కరెంట్ అఫైర్స్-డిసెంబర్ -2010 సంచిక 2

1.అగ్ని-1 క్షిపణి పరీక్ష విజయవంతం
అణు సామర్థ్యమున్న అగ్ని-1 క్షిపణిని భారత్ నవంబర్ 25న విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలో ఉన్న వీలర్స్ ఐలాండ్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి సైన్యానికి చెందిన వ్యూహా త్మక దళాల కమాండ్ ఈ పరీక్షను నిర్వహించింది. ఈ క్షిపణి 700 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. పేలోడ్ సామర్థ్యం 1000 కిలోలు. ఇందులో ఒకేఒక్క దశ ఉంటుంది.ఘన ఇంధనాన్ని వినియోగిస్తారు. అగ్ని-1 బరువు 12 టన్నులు కాగా పొడవు 15 మీటర్లు.

2.యూనిఫెమ్ ‘సేఫ్ సిటీస్’ కార్యక్రమం
దేశ రాజధానిలో మహిళలు, యుక్త వయసు బాలికలపై జరుగుతున్న హింసను అరికట్టేందుకు ఐక్యరాజ్యసమితి మహిళా అభివృద్ధి నిధి (యూనిఫెమ్) ‘సేఫ్ సిటీస్’ అనే నూతన కార్యక్రమాన్ని న్యూఢిల్లీలో నవంబర్ 22న ప్రారం భించింది. ‘మహిళలు, బాలికలపై హింసకు తావు లేని రక్షిత నగరాలు’ అనే లక్ష్యంతో ఆరంభించిన ఈ పథకం లో.. భాగంగా మురికి వాడలు, బహిరంగ ప్రదేశాలు, ప్రజా రవాణా వ్యవస్థ, ఇతర ప్రదేశాలలో లైగింక వేధింపు లు వంటి సమస్యలపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. భారత్‌తోపాటు, ఈక్విడార్, ఈజిప్టు, పాపువా న్యూగి నియా, రువాండా దేశ రాజధాని నగరాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

3.ఆంధ్రప్రదేశ్ 16వ సీఎంగా కిరణ్‌కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ 16వ ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నవంబర్ 25న ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్. నరసింహన్ ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు. ఆయన ఇప్పటి వరకు శాసనసభ స్పీకర్‌గా వ్యవహరించారు.

కిరణ్‌కుమార్ రెడ్డి ప్రస్తుతం చిత్తూరు జిల్లా పీలేరు నుంచి శాసనసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆయన 1989లో తొలి సారి చిత్తూరు జిల్లా వాయల్పాడు నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1999, 2004లలో కూడా ఇదే నియోజక వర్గం నుంచి శాసనసభకు ప్రాతినిథ్యం వహిం చారు. 2004- 09 మధ్య కాలంలో ప్రభుత్వ చీఫ్ విప్‌గా బాధ్యతలు నిర్వహించారు.

4.ఆసియా క్రీడల్లో భారత్‌కు ఆరోస్థానం
చైనాలోని గ్వాంగ్‌జౌలో జరిగిన 16వ ఆసియా క్రీడలు నవంబర్ 27న ముగిశాయి. ముగింపు వేడుకల్లో భారత బృందానికి బాక్సర్ విజేందర్ సింగ్ నేతృత్వం వహించారు. ఈ క్రీడల్లో భారత్ 14 స్వర్ణ పతకాలతోసహా మొత్తం 64 పతకాలను సాధించి ఆరో స్థానంలో నిలిచింది. 2006 దోహలో జరిగిన ఏషియాడ్‌లో భారత్ 10 స్వర్ణాలు సహా మొత్తం 53 పతకాలతో ఎనిమిదో స్థానంలో నిలిచింది.

ప్రస్తుత గ్వాంగ్‌జౌ క్రీడల్లో చైనా 199 స్వర్ణపతకాలున్నాయి. మొత్తం 416 పతకాలను సాధించి మొదటి స్థానంలో నిలిచింది. కాగా దక్షిణ కొరియా 76 స్వర్ణపతకాలతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. తదుపరి ఆసియా క్రీడలను 2014లో నిర్వహిస్తారు. ఈక్రీడలకు దక్షిణ కొరియాలోని ఇంచియోన్ నగరం ఆతిధ్యం ఇవ్వనుంది.

5.భారత స్వర్ణ పతకాల వివరాలు..
షూటింగ్: రంజన్‌సోధికి డబుల్ ట్రాప్ ఈవెంట్‌లో స్వర్ణం. ఈ క్రీడల్లో భారత్‌కు ఇదే తొలిస్వర్ణ పతకం.
టెన్నిస్: పురుషుల సింగిల్స్‌లో సోమ్‌దేవ్ వర్మన్ స్వర్ణం సాధించాడు. ఆసియా క్రీడల చరిత్రలో టెన్నిస్ వ్యక్తిగత విభాగంలో స్వర్ణం సాధించిన తొలి భారత ఆటగాడిగా కూడా వర్మన్ రికార్డు సృష్టించాడు. అదే విధంగా పురుషుల డబుల్స్‌లో సోమ్‌దేవ్ - సనమ్‌సింగ్‌ల జోడి స్వర్ణ పతకాన్ని సాధించింది.
బాక్సింగ్: విజేందర్ సింగ్ 75 కిలోల విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. వికాస్ కృష్ణన్ 60కిలోల విభాగంలో స్వర్ణం గెలుపొందాడు.

కబడ్డీ: పురుషులు, మహిళల రెండు విభాగాల్లోను భారత్‌కు పసిడి పతకాలు లభించాయి.
బిలియర్డ్స్: పంకజ్ అద్వానీ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సాధించడంతో భారత్ ఖాతాలో స్వర్ణం చేరింది.
రోయింగ్: పురుషుల సింగిల్స్ ‘స్కల్స్’లో బజరంగలాల్ థక్కర్ బంగారు పతకం సాధించారు.
అథ్లెటిక్స్: 10 వేల మీటర్ల విభాగంలో ప్రీజా శ్రీధరన్, 3000 మీటర్ల స్టేపుల్ ఛేజ్‌లో సుధాసింగ్ స్వర్ణ పతకాలు సాధించారు.

పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో జోసఫ్ అబ్రహం, మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో అశ్వని చిదానంద బంగారు పతకం సాధించారు. మహిళల 4్ఠ400 రిలేలో మంజిత్ కౌర్, సిని జోస్, అశ్విని చిదానంద, మన్‌దీప్ కౌర్‌ల బృందం స్వర్ణ పతకాన్ని సాధించింది. భారత్‌కు అత్యధికంగా అథ్లెటిక్స్ విభాగంలో ఐదు పసిడి పతకాలు లభించాయి.

6.జైతాపూర్ అణు కేంద్రానికి పర్యావరణ అనుమతి
మహారాష్ట్ర రత్నగిరి జిల్లాలో నిర్మించనున్న జైతాపూర్ అణు విద్యుత్ కేంద్రానికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నవంబర్ 27న అనుమతినిచ్చింది. 9900 మెగావాట్ల ఈ ప్రాజెక్ట్‌ను ఫ్రాన్స్‌కు చెందిన అరెవా కంపెనీ సహకారం తో ది న్యూక్లియర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్మిస్తుంది.

7.భారత-అంతర్జాతీయ చలనచిత్రోత్సవం
గోవా రాజధాని పనాజీలో 41వ భారత -అంతర్జాతీయ చలనచిత్రోత్సవాన్ని రైల్వే శాఖ మంత్రి మమతా బెనర్జీ, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్‌లు ప్రారంభించారు. పది రోజులపాటు నిర్వహిం చే ఈ ఉత్సవాల్లో 61 దేశాలకు చెందిన దాదాపు 300 చిత్రా లను ప్రదర్శిస్తారు. ఇందులో 18 భారతీయ చిత్రాలు. బిట్రిష్ చిత్రం‘వెస్ట్ ఈజ్ వెస్ట్’ను ప్రారంభ చిత్రంగా ప్రదర్శించారు.

8.భద్రతామండలిలో భారత శాశ్వత సభ్యత్వం కోసం అమెరికా తీర్మానం
ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలని కోరుతూ అమెరికా ప్రతినిధుల సభలో సభ్యుడు గున్ బిలిరాకిన్ నవంబర్ 22న తీర్మానం ప్రవేశ పెట్టారు. ఇందుకోసం ఐక్యరాజ్యసమితి చార్టర్‌లోని ఆర్టికల్ 23ను సవరించాలని తీర్మానం కోరింది. జనాభా రీత్యా ప్రపంచంలో రెండో అతి పెద్ద దేశం, అన్ని రకాల రాజకీయ అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉండడం, ఐరాస శాంతి పరిరక్షక కార్యక్రమాలకు అత్యధికంగా దళా లను పంపించడం వంటి అంశాలను ఇందుకు కారణాలు గా పేర్కొంది.

9.ఐబీ నూతన డెరైక్టర్ సంధూ
ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) నూతన డెరైక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి నేచల్ సంధూ నవంబర్ 26న నియమి తులయ్యారు. ప్రస్తుత డెరైక్టర్ రాజీవ్ మాధుర్ స్థానంలో జనవరి 1నుంచి సంధూ బాధ్యతలు స్వీకరిస్తారు. ఈయన బీహార్ క్యాడర్‌కు చెందిన 1973 బ్యాచ్ ఐపీఎస్ అధికారి.

10.నంబర్ పోర్టబిలిటీ ప్రారంభం
మొబైల్ నంబర్ పోర్టబిలిటీ(ఎంఎన్‌పీ) సౌకర్యాన్ని హర్యా నాలోని రోహ్‌తక్‌లో నవంబర్ 25న కేంద్ర టెలికాం శాఖ మంత్రి కపిల్ సిబాల్ ప్రారంభించారు. ఈ సదుపాయం వల్ల మొబైల్ వినియోగదారులు ఒక టెలికాం ఆపరేటర్ నుంచి మరో ఆపరేటర్‌కు మారినా తప్పనిసరిగా కొత్త నంబరు తీసుకోనక్కర్లేదు. కొంత రుసుము చెల్లించి పాత నంబరునే కొనసాగించుకోవచ్చు. ఈ సౌకర్యం జనవరి 20, 2011 నుంచి దేశ వ్యాప్తంగా అమల్లోకి రానుంది.

11.20వ అణువిద్యుత్తు కేంద్రం ఉత్పత్తి ప్రారంభం

కర్ణాటకలోని కైగా అణు విద్యుత్ కేంద్రం నాలుగో యూనిట్‌లో నవంబర్ 26న ఉత్పత్తి ప్రారంభమైంది. దీంతో దేశంలో మొత్తం అణు విద్యుత్ ఉత్పత్తి 4780 మెగా వాట్లకు పెరిగింది. అంతేకాకుండా అణువిద్యుత్ ఉత్ప త్తిలో ప్రపంచంలో భారత్ ఆరోస్థానానికి చేరుకుంది. అమె రికా, ఫ్రాన్స్, జపాన్,రష్యా,దక్షిణ కొరియాలు తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి. కైగా-4 స్వదేశీ ప్రెజరైజ్‌డ్ హెవీ వాటర్ రియాక్టర్. దీని సామర్థ్యం 220 మెగావాట్లు. ఇది దేశంలో 20వ అణువిద్యుత్ కేంద్రం.

12.టెస్ట్ సిరీస్ విజేత భారత్
న్యూజీలాండ్‌తో ముగిసిన మూడు టెస్ట్ మ్యాచ్‌ల క్రికెట్ సిరీస్‌ను భారత్ 1-0 తేడాతో గెలుచుకుంది. మొదటి రెండు మ్యాచ్‌లు డ్రా కాగా.. నాగపూర్‌లో ముగిసిన చివరి టెస్ట్‌లో భారత్ ఇన్నింగ్స్ 198 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా రాహుల్ ద్రవిడ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా హర్భజన్ సింగ్ ఎంపికయ్యారు.

13.హైలాస్ ప్రయోగం
భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) నిర్మించిన సమాచార ఉప గ్రహం ‘హైలాస్(హైలీ అడాప్టబుల్ శాటిలైట్)’ను నవం బర్ 26న ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించారు. ఈ ఉపగ్రహం యూరప్‌లోని హైస్పీడ్ బ్యాండ్ సేవలు అందించేందుకు తోడ్పడుతుంది. 2541 కిలోల బరువు గల హైలాస్ 15ఏళ్ల పాటు సేవలందిస్తుంది.

14.బీహార్ సీఎంగా నితీశ్ ప్రమాణస్వీకారం

బీహార్ ముఖ్యమంత్రిగా వరుసగా రెండో సారి నితీశ్ కుమార్ (జనతాదళ్- యునెటైడ్) నవంబర్26న ప్రమాణస్వీకారం చేశారు. బీజేపీకి చెందిన సుశీల్‌కుమార్ మోడీ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనతాదళ్ (యునెటైడ్), బీజేపీ కూటమి 243 స్థానాలకుగాను 206 సీట్లలో విజయం సాధించింది. నితీశ్ 2005లో తొలి సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

No comments:

Post a Comment