'శాస్త్రీయం'గా అత్యధిక స్కోరు

'శాస్త్రీయం'గా అత్యధిక స్కోరు
గ్రూప్‌-I మెయిన్స్‌లో ఉండే ఐదు పేపర్లలో నాలుగోదైన సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కీలకమైనది. దీనిలో సిలబస్‌ ఎక్కువగా ఉన్నప్పటికీ మిగతా పేపర్ల కంటే ఎక్కువ మార్కులు స్కోరు చేసుకోవచ్చు. ఆర్ట్స్‌ అభ్యర్థులైనా, సైన్సు వారైనా ఈ పేపర్‌పై కొద్దిపాటి అవగాహనను పెంపొందించుకొంటే దీని ప్రిపరేషన్‌ సులభమవుతుంది.
పేపర్‌-IV సిలబస్‌లో మూడు సెక్షన్లు ఉన్నాయి. మొదటి దాంట్లో 'భారతదేశ అభివృద్ధిలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పాత్ర, ప్రభావం' అన్న అంశానికి సంబంధించినవి. రెండో దాంట్లో 'జీవశాస్త్రాల ఆధునిక ధోరణులు- సాధారణ పరిజ్ఞానం' సిలబస్‌. మూడో సెక్షన్‌లో 'అభివృద్ధి, పర్యావరణ' అంశాలు ఉన్నాయి. ఈ మూడు సెక్షన్లలో తిరిగి ఒక్కొక్కదానిలో ఐదు యూనిట్లు. మొత్తం సిలబస్‌ను పదిహేను యూనిట్లుగా విభజిస్తే, ప్రతి యూనిట్‌ నుంచీ రెండు ప్రశ్నలు వస్తాయి. దీనిలో ఒకటి ఛాయిస్‌. అంటే ఒక ప్రశ్నకు సమాధానం రాస్తే సరి. పేపర్‌ మొత్తంలో ఉండే 30 ప్రశ్నల్లో పదిహేనింటికి జవాబులు రాయాలి. ఒక్కొక్క ప్రశ్నకు పది మార్కులు. మొత్తం 150 మార్కులు. ప్రశ్నలు పది మార్కులకనే కాకుండా 1, 2, 4, 5, 6, 8 ఇలా విభజించి అడిగే అవకాశం ఉంది. 2008 మెయిన్స్‌లో ఇలాగే చేశారు.
ఈ పరిస్థితుల్లో అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ను మూడు దశలుగా విభజించుకోవచ్చు. i) సిలబస్‌ను క్షుణ్ణంగా చదివి, అర్థం చేసుకొని నోట్సు సిద్ధం చేసుకోవటం. ii) సమాధానాలను సాధన చేయటం. iii) పునశ్చరణ (రివిజన్‌).
ఏ తీరులో సిద్ధమవ్వాలి?
అభ్యర్థి ముందుగా ఒక్కొక్క సెక్షన్‌లో ఉన్న సిలబస్‌ను క్షుణ్ణంగా చదివి ఏయే అంశాలున్నాయో గమనించాలి. వీటిలో యూనిట్‌ వారీగా ఉన్న అంశాలను వివిధ పుస్తకాలు, మెటీరియల్‌ సాయంతో చదువుతూ నోట్సు తయారుచేసుకోవాలి. సిలబస్‌లోని ప్రతి అంశాన్నీ పూర్తిగా చదివి, అర్థం చేసుకొంటూ నోట్సు రూపొందించుకోవాలి.
* ముఖ్యమైన అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వొచ్చు.
* అంశాలను, సమాధానాలను బట్టీ పట్టకూడదు.
* కొన్నింటిని చదివి, కొన్నింటిని వదిలేయటం సరికాదు.
* అకడమిక్‌ పరీక్షలలో రాసినట్టు కాకుండా ప్రశ్నలకు సమాధానాలు సూటిగా, స్పష్టంగా ఉండాలి. తెలిసిన సమాచారమంతా సందర్భశుద్ధి లేకుండా సమాధానంలో నింపెయ్యకూడదు.
* ప్రశ్న ఏ విధంగా వచ్చినా, ఎన్ని మార్కులకు వచ్చినా సమాధానం రాయగలిగేలా శ్రద్ధ పెట్టాలి.
రెండో దశ...
ప్రతి అంశానికీ సంబంధించిన నోట్సు సిద్ధమయ్యాక అభ్యర్థులు దాన్ని క్షుణ్ణంగా మనసుకు పట్టించుకోవాలి. కీలక అంశాలను గుర్తుంచుకోవాలి. ముఖ్యమైన వాటిని సారాంశం (సినాప్సిస్‌) మాదిరిగా రాసుకోవచ్చు. ఆపైన ఒక్కొక్క అంశాన్ని చూడకుండా రాయటం అభ్యాసం చేయాలి. అభ్యర్థులు ఎక్కువగా రైటింగ్‌ ప్రాక్టీస్‌పై ఆసక్తి చూపరు. కానీ వివిధ అంశాలను ఎంతగా రాతలో సాధన చేస్తే అంత ఎక్కువగా విజయం సాధించగలుగుతారు. మొదట్లో కొద్దిగా ఇబ్బందిగా అనిపించినా సాధన చేస్తూ ఉంటే సమస్యలు తొలగిపోతాయి.
* అంశాలను నిర్ణీత సమయంలో పూర్తిచేసేలా ప్రిపరేషన్‌ ఉండాలి.
* ఒక్కొక్క ప్రశ్న జవాబును 11, 12 నిమిషాల్లో రాయగలగాలి. ఆరంభంలో ఎక్కువ సమయం పట్టినా తరవాత నిర్ణీత సమయంలోనే రాసే స్థాయికి చేరుకోవాలి.
* 180 నిమిషాలలో పదిహేను ప్రశ్నలకు జవాబు రాయాలి. ఇదే నమూనాలో మీకు మీరుగా ప్రశ్నపత్రం తయారుచేసుకొని నమూనాటెస్టులు రాయండి.
* ఒక అంశంపై వివిధ రకాలుగా ప్రశ్నలు తయారుచేసుకొని సమాధానాలు రాయటం అభ్యసించటం వల్ల ప్రశ్న ఏ విధంగా వచ్చినా జవాబు రాయటం అలవాటవుతుంది.
మూడో దశ ...
ఈ దశలో ప్రతి టాపిక్‌నూ తరచూ పునశ్చరణ చేస్తూ ఉండాలి. దీనివల్ల ముఖ్యమైన అంశాలూ, పదాలను మరిచిపోకుండా గుర్తుంచుకొంటారు. దీనితో పాటు వివిధ టాపిక్‌లకు సంబంధించిన వర్తమాన అంశాలను ఆయా అంశాల నోట్సు వద్ద రాసుకొంటూ ఉండాలి. పోటీ పరీక్షల పత్రికలు, దినపత్రికల నుంచి తెలుసుకొన్న సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వర్తమాన అంశాలను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ (అప్‌డేట్‌) ఉండాలి. పరీక్ష తేదీ దగ్గరపడుతున్న కొద్దీ రాత సాధన, పునశ్చరణలు ఎక్కువగా జరగాలి.
వర్తమాన అంశాలు
పేపర్‌ IVలోని మూడు సెక్షన్లలో చాలా అంశాలు టెక్నాలజీ సంబంధ వర్తమాన అంశాలు అయ్యుంటాయి. పరీక్షలో ప్రతి సమాధానంలో దానికి తగ్గట్టుగా వర్తమాన అంశాలు జోడించినట్టయితే ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంది. మొదటి సెక్షన్‌లోని మొదటి యూనిట్‌లో భారతదేశం ప్రస్తుతం ప్రతిపాదించిన టెక్నాలజీ మిషన్‌లు, శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని పెంపొందించడానికి ఇటీవల తీసుకొన్న చర్యలు వర్తమాన అంశాలతో ముడిపడి ఉన్నాయి.
రెండో యూనిట్‌లో భారతదేశం ఇటీవల ప్రయోగించిన ఉపగ్రహాల వివరాలు, వాటి ప్రాధాన్యం, చంద్రయాన్‌ వర్తమాన అంశాలు. మూడో దాంట్లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ప్రస్తుతం ఏయే రంగాలలో ఎన్ని రకాలుగా ఉపయోగపడుతోంది అనే అంశానికి సమకాలీనతను జోడిస్తూ రాయాలి. నాలుగో యూనిట్‌లో భారతదేశం అణుశక్తి అభివృద్ధి కోసం కుదుర్చుకొన్న ఒప్పందాలు, సౌరశక్తి వినియోగానికి ఏర్పర్చిన సోలార్‌ టెక్నాలజీ మిషన్‌, శక్తి, డిమాండు తీర్చడానికి భారతదేశం తీసుకొంటున్న చర్యలు తాజా సమాచారం.
ఐదో యూనిట్‌లో భారతదేశం ఆపత్సమయ నిర్వహణకు తీసుకుంటున్న చర్యలు, పట్టణీకరణకు చేపడుతున్న జవహర్‌లాల్‌ నెహ్రూ అర్బన్‌ రెన్యువల్‌ స్కీమ్‌ వంటి వర్తమాన అంశాలు రాయగలిగితే ఎక్కువ మార్కులు సాధించవచ్చు.
రెండో సెక్షన్‌ మూడో యూనిట్‌లో బయోటెక్నాలజీలో ఇటీవల సాధించిన విజయాలు, ఇటీవల వివాదాస్పదమవుతున్న బీటీ పత్తి, బీటీ వంకాయ వంటివి ముఖ్యమైనవి. నాలుగో యూనిట్‌లో అనేక వ్యాధులకు నూతనంగా కనుగొన్న చికిత్సా విధానాలు, స్వైన్‌ ఫ్లూ, ఎయిడ్స్‌ వ్యాధి నివారణ దిశలో వర్తమాన అంశాలను తప్పకుండా రాయాలి. ఐదో యూనిట్‌లో ఇటీవల రూపొందించిన వ్యాక్సిన్‌లు, వివాదాస్పదమవుతున్న వ్యాక్సిన్లు వంటివి కీలకం.
మూడో సెక్షన్‌ మొదటి యూనిట్‌లో పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన మార్పులు, చేసిన చట్టాలు, నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌, హరిత భవనాలు శ్రద్ధ పెట్టాల్సినవి. మూడో యూనిట్‌లో- జీవ వైవిధ్యం ఎలా నశిస్తోంది, మనదేశం ఇటీవల తీసుకున్న చర్యలు, ముఖ్య వర్తమాన అంశాలు. నాలుగో యూనిట్‌లో ఘన వ్యర్థ పదార్థాలను ముఖ్యంగా ఎలక్ట్రానిక్‌ వ్యర్థ పదార్థాల రీసైక్లింగ్‌కు ఏ చర్యలు తీసుకోవాలనేది కీలకం. ఐదో యూనిట్‌లో శీతోష్ణస్థితి మార్పు వల్ల భారతదేశంపై కలుగుతున్న, కలగబోయే పరిణామాలు, ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు జరుగుతున్న కృషి, ఒప్పందాలు, సదస్సుల వంటి వర్తమాన అంశాలు తప్పనిసరిగా దృష్టి పెట్టవలసినవే.
పునరావృత అంశాల సంగతి
ప్రిపరేషన్‌ కొనసాగిస్తున్నపుడు కొన్ని అంశాలు వివిధ యూనిట్లలో పునరావృతమవుతుంటాయి. లేదా ఒక యూనిట్లో ఒక అంశానికి సంబంధించిన సమాచారం వేరొక యూనిట్లో మరోదానికి ఉపయోగపడుతుంది. ఇలాంటివి గుర్తించి వీటిపై దృష్టిసారిస్తే ప్రిపరేషన్‌ తేలికవుతుంది. ఎక్కువ సమాచారమూ రాసినట్టవుతుంది. ఉదాహరణకు... * సెక్షన్‌ Iఒకటో యూనిట్లో ఉన్న శాస్త్ర సాంకేతిక విజ్ఞానాలకు సంబంధించిన జాతీయ విధానం, వస్తున్న మార్పులు అనే అంశానికి ఇతర సెక్షన్లలో ఉన్న వ్యవసాయ, అంతరిక్ష, అణుశక్తి, ఐటీ వంటివాటిలో ప్రస్తుత భారతదేశ విధానాన్ని రాయవచ్చు.
* శీతోష్ణస్థితి మార్పు అనేది సెక్షన్‌Iలోని ఐదో యూనిట్లో, సెక్షన్‌ IIIలోని ఐదో యూనిట్లో కూడా ఉంది.
* ఐటీ ఉపయోగాలు అనే సమాచారాన్ని సెక్షన్‌ Iలోని యూనిట్‌ 3లో, సెక్షన్‌ III లోని యూనిట్‌5 లోని పర్యావరణ, మానవ ఆరోగ్య రంగాల్లో సమాచారం సాంకేతిక విజ్ఞానం పాత్ర అనే అంశంలో రాయవచ్చు.
* సెక్షన్‌IIలోని ఒకటో యూనిట్‌లో ఉన్న రికాంబినెంట్‌ టీకాల ఉత్పత్తి, యూనిట్‌ 5లో ఉన్న ఆధునిక టీకాల ఉత్పత్తి అనే అంశాల్లో ఒకేరకమైన సమాచారాన్ని రాయవచ్చు. ఇదే సెక్షన్లో యూనిట్‌ 3లో ఉన్న పరిసరాల పరిశుభ్ర విధానాల్లో జీవసాంకేతిక విజ్ఞానం పాత్ర అనే సమాచారాన్ని సెక్షన్‌ IIIలోని యూనిట్‌ 4లో రాయవచ్చు.
* జన్యు ఇంజినీరింగ్‌ అనేది బయోటెక్నాలజీలో భాగం కాబట్టి ఈ రెంటిలో ఒకే సమాచారం ఉపయోగపడుతుంది. ఈ విధంగా సంబంధం కలిగిన అనేక అంశాలను గమనించాలి.
అదనంగా 50 మార్కులు
అభ్యర్థులు క్షుణ్ణంగా సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, వర్తమాన అంశాలను కలుపుకుని చదివితే పేపర్‌-IV లోని 150 మార్కులతో పాటు పేపర్‌-Iలో ఉన్న 50 మార్కులకు కూడా ఉపయోగం. పేపర్‌-Iలో ఉన్న జాతీయ వర్తమాన అంశాలు, ఆపత్సమయ నిర్వహణ వంటివి పేపర్‌-IVలో కవరవుతాయి. పేపర్‌-IVలో ఉన్న అణుశక్తి రంగం, ఇటీవల ప్రయోగించిన ఉపగ్రహాలు, జన్యుపరివర్తన పంటలు (బీటీ కాటన్‌, బీటీ వంకాయ) స్వైన్‌ ఫ్లూ వంటి వ్యాధులు, నూతన వ్యాక్సిన్‌లు, శీతోష్ణస్థితి మార్పు, ఆపత్సమయ నిర్వహణ, గ్లోబల్‌ వార్మింగ్‌ వంటివి పేపర్‌-Iకు కూడా ప్రాధాన్యమైనవి కాబట్టి ఇలాంటివి ఎక్కువగా చదివితే అదనంగా 50 మార్కులు ఖాయం. 2008లో జరిగిన మెయిన్స్‌ పేపర్‌-Iలో ఆపత్సమయ నిర్వహణ, భారతదేశం ఇటీవల ప్రయోగించిన ఉపగ్రహాలు అనేవాటి నుంచి ప్రశ్నలు వచ్చాయి.


 

అభివృద్ధి.. పర్యావరణ సమస్యలు.. చట్టాలు

మొదటి యూనిట్

ఈ యూనిట్‌లోని అంశాలు పర్యావరణ చట్టాలకు సం బంధించినవి. ఇందులో సూచించిన ఐదు చట్టాలకు సం బంధించిన సవూచార అధ్యయునంతో ప్రిపరేషన్ ప్రారం భించాలి. చట్టానికి సంబంధించి వలిక అవగాహన ఏర్ప ర్చుకోకుండా.. గైడ్లు, మెటీరియల్స్ మీద ఆధారపడటం వల్ల అనుకున్న లక్ష్యాన్ని సాధించలేవునే విషయూన్ని గుర్తుంచుకోవాలి. చట్టాలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు రాసేటప్పుడు.. వాటిలోని సెక్షన్లను, నిబం ధనలను ప్రస్తావించడం సందర్భోచితంగా ఉంటుంది.

చట్ట పరిభాషను ఉన్నది ఉన్నట్టుగా రాయుడం వల్ల ఎటు వంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి చట్టాన్ని అధ్యయనం చేసేటప్పుడు ముఖ్య నిబంధనల సారాంశాన్ని క్లుప్తంగా నోట్స్ రూపంలో రాసుకోవడం అభిలషణీయంగా ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం, చట్టాలలోని అంశాలనే కాకుండా వాటి అవుల్లో ఎదురవుతున్న ఇబ్బం దులు, మరింత మెరుగపరచడానికి సూచనలు వంటి అంశాల మీద కూడా దృష్టిని సారించాలి.

2008 గ్రూప్ 1 పరీక్షలో ఈ యూనిట్ నుంచి అడిగిన ప్రశ్నలను గమనిస్తే..అవి సరళంగా కనిపిస్తాయి. వివిధ పర్యావరణ విభాగాల గురించి వివరంగా చర్చించండి? జల కాలుష్య నియంత్రణ చట్టం గురించి వివరించం డి? ఈ రెండు ప్రశ్నలు నేరుగా ఉన్నాయి. కాబట్టి ప్రతి విద్యార్ధి తనకున్న పరిధిలో సవూధానాన్ని ప్రెజెంట్ చేయువచ్చు.

ఈ రకమైన మూస ప్రశ్నలలో మనకు అందుబాటులో ఉండే విస్తారమైన సమాచారాన్ని కేవలం 10-12 నిమిషాలలో కుదించి అర్థవంతంగా ప్రెజెంట్ చేయుడానికి చాలా అనుభవం, నైపుణ్యం కావాలి అనే విషయూన్ని ఈ సందర్భంలో గుర్తుంచుకో వాలి. ఇదే యూనిట్ నుంచి పర్యావరణ చట్టాల అమ ల్లో ఇమిడి ఉన్న అంశాలు ఏమిటి? అని రెండు మార్కు లకు విశ్లేషణాత్మక ప్రశ్నను కూడా ఇచ్చారు. వచ్చే పరీక్ష లో ఇదే రకమైన ప్రశ్నలను ఎక్కువ మార్కులకు అడిగే అవకాశముంది.

ఎక్స్‌పెక్టెడ్ కొశ్చన్స్:
పర్యావరణంలోని ప్రధాన విభాగాలను పేర్కొని వీటి మధ్య సంబంధాలను చర్చించండి?
పర్యావరణంలో నేలల పాత్రను వివరించండి?
వాతావరణంలోని పొరలను పేర్కొని జీవావరణాన్ని ప్రభావితం చేసే పొర లక్షణాలను వివరించండి?
జీవావరణానికి పర్యావరణంలోని ఇతర పొరలకు మధ్య సంబంధాలను పరిశీలించండి?
భారతదేశంలో పర్యావరణవాదం రూపు రేఖలను పరిశీలించండి?
పర్యావరణవాదం వల్ల సామాజిక ఆర్ధికాభివృద్ధిపై ప్రభావాన్ని మూల్యాంకనం చేయండి?
కాలుష్య నియంత్రణ చట్టాల ప్రకారం నమూనాల సేక రణకు సంబంధించిన నియమ నిబంధనలను చర్చిం చండి?
జల కాలుష్య సుంకాల చట్టం కింద వివిధ రకాల జల వినియోగంపై సుంకాల వివరాలను వివరించండి?
పర్యావరణ పరిరక్షణ చట్టం కింద కేంద్ర ప్రభుత్వ సాధారణ అధికారాలను చర్చించండి?
పర్యావరణ పరిరక్షణకు చట్టాలు ఎంతమేరకు ఉపయో గపడతాయో వాటి పరిమితులేమిటో విశ్లేషించండి?

రెండో యూనిట్

ఇందులోని అంశాలు సహజ వనరులకు సంబంధిం చినవి. అటవీ, జల, ఖనిజ, భూవనరులకు సంబంధించిన అంశాలను సిలబస్‌లో పొందుపరిచారు. విద్యార్ధులకు ఈ అంశాలు సాధారణంగాను, తేలికగాను క నిపిస్తాయి. కానీ వీటి పరిధి మాత్రం చాలా విస్తృతం అనే అంశాన్ని గుర్తుం చుకోవాలి. సమకాలీన సమాచారం, క్షేత్ర స్థాయి సమస్యల పట్ల అవగాహన అవసరం. భౌగోళిక శాస్త్ర పాఠ్య పుస్తకా లలో ఈ యూనిట్‌లోని అంశాలకు సంబంధించిన విస్తృత సమాచారం లభ్యమవుతుంది. వనరుల విస్తరణ, వనరుల పరిమాణం మీద కంటే వనరులకు సంబంధించిన సమ స్యలపై విద్యార్ధులు అధిక దృష్టిని కేంద్రీకరించాలి.

2008 గ్రూప్ 1 పరీక్షలో రెండో యూనిట్ నుంచి అడి గిన ప్రశ్నలు మూస రీతిలో ఉన్నాయి. భారతదేశంలో అడవుల రకాలను వివరించండి? భారతదేశంలో లభ్య మయ్యే ఖనిజ వనరులను వివరించండి? అని అడి గారు. ఈ రకమైన ప్రశ్నలకు సమాధానాలను ఎంతో నైపుణ్యంతో రాస్తే తప్ప అధిక మార్కులు సాధించడం కష్టం. వచ్చే గ్రూప్ 1 పరీక్షలో పాయింటెడ్, స్పెసిఫిక్ ప్రశ్నలు అడిగే అవకాశం ఎక్కువగా ఉంది.

ఎక్స్‌పెక్టెడ్ కొశ్చన్స్:
భారతదేశంలో కొనిఫెరస్ అరణ్యాలు ఎక్కడ పెరుగు తున్నాయి? లక్షణాలు,ఉపయోగాలు వివరించండి?
అడవుల వల్ల మానవ సమాజాలకు కలిగే ప్రయోజ నాలను పరిశీలించండి?
భారతదేశంలోని ప్రధాన, గౌణ అటవీ ఉత్పత్తులను అంచనా వేయండి?
భారతదేశంలో అటవీ వనరులకు ఏర్పడుతున్న ముప్పును చర్చించండి?
భారతదేశంలో దుర్భిక్ష, వరద పీడిత ప్రాంతాల విస్తరణను చర్చించండి?
ఆనకట్టల వర్గీకరణను పేర్కొని వాటి ప్రయోజనాలను, లక్షణాలను వివరించండి?
ఆనకట్టల వల్ల కలిగే ప్రయోజనాలను, ఎదురవుతున్న సమస్యలను పరిశీలించండి?
భారతదేశంలో నేలల పరిరక్షణకు ప్రభుత్వం తీసుకుం టున్న చర్యలను మూల్యాంకనం చేయండి?
భారతదేశంలో పంటల రీతులను ప్రభావితం చేస్తున్న అంశాలను విశ్లేషించండి?
ఖనిజ వనరుల వెలికితీత భారతదేశంలో ఏరకంగా పర్యావరణ సమస్యలకు దారితీస్తుందో వివరించండి?

మూడో యూనిట్

ఈ విభాగంలోని అంశాలు ఆవరణ వ్యవస్థలకు సంబం ధించినవి. ఈ యూనిట్‌ను ప్రధానంగా రెండు విభాగాలు గా విభజించవచ్చు. అవి ఆవరణ వ్యవస్థ-అంశాలు, జీవ వైవిధ్యం- సంబంధిత అంశాలు. ముఖ్యంగా జీవవైవిధ్య తకు సంబంధించి సమకాలీన సమాచారాన్ని సేకరించాలి. ఓడమ్ రచించిన ఎకో సిస్టం మొదలుకొని ఆవరణ వ్యవస్థ లకు సంబంధించిన అనేక పాఠ్య పుస్తకాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రామాణిక పాఠ్యపుస్త కాలు, గ్రంథాల ఆధారంగా ప్రిపరేషన్ కొనసాగాలి.

2008 గ్రూప్ 1 పరీక్షలో ఈ యూనిట్ నుంచి నాణ్యమై న ప్రశ్నలు అడిగారు. ఫోకస్డ్‌గా చిన్న చిన్న భాగాలుగా అడిగారు. అర్థవంతంగా ప్రిపేర్ అయితే తప్ప ఇటు వంటి ప్రశ్నలకు సవూధానాలు రాయుడం కష్టం.

ఎక్స్‌పెక్టెడ్ కొశ్చన్స్:
ఆవరణ వ్యవస్థలకు కిరణజన్య సంయోగక్రియ ఏ విధంగా ఉపకరిస్తుందో వివరించండి?
పరపోషకాలు అంటే ఏమిటి? ఏదేని ఒక ఆహార వ్యవస్థలో వీటి పాత్రను పరిశీలించండి?
ఆహార పిరమిడ్ అంటే ఏమిటి? విలోమ ఆహార పిరమిడ్ దృ గ్విషయాన్ని పరిశీలించండి?
తృణ భూముల ఆవరణ వ్యవస్థలలో ‘ఆహారపు వల’ ను వివరించండి?
ఆహారపు వలలు విచ్ఛిన్నమవటంలో మానవుని పాత్ర ను పరిశీలించండి?
మానవ నిర్మిత (కృత్రిమ) ఆవరణ వ్యవస్థలకు ఉదాహ రణలివ్వండి?
జీవ వైవిధ్యతను పరిరక్షించడానికి జాతీయ, అంతర్జాతీ య స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలను వివరించండి?
‘బయోస్ఫియర్ రిజర్వ్’ నిర్మాణాన్ని పరిశీలించి భారత దేశంలోని రక్షిత బయోస్ఫియర్ రిజర్వ్‌ల ఉనికిని పేర్కొనండి?
భారతదేశంలో ‘రామ్ సేర్’ ఒప్పందం కింద రక్షిస్తున్న ఆవరణ వ్యవస్థలేవి?
‘పోషక చక్రం’ అంటే ఏమిటి? ప్రాధాన్యతను వివరిం చండి?

నాలుగు - ఐదో యూనిట్లు

నాలుగో యూనిట్‌లో పర్యావరణ కాలుష్యం, ఘన వ్యర్ధ నిర్వహణకు సంబంధించిన అంశాలను పొందుపరిచారు. ఐదో యూనిట్‌లో అంతర్జాతీయ పర్యావరణ సమస్యలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాత్ర వంటి అంశాలను చేర్చారు. 2008 గ్రూప్ 1లో ఈ రెండు యూనిట్ల నుంచి సునిశితమైన, సందర్భోచితమైన ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ముఖ్యం గా ఐదో యూనిట్‌లోని అంతర్జాతీయ పర్యావరణ సమస్యలకు సంబంధించి సమకాలీనంగా జరుగుతున్న సంఘట నలను విద్యార్ధులు నిశితంగా పరిశీలించాలి. వీటి కోసం ప్రతి రోజు వార్తాపత్రికలను, మ్యాగజీన్లను చదవడం తప్పనిసరి.

నాలుగో యూనిట్ ఎక్స్‌పెక్టెడ్ కొశ్చన్స్:
జల కాలుష్య ప్రధాన కారణాలను, కారకాలను వివరించండి?
బయోమాగ్నిఫికేషన్ అంటే ఏమిటి? దీనికి ఉదాహ రణ ఇవ్వండి?
యుట్రిఫికేషన్ అంటే ఏమిటి? దీని దుష్ర్పభావాన్ని వివరించండి?
ధ్వని కాలుష్య అవధులను పేర్కొని ధ్వని కాలుష్య నియంత్రణ పద్ధతులను వివరించండి?
నీటి శుద్ధిలో వివిధ దశలను వివరించండి?
పారిశ్రామికాభివృద్ధి జల, వాయు, శ బ్ద కాలుష్యాలకు ఏ రకంగా కారణమవుతుందో చర్చించండి?
వాహనాల నుంచి విడుదలయ్యే ఏ వ్యర్ధ పదార్ధాలు వాయు కాలుష్యాన్ని కలుగజేస్తాయి? వాహన కాలుష్య నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలేవి?
ఘన వ్యర్ధాలను వర్గీకరించండి?
బయో మెడికల్ వ్యర్ధాలు, ఎలక్ట్రానిక్ వ్యర్ధాలు ఏ రకంగా హాని కారకాలో పరిశీలించండి?
ఘన వ్యర్ధ నిర్వహణలో భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలేవి?

ఐదో యూనిట్ ఎక్స్‌పెక్టెడ్ కొశ్చన్స్:

గ్లోబల్ వార్మింగ్ వివాదంలో భారతదేశం వైఖరిని వివరించండి?
గ్లోబల్ వార్మింగ్‌ను నివారించడానికి నీవు వ్యక్తిగతం గా తీసుకునే చర్యలేవి?
సుస్థిరాభివృద్ధి అంటే ఏమిటి? భారతదేశంలో ఆర్ధికా భివృద్ధి పర్యావరణ సమస్యలకు ఏ రకంగా దారితీ స్తుందో పరిశీలించండి?
వాటర్‌షెడ్ నిర్వహణ వల్ల ఉపయోగాలేవి?
భారతదేశం మీద శీతోష్ణస్థితి మార్పు ప్రభావాన్ని పరి శీలించండి?
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఏ విధంగా పర్యావరణ అభి వృద్ధికి ఉపయోగించవచ్చో వివరించండి?
భారతదేశంలో వ్యర్ధాల పునశ్చక్రీయం ఎక్కడ ప్రయ త్నిస్తున్నారు?
భారతదేశంలో వ్యర్ధ భూముల విస్తీర్ణాన్ని పరిశీలిం చండి?
ఎడారీకరణ అంటే ఏమిటి? ఇది ఏ రకంగా సంభవిం స్తుందో వివరించండి?
వ్యర్ధ భూములను పునర్ వినియోగానికి తెచ్చే పద్ధతు లను పరిశీలించండి?

పేపర్-4
విభాగం-3

ఈ విభాగంలో ప్రధానంగా పర్యావరణ సమస్యలు, పర్యావరణ చట్టాలు, ఆవరణ వ్యవస్థలకు సంబంధించిన ప్రాథమిక అంశాలు, పర్యావరణ పరిరక్షణలో సమాచార సాంకేతిక విజ్ఞానం పాత్ర, సహజ వనరులు మొదలైన అంశాలు ఉన్నాయి.

ఈ విభాగం మీద పట్టు సాధించడం వల్ల కేవలం మెరుున్స్‌లోనేకాకుండా.. ఇంటర్వ్యూ దశలోను చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ప్రిపరేషన్‌లో సంప్రదాయక పాఠ్యపుస్తకాలలో లభించే సమాచారంతోపాటు సంబంధిత సమకాలీ న సమాచారాన్ని కూడా సేకరించడం లాభిస్తుంది.

                                                                                    -గురజాల శ్రీనివాసరావు
                                                                                     సివిల్స్ సీనియర్ అధ్యాపకులు
                                                                                     ఆర్.సి. రెడ్డి స్టడీ సర్కిల్

పార్లమెంట్ కమిటీలన్నింటిలో పెద్దది?

పార్లమెంట్ కమిటీలన్నింటిలో పెద్దది?






1. పదవీ కాలం ముగియక ముందే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులను తొలగిం చేవారు?
ఎ) యూపీఎస్సీ చైర్మన్
బి) పార్లమెంట్ తీర్మానం మేరకు రాష్ర్టపతి
సి) సుప్రీంకోర్టు సిఫారసు మేరకు రాష్ర్టపతి
డి) సుప్రీంకోర్టు సిఫారసు మేరకు ప్రధానమంత్రి
సమాధానం: సి
యూపీఎస్సీ చైర్మన్, సభ్యుల అసమర్థత, దుష్ర్పవర్తన వంటి కారణాలతో పదవీకాలం ముగియక ముందే రాష్ర్టపతి తొలగిం చవచ్చు. సభ్యులపై వచ్చే ఆరోపణల గురించి రాష్ర్టపతి సుప్రీంకోర్టు పరిశీలనకు పంపు తారు. ప్రధాన న్యాయమూర్తి ఏర్పాటు చేసిన విచారణ కమిటీ సిఫారసు మేరకు రాష్ర్టపతి చర్య తీసుకుంటారు.

2. పార్లమెంట్ కమిటీలన్నింటిలో పెద్దది?
ఎ) ప్రభుత్వ ఖాతాల సంఘం
బి) అంచనాల కమిటీ
సి) ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ
డి) సంయుక్త పార్లమెంటరీ కమిటీ
సమాధానం: బి
అంచనాల కమిటీ పార్లమెంటరీ కమిటీ లన్నింటిలో అతి పెద్దది. ప్రభుత్వ ఖాతాల సంఘం, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీల్లో 22 మంది చొప్పున సభ్యులుంటారు. అంచనాల కమిటీలో 30 మంది సభ్యులుంటారు. సంయుక్త పార్లమెంటరీ కమిటీ సభ్యుల సంఖ్యను ఆయా సందర్భాలను అనుసరించి ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ ఒక అడహాక్ (తాత్కాలిక) కమిటీ మాత్రమే. నిరంతర మిత వ్యయ కమిటీగా పేర్కొనే అంచనాల కమిటీ సభ్యులందరూ లోక్‌సభ నుంచి నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిపై ఎన్నికవుతారు

3. భారతదేశంలో న్యాయశాఖదే క్రియాశీలక పాత్ర అనే భావన ఏ దశకం నుంచి ప్రాచుర్యంలోకి వచ్చింది?
ఎ) 1960 బి) 1970 సి) 1980 డి) 1990
సమాధానం: సి
న్యాయవ్యవస్థ క్రియాశీలక పాత్ర గురించి రాజ్యాంగంలో ఎలాంటి ప్రస్తావనా లేదు. పౌరుల ప్రాథమిక హక్కుల సంరక్షణ, ప్రభుత్వాలు తమ విధులను సక్రమంగా నిర్వహించడంలో న్యాయవ్యవస్థ క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. 1980ల్లో సుప్రీంకోర్టులో ప్రధాన, సాధారణ న్యాయమూర్తులుగా పనిచేసిన జస్టిస్ ఎస్. ఎం.సిక్రీ, హెచ్.ఆర్. ఖన్నా, పి.ఎన్.భగవతి, వి.ఆర్.కృష్ణయ్యర్‌లు న్యాయశాఖ క్రియాశీల కత్వంలో ప్రధానపాత్ర పోషించారని పేర్కొనొచ్చు. తాజ్‌మహల్ చుట్టూ కాలు ష్యాన్ని వెదజల్లే పరిశ్రమలను మూసి వేయడం, బాలకార్మిక వ్యవస్థ నిషేధంలో న్యాయశాఖ పాత్ర చెప్పుకో దగింది.

4. ఎవరి సూచనల ప్రకారం యూపీఎస్సీకి అదనపు బాధ్యతలను అప్పగించొచ్చు?
ఎ) కేంద్ర హోంశాఖా మంత్రి
బి) పార్లమెంట్
సి) కేంద్ర మంత్రి మండలి డి) రాష్ర్టపతి
సమాధానం: బి
పార్లమెంట్ తీర్మానం అనుసరించి యూని యన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు అదనపు విధు లు అప్పగించొచ్చు. పార్లమెంట్ తీర్మానం లేనిదే కమిషన్ విధుల్లో ఎలాంటి మార్పులూ చేయలేం.

5. వీటిలో పంచాయితీరాజ్ సంస్థల విషయంలో రాష్ట్రాలు నిర్వర్తించాల్సిన అంశం?
ఎ) మూడంచెల విధానం
బి) రెండంచెల విధానం
సి) కొన్ని రాష్ట్రాలకు మూడంచెల విధానం విషయంలో మినహాయింపు ఉంది
డి) రాష్ట్రాలకు ఈ విషయంలో ఐచ్ఛికాంశం మాత్రమే
సమాధానం: డి
73వ రాజ్యాంగ సవరణ అనుసరించి రాష్ట్రాల్లోని పంచాయితీరాజ్ వ్యవస్థలో మూడంచెల విధానాన్ని సూచించారు. నేటికీ మన దేశంలో అనేక రాష్ట్రాల్లో మూడంచెల విధానం కొనసాగుతోంది. ఐతే జమ్మూ, కాశ్మీర్‌లో రెండంచెలు, పశ్చిమ బెంగాల్‌లో నాలుగంచెల విధానం అమల్లో ఉంది. ఈ విషయంలో రాష్ట్రాల ఐచ్ఛికతకు వదిలేశారు. 20 లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాల్లో మధ్యంతర వ్యవస్థకు మినహా యింపు ఉంది.

6. రాష్ర్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా పదవీ విరమణ చేసినవారు కేంద్రంలో లేదా రాష్ర్టంలో ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాన్ని నిర్వహిం చరాదు. కానీ కింది ఏ విషయంలో మిన హాయింపు ఉంది?
ఎ) భారత ప్రధాన న్యాయమూర్తిగా
బి) ప్రధాన ఎన్నికల అధికారిగా
సి) యూపీఎస్సీ సభ్యులుగా
డి) లోక్‌సభ స్పీకర్‌గా
సమాధానం: సి
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో సభ్యులుగా పనిచేసి పదవీ విరమణ చేసిన వారు యూని యన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో సభ్యులుగా పని చెయొచ్చు.

7. 352వ అధికరణలో (జీ)వ క్లాజ్‌ను చేర్చడం ద్వారా ‘ఆంతరంగిక అల్లకల్లోల పరిస్థితులకు’ బదులు ‘సాయుధ తిరుగుబాటు’ అనే పదం ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు?
ఎ) 42 బి) 44 సి) 32 డి) 34
సమాధానం: బి
1975లో ఇందిరాగాంధీ ప్రభుత్వం అంత రంగిక కారణాలతో దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి విధించారు. 1977లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం అత్యవసర పరిస్థితిలో పౌరుల హక్కులకు కలిగిన భంగాన్ని దృష్టిలో ఉంచుకుని అంతరంగిక అల్లకల్లోల పరిస్థితు లు అనే పదానికి బదులు సాయుధ తిరుగు బాటు అనే పదాన్ని 44వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు.

8. భారతదేశ విభజనకు ఏ అంశం ఆధారంగా బ్రిటిషర్లు అంగీకరించారు?
ఎ) కేబినెట్ మిషన్ ప్లాన్
బి) మౌంట్ బాటన్ ప్లాన్
సి) క్రిప్స్‌మిషన్ ప్లాన్ డి) సిమ్లా ఒప్పందం
సమాధానం: బి
ద్విజాతి సిద్ధాంతం ప్రాతిపదికగా ముస్లింలీగ్ ప్రత్యేక పాకిస్తాన్ ఏర్పాటు కోసం డిమాండ్ చేస్తే.. కాంగ్రెస్ దేశ విభజనకు అంగీక రించలేదు. దీంతో ఈ రెండు సంస్థల మధ్య అగాధం నెలకొంది. ముస్లింలీగ్ ప్రత్యేక పాకిస్తాన్ ఏర్పాటు కోసం ప్రత్యక్ష చర్యకు పూనుకోవడంతో అనేక ప్రాంతాల్లో హింస, మత కల్లోలాలు చెలరేగాయి. పరిస్థితులు చక్కదిద్దడంలో లార్‌‌డవేవెల్ విఫలమయ్యారు.

దీంతో లార్‌‌డ మౌంట్ బాటన్‌ను వేవెల్ స్థానంలో గవర్నర్ జనరల్‌గా నియమించారు. విభజనకు సంబంధించిన ప్రణాళికను మౌంట్‌బాటన్ ప్రవేశపెట్టారు. దీన్నే ఢిక్కీబర్‌‌డ పథకం అని కూడా అంటారు. ముస్లింలు ఎక్కువగా నివసించే ప్రాంతాలు పాకిస్థాన్‌లో, హిందువులు ఎక్కువగా నివసించే ప్రాంతాలు భారత్‌లో, స్వదేశీ సంస్థానాలు ఏ భాగంలో నైనా విలీనం కావచ్చొని, వివాదాస్పద ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా నిర్ణయించాలని ఆ పథకంలో పేర్కొన్నారు.

9. భారత రాజ్యాంగ సవరణ పద్ధతికి మూలం?
ఎ) 1935 భారత ప్రభుత్వ చట్టం
బి) భారత స్వాతంత్య్ర చట్టం 1947
సి) అమెరికా రాజ్యాంగం
డి) బ్రిటన్ రాజ్యాంగం
సమాధానం: ఎ
భారత రాజ్యాంగ సవరణ విధానాన్ని మన దేశం దక్షిణాఫ్రికా నుంచి గ్రహించినప్పటికీ 1935 భారత ప్రభుత్వ చట్టంలో సవరణకు సంబంధించిన అంశాలు వివరంగా పేర్కొన్నారు. 1935 చట్టాన్ని అనుసరించి ఆనాటి బ్రిటీష్ రాజమకుటం ఆమోదంతోనే సవరించాలి. స్వాతంత్య్రం అనంతరం పార్లమెంట్ ఆమోదించే సవరణ బిల్లుకు రాష్ర్టపతి ఆమోదముద్ర వేయాలి.

10. బిటిషర్లు భారతదేశంలో ప్రవేశపెట్టిన ఏ చట్టం మన ప్రభుత్వ విధానాన్ని ఏకకేంద్ర విధానం నుంచి సమాఖ్యవైపు మరల్చింది?
ఎ) మాంటేగ్-చేమ్స్‌ఫర్‌‌డ సంస్కరణల చట్టం 1919
బి) 1909 కౌన్సిల్ చట్టం
సి) 1935 భారత ప్రభుత్వ చట్టం
డి) భారత స్వాతంత్య్ర చట్టం 1947
సమాధానం: సి
1930లో లార్‌‌డ సైమన్ కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా బ్రిటిష్ ప్రభుత్వం 1930, 1931, 1932ల్లో రౌండ్ టేబుల్ సమావేశాల ద్వారా విస్తృత సంప్రదింపులు జరిపింది. భారతదేశానికి ఏకకేంద్ర ప్రభుత్వం కంటే సమాఖ్య ప్రభుత్వమే ఉత్తమం అని సైమన్ కమిషన్ సిఫారసు చేసింది. విశాల భూ భాగం, పరిపాలనా పరిధి, భిన్న సంస్కృ తుల వల్ల దేశంలో సమాఖ్య ప్రభుత్వమే సరైందని భావించి 1935 చట్టం ద్వారా సమాఖ్య విధానాన్ని ప్రవేశపెట్టారు.

11. రాజ్యాంగ పీఠిక రాజ్యాంగ మౌలిక స్వరూపం లో అంతర్భాగమని ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది?
ఎ) గోలక్‌నాథ్ -1967
బి) మేనకాగాంధీ - 1978
సి) మినర్వామిల్- 1980
డి) కేశవానంద భారతి- 1973
సమాధానం: డి
రాజ్యాంగ ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భా గమే అని 1973 కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరించే అధికారం పార్లమెంట్ కు ఉన్నప్పటికీ మౌలిక స్వరూపాన్ని సవరించే అధికారం లేదని సుప్రీకోర్టు పేర్కొంది. నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సిక్రీతో సహా ఇతర న్యాయమూర్తులు కూడా రాజ్యాంగ ప్రవేశికలోని సార్వభౌమత్వం, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం ఏకత, గణతంత్ర విధానం, ప్రజాస్వామ్యం మొదలైన అంశాలన్నీ మౌలిక స్వరూపంలో అంతర్భాగమని పేర్కొన్నారు.

12. ఏ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి 77వ రాజ్యాంగ సవరణ ద్వారా 16వ అధికరణకు 4(ఎ)ను చేర్చారు?
ఎ) భారత ప్రభుత్వం వర్సెస్ కాశీకర్
బి) ఇందిరా సహానీ వర్సెస్ భారత ప్రభుత్వం
సి) శివచంద్ర వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్
డి) డీటీసీ వర్సెస్ మజ్దూర్ కాంగ్రెస్
సమాధానం: బి
మండల్ కేసుగా పిలిచే ఇందిరా సహానీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు తీర్పు మేరకు 77వ రాజ్యాంగ సవరణ చేశారు. 16(4)ఎ అధికరణ ప్రకారం ఉద్యోగులకు ఇచ్చే పదోన్నతుల్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలని సుప్రీంకోర్టు సమర్థించింది.

13. లోక్‌సభ సీట్లలో కొన్నింటిని ఏ వర్గాలకు రిజర్వ్ చేయలేదు?
ఎ) షెడ్యూల్డ్ కులాలు బి) షెడ్యూల్డ్ తెగలు
సి) స్వయం పాలిత జిల్లాలుగా షెడ్యూల్డ్ తెగలకు అస్సాంలో కల్పించిన రిజర్‌‌వడ్ సీట్లు
డి) ఆంగ్లో-ఇండియన్లకు
సమాధానం: డి
భారత రాజ్యాంగంలోని 330వ అధికరణ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు లోక్‌సభ స్థానాల్లో జనాభా అనుసరించి సీట్లను రిజర్‌‌వ చేశారు. అస్సాంలోని కొన్ని జిల్లాల్లో ఏర్పడిన అటానమస్ కౌన్సిల్స్ ఉన్న ప్రాంతాల్లో కూడా షెడ్యూల్డ్ తెగలకు సీట్లు రిజర్‌‌వ చేశారు. ఆంగ్లో-ఇండియన్లకు ప్రత్యేకంగా రిజర్‌‌వ చేసిన నియోజకవర్గాలు లేవు. 331వ అధికరణ ప్రకారం లోక్‌సభలో ఆంగ్లో- ఇండియన్లకు సరైన ప్రాతినిధ్యం లేదని భావించినపుడు రాష్ర్టపతి ఇద్దరిని లోక్‌సభకు నామినేట్ చేస్తారు.

14. లోక్‌సభ నియోజకవర్గాల ప్రాంతాన్ని ఎవరు నిర్ణయిస్తారు?
ఎ) డీలిమిటేషన్ కమిటీ
బి) కేంద్ర ఎన్నికల కమిషన్
సి) జనాభా లెక్కల సేకరణ కమిషన్
డి) భారత రాష్ర్టపతి
సమాధానం: బి
నియోజకవర్గాల పునర్‌వ్య వస్థీకరణ బాధ్యత భారత ఎన్నికల కమిషన్‌ది. 82వ అధికరణ ప్రకారం జనాభా లెక్కల సేకరణ తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన వ్యక్తి ఆధ్వర్యంలో ఏర్పడే డీలిమిటేషన్ కమిటీలో కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి ఒకరు, రాష్ర్ట ఎన్నికల అధికారి, ఆ ప్రాంత రిటర్నింగ్ అధికారి సభ్యులుగా ఉండి నియోజక వర్గాల పునర్‌వ్యవస్థీకరణ ప్రతిపాదనలు చేస్తారు.

15. పజా ప్రాతినిధ్య చట్టం-1951 సవరిస్తూ ఎన్నికల వివాదాలను విచారించే అధికారం హైకోర్టులకు కల్పించిన రాజ్యాంగ సవరణ?
ఎ) 16వ బి) 17వ సి) 18వ డి) 19వ
సమాధానం: డి

కరెంట్ అఫైర్స్-డిసెంబర్ -2010 సంచిక 3

1.సీబీఐ కొత్త డెరైక్టర్‌గా ఏపీ సింగ్
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నూతన డెరైక్టర్‌గా 1974 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అవుర్ ప్రతాప్(ఏపీ) సింగ్ నవంబర్ 30న బాధ్యతలు స్వీకరించారు. అశ్వనీ కువూర్ స్థానంలో నియుమితులైన సింగ్ రెండేళ్లపాటు పదవిలో కొనసాగుతారు.

2.రాష్టప్రతి ప్రతిభా పాటిల్ సిరియూ పర్యటన
భారత రాష్టప్రతి ప్రతిభా పాటిల్ సిరియూలో పర్యటించా రు. ఈ పర్యటనలో ప్రతిభా పాటిల్ ఆ దేశాధ్యక్షుడు బసర్ అల్ అస్సాద్‌తో సవూవేశవుయ్యూరు. ఈ సందర్భంగా ఇరు దేశాల ఆర్థిక సంబంధాలు, వ్యవసాయుం, ఆరోగ్యం, ఖనిజ వనరులు, విద్యుత్, రవాణా, టెలికవుూ్యనికేషన్‌లో సహకారం తదితర అంశాలు చర్చకు వచ్చారుు.

భద్రతా వుండలిలో భారత శాశ్వత సభ్యత్వానికి సిరియూ వుద్దతు ప్రకటించింది. 2010-13 వుధ్య కాలంలో సాంస్కృతిక సంబంధాల్లో సహకారం, సిరియూ రేడియో, టీవీ సంస్థ- ప్రసార భారతి వుధ్య, సిరియూ అరబ్ న్యూస్ ఏజెన్సీ- పీటీఐ వుధ్య సహకారానికి సంబంధించి ఇరు దేశాలు ఒక అవగాహనకు వచ్చారుు.

3.మిస్ ఎర్త్ 2010 నికోల్ ఫారియా
భారత్‌కు చెందిన నికోల్ ఫారియా ‘మిస్ ఎర్త్ 2010’గా ఎంపికయ్యారు. వియత్నాంలోని హాంగర్‌లో డిసెంబర్ 4న జరిగిన పోటీల్లో బెంగళూరుకు చెందిన 20 ఏళ్ల ఫారియా విజేతగా నిలి చింది. 10 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈపోటీల్లో భారత్‌కు తొలిసారిగా టైటిల్ దక్కింది.

4.ఫెదరర్‌కు ఏటీపీ వరల్డ్ టూర్ టైటిల్
ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌ను స్విట్జర్లాం డ్‌కు చెందిన రోజర్ ఫెదరర్ గెలుచుకు న్నారు. నవంబర్ 29న లండన్‌లో జరి గిన ఫైనల్లో స్పెరుున్‌కు చెందిన రఫెల్ నాదల్‌ను ఓడించాడు. ఫెదరర్ ఐదో సారి ఈ చాంపియున్‌షిప్‌ను సాధించాడు.

5.కాంకున్‌లో వాతావరణ సదస్సు
మెక్సికోలోని కాంకున్‌లో 16వ ఐక్యరాజ్యసమితి వాతావరణ వూర్పు సదస్సు (యుునెటైడ్ ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ ఛేంజ్- యుుఎన్‌ఎఫ్‌సీసీ) నవంబర్ 29న ప్రారంభమైంది. క్యోటో ప్రోటోకాల్ ప్రకారం కుది రిన మెుదటి నిబద్ధత ఒప్పందం డిసెంబర్ 2012 నాటికి వుుగియునుండడంతో.. సంబంధిత పర్యవసానాలపై సద స్సులో చర్చించనున్నారు.

1997 క్యోటో ప్రోటోకాల్ ప్రకా రం పారిశ్రామిక దేశాలు 2012 నాటికి తవు ఉద్గారాలను 5.2 శాతం తగ్గించాలి. ఈ సదస్సు అటవీ సంబంధ అం శాలు- నిర్మూలన-క్షీణత వల్ల ఉద్గారాల తగ్గింపు వంటి అంశాలపై కూడా దృష్టి సారించనుంది. ఈ సవూవేశానికి 194 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతున్నారు.

6.బ్రహ్మోస్ పరీక్ష విజయువంతం

అత్యాధునిక బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూరుుజ్ క్షిపణిని ఒడిశాలోని చాందీ పూర్ నుంచి విజయువంతంగా పరీక్షిం చారు. 8.4 మీటర్ల పొడవుండే ఈ క్షిపణి ధ్వని వేగానికి 2.8 రెట్ల వేగంతో దూసుకె ళ్తుంది. 300 కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళ్తూ 290 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని చేధించగలదు. బ్రహ్మోస్ ను నౌక, వివూనం వంటి భిన్న వేదికల నుంచి ప్రయోగిం చవచ్చు. మెుదటి తరం బ్రహ్మోస్ క్షిపణులను భారతీయు నావిక దళంలో 2005లో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం పరీక్షిం చిన క్షిపణి వుూడో తరానికి చెందింది.

7.అణు ఇంధన బ్యాంకుకుఐఏఈఏ ఆమోదం
అణు ఇంధన బ్యాంకు ఏర్పాటుకు సంబంధించిన తీర్మా నాన్ని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) ఆమోదించింది. తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో.. ఐఏఈఏ పాలకవుండలిలోని 35 దేశాలకుగాను 28దేశాలు తీర్మానా నికి అనుకూలంగా ఓటు వేశారుు. అర్జెంటీనా, బ్రెజిల్, ఈక్వెడార్, దక్షిణాఫ్రికా, టునీషియా, వెనుజులాలు ఓటిం గ్‌లో పాల్గొనలేదు.

కాగా పాకిస్థాన్ గైర్హాజరరుుంది. అణ్వస్త్ర వ్యాప్తి చెందకుండా ప్రపంచ దేశాలు అణు ఇంధనం పొందేందుకు ఈ బ్యాంకు తోడ్పడుతుంది. రాజకీయ కారణాలతో అణు ఇంధనాన్ని పొందలేని దేశాలు, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధాన్ని పాటిస్తున్న దేశాలు ఈ బ్యాంకు నుంచి అణు ఇంధనాన్ని పొందగలుగుతాయి.

8.జీహెచ్‌ఎంసీకి జేఎన్‌ఎన్‌యుుఆర్‌ఎం అవార్డు
గ్రేటర్ హైదరాబాద్ వుున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ)కు జవహర్‌లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ (జేఎన్ ఎన్‌యుుఆర్‌ఎం) అవార్డు లభించింది. సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్‌లో సాధించిన ప్రగతికిగాను జీహెచ్‌ఎంసీ ఈ పుర స్కారానికి ఎంపికైంది.

9.2018 సాకర్ ప్రపంచకప్ వేదిక రష్యా
ఫిఫా(సాకర్) ప్రపంచకప్ టోర్నీని 2018లో రష్యా నిర్వ హించనుంది. జురిచ్‌లో డిసెంబర్ 2న జరిగిన ఫిఫా ఎగ్జిక్యూటివ్ కమిటీ సవూవేశంలో ఈ మేరకు నిర్ణయుం తీసుకున్నారు. అలాగే 2022 ఫిఫా వరల్డ్‌కప్ టోర్నీని ఖతా ర్‌లో నిర్వహించాలని కూడా సవూవేశం నిర్ణరుుంచింది. రష్యా, ఖతార్‌లు తొలిసారి ఈ పోటీలకు ఆతిథ్యం ఇవ్వను న్నారుు. కాగా బ్రెజిల్ వేదికగా 2014 సాకర్ వరల్డ్ కప్ టోర్నీ జరగనుంది. నాలుగేళ్లకోసారి నిర్వహించే ఈ పోటీలు 1930లో ప్రారంభవుయ్యూరుు. 2010 టోర్నీకి దక్షిణాఫ్రికా ఆతిథ్యమిచ్చింది.

10.న్యూట్రాన్ బాంబు సృష్టికర్త సావుూ్యల్ వుృతి
న్యూట్రాన్ బాంబును కనుగొన్న సావుూ్యల్ కొహెన్(89) లాస్ ఏంజెల్స్‌లో నవంబర్ 28నవురణించారు. 1958లో ఆయున ఈ బాంబును కనుగొన్నారు. దీని వల్ల గోడలు, భవనాలకు తక్కువ నష్టం వాటిల్లేది.. కానీ వునుషులు వూత్రం వురణించేవారు. వూనవునిలోని కేంద్రీయు నాడీ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీ స్తుంది. సావుూ్యల్ 1921 జనవరి 25న జన్మించారు.

11.క్షిపణిని విజయువంతంగా ప్రయోగించిన తేజస్
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుుద్ధ వివూనం (ఎల్‌సీఏ) తేజస్.. గగనతలం నుంచి గగనత లంలోని లక్ష్యాలను చేధించే ఆర్-73 క్షిపణిని విజయువం తంగా ప్రయోగించింది. వైవూనిక దళంలో తేజస్‌ను ప్రవేశపెట్టేందుకు ఈ పరీక్ష దోహదం చేస్తుంది. గోవాలోని ఐఎన్‌ఎస్ హంసలో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు.

12.ఇండియన్ ఓపెన్ గోల్ఫ్ విజేత కార్ల్‌బెర్గ్
స్వీడన్‌కు చెందిన రికార్డ్ కార్ల్‌బెర్గ్‌కు ఇండియన్ ఓపెన్ గోల్ఫ్ టైటిల్ గెలుచుకు న్నాడు. న్యూఢిల్లీలో డిసెంబర్ 5న ముగిసిన పోటీలో కార్ల్‌బెర్గ్ విజేతగా నిలిచాడు. గత ఏప్రిల్‌లో జరిగిన సెయిల్ ఓపెన్ టైటిల్‌ను కూడా కార్ల్‌బెర్గ్ గెలుచుకున్నాడు.

13.‘మోనర్ వునుష్’కు గోల్డెన్ పీకాక్ అవార్డు
గోవా రాజధాని పనాజీలో 11రోజుల పాటు జరిగిన 41వ భారత అంతర్జాతీయు చలనచిత్రోత్సవం (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) డిసెంబర్ 2న వుుగిసింది. ఈ ఉత్సవాల్లో 61 దేశాలకు చెందిన 300 చిత్రాలను ప్రదర్శించారు. ప్రారంభ చిత్రంగా బ్రిటన్‌కు చెందిన వెస్ట్ ఈజ్ వెస్ట్‌ను, వుుగింపు చిత్రంగా వెస్ట్ ఇన్ ద వెస్ట్‌ను ప్రదర్శించారు.

ఈ ఉత్సవాల్లో ‘మోనర్ వునుష్’ బెంగాలీ చిత్రం గోల్డెన్ పీకాక్ (బంగారు నెవులి) అవార్డుకు ఎంపికైంది. 19 శతాబ్దపు కవి లాలన్ ఫకీర్ కథ ఆధారంగా బెంగాలీ దర్శకుడు గౌతమ్ ఘోష్ ఈ చిత్రాన్ని రూపొందించారు. అవార్డు కింద * 40 లక్షల నగదును బహుకరించారు. 10 ఏళ్ల తర్వాత భారతీయు చిత్రానికి ఈ పురస్కారం దక్కింది.

ఈ ఉత్సవాల్లో ఇతర అవార్డుల వివరాలు.. జస్ట్ అనెదర్ లవ్‌స్టోరీ (వెండి నెవులి), ఉత్తవు దర్శకుడు- సుసాన్నేబీర్ (డానిష్ చిత్రం- ఇన్ ఎ బెటర్ వరల్డ్), ఉత్తవు నటుడు- గువెన్ కిరాక్ (టర్కీ చిత్రం-ద క్రాసింగ్), ఉత్తవు నటి- వుగ్దలా (పోలాండ్ చిత్రం-లిటిల్ రోజ్).

ఈ ఉత్సవాన్ని ఇండియూ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌గా కూడా వ్యవహరిస్తారు. దీనిని భారత ప్రభుత్వ సవూచార ప్రసార వుంత్రిత్వ శాఖ, ది ఇండియున్ డెరైక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ సంయుుక్తంగా నిర్వహిస్తారుు. ఈ ఉత్సవాలకు ది ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఎఫ్‌ఐఏపీఎఫ్) గుర్తింపు ఉంది.

భారత అంతర్జాతీయు చలన చిత్రోత్సవం నినాదం వసుధైక కుటుంబం (ది హోల్ వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ). 1952లో భారత అంతర్జాతీయు చలనచిత్రోత్సవం ప్రారంభమైంది.

1975 నుంచి ఈ ఉత్సవాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 40 సార్లు ఈ ఉత్సవాలను నిర్వహించారు.

2004 వరకు ఈ ఉత్సవాలను ప్రతి ఏటా దేశంలోని వివిధ నగరాల్లో నిర్వహించే వారు. కానీ 2004 నుంచి గోవా ఈ ఉత్సవాలకు ఆతిథ్యమిస్తుంది.

2004లో గోవా ప్రభుత్వం స్థాపించిన ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ ఆఫ్ గోవా ఈ ఉత్సవాల నిర్వహణకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది.

జాతీయాదాయం, వివిధ రంగాలు.. ప్రాధాన్యం

జాతీయాదాయం
ఒక సంవత్సర కాలంలో దేశంలో తయారైన అంతిమ వస్తు సేవల మొత్తం విలువను జాతీయాదాయం అంటారు. స్వాతంత్య్రానికి పూర్వం జాతీయ, తలసరి ఆదాయ అంచ నాలను కొంత మంది వ్యక్తిగతంగా రూపొందించే వారు. ఆయా అంచనాలు శాస్ర్తీయమైనవి కావు. స్వాతంత్య్రానం తరం జాతీయాదాయ అంచనాలను రూపొందించడానికి 1949లో జాతీయాదాయ కమిటీ , 1950 లో కేంద్రగణాంక సంస్థను ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం కేంద్రగణాంక సంస్థ 2004-05 ఆధార సంవత్సరంగా జాతీయ, తలసరి ఆదా యాలను అంచనా వేస్తుంది. అభివృద్ధి చేందుతున్న దేశా ల్లో జాతీయాదాయ అంచనాలకు ఉత్పత్తి, ఆదాయ మదిం పు పద్ధతులను ఉపయోగిస్తుండగా.. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆదాయ మదింపు, వ్యయ మదింపు పద్ధతులను అనుసరిస్తున్నారు. 2008-09లో స్థిర ధరల వద్ద (2004- 05) ఉత్పత్తి కారకాల పంపిణీ దృష్ట్యా జాతీయాదాయాన్ని * 41,54,973 కోట్లుగా కేంద్ర గణాంక సంస్థ అంచనా వేసింది.

జాతీయాదాయంలో వివిధ రంగాలు:
స్వాతంత్య్రానంతరం నికర దేశీయోత్పత్తిలో ప్రాథమిక రంగం వాటా(వ్యవసాయ రంగం ప్రాథమిక రంగంలో కీలకమైంది) 1960-61లో గరిష్టంగా 56.6 శాతం.కాగా కనిష్టంగా 2008-09లో 15.7 శాతం. తర్వాతి కాలంలో ఈ రంగం వాటాలో తగ్గుదల గమనించవచ్చు.1960-61లో నికర దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 54 శాతం కాగా 2008-09లో 13.2 శాతానికి పడిపోయింది.

వ్యవ సాయ రంగం వాటా గత 50 సంవత్సరాల కాలంలో తగ్గిన ప్పటికీ.. తగ్గుదలలో స్థిరత్వం కన్పించలేదు. ప్రణాళికబద్ధ ఆర్థిక ప్రగతి ప్రారంభమైన మొదట్లో నికర దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా తగ్గుదల ఎటువంటి నిర్మాణా త్మక మార్పును సూచించలేదు. ఈరంగం ప్రాథాన్యం తగ్గ డానికి రుతుపవనాల అననుకూలతను కూడా కారణంగా పేర్కొనవచ్చు.

ఇటీవల కాలంలో భారత ఆర్థిక వ్యవస్థలో అనేక నిర్మా ణాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. రవాణా, వాణి జ్యం, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఇతర సేవా కార్యకలాపా లు వ్యవసాయ రంగం కంటే వేగంగా వృద్ధి సాధించాయి. ఇప్పటికీ జాతీయాదాయ పెరుగుదలకు వ్యవసాయ రంగమే కీలకం. ప్రాథమిక రంగంలో వ్యవసాయ అనుబం ధ రంగాలైన అడవులు, చేపలవేట, పశుపోషణ, మైనింగ్ రంగాలుంటాయి. ఫిషింగ్ రంగం వాటా నికర దేశీయో త్పత్తిలో 1శాతం ఉండగా అడవులవాటా 1.3 నుంచి 1.7 శాతానికి పెరిగింది. 2009-10లో వ్యవసాయం, అడవు లు, చేపలవేట రుణాత్మక వృద్ధి (-0.2)ని నమోదు చేసు కోగా మైనింగ్, క్వారియింగ్‌లు 8.7 శాతం వృద్ధిని సాధిం చాయి.

ద్వితీయ రంగంలో అత్యంత కీలకమైంది తయారీ రంగం. జాతీయాదాయ అంచనాలకు ఈ రంగాన్ని రిజిస్టర్ అయిన, రిజిస్టర్ కానీ వాటిగా వర్గీకరిస్తారు. రిజిస్టర్ అయిన తయారీ రంగ యూనిట్లు నికర ఉత్పత్తిలో పెరుగు దల ఎక్కువగా ఉండి నికర దేశీయోత్పత్తిలో ఈ యూనిట్ల వాటా గణనీయంగా పెరిగింది. 1990లలో సంఘటిత పారిశ్రామిక వాటా తగ్గింది. రిజిస్టర్ కానీ తయారీ రంగం లో ఉపాధి కల్పన ఎక్కువ ఉండడంతో 1970-80 లలో ఈ రంగం కొన్ని ప్రోత్సాహకాలను పొందింది.

1990లలో సరళీకృత ఆర్థిక విధానాల నేపథ్యంలో తయారీ రంగ ప్రాధాన్యం తగ్గింది. ద్వితీయ రంగం కార్య కలాపాలైన విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా సాపేక్షికంగా చిన్నవి. వీటి కంటే నిర్మాణ రంగం సుమారు నాలుగు రెట్లు పెద్దది. 1950లలో ఈ రంగం వాటా నికర దేశీయోత్పత్తిలో 4 శాతం కాగా.. గత రెండు దశాబ్దలుగా వాటా సగటున 5.5 శాతం. 2008-09లో తయారీ రంగం 8.9 శాతం వృద్ధి సాధించగా.. నిర్మాణ రంగం 6.5 శాతం వృద్ధి నమోదు చేసుకుంది.

తృతీయ రంగంలోని వాణిజ్యం, రవాణా, సమాచార రంగాలు ప్రణాళిక యుగంలో స్థిరమైన వృద్ధి నమోదు చేసుకున్నాయి. ఫైనాన్సింగ్, ఇన్సూరెన్స్ కార్యకలాపాలు వేగంగా వృద్ధి సాధించాయి. రియల్ ఎస్టేట్ రంగం వాటా లో పెరుగుదల గణనీయంగా ఉండగా.. ప్రభుత్వ రంగం స్థిరమైన వృద్ధిని సాధించింది. 2009-10లో వాణిజ్యం, హోటళ్లు, రెస్టారెంట్లలో వృద్ధి 8.8 శాతంకాగా ఫైనాన్సింగ్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్, వాణిజ్య సేవలు 9.9 శాతం, కమ్యూనిటీ, సాంఘిక, వ్యక్తిగత సేవలు 8.2 శాతం వృద్ధి సాధించాయి.

జాతీయాదాయ లెక్కల ప్రాధాన్యం:
జాతీయాదాయ అంచనాలు ఒకదేశ ఆర్థిక వ్యవస్థకు కొల మానంగా ఉపకరిస్తాయి. ఈ అంచనాలలో కొన్ని సమస్య లు ఎదురవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికీ వస్తు మార్పిడి పద్ధతి అమలులో ఉన్నందువల్ల అనేక వస్తు సేవల విలువలు లెక్కించడం కష్టతరమైంది.

మార్షల్ అనే ఆర్థికవేత్త ఉత్పిత్తి కారకాల పరంగా జాతీ యాదాన్ని అంచనావేయగా.. పిగూ అనే మరో ఆర్థికవేత్త ఆదాయాన్ని ద్రవ్యరూపంలో అంచనా వేస్తే జాతీయాదా యం అవుతుందని భావించారు.
భారతదేశంలో ప్రణాళికా బద్ధ్దమైన ఆర్థిక ప్రగతి 1951లో ప్రారంభమైంది. జాతీయాదాయ అంచనాలను బట్టి ప్రణాళికలలో సాధించాల్సిన ఆర్థిక లక్ష్యాలను నిర్ణ యించడం జరుగుతుంది. స్థూల ఆర్థిక విధానాలకు ఈ అంచనాలు ఉపకరిస్తాయి.

ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాల ప్రగతిని తెలుసుకోవ డానికి జాతీయాదాయ గణాంకాలు ఉపకరిస్తాయి. స్వాతంత్య్రం వచ్చిన సమయంలో దేశ జాతీయ ఆదాయం లో సగానికిపైగా వాటా కల్గిన వ్యవసాయరంగం తర్వాత కాలంలో ప్రాధాన్యత కోల్పోయి ద్వితీయ, తృతీయ రంగా ల వాటా పెరిగింది. శ్రామికుల సంఖ్యతో పోల్చినప్పుడు ఏ రంగంలో ఉత్పాదకత తక్కువగా ఉంటుందో ఆవిధం గా ఉండటానికి కారణాలను అన్వేషించి వాటి నివారణకు తగిన విధానాలు రూపొందించాలంటే జాతీయాదాయ అంచనాలు అవసరం.

ఆర్థికాభివృద్ధి సూచికగా తలసరి ఆదాయాన్ని ప్రాతి పదికగా తీసుకోవచ్చు. తలసరి ఆదాయ ప్రాతిపదికగానే ఆయా దేశాలను అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలుగా వర్గీకరిస్తారు. ప్రజల జీవన ప్రమాణాన్ని తెలుసుకోవచ్చు.

జాతీయాదాయ పెరుగుదల రేటు జనాభా పెరుగు దల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే ప్రజల జీవన ప్రమా ణం పెరిగిందని భావించవచ్చు.

పంచవర్ష ప్రణాళికలు రూపొందించే క్రమంలో జాతీ య, తలసరి ఆదాయాల వృద్ధి లక్ష్యం, పొదుపు, పెట్టుబ డుల లక్ష్యం, వినియోగదారుల ఉత్పత్తి లక్ష్యం, ఐసీఓఆర్ (ఇంక్రిమెంటల్ క్యాపిటల్ అవుట్‌పుట్ రేషియో) లక్ష్యాన్ని నిర్ణయించుకుంటారు. జాతీయాదాయ అంచనాల వల్ల ప్రణాళికలు విజయవంతమయ్యాయో లేదో తెలుసు కోవ చ్చు. ప్రభుత్వం వివిధ శాఖలకు సంబంధించి విధాన నిర్ణ యాలు చేపట్టడానికి కూడా ఈ గణాంకాలు ఉపకరిస్తాయి.


జాతీయాదాయాన్ని నిర్ణయించే కారకాలు
జాతీయాదాయ, తలసరి ఆదాయాల పెరుగుదల ప్రజల జీవన ప్రమాణాల్ని మెరుగుపరుస్తుంది.
జాతీయాదాయ పెరుగుదల కింది కారకాలపై ఆధా రపడి ఉంటుంది.

సహజ వనరులు:
ఖనిజాల లభ్యత, నాణ్యత, విద్యుత్ ఆధారాలు(బొగ్గు, నీరు). ప్రోత్సాహకర వాతావరణం, సాయిల్ ఫెర్టిలిటీ జాతీయాదాయాన్ని పెంపొందించే కారకాలు.

మానవ వనరులు:
సహజ వనరులు, మూలధన వనరులు వినియోగం మా నవ వనరుల నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. శ్రామిక శక్తి ఉత్పాదకత ప్రత్యక్షంగా ఆధారపడే అంశాలు..

ఆరోగ్యం, శక్తి, విద్య, వయసు, నేర్పరితనం
పని గంటలు, నియమాలు

పారిశ్రామిక సంబంధాలలో భాగంగా యాజమాన్యం, శ్రామికుల మధ్య సహకారం
మూలధన పరికరాల నాణ్యత
తగిన వేతనాలు లభించే పరిశ్రమలో పాలుపంచుకునే జనాభా

ఉత్పత్తి కారకాలను సంఘటిత పరచడం:
అధిక జాతీయాదాయ సాధనకు దోహదం చేసే అంశాలు..
ఉపాధి లేని శ్రామికులను వినియోగించుకోవడం లేదా తక్కువ ఉత్పాదకత రంగాల నుంచి ఎక్కువ ఉత్పాద కత రంగాలకు శ్రామికుల బదిలీ.
ఉత్పత్తి కారకాల మధ్య సమన్వయం
మూలధన పరికరాలను అభిలషణీయంగా వినియో గించుకోవడం.

జనాభా పరిమాణం లేదా విదేశీ వాణి జ్య ప్రగతి:
చిన్న దేశాల్లో స్వదేశీ మార్కెట్ పరిధి స్వల్పంకావడంతో.. సంస్థల లాభదాయకత తక్కువగా ఉంటోంది. దాంతో పెద్ద తరహ ఉత్పత్తి వల్ల పొందే ప్రయోజనాలను పొంద లేక పోతున్నాయి. విదేశీ వాణిజ్య అవకాశాలను విస్తృత పరచుకున్నట్లయితే ఆర్థిక వృద్ధి సాధించడానికి ఎక్కువ అవకాశాలుంటాయి.

రాజకీయ వ్యవస్థ:
దేశంలో స్థిరమైన, సమర్థమైన రాజకీయ వ్యవస్థ ఉంటే వాణిజ్యం రంగం వృద్ధి బాటలో పయనిస్తుంది. రాజకీయ ఆస్థిరత వల్ల వనరుల వినియోగం తగ్గి జాతీయాదాయ వృద్ధి కుంటుపడుతుంది.

సాంకేతిక పరిజ్ఞానం, అవస్థాపనా సౌకర్యాలు:
అవస్థాపనా సౌకర్యాలు ముఖ్యంగా సమాచారం, విత్త సంస్థలు విద్య, పరిశోధనా సంస్థలు ఆర్ధిక వ్యవస్థలో సమ ర్థత పెంచడానికి దోహదపడి జాతీయాదాయ పెరుగుద లకు దారితీస్తాయి.

ముఖ్యాంశాలు:
ఒక సంవత్సర కాలంలో దేశంలో తయారైన అంతిమ వస్తు సేవల మొత్తం విలువను జాతీయాదాయం అంటారు.

2008-09లో స్థిర ధరల వద్ద (2004-05) ఉత్పత్తి కారకాల పంపిణీ దృష్ట్యా జాతీయాదాయాన్ని *41,54,973 కోట్లుగా కేంద్ర గణాంక సంస్థ అంచనా వేసింది.

1960-61లో నికర దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 54 శాతం కాగా 2008-09లో 13.2 శాతానికి పడిపోయింది.

జాతీయాదాయ అంచనాలు ఒకదేశ ఆర్థిక వ్యవస్థకు కొలమానంగా ఉపకరిస్తాయి.

జాతీయాదాయ అంచనాలను బట్టి ప్రణాళికలలో సాధించాల్సిన ఆర్థిక లక్ష్యాలను నిర్ణయించడం జరుగుతుంది. స్థూల ఆర్థిక విధానాలకు ఈ అంచనాలు ఉపకరిస్తాయి.

ఆర్థికాభివృద్ధి సూచికగా తలసరి ఆదాయాన్ని ప్రాతిపదికగా తీసుకోవచ్చు. తలసరి ఆదాయ ప్రాతిపదికగానే ఆయా దేశాలను అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలుగా వర్గీకరిస్తారు.

ఎక్స్‌పెక్టెడ్ కొశ్చన్స్
జాతీయాదాయంలో వివిధ రంగాల వాటాలో మార్పులను తెలపండి?
జాతీయాదాయాన్ని నిర్ణయించే కారకాలను తెలిపి, జాతీయాదాయ లెక్కింపు ప్రాధాన్యత వివరించండి?
జాతీయాదాయంలోని వివిధ భావనలు?
భారత ఆర్థిక వ్యవస్థలో చోటుచేసుకున్న నిర్మాణాత్మక మార్పులను తెలపండి?
జాతీయాదాయం, మానవ వికాసం మధ్య ఉన్న సంబంధాన్ని తెలపండి?
భారత ఆర్థికాభివృద్ధిలో శ్రామికశక్తి పాత్ర?
ఆంధ్రప్రదేశ్‌లో భూ సంస్కరణలకు సంబంధించిన ప్రధాన చట్టాలు?





భూ సంస్కరణలు
(Land Reforms)
గ్రామీణ ప్రాంత ప్రజలు వ్యవసాయ భూమిని తమ గౌరవం, ప్రతిష్టను పెంచే ఆస్తిగా భావిస్తారు. మానవ - భూ సంబంధాలు గ్రామాల్లో వ్యవసాయ నిర్మితిని నిర్దేశిస్తాయి. ‘భూమి యాజమాన్యంలో ఉండే అసమానతలు తగ్గించి, ప్రజలకు, భూమికి మధ్య సంబంధాలను సరిచేయడానికి ఉద్దేశించిన కార్యక్రమమే భూసంస్కరణలు.

భూమి యాజమా న్యంలో మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడాన్ని కూడా భూసం స్కరణగా చెప్పొచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో అధిక భాగం ప్రజలకు జీవనాధారం భూమే. అయితే ఈ భూమి పంపిణీల్లో అసమానతలున్నాయి. ఎక్కువ మొత్తం భూమి కొద్దిమంది ధనవంతులైన భూస్వా ముల ఆధీనంలో ఉంది. అందువల్ల సామాజిక న్యాయాన్ని అందించడానికి భూ సంస్కరణల అమ లు పర్చాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. వ్యవసా యాభివృద్ధి కార్యక్రమాల్లో భూసంస్కరణలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
చిన్న, సన్నకారు, ఉపాంత రైతులు, కౌలుదా రులు, వ్యవసాయ కూలీలు మొదలైన వారికి ‘భూమిని పునఃపంపిణీ’ చేయడంతో పాటు కౌలు పరిమాణం, కౌలుదారులకు భద్రత, వ్యవసాయ కూలీల వేతన నిర్ణయం, సాంకేతిక మార్పులన్నీ భూసంస్కరణల్లో భాగమే అని ఐక్యరాజ్యసమితి నిర్వచించింది.

స్వాతంత్య్రానికి పూర్వమే దేశంలో భూ సంస్క రణలపై చర్చ జరిగింది. దేశంలో జీవన ప్రమాణా లు పెంచాలంటే.. ప్రస్తుత ఆర్థిక, సాంఘిక వ్యవస ్థల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని 1929 మేలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తీర్మానిం చింది. దీనికి అనుగుణంగా చారిత్రాత్మకమైన తీర్మా నాన్ని 1935లో ఆమో దించారు. 1948లో ఏర్పాటు చేసిన కమిటీ సూచనల ఆధారంగా భారతదేశంలో భూసంస్కర ణలు రూపొందించారు. 1950లను భూసంస్కర ణల దశాబ్దంగా పేర్కొన్నారు.

జాతీయ ప్రణాళిక సంఘం భూసంస్కరణల లక్ష్యాలు..
1. వ్యవసాయ ఉత్పత్తిని తగ్గించే ప్రతిబంధకా లను తొలగించడం.
2. వ్యవసాయ రంగంలోని మధ్యవర్తులను తొల గించి, దున్నేవాడికే భూమి ఇవ్వాలి. గ్రామీణ జనాభాలో అన్ని వర్గాలకు సమానహోదా, అవకాశాలు కల్పించాలి.
భూసంస్కరణల ద్వారా ప్రభుత్వం సాధించాలను కున్న లక్ష్యాలు.. 1. భూగరిష్ట పరిమితులను అమ లు చేయడం. కమతాల పరిమాణంలో మార్పులు తేవడం ద్వారా కొరతగా ఉన్న భూమిని హేతుబ ద్ధంగా ఉపయోగించేలా చూడటం. 2. భూమి లేని గ్రామీణ పేదలకు భూమి పంపిణీ చేయడం.

భూసంస్కరణలు - ప్రధాన లక్ష్యాలు
1951లో ప్రణాళికా సంఘం భూసంస్కరణల ప్రధాన లక్ష్యాలను ప్రకటించింది. అవి..
1. గతం నుంచి వారసత్వంగా వ్యవసాయక స్వ రూపంలో వచ్చిన అడ్డంకులను తొలగించడం.
2. వివిధ రూపాల్లో ఉన్న దోపిడీని అరికట్టడం
3. వ్యవసాయ రంగాన్ని సామాజిక న్యాయంతో బలోపేతం చేయడం.
4. భూమిని దున్నేవాడికి రక్షణ కల్పించడం.
5.ఙ్ట్చఛగ్రామ ప్రాంతంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన హోదా, అవకాశాలను కల్పించడం.
పై లక్ష్యాలకనుగుణంగా దేశంలో నాలుగు రకాల భూసంస్కరణల చట్టాలు అమలు చేశారు. అవి..
మధ్యవర్తుల తొలగింపు చట్టం
కౌలు సంస్కరణల చట్టం
భూకమతాల గరిష్ట పరిమితి చట్టం
కమతాల సమీకరణ ద్వారా యాజమాన్య హక్కులను కల్పించడం.

ఆంధ్రప్రదేశ్‌లో భూసంస్కరణలు
ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందటి పరిస్థితి..
1. ఆంధ్ర ప్రాంతం: ఇది అప్పటి మద్రాస్ రాష్ర్టం లో భాగంగా, ఈస్టిండియా కంపెనీ పాలనలో ఉండేది. ఈ ప్రాంతంలోని ఉత్తర సర్కార్ జిల్లా లు జమీందారుల ఆధీనంలో, దక్షిణ జిల్లాలు పాళెగాళ్ల పాలన ఉండేవి. 1801లో థామస్ మన్రో చీఫ్ కలెక్టర్ హోదాలో పాళెగాళ్లను తొల గించి కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ‘రైత్వారీ పద్ధతి’ ప్రవేశపెట్టారు.

2. తెలంగాణ ప్రాంతం: ఇది హైదరాబాద్ సంస్థా నంలో అంతర్భాగంగా ఆసఫ్‌జాహీ వంశస్తులై న నిజాంల పరిపాలనలో ఉండేవి.

ఇక్కడ జాగీర్దారీ, ఇనాందారీ, రైత్వారీ విధానాలు భూ యాజమాన్య పద్ధతులుగా ఉండేవి. ఆనాడు తెలంగాణలో ఆరు రకాల జాగీర్లు, 14 సంస్థా నాలు, సర్ఫేఖాస్ భూములు ఉండేవి. సొంత ఖర్చుల నిమిత్తం నిజాంకు ఉన్న పెద్ద జాగీర్ల ను ‘సర్ఫేఖాస్’భూములు లేదా ‘ఖల్సా’ భూ ములని కూడా పిలిచేవారు. కొన్నింటిని దివానీ భూములనేవారు. దివానీ భూములు ‘సర్ఫే ఖాస్’ భూముల్లోని భాగాలే. ఈ భూములను పాలనా నిర్వహణ కోసం (ప్రభుత్వ ప్రత్యక్ష పాలన) ఇచ్చేవారు.

మధ్య దళారీలు
1. ఆంధ్ర ప్రాంతం: ఇక్కడ జమీందారులు, ఇనాం దారులు మధ్యవర్తులుగా ఉండేవారు. ఆంధ్రా ప్రాంతంలో రెండు రకాల భూమి అనుభవించే పద్ధతులు అమల్లో ఉండేవి. అవి.
భూమిని సాగు చేయడానికి హక్కులున్న రైతులు, ఇతరులు.
ఎలాంటి హక్కులు లేకుండా భూమిని అనుభ వించేవారు రెండవ రకం.
భూమికివ్వాల్సిన కౌలు మొత్తాన్ని, భూమిని అనుభవించే కాలపరిమితిని తరచుగా మార్చే వారు.
2. తెలంగాణ ప్రాంతం: ఈ ప్రాంతంలో జాగీర్దా ర్లు, పట్టేదార్లు, పోటు పట్టేదార్లు మధ్య దళా రీలుగా ఉండేవారు. భూ అనుభవదార్ల పరిస్థి తి దయనీయంగా ఉండేది. వీరిని బానిసలుగా చూసేవారు. మధ్య యుగాల నాటి ఫ్యూడల్ బానిసత్వ విధానం చలామణి అయ్యేది. బ్రాహ్మణులతో పాటు అన్ని వర్గాల వారు ‘వెట్టి’ చేసేవారు. ముందు నవాబుల భూము ల్లో నిర్భంద చాకిరీ చేసిన తర్వాతే వారి భూ ముల్లో సేద్యం చేయనిచ్చేవారు. జాగీర్దారీలు, దేశ్‌ముఖ్, దేశ్‌పాండేలు, సర్‌దేశ్‌ముఖ్‌లు లాంటి మధ్య దళారీలు, ప్రభుత్వ ప్రతినిధు లు, కౌలుదారులను నిర్దయగా దోచుకునేవా రు. సారవంత భూములన్నీ ‘ఖల్సాభూము లు’గా ఉండేవి.

తెలంగాణ ప్రాంతంలో మరో రకమైన భూ అనుభవ పద్ధతి ఆచరణలో ఉండేది. ఇక్కడ మూడు రకాల కౌలుదార్లు ఉండేవారు. దున్నేవాడికి, ప్రభుత్వానికి మధ్య దళారీలుగా ‘పట్టేదారు’ ఉండేవాడు.
షిక్మీదారులు: పట్టేదారు స్వయంగా సేద్యం చేయకుండా కొన్ని షరతులతో, నిర్ణీత కాలా నికి భూములను కౌలుదారులకు ఇచ్చేవారు. వీరినే షిక్మీదారులు, శాశ్వత కౌలుదారులని పిలిచేవారు. ఏదైనా భూమిని 12 ఏళ్ల పాటు పాటు వరుసగా కౌలు చేస్తుంటే వారిని శాశ్వత కౌలుదారులుగా గుర్తిస్తారు.
ఆసామి షిక్మీదారులు: మామూలు కౌలుదా ర్లను అంటే ఎలాంటి షరతులు, హక్కులు లేని సామాన్య కౌలుదారులను ఆసామి షిక్మీదార్ అనేవారు. కౌలు మొత్తం అధికంగా ఉండేది. పండిన పంటలో మాగాణి భూముల్లో 1/4వ వంతు, మెట్ట భూముల్లో 1/5 వంతు కౌలు వసూలు చేసేవారు.
ఇజారా కౌలుదారులు: ఈ కౌలు పద్ధతిని సర్ సాలార్‌జంగ్ ఇజారా ప్రవేశపెట్టాడు. నిర్మాను ష్య గ్రామాల్లో పునరావాసం కల్పించడానికి, సేద్యానికి యోగ్యమైన భూములను సాగులోకి తెచ్చే ఉద్దేశంతో దీన్ని ప్రవేశపెట్టారు. 1908లో ఈ విధానం రద్దు చేశారు.

ప్రభుత్వ చట్టాలు - వాటి లక్ష్యాలు
1956 వరకు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల చట్టాలు వేర్వేరుగా ఉన్నాయి.
1. ‘ఆంధ్రప్రదేశ్ (ఆంధ్రా ప్రాంతం) ఎస్టేట్లు రద్దు -1948’, జమీందారీ వ్యవస్థ రద్దు, రైత్వారీ విధానం అమలు చట్టం-Madras Estate Bill-1948:
మధ్య దళారీలను తొలగించడానికి స్వాతం త్య్రానంతరం తెచ్చిన మొదటి చట్టం ఇది. 1948లో ఆంధ్రా ప్రాంతం మద్రాస్ రాష్ర్టంలో భాగంగా ఉండటంతో ఈ చట్టాన్ని మద్రాస్ రాష్ర్ట ప్రభుత్వం జారీ చేసింది.

చట్టంలోని ప్రధానాంశాలు:
అన్ని రకాల జమీందారీ ఎస్టేట్లు రద్దవుతాయి. ఈ ఎస్టేటుల్లోని భూములు, నదులు, కాలు వలు.. మొదలైన అన్ని రకాల ఆస్తులు ప్రభుత్వపరం అవుతాయి.
జమీందార్లకు నష్టపరిహారాన్ని గత ఏడాది వచ్చిన ఆదాయం ప్రాతిపదిక చెల్లిస్తారు. ఈ నష్టపరిహారం 12 1/2 నుంచి 25 రెట్ల వరకు చెల్లిస్తారు.
సాగు చేస్తున్న రైతులకు రైత్వారీ పట్టా ఇస్తారు.
రైత్వారీ పట్టా పొందిన ప్రతి సాగుదారుడు భూమి పన్నును చెల్లించాలి.
ఈ చట్టం కింద భూములపై గరిష్ట పరిమితిని విధించలేదు.
నోట్: జమీందారీ రద్దు చట్టం వల్ల జమీందారులకు ఉన్న భూమి వికేంద్రీకరణలో అంత మార్పు రాలేదు. ఈ చట్టం భూమి లేని పేదలకు భూమిని పంచడానికి కాకుండా కేవలం మధ్య దళారీ వ్యవస్థ ను రూపుమాపేందుకు ఉద్దేశించింది. రూ.15కోట్ల నష్ట పరిహారం చెల్లించి మధ్యవర్తులను తొలగించారు.
2. ఆంధ్రప్రదేశ్ (ఆంధ్రా ప్రాంతం)లో ఇనాంలు రద్దు; రైత్వారీ విధానం అమలు చట్టం-1956
{పభుత్వానికి లేదా ప్రభువుకు సేవలందించి నందుకు గుర్తింపుగా బహుమతి(ఇనాం) రూపంలో వ్యక్తులకు ఇచ్చేవారు. ఈ వ్యక్తులనే ఇనాందారులు అంటారు. ఇనాం దారుల వద్ద ఉన్న వందల ఎకరాల భూమిని ఎలాంటి హక్కులు కల్పించకుండా ఇతరులకు కౌలుకు ఇచ్చేవారు.
ఈ చట్టంలోని ప్రధాన అంశాలు:
ఇనాందారులకు భూములపై ఉన్న ప్రత్యేక హక్కులు పూర్తిగా రద్దయ్యాయి.
కౌలుకు సాగు చేస్తున్న రైతులకు భూమిపై సర్వహక్కులు కల్పిస్తారు.
ఇనాందారుని వ్యక్తిగత భూమి కౌలుదారుడి స్వాధీనంలో ఉండే ఆ భూమిలో 2/3 వంతు భూమికి సంబంధించి కౌలుదారుడికి, 1/3 వంతు భాగం భూమి యజమానికి హక్కు ఉంటుంది.
ఇనాందారుడు కూడా రైత్వారీ పద్ధతిలో తన వ్యక్తిగత భూమిపై భూమి శిస్తు చెల్లించాలి.
60 రోజుల్లోపు కౌలు చెల్లించని పక్షంలో కౌలు దారుల నుంచి భూమిని తొలగించవచ్చు.
ఈ చట్టం ద్వారా 20 లక్షల మంది రైతులకు 30 లక్షల ఎకరాల భూమిపై యాజమాన్య హక్కు లు కల్పించారు. ఇది రాష్ర్టంలో అత్యంత విజయవంతంగా అమలుచేసిన చట్టం.

గత గ్రూప్-1 మెయిన్‌‌స ప్రశ్నలు

1. భూసంస్కరణలు ఎందుకు అమలు చేస్తారు? ఆంధ్రప్రదేశ్‌లో భూసంస్కరణలకు సంబం ధించిన ప్రధాన చట్టాలు ఏవి?
2. ఆంధ్రప్రదేశ్‌లో భూసంస్కరణల పరిధి ఏమి టి? భూయాజమాన్య దస్తావేజుల కంప్యూట రీ కరణలో సాధించిన విజయాన్ని తెలపండి?

మాదిరి ప్రశ్నలు
1. భూసంస్కరణలు అంటే ఏమిటి? భూసంస్క రణల ప్రధాన లక్ష్యాలేవి?
2. ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్రా ప్రాంతం, తెలంగాణ ప్రాంతంలోని మధ్య దళారీ వ్యవస్థను విశ్లేషిం చండి?
3. ఆంధ్రప్రదేశ్ (ఆంధ్రా ప్రాంతం)లోని వివిధ మధ్య దళారీలు ఎవరు? వీరిని తొలగించడా నికి ప్రభుత్వం రూపొందించిన చట్టాలు ఏవి?
4. ఆంధ్రప్రదేశ్ (ఆంధ్రప్రాంతం) ఎస్టేట్ల రద్దు చట్టం-1948లోని ప్రధాన అంశాలు ఏమిటి? ఈ చట్టం ఆంధ్ర ప్రాంతంలోని మధ్య దళారీ లను రూపుమాపడంలో సంపూర్ణ విజయం సాధించిందా? విశ్లేషించండి?
5. ఆంధ్రప్రదేశ్ ఇనాంలు రద్దు, రైత్వారీ విధానం అమలు చట్టం-1956, ఆంధ్రప్రదేశ్‌లో అత్యం త విజయవంతంగా అమలుచేసిన చట్టం. విశ్లేషించండి?
6. {బిటిష్ పాలనలో ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ భూమిశిస్తు పద్ధతులు వివరించండి? ఈ పద్ధ తుల ద్వారా ఏర్పడిన లాభనష్టాలను విశదీక రించండి?

జాతీయాదాయ భావనలు.. శ్రామికశక్తి లక్షణాలు


జాతీయాదాయ భావనలు.. శ్రామికశక్తి లక్షణాలు
 పేపర్-3, సెక్షన్-1
ప్లానింగ్ ఇన్ ఇండియా -
ఇండియన్ ఎకానమీ
జాతీయాదాయ భావనలు


వాణిజ్య సంస్థలు, కుటుంబాలు, ప్రభుత్వం మధ్య ఆదా య చక్రీయ ప్రవాహం జరుగుతుంది. వస్తు, సేవల ఉత్ప త్తికి కుటుంబ రంగం సేవలను అందించి ప్రతిఫలంగా వేతనాలు పొందుతుంది. కుటుంబ రంగం వస్తు, సేవల కొనుగోలుకు చేసే వ్యయాన్ని ఆదాయంగా ఉత్పత్తిదారు లు పొందుతారు. ఇలా ఆదాయ చక్రీయ ప్రవాహం జరు గుతుంది. ఈ స్థితి రెండు రంగాలున్న ఆర్థిక వ్యవస్థలో.. ఆదాయ ప్రవాహాన్ని సూచిస్తుంది. అదేవిధంగా మూడు, నాలుగు రంగాలున్న (ప్రభుత్వ, విదేశీ వాణిజ్య రంగాలు) ఆర్థిక వ్యవస్థలో కూడా ఆదాయ చక్రీయ ప్రవాహం జరు గుతుంది.

ప్రస్తుత ఉత్పత్తి కారకాలు ఆర్జించిన మొత్తం ఆదాయమే జాతీయాదాయం. జాతీయాదాయ ధోరణులాధా రంగా ఆర్థిక వ్యవస్థ ప్రగతిని తెలుసుకోవచ్చు. స్థూల జాతీ యోత్పత్తి నిర్వచనంలో.. ‘జాతీయ’ అనే భావన దేశానికి సంబంధించిన స్థానికులు ప్రస్తుత సంవత్సరంలో ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనటం ద్వారా ఆర్జించిన ఆదాయాన్ని తెలుపుతుంది. ‘దేశీయోత్పత్తి’ అనేది దేశం లోపల మొత్తం ఉత్పత్తి విలువ లేదా ఆదాయ కల్పనను సూచిస్తుంది. దేశం లోపలి ఉత్పత్తి, ఆదాయ కల్పన (జాతీయతకు తావు లేకుండా) దేశీయోత్పత్తిలో కలిపి ఉంటాయి.

స్థూల ఆదాయ కొలమానాలు:
ఉత్పత్తి కారకాల పంపిణీ దృష్ట్యా జీడీపీ= మార్కెట్ ధరల వద్ద జీడీపీ+ సబ్సిడీలు-పరోక్ష పన్నులు
ఉత్పత్తి కారకాల పంపిణీ దృష్ట్యా స్థూల జాతీయోత్పత్తి = ఉత్పత్తి కారకాల పంపిణీ దృష్ట్యా జీడీపీ నీ విదేశాల నుంచి నికర ఆదాయాలు.
ఉత్పత్తి కారకాల పంపిణీ దృష్ట్యా నికర జాతీయోత్పత్తి = ఉత్పత్తి కారకాల పంపిణీ దృష్ట్యా జీఎన్‌పీ- మూలధన తరుగుదల.
వ్యష్టి ఆదాయం = ఉత్పత్తి కారకాల పంపిణీ దృష్ట్యా నికర జాతీయోత్పత్తి-కార్పొరేట్ పన్నులు+-పంపిణీ కాని కంపెనీ లాభాలు+ బదిలీ చెల్లింపులు
వ్యయార్హ ఆదాయం= వ్యష్టి ఆదాయం-వ్యక్తిగత పన్నులు
జీడీపీ డిఫ్లేటర్= నామినల్ జీడీపీ/రియల్ జీడీపీ

జాతీయాదాయ మదింపు:
జాతీయాదాయాన్ని లెక్కించడానికి ఉత్పత్తి, ఆదాయ, వ్యయాల పద్ధతి ఉపయోగిస్తారు. ఉత్పత్తి మదింపు పద్ధతి లో ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి అయిన మొత్తం వస్తు సేవల విలువను తీసుకుంటారు. దీనిలో వినియోగ వస్తువులు, స్థూల స్వదేశీ ప్రైవేటు పెట్టుబడులు, ప్రభుత్వ రంగ ఉత్పత్తి, నికర ఎగుమతులు కలిసి ఉంటాయి. ఆదాయ మదింపు పద్ధతి ద్వారా జాతీయాదాయాన్ని లెక్కించడా నికి ఉత్పత్తి కారకాల చెల్లింపులు తీసుకుంటారు. ఉద్యోగు లకు ఇచ్చిన పరిహారం, బాటకం, వడ్డీ, విదేశాల నుంచి పొందిన నికర ఉత్పత్తి కారకాల ఆదాయాన్ని తీసుకుంటా రు. స్థూల దేశీయోత్పత్తిపై చేసినఅంతిమ వ్యయాన్ని.. వ్యయాల మదింపు పద్ధతి ద్వారా జాతీయాదాయం లెక్కించడానికి తీసుకుంటారు. స్వదేశీ ఉత్పత్తిపై జరిగిన అంతిమ వ్యయంలో ఎ) ప్రైవేటు అంతిమ వినియోగ వ్య యం బి) ప్రభుత్వ అంతిమ వినియోగ వ్యయం సి)స్థూల స్థిర మూలధన కల్పన డి) స్టాక్‌లలోని మార్పులు ఇ) వస్తు,సేవల నికర ఎగుమతులు కలిసి ఉంటాయి. ఉత్పత్తి, ఆదాయ, వ్యయాల మదింపు పద్ధతులన్నీ ఒకే విధమైన జాతీయాదాయ లెక్కలను సూచిస్తాయి. ఈ స్థితి లభ్య మయ్యే దత్తాంశం, అంచనాలను బట్టి ఆధారపడి ఉంటుంది. వ్యయాల మదింపు పద్ధతి ద్వారా స్థూల దేశీ యోత్పత్తి అత్యల్ప లేదా అత్యధికంగా అంచనా వేయువచ్చు.

ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులు:
స్వాతంత్య్రానంతరం భారత ఆర్థిక వ్యవస్థలో పలు పరి మాణాత్మక, గుణాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి.
స్వాతంత్య్రం వచ్చిన సమయంలో జాతీయాదాయం లో ప్రాథమిక రంగం వాటా ఎక్కవ కాగా.. తదనంత రం ప్రణాళికా యుగంలో ద్వితీయ, తృతీయ రంగాలు పుంజుకున్నాయి. ప్రస్తుతం జాతీయాదాయంలో(2008 -09) సేవారంగం 57 శాతం, ద్వితీయ రంగం 27 శాతం, ప్రాథమిక రంగం 15.7 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఈ విధంగా జాతీయాదాయంలో ప్రాథమిక రంగం వాటా తగ్గి ద్వితీయ, తృతీయ రంగాల వాటా పెరగడాన్ని నిర్మాణాత్మక మార్పుగా భావించవచ్చు.

స్వాతంత్య్రానంతరం వృత్తుల వారీ పంపిణీలో మార్పు లు చోటు చేసుకున్నాయి. బ్రిటిష్ కాలంలో వ్యవసాయ రంగంపై ఆధార పడిన శ్రామిక శక్తి 72 శాతం. కాగా స్వాతంత్య్రానంతర ఆర్థిక ప్రగతి వల్ల ఈ రంగంపై ఆధారపడిన శ్రామిక శక్తి కొంత తగ్గి.. ద్వితీయ, తృతీయ రంగాలపై ఆధారపడే శ్రామికశక్తి పెరిగింది.

స్వాతంత్య్రం వచ్చే నాటికి దేశంలో వినియోగ వస్తు పరిశ్రమలు ఎక్కువ. 1960,70లలో దేశంలో తయారైన వినియోగ ఉత్పత్తులు ధనికుల అవసరాలకే ఎక్కువగా ఉపయోగపడ్డాయి. తర్వాత పారిశ్రామిక తీర్మానాల నేపథ్యంలో మూలధన వస్తు పరిశ్రమలు ఎక్కువగా స్థాపించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి.

స్వాతంత్య్రానంతరం భౌతిక, సాంఘిక అవస్థాపనా సౌకర్యాలు పెరిగాయి. భౌతిక అవస్థాపనలైన విద్యుత్ ఉత్పాదన, రైలు, రోడ్డు మార్గాల విస్తరణ జరిగింది. ప్రజల విద్య, ఆరోగ్య ప్రమాణాలు మెరుగుపడ్డాయి. శిశు మరణాల రేటు, మరణాల రేటు, జననాల రేటులో తగ్గుదల సంభవించింది.

1991లో ఆర్ధిక సంస్కరణల నేపథ్యంలో అన్ని నియం త్రణలు తొలగించారు. అప్పటి వరకు ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ రంగం పాత్ర ఎక్కువ. కానీ తర్వాతి కాలంలో ప్రైవేటీకరణకు అవకాశం కల్పించారు. విదేశీ పెట్టుబడు లు, సాంకేతిక పరిజ్ఞానంపై ఉన్న ఆంక్షలు తొలగిం చారు.

జాతీయ, తలసరి ఆదాయ ధోరణులు:
ప్రస్తుత ధరల వద్ద లెక్కించిన జాతీయ, తలసరి ఆదా యాలు ఆర్థిక వ్యవస్థ వృద్ధిని స్పష్టంగా తెలియుజేయువు. ఒక నిర్ణీత కాలంలో ధరలలోని మార్పుల ప్రభావం నిర్మూ లించాలంటే జాతీయాదాయాన్ని స్థిర ధరల వద్ద లెక్కిం చాలి. ఉత్పత్తి కారకాల పంపిణీ దృష్ట్యా జాతీయాదాయం (ఎన్‌ఎన్‌పీ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్)ను ‘నిజ జాతీయాదాయం’ గా భావించాలి. 1950-51 నుంచి 1980-81 మధ్య జాతీ యాదాయ సగటు వృద్ధి 3.4 శాతం. కాగా తలసరి నికర జాతీయోత్పత్తి (తలసరి ఆదాయం) వృద్ధి 1.2 శాతం. 1980లలో జాతీయ, తలసరి ఆదాయాలలో మంచి వృద్ధి నమోదైంది. 1980-81 నుంచి 1990-91 మధ్య జాతీ యాదాయ వృద్ధి 5.4 శాతం కాగా తలసరి ఆదాయ వృద్ధి 3.1 శాతం. ఈ వృద్ధిని ఆర్థిక వ్యవస్థలో ఆరోగ్యవంతమైన వృద్ధిగా భావించవచ్చు. 1990-91 నుంచి 1995-96 మధ్య జాతీయాదాయ వృద్ధి రేటు 4.9 శాతం కాగా తల సరి ఆదాయ సగటు వృద్ధి 3.4 శాతం. 1992-94 మధ్య ఆర్థిక వ్యవస్థ పురోగమన నేపథ్యంలో 1994-95 నుంచి 1996-97 మధ్య జాతీయ, తలసరి ఆదాయాల వృద్ధి రేటు ఎక్కువగా ఉంది. 1997-2002 మధ్య జాతీయ ఆదాయ లక్షిత వృద్ధి 6.5 శాతం కాగా.. వాస్తవంగా సాధించిన వృద్ధి 5.5 శాతం మాత్రమే. పారిశ్రామిక రంగం కూడా తక్కువ వృద్ధిని నమోదు చేసుకోవడంతో ఆశించిన జాతీయాదాయ వృద్ధి సాధ్యం కాలేదు. ఈ కాలంలో తల సరి ఆదాయ వృద్ధి 2.2 శాతం. 10వ ప్రణాళికలో (2002 -07) జాతీయాదాయ వృద్ధి రేటు 7.8 శాతం కాగా తల సరి ఆదాయ సగటు వృద్ధి 6.1 శాతం. 2009-10లో జాతీ యాదాయం 2004-05 ధరల వద్ద *39,24,183 కోట్లు, తలసరి ఆదాయం *33,540. ఇదే కాలంలో జాతీయాదా యం 6.9 శాతం, తలసరి ఆదాయం 5.4 శాతం మేర వృద్ధి సాధించాయి.
స్వాతంత్య్రానంతరం జాతీయ, తలసరి ఆదాయాల వృద్ధి రేటు పెరిగినప్పటికీ.. చైనా, ఇండోనేషియాలతో పోల్చినపుడు మన దేశ వృద్ధి రేటు తక్కువే. ఆ దేశాలలో జాతీయాదాయ సగటు వృద్ధి రేటు 10 శాతం. గత ఆరు దశాబ్దాలలో జాతీయ, తలసరి ఆదాయాల పెరుగుదల లో స్థిరత్వం లేదు. 1951 తర్వాత తలసరి వినియోగం కూడా ఆశించిన స్థాయిలో పెరగలేదు.

శ్రామిక శక్తి-ఆర్థికాభివృద్ధి:
దేశంలో ఆర్థిక కార్యకలాపాల స్థాయిని నిర్ణయించడంలో శ్రామిక శక్తి ప్రధానమైంది. ఈ శక్తి పరిమాణం పనిలో పాలు పంచుకొనే రేటుపై ఆధారపడి ఉంటుంది. 2001 జనాభా లెక్కల ప్రకారం మొత్తం దేశ జనాభాలో శ్రామిక శక్తి 39.26 శాతం.

దేశంలో శ్రామిక శక్తి లక్షణాలు
అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చినపుడు దేశంలో పనిలో పాలు పంచుకొనే రేటు తక్కువ. దీనికి కారణం జనాభా పెరుగుదల రేటు ఎక్కువగా ఉండటం.
గామీణ శ్రామిక జనాభా నిష్పత్తి పట్టణ జనాభా నిష్పత్తి కంటే తక్కువ.
మహిళలలో పనిలో పాలు పంచుకునే రేటు పురుషుల కంటే తక్కువ. 2001లో మహిళలలో ఈ రేటు 25.68 శాతం కాగా పురుషులలో 51.93 శాతం. ఈ స్థితి దేశంలో సాంఘిక వెనుక బాటుతనాన్ని సూచిస్తోంది. ఇప్పటికీ ఎక్కువ శాతం వుంది మహిళలు ఆర్థిక ఒత్తిళ్ల కారణం గానే ఉత్పాదక శ్రమలో పాలు పంచుకుంటున్నారు.
శ్రామిక భాగస్వామ్య రేట్లు వివిధ రాష్ట్రాలలో వేర్వేరుగా ఉంటున్నాయి.

సాపేక్షికంగా వెనుకబడిన దేశాల్లో ఎక్కువ మంది ప్రజలు ఆధారపడిన రంగం ప్రాథమిక రంగం. ప్రస్తుతం అభివృద్ధిచెందిన దేశాలు తమ అభివృద్ధి తొలి దశలో వ్యవసాయక దేశాలేకావడం గవునార్హం. అనేక అభివృద్ధి చెందిన, వెనుకబడిన దేశాల్లో ఇప్పటికీ చేపల వేట ఒక ముఖ్య వృత్తి. జపాన్, నార్వే, ఇంగ్లండ్‌లలో చేపల వేట ద్వారా అధిక శాతం మంది ఉపాధి పొందుతున్నారు. డెన్మార్క్, అర్జెంటీనాలలో పశుపోషణ, డైరీయింగ్, పౌల్ట్రీ లు ముఖ్య కార్యకలాపాలు. కెనడా, మయన్మార్‌లలో ఎక్కువ శాతం వుంది అటవీ సంపదపై ఆధారపడుతు న్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే..వెనుకబడిన దేశాల్లోనే అధికశాతం వుంది ప్రజలు ప్రాథమికరంగంపై ఆధారపడుతున్నారు. వెనుకబడిన ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక ప్రగతి సాధించే క్రమంలో ప్రాథమిక కార్యకలాపాల పాత్ర తగ్గుతుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో పారిశ్రామిక రంగాభివృద్ధితో పాటు సేవా కార్యకలాపాల పాత్ర ఎక్కువగా ఉండటం గమనించవచ్చు. వ్యవసాయం, ప్రాథమిక కార్య కలాపాలు ఎక్కువగా శ్రమ సాంద్రతవైనందువల్ల ఉత్పాద కత తక్కువ . వీటిలో మూలధన సాంద్రత పెరిగినప్పటికీ.. వాటి స్వభావం వల్ల మూలధన సాంద్రత పద్ధతులు ఉత్పాదకత పెరుగుదలకు దోహదం చేయుడంలేదు. ద్వితీయ, తృతీయ రంగాలపై అధిక శాతం శ్రామిక శక్తిపై ఆధారపడితే తప్ప ఆయా దేశాల్లో తలసరి ఆదాయంలో పెరుగుదల సాధ్యం కాదు.

మూడో ప్రపంచ దేశాల్లో ద్వితీయ రంగం పరిధి తక్కువగా ఉండి.. తక్కువ శ్రామికశక్తికే ఉపాధి కల్పిస్తోంది. ఇటు వంటి స్థితి వెనుబడిన దేశాలలో స్పష్టంగా కనిపిస్తోంది. ద్వితీయ రంగ ముఖ్య కార్యకలాపం తయారీ రంగం ఈ దేశాల్లో తక్కువ ప్రాధాన్యం కలిగి ఉంది. మరో వైపు కుటీ ర, చిన్న పరిశ్రమలు తక్కువ మూల ధన సాంద్రత కలిగి.. ఎక్కువ శ్రామిక శక్తికి ఉపాధి క ల్పిస్తున్నాయి. భారత్‌లో ఈ పరిశ్రమ.. పారిశ్రామిక రంగంలోని మొత్తం శ్రామిక శక్తిలో 80 శాతం మందికి ఉపాధి కల్పిస్తోంది. కుటీర, చిన్న తరహా పరిశ్రమల్లో ఉత్పాదకత తక్కువకావడంతో ఈ రంగంపై ఆధారపడిన ప్రజల తలసరి ఆదాయాలు తక్కు వే. తృతీయ రంగంలో ఉత్పాదకత ద్వితీయ రంగ ఉత్పా దకత కంటే ఎక్కువగా ఉండొచ్చు. ప్రాథమిక రంగం నుంచి శ్రామిక బదిలీ ద్వితీయ, తృతీయ రంగాలకు జరి గినప్పుడే ఆర్థికాభివృద్ధికి అనువైన వాతావరణం ఏర్పడు తుంది. తృతీయ రంగంలో వాణిజ్యం, రవాణా, సమాచా రం, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ సేవలను విస్తరించాలి.

-డా.తమ్మా కోటిరెడ్డి
ప్రొఫెసర్, ఐబిఎస్
హైదరాబాద్

కరెంట్ అఫైర్స్-డిసెంబర్ -2010 సంచిక 4

1.భారత్ కు ఫ్రాన్స్ అణు సహకారం
ఫ్రాన్స్ అధ్యక్షుడు నికో లస్ సర్కోజీ భారత పర్యటనలో డిసెంబర్ 6 న ఇరు దేశాల వుధ్య పలు రంగాలకు సంబంధించి ఒప్పందాలు కుదిరారుు. ఇందులో ఐదు అణు ఇంధనానికి సంబంధించినవి కాగా, రెండు భూ శాస్త్ర విజ్ఞానానికి చెందినవి. విద్యారంగానికి సంబంధించి కూడా మరో రెండు ఒప్పందాలు కుదిరారుు. అణు రంగంలో భారత్‌పై అంతర్జాతీయు ఆంక్షలు తొలగిపోరుున రెండేళ్లకు.. భారత్‌లో అణు రియూక్టర్లు నెలకొల్పేందుకు ఫ్రాన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ అవగాహనలో భాగంగా వుహారాష్టల్రోని జైతాపూర్‌లో ఏర్పాటు చేయు నున్న ఆరు అణు రియూక్టర్లలో మెుదటి రెండింటిని ఫ్రాన్స్ నెలకొల్పుతుంది. ఈ ఒప్పందంపై భారత్‌కు చెందిన న్యూక్లియుర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియూ, ఫ్రాన్స్ కంపెనీ అరేవా ప్రతినిధులు.. నికోలస్ సర్కోజీ, ప్రధాని వున్మోహన్ సింగ్ సవుక్షంలో సంతకాలు చేశారు. ఉన్నత మైన టెక్నాలజీ సంస్థల్లో సంయుుక్త పరిశోధన, విద్యా వూర్పిడి కార్యక్రవూలను ప్రోత్సహించేందుకు విద్యా ఒప్పందాలు దోహదం చేస్తారుు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2012 నాటికి 1,200 కోట్ల యుూరోలకు పెంచాలని కూడా ఇరువురు నేతలు నిర్ణరుుంచారు. రక్షణ, ఉగ్రవాదంపై పోరాటం, అంతరిక్షం, శాస్త్ర సాంకేతికత వంటి రంగాల్లో ద్వైపాక్షిక సహకారానికి సంబంధించి కూడా ఇరువురు నాయుకులు చర్చించారు.

2.ముగిసిన కాన్‌కున్ సదస్సు
మెక్సికోలోని కాన్‌కున్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి 16వ వాతావరణ వూర్పు సదస్సు డిసెంబర్ 11న వుుగిసింది. ఈ సందర్భంగా కాన్‌కున్ ఒప్పందాన్ని సదస్సు ఆమోదిం చింది. దీనికి 193 దేశాలు వుద్దతు పలికారుు. దీని ప్రకా రం గ్లోబల్ వార్మింగ్ నివారణకు 100 బిలియున్ డాలర్లతో ‘గ్రీన్ ఫండ్’ ఏర్పాటు చేస్తారు. ఈ నిధి వల్ల అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలు లాభపడతారుు. అడవుల క్షీణత -నరికివేత వల్ల కలిగే ఉద్గారాల తగ్గింపు అంశం కూడా ఒప్పందంలో చోటు చేసుకుంది. అదే సవుయుంలో ఉద్గా రాల తగ్గింపునకు సంబంధించి 2012తో వుుగియునున్న క్యోటో ప్రోటోకాల్ పొడిగింపునకు సంబంధించి ఎటు వంటి ఒప్పందం కుదరలేదు.

3.కకోద్కర్‌కు హోమీ బాబా అవార్డు
ప్రతిష్టాత్మక ‘హోమీ బాబా లైఫ్ టైం అచీవ్‌మెంట్’ అవా ర్డుకు అణుశక్తి కమిషన్ వూజీ చైర్మన్ అనిల్ కకోద్కర్ ఎంపికయ్యూరు. ఈ పురస్కారాన్ని జనవరి 17, 2011న జరిగే ఇండియున్ న్యూక్లియుర్ సొసైటీ(ఐఎన్‌ఎస్) వార్షిక సవూవేశంలో బహూకరిస్తారు.

4.యుూపీ ప్రభుత్వ మాజీ సీఎస్‌కు జైలు శిక్ష
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ వూజీ చీఫ్ సెక్రటరీ(సీఎస్) నీరా యూదవ్‌కు సీబీఐ ప్రత్యేక కోర్టు డిసెంబర్ 8న నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. నీరా 1992-94లో నోరుుడా అభి వృద్ధి సంస్థ చైర్‌పర్సన్‌గా వ్యవహరించిన సవుయుంలో.. ప్లాట్ల కేటాఇంపులో నిబంధనలు ఉల్లంఘించినందుకు కోర్టు ఈ శిక్ష విధించింది.

5.ఎర్డోగన్‌కు అల్-గడాఫీ వూనవ హక్కుల అవార్డు
టర్కీ ప్రధానవుంత్రి ఎర్డోగన్, అల్- గడాఫీ ఇంటర్నేషనల్ ప్రైజ్ ఫర్ హ్యువున్ రైట్స్‌కు ఎంపిక య్యూరు. లిబియూ రాజధాని ట్రిపోలిలో జరిగిన ఒక కార్య క్రవుంలో ఆయునకు ఈ పురస్కారాన్ని బహూకరించారు. లిబియూ నాయుకుడు వవుర్ అల్ గడాఫీ పేరిట 1988లో ఈ అవార్డును ఏర్పాటు చేశారు. వూనవ హక్కుల రక్షణ, స్వేచ్ఛ, ప్రపంచ శాంతి కోసం కృషి చేసిన వ్యక్తులు లేదా సంస్థలకు ప్రతి ఏటా ఈ పురస్కారాన్ని అందజేస్తారు. 2009లో నికరాగ్వా అధ్యక్షుడు జోస్ డేనియుల్ ఒర్టేగాకు ఈ అవార్డు దక్కింది. గతంలో దక్షిణాఫ్రికా వూజీ అధ్యక్షుడు నెల్సన్ వుండేలా, వెనుజులా అధ్యక్షుడు విక్టర్ హ్యుగో చావెజ్‌లను ఈ పురస్కారం వరించింది.

6.వికీలీక్స్ వ్యవస్థాపకుడు అసాంజే అరెస్టు
వికీలీక్స్ వెబ్‌సైట్ వ్యవస్థాపకుడు జూలియున్ అసాంజేను బ్రిటన్ పోలీసులు డిసెంబర్ 7న అరెస్టు చేశారు. స్వీడన్ జారీ చేసిన అంతర్జాతీయు వారంటుపై ఆయునను అదుపు లోకి తీసుకున్నారు. ఆస్ట్రేలియూ పౌరుడైన 39ఏళ్ల అసాంజే పై స్వీడన్‌లో అత్యాచార కేసు నమోదైంది.

7.‘డ్రాగన్’ ప్రయోగం
నాసాతో కలిసి స్పేస్ ఎక్స్ అనే ప్రైవేట్ సంస్థ రూపొందిం చిన అంతరిక్ష నౌక ‘డ్రాగన్’ను ఫ్లోరిడాలోని కేప్‌కెనావరల్ అంతరిక్ష కేంద్రం నుంచి డిసెంబర్ 8న ఫాల్కాన్-9 రాకెట్ ద్వారా ప్రయోగించారు. ప్రైవేట్ సంస్థ ప్రయోగించిన మెుదటి అంతరిక్ష నౌక ఇది. అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ ఎస్) వస్తువులను చేరవేసేందుకు నాసా, స్పేస్ ఎక్స్‌తో కుదుర్చుకున్న 1.6 బిలియున్ డాలర్ల ఒప్పందంలో భాగం గా స్పేస్ ఎక్స్ 12 స్పేస్‌క్రాఫ్ట్‌లను తయూరు చేయునుంది.

8.గస్తీ నౌక ‘విజిత్’ ప్రారంభం
భారత తీర గస్తీనౌక ‘విజిత్’ను డిసెంబర్ 11న గోవాలో ప్రారంభించారు. దీన్ని గోవా షిప్‌యూర్డ్ లిమిటెడ్ నిర్మిం చింది. భారత్-పాకిస్థాన్ సవుుద్ర సరిహద్దులో విజిత్ గస్తీ నిర్వహిస్తుంది.

9.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చలనచిత్ర అవార్డులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2009 సంవత్సరానికి రఘుపతి వెంకయ్యపురస్కారంతో సహా వుూడు జాతీయు చలనచిత్ర అవార్డులను డిసెంబర్ 6న ప్రకటించింది. వివరాలు.. రఘుపతి వెంకయ్యు అవార్డు: ప్రవుుఖ నిర్మాత కె.రాఘవ, ఎన్‌టీఆర్ జాతీయు చలనచిత్ర అవార్డు: ప్రవుుఖ నటి బి.సరోజాదేవి, బీఎన్ రె డ్డి జాతీయు చలనచిత్ర అవార్డు: ప్రవుుఖ దర్శకుడు కె.రాఘవేంద్ర రావు, నాగిరెడ్డి, చక్ర పాణి జాతీయు అవార్డు: రామోజీరావు.

10.భారత్ - ఈయూ(EU) సదస్సు
భారత్- యుూరోపియున్ యుూనియున్(ఈయుూ) 11వ వార్షిక సదస్సు బ్రస్సెల్స్‌లో డిసెంబర్ 10న జరిగింది. సవూవేశానికి భారత ప్రధాని వున్మోహన్ సింగ్ హాజర య్యూరు. 27 సభ్యదేశాలున్న భారత్-ఈయుూ సదస్సులో పలు అంశాలపై పరస్పర సహకారాన్ని వురింత పటిష్టం చేసు కోవడానికి అంగీకరించారుు. సాంస్కృతిక సంబంధా ల మెరుగు, నేరస్తుల అప్పగింత వంటి అంశాలు ఇందులో ఉన్నారుు. వచ్చే సంవత్సరం మెుదట్లో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేసేందుకు చర్యలు చేపట్టాలని కూడా సదస్సు నిర్ణరుుంచింది.

11.డేవిస్ కప్ విజేత సెర్బియూ
డేవిస్ కప్ టెన్నిస్ టైటిల్‌ను సెర్బియూ జట్టు గెలుచుకుంది. బెల్‌గ్రేడ్‌లో డిసెంబర్ 5న జరిగిన ఫైనల్లో ఫ్రాన్స్‌ను ఓడిం చింది. సెర్బియూ మెుదటి సారి డేవిస్‌కప్‌ను గెలుచుకుంది.

టెన్నిస్‌లో టీమ్ ఈవెంట్లలో డేవిస్ కప్, ఫెడ్ కప్, హాప్ వ్యూన్ కప్‌లను ప్రతిష్టాత్మకమైనవిగా భావిస్తారు. వీటిలో డేవిస్ కప్ పురుషుల టీమ్ టెన్నిస్ విభాగం. ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్(ఐటీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించే ఈ టోర్నమెంట్ 1900లో ప్రారంభమైంది. వుహిళల విభాగం లో ఫెడ్ కప్(1995 వరకు ఫెడరేషన్ కప్‌గా వ్యవహరించే వారు) ప్రతిష్టాత్మకమైంది. దీనిని ఐటీఎఫ్ 50వ వార్షికోత్స వం సందర్భంగా 1963లో ప్రారంభించారు. మిక్స్‌డ్ విభా గంలో హాప్‌వ్యూన్ కప్ ప్రతిష్టాత్మకమైంది. దీనిని 1989 నుంచి నిర్వహిస్తున్నారు.

డేవిస్ కప్‌ను ప్రారంభంలో ఇంటర్నేషనల్ లాన్ టెన్నిస్ చాలెంజ్‌గా వ్యవహరించేవారు. 1900లో టోర్నీ ప్రారంభ వ్యూచ్ యుూఎస్‌ఏ, గ్రేట్ బ్రిటన్ వుధ్య జరిగింది. ఈ వ్యూచ్‌కు బోస్టన్‌లోని లాంగ్‌ఉడ్ క్రికెట్ క్లబ్ ఆతిథ్యమిచ్చిం ది. ప్రారంభంలో కొన్ని దేశాలు వూత్రమే ఈ టోర్నమెంట్ లో పాల్గొనేవి. టెన్నిస్‌లో ఓపెన్ యుుగం ప్రారంభమైన తర్వాత 1969లో 50 దేశాలు ఇందులో పోటీ పడ్డారుు. కాగా 2010 టోర్నీలో 125 దేశాలు పాల్గొన్నారుు.

డేవిస్ కప్ నిర్వహించాలనే ఆలోచన.. హార్వర్డ్ యుూనివర్సి టీకి చెందిన నలుగురు విద్యార్థులది. వీరిలో డ్వైట్ డేవిస్ ఒకరు. అతనే ఈ టోర్నమెంట్ ఫార్మాట్‌ను రూపొందించ డంతోపాటు తన సొంత డబ్బుతో టోర్నీకోసం ట్రోఫీని కూడా బహూకరించారు. తర్వాత డేవిస్ అమెరికా రాజకీ యూల్లో ప్రవుుఖుడిగా పేరుగాంచడంతో పాటు 1925-29 వుధ్య యుూఎస్ సెక్రటరీ ఆఫ్ వార్‌గా బాధ్యతలు నిర్వహించా రు. అతని గౌరవార్థం ఈ టోర్నీ ని డేవిస్ కప్‌గా వ్యవహరించడం ప్రారంభించారు.

ఇప్పటి వరకు 13 దేశాలు వూత్రమే డేవిస్ కప్ విజేతలుగా నిలిచారుు. అత్యధికంగా యుూఎస్‌ఏ 32 సార్లు ఈ ట్రోఫిని సాధించింది. 28 టైటిల్స్‌తో ఆస్ట్రేలియూ తర్వాతి స్థానంలో నిలిచింది. ఫ్రాన్స్, గ్రేట్ బ్రిటన్ (9సార్లు), స్వీడన్(7 సార్లు) డేవిస్ కప్‌ను సాధించారుు. భారత్ 1921 నుంచి ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటోంది. 1966, 1974, 1987లలో వుూడు సార్లు రన్నర్‌గా (1974లో దక్షిణాఫ్రికా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా.. ఆ దేశంతో ఫైనల్ ఆడటానికి భారత్ నిరాకరించింది) నిలిచింది.

12.హాంకాంగ్ ఓపెన్ విజేత సైనా
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ హాంకాంగ్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ సాధించింది. డిసెంబర్ 12న జరిగిన ఫైనల్లో షిజియూన్ వాంగ్(చైనా)ను సైనా ఓడించింది. 1982లో ప్రకాశ్ పదుకొనే తర్వాత హాంకాంగ్ టైటిల్ సాధించిన తొలి భారతీయుురాలిగా కూడా సైనా గుర్తింపు పొందింది. ఇది సైనాకు నాలుగో సూపర్ సిరీస్ టైటిల్. గతంలో ఇండియూ, సింగపూర్, ఇండోనేషియూ ఓపెన్‌లలో సైనా విజేతగా నిలిచింది.

13.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని అబుదాబీలో జరిగిన గల్ఫ్ కో-ఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) సదస్సు డిసెంబర్ 7న వుుగిసింది. 1981లో ఏర్పాటైన జీసీసీలో సౌదీ అరేబియూ, కువైట్, బహ్రెయిన్, ఒవున్, ఖతార్, యుుఏఈలు సభ్య దేశాలు.

14.భారత్‌లో అంతరిస్తున్నజంతు వుల ఇతివృత్తంతో డెరైక్టరేట్ ఆఫ్ అడ్వర్‌టైజింగ్ అండ్ విజువల్ పబ్లిసిటీ (డీఏవీపీ) 2011 క్యాలెం డర్‌ను రూపొందించింది.

15.సీఎన్‌ఎన్-ఐబీఎన్ ఇంగ్లిష్ న్యూస్‌చానల్‌కు చెందిన కరణ్ థాపర్‌కు ‘బెస్ట్ కరెంట్ అఫైర్స్ ప్రెజెంటర్’గా ఏషియున్ టెలివిజన్ పురస్కారం దక్కింది. థాపర్‌కు ఈ అవార్డు రావడం ఐదోసారి.

16.న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు వన్డేల క్రికెట్ సిరీస్‌ను భారత్ 5-0 తేడాతో గెలుచుకుంది. భారత జట్టు కెప్టెన్ గౌతమ్‌గంభీర్ వ్యూన్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యూరు.
                                                                            -ఆకేపాటి శ్రీనివాసులురెడ్డి
                                                                             కరెంట్ అఫైర్స్ నిపుణులు

విజయూనికి కీలకం.. జనరల్ ఎస్సే

విజయూనికి కీలకం.. జనరల్ ఎస్సే

గ్రూప్-1 మెయిన్స్‌లో మిగిలిన విభాగాల కంటే భిన్నమైంది జనరల్ ఎస్సే.. గత ఫలితాలను విశ్లేషిస్తే..తుది విజేతలను నిర్ణయించడంలో ఈ విభాగమే కీలకమనే విషయుం అవగతవువుతుంది.. అభ్యర్థిలోని సృజనాత్మకత, సంపూర్ణ విషయావగాహన, వర్తవూన అంశాలపై పట్టు వంటి అంశాలను పరీక్షించడానికి ఉద్దేశించిన .. ఈ విభాగమే.. గ్రూప్-1లో విజయూనికి కీలకం.. పక్కా ప్రణాళిక, భిన్న కోణాల్లోంచి విషయూన్ని ప్రెజెంట్ చేసే చతురత ఉంటే ఈ పేపర్‌లో చక్కని స్కోరు సాధించవచ్చు.

ఇందులో ఒక్కో విభాగం నుంచి మూడు ప్రశ్నలు అడుగు తారు. వాటిలో ఒక్క ప్రశ్నకు వూత్రమేసమాధానం రాయాలి. అంటే మొత్తం మీద మూడు వ్యాసరూప ప్రశ్నల కు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు 50 వూర్కులు కేటారుుంచారు. గతంలో మూడు గంటల సమయంలో కేవలం ఒక వ్యాసరూప ప్రశ్నకు సవూధానం ఇస్తే సరిపోయేది. ప్రస్తుత విధానంలో అంతే సవుయుంలో మూడు ప్రశ్నలకు సవూధానాలు రాయాల్సి ఉంటుంది. అందువల్ల అభ్యర్థులు ప్రిపరేషన్ నుంచే ఈ పేపర్‌ను సరికొత్త దృక్కోణంలో చూడాలి.

గత గ్రూప్-1 పేపర్‌లో వివిధ పేపర్లలో అభ్యర్థులు పొందిన మార్కులను పరిశీలిస్తే.. మిగతా పేపర్లతో పోల్చి తే ఎస్సే పేపర్ స్కోరింగ్ తీరులో చాలా వ్యత్యాసాన్ని గవు నించవచ్చు. ఈ విభాగంలో 80-120 స్థాయిలో మార్కు లు సాధించిన వారు చాలా మంది ఉన్నారు. అదే సవు యుంలో 40 నుంచి 50 మార్కులు మాత్రమే సాధించిన అభ్యర్థులు కూడా ఉన్నారు. దీన్ని బట్టి గత గ్రూప్-1 విజే తలను నిర్ణరుుంచడంలో ఈ విభాగం కీలక పాత్ర పోషిం చిందనే విషయుం స్పష్టవువుతుంది. కాబట్టి అభ్యర్థులు ఈ విభాగం ప్రిపరేషన్ విషయుంలో జాగ్రత్తగా ఉండాలి. ఎటు వంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా సంప్రదాయు పద్ధతులకు బదులు.. సాంకేతికంగా, శాస్ర్తీయమైన ప్రిపరేషన్ కొనసా గించాలి.

గతంలో ఉన్న వుూడు గంటల వ్యవధిలో ఒక వ్యాసం రాసేటప్పుడు.. దానికి సంబంధించిన వివరణ, సుదీర్ఘ పరిచయుం ఇచ్చేవారు. అంతేకాకుండా వ్యాసం నేపథ్యాని కి, వుుగింపునకు తగిన ప్రాధాన్యం కల్పించేవారు.గంటకు ఒక్క వ్యాసం రాయూల్సిన ప్రస్తుత విధానంలో.. ఈ తరహా విధానానికి స్వస్తి పలకడమే మేలు. అభ్యర్థిలోని సృజనా త్మకత, అవగాహన, వర్తవూన అంశాలపై పట్టు తదితర అంశాలను పరీక్షించడానికి ఈ విభాగం ఉపయోగపడు తుంది. కాబట్టి అభ్యర్థి ఏ విషయుంపై వ్యాసం రాస్తున్నా.. సంబంధిత లక్ష్యం సాధించేలా వ్యాసాన్ని ప్రెజెంట్ చేయు డం వుంచిది. అంతేకాకుండా సరళమైన భాషను వినియో గిస్తు.. చిన్న పదాలలో భావం అర్థవుయ్యేలా రాయాలి.

ప్రిపరేషన్‌లో.. కీలకాంశాలు
ప్రతి విభాగం నుంచి ప్రస్తుత పరిస్థితులాధారంగా ఏఏ ప్రశ్నలు అడిగే అవకాశం ఉందో వాటికి సంబంధించి ఒక అవగాహనకు రావాలి.
గుర్తించిన అంశాలపై ఎన్ని రకాల నేపథ్యాల నుంచి ప్రశ్నలు అడగవచ్చో ముందుగానే అంచనాకు రావడం వుంచిది.
గుర్తించిన అంశాలకు సంబంధించిన ముఖ్య గణాంక సమాచారాన్ని సేకరించుకోవాలి.
అంశానికి సంబంధించిన సమకాలీన నేపథ్యాన్ని అవగాహన చేసుకోవాలి.
సంబంధిత సమస్యలను గుర్తించాలి.
సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించాలి.

ఈ రకమైన అధ్యయనంతో ఒక్కో విభాగం నుంచి కనీసం నాలుగు అంశాల చొప్పున మొత్తం 12 వ్యాసాల కు ప్రిపేర్ కావడం చాలా అవసరం. అంతేకాకుండా నిర్దే శించిన కాలవ్యవధిలో ప్రభావవంతమైన వ్యాసం రాయు డాన్ని ప్రాక్టీస్ చేయుడం కూడా అవసరం. ప్రాక్టీస్ చేసిన వ్యాసంపై సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోవడం ఉపకరిస్తుంది. దీని వల్ల అభ్యర్థులు ఊహించని విధంగా ప్రశ్న వచ్చినా సమర్థంగా ప్రతిస్పందించే లక్షణం అలవడు తుంది.

ప్రతి వ్యాసాన్ని ప్రారంభించే ముందు దానికి గంట లోపలే సమాధానం రాయాల్సి ఉంటుందనే విషయూన్ని గుర్తుంచుకోవాలి. ప్రశ్నను రెండు-వుూడు సార్లు జాగ్రత్త గా చదవడం వుంచిది. కొంత మంది అభ్యర్థులు తొందర లో ప్రశ్నను సరిగ్గా చదువకుండానే జవాబును ప్రారంభి స్తారు. దాంతో అడిగిన ప్రశ్నకు.. సవూధానానికి ఏ వూత్రం పొంతన లేకుండా వ్యాసం సాగుతుంది. ఇక్కడ గవునించాల్సిన వురొక అంశం గతంలోలాగ ప్రశ్న ఒక పద బంధంలో ఉండటం లేదు. ఉదా: బాల కార్మిక వ్యవస్థ గురించి రాయండి?, మహిళ సాధికారత గురించి రాయండి? అనే రీతిలో ప్రశ్నలు ఉండటం లేదు. ఒక అంశానికి సంబంధించి ఏదో ఒక ప్రత్యేక కోణం లేదా సమస్యను లక్ష్యంగా చేసుకొని ప్రశ్నలడుగుతున్నారు.

ఉదాహరణకు బాల కార్మిక వ్యవస్థను తీసుకుంటే.. బాల కార్మిక వ్యవస్థ ఒక ఆర్థిక సమస్య మాత్రమే కాదు, ఆర్థిక మూలాలు ఉన్నాయి. వ్యాఖ్యానించండి?
ఈ రకమైన ప్రశ్నకు సంప్రదాయ పద్ధతిలో సవూధా నం ఇస్తే అంత ప్రభావవంతంగా ఉండదు. మెుదట ప్రశ్నను ఏ కోణంలో అడుగుతున్నారో గవునించి.. అదే నేపథ్యంలో సమాధానం రాయాలి. వ్యాసాన్ని ప్రారం భించడానికి ముందు కనీసం అయిదు నిమిషాలు జాగ్ర త్తగా ఆలోచించి.. వ్యాసంలో ప్రస్తావించాల్సిన అంశాలపై ఒక అవగాహన ఏర్పర్చుకోవాలి. తర్వాత దానికనుగుణం గా నిర్మాణాత్మకంగా వ్యాసాన్ని ప్రెజెంట్ చేయూలి.

వ్యాసం రాసేటప్పుడు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు
సమకాలీన నేపథ్యం
సమస్య-వివిధకోణాలు
సమస్య కారణాలు ప్రభుత్వ చర్యలు
ప్రస్తుత స్థితి
పరిష్కార మార్గాలు
నిర్మాణాత్మక సూచనలు

పేపర్-1 జనరల్ ఎస్సే (వ్యాసం)
ఈ పేపర్‌లో మూడు విభాగాలు ఇచ్చారు. అవి
ఎ)సంక్షోభ నిర్వహణ, సామాజిక సమస్యలు- విశ్లేషణ, పరిష్కారాలు
బి)జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న సమకాలీన సమస్యలు
సి)ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన సమకాలీన సంఘటనలు/అంశాలు

మొదటి యూనిట్
గత గ్రూప్-1 మొదటి యూనిట్‌లో దుర్భిక్షం, స్ర్తీ, పురుష నిష్పత్తి, ఆర్థిక సంక్షోభం అంశాల మీద ప్రశ్నలు ఇచ్చారు. అయితే ఈ ప్రశ్నలు స్థూలంగా లేవు. ఈ విషయాన్ని అభ్యర్ధులు జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి.
ఈ విభాగం నుంచి వచ్చే అవకాశం ఉన్న ప్రశ్నలు
జనాభా విస్ఫోటం.
వ్యవసాయ రంగంలో క్షీణిస్తున్న దిగుబడులు, అంతంత మాత్రంగా వృద్ధి రేట్లు.
భారతదేశం వైద్య అత్యవసర పరిస్థితులు-ప్రభుత్వ సమాయత్తత.
మహిళలపై అత్యాచారాలు-గృహహింస-లైంగిక వేధింపులు.
పెరుగుతున్న ఆత్మహత్యల రేట్లు-సామాజిక ఒత్తిడి.
భారతదేశంలో ఇటీవల సంభవించిన ప్రకృతి వైపరీత్యాలు-ప్రభుత్వ యంత్రాంగ ప్రతిస్పందన.

రెండో యూనిట్
రెండో యూనిట్ (జాతీయ, అంతర్జాతీయ, వర్తమాన సంఘటనలకు సంబంధించిన) నుంచి గత గ్రూప్-1లో యుూరోపియున్ యూనియన్, ఇండో- యూఎస్‌ఏ అణు ఒప్పందం, ఇస్రోలకు సంబంధించిన ప్రశ్నలు అడిగారు.

ఈ విభాగం నుంచి వచ్చే అవకాశం ఉన్న ప్రశ్నలు
పొరుగు దేశాలతో భారతదేశ సంబంధాలు.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు సభ్యత్వం.
ఆసియా ఖండంలో యూఎస్‌ఏ దౌత్య నీతి-చైనాను చుట్టుముట్టడం.
కాశ్మీర్ సమస్య పరిష్కారంలో యూఎస్‌ఏ పాత్ర.
కాశ్మీర్‌లో శాంతి స్థాపన.
అంతర్జాతీయ దౌత్య సంబంధాలపై వికీలీక్స్ ప్రభావం
అయోధ్య వివాదంపై అలహాబాద్ న్యాయస్థానం తీర్పు.
కార్పొరేట్ లాబీయింగ్- ప్రసారమాధ్యమాల పాత్ర.

మూడో యూనిట్
మూడో విభాగంలో ఆంధ్రప్రదేశ్‌లో సంభవించిన సమ కాలీన సంఘటనలు అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. గత గ్రూప్-1లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌ఆర్‌ఈజీపీ పథకం అమలు, ఆంధ్ర ప్రదేశ్‌లో పంచాయితీరాజ్ వ్యవస్థపై ప్రశ్నలు అడిగారు.

ఈ విభాగం నుంచి వచ్చే అవకాశం ఉన్న ప్రశ్నలు
ఆంధ్రప్రదేశ్‌లో సూక్ష్మరుణ సంస్థల కార్యకలాపాలు- చట్ట నియంత్రణ సాధ్యమేనా?సబబేనా?
ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్ధి ఉద్యమాలు-ప్రాంతీయ, సమైక్య వాదాలు.
ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో కార్పొరేట్ ధోరణులు- విద్యాహక్కు చట్టం అమలు.
రాష్ట్ర సహకార రంగ ప్రక్షాళన- ప్రతిపాదిత ఏకీకృత చట్టం.
రాష్ట్రంలో అతివృష్టి-వ్యవసాయ రంగంపై ప్రభావం.
రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధి-సమకాలీన సమస్యలు.
ఆంధ్రప్రదేశ్‌లో సేద్యపు నీటి ప్రాజెక్టులు నిర్మాణం- పర్యావరణ, ఇతర అడ్డంకులు.

                                                                   -గురజాల శ్రీనివాసరావు
                                                        సివిల్స్ సీనియర్ అధ్యాపకులు, ఆర్.సి. రెడ్డి స్టడీ సర్కిల్

చరిత్ర.. విస్తృత అవగాహనతోనే విజయం

చరిత్ర.. విస్తృత అవగాహనతోనే విజయం
పేపర్-2, సెక్షన్-1
గ్రూప్-1 మొయిన్స్ పేపర్-2లో కీలక విభాగం ‘చరిత్ర’. శాస్ర్తీయంగా, ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ అరుుతే ఈ విభాగంలో చక్కని స్కోరు సాధించవచ్చు. సిలబస్‌లో.. భారతదేశ చరిత్రకు సంబంధించిన విభాగాన్ని పరిశీలిస్తే ‘సాంస్కృతిక వారసత్వం, 20వ శతాబ్ది చరిత్ర’కు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తుంది. మొదటి రెండు యూనిట్ల సిలబస్‌లో స్థూలంగా భారతీయ సాంస్కృతిక వారసత్వానికి సంబంధించిన అంశాలే కనిపిస్తాయి. ఇక, 3,4,5 యూనిట్లు ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధిం చినవి. వర్తమాన చరిత్రను సమగ్రంగా అర్ధం చేసుకోవడా నికి అభ్యర్ధికి ఆధునిక భారతదేశ చరిత్రపై లోతైన అవగా హన తప్పనిసరి.

ఈ విషయూన్ని దృష్టిలో ఉంచుకుని ఆధునిక చరిత్రకు మూడు యూనిట్లు కేటాయించారు.
అభ్యర్ధులు ప్రిపరేషన్ విషయుంలో జాగ్రత్తగా వ్యవ హరించాలి. తర్కబద్ధంగా, శాస్ర్తీయంగా ప్రిపేర్ కావడం వుంచిది. అందుబాటులో ఉన్న సవుయూన్ని దృష్టిలో పెట్టుకుని, మిగిలిన పేపర్లను కూడా పరిగణనలోకి తీసుకుని పక్కా ప్రణాళికతో ప్రిపేర్ కావడం లాభిస్తుంది. ప్రతి యూనిట్ నుంచి ఒక్క ప్రశ్నకు మాత్రమే సమాధానం రాయాలి. అంతేకాకుండా ప్రతి యూనిట్‌లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. కాబట్టి హిస్టరీలో కొన్ని ముఖ్యమైన టాపిక్స్‌ను గుర్తించి వాటిపై అన్ని కోణాల్లోను ప్రశ్నలు- సమాధానాలు రూపొందించుకోవడం ఉపయుుక్తం.

ఏ యూనిట్‌లో ఏ టాపిక్స్ ఎంచుకోవాలనేది అభ్యర్ధి అవగా హన, ఆసక్తిని బట్టి ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు 4వ యూనిట్‌లో జాగ్రత్తగా గమనిస్తే రెండు విభాగాలను గుర్తించవచ్చు. తొలుత సాంఘిక-మత సంస్కరణోద్య మాలు- రాజారామ్మోహన్‌రాయ్, దయానంద సరస్వతి తదితర అంశాలు, ఆ తర్వాత కులవ్యతిరేక, బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలు కనిపిస్తాయి. అభ్యర్ధి ఈ రెండు విభా గాల్లో (చాయిస్ దృష్ట్యా) ఏదో ఒక దానిపై సమగ్రంగా ప్రిపేర్ అరుుతే సరిపోతుంది. అయితే ఇది ఒక వ్యూహా త్మక దృక్పథం మాత్రమేననే విషయూన్ని గుర్తుంచుకో వాలి. ఒక్కోసారి ఏదో ఒక విభాగం నుంచి రెండు ప్రశ్నలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు.


మొదటి యూనిట్
ప్రాచీన భారతదేశ చరిత్రకు సంబంధించిన ఈ యూనిట్ ప్రిపరేషన్‌కు ఎన్‌సీఈఆర్‌టీ ‘ఏన్సియంట్ ఇండియా’ (ఆర్‌ఎస్ శర్మ) పుస్తకం, తెలుగు అకాడెమీ బీఏ మొదటి సంవత్సరం ‘భారతదేశ చరిత్ర’ పుస్తకం చాలా వరకు ఉపయోగపడతాయి. అభ్యర్ధి గమనించాల్సిన విషయం.. ప్రాచీన భారతదేశ చరిత్రలోని చాలా అంశాలు సిలబస్‌లో పేర్కొనలేదు. సాధారణంగా చరిత్ర పుస్తకాల్లో కనిపించే ‘ఆధారాలు’, ‘చరిత్ర పూర్వ యుగం (ప్రీ హిస్టరీ)’లాంటి అంశాలు లేవు. సిలబస్.. సింధు నాగరికతతో ప్రారంభమై మౌర్యానంతర యుగంలోని ‘గాంధార, మధుర, అమరావతి’ శైలులతో వుుగుస్తుంది. అకడెమిక్ స్థాయిలో ప్రాచీన చరిత్రలో చాలా ముఖ్యమైన గుప్తులు, హర్షుడు వంటి అంశాలను ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా సిలబస్‌లో ఒక్క రాజవంశం పేరుగాని, ఒక్క పాలకుడి పేరుగాని ప్రస్తావించలేదు.

ముఖ్యమైన ప్రశ్నలు
సింధు నాగరికతలోని పట్టణ సంస్కృతికి సంబంధించిన అంశాలను విశ్లేషించండి?
సింధు నాగరికత పతనాన్ని చర్చించి, వారసత్వాన్ని విశ్లేషించండి?
రుగ్వేద కాలానికి, మలివేద కాలానికి ఆర్యుల జీవనంలో వచ్చిన మార్పులను చర్చించండి?
సింధు నాగరికతకు, వైదిక సంస్కృతికి మధ్య తేడాలను చర్చించండి?
బౌద్ధ, జైన మతాల ఆవిర్భావానికి ఆనాటి సాంఘిక, ఆర్థిక అంశాలే కారణం- చర్చించండి?
భారతీయ సంస్కృతికి బౌద్ధమత సేవలను అంచనా వేయండి?
బౌద్ధమత వ్యాప్తికి, పతనానికి కారణాలను విశ్లేషించండి?
మహాయాన బౌద్ధం నేపథ్యాన్ని, ప్రభావాన్ని పరిశీలించండి?
గాంధార, మధుర, అమరావతి శైలులను తులనాత్మకంగా పరిశీలించండి?

రెండో యూనిట్
మధ్య యుగ చరిత్రకు సంబంధించిన ఈ యూనిట్‌లో ఎక్కువ సిలబస్ ఉన్నప్పటికీ, ‘భక్తి ఉద్యమం, ఇండో- పర్షియన్ సంస్కృతి, మొఘల్ సంస్కృతి, విజయనగర సాంఘిక, ఆర్ధిక స్థితిగతులు’ వంటి కొన్ని ముఖ్యమైన అంశాలను లోతుగా అధ్యయునం చేస్తే సరిపోతుంది. అదే సవుయుంలో ‘రాజకీయ చరిత్ర’ను పరిగణనలోకి తీసు కోవాల్సిన అవసరం లేకపోవడం గవునించాలి.

‘మధ్య యుగాల భారతదేశ చర్రిత’ (సతీష్ చంద్ర), తెలుగు అకాడెమీ-బీఏ ద్వితీయ సంవత్సరం భారతదేశ చరిత్ర పుస్తకాలు ఈ యుూనిట్ ప్రిపరేషన్‌కు ఉపకరిస్తాయి. ఈ విభాగంలో అభ్యర్ధులు దృష్టి పెట్టాల్సిన వురో కీలక అంశం ‘వాస్తు, చిత్ర లేఖనం, సంగీతం, సాహిత్యం’. అంతేకాకుండా ఈ అంశాలకు సంబంధించిన కచ్చితమైన పారిభాషిక పదజాలాన్ని పరీక్షలో ఉపయోగించడం సంద ర్భోచితంగా ఉంటుంది.

ముఖ్యమైన ప్రశ్నలు:
హిందూ సమాజం, ముస్లిం సమాజం పరస్పర ప్రభావానికి గురై, ‘ఇండో-ఇస్లామిక్ సంస్కృతి’ వికాసానికి ఎలా దోహదపడ్డాయో వివరించండి?
భక్తి ఉద్యమ స్వభావాన్ని, ప్రభావాన్ని విశ్లేషించండి?
సాంస్కృతిక సామరస్యానికి కబీర్, నానక్ బోధనలు ఎంత వరకు దోహదపడ్డాయో పరిశీలించండి?
సూఫీ భావనలు వివరించి భారతీయ సమాజంపై సూఫీల ప్రభావాన్ని విశ్లేషించండి?
ఢిల్లీ సుల్తానుల కాలం నాటి ఇండో-పర్షియన్ వాస్తు శైలి విశేషాలను వివరించండి?
విజయనగర సామ్రాజ్యంలోని సాంఘిక, ఆర్ధిక పరిస్థితులను విదేశీ యాత్రికుల ప్రస్తావనల సాయంతో చర్చించండి?
విజయనగర సామ్రాజ్యంలో సాంస్కృతిక వికాసాన్ని పరిశీలించండి?
మొఘల్ యుగంలోని వాస్తు, చిత్రలేఖనం, సంగీతం, సాహిత్య రంగాల వికాసాన్ని పరిశీలించండి?
మొఘల్ వాస్తు శైలి పరిణామాన్ని సోదాహరణంగా చర్చించండి?
శివాజీ ఉత్థానానికి దారితీసిన కారకాలను విశ్లేషించండి?

మూడో యూనిట్
భారతదేశ చరిత్రకు సంబంధించి గ్రూప్-1 సిలబస్‌లో అతిపెద్ద యూనిట్ ఇదే. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రిపరే షన్ సాగించాలి. జాతీయోద్యమంపై సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలి. అప్పుడే ఈ యూనిట్ నుంచి వచ్చే ప్రశ్నలను సమర్ధంగా ఎదుర్కోగలుగుతారు.
ఈ యూనిట్ ప్రిపరేషన్‌కు ఎన్‌సీఈఆర్‌టీ-‘మోడర్న్ ఇండియా’ (బిపిన్ చంద్ర), అలాగే బిపిన్ చంద్ర తదితరు లు రాసిన ‘భారతదేశ స్వాతంత్య్రోద్యమ చరిత్ర’ చాలా వరకు ఉపకరిస్తాయి.
ఆధునిక భారతదేశ చరిత్ర పుస్తకాల్లో విస్తృతంగా కన్పించే ‘కర్ణాటక యుద్ధాలు’ ‘ఆంగ్లో-మైసూరు యుద్ధా లు’, ఆంగ్లో-మరాఠా యుద్ధాలు’ తదితర రాజకీయ సంఘటనలను చదవాల్సిన అవసరం లేదు. జాతీయో ద్యమ చరిత్రను మాత్రం లోతుగా అధ్యయనం చేయాలి.

ముఖ్యమైన ప్రశ్నలు:
బ్రిటిష్ వారి విజయానికి, భారతీయ పాలకుల వైఫల్యానికి కారణాలు చర్చించండి?
1857 తిరుగుబాటు కారణాలను, ఫలితాలను విశ్లేషించండి?
1857 తిరుగుబాటు వైఫల్యానికి గల కారణాలను చర్చించండి?
1857 తిరుగుబాటు స్వభావాన్ని చర్చించండి?
భారత జాతీయోద్యమ ఆవిర్భావానికి దారి తీసిన పరిస్థితులను విశ్లేషించండి?
మితవాద రాజకీయాలను విమర్శనాత్మకంగా పరిశీలించండి?
అతివాద రాజకీయాలు బలపడేందుకు దోహదపడిన కారణాలను విశ్లేషించండి?
బెంగాల్ విభజనకు గల కారణాలను విశ్లేషించి, స్వదేశీ ఉద్యమ ప్రభావాన్ని చర్చించండి?
మితవాదులు, అతివాదులకు మధ్య భేదాలను చర్చిస్తూ, సూరత్ చీలికకు దారితీసిన పరిస్థితులను విశ్లేషించండి?
హోం రూల్ ఉద్యమ ప్రభావాన్ని పరిశీలించండి?
సహాయ నిరాకరణోద్యమ నేపథ్యాన్ని, ప్రభావాన్ని విశ్లేషించండి?
శాసనోల్లంఘన ఉద్యమ నేపథ్యాన్ని, ప్రభావాన్ని చర్చించండి?
విప్లవ తీవ్రవాద ఉద్యమాన్ని, భావజాలాన్ని పరిశీలించండి?
1944-47 మధ్య సంభవించిన రాజకీయ పరిణామాలను విశ్లేషించండి?
జాతీయోద్యమానికి గాంధీ ఎలా తిరుగులేని నాయకుడిగా ఎదిగాడో విమర్శనాత్మకంగా పరిశీలించండి?
గాంధీ శకం ప్రాముఖ్యతను అంచనా వేయండి?

నాలుగో యూనిట్
19వ శతాబ్దంలోని సాంఘిక, మత సంస్కరణోద్యమాలు, అ శతాబ్ది చివరి దశకాల నుంచి 20వ శతాబ్ది ప్రధమార్థం వరకు కొనసాగిన కులవ్యతిరేక పోరాటాలు, బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలను ఈ యూనిట్‌లో చేర్చారు. మిగతా యూనిట్లతో పోలిస్తే ఈ యూనిట్‌లోని సమాచారం పరిధి చాలా స్వల్పం. అయితే విశ్లేషణ పరంగా చాలా ప్రాముఖ్యమైంది.

సాంఘిక, మత సంస్కరణోద్యమాలు, రాజారామ్మో హన్‌రాయ్, దయానంద సరస్వతి తదితరుల గురించి సమాచారం ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లోనూ, తెలుగు అకా డెమీ పుస్తకాల్లోనూ పుష్కలంగా లభిస్తుంది. కులవ్యతిరేక, బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాల్లో భాగంగా జస్టిస్ పార్టీ ఉద్యమం, ఆత్మగౌరవ ఉద్యమంపై లోతుగా అధ్యయనం చేయాలి. అలాగే కుల వ్యవస్థ, అస్పృశ్యతలకు సంబం ధించి జ్యోతిభా ఫూలే, నారాయణ గురు, అంబేద్కర్, గాంధీల ఆలోచనలు వారు నడిపిన ఉద్యమాలపై లోతైన అవగాహన ఏర్పర్చుకోవాలి. ఈ అంశాలకు ‘ ఏ న్యూ లుక్ ఎట్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ’ (గ్రోవర్ అండ్ గ్రోవర్), ఇగ్నో స్టడీ మెటీరియల్ చాలా వరకు ఉపకరిస్తాయి.

ముఖ్యమైన ప్రశ్నలు:
19వ శతాబ్దిలో తలెత్తిన వివిధ మత, సాంఘిక, సంస్కరణోద్యమాలను పరిశీలించండి?
19వ శతాబ్దిలో తలెత్తిన సాంస్కృతిక పునరుజ్జీవనంలో రాజారామ్మోన్ రాయ్, దయానంద సరస్వతి రెండు ప్రత్యేక ధోరణులకు ప్రతినిధులు- చర్చించండి?
ఆధునిక భారతదేశంలో తలెత్తిన వివిధ కుల వ్యతిరేక, బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాలను వివరించండి?
జస్టిస్ పార్టీ లక్ష్యాలను, పనితీరును విమర్శనాత్మకంగా పరిశీలించండి?
ఆత్మ గౌరవ ఉద్యమ నేపథ్యాన్ని, ప్రభావాన్ని విశ్లేషించండి?
భారతదేశంలో దళితుల అభ్యున్నతికి కృషి చేసిన వివిధ వ్యక్తుల పాత్రను వివరించండి?
దళితుల కోసం ఫూలే, నారాయణ గురు, అంబేద్కర్ చేసిన కృషిని చర్చించండి?
గాంధీ నడిపిన హరిజనోద్యమాన్ని వివరించి, కుల వ్యవస్థ-అస్పృశ్యతకు సంబంధించి గాంధీ, అంబేద్కర్‌కు గల భేదాభిప్రాయాలను విశ్లేషించండి?

ఐదో యూనిట్
జాతీయోద్యమానికి సమాంతరంగా నడిచిన కొన్ని వర్గ పోరాటాలు, మతతత్వ రాజకీయాలు-జాతీయోద్యమం తో వీటికి గల సంబంధాలు ఈ యూనిట్‌లోని ప్రధాన అం శాలు. అలాగే స్వాతంత్య్రానంతర చరిత్ర కూడా అధ్యయ నం చేయడం అవసరం. ఈ అధ్యయనం ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ ఎస్సే పేపర్లకు కూడా ఉపకరి స్తుంది. స్వాతంత్య్రానంతర చరిత్రలో నెహ్రూ విదేశాంగ విధానం, సంస్థానాల విలీనం, ప్రణాళికలు, రాష్ట్రాల పున ర్విభజన, ఇతర సాంఘిక, ఆర్ధిక పునర్నిర్మాణానికి సంబం ధించిన అంశాలను అధ్యయనం చేయడం మంచిది.

ఈ యూనిట్ లో కనిపించే రకరకాల ఉద్యమాలు- రైతు ఉద్యమాలు, కార్మిక ఉద్యమాలు, వామపక్ష రాజకీ యాలు, మతతత్వ రాజకీయాలు వంటి అంశాల కోసం బిపిన్ చంద్ర పుస్తకాలతో పాటు ‘మోడర్న్ ఇండియా’ (సుమిత్ సర్కార్), ‘ఎ న్యూ లుక్ ఎట్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ’ (గ్రోవర్ అండ్ గ్రోవర్) ఉపకరిస్తాయి. మహిళా ఉద్యమానికి సంబంధించిన సమాచారం కోసం సోషియా లజీకి సంబంధించిన పుస్తకాలు, ఇగ్నో స్టడీ మెటీరియల్ ఉపయుుక్తం. స్వాతంత్య్రానంతర చరిత్ర కోసం ‘ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్’ (బిపిన్ చంద్ర అండ్ అదర్స్) చదవడం మంచిది.

ముఖ్యమైన ప్రశ్నలు:
ఆధునిక భారతదేశంలో వామపక్ష రాజకీయ వృద్ధిని, ప్రభావాన్ని విశ్లేషించండి?
ఆధునిక భారతదేశంలోని రైతు ఉద్యమాలను పరిశీలించండి?
భారతదేశంలో కార్మికోద్యమ ప్రస్థానాన్ని విశ్లేషించండి?
జాతీయోద్యమంలో కర్షకులు, కార్మికులు పోషించిన పాత్రను పరిశీలించండి?
భారతదేశంలో మహిళా ఉద్యమ వికాసాన్ని, పరిణామాన్ని విశ్లేషించండి?
జాతీయోద్యమంలో మహిళల పాత్రను చర్చించండి?
మతతత్వ రాజకీయాలు ఆవిర్భవించడానికి దారి తీసిన కారణాలను విశ్లేషించండి?
భారతదేశంలో మతతత్వ ఘర్షణలు, రాజకీయాల వృద్ధిని పరిణామాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించండి?
దేశ విభజనకు దారితీసిన పరిస్థితులను విశ్లేషించండి? దేశ విభజన అనివార్యమా?
దేశ విభజన ప్రభావాన్ని, ఫలితాలను విశ్లేషించండి?
భారతదేశంలో సంస్థానాలు విలీనమైన వైనాన్ని, అందులో వల్లభాయ్ పటేల్ పాత్రను విశ్లేషించండి?
ఆధునిక భారతదేశ పరిణామంలో నెహ్రూ పాత్రను అంచనా వేయండి?

-వి.శివాజీ
హిస్టరీ ఫ్యాకల్టీ, హైదరాబాద్