన్ఫోసిస్ 2010’ అవార్డులను ప్రకటించింది. పురస్కారం కింద విజేతలకు * 50 లక్షల నగదును బహుకరిస్తారు.

మ్యాథమెటిక్స్: చంద్రశేఖర్ ఖేర్(యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా-నెంబర్ థియరీలో చేసిన కృషికి)
ఫిజిక్స్: సందీప్ త్రివేదీ(టీఐఎఫ్‌ఆర్‌లో రీసెర్చ్ ప్రొఫెసర్, సూపర్ స్ట్రింగ్ థియరీలో పజిల్స్ పరిష్కరించినందుకు)

ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్:అశుతోష్ శర్మ(కాన్పు ర్ ఐఐటీ ప్రొఫెసర్, మెటీరియల్ సైన్స్‌లో చేసిన కృషికి)

లైఫ్ సెన్సైస్: చేతన్.ఇ. చిట్నీస్ (లైబల్ మలేరియా వ్యాక్సిన్ అభివృద్ధి కోసం చేసిన కృషికి)

సోషల్ సెన్సైస్: అమిత్ బావిస్కర్ (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్‌గ్రోత్), నందినీ సుందర్(ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్)లకు సంయుక్తంగా.

4.అవినీతి సూచిలో భారత్‌కు 87వ స్థానం
ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసిన 2010 కరప్షన్ ఇండెక్స్ రిపోర్ట్‌లో భారత్ 3.3 స్కోర్‌తో 87వ స్థానంలో నిలిచింది. గతేడాది భారత్ స్థానం 84. అవినీతి స్థాయి, దాన్ని అరికట్టడంలో ప్రభుత్వ సామర్థ్యం ఆధారంగా 178 దేశాలకు ర్యాంకులు ప్రకటించారు. ఇందులో 9.3స్కోర్‌తో డెన్మార్క్ మొదటి స్థానంలో నిల్చింది.

న్యూజిలాండ్, సింగపూర్‌లు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. సున్న నుంచి పది వరకు తీసిన స్కేల్ ఆధారంగా కేటాయించిన ర్యాంకుల్లో.. సున్న పాయింట్లు పొందిన దేశం అత్యంత అవినీతి దేశంగా, పది పాయింట్లు సాధించిన దేశాన్ని అవినీతి తక్కువ ఉన్న దేశంగా పరిగణిస్తారు.

5.ప్రధాని విదేశీ పర్యటన
జపాన్
భారత ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ జపాన్ పర్యటనలో భాగంగా అక్టోబర్ 25న ఆ దేశ ప్రధాని నవాటో కాన్‌తో సమా వేశమయ్యారు. ద్వైపాక్షిక పౌర అణు సహకార ఒప్పందంపై చర్చలను వేగవంతం చేయాలని ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. కీలకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందమైన సమీకృత ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కూడా ఖరారైంది.

దీనివల్ల వచ్చే దశాబ్ద కాలంలో సుంకాలు 94 శాతం మేర తగ్గుతాయి.అయితే ఈ ఒప్పందాన్ని జపాన్ పార్లమెంట్ (డైట్) ఆమోదించాల్సి ఉంది. వీసా నిబంధన లను సడలించాలని ఇరు దేశాలు నిర్ణయిస్తూ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి.

మలేషియా పర్యటన
భారత ప్రధాని మన్మోహన్ సింగ్ పర్యటనలో భారత్- మలేషి యాల మధ్య అక్టోబర్ 27న ఆరు ఒప్పందాలు కుదిరాయి. ఇందులో 2011 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చే సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం(సీఈసీఏ) ప్రధానమైంది. సేవల మార్కె ట్‌లో అవకాశాల కల్పనకు ఇరు దేశాలు అంగీకరించాయి.

ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, టూరిజంలో పరస్పర సహకారం, గ్రీన్ టెక్నాలజీ, నీటి శుద్ధి, ఔషధ మొక్కలకు సంబంధించి పరిశోధన చేపట్టేందుకు మలేషియాలో ఉమ్మడి కేంద్రం ఏర్పాటు వంటి అంశాలపై కూడా ఇరు దేశాలు అవగాహనకు వచ్చాయి. ఇదే పర్యటనలో ప్రధాని మన్మోహన్ ‘లిటిల్ ఇండియా’పేరుతో బ్రిక్‌ఫీల్డ్స్‌లో నిర్మించిన భారతీయ షాపింగ్ మాల్‌ను కూడా ప్రారంభించారు.

హనోయ్‌లో..
వియత్నాం రాజధాని హనోయ్‌లో 17వ ఆగ్నేయాసియా (ఆసి యాన్) సదస్సు, ఐదో తూర్పు ఆసియా సదస్సులను నిర్వ హించారు. ఆసియాన్‌లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ.. సమర్థ ఆర్థిక సహకారానికి వస్తు వాణిజ్య ఒప్పందం మాదిరిగా సేవలు, పెట్టుబడుల ఒప్పందం పూర్తి కావలసిన అవసరముందని పేర్కొ న్నారు.

‘టువార్డ్స్ ఆసియాన్ కమ్యూ నిటీ: ఫ్రమ్ విజన్ టు యాక్షన్’ ఇతి వృత్తంతో నిర్వహించిన ఈ సదస్సు ప్రధానంగా శాంతి సుస్థిరత, సహకారం అభివృద్ధిపై దృష్టి సారించింది. తూర్పు ఆసియా సదస్సుకు అమెరికా, రష్యా లను ఆహ్వానించాలని కూడా నిర్ణయించారు. 1967 ఆగస్టు 8న ఏర్పాటైన ఆసియాన్‌లో ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, బ్రూనై, వియత్నాం, లావోపిడిఆర్, మయన్మార్, కాంబోడియా సభ్య దేశాలు.

తూర్పు ఆసియా సదస్సులో ప్రధాని మాట్లాడుతూ పారి శ్రామిక దేశాలు అనుసరిస్తున్న రక్షణాత్మక చర్యలను వ్యతిరేకిం చారు. 2005లో ఏర్పాటైన తూర్పు ఆసియా సదస్సులో 10 ఆసియా దేశాలతోపాటు భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సభ్య దేశాలు. ఈ సంద ర్భంగానే మన్మోహన్ చైనా ప్రధాని వెన్ జియబావోతో సమా వేశమయ్యారు.

6.చైనాలో వేగవంతమైన రైలు
ప్రపంచంలో అత్యంత వేగంగా నడిచే ‘సీఆర్‌హెచ్ 380’ అనే బుల్లెట్ రైలును చైనా అక్టోబర్ 26న ప్రారంభించింది. ఇది గంటకు సరాసరి 350 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుం ది. దీనిని షాంఘై-హాంగ్ జౌ మధ్య ప్రారంభించారు. ప్రస్తుతం చైనాలో 7431 కి.మీ. పరిధిలో హై స్పీడ్ రైల్వే నెట్‌వర్క్ ఉంది. దీన్ని 2020 నాటికి 16,000 కి.మీ. విస్త రించాలని చైనా భావిస్తోంది.

7.నిషాంత్ పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మానవ రహిత విమానం ‘నిషాంత్’ను బెంగళూరు సమీపాన గల కోలార్ వైమానిక క్షేత్రంలో అక్టోబర్ 29న విజయవంతంగా పరీక్షించారు. దీన్ని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) అనుబంధ సంస్థ ఎరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్(ఏడీఈ) అభివృద్ధి చేసింది.

8.కరణ్ సింగ్‌కు చైనా వర్సిటీ ప్రొఫెసర్ హోదా
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, భారత సాంస్కృతిక సంబంధాల మండలి (ఐసీసీఆర్) అధ్యక్షుడు కరణ్ సింగ్‌కు దక్షిణ చైనాలోని షెన్ ఝేన్ యూనివ ర్సిటీ గౌరవ ప్రొఫెసర్ హోదా కల్పిం చింది. ఈ వర్సిటీ 2008లో ఐసీసీఆర్ విజిటింగ్ చైర్‌ను ఏర్పాటు చేసింది.

9.వర్మ ‘బేస్’ జంప్ విజయవంతం
భారత సైన్యానికి చెందిన లెఫ్ట్‌నెంట్ కల్నల్ సత్యేంద్ర వర్మ దేశంలో మొదటి సారిగా బేస్ జంప్ నిర్వహించాడు. అక్టో బర్ 29 న్యూఢిల్లీలోని 235 మీటర్ల ఎత్తయిన పీతంపుర టీవీ టవర్ నుంచి ఈ సాహసం చేశాడు. బిల్డింగ్, ఏంటెన్నా, స్పాన్(వంతెన), ఎర్త్(కొండలు), నుంచి దూకే సాహస క్రీడను ‘బేస్’ జంప్ అంటారు. ఇందుకోసం ప్రత్యే కంగా రూపొందించిన పారాచూట్‌ను ఉపయోగిస్తారు.

10.సీఎస్‌సీపై భారత్ సంతకం
అనుబంధ పౌర అణు పరిహార ఒప్పం దం (సీఎస్‌సీ)పై వియన్నాలోని అంత ర్జాతీయ అణు ఇంధన సంస్థ(ఐఏఈ ఏ)లో భారత్ అక్టోబర్ 27న సంతకం చేసింది. దీంతో 2005 లో అమెరికాతో కుదిరిన అణు ఒప్పందానికి సంబంధించిన చివరి దశ పూర్తయింది. ఈ ఒప్పందం అమల్లోకి రావాలంటే.. నాలు గు లక్షల యూనిట్ల అణు సామర్థ్యమున్న కనీసం ఐదు దేశాలు దీన్ని ఆమోదించాలి. ఈ ఒప్పందాన్ని 1997లో ఐఏఈఏ రూపొందించింది.

11.సూపర్ కంప్యూటర్ ‘తియాన్ హి-1 ఎ’
చైనా సూపర్ కంప్యూటర్ ‘తియాన్ హి-1 ఎ’ ప్రపంచంలో అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్‌గా గుర్తింపు పొందింది. దీన్ని బీజింగ్ సమీపంలోని తియాన్‌జిన్ నేషనల్ సూపర్ కంప్యూటర్ సెంటర్‌లో అక్టోబర్ 27న ఆవిష్కరించారు. ఇది సెకన్‌కు 2.507 పెటాఫ్లాప్స్ వేగంతో పని చేస్తుంది (అంటే సెకన్‌కు 2,507 ట్రిలియన్ క్యాలిక్యు లేషన్లు).

12.ఢిల్లీలో అంతర్జాతీయ ఇంధన సదస్సు
ఢిల్లీలో అక్టోబర్ 27 నుంచి 29 వరకు నాలుగో అంతర్జాతీయ పునర్వినియోగ ఇంధన వనరుల అంతర్జాతీయ సదస్సు జరిగింది. పునర్వినియోగ ఇంధన సామర్థ్యం వినియోగించుకునేందుకు ప్రపంచ నాయకత్వం అవసరమని సదస్సు పేర్కొంది. శిలాజ ఇంధనాలపై ఆధారపడటం తగ్గించాలని, ఇంధనం అందుబాటు ధరల్లో ఉండాలని కూడా సదస్సు వ్యాఖ్యానించింది.

71 దేశాల నుంచి 9000 మంది ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సును భారత నూతన, పునర్వినియోగ ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ నిర్వహించింది. 2004లో బాన్ (జర్మనీ), 2005లో బీజింగ్, 2008లో వాషింగ్టన్ వేదికలుగా ఈ సదస్సులను నిర్వహించారు.

13.సహారా క్రీడా అవార్డులు
సహారా స్పోర్ట్స్ అవార్డుల ప్రదానోత్సవం అక్టోబర్ 30న ముంబైలో జరిగింది. ఇందులో సచిన్ టెండూల్కర్ ఈ ఏటి భారత క్రికెటర్‌తోపాటు ఈ శతాబ్ది మేటి ఆటగాడి అవార్డును కూడా అందుకున్నారు. ఉత్తమ మహిళా క్రికెటర్‌గా హైదరాబాద్‌కు చెందిన మిథాలీ రాజ్ ఎంపికయ్యారు. క్రికెటేతర క్రీడాంశాల్లో ఉత్తమ క్రీడాకారుడిగా హైదరాబాద్ షూటర్ గగన్ నారంగ్..మహిళల విభాగంలో దీపికా కుమారి (జార్ఖండ్-ఆర్చరీ) ఎంపిక య్యారు. యువ ప్రతిభావంతుడు పురస్కారం హైదరాబాదీ షూటర్ అషెర్ నోరియాకు దక్కింది.

No comments:

Post a Comment