Showing posts with label GENERAL ESSAY. Show all posts

నల్లధనం - అంచనాలు - పరిణామాలు
వాల్ స్ట్రీట్ ఆక్రమణ... అంతర్జాతీయ స్పందన
విస్తృత ఉపాధి కల్పన ఎంతో ముఖ్యం
మౌర్య పూర్వ యుగం - షోడశ మహా జనపదాలు
క్రీస్తు పూర్వం 600 నుంచి 325 వరకు గల కాలాన్నీ మౌర్య పూర్వ యుగం (Pre-Mouryan Age) అని వ్యవహరిస్తున్నారు. ప్రాచీన భారత రాజ్య వ్యవస్థతోపాటు, సాంఘిక, ఆర్థిక వ్యవస్థలు కూడా స్పష్టమైన రూపాన్ని సంతరించుకున్న కాలమది. సుమారు వేయి సంవత్సరాలపాటు భారత రాజకీయ, సాంఘిక, ఆర్థిక వ్యవస్థలు అదే రూపంతో కొనసాగాయని చెప్పవచ్చు. షోడశ మహా జనపదాలు: బౌద్ధ గ్రంథం ‘అంగుత్తర నికాయ’ ఆధారంగా.. ఆనాటి భారతదేశంలో 16 మహా జనపదాలు ఉండేవని తెలుస్తోంది. ఈ మహా జనపదాలు, వాటి రాజధానుల వివరాలు ఇవి.. మహా జనపదం రాజధాని అంగ చంపా మగధ గిరివజ్రం, పాటలీపుత్రం కాశీ వారణాసి కోసల అయోధ్య, శ్రావస్తి వజ్జి వైశాలి మల్ల కుసీ నగర, పావాపురి చేది సుక్తిమతి వత్స కౌసాంబి కురు ఇంద్రప్రస్థ పాంచాల అహిచ్ఛత్ర మత్స్య విరాట నగరం సౌరసేన మధుర అస్సక పౌధన్యపురం (బోధన్) అవంతి ఉజ్జయిని, మహిష్మతి గాంధార తక్షశిల కాంభోజ రాజపుర షోడశ మహా జనపదాల్లో రాచరిక వ్యవస్థలే అధికం. అయినప్పటికీ కొన్ని గణ రాజ్యాలు కూడా ఉన్నాయి. వజ్జి, మల్ల జనపదాలు అలాంటివే. శాక్యులు పాలించిన కపిలవస్తు, కోలియుల రామగ్రామం, జ్ఞాత్రికుల కుందగ్రామం, తదితరాలు కూడా ఈ కోవకు చెందినవే. షోడశ మహా జనపదాల్లో కాశీ, కోసల, మగధ, వజ్జియగణ సమాఖ్య ముఖ్యమైనవి. ఈ నాలుగు రాజ్యాల మధ్య నిరంతర యుద్ధాలు జరిగేవి. దీనికి ముఖ్య కారణం.. గంగా నదీ లోయలో సాగే వాణిజ్యంపై ఆధిపత్యం సాధించాలనుకోవడం. ఈ ఆధిపత్య పోరులో చివరకు మగధ పై చేయి సాధించింది. కాశి: షోడశ మహా జనపదాల్లో తొలుత ప్రాబల్యాన్ని పొందిన రాజ్యం. వరుణ, ఆసి అనే నదుల సంగమ స్థానంలో ఉండటం వల్ల రాజధానికి ‘వారణాసి’ అనే పేరు వచ్చింది. ‘‘కాశీ రాజ్యాన్ని బ్రహ్మదత్తుడు పాలించే కాలంలో..’’ అంటూ ఎన్నో జాతక గాధలు ప్రారంభమవడాన్ని బట్టి బ్రహ్మదత్తుడు అనే కాశీ పాలకుడు ఎంతో ప్రాచుర్యం పొందాడని చెప్పవచ్చు. కోసల: తొలి రాజధాని అయోధ్య. మలి రాజధాని శ్రావస్తి. కాశీని ఆక్రమించడం ద్వారా కోసల శక్తిమంతంగా రూపుదిద్దుకుంది. బుద్ధుని కాలంలో కోసల రాజ్యాన్ని ప్రసేనజిత్ (పసేనది) పాలించేవాడు. ఇతని వారసుడు ‘విధూదభ’ శాక్య రాజ్యంపై దండెత్తి శాక్యతెగను సమూలంగా సంహరించాడు. వజ్జి: ఎనిమిది తెగలు కలిసి పాలించడం వల్ల దీనికి ‘అట్టకుల’ అనే పేరు వచ్చింది. ఈ ఎనిమిది తెగల్లో లిచ్ఛవులు ప్రధానమైన తెగ. మగధ పాలకుడు బింబిసారుడు... లిచ్ఛవుల నాయకుడైన ‘చేతకుని’ కుమార్తె ‘చెల్లన’ను వివాహం చేసుకున్నాడు. షోడశ మహా జనపదాల్లో అత్యంత శక్తిమంతమై.. మహా సామ్రాజ్యంగా ఎదిగిన రాజ్యం మగధ. ఈ సామ్రాజ్య వికాసంలో పాలకుల విధానాలతో పాటు మగధకు గల భౌగోళిక సానుకూలతలు కూడా దోహదపడ్డాయి. హర్యాంకులు: బింబిసారుడు (క్రీస్తు పూర్వం 547-495 వరకు): రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకోవడంలో వైవాహిక సంబంధాలకున్న ప్రాధాన్యాన్ని గుర్తించాడు. కోసల రాజ కుమారి కోసలాదేవి, మద్రదేశ (పంజాబ్ ప్రాంతం) రాకుమారి ఖౌమ, లిచ్ఛవుల రాకుమారి ‘చెల్లన’లను పెళ్లి చేసుకుని తన రాజ్యానికి అన్ని వైపుల నుంచి భద్రతను సాధించాడు. భారతదేశ చరిత్రలో సిద్ధ సైన్యానికి (Standing army) ఉన్న ప్రాధాన్యతను గుర్తించిన రాజుగా బింబిసారుడుని పేర్కోవచ్చు. అతడికి గల ‘సేనియ’ అనే బిరుదు ఈ విషయాన్నే సూచిస్తోంది. గ్రామాధికారులతో కూడా సమావేశాలు నిర్వహిస్తూ పరిపాలనలో అట్టడుగు స్థాయి వరకు ఆసక్తి ప్రదర్శించాడు. పొరుగునే ఉన్న అంగ రాజ్యాన్ని ఆక్రమించి గంగా నదిపై మగధ ప్రాబల్యాన్ని విస్తరించాడు. అవంతి పాలకుడైన ప్రద్యోతునితో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాడు. ప్రద్యోతుడు కామెర్ల వ్యాధితో బాధపడుతున్నప్పుడు బింబిసారుడు తన వ్యక్తిగత వైద్యుడైన జీవకుడిని ప్రద్యోతుడి దగ్గరికి పంపాడు. అతనికి స్వస్థత చేకూరేలా చేశాడు. బింబిసారుడు సహజ మరణాన్ని పొందలేదని, కుమారుని కారణంగా అతని జీవితం విషాదంగా ముగిసిందని సాహిత్యాధారాలు సూచిస్తున్నాయి. అజాత శత్రువు (క్రీస్తు పూర్వం 495-462 వరకు): వజ్జి గణ సమాఖ్యను ధ్వంసం చేయడం ఇతడు సాధించిన ప్రధాన విజయం. లిచ్ఛవుల్లో చిచ్చు పెట్టేందుకు ‘వస్సకార’ అనే బ్రాహ్మణుడిని అజాత శత్రువు నియోగించాడు. వస్సకారుడి కృషి కారణంగా లిచ్ఛవ నాయకుల ఐక్యత దెబ్బతింది. లిచ్ఛవులు బలహీనపడ్డారనే సమాచారం అందుకున్న అజాత శత్రువు వారిపై యుద్ధం ప్రకటించాడు. ఈ యుద్ధంలో అజాత శత్రువు ‘మహా శిల కంటక’, ‘రథముసల’ అనే ఆయుధాలను వినియోగించి విజయం సాధించినట్లు తెలుస్తోంది. అజాతశత్రువు బుద్ధుడిని కలిసి.. తన తండ్రిని చ ంపి నేరానికి పాల్పడినట్లు తెలిపి... పశ్చాత్తాపాన్ని ప్రకటించినట్లు బౌద్ధ సంప్రదాయం చెబుతోంది. అజాత శత్రువు తర్వాత వరుసగా నలుగురు పితృహంతకులు అధికారంలోకి వచ్చారు. వారితో విసిగి వేసారిన ప్రజలను ఆకట్టుకొని ‘శిశునాగుడు’ అధికారం చేపట్టాడు. ఆ విధంగా హర్యాంక వంశం అంతమై శిశునాగ వంశం అధికారంలోకి వచ్చింది. శిశునాగులు: ‘అవంతి’ రాజ్యాన్ని ఆక్రమించి మగధ ప్రాబల్య విస్తరణలో శిశునాగుడు కీలక పాత్ర పోషించాడు. శిశునాగుని వారసుడైన కాలాశోకుడు(కాకవర్ణి) కాలంలోనే వైశాలిలో రెండో బౌద్ధ సంగీతి జరిగింది. కాలాశోకుడిని వధించి మహాపద్మ నందుడు‘నంద ’ వంశాన్ని స్థాపించాడు. నందులు: నంద వంశ స్థాపకుడైన ‘మహాపద్మ’ నిమ్న జాతికి చెందిన వాడని పురాణాలు, ఇతర సాహిత్య ఆధారాలు చెబుతున్నాయి. నందులు.. మగధ ప్రాబల్యాన్ని మరింత విస్తరించారు. ఖారవేలుని హాథిగుంఫా శాసనం ప్రకారం ‘కళింగ’ను నందులు ఆక్రమించినట్లు తెలుస్తోంది. నందులు గొప్ప సైన్యాన్ని, కోశాగారాన్ని నిర్మించారు. నందులలో చివరి వాడు ధన నందుడు. గ్రీకు రచయితలు ఇతడినే ‘అగ్రేమ్సు’ అని పిలిచే వారు. ఇతడిని ఓడించి చంద్ర గుప్తమౌర్యుడు అధికారంలోకి వచ్చాడు. మగధ విజృంభణకు రాజుల దండయాత్రలు, విధానాలే గాక, మగధకు గల ప్రత్యేక భౌగోళిక సానుకూలతలు కూడా ఉపకరించాయి. గంగానదీ ప్రవాహ ప్రాంతంలో అధిక భాగాన్ని ఆక్రమించగలగడం మగధ సాధించిన తొలి విజయంగా చెప్పొచ్చు. కాశీ నుంచి అంగ వరకు సారవంతమైన ఒండ్రు మట్టి నేలలు, మగధ రాజ్యంలో ఉండటం వల్ల వ్యవసాయిక మిగులు పెరిగి, మగధ ఆర్థికంగా బలపడింది. ఆ రోజుల్లో వాణిజ్యంలో గంగానదీ వ్యవస్థ ఎంతో కీలకమైంది. గంగానదీపై గల ప్రధాన వాణిజ్య రేవు పట్టణాలన్నింటీని నియంత్రించడం ద్వారా మగధ ఎంతో లాభపడింది. భారతదేశంలోని అత్యంత సుసంపన్నమైన ఇనుప గనులు మగధ రాజ్యంలోనే ఉన్నాయి. ఇనుప గొడ్డళ్లు.. అడవులను నరికి సాగు భూమిని పెంచడానికి, ఇనుప నాగళు..్ల వ్యవసాయానికి, కొడవళ్లు పంటకోతకు ఉపయోగపడ్డాయి. ఇనుముతో బలమైన ఆయుధాలను తయారు చేసుకోవడం కూడా మగధకు ఉపకరించిన అంశమే. మగధ దక్షిణ ప్రాంతంలో గల అడవులు, ఆ నాటి యుద్ధతంత్రంలో కీలకమైన గజ బలాన్ని అందించాయి. అలాగే సుదూర వాణిజ్యంలో కూడా ఏనుగు దంతం ఎంతో ప్రతిష్టాత్మకమైన వస్తువుగా మారింది. అంతేకాకుండా ఆ అడవులు రథాల తయారీకి, భవన నిర్మాణాలకు కావల్సిన కలపను అందించాయి. మగధ కొత్తగా ఆర్యీకరణకు గురైన ప్రాంతం. కొత్తగా నాగరికతకు గురైన ప్రజల్లో ఉండే చొరవ, ఉత్సాహం మగధ ప్రజల్లో కూడా ఉన్నాయి. సమర్థులైన పాలకులకు మద్దతివ్వడం, అసమర్థులను తొలగించడంలో మగధ ప్రజలు చూపిన వివేకం మగధ సామ్రాజ్య వాదానికి దోహపడిందని చెప్పొచ్చు. పర్షియన్ గ్రీకు దండయాత్రలు: ప్రపంచ ఆధిపత్యం కోసం పర్షియన్లు, గ్రీకులు సంఘర్షించుకున్న కాలమది. ఈ పోరులో చివరకు గ్రీకులే పై చేయి సాధించారు. పర్షియాకు చెందిన సైరస్.. సింధు నది వరకు చొచ్చుకు రాగలిగారు. సైరస్ మనమడైన డేరియస్ సామ్రాజ్యంలోని భారతదేశం 20వ సత్రపి(రాష్ట్రం)గా ఉందని హెరోడోటస్ పేర్కొన్నాడు. అయితే అలెగ్జాండర్ దండేత్తే నాటికే పర్షియన్ల నియంత్రణ సడలిన ట్లు తెలుస్తోంది. క్రీ.పూ. 334లో తన తండ్రి ఫిలిప్ మరణం తర్వాత మాసిడోనియా సింహాసనాన్ని అధిష్టించిన అలెగ్జాండర్ ప్రపంచాన్నంతా జయించి, విశ్వ విజేత కావాలని కాంక్షించాడు. అలెగ్జాండర్ భారత దేశ దండయాత్ర: క్రీ.పూ.326లో ఖైబర్ కనుమను దాటి అలెగ్జాండర్ భారత దేశంలోకి ప్రవేశించాడు.తక్షశిల పాలకుడైన ఆంఫిస్ (అంభి) అలెగ్జాండర్‌కు లొంగిపోయాడు. జీలం, చీనాబ్ నదుల మధ్య గల‘పోరస్’ (పురుషోత్తముడు) రాజ్యాన్ని ఆక్రమించేందుకు అలెగ్జాండర్‌కు సహకరించాడు. క్రీ.పూ. 326లో జరిగిన హైడాస్పెస్ యుద్ధం (జీలం నదినే గ్రీకులు హైడాస్పెస్ అని పిలిచారు) లో పోరస్ తీవ్రంగా పోరాడి ఓడాడు. పోరస్ వ్యక్తిత్వాన్ని మెచ్చుకున్న అలెగ్జాండర్ అతని రాజ్యాన్ని తిరిగి అతనికే కట్టబెట్టాడు. అలా జీలం నది వద్ద మొదలైన అలెగ్జాండర్ ప్రస్థానం బియాస్ నది వరకు సాగుతూ వచ్చింది. అయితే.. అప్పటికే అలసిన సైనికులు బియాస్ నదిని దాటేందుకు నిరాకరించడంతో అలెగ్జాండర్ నిరుత్తరుడయ్యాడు. నిరంతర యుద్ధాలు, ఇంటి బెంగ అలెగ్జాండర్ సైన్యాన్ని బలహీనపరచాయి. బియాస్ నదికి అవతల మహాసైన్యాన్ని, కోశాన్ని కలిగిన నందుల రాజ్యం ఉంది. దానిని లొంగతీసుకోవడం అంత సులభం కాదని కూడా భావించాడు. ఫలితంగా అలెగ్జాండర్ వెనుదిరిగి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. సింధు నుండి బియాస్ వరకు విస్తరించి ఉన్న తన రాజ్యాన్ని అలెగ్జాండర్ మూడు భాగాలుగా విభజించి ప్రతినిధులను నియమించాడు. నియార్ఖస్ నేతృత్వంలో కొంత సైన్యాన్ని సముద్ర మార్గం ద్వారా వెనక్కు పంపాడు. తను భూమార్గం ద్వారా ప్రయాణించాడు. బాబిలోనియా చేరేసరికి అలెగ్జాండర్ తీవ్ర అస్వస్థతకు గురై మరణించాడు. అలెగ్జాండర్ దండయాత్ర వల్ల కొత్త వాణిజ్య మార్గాలు వృద్ధి చెందాయి. ఎన్నో చిల్లర రాజ్యాలను, తెగలను నిర్మూలించడం ద్వారా వాయవ్య భారత దేశంలో రాజకీయ చిత్రపటాన్ని మార్చి చంద్రగుప్తునికి మార్గం సుగమం చేశాడు అలెగ్జాండర్. ఇంతకు మించి అలెగ్జాండర్ భాతర దండయాత్రకు ప్రాధాన్యం లేదు. భారతీయ గ్రంధాల్లో అలెగ్జాండర్ ప్రస్తావన మచ్చుకైనా కనపడదు. ముఖ్యాంశాలు: {పాచీన భారత రాజ్య వ్యవస్థతోపాటు, సాంఘిక, ఆర్థిక వ్యవస్థలు కూడా స్పష్టమైన రూపాన్ని సంతరించుకున్న కాలం మౌర్య పూర్వ యుగం. భారతదేశ చరిత్రలో సిద్ధ సైన్యానికి (Standing army) ఉన్న ప్రాధాన్యతను గుర్తించిన రాజుగా బింబిసారుడుని పేర్కోవచ్చు. వజ్జి గణ సమాఖ్యను ధ్వంసం చేయడం అజాత శత్రువు సాధించిన ప్రధాన విజయం. నందులలో చివరి వాడు ధన నందుడు. గ్రీకు రచయితలు ఇతడినే ‘అగ్రేమ్సు’ అని పిలిచే వారు. సైరస్ మనమడైన డేరియస్ సామ్రాజ్యంలోని భారతదేశం 20వ సత్రపి(రాష్ట్రం)గా ఉందని హెరోడోటస్ పేర్కొన్నాడు. 334లో తన తండ్రి ఫిలిప్ మరణం తర్వాత మాసిడోనియా సింహాసనాన్ని అధిష్టించిన అలెగ్జాండర్ 326లో జరిగిన హైడాస్పెస్ యుద్ధంలో పోరస్ (పురుషోత్తముడు) తీవ్రంగా పోరాడి ఓడాడు. |
More Headlines |
భారత్.. పారిశ్రామిక రంగ ప్రగతి
స్వాతంత్య్రానంతరం భారత్ ఆర్థికంగా పురోగతి సాధించడానికి వ్యవసాయ, పారిశ్రామిక రంగాల విస్తరణతోపాటు అధిక ఉత్పత్తి దోహదపడింది. అనేక పరిశ్రమల్లో నూతన సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశపెట్టారు. పారిశ్రామిక పెట్టుబడులు పెరిగాయి. దీంతోపాటు ఆధునిక యాజమాన్య పద్ధతులు, నవకల్పనల నేపథ్యంలో ఉద్యమదారులు పెరగ డం, ప్రభుత్వ మద్దతు పారిశ్రామికాభివృద్ధికి దోహదపడ్డాయి.
దేశంలోని అనేక ప్రాంతాల్లో కొత్త పారిశ్రామిక కేంద్రాల అభివృద్ధి జరిగింది. గత కొన్నేళ్లుగా మౌలిక సౌకర్యాలైన విద్యుచ్ఛక్తి, కమ్యూనికేషన్లపై ప్రభుత్వ రంగ పెట్టుబడులు పెరిగాయి. ఉద్యమిత్వ అభివృద్ధి (ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్)ని పెంపొందించే అనేక సంస్థల తోపాటు పారిశ్రామిక పరపతి సంస్థలు ఎక్కువగా ఏర్పడటం పారిశ్రామిక రంగ పురోగతికి కారణమయ్యాయి.
ఆర్థిక విస్తరణ భారతదేశ స్థూల జాతీయోత్పత్తి పెరుగుదలకు దారితీసింది. స్వాతంత్య్రానంతరం 4 సంవత్సరాలు మినహా, భారత్ ధనాత్మక వృద్ధిని నమోదు చేసుకుంది. 1951తో పోల్చినపుడు 1999-2000 సంవత్సరంలో దేశ తలసరి నికరజాతీయోత్పత్తి 2.75 రెట్లు ఎక్కువ. తలసరి నికర జాతీయోత్పత్తి 1950-90 మధ్య కాలంలో వార్షిక వృద్ధి సగటు 3.2 శాతం కాగా 1993-94 నుంచి 1999-2000 మధ్య కాలంలో వార్షిక వృద్ధి 4.8 శాతంగా నమోదైంది. 2009-10లో ఈ వృద్ధి 6.1 శాతం.
సంస్కరణల ముందు కాలం: ప్రభుత్వం అవలంబించిన అనేక ప్రోత్సాహకర విధానాలు స్థూల జాతీయోత్పత్తి పెరుగుదలకు దోహదపడ్డాయి. స్వాతంత్య్రానంతరం ప్రభుత్వం రక్షణ విధానాలు అవలంబించడంతోపాటు విదేశీ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన ఒప్పందాలను ప్రోత్సహించినప్పటికీ విదేశీ పెట్టుబడులపై పరిమితిని 40 శాతంగా విధించింది. దిగుమతుల విధానాన్ని స్థానిక పరిశ్రమలకు అనుకూలంగా అవలంబించిన అతి కొద్ది దేశాలలో భారత్ ఒకటి.
స్వాతంత్య్రానంతరం కొంత కాలంలోనే విదేశీ మారక ద్రవ్య కొరతను భారత్ ఎదుర్కొన్నందువల్ల దిగుమతులపై నియంత్రణ విధించింది. వినియోగ వస్తువుల దిగుమతులను పూర్తిగా నియంత్రించింది. వీటితోపాటు మూల ధన వస్తువుల దిగమతులపై కూడా ప్రభుత్వం కొంతమేర నియంత్రణ విధించినప్పటికి దేశంలో ఈ ఉత్పత్తుల పెరుగుదలకు ప్రభుత్వ విధానం దోహదపడింది.
మూలధన వస్తువులకు సంబంధించి విదేశీ సహకారంతోపాటు సాంకేతిక పరిజ్ఞానం దిగుమతికి మూలధన వస్తు పరిశ్రమలకు ప్రభుత్వం ప్రోత్సాహమిచ్చింది. రెండు, మూడో పంచవర్ష ప్రణాళికా కాలంలో మూలధన వస్తు పరిశ్రమల అభివృద్ధి దిశగా కొన్ని పరికరాల దిగుమతికి ప్రభుత్వం అనుమతిచ్చింది.
స్థానిక పరిశ్రమలను ప్రోత్సహించే దిశగా దిగుమతులపై నియంత్రణతో పాటు అనేక ఉత్పత్తుల దిగుమతులపై 200 నుంచి 300 శాతం వరకు దిగుమతి సుంకం విధిస్తూ స్థానిక పరిశ్రమలకు ప్రభుత్వం రక్షణ కల్పించింది. పారిశ్రామిక రంగ అభివృద్ధి నిమిత్తం ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకులను ఏర్పాటు చేసింది. మధ్య, దీర్ఘకాలిక పెట్టుబడులను పారిశ్రామిక రంగ అభివృద్ధికి అందించడం అభివృద్ధి బ్యాంకు ముఖ్యోద్దేశం.
ఈ క్రమంలో ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను 1948లో, ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఐసీఐసీఐ) 1955లో, పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకు (ఐడీబీఐ) 1964లో, చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంకు 1990లో స్థాపించారు. యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా 1963లో, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1956లో ఏర్పాటయ్యాయి.
చిన్న ఉద్యమదారులకు పరపతి కల్పించడం కోసం రాష్ట్రాల స్థాయిలో 1951లో పార్లమెంట్ చట్టం ద్వారా ఫైనాన్స్ కార్పొరేషన్లు ఏర్పాటయ్యాయి. వీటితోపాటు జాతీయ చిన్న తరహా పరిశ్రమల కార్పొరేషన్‌ను జాతీయ స్థాయిలో ఏర్పాటు చేశారు.
పారిశ్రామికాభివృద్ధి వేగవంతంకావడానికి శక్తి-రవాణా-సమాచార సౌకర్యాలు తప్పనిసరి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుదుత్పాదన, పంపిణీతోపాటు కొత్త విద్యుచ్ఛక్తి ప్రాజెక్టులపై పెట్టుబడులను పెంచాయి. వీటితోపాటు రోడ్ల నిర్మాణం, సమాచారం, నౌకాయానా అభివృద్ధిపై పెట్టుబడులు పెరిగాయి.
1977లో పారిశ్రామిక తీర్మానం నేపథ్యంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పారిశ్రామిక వాడలను అన్ని మౌలిక సౌకర్యాలతో ఏర్పాటు చేశాయి. 1980 దశకం తర్వాత కాలంలో చమురు, సహజ వాయువు శక్తి ఉత్పాదనకు ముఖ్య ఆధారాలుగా రూపొందాయి. చమురు వెలికితీతకు ‘ఆయిల్, సహజ వాయువు కమిషన్ (ఓఎన్‌జీసీ)’ ఏర్పాటు చేశారు. ప్లాంట్లను విస్తరించడం ద్వారా అదనపు రిఫైనింగ్ సామర్ధ్యం పెంచారు.
పారిశ్రామిక రంగం.. 1991 తర్వాత:
1991లో నూతన ఆర్థిక సంస్కరణల్లో భాగంగా పారిశ్రామిక రంగంలో సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిం ది. ప్రభుత్వ రంగ పాత్రను తగ్గిస్తూ ప్రైవేటీకరణకు ప్రాధాన్యమిచ్చారు. స్వదేశీ పరిశ్రమల్లో విదేశీ పెట్టుబడులను 51 శాతానికి పెంచారు. అవస్థాపనా సౌకర్యాల కల్పనలో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించారు.
పారిశ్రామిక రంగంలో అనేక సరళీకృత విధానాలను ప్రవేశపెట్టినప్పటికీ 9వ ప్రణాళికలో పారిశ్రామిక రంగం కేవలం 5 శాతం వృద్ధినే సాధించింది. 1950-51లో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ 7.9 శాతం కాగా ఏప్రిల్-డిసెంబర్ 2010లో 8.6శాతం. బేసిక్ గూడ్స్, ‘వినియోగనశ్వర వస్తువు’ రం గంలో ప్రగతి తగ్గినందువల్ల 2010లో పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో చెప్పుకోదగ్గ పెరుగుదల సంభవించలేదు.
సంస్కరణల యుగంలో పారిశ్రామిక రంగంలో ఉత్పాదక సామర్ధ్యం పెరిగినందువల్ల ‘స్వదేశీ మూలధన కల్పన’లో ఎక్కువ వాటాను ఈ రంగం ఆకర్షించగలిగింది. నేషనల్ అకౌంట్స్ అంచనా ప్రకారం 2004-05 నుంచి 2009-10 మధ్య కాలంలో స్థూల దేశీయోత్పత్తి సగటు 8.6 శాతం కాగా ఇదే కాలానికి సంబంధించి నూతన పెట్టుబడుల వార్షిక వృద్ధి 11.3 శాతం. మైనింగ్, రిజిస్టర్డ్ తయారీ రంగం, విద్యుచ్ఛక్తి రంగాల్లో స్థూల మూలధన కల్పన వృద్ధి రేటు ఎక్కువ.
2008-09లో మొత్తం స్థూల మూలధన కల్పనలో పారిశ్రామిక స్థూల మూలధన కల్పన తగ్గడానికి ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణమయింది. కాని 2009-10లో పారిశ్రామిక స్థూల మూలధన కల్పన వాటా మొత్తం స్థిర మూలధన కల్పనలో 43.8 శాతంగా ఉండడానికి ఇన్వెస్ట్‌మెంట్ సెంటిమెంట్స్‌లో పురోగతి కారణమయింది.
సంస్కరణల యుగంలో ముఖ్యంగా 2003-04 తర్వాత దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం పెరిగింది. ఆగస్ట్ 1991 నుంచి మే 2010 మధ్యకాలంలో దేశంలోకి వచ్చిన మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 136.86 బిలియన్ డాలర్లు.
భారత్‌లో సేవలు, టెలికమ్యూనికేషన్లు, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, హౌసింగ్, రియల్ ఎస్టేట్ రంగాలు ఎక్కువ విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక సంక్షోభ నేపథ్యంలో ప్రపంచ పెట్టుబడులు స్థంభించే అవకాశం ఉందని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఓఈసీడీ) నివేదిక 2010 పేర్కొంది.
పారిశ్రామికాభివృద్ధికి వనరులు:
ప్రణాళికా యుగంలో పారిశ్రామికీకరణ సాధించే దిశగా పారిశ్రామిక రంగానికి వనరుల కేటాయింపు పెరిగింది. మొదటి ప్రణాళికలో మొత్తం ప్రభుత్వ రంగ పెట్టుబడి రూ, 1960 కోట్లలో 2.8 శాతం అంటే రూ.56 కోట్లు పరిశ్రమలు, ఖనిజాలకు కేటాయించారు. రెండో ప్రణాళికలో మొత్తం ప్రభుత్వ రంగ పెట్టుబడిలో 20.1 శాతం, మూడో ప్రణాళికలోను 20.1 శాతం ఈ రంగానికి కేటాయించారు.
రెండో, మూడో ప్రణాళికల్లో బేసిక్ ఇండస్ట్రీస్,మూలధన వస్తు పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యమిచ్చారు. ఈ పరిశ్రమలను ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేసి ప్రభుత్వ రంగ పరిధిని విస్తరించారు. వినియోగ వస్తు పరిశ్రమలను ప్రైవేటు రంగంలో అనుమతించారు. నాలుగో ప్రణాళికలో మొత్తం వ్యయం రూ.15779 కోట్లలో 18.2 శాతం అంటే 2,864 కోట్లను; 5వ ప్రణాళికలో మొత్తం వ్యయంలో 22.8 శాతాన్ని పరిశ్రమలు, ఖనిజాలకు కేటాయించారు.
పరిశ్రమలు అవస్థాపనా సౌకర్యాలను పూర్తిగా వినియోగించుకోవడం, ఉత్పాదకతను పెంపొందించడం, మూలధన వస్తు పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్, శక్తి సామర్ధ్యం పెంపునకు 6వ ప్రణాళిక ప్రాధాన్యమిచ్చింది. మొత్తం వ్యయంలో ఈ ప్రణాళికలో 13.7 శాతం ఏడో ప్రణాళికలో 11.9 శాతం ఈ రంగానికి కేటాయించారు.
నూతన పారిశ్రామిక విధానం 1991 ప్రకారం పారిశ్రామిక కార్యకలాపాల్లో ప్రైవేటు రంగానికి ప్రాధాన్యమిచ్చారు. మౌలిక, కీలక రంగాల్లో ప్రభుత్వ రంగం కీలక పాత్ర పోషించగలదని భావించారు. 8వ ప్రణాళిక మొత్తం వ్యయం రూ.4,85,457 కోట్లలో 8.4 శాతం అంటే రూ.40,623 కోట్లు ఈ రంగానికి కేటాయించారు. 9 వ ప్రణాళికలో మొత్తం వ్యయంలో ఈ రంగంపై వ్యయం 5 శాతం మాత్రమే.
మిగతా ప్రణాళికలతో పోల్చినపుడు 10వ ప్రణాళికలో ఈ రంగంపై చేసిన వాస్తవ వ్యయం మొత్తం వ్యయంలో 3.9 శాతం మాత్రమే. ప్రభుత్వ రంగ పెట్టుబడులు తగ్గడం మరో వైపు ప్రైవేటు రంగ పెట్టుబడులను ఎక్కువగా ఆకర్షించకపోవడం వల్ల సంస్కరణల కాలంలో ప్రణాళికల్లో వృద్ధిరేటు తగ్గింది. 11వ ప్రణాళికలో మొత్తం వ్యయంలో 4.2 శాతం పారిశ్రామిక రంగానికి కేటాయించారు.
ముఖ్యాంశాలు:
{పపంచ పెట్టుబడి నివేదిక 2009 ప్రకారం ప్రపంచ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మొత్తం 2007లో 1.979 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు. కాగా 2008లో 1.697 ట్రిలియన్ డాలర్లు.
పారిశ్రామిక అభివృద్ధి, నియంత్రణ చట్టం-1951.
ఎలక్ట్రానిక్స్ వస్తువుల ఉత్పత్తి వృద్ధి 2009-10లో 13 శాతం.
2004-05 నుంచి 2009-10 మధ్య కాలంలో జీడీపీ వృద్ధి సగటు 8.6 శాతం.
2004-05 నుంచి 2009-10 మధ్య కాలంలో పారిశ్రామిక రంగంలో కొత్త పెట్టుబడుల వృద్ధి 11.3 శాతం.
2003-04 తర్వాత దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం పెరిగింది.
2003-04తో పోల్చినపుడు 2009-10లో దేశంలోకి వచ్చిన ఈక్విటి ప్రవాహాల్లో పెరుగుదల 13 రెట్లు.
2009-11 మధ్య కాలంలో చైనా, ఇండియా, బ్రెజిల్, అమెరికా, రష్యన్ ఫెడరేషన్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఎక్కువగా ఆకర్షించాయి.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఈక్విటీ ప్రవాహాలు 2003-04లో జీడీపీలో 0.37 శాతం కాగా 2008- 09లో 2.21 శాతం.
వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడానికి అనువుగా ఉండే దేశాల్లో చైనా తర్వాత భారత్ రెండోస్థానం ఆక్రమించిందని ‘జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్’ అభిప్రాయపడింది.
ఆగస్ట్ 1991 నుంచి మే 2010 మధ్య కాలంలో దేశంలోకి వచ్చిన మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 136.86 బిలియన్ డాలర్లు.
{పపంచ ఆర్థిక సంక్షోభ నేపథ్యంలో ప్రపంచ పెట్టుబడులు స్థంబించగలవని ఓఈసీడీ నివేదిక 2010 అభిప్రాయపడింది.
1951లో పార్లమెంటు చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు పారిశ్రామిక రంగ అభివృద్ధికి రాష్ట్రాల స్థాయిలో ఫైనాన్స్ కార్పొరేషన్లను ఏర్పాటు చేశాయి.
10వ ప్రణాళికలో మొత్తం వ్యయంలో 3.9 శాతం, 11వ ప్రణాళికలో 4.2 శాతం పారిశ్రామిక రంగానికి కేటాయించారు.

ఫుకిషిమా విస్ఫోటనం.. అణు భద్రత
జైతాపూర్‌లో అణు రియాక్టర్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఇటీవలి కాలంలో ప్రజలు నిరసన తెలియజేయడం.. ఆ సందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరును ప్రతిపక్షాలు, పర్యావరణ పరిరక్షక ఉద్యమకారులు గర్హించడం తెలిసిందే. ఇటీవల జపాన్‌లో సంభవించిన సునామీ కారణంగా ఫుకిషిమా పట్టణంలోని అణు రియాక్టరులో జరిగిన ప్రమాదం దృష్ట్యా.. భారతదేశం సహా ప్రపంచంలోని అన్ని దేశాలు తాము అనుసరిస్తున్న అణు విధానం గురించి పునరాలోచనలో పడ్డాయి.
చెర్నోబిల్ (ఉక్రెయిన్)లో 25 ఏళ్ల క్రితం సంభవించిన ఘోర అణు ప్రమాదాన్ని ప్రజలు ఇంకా మరిచిపోలేదు. దాంతో అణుశక్తి ఉత్పత్తి క్షేమకారం కాదని.. దానికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ.. మన ప్రభుత్వ అణు విధానంలో ఎటువంటి మార్పు కనిపించడంలేదు.
దేశ వ్యాప్తంగా 20 అణు రియాక్టర్లను నిర్మించి 2052 నాటికి 208,000 మెగావాట్ల విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 7,000 కిలోమీటర్ల పొడవున్న కోస్తా ప్రాంతంలో ప్రతి 55 కిలోమీటర్లకు 1,000 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన కర్మాగారాలను ఏర్పాటు చేయడానికి సన్నద్ధమవుతోంది.
అణు విద్యుత్ ఉత్పత్తిపై ప్రజల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించడానికి అనేరీతిలో మన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇటీవల ఒక ప్రకటన చేశారు. దాని సారాంశం.. స్వతంత్ర ప్రతిపత్తితో చట్టబద్ధత కలిగిన అణు వ్యవస్థను ఏర్పాటు చేయడం; ఈ అంశానికి సంబంధించి ప్రజలతో విస్తృత చర్చలు జరపడం.. తద్వారా ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయడం; అణు రియాక్టర్లను స్థాపించడం వల్ల స్థానిక ప్రజలకు ఎటువంటి నష్టం కలగకుండా తగిన పరిహారాన్నివ్వడం; వారికి పునరావాసాన్ని కల్పించడం.
పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారులు మాత్రం ప్రభుత్వ హామీలతో సంతృప్తి చెందడం లేదు. అంతర్జాతీయ స్థాయి లో ప్రాచుర్యం కలిగిన హరిత శాంతి ఉద్యమకారులు (గ్రీన్ పీస్ మూవ్‌మెంట్ లీడర్స్) చెర్నోబిల్‌లో సంభవించిన ప్రమాదం వల్ల పర్యావరణానికి ఇప్పటి వరకు కలిగిన హాని, భవిష్యత్‌లో సంభవించ బోయే దుష్పరిణామాలను కాసింత అతిశయోక్తితో ప్రచారం చేస్తున్నారు.
వారి అంచనాల ప్రకారం చెర్నోబిల్ ప్రమాదం వల్ల 2056 నాటికి 93,000 మంది రేడియేషన్‌కు గురై మరణిస్తారు. కాని అధికారిక లెక్కల ప్రకారం అణు కర్మాగారంలో పని చేసిన ఉద్యోగులు 47-62 మంది మాత్రమే మరణించారు. థైరాయిడ్ క్యాన్సర్‌వల్ల 15మంది మరణించినట్లు ఉక్రెయిన్ ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
హరిత ఉద్యమకారులు భయపెట్టినంతగా పర్యావరణానికి ప్రమాదం లేదని అణు విధానాన్ని సమర్థించే వారు వాదిస్తున్నారు. వాస్తవానికి ఇరుపక్షాల వాదనలు అతిశయోక్తులే. ఈ సందర్భంగా అణు శక్తికి సంబంధించిన అంశాల మీద విస్తృత చర్చలు జరగాలి. శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు, ఉద్యమకారులు వాస్తవాలను ప్రజలకు తెలియజేసి వారి భయాందోళలను తొలగించాలి.
ఒక దేశ అభివృద్ధిని.. ఆ దేశ వార్షిక సగటు విద్యుచ్ఛక్తి వినియోగం ప్రాతిపదికగా అంచనా వేస్తారు. మన దేశం విద్యుచ్ఛక్తి వినియోగంలో 150వ స్థానంలో ఉంది. చైనా 80, రష్యా 26, జపాన్ 19, అమెరికా 11 స్థానాల్లో ఉన్నాయి. మన దేశ సగటు విద్యుచ్ఛక్తి వినియోగం పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే 14 రెట్లు తక్కువ.
ప్రస్తుతం సగటున 650-700 kwh విద్యుచ్ఛక్తి వినియోగిస్తుంది. కనీసం 5000 kwh వినియోగ స్థాయికి చేరుకుంటే ఆమోదయోగ్యమైన ప్రగతి సాధించడానికి వీలవుతుంది. దేశంలో 1947లో కేవలం 1,400 MW విద్యుచ్ఛక్తి ఉత్పత్తి అయ్యేది. ఇప్పుడది 1,63,670 MW స్థాయికి చేరుకుంది. ఇందులో నీటి ద్వారా 37,033 కగి ఉత్పత్తి అవుతోంది. బొగ్గు, సహజ వాయువు ద్వారా 1,05,647 MW, అణుశక్తి ద్వారా 4,560 కగి, సాంప్రదాయయేతర (వాయు, సౌర) పద్ధతుల ద్వారా 16,429 కగిఉత్పత్తి జరుగుతోంది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న విద్యుచ్ఛక్తిలో 40 శాతాన్ని ఉత్పత్తి చేసినప్పుడే భారతదేశంలోని 1.2 బిలియన్ ప్రజల అవసరాలను తీర్చడానికి వీలవుతుంది . దేశంలో ఎక్కువ శాతం విద్యుత్ ఉత్పత్తి బొగ్గు, సహజ వాయువుల ద్వారా జరుగుతుంది.
అయితే బొగ్గు నిల్వలు 11 సంవత్సరాల వరకు మాత్రమే సరిపోతాయి. నీటి ద్వారా ఐదు శాతం మేరకు మాత్రమే విద్యుచ్ఛక్తి ఉత్పత్తి అవుతుంది. సౌరశక్తి ద్వారా రెండు శాతం ఉత్పత్తి సాధ్యమవుతుంది. అణు శక్తిని పెంపొందిస్తే కనీసం 10 శాతం విద్యుచ్ఛక్తి అవసరాలు తీరుతాయని అంచనా.
అణుశక్తి ప్రమాదకరమైనదే కాకుండా.. ఖర్చుతో కూడుకుంది. కాబట్టి ప్రత్యామ్నాయ వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేయాలని వాదించే వారి అభిప్రాయంలో.. సహజ వాయువు (Natural gas) మిగిలిన కర్బన పదార్థాకంటే మేలైంది. ఇది పుష్కలంగా లభించడమే కాకుండా... దీని ద్వారా బొగ్గు, అణు పద్ధతులకంటే తక్కువ నీటితో విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చు. దీనికి అవసరమైన అధునాతన సాంకేతిక పరిజ్ఞానం తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉంది.
దీంతోపాటు బొగ్గు గనుల్లో లభించే కోల్ బెడ్ మీథేన్ అనే వాయువు గోండ్వానా ప్రాంతంలో ఒక ట్రిలియన్ క్యూబిక్ మీటర్లు లభిస్తుందని ఒక అంచనా. బొగ్గుకు ప్రత్యామ్నాయంగా సహజ వాయువు, మీధేన్ వాయువు.. విద్యుత్ అవసరాలను చాలా వరకు తీరుస్తాయనే వాదన ఉంది.
అంతేకాకుండా వీటి వల్ల సంభవించే పర్యావరణ కాలుష్యం చాలా తక్కువ. సాంప్రదాయేతర విద్యుత్ వనరుల మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం పవన విద్యుత్ (wind power) ద్వారా 20,000 MW నుంచి 45000 MW విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు. అదేవిధంగా సౌరశక్తి ద్వారా ఉత్పత్తికి కూడా అపారమైన అవకాశాలున్నాయి.
అయితే సౌరశక్తి ఫలకాల (Solar Photo Voltaic Cells) ఏర్పాటుకు 4.5 మిలియన్ హెక్టారుల భూమి కావాలి. పవన యంత్రాల (wind mills) ఏర్పాటుకు కూడా విశాలమైన ఆవరణ కావాలి. ఉత్పత్తి సామర్థ్యం నిలకడగా ఉండదు. వాయుపీడనం మీద ఇది ఆధారపడి ఉంటుంది. ఇన్ని పరిమితుల దృష్ట్యా అణుశక్తి మీద ఆధారపడక తప్పదని ఒక వాదన.
ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 16 శాతం విద్యుత్ ఉత్పత్తికి అణుశక్తి ఉపయోగపడుతోంది. ఫ్రాన్స్ దాదాపు 90 శాతం, జపాన్ 40 శాతం అణుశక్తిమీదనే ఆధారపడుతున్నాయి. బొగ్గు, పెట్రోలు వంటి ఇంధనాల వినియోగం వల్ల పర్యావరణానికి జరిగే హానితో పోల్చితే అణుశక్తి స్వచ్ఛమైంది.
చెర్నోబిల్, ఫుకిషిమా ఘటనల వల్ల జరిగిన/జరగబోతున్న హాని పరిమితమేనని ప్రఖ్యాత శాస్త్రవేత్త అనిల్ కకోద్కర్ అభిప్రాయం. సునామీ వల్ల మరణించిన ప్రజల సంఖ్య, ఆస్తి నష్టంతో పోల్చితే అణు ప్రమాదాల వల్ల జరిగిన నష్టం చాలా తక్కువ అని ఆయన వాదన.
భోపాల్ గ్యాస్ లీకు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య.. చెర్నోబిల్ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య కంటే ఎన్నో రెట్లు ఎక్కువ అని అణు విద్యుత్ ఉత్పత్తి మద్దతు దారుల వాదన.
భారతదేశం 2009లో అమెరికాతో కుదుర్చుకొన్న పౌర అణు సహకార ఒప్పందం (Civil nuclear cooperation agreement) కేవలం అమెరికా, ఫ్రాన్స్, జపాన్ దేశాల అణు రియాక్టర్ల పరిశ్రమలకు గిరాకీ కల్పించడానికే తప్ప.. భారత శక్తి అవసరాలను తీర్చడానికి ఉద్దేశించింది కాదని తీవ్ర విమర్శ నెలకొంది. ఇటీవల లిబియా, ఈజిప్టువంటి దేశాల్లో సంభవించిన రాజకీయ అనిశ్చిత పరిస్థితి ఇంధన రంగంలో సంక్షోభాన్ని తెచ్చింది.
70 శాతం ఇంధన అవసరాలు ‘మధ్య ప్రాచ్య ఆసియా, ఉత్తర ఆఫ్రికా దేశాల’ ద్వారానే తీరుతున్నాయి. క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ 100 డాలర్లు దాటిన ఈ నేపథ్యంలో వర్థమాన దేశమైన భారత్ ఆర్థిక పరిస్థితి అతలాకుతలమవుతుంది. దిగుమతుల మీద ఆధారపడేకంటే ఇంధన రంగంలో వీలైనంత వరకు స్వావలంబన సాధించడానికి ప్రయత్నించాలనీ, అందుకు అణు విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యతనివ్వడంలో తప్పు లేదని కొందరు మేధావుల అభిప్రాయం.
సంక్షోభం సంభవించినప్పుడు మనోధైర్యాన్ని కోల్పోకుండా ధ్రుడ విశ్వాసంతో దానికి ఎదుర్కొని, అధిగమించడమే ధీరోధాత్తత. జపాన్ వంటి దేశాలకు సహజ వనరులు అంతంతమాత్రమే కాబట్టి అణుశక్తి మీద ఆధారపడక తప్పదు అనే వాదనలో నిజమున్నప్పటికీ..రష్యా వంటి దేశం అపారమైన సహజ వాయువు, క్రూడ్ ఆయిల్ రిజర్వులు కలిగున్నప్పటికీ 10 శాతం ఇంధన అవసరాలను అణుశక్తి ద్వారా తీర్చుకుంటోంది.
భారతదేశం, ఒకవైపు సాంప్రదాయేతర ఇంధన ఉత్పత్తిని (సౌర, పవన, సహజవాయువు) ప్రోత్సహిస్తూనే, అణుశక్తి ఉత్పత్తికి తగిన ప్రాధాన్యతనివ్వడంలో తప్పులేదు. ఇంధన భద్రతను, వైవిధ్య వనరులను అభివృద్ధి పరచుకోవడం ద్వారా స్వావలంబన సాధించవచ్చు. ఇంధన ఉత్పత్తికి అభివృద్ధిపరచిన సాంకేతిక పరిజ్ఞానాన్ని రక్షణ రంగంలో కూడా వినియోగించుకోవచ్చు.
ఇంధన, రక్షణ రంగాల్లో స్వావలంబన సాధించినప్పుడే..దేశానికి నిజమైన భద్రత. సామాజిక సేవలందించడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నప్పుడు ఊహించని విపత్తులు సంభవిస్తాయి. అవి ప్రకృతి సిద్ధమైనవి (సునామీ; మానవ తప్పిదాల వల్ల చెర్నోబిల్ సంఘటనల వంటివి).
ఇలాంటి వాటి ఉపశమనానికి కొన్ని చర్యలు తీసుకోవచ్చు. అవి..
{పమాద అవకాశాలను సాధ్యమైనంతగా నివారించడం.
నివారణ వీలుకానప్పుడు.. కనీసం దాని ప్రభావాన్ని సాధ్యమైనంత మేర తగ్గించడం.
విపత్తు అనంతర పరిణామాలను ఎదుర్కోవడానికి సమాయత్తం కావడం.
భవిష్యత్తులో సంభవించే విపత్తులను ఎదుర్కోవడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించుకోవడం.
ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కి మూన్ అణుభద్రతకు సూచించిన అయిదు అంశాలను పాటించడం సముచితం. అవి..
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రస్తుతం అమల్లో ఉన్న భద్రతా ప్రమాణాలను సమీక్షించడం.
అంతర్జాతీయ అణు ఇంధన వ్యవస్థను పటిష్టం చేయడం.
{పకృతి సిద్ధమైన విపత్తులు అణుభద్రతను ప్రభావితం చేస్తాయనే అంశాన్ని క్షుణ్నంగా అధ్యయనం చేయడం.
అణుశక్తి ఉత్పత్తి విషయంలో వ్యయ-ప్రయోజన విశ్లేషణ (ఇౌట్టఛ్ఛ్ఛజజ్టీ ్చ్చడటజీట) చేసి ఉపద్రవాలు సంభవించినప్పుడు సత్వర చర్యలు తీసుకోవడానికి సిద్ధమవ్వడం.
అణు రక్షణ - అణు భద్రత (ఠఛ్ఛ్చిట ట్చజ్ఛ్టడ ్చఛీ ఠఛ్ఛ్చిట ట్ఛఛిఠటజ్టీడ) అనుసంధానించడం.
చైనాకు చెందిన ప్రఖ్యాత తత్వవేత్త వ్యాఖ్యానించినట్లు: జీవితంలో ఎప్పుడూ కిందపడకుండా ఉండటంలో గొప్పదనం లేదు. పడిన ప్రతిసారీ లేవడంలోనే ఉంది గొప్పదనం.
సునామీ, చెర్నోబిల్, ఫుకిషిమా అణు ప్రమాదాలు సంభవిస్తాయి. వాటిని పసిగట్టి, వీలైతే నివారించి, అనివార్యమైతే ఎదుర్కొని, సాధ్యమైనంత తక్కువ జన, ఆస్తి నష్టంతో బయటపడాలి.
ముఖ్యాంశాలు:
2052 నాటికి 208,000 మెగావాట్ల విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది
మన దేశం విద్యుచ్ఛక్తి వినియోగంలో 150వ స్థానంలో ఉంది
దేశంలో 1947లో కేవలం 1,400 MW విద్చుచ్ఛక్తి ఉత్పత్తి అయ్యేది. ఇప్పుడది 1,63,670 MW స్థాయికి చేరుకుంది.
సాంప్రదాయేతర విద్యుత్ వనరుల మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం పవన విద్యుత్ (wind power) ద్వారా 20,000 MW నుంచి 45000 MW విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు.
{పపంచంలో 70 శాతం ఇంధన అవసరాలు మధ్య ప్రాచ్య ఆసియా, ఉత్తర ఆఫ్రికా దేశాల ద్వారానే తీరుతున్నాయి.
{పపంచ వ్యాప్తంగా 16 శాతం విద్యుత్ ఉత్పత్తికి అణుశక్తి ఉపయోగపడుతోంది. ఫ్రాన్స్ దాదాపు 90 శాతం, జపాన్ 40 శాతం అణుశక్తిమీదనే ఆధారపడుతున్నాయి. రష్యా 10 శాతం ఇంధన అవసరా లను అణు శక్తి ద్వారానే తీర్చుకుంటోంది.

బౌద్ధ మత ఆవిర్భావం.. తదనంతర పరిణామాలు
సివిల్స్ ఎగ్జామినేషన్ మొదలు గ్రూప్-1, 2 ఇలా అన్ని పోటీ పరీక్షలో చరిత్ర విభాగం నుంచి మతాలు, వాటి తీరు, మనుగడ వంటి అంశాలపై ప్రశ్నలు తప్పకుండా ఉంటాయి. కాబట్టి ఈ అంశాలపై అవగాహన ఉండటం అభ్యర్థులకు తప్పనిసరి. ఈ క్రమంలో బౌద్ధమతం గురించి వివరాలు..
క్రీస్తు పూర్వం ఆరో శతాబ్ధంలో ఆవిర్భవించిన నూతన మతాల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన మతం బౌద్ధం. ఉత్తర భారత దేశంలో సాంఘిక, ఆర్థిక జీవనంలో చోటు చేసుకున్న మార్పులు, వైదిక కర్మకాండల పట్ల వ్యక్తమైన నిరసనల నేపథ్యంలో ఆవిర్భవించిన బౌద్ధం..దేశ మంతటా విస్తరించింది. మన పొరుగు దేశాలకు కూడా విస్తరించింది ఆసియా ఖండంలో ఒక బలమైన తాత్విక సాంప్రదాయంగా స్థిరపడటం విశేషం.
బుద్ధుని జీవిత క్రమం:
క్రీస్తు పూర్వం 563లో కపిలవస్తు నగర సమీపంలోని ‘లుంబినీ’గ్రామం (ప్రస్తుత నేపాల్‌లోని ప్రాంతం)లో జన్మించిన బుద్ధుడి అసలు పేరు సిద్ధార్ధుడు. శాక్య తెగను పాలిస్తున్న శుద్ధోధనుడు ఇతని తండ్రి. మహామాయ తల్లి.
ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం.. చిరు ప్రాయంలోనే ‘యశోధర’ అనే సమీప బంధువును పెళ్లి చేసుకున్న సిద్ధార్ధుడికి.. కొంతకాలం గృహస్థు జీవనం సాగించాక తీవ్ర అశాంతి ఏర్పడింది. ఒక రోజు చెన్నుడి సారథ్యంలో రథంలో విహరిస్తున్న సిద్ధార్ధుడికి కనిపించిన దృశ్యాలు (వృద్ధుడు, రోగి, శవయాత్ర) అతణ్ని తీవ్రంగా కలచివేశాయి. తర్వాత కనిపించిన నాలుగో దృశ్యం.. ప్రశాంత వదనంతో, అలౌకిక ఆనందంతో సంచరిస్తున్న సన్యాసి.
ఈ నాలుగు దృశ్యాలు సిద్ధార్ధుడికి దిశానిర్దేశం చేశాయి. ఈ నేపథ్యంలోనే యశోధర ‘రాహులుడికి’ జన్మనిచ్చింది. కుమారుడి జన్మదినాన సిద్ధార్ధుడు తన 29వ ఏటా రాజ్యా న్ని కుటుంబాన్ని విడిచి సన్యాసిగా మారాడు. తన యజమాని వియోగాన్ని తట్టుకోలేని ప్రియ అశ్వం ‘కంథక’ మరణించింది. సిద్ధార్ధుడు ఇల్లు విడిచి వెళ్లటాన్నే బౌద్ధులు ‘మహాభినిష్ర్కమణ’ అని వ్యవహరిస్తారు.
ఆ తర్వాత సిద్ధార్ధుడు ‘ఆలార కాలామ’ అనే గురువు వద్ద ధ్యాన సాధనలో శిక్షణ పొందాడు. తదనంతరం అయిదుగురు సన్యాసులతో కలసి కఠోర సాధనలు చేస్తూ.. శరీరాన్ని శుష్కింప చేసుకున్నాడు. కానీ ఆ సాధనల వల్ల ప్రయోజనం లేదని తెలుసుకుని మళ్లీ ఆహారాన్ని తీసుకున్నాడు. శారీరక బలాన్ని పొందాడు.
35వ ఏటా మగధను బింబిసారుడు పాలిస్తున్న కాలంలో గయ పట్టణ శివార్లలో, ‘సుజాత’ అనే పల్లెపడుచు తెచ్చిన ఆహారాన్ని స్వీకరించాక, ఒక పెద్ద బోధి వృక్షం కింద ధ్యాన నిమగ్నుడయ్యాడు. 49 రోజుల ధ్యానం తర్వాత సిద్ధార్ధుడికి జ్ఞానోదయం కలిగింది. దాని ఫలితమే సిద్ధార్ధుడు బుద్ధుడిగా మారడం. ఆ తర్వాత సారనాథ్‌లోని హరిణవనంలో ఒకప్పటి తన అయిదుగురు సహచరులకు తాను పొందిన జ్ఞానాన్ని ఉపదేశించాడు. దీనినే ‘ధర్మ చక్ర ప్రవర్తన’ అంటారు.
క్రమంగా బుద్ధుడి బోధనలు ప్రచారం పొందుతూ, ఎందరినో ఆకర్షించాయి. అ క్రమంలోనే బౌద్ధ సంఘం ఏర్పడింది. ఆ విధంగా 40 సంవత్సరాలకు పైగా బుద్ధుడు ధర్మ ప్రచారం చేశాడు. చివరికి 80వ ఏటా క్రీస్తు పూర్వం 483లో కుసీనగర్ అనే ప్రాంతంలో మరణించాడు. ఈ సంఘటననే బౌద్ధ పరిభాషలో ‘మహా పరినిర్వాణ’గా వ్యవహరిస్తారు.
బుద్ధుని బోధనలు:
తన సమకాలీన వాస్తవికతను సవ్యంగా అవగాహన చేసుకుని, దానిని సంస్కరించే ప్రయత్నం చేశాడు బుద్ధుడు. ఆత్మ, బ్రహ్మల గురించి నడుస్తున్న రాద్ధాంతాలను పట్టించుకోలేదు. నాలుగు గొప్ప సత్యాలను గుర్తించాడు. అవి..
1. పపంచం దుఃఖమయం
2. దుఃఖానికి మూలం కోరిక
3. కోరికలను జయిస్తే దుఃఖం నివారణై నిర్వాణం సిద్ధిస్తుంది.
4. దుఃఖాన్ని నివారించేందుకు అష్టాంగ మార్గాన్ని అనుసరించాలి.
అష్టాంగ మార్గం:
1. సమ్యక్ దృష్టి
2. సమ్యక్ నిశ్చయం
3. సమ్యక్ వాక్కు
4. సమ్యక్ క్రియ
5. సమ్యక్ జీవనం
6. సమ్యక్ సాధన
7. సమ్యక్ స్మృతి
8. సమ్యక్ సమాధి
ఈ ఎనిమిది సూత్రాలు అవగతం చేసుకుని, ఆచరించిన వ్యక్తికి ‘నిర్వాణం’ సిద్ధిస్తుంది. అంటే జనన మరణ చక్రం నుంచి విముక్తి. బుద్ధుడు విలాస జీవనాన్ని, కఠోర క్రమశిక్షణను తిరస్కరించాడు. బౌద్ధం అన్నింటిలోనూ ‘మితం’గా ఉండటం వల్లే ఎక్కువ ప్రాచుర్యాన్ని పొందింది. బుద్ధుడు తన అనుచరులకు కొన్ని సాంఘిక ప్రవర్తన నియమాలను రూపొందించాడు. అవి..
1. ఇతరుల ఆస్తిని ఆశించకూడదు.
2. అహింసను పాటించాలి
3. మత్తు పదార్థాలు సేవించకూడదు.
4. అబద్ధాలు ఆడరాదు.
5. అవినీతి చర్యలకు పాల్పడకూడదు.
బుద్ధుని జీవితానికి సంబంధించి అయిదు ప్రధాన ఘట్టాలను బౌద్ధులు పంచకళ్యాణులుగా భావిస్తారు. అవి..
1. బుద్ధుడి జననం 2. మహాభినిష్ర్కమణం 3. సంబోధి (బుద్ధుడికి జ్ఞానోదయం కలగడం) 4. ధర్మచక్ర ప్రవర్తన 5. మహా పరినిర్వాణం
బౌద్ధ సంగీతులు:
బౌద్ధ సంఘంలోని సైద్ధాంతిక వాదోపవాదాలను పరిష్కరించుకునేందుకు జరిగిన సమావేశాలనే ‘సంగీతుల’అని వ్యవహరించే వారు.
మొదటి సంగీతి: బుద్ధుని మరణానంతరం అజాత శత్రువు పాలనా కాలంలో క్రీస్తు పూర్వం 483లో ‘రాజగృహ’ సమీపంలో మహాకస్యపుడి అధ్యక్షతన జరిగింది. బుద్ధుని శిష్యుల్లో ముఖ్యుడైన ఉపాలి ‘వినయ పీటిక’ను, ఆనందుడు ‘సుత్త పీటిక’ను క్రోడీకరించారు.
రెండో సంగీతి: బుద్ధుడు మరణించిన వందేళ్లకు అంటే క్రీస్తు పూర్వం 383లో వైశాలిలో ‘సబకామి’ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో బౌద్ధ సంఘం ‘స్థవిరవాదులు’, ‘మహాసాంఘికులు’గా చీలింది.
మూడో సంగీతి: అశోకుని పోషణలో పాటలీపుత్రంలో మొగలి పుత్తతిస్స అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో స్థవిరవాదులు పైచేయి చాటుకున్నారు. ఈ సమావేశంలోనే త్రిపీటికాల చివరి భాగం- అభిదమ్మ పీటికలోని ‘కథావత్తు’ సంకలనం చేశారు.
నాలుగో సంగీతి: కనిష్కుని కాలంలో కాశ్మీర్‌లో వసుమిత్రుడు, అశ్వఘోషుల అధ్యక్షతన జరిగింది. బౌద్ధ సంఘం హీనయాన, మహాయాన శాఖలుగా చీలింది.
బౌద్ధ మత సాహిత్యం:
వినయ పీటిక: బౌద్ధ సంఘ ప్రవర్తన, క్రమశిక్షణకు సంబంధించి బుద్ధుడు రూపొందించిన నియమావళి.
సుత్త పీటిక: త్రిపీటకాల్లో విస్తృతమైంది, ముఖ్యమైంది. దీనిలో అయిదు భాగాలున్నాయి. అవి..
1. దీర్ఘ నికాయ

2. మధ్యమ నికాయ
3. సంయుక్త నికాయ
4. అంగుత్తర నికాయ
5. ఖుద్దక నికాయ.
ప్రపంచ ప్రసిద్ధి పొందిన జాతక గాధలు ‘ఖుద్దక నికాయ’లోనే నిక్షిప్తమయ్యాయి.
అభిదమ్మ పీటిక: బౌద్ధులు వృద్ధి చేసిన అధిభౌతిక, మనస్తత్వ విజ్ఞానం ఇందులో సంకలనం చేశారు.
ఈ త్రిపీటకాలన్నీ పాలీ భాషలోనే ఉన్నాయి. క్రీస్తుశకం ఒకటో శతాబ్ధంలో ఆవిర్భవించిన ‘మహాయానం’ సంస్కృత భాషను స్వీకరించింది. మహాయానం ‘వైఫల్య సూత్రాలు’ పేరిట కొంత సాహిత్యాన్ని సృష్టించింది. అందులో ముఖ్యమైనవి..
అష్ట సహస్రిక ప్రజ్ఞా పారమిత, సద్ధర్మ పుండరీక, లలిత విస్తార.
బౌద్ధ మేధావులు: అశ్వఘోషుడు: కనిష్కుని సమకాలీనుడు. కవి, వాగ్గేయకారుడు, నాటక రచయిత, పండితుడు, మహా వక్త. ఈయన కాలినడకన పట్టణాలు, పల్లెలు సంచరించి బౌద్ధ మత ప్రచారం చేశాడు.
నాగార్జునుడు: యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో శ్రీపర్వతం (దీనికే నాగార్జున కొండ అని పేరు) వద్ద నివసించాడు. మాధ్యమిక వాదాన్ని ప్రవచించాడు. దీనికే శూన్యవాదం అని పేరు వచ్చింది.
అసంగుడు: నాలుగో శతాబ్ధంలో పంజాబ్ ప్రాంతంలో జీవించాడు. మైత్రేయనాధుడు స్థాపించిన యోగాచార లేదా విజ్ఞాన వాద శాఖను ప్రచారం చేశాడు.
వసుబంధుడు: అసంగుని సోదరుడు. ఇతడు రాసిన ‘అభిదమ్మ కోశ’ను బౌద్ధ విజ్ఞాన సర్వస్వంగా భావిస్తున్నారు.
బుద్ధఘోషుడు: అయిదో శతాబ్ధంలో జీవించిన పాలీ విద్వాంసుడు. ఇతడు రచించిన ‘విశుద్ధిమార్గ’ త్రిపీటకాలను అవగతం చేసుకునేందుకు కీలకమైంది.
అయిదో శతాబ్ధంలోనే జీవించిన బుద్ధపాలితుడు భావ వివేకుడు. నాగార్జునుడి ‘శూన్య వాదాన్ని’ విస్తృతపరిచారు. ఈ శతాబ్ధానికే చెందిన దిగ్నాశుడు తర్కంపై సుమారు వంద రచనలు చేసి ప్రసిద్ధి పొందాడు. ఏడో శతాబ్ధంలో జీవించిన ధర్మకీర్తి మరో గొప్ప తార్కికుడు. గాఢ తాత్విక చింతన, గతితర్కంతో ‘కాంట్ ఆఫ్ ఇండియా’ (Kant of India) గా ప్రశంసలు పొందాడు.
బౌద్ధ మత శాఖలు:
బుద్ధుడు జీవించినప్పుడు ఆయన బోధనలు అక్షరబద్ధం కాలేదు. దీంతో ఆయన మరణించాక తలెత్తిన విభేదాల కారణంగా బౌద్ధ మత సిద్ధాంతాలు, సూత్రాలు, బౌద్ధ సంఘం శాఖోపశాఖలుగా చీలింది.
బుద్ధుడు మరణించిన వందేళ్లకు జరిగిన రెండో సంగీతిలో బౌద్ధ సంఘం ‘స్థవిరవాద’, ‘మహా సాంఘిక’ శాఖలుగా చీలింది. అశోకుని కాలానికి బౌద్ధంలో 18 శాఖలు ఏర్పడినట్లు తెలుస్తోంది. వివాదాల పరిష్కారం కోసమే అశోకుడు మూడో సంగీతిని ఏర్పాటు చేశాడు. కనిష్కుని కాలానికి మహా సాంఘికులే ‘మహాయాన శాఖ’ఏర్పాటుకు కారణమయ్యారు.
మహాయానం:
మౌర్యానంతర యుగం (క్రీస్తు పూర్వం 200- క్రీశ 300) లో సంభవించిన సామాజిక పరిణామాలు మహాయాన ఆవిర్భావానికి దారి తీశాయి. ఎన్నో విదేశీ తెగలు బౌద్ధాన్ని స్వీకరించడం, బౌద్ధ సంఘంలో సంపద పేరుకుపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో ‘సంఘం’లో తలెత్తిన విభేదాలు మహాయానానికి దారి తీశాయి.
మహాయానం ‘బోధి సత్య భావన’కు విస్తృత ప్రచారం కల్పించింది. దానాలు చేసి పుణ్యం పొందొచ్చని, పుణ్యాన్ని బదిలీ చేయొచ్చని ప్రచారం చేసింది. మహా యానం బుద్ధుడిని దేవుడిగా మార్చింది. భారతదేశంలో విగ్రహారాధన ప్రబలమవడానికి మహాయానమే కారణం.
మహాయానం విపరీత పోకడలో వజ్రయానానికి దారితీసింది. వజ్రయానం బుద్ధుడికి తోడుగా ‘తారా’ అనే స్ర్తీ దేవతలను సృష్టించింది. లైంగిక సాధనల వంటి చర్యలతో బౌద్ధం ప్రతిష్ట మసకబారింది.
బౌద్ధమత ప్రాచుర్యం:
బౌద్ధమతంలోని నిరాడంబరత్వం సామాన్యులను విశేషంగా ఆకర్షించింది. వర్ణ వివక్షను నిరసించడం ద్వారా బ్రాహ్మణేతర వర్ణాల్లో విశేష ప్రాచుర్యం పొందింది. బుద్ధుని వ్యక్తిత్వం, సంభాషణ శైలి బౌద్ధానికి విశేష ప్రచారం తీసుకొచ్చాయి. బౌద్ధ సంఘం ఎంతో ఆసక్తితో, క్రమశిక్షణతో మత ప్రచారానికి పాటుపడింది. జన సమాన్యంలో ప్రచారంలో ‘పాలీ’ భాషను వినియోగించడం ద్వారా కూడా బౌద్ధం విశేష ప్రాచుర్యం పొందింది. ఇక, అశోకుడ, కనిష్కుడు, హర్షుడు వంటి చక్రవర్తులు కూడా ఆరాధించడం వల్ల ఉపఖండంతోపాటు, విదేశాలకూ సైతం బౌద్ధ మతం విస్తరించింది.
బౌద్ధమత క్షీణత:
క్రీస్తు శకం ఆరో శతాబ్ధం నాటికే బౌద్ధం క్షీణత ప్రారంభమైంది. క్రీస్తు శకం 12వ శతాబ్ధం నాటికి బౌద్ధం భారతదేశం నుంచి అంతర్ధానమైంది. ఒకప్పటి నిరాడంబరత్వాన్ని, మౌలిక సిద్ధాంతాలను బౌద్ధం విడిచిపెట్టడం, ‘పాలీ’ భాషకు బదులు సంస్కృతాన్ని స్వీకరించడం, బౌద్ధ సంఘం శాఖోపశాఖలుగా చీలిపోవడం.. శంకరాచార్య, కుమారభట్టు తదితరులు హిందూమతాన్ని సంస్కరించి, శక్తిమంతం చేయడం, బౌద్ధంపై అన్యమతస్తుల (ముఖ్యంగా శైవులు) దాడులు.. వంటి ఎన్నో కారణాలతో బౌద్ధం క్షీణించింది.
20వ శతాబ్ధంలో డా॥బి.ఆర్. అంబేద్కర్ బౌద్ధాన్ని స్వీకరించి, గొప్ప సమతా సిద్ధాంతంగా, ప్రజాస్వామిక భావనగా బౌద్ధానికి తిరిగి ప్రచారం కల్పించడంలో సఫలమయ్యాడు.
వి. శివాజీ
చరిత్ర అధ్యాపకులు

భారత్.. వ్యవసాయ విధానం
అల్పాభివృద్ధి దేశాల్లో ఆర్థికాభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేయడంలో వ్యవసాయ రంగం ప్రధాన పాత్ర పోషిస్తుంది. దేశంలో ప్రజలందరికీ ఆహారాన్ని అందించడమే కాకుండా ఎక్కువ శ్రామిక శక్తికి ఉపాధి, పొదుపు పెంపొందించడం, పారిశ్రామిక ఉత్పత్తులకు మార్కెట్, విదేశీ మారకద్రవ్యం ఆర్జనలాంటి విషయాలలో వ్యవసాయ రంగం పాత్ర ప్రధానమైంది. స్వాతంత్య్రం వచ్చినప్పుడు జాతీయాదాయానికి ఎక్కువ వాటాను సమకూర్చటమే కాకుండా, ఎక్కువమంది శ్రామిక శక్తికి.. ఉపాధి కల్పనలో ఈ రంగం ముందంజలో ఉంది.
సుమారు 72 శాతం శ్రామిక శక్తి వ్యవసాయరంగంపై ఆధారపడటాన్ని బట్టి స్వాతంత్య్రం వచ్చినప్పుడు భారత ఆర్థిక వ్యవస్థను వ్యవసాయ ఆధారిత వ్యవస్థగా భావించవచ్చు. వ్యవసాయేతర రంగాల అభివృద్ధి, మొత్తం ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి వ్యవసాయరంగ అభివృద్ధిపైనే ఆధారపడటాన్ని స్వాతంత్య్రానంతరం మనం గమనించొచ్చు.
స్వాతంత్య్రానికి ముందు 50 ఏళ్లలో వ్యవసాయరంగంలో వృద్ధి సగటున ఒక శాతం, కాగా.. స్వాతంత్య్రానంతర కాలంలో సగటు వార్షిక వృద్ధి 2.6 శాతం. 1950, 1960 దశకాలలో సాగు విస్తీర్ణంలో పెరుగుదల నమోదు కాగా.. తర్వాత కాలంలో వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించి పెరిగిన భూవిస్తీర్ణంలో తగ్గుదల సంభవించింది. వ్యవసాయ ఉత్పత్తిలో వృద్ధికి ముఖ్య ఆధారంగా ఉత్పాదకతలో పెరుగుదల వెలుగులోకి వచ్చింది.
స్వాతంత్య్రం వచ్చినప్పుడు ఆహార ధాన్యాల దిగుమతిపై భారత్ ఆధారపడగా తర్వాత కాలంలో ఈ ఉత్పత్తుల దిగుమతులను నిరోధించడంలో వ్యవసాయ రంగం విజయవంతమైంది. ఉత్పత్తి, దిగుబడిలో వచ్చిన మార్పులే కాకుండా ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులు సంభవించడానికి వ్యవసాయ రంగం దోహదపడింది.
ప్రభుత్వం అమలు పరిచిన భూసంస్కరణలు, వ్యవసాయ ధరల కమిషన్ ఏర్పాటు, నూతన వ్యవసాయ అభివృద్ధి వ్యూహం అమలు, పరిశోధన, విస్తరణ సేవలపై పెట్టుబడి, పరపతి సౌకర్యాల పెంపు వంటి చర్యలు వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రధాన కారకాలుగా నిలిచాయి. ప్రపంచ వాణిజ్య సంస్థను (డబ్ల్యూటీఓ) ఏర్పాటు చేసిన తర్వాత వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల స్థితిలో కొంత ప్రతికూల వాతావరణం కన్పిస్తుంది.
ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటు చేసిన తర్వాత భారత్‌లో అన్ని పంటల ఉత్పత్తి వృద్ధి 2.93 శాతం నుంచి 1.57 శాతానికి తగ్గింది. లైవ్‌స్టాక్ వృద్ధి 4.21 శాతం నుంచి 3.40 శాతానికి, ఫిషరీస్ రంగ వృద్ధి 7.48 నుంచి 3.25 శాతానికి తగ్గింది అయితే.. అడవుల విషయంలో మాత్రం వృద్ధి 0.09 నుంచి 1.82 శాతానికి పెరిగింది.
వ్యవసాయ విధానం:
స్వాతంత్య్రానంతరం వ్యవసాయరంగ అభివృద్ధిలో భాగంగా అనేక సంస్థాపరమైన అవస్థాపన సౌకర్యాల్లో మార్పులు ప్రవేశపెట్టారు. స్వాతంత్య్రానంతరం వ్యవసాయరంగ అభివృద్ధిని నాలుగు దశలుగా విభజించవచ్చు. మొదటి దశ (1947-1960 దశకం మధ్య కాలం), రెండోదశ (1960వ దశకం మధ్యకాలం నుంచి 1980 వరకు), మూడో దశ (1980 నుంచి 1991 వరకు), నాలుగో దశ (1991-92 తర్వాత కాలం)గా పేర్కొనవచ్చు.
మొదటి దశ:
వ్యవసాయ విధానం మొదటి దశలో వ్యవసాయ సంస్కరణలు, సంస్థాపర మార్పులు, భారీ నీటిపారుదల ప్రాజెక్టుల అభివృద్ధి, సహకార పరపతి సంఘాల పటిష్టత కోసం చర్యలు తీసుకున్నారు. భూసంస్కరణల్లో భాగంగా మధ్యవర్తుల తొలగింపు, భూమిని వాస్తవంగా సేద్యం చేసిన వారికి భూపట్టాల పంపిణీ జరిగింది.
తద్వారా వ్యవసాయరంగంలో కమతాలపై యాజమాన్య హక్కులు పొందిన సాగుదార్లు చూపించిన శ్రద్ధ వల్ల వ్యవసాయ ఉత్పాదకత పెరిగింది. మొదటి దశలో వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదలకు భూసంస్కరణలు కారణమయ్యాయి. బ్రిటిష్ పాలనలో స్తంభించిన వ్యవసాయ రంగాన్ని తిరిగి పురోగమింప చేసే కృషిలో భాగంగా కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్, ప్రణాళికా వికేంద్రీకరణ, సాంద్ర ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టారు.
రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే దిశగా నడిపించేందుకు ప్రోత్సాహక ధరల విధానాన్ని ప్రవేశపెట్టడానికి వ్యవసాయ ధరల కమిషన్‌ను 1965లో ఏర్పాటు చేశారు. దేశంలో పెరుగుతున్న జనాభాకు తగినంత ఆహారాన్ని అందించే చర్యలో భాగంగా ప్రభుత్వం ఈ దశలో ఆహారధాన్యాల దిగుమతిపై ఆధారపడింది.
రెండో దశ:
వ్యవసాయ రంగంలో నూతన వ్యవసాయ వ్యూహాన్ని 1960 వ దశకం మధ్యకాలం నుంచి అవలంభించడం ద్వారా వ్యవసాయరంగంలో రెండో దశ ప్రారంభమైంది. నూతన వ్యవసాయ వ్యూహంలో భాగంగా మేలురకమైన విత్తనాల వినియోగం, బహుళ పంటలు, ఆధునిక వ్యవసాయ పనిముట్లు, నీటిపారుదల సౌకర్యాల విస్తర ణ జరిగింది. ఈ వ్యూహంలో భాగంగా ఆహారధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధ్యమైంది. ఈ దశలో వ్యవసాయరంగంలో సంస్కరణలు చోటు చేసుకోలేదు. అయితే విధాన నిర్ణేతలు పరిశోధన, విస్తరణ, ఉత్పాదితాల సరఫరా, పరపతి, మార్కెటింగ్, మద్దతు ధర, సాంకేతిక పరిజ్ఞానం వ్యాప్తిలాంటి అంశాలకు ప్రాధాన్యమిచ్చారు.
మూడో దశ:1980వ దశకం ప్రారంభంలో వ్యవసాయ రంగంలో మూడో దశ ప్రారంభమైంది. ఈ కాలంలో పంటల మార్పిడి సాధ్యమయింది. ఆహారేతర ఉత్పత్తుల్లో అధిక వృద్ధి నమోదైంది. మరోవైపు పాలు, ఫిషరీస్, పౌల్ట్రీ, కూరగాయలు, పండ్ల ఉత్పత్తుల్లో గణనీయ ప్రగతి నమోదైంది. ఈ కాలంలోనే వ్యవసాయ రంగానికి సబ్సిడీలు పెరిగాయి. వ్యవసాయ రంగంలో మౌలిక సౌకర్యాల అభివృద్ధిపై ప్రభుత్వరంగ పెట్టుబడులు తగ్గాయి. అయితే రైతుల పెట్టుబడిలో మాత్రం పెరుగుదల కన్పించింది.
నాలుగో దశ:
1991లో ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో వ్యవసాయరంగంలో వ్యవసాయ విధానం నాలుగో దశ ప్రారంభమైంది. అనేక నియంత్రణల సడలింపు, అనేక కార్యకలాపాల్లో ప్రభుత్వ పరిధిని తగ్గించడం, సరళీకరణ వంటి విధానాలు ప్రవేశపెట్టారు. వ్యవసాయ రంగంలో ప్రత్యక్షంగా ఏవిధమైన సంస్కరణలు ప్రవేశపెట్టనప్పటికీ వినిమయరేటులో సంభవించిన ఒడిదుడుకులు ఈ రంగంపై పరోక్ష ప్రభావాన్ని చూపించాయి. పారిశ్రామిక రంగానికి సంబంధించి రక్షణ విధానాన్ని ఉపసంహరించుకోవడం, విదేశీ వాణిజ్య సరళీకరణలాంటి విధానాలు కూడా వ్యవసాయరంగ అభివృద్ధిపై కొంత మేర ప్రతికూల ప్రభావాన్ని చూపించాయి.
ప్రపంచవాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) నిబంధనల మేరకు స్వదేశీ మార్కెట్‌లో ప్రవేశపెట్టిన సరళీకరణ విధానాలు వ్యవసాయ రంగంలో సంక్షోభానికి కారణమయ్యాయి. విధాన నిర్ణేతలకు ఈ దశలో వ్యవసాయ రంగం ఒక సవాలుగా నిలిచింది. దీనివల్లే భారత ప్రభుత్వం జూలై 2000లో నూతన వ్యవసాయ విధానం ప్రవేశపెట్టింది. వనరుల సమర్థ వినియోగం ద్వారా వ్యవసాయ రంగంలో నాలుగు శాతం వృద్ధి సాధించడం వ్యవసాయ విధానం లక్ష్యం. కేంద్ర, రాష్ర్ట్ర స్థాయిలో నూతన వ్యవసాయ విధానం లక్ష్యాలు సాధించడానికి కాలప్రాతిపదికన యాక్షన్ ప్లాన్స్ రూపొందించవలసిన అవసరం ఉంది.
పంటల తీరులో మార్పు:
ఒక నిర్ణీతకాలంలో వివిధ పంటల కింద ఉన్న భూవిస్తీర్ణాన్ని పంటల తీరు అంటారు. స్వాతంత్య్రానంతరం మొత్తం పంటల విస్తీర్ణంలో ఆహారేతర పంటల విస్తీర్ణం పెరుగుతున్నప్పటికీ.. ఆహారపంటల కింద ఉన్న భూవిస్తీర్ణమే ఎక్కువ. ప్రణాళిక రచన ప్రారంభమయ్యే సమయంలో మొత్తం పంటల విస్తీర్ణంలో 76.7 శాతం భూమి ఆహారపంటల కింద 23.3 శాతం భూమి ఆహారేతర పంటల కింద ఉంది.
2001 లెక్కల ప్రకారం మొత్తం విస్తీర్ణంలో ఆహార పంటల విస్తీర్ణం 65.83 శాతానికి తగ్గగా ఆహారేతర పంటల కింద ఉన్న విస్తీర్ణం 34.17 శాతానికి పెరిగింది. వివిధ పంటలకు సంబంధించి భూపంపిణీలో వచ్చిన మార్పు వ్యవసాయ రంగాన్ని జీవనాధార వ్యవసాయం నుంచి కమర్షియల్ క్రాపింగ్ (వాణిజ్యపరమైన వ్యవసాయం)గా మార్చింది. మార్కెట్‌లో ధరలతోపాటు ప్రతి హెక్టారుకు లభించే లాభదాయకత ఆహారేతర పంటల విషయంలో ఎక్కువగా ఉండటం.. వీటి భూ విస్తీర్ణం పెరగడానికి కారణం.
మొత్తం పంటల విస్తీర్ణంలో 54.43 శాతం భూమి ఆహార ధాన్యాల కింద, 11.4 శాతం భూమి పప్పు ధాన్యాల కింద ఉంది. ధాన్యపు పంటలు, పప్పు ధాన్యాలు కింద ఉన్న విస్తీర్ణంలో పెరుగదల సంభవించగా, పప్పు ధాన్యాల విస్తీర్ణంలో పెరుగుదల కంటే ధాన్యపు పంటల (cereals) విస్తీర్ణంలో పెరుగుదల రేటు ఎక్కువ. నీటిపారుదల సౌకర్యాలు, రసాయన ఎరువులు, మేలురకమైన విత్తనాల వల్ల పంటల విస్తీర్ణంలో ఏ విధమైన పెరుగదల సంభవించనప్పటికీ ఆహారధాన్యాలకు సంబంధించిన విస్తీర్ణంలో మార్పు ఎక్కువ ఉంటుంది. 1950-51 తర్వాత ధాన్యపు గింజలు (Coarse Cereals) కింద ఉన్న భూవిస్తీర్ణంలో తగ్గుదల సంభవించింది.
ఆహార వినియోగ ప్రక్రియలో మార్పు:
వినియోగదారుల అభిరుచులు, సరఫరా అనుకూలంగా ఉండటం, సాపేక్ష ధరలలోని మార్పు వల్ల ఆహార వినియోగ ప్రక్రియలో మార్పులు సంభవించాయి. పట్టణీకరణ, ఆర్థికవృద్ధిలో పెరుగుదల ధాన్యపు పంటల తలసరి డిమాండ్‌లో తగ్గుదలకు దారితీసి noncereal food items డిమాండ్‌లో పెరుగుదలకు కారణమైంది. వ్యవసాయ రంగంలో చోటు చేసుకున్న ఆధునికీకరణ ధాన్యపు పంటల తలసరి వినియోగంపై రుణాత్మక ప్రభావాన్ని చూపించింది. 1972-73 నుంచి 2004-05 మధ్యకాలంలో ఆహార వినియోగ ప్రక్రియలో కొన్ని కీలక మార్పులు సంభవించాయి.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కుటుంబ బడ్జెట్‌లో ఆహార ఉత్పత్తుల వాటా తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో టజ్చిట్ఛ ౌజ జౌౌఛీ మొత్తం కుటుంబ బడ్జెట్ వ్యయంలో 72.9 శాతం నుంచి (1972-73) 2004-05 నాటికి 55 శాతానికి తగ్గింది. ఇదే కాలానికి సంబంధించి పట్టణ ప్రాంతాల్లో share of food మొత్తం కుటుంబ బడ్జెట్ వ్యయంలో 64.5 శాతం నుంచి 42.5 శాతానికి తగ్గింది.
పప్పు ధాన్యాల వాటాలోనూ తగ్గుదల కన్పించింది.
కూరగాయలు, పండ్లు, పాలు, మాంసం, గుడ్లు, వంట నూనెల వాటా మొత్తం కుటుంబ బడ్జెట్ వ్యయంలో పెరుగుతుంది.
...........................................
ముఖ్యాంశాలు
స్వాతంత్య్రానికి ముందు 50 ఏళ్లలో వ్యవసాయ రంగంలో సగటు వార్షిక వృద్ధి ఒక శాతం కాగా స్వాతంత్య్రానంతరం ఈ రంగం సగటున 2.6 శాతం వృద్ధి నమోదు చేసింది.
వ్యవసాయ విధానం మొదటి దశ (1947- 1965) లో భూసంస్కరణలు, సంస్థాపరమైన మార్పులు, భారీనీటిపారుదల ప్రాజెక్టుల అభివృద్ధి, సహకార పరపతి సంఘాల పటిష్టతకు చర్యలు తీసుకున్నారు.
వ్యవసాయరంగంలో నూతన వ్యవసాయ వ్యూహాన్ని 1960వ దశకం మధ్యకాలం నుంచి అవలంభించారు.
ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటు చేసిన తర్వాత అడవులు మినహా మిగులు వ్యవసాయం, అనుబంధాల వృద్ధి రేటు తగ్గింది.
భారత ప్రభుత్వం జూలై 2000లో నూతన వ్యవసాయ విధానాన్ని ప్రవేశపెట్టింది.

మార్కులు తెచ్చే వ్యాసంగం!
మార్కులు తెచ్చే వ్యాసంగం! గ్రూప్-1 సిలబస్‌లో 'జనరల్ వ్యాసం' అని ఉంటుంది. వ్యాస విషయం ఏదైనా కానివ్వండి- ప్రత్యేక జ్ఞానం లేని వ్యక్తి కూడా చదవగానే ఒక అవగాహనకి రాగలిగితే వ్యాసం విజయం సాధించినట్టే! ఆకట్టుకునే వ్యాసానికి రూపురేఖలను ఎలా ఇవ్వాలో వివరంగా తెలుసుకుందాం.
కొడాలి భవానీ శంకర్
వ్యాసం- ఎన్ని దశల్లో?
ప్రశ్నని క్షుణ్ణంగా చదవటం
కీ (కీలక పదాలు) గుర్తించడం
చిత్తు ప్రతి తయారీ: 7-8 నిమిషాలు
వ్యాస రచన: 45 నిమిషాలు
సమీక్ష/సవరణలు: 5 నిమిషాలు
ఈ వ్యాస దశల్ని 2008 గ్రూప్-1 మెయిన్స్‌లో అడిగిన ప్రశ్నల ద్వారా విశ్లేషిద్దాం.
ప్రశ్న: కరువు లేదా దుర్భిక్షం అనగానేమి? దుర్భిక్ష ప్రభావాల్ని తెలిపి, వాటిని అంతమొందించడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యల్ని చర్చించండి. మూడు సంవత్సరాలకు పైగా కరువు కొనసాగితే దాని నివారణకు చేపట్టే చర్యలు ఏమిటి?
1) దుర్భిక్ష నిర్వచనం 2) దుర్భిక్ష ప్రభావాలు 3) ప్రభుత్వ చర్యలు 4) 3 సంవత్సరాల కరువు నివారణ చర్యలు
ఈ నాలుగు అంశాలనూ క్రమబద్ధీకరించి వ్యాస లక్షణాల్ని మిళితం చేయడం ఎలా? అని ఆలోచించాలి. ఈ నాలుగు అంశాల్నే ఉప శీర్షికల్లాగా రాసుకొంటూ పోతే అది జనరల్ స్టడీస్ సమాధానాల శైలిలో ఉండి వ్యాస రూపాన్ని ప్రతిబింబించదు.
ప్రశ్నలో అడిగిన కీలక పదాల వరుస క్రమంలోనే చిత్తు ప్రతిని తయారుచేయాల్సిన అవసరం కూడా లేదు. కీలక పదాల్ని ఏ వరుస క్రమంలో కలిపితే అందమైన రూపం వస్తుంది అనే ఆలోచనే సరైన చిత్తు ప్రతికి దారి తీస్తుంది. దాంతో సరైన వ్యాసం వస్తుంది.
చిత్తుప్రతి తయారీ
భవనం నిర్మించటానికి ముందు తయారుచేసే ప్రణాళిక లాంటిదే చిత్తు ప్రతి తయారీ. సమగ్రత, అవిచ్ఛిన్నత, విషయావగాహన, విశ్లేషణ మొదలైన అంశాలు కలిపేందుకు అనుగుణంగా సరైన క్రమంలో కీలక పదాలు, ఇతర అంశాల అనుసంధానంతో చిత్తుప్రతిని తయారుచేసుకోవాలి.
ఈ విధంగా వ్యాసాన్ని అభివృద్ధి చేసేటప్పుడు కీలక పదాలను అదనంగా ఏయే విషయాల జోడింపు అవసరమో నిర్ధారించుకుంటే సంపూర్ణత్వం దిశగా పయనించినట్లే.
ఎంత సమయం కేటాయించాలి?
వ్యాస రచనలో అనవసరమైన విషయాలకు ఎక్కువ, అవసరమైన విషయాలకు తక్కువ సమయం కేటాయించడం వంటి తప్పులు జరగకుండా జాగ్రత్త వహించాలి. ఎగ్జామినర్‌కు కావల్సిన స్థాయిలో సమాచారం ఇవ్వాలి కదా! అందుకే చిత్తు ప్రతిలోని ప్రతి అంశానికీ ఎంత సమయం కేటాయించాలో ముందుగా నిర్ణయించుకోవాలి.
కరువు వ్యాసం చిత్తుప్రతి అంశాల్ని పరిగణనలోకి తీసుకుంటే, రచనకు లభించే సమయం 45 నిమిషాలలో...
ఉపోద్ఘాతం 4 నిమిషాలు
కారణాలు 6 ని.
దుష్ఫలితాలు 15 ని.
ప్రభుత్వ చర్యలు 15 ని.
దుష్ఫలితాలు, ప్రభుత్వ చర్యలు అనేవి ప్రశ్నలోనే ఉన్నాయి కాబట్టి వాటికి ఎక్కువ సమయం కేటాయించాం. మిగతా అంశాలు సమగ్రత కోసం అవసరం కాబట్టి, లభించే సమాచారాన్ని బట్టి సమయాన్ని కేటాయించుకున్నాం. ఇదే రీతిలో ప్రతి వ్యాసంలో సమయం విలువను నిర్ణయించుకోవాలి.
సైన్సు - ఆర్ట్స్ అభ్యర్థులు
సైన్సు, ఆర్ట్స్ అభ్యర్థులలో వారి సబ్జెక్టుల స్వభావం రీత్యా సంక్షిప్తత, విస్తరణ అనే గుణాలు వారిలో ఇమిడిపోతాయి. సైన్సు అభ్యర్థులకు వివరణాత్మకంగా రాయాల్సిన అవసరం పెద్దగా ఉండదు. ప్రతి విషయాన్నీ సూత్రీకరణ రూపంలో చెప్పడం వీరి గుణం. దీనికి భిన్నంగా ఆర్ట్స్ అభ్యర్థులు ఒక పదాన్ని ఆధారంగా చేసుకొని ఎంత పెద్ద కథనయినా చెప్పగలుగుతారు. పైగా ఈ వ్యాసాలన్నీ సాంఘిక విషయాలకు సంబంధించినవే. అందువల్ల సైన్సు అభ్యర్థులు సాధన ద్వారానే, మంచి వ్యాసం అభివృద్ధి చేయగలుగుతారు.
2008 గ్రూప్-1 మెయిన్స్‌లో - 'ఆంధ్రప్రదేశ్‌లో స్థాపించబడిన ప్రత్యేక ఆర్థిక మండళ్ల అనుకూల, ప్రతికూల అంశాల్ని చర్చింపుము'అనే ప్రశ్నకి 'అనుకూల, ప్రతికూల' అంశాలు మాత్రమే రాస్తే మార్కులు తక్కువ వచ్చే ప్రమాదం ఉంది. ఈ వ్యాసాన్ని ఈ కింది విధంగా విస్తరించవచ్చు.
సెజ్‌లపై తాజా స్థితి (5-6 లైన్లు)
సెజ్‌ల పరిణామం, తోడ్పడిన అంశాలు
ఆవశ్యకత (అనుకూలతలు)
ప్రతికూలత (దుష్పలితాలు)
ప్రభుత్వ చర్యలు
సిఫార్సులు
ముగింపు
ఆర్ట్స్ అభ్యర్థులు పేజీలు పేజీలు రాసెయ్యాలనే అపోహ వదిలి నిర్మాణాత్మకంగా, పొందికగా రాసేందుకు కృషి చేయాలి.
విజయూనికి కీలకం.. జనరల్ ఎస్సే
విజయూనికి కీలకం.. జనరల్ ఎస్సే
గ్రూప్-1 మెయిన్స్‌లో మిగిలిన విభాగాల కంటే భిన్నమైంది జనరల్ ఎస్సే.. గత ఫలితాలను విశ్లేషిస్తే..తుది విజేతలను నిర్ణయించడంలో ఈ విభాగమే కీలకమనే విషయుం అవగతవువుతుంది.. అభ్యర్థిలోని సృజనాత్మకత, సంపూర్ణ విషయావగాహన, వర్తవూన అంశాలపై పట్టు వంటి అంశాలను పరీక్షించడానికి ఉద్దేశించిన .. ఈ విభాగమే.. గ్రూప్-1లో విజయూనికి కీలకం.. పక్కా ప్రణాళిక, భిన్న కోణాల్లోంచి విషయూన్ని ప్రెజెంట్ చేసే చతురత ఉంటే ఈ పేపర్‌లో చక్కని స్కోరు సాధించవచ్చు.
ఇందులో ఒక్కో విభాగం నుంచి మూడు ప్రశ్నలు అడుగు తారు. వాటిలో ఒక్క ప్రశ్నకు వూత్రమేసమాధానం రాయాలి. అంటే మొత్తం మీద మూడు వ్యాసరూప ప్రశ్నల కు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు 50 వూర్కులు కేటారుుంచారు. గతంలో మూడు గంటల సమయంలో కేవలం ఒక వ్యాసరూప ప్రశ్నకు సవూధానం ఇస్తే సరిపోయేది. ప్రస్తుత విధానంలో అంతే సవుయుంలో మూడు ప్రశ్నలకు సవూధానాలు రాయాల్సి ఉంటుంది. అందువల్ల అభ్యర్థులు ప్రిపరేషన్ నుంచే ఈ పేపర్‌ను సరికొత్త దృక్కోణంలో చూడాలి.
గత గ్రూప్-1 పేపర్‌లో వివిధ పేపర్లలో అభ్యర్థులు పొందిన మార్కులను పరిశీలిస్తే.. మిగతా పేపర్లతో పోల్చి తే ఎస్సే పేపర్ స్కోరింగ్ తీరులో చాలా వ్యత్యాసాన్ని గవు నించవచ్చు. ఈ విభాగంలో 80-120 స్థాయిలో మార్కు లు సాధించిన వారు చాలా మంది ఉన్నారు. అదే సవు యుంలో 40 నుంచి 50 మార్కులు మాత్రమే సాధించిన అభ్యర్థులు కూడా ఉన్నారు. దీన్ని బట్టి గత గ్రూప్-1 విజే తలను నిర్ణరుుంచడంలో ఈ విభాగం కీలక పాత్ర పోషిం చిందనే విషయుం స్పష్టవువుతుంది. కాబట్టి అభ్యర్థులు ఈ విభాగం ప్రిపరేషన్ విషయుంలో జాగ్రత్తగా ఉండాలి. ఎటు వంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా సంప్రదాయు పద్ధతులకు బదులు.. సాంకేతికంగా, శాస్ర్తీయమైన ప్రిపరేషన్ కొనసా గించాలి.
గతంలో ఉన్న వుూడు గంటల వ్యవధిలో ఒక వ్యాసం రాసేటప్పుడు.. దానికి సంబంధించిన వివరణ, సుదీర్ఘ పరిచయుం ఇచ్చేవారు. అంతేకాకుండా వ్యాసం నేపథ్యాని కి, వుుగింపునకు తగిన ప్రాధాన్యం కల్పించేవారు.గంటకు ఒక్క వ్యాసం రాయూల్సిన ప్రస్తుత విధానంలో.. ఈ తరహా విధానానికి స్వస్తి పలకడమే మేలు. అభ్యర్థిలోని సృజనా త్మకత, అవగాహన, వర్తవూన అంశాలపై పట్టు తదితర అంశాలను పరీక్షించడానికి ఈ విభాగం ఉపయోగపడు తుంది. కాబట్టి అభ్యర్థి ఏ విషయుంపై వ్యాసం రాస్తున్నా.. సంబంధిత లక్ష్యం సాధించేలా వ్యాసాన్ని ప్రెజెంట్ చేయు డం వుంచిది. అంతేకాకుండా సరళమైన భాషను వినియో గిస్తు.. చిన్న పదాలలో భావం అర్థవుయ్యేలా రాయాలి.
ప్రిపరేషన్‌లో.. కీలకాంశాలు
ప్రతి విభాగం నుంచి ప్రస్తుత పరిస్థితులాధారంగా ఏఏ ప్రశ్నలు అడిగే అవకాశం ఉందో వాటికి సంబంధించి ఒక అవగాహనకు రావాలి.
గుర్తించిన అంశాలపై ఎన్ని రకాల నేపథ్యాల నుంచి ప్రశ్నలు అడగవచ్చో ముందుగానే అంచనాకు రావడం వుంచిది.
గుర్తించిన అంశాలకు సంబంధించిన ముఖ్య గణాంక సమాచారాన్ని సేకరించుకోవాలి.
అంశానికి సంబంధించిన సమకాలీన నేపథ్యాన్ని అవగాహన చేసుకోవాలి.
సంబంధిత సమస్యలను గుర్తించాలి.
సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించాలి.
ఈ రకమైన అధ్యయనంతో ఒక్కో విభాగం నుంచి కనీసం నాలుగు అంశాల చొప్పున మొత్తం 12 వ్యాసాల కు ప్రిపేర్ కావడం చాలా అవసరం. అంతేకాకుండా నిర్దే శించిన కాలవ్యవధిలో ప్రభావవంతమైన వ్యాసం రాయు డాన్ని ప్రాక్టీస్ చేయుడం కూడా అవసరం. ప్రాక్టీస్ చేసిన వ్యాసంపై సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోవడం ఉపకరిస్తుంది. దీని వల్ల అభ్యర్థులు ఊహించని విధంగా ప్రశ్న వచ్చినా సమర్థంగా ప్రతిస్పందించే లక్షణం అలవడు తుంది.
ప్రతి వ్యాసాన్ని ప్రారంభించే ముందు దానికి గంట లోపలే సమాధానం రాయాల్సి ఉంటుందనే విషయూన్ని గుర్తుంచుకోవాలి. ప్రశ్నను రెండు-వుూడు సార్లు జాగ్రత్త గా చదవడం వుంచిది. కొంత మంది అభ్యర్థులు తొందర లో ప్రశ్నను సరిగ్గా చదువకుండానే జవాబును ప్రారంభి స్తారు. దాంతో అడిగిన ప్రశ్నకు.. సవూధానానికి ఏ వూత్రం పొంతన లేకుండా వ్యాసం సాగుతుంది. ఇక్కడ గవునించాల్సిన వురొక అంశం గతంలోలాగ ప్రశ్న ఒక పద బంధంలో ఉండటం లేదు. ఉదా: బాల కార్మిక వ్యవస్థ గురించి రాయండి?, మహిళ సాధికారత గురించి రాయండి? అనే రీతిలో ప్రశ్నలు ఉండటం లేదు. ఒక అంశానికి సంబంధించి ఏదో ఒక ప్రత్యేక కోణం లేదా సమస్యను లక్ష్యంగా చేసుకొని ప్రశ్నలడుగుతున్నారు.
ఉదాహరణకు బాల కార్మిక వ్యవస్థను తీసుకుంటే.. బాల కార్మిక వ్యవస్థ ఒక ఆర్థిక సమస్య మాత్రమే కాదు, ఆర్థిక మూలాలు ఉన్నాయి. వ్యాఖ్యానించండి?
ఈ రకమైన ప్రశ్నకు సంప్రదాయ పద్ధతిలో సవూధా నం ఇస్తే అంత ప్రభావవంతంగా ఉండదు. మెుదట ప్రశ్నను ఏ కోణంలో అడుగుతున్నారో గవునించి.. అదే నేపథ్యంలో సమాధానం రాయాలి. వ్యాసాన్ని ప్రారం భించడానికి ముందు కనీసం అయిదు నిమిషాలు జాగ్ర త్తగా ఆలోచించి.. వ్యాసంలో ప్రస్తావించాల్సిన అంశాలపై ఒక అవగాహన ఏర్పర్చుకోవాలి. తర్వాత దానికనుగుణం గా నిర్మాణాత్మకంగా వ్యాసాన్ని ప్రెజెంట్ చేయూలి.
వ్యాసం రాసేటప్పుడు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలు
సమకాలీన నేపథ్యం
సమస్య-వివిధకోణాలు
సమస్య కారణాలు ప్రభుత్వ చర్యలు
ప్రస్తుత స్థితి
పరిష్కార మార్గాలు
నిర్మాణాత్మక సూచనలు
పేపర్-1 జనరల్ ఎస్సే (వ్యాసం)
ఈ పేపర్‌లో మూడు విభాగాలు ఇచ్చారు. అవి
ఎ)సంక్షోభ నిర్వహణ, సామాజిక సమస్యలు- విశ్లేషణ, పరిష్కారాలు
బి)జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న సమకాలీన సమస్యలు
సి)ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన సమకాలీన సంఘటనలు/అంశాలు
మొదటి యూనిట్
గత గ్రూప్-1 మొదటి యూనిట్‌లో దుర్భిక్షం, స్ర్తీ, పురుష నిష్పత్తి, ఆర్థిక సంక్షోభం అంశాల మీద ప్రశ్నలు ఇచ్చారు. అయితే ఈ ప్రశ్నలు స్థూలంగా లేవు. ఈ విషయాన్ని అభ్యర్ధులు జాగ్రత్తగా అవగాహన చేసుకోవాలి.
ఈ విభాగం నుంచి వచ్చే అవకాశం ఉన్న ప్రశ్నలు
జనాభా విస్ఫోటం.
వ్యవసాయ రంగంలో క్షీణిస్తున్న దిగుబడులు, అంతంత మాత్రంగా వృద్ధి రేట్లు.
భారతదేశం వైద్య అత్యవసర పరిస్థితులు-ప్రభుత్వ సమాయత్తత.
మహిళలపై అత్యాచారాలు-గృహహింస-లైంగిక వేధింపులు.
పెరుగుతున్న ఆత్మహత్యల రేట్లు-సామాజిక ఒత్తిడి.
భారతదేశంలో ఇటీవల సంభవించిన ప్రకృతి వైపరీత్యాలు-ప్రభుత్వ యంత్రాంగ ప్రతిస్పందన.
రెండో యూనిట్
రెండో యూనిట్ (జాతీయ, అంతర్జాతీయ, వర్తమాన సంఘటనలకు సంబంధించిన) నుంచి గత గ్రూప్-1లో యుూరోపియున్ యూనియన్, ఇండో- యూఎస్‌ఏ అణు ఒప్పందం, ఇస్రోలకు సంబంధించిన ప్రశ్నలు అడిగారు.

పొరుగు దేశాలతో భారతదేశ సంబంధాలు.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు సభ్యత్వం.
ఆసియా ఖండంలో యూఎస్‌ఏ దౌత్య నీతి-చైనాను చుట్టుముట్టడం.
కాశ్మీర్ సమస్య పరిష్కారంలో యూఎస్‌ఏ పాత్ర.
కాశ్మీర్‌లో శాంతి స్థాపన.
అంతర్జాతీయ దౌత్య సంబంధాలపై వికీలీక్స్ ప్రభావం
అయోధ్య వివాదంపై అలహాబాద్ న్యాయస్థానం తీర్పు.
కార్పొరేట్ లాబీయింగ్- ప్రసారమాధ్యమాల పాత్ర.
మూడో యూనిట్
మూడో విభాగంలో ఆంధ్రప్రదేశ్‌లో సంభవించిన సమ కాలీన సంఘటనలు అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. గత గ్రూప్-1లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌ఆర్‌ఈజీపీ పథకం అమలు, ఆంధ్ర ప్రదేశ్‌లో పంచాయితీరాజ్ వ్యవస్థపై ప్రశ్నలు అడిగారు.

ఆంధ్రప్రదేశ్‌లో సూక్ష్మరుణ సంస్థల కార్యకలాపాలు- చట్ట నియంత్రణ సాధ్యమేనా?సబబేనా?
ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్ధి ఉద్యమాలు-ప్రాంతీయ, సమైక్య వాదాలు.
ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో కార్పొరేట్ ధోరణులు- విద్యాహక్కు చట్టం అమలు.
రాష్ట్ర సహకార రంగ ప్రక్షాళన- ప్రతిపాదిత ఏకీకృత చట్టం.
రాష్ట్రంలో అతివృష్టి-వ్యవసాయ రంగంపై ప్రభావం.
రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధి-సమకాలీన సమస్యలు.
ఆంధ్రప్రదేశ్‌లో సేద్యపు నీటి ప్రాజెక్టులు నిర్మాణం- పర్యావరణ, ఇతర అడ్డంకులు.
-గురజాల శ్రీనివాసరావు
సివిల్స్ సీనియర్ అధ్యాపకులు, ఆర్.సి. రెడ్డి స్టడీ సర్కిల్

Subscribe to:
Posts (Atom)