ఒక అమూల్ కథ

Courtesy : Wikipedia

The Following article is directly lifted  from Telugu Wikipedia

అమూల్

ఆనంద్ లో అమూల్ కర్మాగారంలో కనపడుతున్న పాల గిడ్డంగులు
అమూల్ (ఆంగ్లం: Amul; సంస్కృతంలో "వెల లేనిది" అని అర్ధం. సంస్కృత పదము "అమూల్య," (విలువైనది అని అర్ధం) నుండి వచ్చిన "అమూల్" అను వ్యాపార నామమును ఆనంద్ లోని నాణ్యత నియంత్రణ నిపుణులు సూచించారు.)[1], 1946లో భారతదేశంలో స్థాపించబడిన ఒక పాడి పరిశ్రమ సహకార సంస్థ. ఈ వ్యాపార నామము అగ్ర సహకార సంస్థ అయిన గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ చేత నిర్వహించబడుతుంది. (GCMMF), ఈ సంస్థ ఈ రోజు భారతదేశంలోని గుజరాత్ లో దాదాపు 2.8 మిలియన్ల పాల ఉత్పత్తిదారులతో ఉమ్మడి యాజమాన్యమును కలిగివుంది[2].
అమూల్ గుజరాత్ లోని ఆనంద్ పట్టణంలో ఉంది, ఇది దీర్ఘ కాలంగా విజయవంతంగా నడుస్తున్న సహకార సంస్థలకు ఉదాహరణ. "గుజరాత్ లోని పాడి పరశ్రమ సహకార సంస్థలను చూసిన వారు ఎవరైనా ముఖ్యంగా అత్యంత విజయవంతంగా నడుస్తున్న AMUL వంటి దానిని చూసి అన్ని అభివృద్ధి విభాగాలలో వెయ్యి రెట్లు అభివృద్ధి చూపెడుతున్న ఇటువంటి సంస్థను అభివృద్ధి చేయుటకు ఏ విధమైన ప్రభావాలు మరియు ప్రోత్సాహకాలు అవసరము అయ్యాయి అని ఆశ్చర్యపోతారు."[3] అమూల్ పాటర్న్ గ్రామీణ అభివృద్ధికి మాత్రమే ఏకైక సముచితమైన నమూనా వలె స్థాపించబడినది. ప్రపంచంలోనే భారతదేశాన్ని పాలు మరియు పాల ఉత్పత్తులలో అతి పెద్ద ఉత్పత్తి దేశంగా నిలబెట్టిన శ్వేత విప్లవమునకు అమూల్ ప్రోత్సాహాన్ని ఇచ్చింది[citation needed]. ఇది ప్రపంచం యొక్క అతి పెద్ద శాఖాహార జున్ను ఉత్పత్తి. [4].
అమూల్ భారతదేశంలోని అతి పెద్ద ఆహార ఉత్పత్తి మరియు సంవత్సరానికి US $1050 మిలియన్ల (2006–07) కొనుగోళ్లను సాధిస్తున్న ప్రపంచం యొక్క అతిపెద్ద పాల సంచి ఉత్పత్తి (2006–07) [5]. ప్రస్తుతము GCMMF యొక్క సంఘాలు 2.8 మిలియన్ల ఉత్పత్తి సభ్యులతో ప్రతి రోజు సగటున 10.16 మిలియన్ లీటర్ల పాలను సమీకరిస్తున్నాయి. భారతదేశంలోనే కాకుండా అమూల్ మారిషస్, UAE, USA, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, చైనా, సింగపూర్, హాంగ్ కాంగ్ మరియు కొన్ని దక్షిణ ఆఫ్రికా దేశాలు వంటి దేశాల అంతర్జాతీయ వాణిజ్య కేంద్రాలలో కూడా ప్రవేశించింది. జపనీయుల వాణిజ్య కేంద్రంలో 1994లో ఈ సంస్థ పాలకు నిశ్చయించిన ధర లావాదేవీలు సఫలం కాలేదు, కాని ఇప్పుడు జపనీయుల వాణిజ్య కేంద్రంలో ప్రవేశించుటకు తిరిగి తాజా ప్రణాళికలు తయారు చేసుకుంది[6]. వీటిలో శ్రీలంక వంటి ఇతర సమర్ధవంతమైన వాణిజ్య కేంద్రాలు కూడా ఉన్నాయి.
డాక్టర్ వర్ఘీస్ కురియన్, GCMMF యొక్క మాజీ అధ్యక్షుడు అమూల్ విజయం వెనుక ఉన్న కీలకమైన వ్యక్తిగా గుర్తించారు. 2006 ఆగష్టు 10న బనస్కంట సంఘ అధ్యక్షుడైన పార్థి భాటోల్, GCMMF కి అధ్యక్షుడుగా ఎన్నికైనారు.

విషయ సూచిక

చరిత్ర

ది కైరా డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్' యూనియన్ ఆనంద్ అనే చిన్న పట్టణంలో నడుస్తున్న పాడి పరిశ్రమల వ్యాపారస్తులు లేదా ప్రతినిధుల చేత మధ్యంతర పాల ఉత్పత్తిదారుల తీవ్రమైన కృషికి ప్రతిస్పందనగా 1946 డిసెంబర్ 14న స్థాపించబడినది.(గుజరాత్ రాష్ట్రంలోని కైరా జిల్లాలో).[7] పాల ఉత్పతిదారులు పాలను అమ్ముకొనుటకు ఆనంద్ లో ఉన్న ఏకైక పాల కేంద్రం అయిన పోల్సన్ పాల కేంద్రంకు చాలా ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఉత్పత్తిదారులు పాలను విడిగా పాత్రలలో తీసుకొని వెళ్ళే సమయానికి ముఖ్యంగా వేసవి కాలంలో ఆ పాలు తరచూ పుల్లగా తయారయ్యేవి. ఈ ప్రతినిధులు పాల ఉత్పత్తిని బట్టి మరియు కాలమును బట్టి వారి ఇష్టానుసారంగా ధరలను నిర్ణయించేవారు. పాలు ప్రతి ఆవు లేదా గేదె నుండి రోజుకి రెండుసార్లు తీసుకొనే పదార్ధం. శీతాకాలంలో, ఉత్పత్తిదారుడు అధిక ఆదాయం పొందేవాడు లేదా మిగిలిపోయిన పాలతో తిరిగి వెళ్ళేవాడు లేదా పాలను తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వచ్చేది. కానీ అప్పటికి, ప్రభుత్వం పోల్సన్ పాల ఉత్పత్తి కేంద్రానికి(ఆ కాలంలో పోల్సన్ దేశంలోనే ప్రసిద్ధి పొందిన వెన్న ఉత్పత్తి) ఆనంద్ లోని పాలను సమీకరించి బొంబాయి నగరముకు పంపిణీ చేయుటకు గుత్తాధిపత్యంను ఇచ్చినది. 1946లో బ్రిటీషు ప్రభుత్వం పెట్టిన ఆంక్షల ఫలితంగా ప్రపంచంలోని పాల ఉత్పత్తి దేశాలలో భారతదేశం జాడ ఎక్కడా ఉండేది కాదు.
ఇది కపట మరియు యధేచ్చగా వ్యాపారం చేసుకుంటున్న వ్యాపారులకి ఆగ్రహాన్ని తెప్పించింది, ఈ వ్యాపారస్తులు అందరూ కలిసి స్థానిక వ్యాపార నాయకుడైన త్రిభువనదాస్ పటేల్ నాయకత్వంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ను సంప్రదించారు (ఈయన ఆ తరువాత కాలంలో స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి ఉప ప్రధానమంత్రి అయ్యారు). సర్దార్ పటేల్ వారికి ఒక సహకార సంఘంగా ఏర్పడి పాలను పోల్సన్ కి అమ్మే బదులు నేరుగా బొంబాయి మిల్క్ స్కీంకి అమ్ముకోమని సలహా ఇచ్చారు (ఆయన అలాగే చేసారు కాని ఉత్పత్తి దారులకి తక్కువ ధరలు చెల్లించారు).[8] ఆయన ఆ వ్యాపారస్తులను మధ్య సయోధ్యకు మొరార్జీ దేశాయ్ ని పంపారు. (తరువాత కాలంలో ఈయన భారత దేశానికి ప్రధాన మంత్రి అయ్యారు) 1946లో, ఆ ప్రదేశానికి చెందిన వ్యాపారస్తులు వారికి ఇక ముందు అన్యాయం జరగకుండా పాల సమ్మె చేసారు. అందువలన 1946లో కైరా జిల్లాలో పాలను సమీకరించి మరియు సంవిధానం చేయుటకు కైరా జిల్లా సహకార సంఘం స్థాపించబడినది. ఎక్కువ మంది పాల ఉత్పత్తిదారులు పరిమితంగా పాలను పోయగల స్థితిలో అనగా రోజుకి 1-2 లీటర్లను మాత్రమే పోయగల పరిస్థితిలో ఉండుట మూలంగా పాల సమీకరణ వికేంద్రీకరించబడినది. ఈ పరిమిత పాల ఉత్పత్తిదారులకు అనుకూలంగా ఆయా గ్రామాలలో గ్రామీణ స్థాయి సహకార సంఘాలు ఏర్పాటు చేసారు.
ఈ సహకార సంఘం ఆ తరువాత రోజులలో డాక్టర్ వి కురియన్ మరియు శ్రీ హెచ్ ఎమ్ దాలయ ల ఇద్దరి సారధ్యంలో నిర్వహించబడి అభివృద్ధి చెందినది. కైరా యొక్క మొట్ట మొదటి ఆధునిక పాడి పరిశ్రమ కైరా యూనియన్ ఆనంద్ లో స్థాపించబడినది. సహకార సంఘంలో జరిపిన దేశవాళీ పరిశోధన మరియు అభివృద్ధి మరియు సాంకేతికాభివృద్ధి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఒక వాణిజ్య కొలమానం మీద గేదె పాల నుండి విజయవంతంగా వెన్న తీసిన పాల పొడి తయారు చేయుటకు దారి తీసింది.[citation needed]
ఈ పాడి పరిశ్రమ సహకార ఉద్యమం యొక్క విజయం గుజరాత్ అంతా వేగంగా వ్యాప్తి చెందింది. అతి కొద్ది కాలంలో ఐదు జిల్లా సంఘాలు ఏర్పాటు అయ్యాయి అవి - మెహ్సాన, బనస్కంట, బరోడా, సబర్కంట మరియు సూరత్. వాణిజ్య ప్రకటనల మీద ఖర్చును ఆదా చేస్తూ మరియు పాల సహకార సంఘాల మధ్య ఒకదాని వ్యతిరేకంగా ఒకటి పోటీ పడుటను నియంత్రిస్తూ సిబ్బందిని ఐక్యపరచుతూ మరియు వ్యాపారమును విస్తరించే క్రమములో గుజరాత్ లో పాడి పరిశ్రమ యొక్క సహకార సంఘాల అగ్ర వాణిజ్య సమాఖ్యను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోబడినది. అందువలన, 1973లో గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ స్థాపించబడినది. ది కైరా డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్’ యూనియన్ లిమిటెడ్, 1955లో స్థాపించిన వ్యాపార నామము అమూల్ ను GCMMF (AMUL)కు అప్పగించాలని నిర్ణయించుకుంది.
వరల్డ్ ఫుడ్ ప్రైజ్ మరియు మెగసెసే అవార్దు విజేత, భారతదేశ శ్వేత విప్లవ రూపశిల్పి అయిన డాక్టర్. వర్ఘీస్ కురియన్ భారతదేశాన్ని ప్రపంచంలోనే అధిక పాల ఉత్పత్తి దేశంగా ప్రసిద్ధి చెందేటట్లు కృషి చేశాడు.
అప్పటి భారతదేశ ప్రధాన మంత్రి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి 1964లో ఆనంద్ ని సందర్శించినపుడు కైరా జిల్లాలోని పాడి పరిశ్రమ సంఘాల అభివృద్ధిని మరియు విజయాన్ని చూసి ముగ్ధులై భారతదేశం అంతటా కూడా ఆనంద్ తరహా పాడి పరిశ్రమ సహకార సంఘాలను అభివృద్ధి చేయాలని అడిగారు. అందువలన, నేషనల్ డైరీ డెవలప్డ్ బోర్డ్ ఏర్పడి భారతదేశం అంతటా అమూల్ తరహా ఉత్పత్తిని అభివృద్ధి చేయుటకు ఆపరేషన్ ఫ్లడ్ రూపొందినది.[9]

GCMMF ఈరోజు

GCMMF భారతదేశం యొక్క అతి పెద్ద ఆహార ఉత్పత్తుల వాణిజ్య సంస్థ.[citation needed]. పాడి ఉత్పత్తి దారులకు ఆకర్షణీయమైన ఆదాయమును అందిస్తూ మరియు వినియోగదారుల అభిరుచికి సరిపడునట్లు నాణ్యమైన ఉత్పత్తులను సరసమైన ధరలకు అందించు లక్ష్యంతో ఏర్పాటైన ఈ సంస్థ రాష్ట్రస్థాయిలో గుజరాత్ లోని పాడి సహకార సంఘాల అగ్ర సమాఖ్య. GCMMF అమూల్ ఉత్పత్తి విక్రయాలను నిర్వహిస్తూ విస్తరిస్తుంది. 1990ల మధ్య నుండి అమూల్ దాని యొక్క మూల వాణిజ్యానికి ప్రత్యక్ష సంబంధం లేని విభాగాలలోనికి కూడా ప్రవేశించింది. ఐస్ క్రీం తయారీలో దీని ప్రవేశం విజయవంతమైనది, ఏవిధంగా అనగా ఇది అతి కొద్ది కాలంలోనే ప్రధానంగా ధరలో ఉన్న తేడా మరియు ప్రసిద్ధి చెందిన ఉత్పత్తి పేరుతో మార్కెట్లో అధిక వాటాను కైవశం చేసుకుంది. ఇది ఇంకా పిజ్జా వ్యాపారంలో కూడా ప్రవేశించింది, ఫలహారశాల యజమానులకి పిజ్జాను తయారు చేయుటకు అవసరమైన బేస్ అనబడే రొట్టెను మరియు పలు రకాల పిజ్జా తయారీలను అందిస్తూ ఇతర వ్యాపారాలు పిజ్జాకు 100 రూపాయల పైగా ధరను వసూలు చేస్తుండగా వీరు దాదాపు ఒక పిజ్జాకు 30 రూపాయల వరకు తక్కువ ధరకు అందించునట్లు సహాయపడుతుంది.

సంస్థ సమాచారం

గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్, ఆనంద్ (GCMMF) భారతదేశంలోనే అతి పెద్ద ఆహార ఉత్పత్తి వ్యాపార సంస్థ. ఇది గుజరాత్ యొక్క అగ్ర పాడి పరిశమ సంస్థ. పాడి పరిశ్రమ సహకార సంఘాలను నిర్వహించుటలో ఈ రాష్ట్రం ఆదర్శవంతమైనది, మరియు ఈ విజయము భారతదేశంలోని వారికే కాకుండా మిగిలిన ప్రపంచంలోని వారికి కూడా ఒక ఆదర్శమైన సంస్థ వలె అనుసరణీయంగా ఉంది. గత ఐదున్నర దశాబ్దాలలో, గుజరాత్ లోని పాడి పరిశ్రమ సహకార సంఘాలు 2.8 మిలియన్ల గ్రామీణ పాల ఉత్పత్తిదారులను భారతదేశం మరియు విదేశాలలోని వినియోగదారులను జిల్లా స్థాయిలో మరియు GCMMF రాష్ట్రస్థాయిలో 13 జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల సమాఖ్యలతో అనుసంధానమైన గ్రామీణ స్థాయి 13,141 గ్రామీణ పాడి పరిశ్రమ సంఘాలను(VDCS), ఒక సహకార వ్యవస్థ ద్వారా కలుపుతూ ఒక ఆర్ధిక వలయమును తయారు చేసాయి. ఈ సహకార సంఘాలు సగటున 7.5 బిలియన్ లీటర్ల పాలను ఉత్పత్తిదారుల సభ్యుల నుండి సమీకరిస్తుంది, ఈ ఉత్పత్తిదారులలో 70% వరకు చిన్న, మధ్య తరగతి వ్యవసాయదారులు మరియు భూమి లేని కూలీలు ఇంకా గిరిజన జాతులు మరియు షెడ్యూల్డ్ తరగతి ప్రజలు ఉంటారు.
GCMMF (AMUL) యొక్క 2008-09 వార్షిక చలామణి రు. 67.11 బిలియన్లు. ఉత్పత్తి నామముతో 30 పాడి పరిశ్రమ కర్మాగారాలలో పాల సమాఖ్యచేత ఉత్పత్తి అవుతున్న ఉత్పత్తుల యొక్క విక్రయాలను చేపడుతుంది. మొత్తం నాలుగు పాడి పరిశ్రమ కర్మాగారాలలో రోజుకి 1 మిలియన్ కన్నా ఎక్కువ సంవిధాన పరిమాణముతో ఈ కర్మాగారాల యొక్క మిశ్రమ సంవిధాన పరిమాణము రోజుకి 11.6 లీటర్లు. గుజరాత్ వ్యవసాయదారులు ఆసియాలోని ప్రసిద్ధ పాడి పరిశ్రమ కర్మాగారాన్ని సొంతం చేసుకున్నారు - మథర్ డైరీ, గాంధీ నగర్, గుజరాత్ - ఇది 2.5 మిలియన్ లీటర్ల తో 100 MTs పాల పొడిని ఒక రోజుకి తయారు చేస్తుంది. గత ఏడాది GCMMF యొక్క సభ్యుల సంఘాల నుండి 3.1 బిలియన్ లీటర్ల పాలను సమీకరించింది. పాలను పొడి చేయుటకు అధిక పరిమాణాలు, ఉత్పత్తి తయారీ మరియు పశువుల దాణా తయారీ వంటివి సిద్ధపరిచారు. దీని యొక్క అన్ని ఉత్పత్తులను పరిశుభ్రమైన పరిస్థితులలో తయారుచేస్తారు. అన్ని కర్మాగారాలు మరియు సమాఖ్యలు ISO 9001-2000, ISO 22000 మరియు HACCP దృవీకరణను పొందినవి. GCMMF (AMUL) యొక్క టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ (పూర్తి నాణ్యత నిర్వహణ) ఉత్పత్తి యొక్క నాణ్యతను మొదటి స్థానం నుండి (పాల ఉత్పత్తిదారుడు) నుండి మొదలుకొని అది వినియోగదారుడి చేరు వరకు మొత్తం నాణ్యతకు భరోసాను ఇస్తుంది.
ఇది వరకు ఎన్నడు లేని ఈ ఉద్యమం యాభై ఐదు సంవత్సరాల క్రితం మొదలైనది, మన గ్రామీణ ప్రజలలో గుజరాత్ యొక్క పాడి పరిశ్రమ సహకార సంఘాలు గుర్తించ తగిన సామాజిక మరియు ఆర్ధిక మార్పును తీసుకువచ్చాయి. పాడి పరిశ్రమ సహకార సంఘాలు వ్యవసాయదారుల ఈ అద్భుత కృత్యమును ముగించుటకు దోహదపడ్డాయి మరియు ఎప్పుడైతే గ్రామీణ ఉత్పత్తిదారులు లాభం పొందుతారో, సమాజము మరియు దేశము కూడా లాభాలు పొందుతాయి అని వివరించారు.
ది గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ ని కేవలం ఒక వ్యాపార సంస్థ వలె చూడుటకు వీలు లేదు. ఇది పాల ఉత్పత్తిదారులచే ప్రధానంగా వారి ఆశక్తిని ఆర్ధికంగా, సామాజికంగా ఇంకా ప్రజాస్వామికంగా రక్షణగా కొరకు వారే సృష్టించుకున్న సంస్థ. వ్యాపార సంస్థలు వారి వాటాదారులకు పంచుటకు లాభాలను సృష్టిస్తారు. GCMMF విషయంలో మిగిలిన లాభాలను జిల్లా సమాఖ్యల ద్వారా ఇంకా గ్రామీణ సంఘాల ద్వారా వ్యవసాయదారులకు తిరిగి ఇవ్వబడతాయి. ఈ నమూనాలోనే అదనపు విలువతో ఈ మూలధనం యొక్క చలామణి చివరిగా అనుభవించు వ్యవసాయదారుడు మాత్రమే కాకుండా - అంచెలంచెలుగా గ్రామీణ సమాజము యొక్క అభివృద్ధిలో కూడా పాలుపంచుకుంటుంది. దేశం యొక్క అభివృద్ధి నిర్మాణంలో అమూల్ నమూనా సహకార సంఘాల యొక్క గుర్తించ తగిన సహాయం.

త్రి-స్థాయి "అమూల్ నమూనా"

అమూల్ నమూనా ఒక త్రి-స్థాయి సహకార సంఘ నమూనా. ఈ నమూనా జిల్లా స్థాయిలో ఒక పాల సమాఖ్యకు అనుసంధానంగా ఉన్న గ్రామీణ స్థాయి పాడి పరిశ్రమ సహకార సంఘంను కలిగి ఉంటుంది ఇది ఆ తరువాత రాష్ట్ర స్థాయిలోని ఒక పాల సమాఖ్యతో కలుస్తుంది. పైన వివరించిన త్రి-స్థాయి రూపం గ్రామీణ పాడి పరిశ్రమ సంఘంలో పాలను సమీకరించుటకు, పాల సంతరణ మరియు జిల్లా పాల సమాఖ్యలో సంవిధానం మరియ రాష్ట్ర పాల సమాఖ్యలో పాలు మరియు పాల ఉత్పత్తుల విక్రయాలు వంటి విభిన్న కార్యక్రమాలకు ప్రతినిధిగా వ్యవహరించుటకు ఏర్పాటు చేయబడినది. ఇది అంతర్గత పోటీలను నిలువరించుటే కాకుండా పెరిగిన ఉత్పత్తి ఫలితంగా ధరలు తగ్గించుట సాధ్యపడుతుంది అని నమ్మకమును కలిగిస్తుంది. ఈ నమూనా మొదట గుజరాత్ లోని అమూల్ లో అభివృద్ధి జరిగి ఆతరువాత దేశం అంతటా ఆపరేషన్ ఫ్లడ్ కార్యక్రమం ద్వారా పునరుక్తం అవుట మూలంగా దీనిని "అమూల్ మోడల్" లేదా "ఆనంద్ పాటర్న్" అని కాని పిలుస్తారు.
పాలు & పాల ఉత్పత్తుల వాణిజ్యమునకు బాధ్యతాయుతమైనది పాల సంతరణ & సంవిధానం చేయుటకు బాధ్యతాయుతమైనది పాల సమీకరణకు బాధ్యతాయుతమైనది పాల ఉత్పత్తికి బాధ్యతాయుతమైనది
3.1 విలేజ్ డైరీ కో-ఆపరేటివ్ సొసైటీ (VDCS)
గ్రామములోని పాల ఉత్పత్తిదారులు స్వంత వినియోగం తరువాత మిగిలిన పాలతో ఒక కూటమిగా విలేజ్ డైరీ కో-ఆపరేటివ్ సొసైటీ (VDCS)గా ఏర్పడుతారు. గ్రామీణ పాడి పరిశ్రమ సహకార సంఘం త్రి-స్థాయి రూపం యొక్క ప్రథమ స్థాయి. ఇది గ్రామములోని పాల ఉత్పత్తిదారులతో సభ్యత్వమును కలిగి ఉంటుంది మరియు ఒక సభ్యుడు ఒక ఓటు అనే సూత్రంతో పాల ఉత్పత్తి దారుల నుండి 9 నుండి 12 మందిని ఎంపిక చేసుకొని ఏర్పడిన ఒక కార్యవర్గం నిర్వహణలో నడుస్తుంది. రోజు వారి కార్యక్రమాలను నిర్వర్తించుటకు ఈ గ్రామీణ సంఘం ఒక కార్యదర్శిని ఎంపిక చేసుకుంటుంది.(జీతం ప్రాతిపాదిక మీద ఉద్యోగి మరియు నిర్వహణా కార్యవర్గం యొక్క సభ్యత్వ కార్యదర్శి) ఈ కార్యదర్శికి రోజు వారీ కార్యక్రమాలను పూర్తిచేయుటకు మరియు సహాయం చేయుటకు అతనికి / ఆమెకి సహాయంగా ఇతర ఉద్యోగులను కూడా నియమిస్తారు. VDCS యొక్క ప్రధాన కర్తవ్యాలు ఈ క్రింది విధంగా ఉంటాయి:
  • గ్రామంలో పాల ఉత్పత్తిదారుల నుండి మిగిలిన పాలను సమీకరించుట & నాణ్యత & పరిమాణం ఆధారంగా ధర చెల్లించుట
  • సభ్యులకు పశువుల ప్రథమ చికిత్స, కృత్రిమ గర్భధారణ సేవలు, పశువుల-దాణా అమ్మకాలు, ఖనిజ మిశ్రమ అమ్మకాలు, పశుగ్రాసం & పశుగ్రాస విత్తనాల అమ్మకాలు, పశు పోషణకు కావలసిన శిక్షణ చేపట్టుట & పాల కేంద్ర నిర్వహణ మొదలైన సహకార సేవలు అందించుట.
  • గ్రామం యొక్క స్థానిక వినియోగ దారులకు ద్రవ రూపంలో పాలను అమ్ముట
  • పాలను జిల్లా పాల కేంద్రాలకు పంపిణీ చేయుట
కాబట్టి, స్వతంత్ర వాస్తవికతలో VDCS జిల్లా పాల సమాఖ్య సహాయంతో స్థానిక పాల ఉత్పత్తిదారులచే నడుపబడుతాయి.
3.2 డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్’ యూనియన్ (పాల సమాఖ్య)
జిల్లాలోని గ్రామీణ సంఘాలు స్థానికంగా పాలను అమ్మిన తరువాత మిగిలిన పాలతో అందరు కైలిసి ఒక జిల్లా పాల సంఘంగా ఏర్పడతారు (గుజరాత్ లోని ఒక పాల సంఘముకు 75 నుండి 1653 వరకు). పాల సంఘం త్రి-స్థాయి రూపం యొక్క రెండవ స్థాయి. ఇది జిల్లా యొక్క గ్రామీణ పాడి పరిశ్రమ సంఘాల సభ్యత్వమును కలిగి ఉంటుంది మరియు గ్రామీణ సంఘాల నుండి ఎంపిక చేసుకున్న 9 నుండి 18 మంది ప్రతినిధులతో అధ్యక్ష మండలిని కలిగి ఉంటుంది. పాల సమాఖ్య రోజు వారి కార్యక్రమాలను నిర్వహించుటకు ఒక వృత్తి సంబంధమైన నిర్వహణాధికారిని నియమించుకుంటుంది.(జీతం ప్రాతిపదిక మీద ఉద్యోగి మరియు మండలి సభ్య కార్యదర్శి) ఇది ఇంకా ఈ అధ్యక్షుడి యొక్క అతని / ఆమె రోజువారి భాధ్యతలను నిర్వర్తించుటలో సహాయం చేయుటకు మరియు పూర్తి చేయుటకు ఇంకా అనేక మంది ఉద్యోగులను కూడా నియమించుకుంటారు. పాల సమాఖ్య యొక్క ప్రధాన కర్తవ్యాలు క్రింది విధంగా ఉంటాయి:
  • జిల్లా యొక్క గ్రామీణ పాడి పరిశ్రమ సంఘాల నుండి పాల యొక్క సంతరణ
  • VDCSల నుండి పచ్చి పాలను పాల కేంద్రాల వరకు రవాణాను ఏర్పాటు చేయుట
  • పశు రక్షణ, కృత్రిమ గర్భధారణ సేవలు, పశువుల-దాణా అమ్మకాలు, ఖనిజ మిశ్రమ అమ్మకాలు, పశుగ్రాసం & పశుగ్రాస విత్తనాల అమ్మకాలు మొదలైన అంతర్గత సేవలను అందిస్తుంది.
  • సహకార సంఘాల అభివృద్ధి, పశుపోషణ & పాల ఉత్పత్తి దారులకు పాల కేంద్రాలను ఏర్పాటు చేయుట మరియు VDCS సిబ్బంది & నిర్వహణ సంఘ సభ్యులకు ప్రత్యేక నైపుణ్య అభివృద్ధి & నాయకత్వ అభివృద్ధి శిక్షణను నిర్వహించుట.
  • VDCS యొక్క కార్యకాలపాలను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ నిర్వహణ సహాయాన్ని అందించుట.
  • గ్రామాల నుండి సమీకరించిన పాలను సంవిధానం చేయు శీతలీకరణ కేంద్రాలను & పాల కేంద్రాలను ఏర్పాటు చేయుట.
  • జిల్లా లోపల ద్రవ రూపంలో ఉండే పాలను & పాల ఉత్పత్తులను విక్రయించుట
  • రాష్ట్ర వాణిజ్య సమాఖ్య అవసరానుగుణంగా పాలను వివిధ రకాల పాల & పాల ఉత్పత్తుల క్రింద మార్చుట.
  • పాల ఉత్పత్తి దార్లకు చెల్లించవలసిన ధరలను నిర్ణయించుటతో పాటు వారికి అందిస్తున్న సహకార సేవల ధరలను కూడా నిర్ణయించుట.
3.3 స్టేట్ కోఆపరేటివ్ మిల్క్ ఫెడరేషన్ (మండలి)
ఒక రాష్ట్ర పాల సంఘాలు అన్నీ, రాష్ట్ర సహకార పాల సమాఖ్యలుగా ఏర్పడినాయి. ఈ సమాఖ్య త్రి-స్థాయి రూపం యొక్క అగ్ర స్థాయి. దీనికి రాష్ట్రంలోని అన్ని పాడి పరిశ్రమ సహకార సంఘాల సభ్యత్వమును కలిగి ఉంటాయి మరియు ఒక అధ్యక్ష మండలి ఆధ్వరంలో నడుస్తుంటాయి, ఈ మండలికి ప్రతి పాల సంఘం నుండి ఒక ప్రతినిధిని ఎంచుకుంటారు. ఈ రాష్ట్ర సమాఖ్య దైనందిన కార్యక్రమాల నిర్వహణకు ఒక నిర్వహణాధికారిని నియమించుకుంటుంది (జీతం చెల్లించే ఉద్యోగి మరియు మండలి సభ్య కార్యదర్శి). ఈ అధికారి యొక్క రోజు వారీ కర్తవ్యాలను పూర్తి చేసేందుకు మరియు సహాయం చేసేందుకు ఇతర ఉద్యోగులను కూడా నియమించుకుంటుంది. ఈ సమాఖ్య యొక్క ప్రధాన కర్తవ్యాలు క్రింది విధంగా ఉంటాయి:
  • పాల సంఘాల ద్వారా తయారైన / సంవిధానం చేసిన పాలు మరియు పాల ఉత్పత్తుల విక్రయాలు చేయుట
  • పాలు & పాల ఉత్పత్తులను విక్రయించుటకు పంపిణీ నిర్వహణా వలయమును ఏర్పాటు చేయుట.
  • పాలను పాల సంఘాల నుండి విక్రయ కేంద్రముకు తరలించుటకు రవాణను ఏర్పాటు చేయుట.
  • పాలను & పాల ఉత్పత్తులను విక్రయించుటకు ఒక వాణిజ్య నామమును సృష్టించుట మరియు చిరకాలం ఉండునట్లు నడిపించుట (వ్యాపార ఉత్పత్తిని అభివృద్ధిని చేయుట).
  • పాల సంఘాలకు మరియు సభ్యులకు సాంకేతిక దత్తాంశాలు, నిర్వహణ సహాయం మరియు సలహా సేవలు వంటి సహకార సేవలను అందించుట.
  • అధికంగా మిగిలిన పాలను పాల సంఘాల వారి నుండి తీసుకొని పాలు కొరత ఉన్న సంఘాలకు పంపిణీ చేయుట.
  • అధికంగా మిగిలిపోయిన పాల సంఘాల కొరకు పాలను సంవిధానం చేయుటకు సమతుల ఆహారాన్ని ఇచ్చే పాడి పరిశ్రమలను స్థాపించుట.
  • పాల ఉత్పత్తులను చిన్న చిన్న భాగాలుగా చిన్న సంచులలో తయారు చేసి అందించుటకు పచ్చి పాలను ఎక్కువ పరిమాణంలో కొనుగోలు చేయుట.
  • పాల సంఘాల వారికి చెల్లించాల్సిన పాలు మరియు పాల ఉత్పత్తుల ధరలను నిర్ణయించుట.
  • వివిధ పాల సమాఖ్యలలో తయారు చేయాల్సిన ఉత్పత్తులను (ఉత్పత్తి మిశ్రమం) మరియు వాటికి కావలసిన పరిమాణాలను నిర్ణయించుట.
  • దీర్ఘ-కాలిక పాల ఉత్పత్తిని నడిపించుట, సంతరణ మరియు సంవిధానం ఇంకా విక్రయాల పథకం
  • పాల సంఘాల వారికి ఆర్థిక సహాయం అందించుట మరియు సాంకేతికంగా ఈ పని ఏ విధంగా చేయాలో శిక్షణను అందించుట.
  • సహకార సంఘాల అభివృద్ధి, సాంకేతిక మరియు విక్రయాల కార్యకలాపాలను రూపొందించట మరియు వాటి మీద శిక్షణను అందించుట.
  • సంఘర్షణా స్థైర్యం మరియు మొత్తం ఏర్పాటును చెక్కుచెదరకుండా ఉంచుట.[ఎవరు?] 2008వ సంవత్సరానికి వెళ్ళాము. భారతదేశంలో పాడి పరిశ్రమ ముఖ్యంగా గుజరాత్ రాష్ట్రంలో చాలా విభిన్నంగా కనిపిస్తుంది. భారతదేశం పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా వెలుగొందుతుంది. పాడి పరిశ్రమ సహకారోద్యమం వలన గుజరాత్ పాలు మరియు పాల ఉత్పత్తులను ఉత్పత్తి చేయుటలో మంచి విజయాన్ని సాధించిన రాష్ట్రంగా ప్రసిద్ధి పొందింది. ది కైరా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్’ యూనియన్ లిమిటెడ్, ఆనంద్ మొత్తం దేశంలోనే పాడి పరిశ్రమ అభివృద్ధికి కేంద్ర బిందువు అయినది మరియు AMUL అనేక అంతర్జాతీయ ఉత్పత్తులను అధిగమించి భారతదేశంలో అధిక గుర్తింపు తెచ్చుకున్న ఉత్పత్తిగా పేరుగాంచింది.
ఈ రోజు, మేము ఎవరైతే పాలను మరియు పాల ఉత్పత్తులను లాభాయుక్తంగా సంవిధానం చేసి మరియు విక్రయిస్తున్న దాదాపు 13 మిలియన్ల సభ్యులతో అది గుజరాత్ లోని అమూల్ కావచ్చు లేదా పంజాబ్ లోని వెర్కా కావచ్చు లేదా ఆంధ్రప్రదేశ్ లోని విజయ కావచ్చు లేదా కర్ణాటకాలోని నందిని కావచ్చు, 1,25,000మూస:Quantify పాడి పరిశ్రమ సహకార సంఘాలతో, 176 పాడి పరిశ్రమ సహకార సమాఖ్యలను నడుపుతున్నాము. ఈ మొత్తం విధానం ఈ వ్యవసాయదారుల సంస్థలచే భారతదేశం అంతటా 190 కన్నా ఎక్కువ పాల సంవిధాన కర్మాగారాలను నెలకొల్పబడే విధంగా తయారు చేసింది. ఈ సహకార సంఘాలు ఈ రోజు దాదాపు రోజుకి 23 బిలియన్ కేజీల పాలను సమీకరిస్తుంది మరియు సంవత్సరానికి ఈ పాల ఉత్పత్తిదారులకు మొత్తం రు. 125 బిలియన్లను చెల్లిస్తుంది.

"అమూల్ మోడల్" యొక్క ప్రభావం

ఆపరేషన్ ఫ్లడ్ కార్యక్రమము యొక్క ప్రయోజనాలను ప్రపంచ బ్యాంకు తన ఇటీవలి మూల్యాంకన నివేదికలో వివరించింది. ఆపరేషన్ ఫ్లడ్ కార్యాక్రమము క్రింద 70లు మరియు 80లలో మొత్తం 20 సంవత్సరాలలో పెట్టుబడి పెట్టిన రూ. 20 మిలియన్లు భారతదేశం యొక్క పాల ఉత్పత్తిని 40 మెట్రిక్ టన్నులు(MMT) పెంచుటలో పాలు పంచుకుంది. అనగా ఆపరేషన్ ఫ్లడ్ ముందు కాలంలో 20 MMT ఉన్న పరిమాణమును ఆపరేషన్ ఫ్లడ్ కార్యక్రమము ముగింపు సమయానికి 60 MMT కి పెంచినది. అందువలన, 20 సంవత్సరముల కాల వ్యవధిలో రూ. 20 బిలియన్ల పెట్టుబడి మీద సంవత్సరానికి రూ. 400 బిలియన్ల అదనపు అదాయమును పొందుతున్నది. ప్రపంచ బ్యాంకు నిధులు సమకూర్చిన పథకాలలో ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఈ పథకం ఎక్కువ లాభాలను పొందిన పథకం. నిరంతరంగా పెరుగుతూ ఇప్పుడు 90 MMT వద్ద నిలిచిన భారతదేశం యొక్క పాల ఉత్పత్తి యొక్క ప్రయత్నాల ప్రయోజనాలను ప్రతి ఒక్కరు చూస్తున్నారు, పాల ఉత్పత్తిలో నాలుగింతల అభివృద్దితో పాటు ఆ కాల పరిధిలో పాల ధరలలో పెరుగుదలే కాని తగ్గుదల లేకుండా సాగిపోతుంది.
ఈ ఉద్యమం మూలంగా, 1971 నుండి 1996 మధ్య సంవత్సరాలలో పాల ఉత్పత్తి మూడింతలు పెరిగింది. అలాగే, 1973లో ఒక వ్యక్తికి రోజుకి సగటున 111 గ్రాముల నుండి పాల వినియోగం 2000 నాటికి రెండింతలు అనగా 222 గ్రాములకు పెరిగింది. కాబట్టి, ఈ సహకార సంఘాలు గ్రామీణ భారతదేశం యొక్క ఆర్ధికాభివృద్దికి కారణభూతాలే కాకుండా భారతీయ సమాజానికి ఆరోగ్యాభివృద్ధి & పోషకాల అవసరాలకు అవసరమైన ప్రాణాధార జీవ పదార్థాలను కూడా అందిస్తుంది. భారతదేశం యొక్క చాలా కొద్ది కర్మాగారాలు మాత్రమే ఇలాంటి సమాంతర అభివృద్ధి చేస్తూ ఇంత పెద్ద జనావరణం చుట్టూ ఆవరించి ఉన్నాయి.
మగవారు వారి వ్యవసాయ పనులతో ఉండగా సాధారణంగా మహిళలే పాడి చేస్తుంటారు కాబట్టి ఈ పాడి పరిశ్రమ సహకార సంఘాలు మహిళల యొక్క సామాజిక మరియు ఆర్ధిక స్థితిని పెంపొందించు బాధ్యతను కూడా మోస్తున్నాయి. ఇది మహిళలకు వారి ఆర్ధిక దాస్యం నుండి విమోచనం పొందుటకు ఒక నిర్దిష్ట అదాయమును సమకూర్చుతుంది.
త్రి-స్థాయిల 'అమూల్ మోడల్' దేశంలో శ్వేత విప్లవం తేవటంలో కారకం అయినది. భారతదేశంలో పాడి పరిశ్రమ అభివృద్ధి యొక్క ప్రభావం మీద ప్రపంచ బ్యాంకు యొక్క అంచనా నివేదిక ప్రకారం 'ఆనంద్ పాటర్న్' ఈ క్రింది ప్రయోజనాలను వివరిస్తుంది:
  • పేదరికమును తగ్గించుటలో పాడి పరిశ్రమ యొక్క పాత్ర
  • గ్రామీణాభివృద్ధి ఎక్కువగా వ్యవసాయోత్పత్తి మీద ఆధారపడి ఉంటుంది అనేది సత్యం
  • అభివృద్ధిలో జాతీయ 'యాజమాన్యం' యొక్క విలువ
  • పేదరికం యొక్క కనీస రూపాలను నివారించుటలో అధిక ఆదాయాల ప్రయోజనకర ప్రభావాలు
  • ఉద్యోగాలను సృష్టించుటలో పాడి పరిశ్రమ యొక్క సామర్ధ్యం
  • తక్కువ ధరలో పేదలకు ప్రయోజనకరంగా ఉండే పాడి పరిశ్రమ సామర్ధ్యం
  • అభివృద్ధిలో వాణిజ్య విధానం యొక్క ప్రాముఖ్యం
  • బహు-దిశాత్మక ప్రభావాలు పొందుటకు ఏక-పదార్ధ పథకాల సామర్ధ్యం
  • వాణిజ్య వ్యవస్థల కన్నా ప్రభుత్వ సహాయం యొక్క ప్రాముఖ్యత
  • వ్యవసాయంలో విఫలమైన విపణి యొక్క ప్రాముఖ్యత
  • సహ వ్యవస్థల సామర్ధ్యం మరియు సమస్యలు
  • భీమా యొక్క ప్రాముఖ్యత

"అమూల్ ఉద్యమం" యొక్క విజయాలు

  1. భారతదేశంలో పాల ఉత్పత్తి యొక్క అసాధారణ పెరుగుదల - 40 సంవత్సరాల కాల వ్యవధిలో 20 మిలియన్ల MT నుండి 100 మిలియన MT వరకు - కేవలం పాడి పరిశ్రమ సహకారోద్యమం వలన సాధ్యపడినది. ఇది భారతదేశం ఈ రోజు ప్రపంచంలో అధిక పాల ఉత్పత్తి దేశంగా ఎదుగుటకు దోహదపడినది.
  2. పాడి పరిశ్రమ సహకారోద్యమం వ్యవసాయదార్లకు ఎక్కువ పశువులను పెంచుటకు కూడా ప్రోత్సాహాన్ని ఇచ్చింది, ఫలితంగా దేశంలో 500 మిలియన్ల వరకు పశువులు & గేదెల సంఖ్య పెరిగినది - ఇది ప్రపంచంలో అధిక సంఖ్య.
  3. పాడి పరిశ్రమ సహకారోద్యమం అధిక సంఖ్యాక పాల ఉత్పత్తిదారులను కూడగట్టింది, ఈ రోజు వారి యొక్క సభ్యత్వంతో 13 మిలియన్ల సభ్యుల కుటుంబాల కన్నా ఎక్కువ సంఖ్యను కలిగి ఉంది.
  4. పాడి పరిశ్రమ సహకారోద్యమం దాదాపు 22 రాష్ట్రాలలో 180 జిల్లాలోని 125,000 గ్రామాలలో దేశం నలుదిక్కులా వ్యాపించి ఉంది.
  5. పాడి పరిశ్రమ సహకార సంఘాలు అనేక గ్రామాల సభ్యుల నుండి ఎన్నుకోబడిన గ్రామీణ స్థాయి యొక్క నిర్వహణా కార్యవర్గంతో కనీసం దిగువ స్థాయిలో అయిన ప్రజాస్వామిక విధానమును అవలంబించగలిగాయి.
  6. పాడి పరిశ్రమ సహకార సంఘాలు పారదర్శకంగా మరియు స్వతంత్రంగా సభ్యత్వమును అందిస్తూ గ్రామాలలో కులం, మతం, తెగ, మతము & భాష యొక్క సామాజిక విభజనకు ఒక వారధి వలె పనిచేస్తున్నాయి.
  7. పాడి పరిశ్రమ సహకార సంఘాలు అతి తక్కువ ధరలో ఉత్పత్తి & పాల సంవిధానంను ఫలితాలుగా ఇచ్చే సాంకేతిక పశు పోషణ & విధానాల ఫలోత్పాధక శక్తి వంటి విషయాలను విజయవంతంగా వ్యాప్తి చేస్తున్నాయి.
  8. ఈ ఉద్యమము ఒక అభివృద్ధి చెందిన సంతరణ విధానము మరియు జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలలో సహకార సంయుక్త విధానముల వలన విజయవంతంగా కొనసాగుతుంది.
  9. పాడి పరిశ్రమ సహకార సంఘాలు నిరంతరం ముందు ముందు అధిక పాల ఉత్పత్తిని కలిగి ఉండే అధిక సంవిధాన పరిమాణాలను ఏర్పాటు చేయుటలో ముందస్తు జాగ్రత్తలో ఉంటుంది.
  10. పాడి పరిశ్రమ సహకార సంఘాలు ఇప్పటికీ ఒక దృఢమైన సహకార గుర్తింపు, విలువలు మరియు అభిప్రాయాలను రక్షిస్తున్న భారతదేశంలో ఉన్న అతి కొద్ది సంస్థలలో కొన్ని. ఈ సంస్థలు ఇప్పటికీ ఆదర్శవాదం & సభ్యులు మరియు ఉద్యోగుల యొక్క ఆదరాభిమానాలను కలిగి ఉన్నాయి.
  11. పాడి పరిశ్రమ సహకార సంఘాలు భారతదేశం యొక్క పేద వ్యవసాయదారులను దళారులు & మధ్యవర్తుల సంకెళ్ళ నుండి తప్పించి మరియు వారి ఉత్పత్తులకు ఒక నమ్మకమైన మార్కెట్ ను అందించింది. ఈ సంస్థలు వ్యవసాయదారుల చేతనే నడుపబడుతున్నాయి కాబట్టి, వారి ఉత్పత్తులకు వారికి తగిన ధరలే లభిస్తున్నాయి.
  12. పాడి పారిశ్రామ సంఘాలు వారి నిర్మలమైన నిర్వహణతో నిజాయితీ & పారదర్శకతను ఒక మార్కెట్ దృష్ట్యా ఎలా ఉండాలో అలాగ సృష్టించగలుగుతున్నాయి.

GCMMF యొక్క విజయాలు

  • 2.8 మిలియన్ల పాల ఉత్పత్తి సభ్యుల కుటుంబాలు
  • 13,759 గ్రామీణ సంఘాలు
  • 13 జిల్లా సమాఖ్యలు
  • ఒక రోజుకు 8.5 మిలియన్ లీటర్ల పాల సేకరణ
  • ప్రతి రోజూ రు.150 మిలియన్ల డబ్బు బట్వాడా
  • GCMMF చిన్న ఉత్పత్తిదారులతో రు.53 మిలియన్ల వార్షిక చలామణీ కలిగిన అతి పెద్ద సహకార సంఘ వ్యాపారము.
  • భారత ప్రభుత్వం అమూల్ ను "బెస్ట్ ఆఫ్ ఆల్ కేటగిరీస్ రాజీవ్ గాంధీ నేషనల్ క్వాలిటీ అవార్డు"తో సత్కరించింది.
  • ఆసియా ఖండం మొత్తం మీద అధిక పాలను నిల్వ చేయగల సామర్ధ్యం
  • అతి పెద్ద శీతల గొలుసు వలయం
  • 48 విక్రయ కార్యాలయాలు, 3000 హొల్ సేల్ పంపిణీదారులు, 5 లక్షల చిల్లర దుకాణాలు
  • 37 దేశాలకు రూ. 150 కోట్ల విలువ కల ఎగుమతులు
  • వరుసగా తొమ్మిది సంవత్సరాల పాటు APEDA అవార్డు గెలుచుకున్న విజేత

అమూల్ ఉత్పత్తి ఏర్పాటు

GCMMF (AMUL) ఏదైనా FMCG సంస్థ కొరకు అతి పెద్ద పంపిణీ వలయమును కలిగి ఉంది. దేశ వ్యాప్తంగా 50 విక్రయ కార్యాలయాలు ఉన్నాయి, 3,000 వరకు టోకు వ్యాపారులు మరియు 5,00,000 వరకు చిల్లర వ్యాపారులు ఉన్నారు.
అమూల్ దేశ వ్యాప్తంగా అతి పెద్ద పాల ఉత్పత్తుల ఎగుమతిదారి. అమూల్ ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా 40 దేశాలలో అందుబాటులో ఉంది. అమూల్ వివిధ ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది వాటిలో వెన్నపాల పొడి మరియు వెన్న తీసిన పాల పొడి, కాటేజ్ జున్ను (పనీర్), UHT పాలు, శుద్ధి చేసిన వెన్న (నెయ్యి) మరియు స్వదేశీ మిఠాయిలు. అధిక విక్రయ మార్కెట్లు కలిగిన ప్రదేశాలు USA, వెస్ట్ ఇండీస్, మరియు ఆఫ్రికాలో కొన్ని దేశాలు, గల్ఫ్ ప్రాంతం, మరియు [SAARC] SAARCసమీప ప్రాంతాలు, సింగపూర్, ఫిలిప్పీన్స్, థాయ్ లాండ్, జపాన్ మరియు చైనా.
2007 సెప్టెంబర్ లో సినోవేట్ చేపట్టిన ఒక సర్వేలో ఆసియాలోని 1000 ప్రసిద్ధి పొందిన ఉత్పత్తులలో అమూల్ భారత దేశంలో అధికంగా అమ్ముడయ్యే ఉత్పత్తిగా నిలిచింది.[10]

ఉత్పత్తులు

అమూల్ ఉత్పత్తుల శ్రేణిలో పాల పొడి, పాలు, వెన్న, నెయ్యి, జున్ను, మీగడ పెరుగు, పెరుగు, మజ్జిగ చాక్లెట్, ఐస్ క్రీం, మీగడ, శ్రీఖండ్, పనీర్, గులాబ్ జామున్లు, సువాసన పాలు, బాసంది, న్యూట్రమూల్ మరియు ఇంకా అనేక ఇతర ఉత్పత్తులు ఉన్నాయి. 2006 జనవరిలో, అమూల్ భారతందేశం యొక్క మొట్ట మదటి క్రీడా పానీయం స్టామినా ను ప్రవేశపెట్టుటకు పథకం వేసింది, ఈ పానీయం కోకా కోలా యొక్క పవరేడ్ మరియు పెప్సికో యొక్క గాటోరేడ్ [11] పానీయాలకు గట్టి పోటీ ఇవ్వవచ్చు.
2007 ఆగష్టులో, అమూల్ పాల ఉత్పత్తుల విభాగం విస్తరిస్తూ కూల్ కోకో అను ఒక చాక్లెట్ పాల ఉత్పత్తిని ప్రవేశపెట్టింది. ఒక తక్కువ కేలరీలతో ఉన్న అమూల్ కూల్, దాహాన్ని తీర్చుకొను పానీయం; మస్తి బటర్ మిల్క్; తాగటానికి తయారుగా ఉండే కాఫీ కూల్ కేఫ్, మరియు భారత దేశం యొక్క తొలి క్రీడా పానీయం స్టామినా, ఇతర అమూల్ ఉత్పత్తులు.
అమూల్ యొక్క పంచదార లేని ప్రో-బయోటిక్ ఐస్-క్రీం 2007 కొరకు ది ఇంటర్నేషనల్ డైరీ ఫెడరేషన్ మార్కెటింగ్ అవార్డును గెలుచుకుంది.[citation needed]

చిహ్నం

1967 నుండి[12] అమూల్ ఉత్పత్తుల' వ్యాపార చిహ్నం చప్పున గుర్తు పట్టగల "అమూల్ పాప" (గుండ్రని పెద్ద చుక్కలుకలిగిన గౌను వేసుకొని ముద్దుగా బొద్దుగా ఉండే ఒక పాప), హోర్డింగుల మీద మరియు ఉత్పత్తులను చుట్టిన పేపర్ల మీద అలాగే చప్పున గుర్తుపట్ట గల ఉపశీర్షిక అట్టర్లీ బట్టర్లీ డెలీషియస్ అమూల్ తో కనిపిస్తుంది.ఈ వ్యాపార చిహ్నమును మొట్టమొదట అమూల్ వెన్నకు ఉపయోగించారు. కాని తరువాత సంవత్సరాలలో అమూల్ ఉత్పత్తుల రెండవ దఫా వ్యాపార ప్రకటనల ప్రచారంలో ఈ పాపను ఇతర నెయ్యి మరియు పాలు వంటి ఉత్పత్తులకు కూడా ఉపయోగిస్తున్నారు.

ప్రకటనలు

దస్త్రం:Amul63.jpg
పాకిస్తాన్ యొక్క కార్గిల్ యుద్ధ అపజయం మీద అమూల్ వెన్న ప్రచార ప్రకటనజార్జ్ ఫెర్నాండెజ్ మరియు అటల్ బిహారీ వాజ్పేయ్ మధ్య "అమూల్ పాప"ను చూపెడుతున్న చిత్రం.
అమూల్ వెన్న కొరకు 1966లో అమూల్ ఒక నూతన ప్రచార ప్రకటనను రూపొందించుటకు ప్రచార ప్రకటనల సంస్థ AS యొక్క అప్పటి నిర్వహణా అధ్యక్షుడు సిల్వెస్టర్ డకన్హతో ఒప్పందం చేసుకుంది, డకన్హ ప్రతి రోజు దైనందిన కార్యక్రమాల మీద వెన్నకి సంబంధించిన ప్రచార ప్రకటనల తెరల శ్రేణిని రూపొందించారు.[13] ఈ ప్రచార ప్రకటన విస్తృతంగా ప్రజారణ పొంది ప్రపంచంలో దీర్ఘ కాలంగా కొనసాగిన ప్రచార ప్రకటనగా ప్రపంచ గిన్నిస్ రికార్డుని సాధించింది. 1980ల నుండి కార్టూన్ చిత్రకారుడు భరత్ దభోల్కర్ అమూల్ ప్రచార ప్రకటనలను చిత్రిస్తున్నారు, ఈయన ప్రచార ప్రకటనలలో ప్రముఖ వ్యక్తులను పెట్టి చిత్రీకరించే ధోరణిని తిరస్కరించారు. అధ్యక్షుడు వర్ఘీస్ కురియన్ ప్రచార ప్రకటనల రూపకల్పనలో స్వేచ్చాయుత వాతావరణమును కల్పించారు అని దభోల్కర్ ప్రశంసించారు.[14]
ఒక ప్రక్క అనేక పరిస్థితులలో రాజకీయ ఒత్తిడులు ఎదురవుతున్నా, డకన్హ యొక్క ప్రకటనల సంస్థ వాటికి వెరువకుండా ఉండగల విధానమును అనుసరించింది. పశ్చిమ బెంగాల్ లో తీవ్రవాదం పెచ్చురిల్లుట మీద, భారతీయ విమానయాన ఉద్యోగుల సమ్మె మీద వ్యాఖ్యానించుట మరియు గాంధీ టోపీని ధరించిన అమూల్ వెన్న పాప చిత్రించుట వంటివి వివాదాస్పదం అయ్యాయి[13]

జనరంజక సంస్కృతిలో

అమూల్ యొక్క వ్యవస్థాపనను శ్వేత విప్లవం అని కూడ తెలుపుతారు. ఈ శ్వేత విప్లవం మీద ప్రముఖ భారతీయ చిత్ర నిర్మాత శ్యామ్ బెనగల్ ప్రేరణ పొంది దీని ఆధారంగా మంథాన్ (1976) అను చలన చిత్రమును నిర్మించారు. ఈ చిత్రంలో నటీనటులు స్మితా పాటిల్, గిరీష్ కర్నాడ్, నసీరుద్దిన్ షా మరియు అమ్రిష్ పురి. ఈ చిత్రానికి గుజరాత్ లోని ఐదు లక్షల మంది వ్యవసాయదారులు ఒక్కొక్కరు రు. 2 చొప్పున పెట్టుబడి పెట్టారు. ఇది విడుదల అయిన తరువాత పెట్టుబడి పెట్టిన అదే వ్యవసాయదారులు బండ్లు కట్టుకొని వెళ్లి చలన చిత్రం చూసి అది వాణిజ్య పరంగా విజయవంతం అయ్యేట్లు చేసారు.[15][16], ఈ చిత్రంను 1977 సంవత్సరానికి హిందీలో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డు కొరకు ఎంపిక చేసారు. అమూల్ విజయ గాధను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక ప్రధాన నిర్వహణా విద్యాసంస్థలలో సందర్భ అధ్యయనంగా (కేస్ స్టడీ) చదువుతారు.
శ్వేత విప్లవం చాలీ చాలని పరిమాణంలో ఉన్న పాల ఉత్పత్తి మరియు పంపిణీని అధికంగా ఉండు కాలానికి తీసుకొని వచ్చింది. ఈ పథకం ఒక గొప్ప కొలమానం కల విజయంతో పాటు, "ఐకమత్యం" యొక్క విలువను వివరించింది. గుజరాత్ లోని ఖేడా జిల్లాలోని ఒక చిన్న పేద వ్యవసాయదారుల సమూహం యొక్క స్వప్నం మరియు ముందుచూపు వారి స్వార్ధానికి కాకుండా సమాజానికి మంచిమార్గాన్ని చూపించింది.
Creative Commons LicenseAPPSC Groups and Indian Civil Services Articles by Dilip Reddy is licensed under a Creative Commons Attribution 2.5 India License.Based on a work at appscgroupspoint.blogspot.com.Permissions beyond the scope of this license may be available at http://appscgroupspoint.blogspot.com/. All articles published under CC License

No comments:

Post a Comment