సివిల్స్- 2010
''కాలేజీలో చదువుతున్నపుడే నా సివిల్ సర్వీసెస్ ప్రయాణం మొదలైంది. ఓ ఐఏఎస్ అధికారి కూతురిగా సివిల్స్‌పై అవగాహన నాకున్న అనుకూలాంశం. కెరియర్ అవకాశంగా ఇది నా మనసులో ఉన్నప్పటికీ డిగ్రీలో చేరేవరకూ సివిల్స్ గురించి సీరియస్‌గా ఆలోచించనేలేదు!
'డిగ్రీ అవగానే సివిల్స్ రాస్తే నెగ్గగలనా?' అనే సందేహం నాకుండేది. అయితే డిగ్రీ పూర్తవగానే సివిల్స్‌కు హాజరైన స్మితాదాస్ (సభర్వాల్) ఆలిండియా ఫోర్త్ ర్యాంకు సాధించటంతో నా అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. పైగా ఆమె ఇదే తరహా సర్వీస్ నేపథ్యం (తండ్రి ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్) నుంచి రావటం, తనూ హైదరాబాద్ కాలేజీలోనే చదివివుండటం నాకు చాలా ఉత్సాహాన్నిచ్చాయి. దీంతో డిగ్రీ అవగానే పరీక్ష రాయాలని నిశ్చయించుకున్నా.
గ్రాడ్యుయేషన్ 4 నెలల్లో ముగుస్తుందనగా నాన్నగారితో నా ఆలోచనల గురించి చర్చించాను. స్వయంగా సివిల్స్ రాసివున్నప్పటికీ (చాలాకాలం క్రితమే అనుకోండీ), విద్యావేత్త అయివున్నప్పటికీ professional advice తీసుకున్నాకే ప్రిపరేషన్‌కు శ్రీకారం చుట్టమని ఆయన సూచించారు. అలా ఆయనతో కలిసి హైదరాబాద్‌లో 'బ్రెయిన్ ట్రీ' డైరెక్టర్ గోపాలకృష్ణగారిని కలిసి, కౌన్సెలింగ్ తీసుకున్నా.
చాలాసేపు జరిగిన కౌన్సెలింగ్ సెషన్లో నా అనుమానాలెన్నో నివృత్తి అయ్యాయి. ఒకవేళ సివిల్స్ పరీక్ష సరిగా రాయలేకపోతే ఏమిటనేది ప్రధానంగా చర్చకు వచ్చింది. ఆప్షనల్స్‌గా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంత్రపాలజీలను ఎంచుకోవాలని నిర్ణయించుకున్నాను. ఈ సబ్జెక్టులే ఎందుకో తెలుసా? కోచింగ్, స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంటాయి. ఈ సబ్జెక్టులకు ఇప్పటికే విజయాల ట్రాక్‌రికార్డు ఉంది. ప్రతి సంవత్సరమూ వీటిని ఎంచుకుని రాసినవాళ్ళే టాపర్లు అవుతున్నారు. నాన్నగారు కూడా ఈ సబ్జెక్టుల విషయంలో సహాయపడతానన్నారు. దీంతో ఆప్షనల్స్ నిర్ణయం తేలికైపోయింది.
ఇలా మొదలైంది!
పరీక్ష రాద్దామని నిర్ణయించుకోగానే నాన్నగారు నన్ను SWOT విశ్లేషణ చేసుకోమన్నారు. అంటే తెలుసుగా? నా Strengths, Weaknesses, Opportunities & Threats ను గుర్తించటం.
పరీక్ష రాద్దామని నిర్ణయించుకోగానే నాన్నగారు నన్ను SWOT విశ్లేషణ చేసుకోమన్నారు. అంటే తెలుసుగా? నా Strengths, Weaknesses, Opportunities & Threats ను గుర్తించటం.
బలాలు: 1) ఇంగ్లిష్‌లో పట్టు 2) విశ్లేషణ సామర్థ్యాలు (ఇంజినీరింగ్‌లో ఇవి నేర్చుకున్నా).
బలహీనతలు: రాసే అలవాటు తగ్గిపోవడం. ఇంజినీరింగ్‌లో వ్యాసాలను ఎక్కువగా రాసే అవసరం ఉండదు కదా!
అవకాశాలు: 1) మరిన్నిసార్లు పరీక్ష రాయగలిగే వయసు 2) నాన్నగారి ప్రోత్సాహం.
బలహీనతలు: రాసే అలవాటు తగ్గిపోవడం. ఇంజినీరింగ్‌లో వ్యాసాలను ఎక్కువగా రాసే అవసరం ఉండదు కదా!
అవకాశాలు: 1) మరిన్నిసార్లు పరీక్ష రాయగలిగే వయసు 2) నాన్నగారి ప్రోత్సాహం.
నిరోధాలు/సమస్యలు: కాలేజీలో నా స్నేహితులు చాలామంది మల్లే ప్రైవేటురంగంలో ప్రవేశించాలనే దురాకర్షణ. అలాంటి మిత్రులతో పోల్చిచూసుకోకూడదనీ, సివిల్ సర్వీసెస్‌లో నా లక్ష్యం చేరుకోవటం గురించే నిరంతరం ఆలోచించాలనీ పెద్దలు నాకు సలహా ఇచ్చారు.
'బ్రెయిన్ ట్రీ'లో కోచింగ్ తరగతులకు హాజరవటం ప్రారంభించాను. ఎంచుకున్న సబ్జెక్టులు రెండూ కొత్తే! పైగా ఇంజినీరింగ్ విద్యార్థినిని అయివుండటం వల్ల మొదట్లో ఆ సబ్జెక్టులు నిస్సారంగా అనిపించేవి. అయితే చదువుతూవుంటే ఆసక్తి పెరుగుతూవచ్చిందనుకోండీ.
ఇంజినీరింగ్ నేపథ్యం ఉన్న చాలామంది ఈ సామాజికశాస్త్రాల విషయంలో భయాలు పెంచుకుంటుంటారు. నిజానికవి అపోహలే! ఈ సబ్జెక్టులు చాలా సులువని స్వానుభవంతో చెపుతున్నా. మొదట సబ్జెక్టును ఆకళింపు చేసుకోవటానికి ప్రయత్నించాలి. అంతేకానీ పుస్తకంలోని facts ను బట్టీ పట్టెయ్యాలని చూడకూడదు. ముఖ్యంగా గమనించాల్సింది- సైన్స్ సబ్జెక్టుల్లాంటివి కావివి. సైన్సెస్‌లో 2+2 కు సమాధానం ఎప్పుడైనా, ఎక్కడైనా జవాబు నాలుగే! కానీ ఈ సబ్జెక్టుల్లో 2+2= 4 కావొచ్చు; 6 కూడా కావొచ్చు!
చదివే ప్రతి అంశానికీ ఇతర అంశాలతో సంబంధం ఉంటుంది. నేను మొదట అన్ని అధ్యాయాలనూ చదివేశాను. తర్వాత వాటిని ఒకదానితో మరొకటి అనుసంధానించటం ప్రారంభించాను. విడివిడి పూసలను దారంతో కలిపేసి, అందమైన కంఠహారం తయారుచేస్తామే, అలాగన్నమాట! అనుసంధానాలపై అవగాహన వచ్చాక చాలా సౌకర్యంగా అనిపించింది. సైకిల్ నేర్చుకోవటం మొదట్లో భయపెడుతుంది. కానీ బ్యాలన్స్ చేయటం వచ్చేశాక, చాలా ఉల్లాసంగా ఉంటుంది కదా? ఈ సబ్జెక్టుల అధ్యయనం కూడా అంతే! మరో సంగతేమిటంటే... సైక్లింగ్, స్విమింగ్‌ల్లాగా ఒకసారి అవగాహన సాధించేస్తే చాలాకాలం అవి గుర్తుండిపోతాయి.
రెండు attempts మధ్యా మూడేళ్ళ అంతరం వచ్చినా ఈ సబ్జెక్టుల్లో నేను బాగా స్కోర్ చేయటానికి ప్రధాన కారణం ఇదే!
జనరల్‌స్టడీస్‌లో మనదేశం గురించీ, ప్రపంచం గురించీ ఎంతో తెలుసుకోవచ్చు. అందుకే దీన్ని చదవటం ఆసక్తికరం. టెన్త్‌లో చదివిన హిస్టరీ, జాగ్రఫీ మొదలైనవాటిని మళ్ళీ మళ్ళీ నేర్చుకునే అవకాశం ప్రిపరేషన్లో లభించింది. సానుకూల దృక్పథం, నేర్చుకోవాలనే తపన ఉంటే ఒక సబ్జెక్టును నేర్చుకునే సమయం గణనీయంగా తగ్గిపోతుందని గ్రహించాను. NCERT ప్రాథమిక పుస్తకాలను చదివి నోట్సు తయారుచేసుకున్నాను. కరంట్ అఫైర్స్ కోసం జాతీయ వార్తాపత్రికలను చదివాను.

ఒక్కో అడుగూ...
మొదటిసారి 2005లో సివిల్స్ రాశాను. ప్రిలిమినరీలో అర్హత పొందలేకపోయాను. ఇది ఆబ్జెక్టివ్ పరీక్షే కదా, సులభంగా రాసెయ్యవచ్చని ఆలోచించటం వల్లనే ఇలాంటి వ్యతిరేక ఫలితం వచ్చింది. ప్రిలిమ్స్ పాసవ్వకపోయినా మెయిన్స్ ప్రిపరేషన్ కొనసాగించి, డిసెంబర్ 2005కల్లా ఆప్షనల్స్- మెయిన్స్ సిలబస్‌ను పూర్తిచేశాను. జనవరిలో ప్రిలిమ్స్, మెయిన్స్ జనరల్‌స్టడీస్ ప్రిపరేషన్ మొదలుపెట్టాను. మార్చి నుంచీ మళ్ళీ నా ఆప్షనల్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివి, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలను సాధన చేయటం ప్రారంభించాను. ఈసారి నేను జనరల్‌స్టడీస్ మీద కంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌మీదనే ఎక్కువ దృష్టిపెట్టాను.

ఇది అనుకూల ఫలితాన్నిచ్చింది. ఆగస్టు 2006లో వచ్చిన ప్రిలిమినరీ ఫలితాల జాబితాలో నా రోల్‌నంబర్ ఉండటం చాలా సంతోషాన్నిచ్చింది. నేను నేర్చుకున్న పాఠం ఏమిటంటే... ఏ పరీక్షనూ తక్కువ అంచనా వేయకూడదని. అలాగే మార్కుల వెయిటేజిని విశ్లేషించుకోవాలనీ!
మెయిన్స్ ఫార్మ్ రాగానే దానిలో ఏం రాయాలనేదానిపై ఎక్కువ సమయం వెచ్చించి, ఆలోచించాను. బయోడేటా ఫార్మ్ నుంచే ఇంటర్‌వ్యూలో చాలా ప్రశ్నలు వస్తాయని విన్నాను. పైగా అక్కడ నింపే order of choices of services సమాచారంపైనే మన భవిష్యత్తు ఆధారపడివుంటుంది. ఈ ఫార్మ్‌ను నింపే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని అభ్యర్థులందరికీ నా సలహా.
మెయిన్స్ కోసం... పాత ప్రశ్నపత్రాలను విశ్లేషించాను. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంత్రపాలజీల్లో expected questions, కొన్నిటికి prepared answers ను తయారుచేయటానికి ప్రయత్నించాను. 2007లో ఇంటర్వ్యూకి హాజరై, 312 ర్యాంకు తెచ్చుకున్నాను. కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ సర్వీస్‌కు ఎంపికయ్యాను.
ఐఏఎస్ సాధించాలనే అభిలాష అలాగే ఉండిపోయింది కదా? అయితే వెంటనే మళ్ళీ సివిల్స్ పరీక్ష రాయకూడదనీ, నా శిక్షణ మీదే దృష్టి పెట్టాలనీ నిర్ణయించుకున్నాను. శిక్షణ తర్వాత పెళ్ళి చేసుకున్నాను... పరీక్ష వెంటనే రాయబోవటం లేదు కదా అని!
మళ్ళీ సివిల్స్ సమరం
ఈసారి ఉద్యోగం చేస్తూనే 2010లో సివిల్స్ రాశాను. ఒక పక్క పాపాయి అవసరాలూ, ఇంకో పక్క ఉద్యోగ విధులూ, మరోపక్క పరీక్ష కోసం కేటాయించాల్సిన సమయం- వీటన్నిటినీ సమన్వయం చేసుకోవటం... నిజంగా చాలా కష్టమయింది! నా భర్త, అత్తింటివారూ, నా తల్లిదండ్రులూ ఎంతగానో సహకరించారు.

ఈ ప్రయత్నంలో నేను ఏ వ్యూహం పాటించానో చెపుతాను. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కోసం మౌలిక పుస్తకాలతో పాటు 2nd Administrative Reforms Commission నివేదికలను సంప్రదించాను. ఇది గొప్పగా ఉపకరించింది. ఆంత్రపాలజీలో ప్రాథమికాంశాలపై దృష్టి పెట్టి ఫిజికల్ ఆంత్రపాలజీపై అదనపు శ్రద్ధ పెట్టాను. ఇంతకుముందు ప్రయత్నంలో నేను నిర్లక్ష్యం చేసిన, ఎక్కువ స్కోరింగ్ అవకాశమున్న భాగమిది!
మెయిన్స్‌లో నెగ్గి ఇంటర్వ్యూకు సిద్ధమయ్యాను.
ఇంటర్వ్యూలో ఏయే ప్రశ్నలు రావటానికి అవకాశముందో అంచనా వేయటం ప్రారంభించాను. ఆ ప్రశ్నలను స్థూలంగా ఏడు అంశాలుగా విభజించుకున్నాను. 1) వ్యక్తిగతం 2) విద్యాసంబంధం 3) సర్వీస్ ప్రిఫరెన్స్ 4) ఉద్యోగ విధులు 5) ఆప్షనల్స్ 6) అభిరుచులు 7) కరంట్ అఫైర్స్.

అడగటానికి ఆస్కారమున్న ప్రశ్నలను ఊహించి, వాటన్నిటికీ సమాధానాలు సిద్ధం చేసుకున్నాను. డిగ్రీలో నా సబ్జెక్టులకు సంబంధించిన కరంట్ అఫైర్స్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపాను. నా డిపార్ట్‌మెంట్, విధుల తీరు గురించిన సమాచారాన్ని సమీక్షించుకున్నాను. ఒడిస్సీ నృత్యాన్ని నా అభిరుచిగా రాశాను కాబట్టి దాని గురించి కొంత అధ్యయనం చేశా. కరంట్ అఫైర్స్‌లో ప్రాథమిక అంశాలు చదివాను. సమయం చాలక ఇంటర్వ్యూ గైడెన్స్, మాక్ ఇంటర్‌వ్యూ ఫోన్లోనే తీసుకోవాల్సివచ్చింది.
సివిల్స్ ఇంటర్‌వ్యూ 20 నిమిషాలసేపు జరిగింది. ఎక్కువ ప్రశ్నలు నా ఉద్యోగంపైనే వచ్చాయి. అసిస్టెంట్ కమిషనర్‌గా నా విధులేమిటని బోర్డ్ చైర్మన్ అడిగారు. కస్టమ్స్ విభాగంపై ప్రజలకు ఎందుకని వ్యతిరేక భావన ఉందని ఓ సభ్యుడు ప్రశ్నించారు. అవినీతి గురించి మరో ప్రశ్న. ఈజిప్ట్ గురించి ఇంకో ప్రశ్న. జనాభా, జనసాంద్రతకు సంబంధించి అగ్రశ్రేణిలో ఉన్న మొదటి ఐదు రాష్ట్రాలేమిటని ఒక సభ్యుడు అడిగారు. ఆవనూనె (మస్టర్డ్ ఆయిల్)ను ఎక్కడ వినియోగిస్తారనీ, కల్తీ ఆవనూనె తయారీకి ఏం ఉపయోగిస్తారనీ ప్రశ్నించారు.
అన్ని ప్రశ్నలకూ కాకుండా కొన్నిటికి మాత్రమే సమాధానాలు చెప్పగలిగాను. సంతృప్తికరంగా ఇంటర్‌వ్యూ చేయలేకపోయాననీ, ఇంకా బాగా చేసివుండొచ్చనీ అనిపించింది. ఐఏఎస్‌కు అవసరమైన ర్యాంకును ఆశించాను కానీ, టాప్ ర్యాంకు వస్తుందని మాత్రం అనుకోలేదు.
అందుకే జాతీయస్థాయిలో సెకండ్ ర్యాంకు వచ్చిందని తెలియగానే... అది అర్థమవ్వటానికి కాస్త సమయం పట్టింది! విస్మయం, సంతోషం, సంతృప్తీ... ఒకేసారి మనసును చుట్టుముట్టాయి''.
*సైకిల్ నేర్చుకోవటం మొదట్లో భయపెడుతుంది. కానీ బ్యాలన్స్ చేయటం వచ్చేశాక, చాలా ఉల్లాసంగా ఉంటుంది కదా? ఈ సబ్జెక్టుల అధ్యయనం కూడా అంతే! *నేను నేర్చుకున్న పాఠం ఏమిటంటే... ఏ పరీక్షనూ తక్కువ అంచనా వేయకూడదని. అలాగే మార్కుల వెయిటేజిని విశ్లేషించుకోవాలనీ! |
* ప్రిపరేషన్ సాగించేటపుడు స్త్థెర్యం కోల్పోవచ్చు. అలాంటపుడు తల్లిదండ్రులపై, దగ్గర కుటుంబ సభ్యులపై నమ్మకం ఉంచండి. * జనరల్ స్టడీస్‌ను ఎంత ఎక్కువ అధ్యయనం చేసినా సంతృప్తస్థాయిని చేరుకోవటం ఉండదు. అందుకే చదవగలిగినంతవరకూ చదివెయ్యండి. * సరైన ప్రశ్నలనే ఎంచుకోండి. ఉదాహరణకు... జనరల్ ఎస్సేలో 'India as an Emerging Global Super Power' ను ఎంచుకున్నాను. ఎందుకంటే... ఈ అంశంపై నేను ఎంతైనా రాయగలను కాబట్టి. * మీ పరిజ్ఞానానికి ఆధారంగా, అనుబంధంగా ఇంటర్నెట్‌ను ఉపయోగించండి. * చివరిగా, మీ ప్రయత్నంలో విఫలమైతే నిరాశలో కూరుకుపోవద్దు. విజయం అనాయాసంగా ఎవరినీ వరించదు. దానికి అవసరమైన కాలాన్ని అది తీసుకుంటుంది! |
i am anusha,i complited my degree at b.sc (bzc),inter bi.p.c how to apply civils and qualifications persentage of marks in earliar studies, where it is apply ,coaching centers details,age limit,total details of civils
ReplyDelete